ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది. రాజధాని ఢిల్లీ వేదికగా శనివారం జరిగిన ఒక కీలక భేటీ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.  ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక నివాసంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దిశగా భారతీయ జనతా పార్టీ అప్పుడే సమరశంఖం పూరించినట్లు ఈ ఉన్నత స్థాయి సమావేశం స్పష్టం చేస్తోంది. ఎన్నికలకు కొన్ని నెలల వ్యవధి మాత్రమే మిగిలి ఉండటంతో, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలు, ప్రభుత్వ పనితీరు మరియు రాబోయే ఎన్నికల ముందస్తు వ్యూహాలపై ఇరువురు అగ్రనేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. భారతదేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. జాతీయ రాజకీయాల్లో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలో నిర్ణయించడంలో యూపీ పాత్ర అత్యంత కీలకమైంది. ఇప్పటికే వరుసగా 2 సార్లు యూపీలో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఇప్పుడు మూడోసారి కూడా రికార్డు విజయాన్ని నమోదు చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. 2027 ప్రారంభంలో జరగబోయే ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, తదుపరి జరగబోయే 2029 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలపై ప్రత్యక్షంగా  అత్యంత బలంగా ప్రభావం చూపనున్నాయి. అందుకే కేంద్ర నాయకత్వం, ముఖ్యంగా ప్రధాని మోడీ మరియు సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఇప్పటినుంచే ఎన్నికల ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల పురోగతి, మౌలిక వసతుల కల్పన మరియు యోగి ప్రభుత్వ పనితీరుతో పాటు ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న సాధారణ అభిప్రాయాలపై ఈ సమావేశంలో లోతుగా సమీక్షించారు. ప్రధాని మోడీతో భేటీ ముగిసిన అనంతరం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్  ఇతర కేంద్ర నాయకులతో కూడా సీఎం యోగి వరుసగా సమావేశం కానుండటం ఈ పరిణామాల ప్రాధాన్యతను మరింత పెంచుతోంది. ఎన్నికల సమయానికి తగినంతగా పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో సిద్ధం చేయడం, ప్రతి నియోజకవర్గంలోనూ బూత్ స్థాయి బలపర్చడంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ భేటీ కేవలం ఒక సాధారణ రాజకీయ సమావేశం మాత్రమే కాదు.. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలు  2029 సార్వత్రిక ఎన్నికల విజయానికి ఒక బలమైన పునాది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సాధించిన విజయాలను, అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత వేగంగా తీసుకెళ్లేలా పక్కా కార్యాచరణను రూపొందిస్తున్నారు. ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన ఎన్నికల వ్యూహాలు యూపీ రాజకీయ వేదికపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, ప్రతిపక్షాల ప్రచార హోరును ఎలా తిప్పికొడతాయో రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ఈ సంచలన రాజకీయ పరిణామాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. PM Modi Yogi Adityanath meeting, UP Elections 2027, BJP strategy UP, Yogi Adityanath Delhi visit, PM Modi news, Uttar Pradesh politics  
  టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని.. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పకపోతే.. తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే ప్రమాదం ఉందని అన్నారు. గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. డీఎస్సీ పరీక్షల విషయంలోనూ దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించారని.. అయితే వాస్తవాలను ప్రజలకు వివరించి గట్టిగా కౌంటర్ ఇవ్వగలిగామని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉందని.. అయితే ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా చేసే నిరసనలను ఉపేక్షించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. కర్నూలులో జరిగిన నిరసనలను ప్రస్తావిస్తూ.. గొడ్డలి పార్టీ ఆందోళనల్లో రౌడీలు, గంజాయి బ్యాచ్‌లు తప్ప ఒక్క డీఎస్సీ అభ్యర్థి అయినా ఉన్నారా అని ప్రశ్నించారు. కర్నూలులో ఈరోజు ఆందోళనకు దిగిన వారంతా మెగా డీఎస్సీ-2025 ద్వారా ఎంపికైన టీచర్లేనని తెలిపారు.డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని స్పష్టంగా చెప్పగలిగామని.. అందుకే గొడ్డలి పార్టీ మినహా ఇతర పార్టీల నేతలు సైతం తప్పులు జరగలేదని బహిరంగంగా చెబుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించగలిగితే.. కుట్రలను ప్రజలే అడ్డుకుంటారని అన్నారు. మంచి పనులు చేస్తే ప్రజలు సహకరించి భాగస్వాములు అవుతారనడానికి భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవమే నిదర్శనమని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవలే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చానని.. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యవస్థలను గాడిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సాధారణ కార్యకర్త అయినా.. పార్టీ అగ్రనాయకుడు అయినా పార్టీనే సుప్రీం అని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని చెప్పారు. కార్యకర్తలను పట్టించుకోని వారిపై, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై జీరో టాలరెన్స్ ఉంటుందని హెచ్చరించారు. గొడ్డలి పార్టీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. రాబోయే ప్రతి ఎన్నికల్లో ప్రతి బూత్‌లోనూ గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకుల ప్రవర్తన ఓట్లపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. యూనిట్, క్లస్టర్ ఇంఛార్జ్‌లు, మండల అధ్యక్షులకు తగిన గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. CM Chandrababu,TDP,NTR Bhavan, TDP Central Office,TDP Training Programme, Mega DSC 2025, AP Politics, Minister naralokesh  
జగన్ ఇక ఎప్పటికీ సీఎం కాలేరా?  ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తర్కబద్ధంగా తొడగొట్టి మరీ చెప్పిన 40 శాతం ఓటు షేర్ సంకేతం అదేనా? ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఇప్పుడు ఇదే విషయమై హాట్ హాట్ చర్చ జరుగుతోంది.  2024  ఎన్నికల్లో  రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా   40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు. ఇప్పటికీ ఆ ఓట్ షేర్ తమకు పదిలంగా చెక్కుచెదరకుండా ఉందన్నారు.  ఆ ఓటు షేర్ తో రాబోయే రోజుల్లో  జగన్   నేతృత్వంలో వైసీపీ రాష్ట్రంలో  తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని తొడగొట్టి మరీ చెప్పారు. అయితే ఆయన చెప్పిన 40 శాతం ఓటు షేరు లెక్కలను బట్టి చూస్తే..  జగన్ ఎన్నటికీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేరని పరిశీలకులు అంటున్నారు. అంబటి 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పొందిన ఓటు షేర్‌తో   తమ పార్టీ ఓటు షేర్‌ను పోల్చి మాట్లాడారు.   అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ వైసీపీ  40 శాతానికి పైగా ప్రజల ఆమోదాన్ని నిలబెట్టుకుందన్నారు. కేవలం గెలిచిన అసెంబ్లీ సీట్ల సంఖ్యను బట్టి ఒక పార్టీ ప్రజాదరణను అంచనా వేయలేమని, నేటికీ రాష్ట్రంలోని కోట్లాది మంది ఓటర్లు  జగన్ సంక్షేమ పాలనపై, ఆయన నాయకత్వంపై చెక్కుచెదరని విశ్వాసంతో ఉన్నారన్నారు అంబటి.   కానీ వాస్తవానికి..  రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిధులలో.. ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేవలం ఒక శాతం  ఓట్ల తేడా సరిపోతుంది. అంతే కాకుండా..  మొత్తం ఓట్ షేర్ కంటే..  అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుచుకున్న సీట్ల సంఖ్య గెలుపు నిర్ణయిస్తుంది. దీనిని బట్టి అంబటి రాంబాబు రాంబాబు చెబుతున్న ఓట్ షేర్ లెక్కల  , వైసీపీ తమకున్న 40శాతం ఓట్ల వాటాతో  తెలుగుదేవం కూటమి ఐక్యంగా ఉన్నంత కాలం జగన్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేనేలేదన్న మాటే. కాంగ్రెస్, వైఎస్ లెగసీ నుంచి  సంప్రదాయబద్ధంగా వచ్చే 40శాతం ఓట్ షేర్ తో  జగన్ అధికారంలోకి వచ్చే అవకాశలే లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అందుకే తమ 40 శాతం ఓటు షేరుతో హ్యాపీగా ఉన్నామంటూ అంబటి చెబుతున్న దానిని బట్టి చూస్తే జగన్ సీఎం ఆశలు వదలిలేసుకున్నట్లేగా?  Ambati Rambabu 40percent vote share narrative, YS Jagan, CM dream neverfullfill, YSR Congress Party, AP Politics, TeluguOne
ALSO ON TELUGUONE N E W S
Yash’s Toxic is getting closer to its theatrical release, and the newly unveiled trailer has only amplified the excitement around the film. Directed by Geethu Mohandas and backed by KVN Productions and Yash, the film has been in the spotlight for its unusual world, ambitious scale and Yash’s striking transformation. The trailer launch has now added further momentum to the August 26 release. At the grand launch event, Yash made it a point to acknowledge the actors who stood alongside him in the film. He revealed that Nayanthara had to be brought in at short notice for her dates but appreciated her for cooperating with the team despite the demanding schedule. Yash also had words of appreciation for Tara Sutaria, Rukmini Vasanth, Kiara Advani and Huma Qureshi, highlighting their dedication throughout the making of the film. According to the actor, every character has moments to shine in Toxic, while the performers were pushed beyond their comfort zones to deliver what the story demanded. He credited all of them for rising to the challenge. Speaking about Geethu Mohandas, Yash said he was never concerned about what she had done in her earlier films. Instead, it was the potential he saw in the script that convinced him to come on board. He praised the director for the sacrifices she made to bring her ambitious vision to the screen and assured her that those efforts would not go waste. Yash also spoke about the personal support he received during the making of Toxic, particularly from his wife Radhika Pandit. He described her as a pillar of support behind his decisions and credited her for standing by him through the demanding transformations he underwent for the film. The actor thanked producer K Venkata Narayana for giving the team the freedom and backing required to make a film of this scale. Yash concluded with a confident message to audiences, promising that Toxic will blow their minds and it will be an epic experience. He added that he values the audience’s money and time and believes the film will become a great and memorable achievement for Indian cinema.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  కొన్ని నిమిషాల క్రితం యష్ వన్ మాన్ సునామి 'టాక్సిక్' ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అభిమానులు, ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ బాగానే వస్తుంది. అదే టైంలో ఆ అందరు ఆశ్చర్యానికి గురయ్యే విషయం ఏంటంటే టాక్సిక్ ప్రతి ఫ్రేమ్ మైండ్ బ్లోయింగ్ గా ఉండటంతో పాటు టేకింగ్ పరంగా కూడా ఎంతో విభిన్నంగా దూసుకుపోతూ ఉంది. ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ సినిమాని మనముందు ఉంచిందని చెప్పవచ్చు. దీంతో సౌత్ ఇండియన్ సినిమా  అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్రను తిరగరాస్తుందా అనే చర్చలు మొదలయ్యాయి. అసలు ఇలాంటి సినిమాని తెరకెక్కించాలంటే హీరో, దర్శకుడు, నిర్మాతకి ఎన్నో గట్స్ ఉండాలి. గట్స్ అనే మాట కూడా చాలా తక్కువ.  కెవిఎన్ ప్రొడక్షన్స్, మ్యాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యశ్ మునుపెన్నడూ చూడని విభిన్నమైన ద్విపాత్రాభినయంలో మెరవనున్నారు. 'రాయ' అనే శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఆయన రగ్గడ్ లుక్, స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు, రక్తం సిందే పోరాట ఘట్టాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతకుముందు విడుదలైన గ్లింప్స్ కేవలం 24 గంటల్లోనే 200 మిలియన్లకు పైగా వీక్షణలు మరియు 5.5 మిలియన్ల లైక్స్‌ సాధించి సోషల్ మీడియా రికార్డులను తిరగరాయడం, ఈ సినిమాపై ఉన్న అంతర్జాతీయ క్రేజ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది.  Also read: Toxic: టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది.. ఏదో జరగబోతుందనేది పక్కా  కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి అగ్ర హీరోయిన్స్  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే టాక్సిక్ భారతీయ సినిమా గొప్పతనాన్ని ప్రపంచ సినిమాకి తెలియచేయబోతుందని. కాబట్టి ఆగస్టు 26 న టాక్సిక్ కి పోటీగా రావాలని అనుకునే వాళ్ళు కనీసం మనసులో కూడా ఆ ఆలోచన రానీయకండి. మధ్య పానం, ధూమపానం ఎలా అయితే ఆరోగ్యానికి హానికరమో, టాక్సిక్ కి పోటీ రావడం కూడా హానికరమే. Toxic, Yash, Kaira Adwani, Nayanthara
Varun Tej’s Korean Kanakaraju (KOKA) is witnessing a strong surge in demand after opening to his career-best numbers. The film collected Rs.10 crore+ gross worldwide on Day 1 including premieres, and the positive word of mouth appears to be translating into even stronger demand for the second day. Interestingly, Day 2 bookings are reportedly higher than Day 1 in several areas. The demand has prompted exhibitors to add new theatres and screens in multiple territories, with additional chairs and shows being arranged to accommodate the growing audience turnout. The positive response is not limited to the youth audience, with family audiences also showing strong interest in the entertainer. The word of mouth has been spreading rapidly, helping the film gain momentum after its opening. Trade circles are reportedly upbeat about the trend and expect KOKA to post much bigger numbers over the weekend. Varun Tej’s performance in his contrasting shades, along with Satya’s comedy and one-liners, has emerged as one of the major highlights. The film’s interesting blend of Korean and Indian cultural elements has also struck a chord with audiences, while Thaman’s music adds to the entertainment quotient. Directed by Merlapaka Gandhi, KOKA blends humour and horror with Varun Tej and Ritika Nayak in the lead roles. With new screens being added to meet the demand and Day 2 looking stronger than the opening day, the film is heading towards a career-best weekend for Varun Tej. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Yash has once again taken the excitement around Toxic to another level. The film’s glimpse, teaser and songs like Tabaahi and Madhoshi have already created massive buzz, and the makers have now unveiled the much-awaited trailer. Packed with striking visuals, intense action and a fascinating dual-role setup, the trailer is every bit as explosive as expected. Yash plays Raya, a powerful don who wants to rule the underworld and the crime world around him. Nayanthara’s character appears to ignite his ambition, while the trailer also introduces a young boy in clown makeup who shares an intriguing moment with Raya. The narrative then takes an unexpected turn as the boy grows up to become Yash himself, setting up a conflict between the son and his father. The biggest highlight is undoubtedly Yash in the dual role. His body language, dialogue delivery and screen presence are strikingly different in the two characters. As the young man, he brings an energetic and rebellious attitude, while Raya carries the swagger, authority and menace of an established don. Yash aces both shades and dominates almost every frame. Nayanthara, Kiara Advani, Tara Sutaria, Rukmini Vasanth and Huma Qureshi also make strong impressions, with all of them appearing to have significant parts in the story. Director Geethu Mohandas presents the world of Toxic with a distinctive visual language, while the editing makes the trailer feel constantly unpredictable. Produced by KVN Productions and Yash, Toxic has been mounted on an enormous scale. The trailer successfully maintains the mystery surrounding the story while promising a stylish and ambitious action spectacle. With the hype already at its peak, Toxic is set to release worldwide on August 26th in multiple languages. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న యష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యష్ వన్ మాన్ షో టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది.  రావడమే కాదు సుమారు నాలుగు నిమిషాల ముప్పై సెకన్ల ఉన్న ట్రైలర్ పాన్ ఇండియా మొత్తాన్ని దుమ్ము రేపుతోంది.    ట్రైలర్ ప్రారంభం నుంచే తీవ్రమైన హింస, రక్తపాతం, యాక్షన్ దృశ్యాలతో మైండ్ బ్లాక్ అయ్యే వాతావరణాన్ని సృష్టిస్తుంది. యష్ ఈ చిత్రంలో 'రాయా' అనే శక్తివంతమైన ఆంటి-హీరో పాత్రతో పాటు ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) చేస్తుండటం ట్రైలర్‌లోని అతిపెద్ద విజువల్ హైలైట్. గోవా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే డ్రగ్స్, గ్యాంగ్‌స్టర్ మాఫియా ప్రపంచంలో యష్ పాత్ర విశ్వరూపం చూపిస్తోంది. దీనికి తోడు రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కి ప్రాణం పోశాయి. ప్రతి షాట్ కూడా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌ను తలపించేలా అద్భుతమైన సినిమాటోగ్రఫీతో తీర్చిదిద్దబడింది.  నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి స్టార్స్ ముఖ్యమైన రోల్స్ పోషిస్తున్నట్టుగా అర్ధమవుతుంది. ఆ అందరి లుక్స్, విజువల్ ప్రెజెన్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. Also read: ఆ బ్యానర్ లోనే ఎందుకు: త్రివిక్రమ్ అన్ని సినిమాలు   ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ యూట్యూబ్ మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించగా, ఈ ట్రైలర్ ఆ రికార్డులను తిరగరాసే దిశగా దూసుకుపోతోంది. యష్ మార్క్ ఎలివేషన్లు మరియు గీతూ మోహన్‌దాస్ టేకింగ్ ఈ చిత్రాన్ని పాన్-ఇండియా రేంజ్‌ను దాటి గ్లోబల్ లెవెల్‌లో నిలబెట్టబోతున్నాయనే విషయం కూడా క్లియర్ గా అర్ధమవుతుంది. మొత్తంగా చూస్తే, 'టాక్సిక్' ట్రైలర్ కేవలం ఒక మాస్ విందు మాత్రమే కాకుండా ఒక క్లాసిక్ డార్క్ థ్రిల్లర్ అనుభవాన్ని అందిస్తుందని స్పష్టమవుతోంది. ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం భారతీయ చలనచిత్ర రంగానికి సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అగస్ట్ నెలని సినీ సునామి నెలగా మార్చే అవకాశాలు ఉన్నాయి.  Toxic, yash, Kaira Adwani, Nayanthara  
  మాటని అప్ డేట్ చేసి సినీ ప్రియుల్ని తన మాయలో పాడేసుకున్న మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్. మాటని వయ్యారంగా ముస్తాబు చేయవచ్చని కూడా నిరూపించాడు  ప్రస్తుతం వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో గాడ్ ఆఫ్ వార్ ని లైన్ లోకి తీసుకొస్తాడు. ఈ రెండు చిత్రాలని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై సూర్యదేవర చినబాబు నిర్మిస్తున్నాడు. ఈ బ్యానర్ నుంచి వచ్చిన ఫస్ట్ మూవీ అల్లు అర్జున్ వన్ మాన్ షో జులాయి. దర్శకుడు త్రివిక్రమ్ నే. ఈ జులాయి నుంచి ప్రెజెంట్ త్రివిక్రమ్ చేస్తున్న సినిమాల దాకా అన్ని కూడా    హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నే నిర్మాణ సంస్థ. అంటే ఆ సంస్థ తెరకెక్కించిన అన్ని చిత్రాలు త్రివిక్రమ్ తోనే. ఈ విధంగా ఒకే బ్యానర్‌లో వరుసగా సినిమాలు చేసే దర్శకులు లేదా నటులను చూసినప్పుడు, వారి మధ్య ఏదో ఒక కాంట్రాక్ట్ లేదా అగ్రిమెంట్ ఉందేమో అని సినీ ప్రియులు భావించడం సహజం. అయితే, ప్రస్తుత రోజుల్లో అలాంటి పరిస్థితి లేదని, నిజమైన ఆత్మీయ అనుబంధం ఉంటే ఎలాంటి అగ్రిమెంట్లు అవసరం లేదని స్పష్టం చేశారు ప్రముఖ నిర్మాత, సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ. ఈ నాగ వంశీ ఎవరో కాదు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చినబాబు సోదరుడి కుమారుడు.    త్రివిక్రమ్ తో తమ కుటుంబానికి, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థకు ఉన్న సుదీర్ఘమైన బంధం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. నాగవంశీ మాట్లాడుతూ 'బాబాయ్ ఇండస్ట్రీకి వస్తున్న సమయంలో, తన  మొదటి సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేయాలని గట్టిగా కోరుకున్నారు. త్రివిక్రమ్‌కు ఉన్న అద్భుతమైన పనితీరు, సినిమాల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ, కథా కథనాలపై ఉన్న పట్టు వల్లే ఆ నిర్ణయం తీసుకున్నారు. అలా వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రారంభమైన మొదటి చిత్రం నుంచే త్రివిక్రమ్‌తో తమ కుటుంబానికి ఉన్న బంధం మరింత బలపడుతూ వచ్చింది. కేవలం ఒక దర్శకుడు, నిర్మాతగా కాకుండా వారి సంబంధం ఒక ఆత్మీయ కుటుంబ అనుబంధంగా రూపాంతరం చెందింది.  చిత్ర పరిశ్రమలో తమ నిర్మించబోయే బ్యానర్‌కు ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్న సమయంలో త్రివిక్రమ్ అందించిన సహకారం మరవలేనిది.  Also read: వీసా రిజెక్ట్.. మోహన్ లాల్ తీవ్ర ఆవేదన  'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' అనే పేరుని స్వయంగా త్రివిక్రమ్ శ్రీనివాసే సూచించారు. అంతేకాకుండా, ఆ బ్యానర్ యొక్క లోగోను సైతం త్రివిక్రమే ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ బ్యానర్ పునాదుల నుంచి ప్రతి అడుగులోనూ త్రివిక్రమ్ భాగస్వామ్యం ఉంది. అప్పటి నుండి నేటివరకు త్రివిక్రమ్ ఇతర బయటి బ్యానర్లలో సినిమాలు చేసేందుకు పెద్దగా మొగ్గు చూపలేదు. ఈ ప్రయాణంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫోర్చ్యూన్ ఫోర్ సినిమాస్ వంటి బ్యానర్లు కూడా తోడై ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాయి.  అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 'జులై' చిత్రం నుంచి నేటి వరకు త్రివిక్రమ్ వారి బ్యానర్‌లోనే వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ, వీరి మధ్య ఒక్క కాగితంపై కూడా అగ్రిమెంట్ లేదా లీగల్ బాండ్ సంతకం చేయలేదట. సినిమా ఇండస్ట్రీలో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నప్పటికీ, విశ్వాసం మరియు కుటుంబ తరహా అనుబంధమే తమను నడిపిస్తోందని నాగవంశీ తెలిపారు.  TriVikram, Naga vamsi, Haarika Hassine Creations, Radhakrishna    
ఆర్‌. మాధవన్‌ టైటిల్‌ రోల్‌లో, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తూ తెరకెక్కించిన తాజా బయోపిక్ 'జి.డి.ఎన్‌' (GDN). 'రాకెట్రీ'లో నంబి నారాయణన్‌గా అద్భుత నటనతో అలరించిన మాధవన్‌, ఈసారి జి.డి. నాయుడు అలియాస్ గోపాలస్వామి దొరస్వామి నాయుడు పాత్రలో మన ముందుకు వచ్చారు. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? అనేది తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే.. కోయంబత్తూరులోని ఒక తెలుగు రైతు కుటుంబంలో జన్మించిన జి.డి. నాయుడు చదువు మూడో తరగతితోనే ఆగిపోతుంది. కానీ, "జీవితంలో డిగ్రీల కంటే నేర్చుకోవాలనే తపన, నిరంతర అన్వేషణే ముఖ్యం" అని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన. హోటల్‌లో సర్వర్‌గా పనిచేస్తూ, ఒక బ్రిటీషర్ దగ్గర చూసిన మోటార్ సైకిల్‌ని కొనుగోలు చేసి, దాని పార్ట్స్ అన్నీ విప్పి.. అదెలా పనిచేస్తుందో అధ్యయనం చేస్తాడు. అలా మొదలైన ఆయన ఆవిష్కరణల ప్రయాణం.. భారత్‌లోనే తొలి విద్యుత్ మోటార్ తయారీ వరకు సాగుతుంది. అంతేకాదు, ఒకే ఒక్క బస్సుతో ప్రారంభించి, ఏకంగా 600 బస్సులతో 'యునైటెడ్ మోటార్ సర్వీస్' అనే రవాణా సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు. భారతదేశంలోనే మొట్టమొదటి పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించి విద్యా రంగంలో విప్లవం తెస్తారు. అయితే, ఆయన ఎదుగుదల చూసి తట్టుకోలేని అప్పటి బ్రిటీషర్లు, కొంతమంది ఈర్ష్యాపరులైన పారిశ్రామికవేత్తలు ఆయనపై అధిక పన్నులు విధించి, దేశద్రోహి అని ముద్ర వేయడానికి కుట్రలు పన్నుతారు. మరి ఆ కుట్రలను జి.డి. నాయుడు తన మేధస్సుతో ఎలా తిప్పికొట్టాడు? అనేది తెరపై చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే.. ఒక అసాధారణమైన వ్యక్తి జీవితాన్ని తెరపైకి తీసుకురావడం ఎప్పుడూ పెద్ద సవాలే. 1920 నుంచి 1960ల వరకు నాలుగు దశాబ్దాల కాలాన్ని దర్శకుడు కృష్ణకుమార్ రామ్‌కుమార్ కళ్లకు కట్టారు. ముఖ్యంగా వ్యాపారంలో నష్టాలు రావడం, మళ్లీ సున్నా నుంచి రవాణా సామ్రాజ్యాన్ని సృష్టించడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అయితే, ఇండియన్ ఎడిసన్‌గా పేరుగాంచిన జి.డి. నాయుడి గొప్ప గొప్ప ఆవిష్కరణలు, వ్యవసాయంలో ఆయన సృష్టించిన నూతన వంగడాలు వంటి స్ఫూర్తిదాయక అంశాలు  చూపించడం కంటే.. పన్నుల వివాదాలు, పొలిటికల్ కుట్రల చుట్టూనే కథను ఎక్కువ నడిపించడం కాస్త నిరాశపరుస్తుంది. దాంతో ఎమోషనల్ కనెక్షన్ తగ్గినట్లు అనిపిస్తుంది. అలాగే, మొదటి భార్య చెల్లమ్మ (ప్రియమణి) పాత్రను అర్ధాంతరంగా ముగించడం కథలోని గాఢతను తగ్గించింది. నటీనటుల విషయానికి వస్తే.. మాధవన్‌ మరోసారి జీవించేశారు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ జి.డి. నాయుడు పాత్రకి ప్రాణం పోశాయి. దుషార విజయన్, ప్రియమణి, సత్యరాజ్, జయరామ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో ఉంది. గోవింద్ వసంత అందించిన సంగీతం సన్నివేశాలలోని భావోద్వేగాలను చక్కగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. చివరగా చెప్పాలంటే.. ఒక గొప్ప భారతీయుడి స్ఫూర్తిదాయక జీవిత చరిత్రను తెలుసుకోవడానికి, మాధవన్‌ అద్భుత నటన కోసం 'జి.డి.ఎన్‌' సినిమాను ఒకసారి చూడవచ్చు.       GDN Movie Review, GDN Review Telugu, GD Naidu Biopic, Madhavan  
  భారతీయ చలనచిత్ర పరిశ్రమలో  మోహన్ లాల్ కి ఉన్న సినీ చరిష్మాకి కోహినూర్ డైమండ్ కి ఉన్నంత వాల్యూ ఉంది. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, 360కి పైగా సినిమాలు, 5 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే మోహన్‌లాల్‌ నే వరించాయి. అటువంటి మోహన్ లాల్ కి ఊహించని చేదు అనుభవం ఎదురైంది.   ఈ రోజు సాయంత్రం 5 గంటలకి  ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న నార్వెస్ట్ కన్వెన్షన్ సెంటర్‌లో కాయల్ ఈవెంట్స్ నిర్వహణలో "వైకిట్టు ఎంధ పరిపాడి" అనే భారీ కళాత్మక వేడుకని  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం మోహన్‌లాల్‌తో పాటు లెజండ్రీ గాయని  కేఎస్ చిత్ర, గాయకుడు, నటుడు మనోజ్ కే జయన్, అజు వర్గీస్, స్టీఫెన్ దేవస్సీ వంటి పలువురు ప్రముఖ కళాకారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే దాదాపు నెల రోజుల క్రితమే ఇతర కళాకారులు, సాంకేతిక సిబ్బంది అందరికీ ఆస్ట్రేలియా వీసాలు మంజూరు కావడంతో వారంతా సిడ్నీ చేరుకున్నారు. కానీ, ప్రధాన ఆకర్షణ అయిన మోహన్‌లాల్ వీసా దరఖాస్తు మంజూరు కాకపోవడంతో ఆయన సింగపూర్‌లోనే నిలిచిపోవాల్సి వచ్చింది.  వీసా క్లియరెన్స్ సకాలంలో వస్తుందనే ఆశతో మోహన్‌లాల్ గత 2 రోజులుగా సింగపూర్‌లోనే వేచి చూశారు. అధికారులతో మాట్లాడి సాంకేతిక అడ్డంకులను పరిష్కరించడానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, శనివారం నాటికి అనుమతి లభించలేదు. వీసా అప్లికేషన్ తిరస్కరణకు గురికాలేదని, పరిశీలనా ప్రక్రియలో అనుకోకుండా అనూహ్య జాప్యం జరిగిందని నిర్వాహక సంస్థ కాయల్ ఈవెంట్స్ స్పష్టం చేసింది. అయినప్పటికీ, మోహన్‌లాల్ లేకుండా ప్రదర్శనను కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో విధిలేక ఈవెంట్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియాలోనే ఉండి వేచి చూస్తున్న అభిమానులకు, టికెట్లు కొనుగోలు చేసిన వేలాది మంది ప్రేక్షకులకు నిర్వాహకులు క్షమాపణలు తెలిపారు.   Also read: పరేష్ రావల్ భార్య ఎవరో తెలుసా? మిస్ ఇండియా నుంచి అక్కడి దాకా ఈ అనూహ్య పరిణామంపై సింగపూర్ నుంచి స్పందించిన మోహన్‌లాల్ అభిమానులని  ఉద్దేశించి మాట్లాడారు. తన 50 ఏళ్ల నట జీవితంలో ఎన్నో ప్రదర్సనలు ఇచ్చాను.  అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఐర్లాండ్ వంటి అనేక దేశాల్లో అయితే ఈ ఏడాదే ప్రదర్శనలు ఇచ్చాను. వీసా ప్రక్రియలో ఏదైనా సాంకేతిక లోపం, క్లరికల్ పొరపాటు లేదా ఏఐ వ్యవస్థ వల్ల అడ్డంకి ఏర్పడి ఉండవచ్చని, లోపం ఎక్కడ ఉన్నా ఆ నిందనంతా తనపైనే వేసుకుంటున్నాను. నిర్వాహకులు, తోటి కళాకారులు షో విజయం కోసం ఎంతో కష్టపడ్డారు.  ప్రేక్షకులకు సారీ. త్వరలోనే ఈ షోకు సంబంధించి నూతన తేదీలను, టికెట్ల మార్గదర్శకాలను వెల్లడిస్తామని, ఇది కేవలం వాయిదా మాత్రమేనని  భావోద్వేగానికి లోనయ్యారు.   Mohanlal, KS Chithra, Sydney, Mollywood
ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రియులకు వినోదాల పంట పండిందనే చెప్పాలి. అక్కినేని అఖిల్ 'లెనిన్', సిద్ధార్థ్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్', తిరువీర్ 'ఓ సుకుమారి'తో పాటు.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో 25కు పైగా సినిమాలు, సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. యాక్షన్, డ్రామా, రొమాన్స్, సస్పెన్స్, పీరియాడికల్, రూరల్ ఇలా పలు జానర్స్ లో ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గట్టుగా వినోదాలు అలరిస్తున్నాయి. ఈ వారం ఓటీటీ రిలీజ్‌లలో ప్రధానంగా ఆకట్టుకుంటున్న చిత్రాల్లో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా బ్లాక్‌బస్టర్ యాక్షన్ మూవీ 'లెనిన్' ముందువరుసలో ఉంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కించారు. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన నెల రోజుల్లోపే ప్రముఖ డిజిటల్ సంస్థ జీ5 వేదికగా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చి విశేషంగా ఆకట్టుకుంటోంది.  వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే తమిళ హీరో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో దర్శకుడు శశి కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా 'వంద దేవుళ్ళు' కూడా జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంతగానో అలరిస్తోంది. ఇందులో శ్వాసిక, అజయ్, కావ్య, శక్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరోవైపు నెట్‌ఫ్లిక్స్ వేదికపై సైనిక నేపథ్యం, దేశభక్తి అంశాలతో భారీ స్థాయిలో రూపుదిద్దుకున్న 'ఆపరేషన్ సఫేద్ సాగర్' వార్ యాక్షన్ వెబ్‌సిరీస్ విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో ఓనీ సేన్ దర్శకత్వంలో తీర్చిదిద్దిన ఈ సిరీస్ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండి రికార్డు వ్యూస్ తో ముందుకు సాగుతోంది.  అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ చిత్రం 'మై వాపస్ ఆవూంగా', హాలీవుడ్ అడ్వెంచర్ 'ది సూపర్ మారియో గెలాక్సీ', 'ది లాస్ట్ హౌస్', 'బిగ్ చికెన్: ఎ ఫాస్ట్ ఫుడ్ కాన్స్పిరసీ', 'లవ్ హర్ట్స్'తో పాటు.. తమిళ్, తెలుగు భాషల్లో వచ్చిన 'హృదయం మురళి', కొరియన్ డ్రామా 'అవర్ స్క్రిక్ట్లీ లవ్' వంటి సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో విషయానికి వస్తే, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన రూరల్ కామెడీ డ్రామా 'ఓ సుకుమారి' ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా భరత్ దర్శన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా, తాకగానే షాక్ కొట్టే విచిత్రమైన శక్తి ఉన్న ఒక అమ్మాయి చుట్టూ తిరిగే వినూత్న కథాంశంతో డిజిటల్ వీక్షకులకు నవ్వులు పంచుతోంది.  ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చిన ఇతర చిత్రాల్లో 'ఎంఆర్‌పీ: నీకెంత నాకెంత', ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'డార్క్ సీక్రెట్', ప్రముఖ హిందీ సిరీస్ సీక్వెల్ 'వదంతి: సీజన్ 2', అలాగే ఇంగ్లీష్, తెలుగు వర్షన్లలో అందుబాటులో ఉన్న 'స్టెర్లింగ్ పాయింట్: సీజన్ 1' కూడా ఓటీటీ ప్రియులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇవే కాకుండా జియో హాట్‌స్టార్‌లో మలయాళ, తెలుగు వర్షన్లలో సైకలాజికల్ థ్రిల్లర్ 'ఉయిర్', సింప్లీసౌత్‌లో తమిళ చిత్రం 'కాట్టలాన్' వంటి విభిన్న చిత్రాలు సైతం తమ మార్కు వినోదాన్ని అందిస్తున్నాయి. ఇలా దాదాపు 25 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విభిన్న ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అలరిస్తుండటంతో, ఈ వీకెండ్ సినీ ప్రియులకు సరికొత్త వినోదాల వేడుకగా మారింది.       Telugu OTT Releases, Lenin Movie, Oh Sukumari, Vanda Devullu, Hrudhayam Murali   
  చెవిలో కాలీఫ్లవర్ ఏమైనా కనపడుతుందా అనే ఒకే ఒక డైలాగ్ తో తెలుగు నాట పాపులర్ అయిన లెజండ్రీ యాక్టర్ పరేష్ రావల్.. ఎన్నో వైవిద్యమైన క్యారెక్టర్స్ తో ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. కామెడీ టైమింగ్‌ కి అయితే తిరుగులేదు. శంకరదాదా ఎంబిబిఎస్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి లింగం మావయ్యగా  కూడా ఫుల్ పాపులర్ అయ్యాడు. ఆయన  రియల్ లైఫ్, ఆయన కుటుంబ నేపథ్యం గురించి చాలా మందికి తక్కువగా తెలుసు. ముఖ్యంగా వైఫ్  స్వరూప్ సంపత్ ఒకప్పుడు భారతదేశాన్ని ఏలిన అందాల రాశి, మాజీ మిస్ ఇండియా విజేత అనే విషయం చాలా మందికి తెలియదు.  కేవలం సౌందర్యంలోనే కాకుండా విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆమె జీవిత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.  ఈ అరుదైన ప్రేమకథ 1975వ సంవత్సరంలో ముంబైలోని ఒక నాటక ప్రదర్శనలో ప్రారంభమైంది. కళాశాల రోజుల్లో నాటకాల్లో చురుగ్గా పాల్గొనే  పరేష్ రావల్ తొలిచూపులోనే స్వరూప్ సంపత్‌ను చూసి ప్రేమలో పడ్డారు. ఆ సమయంలో ఆమె నాటక నిర్వాహకుని కుమార్తె కావడంతో స్నేహితులు హెచ్చరించినప్పటికీ, పరేష్ మాత్రం "ఆమె ఎవరి కుమార్తె అయినా సరే, నేను మాత్రం ఆమెనే పెళ్లి చేసుకుంటాను" అని ధైర్యంగా ప్రకటించారు. పరేష్ నటనను చూసి ముగ్ధురాలైన స్వరూప్ కూడా ఆయనతో స్నేహాన్ని పెంచుకున్నారు. వీరిద్దరి అభిరుచులు, నాటకరంగం పట్ల ఉన్న ప్రాణం వారిని మరింత దగ్గర చేశాయి.  కొద్దికాలానికే, స్వరూప్ తండ్రి ప్రోత్సాహంతో  మిస్ ఇండియా పోటీలలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. అయితే ప్రారంభంలో ఆమెకు కొంత సంకోచం ఉన్నప్పటికీ, పరేష్ రావెల్ ఇచ్చిన ధైర్యం, మద్దతు ఆమెని  ముందుకు నడిపాయి.  ఫలితంగా 1979వ సంవత్సరంలో స్వరూప్ సంపత్ 'ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్' కిరీటాన్ని కైవసం చేసుకుని, 1979 మిస్ యూనివర్స్ పోటీలలో భారత ప్రతినిధిగా నిలిచారు. మోడలింగ్ రంగుల ప్రపంచంలో ప్రవేశించిన తర్వాత కూడా వీరి అనుబంధం చెక్కుచెదరలేదు. సుదీర్ఘంగా 12 సంవత్సరాల పాటు ప్రేమాయణం సాగించిన ఈ జంట, 1987వ సంవత్సరంలో ఎంతో నిరాడంబరంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.   సినిమా రంగంలో స్వరూప్ సంపత్ తనదైన ముద్ర వేశారు. 1981లో విడుదలైన 'నరమ్ గరమ్', 'నాఖుదా' చిత్రాలతో పాటు, 1983 నాటి 'హిమ్మత్‌వాలా', 1984లో వచ్చిన 'కరిష్మా' వంటి ప్రసిద్ధ చిత్రాలలో ఆమె కీలక పాత్రలు పోషించారు. అలాగే 1984లో ప్రసారమైన అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ సీరియల్ 'యే జో హై జిందగీ' ద్వారా బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. తదనంతర కాలంలో 'సాథియా' (2002), 'కీ అండ్ కా' (2016), 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' (2019) వంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు.  అయితే కేవలం వెండితెర గ్లామర్‌కే పరిమితం కాకుండా, విద్యా రంగంలో స్వరూప్ అద్భుతమైన కృషి చేశారు. Also read: ఇదేనా!.. రాజకీయాల్లోకి వచ్చే సినీ లిస్ట్   పిల్లల పెంపకం, విద్య మరియు సమాజ సేవపై దృష్టి సారించిన ఆమె, యూకేలోని విశ్వఖ్యాత 'యూనివర్సిటీ ఆఫ్ వోర్సెస్టర్' నుంచి విద్యారంగంలో పీహెచ్‌డీ (PhD) పట్టా సాధించి 'డాక్టర్ స్వరూప్ సంపత్'గా మారారు. నేర్చుకునే వైకల్యాలు ఉన్న పిల్లల కోసం నాటకాలను బోధనా సాధనంగా ఉపయోగించడంపై ఆమె పరిశోధనలు చేశారు.నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, పిల్లల కోసం ప్రత్యేక విద్యా కార్యక్రమానికి అధిపతిగా స్వరూప్‌ను ఎంపిక చేశారు. అంతేకాకుండా, గ్లోబల్ టీచర్ ప్రైజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా 179 దేశాల నుండి వచ్చిన 10,000 కంటే ఎక్కువ నామినేషన్లలో స్వరూప్ సంపత్ టాప్ 10 గ్లోబల్ ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచి భారతదేశ కీర్తిని అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పారు. ప్రస్తుతం ఈ దంపతులకు అనిరుద్ధ్, ఆదిత్య అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్లామర్ ప్రపంచాన్ని ఏలి, ఆ తర్వాత విద్యావేత్తగా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన స్వరూప్ సంపత్ జీవితం నిజంగా అభినందనీయం.  Paresh Rawal,  Swaroop Sampat, Tollywood  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు అయితే.. రాత్రంతా రైళ్లలోనే ఉండాల్సి వస్తుంది.  అయితే రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది.  పక్కన ప్రయాణికుల నుండి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. రైల్వే రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ప్రత్యేక "నైట్ జర్నీ కండీషన్స్" అమలు చేసింది. ప్రతి రైలు ప్రయాణికుడు ఈ నియమాల గురించి తెలుసుకోవాలి. లేకపోతే రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అవేంటో తెలుసుకుంటే.. శబ్దం చేయకూడదు.. రాత్రి 10 గంటల తర్వాత రైలులో నిశ్శబ్ద వాతావరణాన్ని పాటించడం ప్రధాన నియమం. ఈ సమయంలో మొబైల్ ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడకూడదు, లేదా ఇయర్‌ఫోన్‌లు లేకుండా స్పీకర్‌లపై వీడియోలు లేదా సంగీతాన్ని ప్లే చేయకూడదు. ఇతర ప్రయాణికుల నిద్రకు భంగం కలగకుండా ఉండేందుకు, స్నేహితులతో గుంపులుగా బిగ్గరగా నవ్వడం , జోకులు వేయడం కూడా నిషేధించబడింది. లైట్స్ ఆఫ్.. కొన్నిసార్లు ప్రయాణికులు ఎవరైనా రాత్రి పొద్దుపోయే వరకు  ఏదో ఒక కారణంతో మెయిన్ లైటును ఆన్ చేసి ఉంచుతారు. దీనివల్ల ఇతర ప్రయాణికులు నిద్రపోలేరు. పక్క వారి నిద్రకు ఇబ్బంది అవుతుంది.  రైల్వే నిబంధనల ప్రకారం, రాత్రి 10 గంటల తర్వాత ప్రధాన కోచ్‌లోని లైట్లన్నీ తప్పనిసరిగా ఆపివేయాలి. రాత్రిపూట కేవలం నైట్‌లైట్ బల్బులు మాత్రమే ఆన్ చేసి ఉండవచ్చు. ఎవరైనా  అవసరం అనిపిస్తే వారు  తమ సీటులోని పర్సనల్ రీడింగ్ లైటును ఉపయోగించుకోవచ్చు. మధ్య బెర్త్ లకు రైల్వే నియమాలు.. లోయర్ బెర్త్  , మధ్య బెర్త్ ప్రయాణీకుల మధ్య సీట్ల తగాదాలను నివారించడానికి, రైల్వే ఒక స్పష్టమైన నియమాన్ని పెట్టింది. మధ్య బెర్త్ ప్రయాణీకుడు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య మాత్రమే తన సీటును విప్పి నిద్రపోవచ్చు. ఉదయం 6 గంటల తర్వాత, ఇతరులు దిగువ బెర్త్‌లో కూర్చోవడానికి వీలుగా  మధ్య బెర్త్‌ను దించాలి. అదేవిధంగా, రాత్రి 10 గంటల తర్వాత, లోయర్ బెర్త్ ప్రయాణీకుడు తన సీట్ లో ఎవరినీ కూర్చోబెట్టుకోకూడదు. వారు తమ పక్కన కూర్చోమని ఎవరినీ బలవంతం చేయలేరు. టికెట్ చెకింగ్.. ప్రయాణికుల నిద్రను దృష్టిలో ఉంచుకుని, రైల్వే తన టికెట్ చెకింగ్ సిబ్బందికి సూచనలు జారీ చేసింది. రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 6:00 గంటల మధ్య  టికెట్‌ను తనిఖీ చేయడానికి ఏ టిటిఇ మిమ్మల్ని నిద్రలేపకూడదు. వారు రాత్రి 10:00 గంటల లోపు తమ పనిని పూర్తి చేసుకోవాలి. అయితే, రాత్రి 10:00 గంటల తర్వాత రైలు ఎక్కిన ప్రయాణికులు ఈ సమయంలో తమ టికెట్లను తనిఖీ చేయించుకోవచ్చు. ఇది కాకుండా రాత్రి 10 గంటల తర్వాత రైలులో వీధి వ్యాపారులు లేదా విక్రయదారులు గట్టిగా అరుస్తూ ఎలాంటి వస్తువులను అమ్మకూడదు.  కానీ ఎవరైనా ఈ-క్యాటరింగ్ ద్వారా ఆహారాన్ని ముందుగానే బుక్ చేసుకుని ఉంటే, అది ఖచ్చితంగా వారి సీటుకే తెచ్చిస్తారు. నియమాలు ఉల్లింఘిస్తే.. రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికుడు ఈ నియమాలను ఉల్లంఘిస్తే, వారితో వాదించాల్సిన అవసరం లేదు.  వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), TTE, లేదా రైలులోని కోచ్ అటెండెంట్‌కు ఫిర్యాదు చేయవచ్చు.  రైల్వే అధికారిక యాప్ 'రైల్‌మదాద్' లేదా 139 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా కూడా సహాయం పొందవచ్చు. నియమాలను ఉల్లంఘించిన వారిపై రైల్వే జరిమానాలు కూడా విధించవచ్చు. కాబట్టి రైలు ప్రయాణం చేసేటప్పుడు పై నియమాలు గుర్తుంచుకుని,  వాటిని అనుసరిస్తూ ప్రయాణించడం మంచిది.                                      *రూపశ్రీ.  
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు.  వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని,  తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది.  రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం,  పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా  మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు.  అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల  భవిష్యత్తులో  చాలా సమస్యలు వస్తాయి.  మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం,  పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి.  ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు.  తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు.  ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు.  సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ  భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును,  తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు.  ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ  భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా  భాగస్వామిపై ఆధారపడటం  తప్పు. ఈ అలవాటు  భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం  సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు.  ఎవరి కోసమూ  అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం,  చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది.                                              *రూపశ్రీ.
సిబ్లింగ్ థెరపీ..  తోబుట్టువుల మధ్య వచ్చే మనస్పర్థలు సులువుగా తొలగించే భలే మార్గం..! అన్నా తమ్ముడు, అక్కా చెల్లి, అన్నా చెల్లెళ్లు,  అక్కా తమ్ముళ్లు.. ఇలా తోబుట్టువుల బంధాలు చాలా గొప్పవి. ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన వారి మధ్య బంధం ఎంతో అపురూపమైనది.  చిన్నతనంలో తోబుట్టువులు కొట్టుకున్నా, తిట్టుకున్నా, గొడవ పడినా అది జరిగిన తర్వాత కొన్ని నిమిషాలు లేదా గంటల్లోనే తిరిగి కలిసిపోతారు.  ఒక్కటిగా పెరుగుతారు.  కానీ పెద్దయ్యాకే సమస్యలు వస్తాయి.  చాలామందికి అపార్థాలు చోటుచేసుకుంటాయి. మనస్పర్థలు వస్తాయి. వీటి వల్ల కేవలం ఆ మనిషి మాత్రమే కాకుండా కుటుంబం అంతా కలత చెందుతుంది.  పైగా ఇలాంటి మనస్పర్థలు,  అపార్థాల వల్ల దూరం కూడా పెరుగుతుంది. ఇలాంటి దూరాలను తగ్గించి, మనస్పర్థలు పోగొట్టి తిరిగి తోబుట్టువులను ఒక్కటిగా ఉంచే మార్గమే సిబ్లింగ్ థెరపీ.. అసలు సిబ్లింగ్ థెరపీ అంటే ఏంటి? దీని ప్రయోజనం ఏంటి? ఇదెలా సహాయపడుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. సిబ్లింగ్ థెరపీ అంటే.. సిబ్లింగ్ థెరపీ అనేది కుటుంబ చికిత్సలో ఒక భాగం. తోబుట్టువుల మధ్య మాట్లాడుకునే విధానాన్ని  మెరుగుపరచడం, గత విభేదాలను పరిష్కరించడం,  సంబంధంలో నమ్మకాన్ని తిరిగి వచ్చేలా చేయడం  దీని లక్ష్యం. ఈ చికిత్సలో బాగా ట్రైనింగ్ అయిన వ్యక్తి మనస్పర్థలు ఉన్న ఇద్దరు వ్యక్తులను  స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తపరచనవు చెబుతారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడానికి గల కారణాలను అర్థం చేసుకోవడంలో సహాయపడతారు. తోబుట్టువుల మధ్య తరచుగా  జరిగే గొడవలు, ఇద్దరి మధ్య మాటలు లేకపోవడం, సవతి కుటుంబ సమస్యల కారణంగా సంబంధాలు దెబ్బతినడం, లేదా  పెద్దవయలు అయిపోయిన తల్లిదండ్రులను చూసుకోవడం.. ఇలా చాలా కారణాల వల్ల తోబుట్టువుల మధ్య విబేధాలు ఏర్పడితే వాటికి సరైన సొల్యుషన్ చెప్పి తోబుట్టువులను తిరిగి కలుపుతారు. ప్రయోజనం... సిబ్లింగ్ థెరపీ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, అది వారి మధ్య కమ్యునికేషన్ ను  మెరుగుపరుస్తుంది. థెరపీ సమయంలో, తోబుట్టువులు శ్రద్ధగా వినడం, తమ భావాలను సరైన విధంగా  వ్యక్తపరచడం,  అవతలి వ్యక్తి కోణాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. దీనివల్ల క్రమంగా అపార్థాలు తగ్గుతాయి. ఒకవేళ చిన్ననాటి అనుభవం లేదా గతంలోని వివాదం వారి సంబంధంలో సమస్యకు కారణమైతే, ఈ సమస్యలను బహిరంగంగా చర్చించడానికి థెరపీ ఒక మంచ వాతావరణాన్ని అందిస్తుంది. కొన్నిసార్లు, పక్షపాతం, పగ, లేదా చెప్పుడు మాటలు వంటివి సంవత్సరాల తరబడి ఆ సంబంధాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి.  థెరపిస్ట్ సహాయంతో ఈ సమస్యలను చర్చించి పరిష్కరించడం జరుగుతుంది, తద్వారా ఆ సంబంధం సాఫీగా  సాగడానికి వీలవుతుంది. ఎమోషనల్ సపోర్ట్.. సిబ్లింగ్ థెరపీ  రిలేషన్స్ ను ఎమోషన్ పరంగా బలంగా మారుస్తుంది.  తోబుట్టువులకు ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది. కష్ట సమయాల్లో  కలసికట్టుగా ఉండటం, ఒకరి సంతోషాన్ని మరొకరు పంచుకోవడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడుగా ఉండటం.. ఇలా   మొత్తం కుటుంబంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంట్లో ఒత్తిడి తగ్గుతుంది , ఇతర కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడటం ప్రారంభిస్తాయి. తోబుట్టువుల మధ్య ఎప్పుడూ గొడవలు ఉంటే,  లేదా పూర్తీగా మాటలు ఆగిపోయి ఉంటే.. కుటుంబంలో పెద్ద మార్పు తర్వాత సంబంధాలు క్షీణిస్తే, లేదా కుటుంబ నిర్ణయాలపై తరచుగా వివాదాలు అవుతూ ఉంటే, సిబ్లింగ్ థెరపీని తీసుకోవడం చాలా మంచిది.                              *రూపశ్రీ.  
కాల్షియం, ఐరన్ లోపం ఉందా? పాలు, పాల ఉత్పత్తుల విషయంలో కల్తీపై ఆందోళన ఉందా? అయితే మన ఇంట్లోనే సులభంగా లభించే ఒక ఆకుకూర మీ ఆహారంలో మంచి పోషక వనరుగా ఉపయోగపడవచ్చు. ఇంతకీ ఆ ఆకుకూర ఏంటి? దానిలో ఉండే పోషకాలు ఏమిటి? ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? ఎంత మోతాదులో తీసుకోవాలి? ఈ వీడియోలో ఆయుర్వేద వైద్యులు చిట్టి బొట్ల మధుసూదన్ శర్మ ఈ ఆకుకూర గురించి ఆసక్తికరమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. కాల్షియం మన ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజం. అలాగే ఐరన్ శరీరంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, ఇతర సహజ ఆహార పదార్థాలను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఆహార విధానంలో భాగం. అయితే ఒక ఆహార పదార్థం తీసుకోవడం వల్ల మాత్రమే కాల్షియం లేదా ఐరన్ లోపం పూర్తిగా సరిచేయబడుతుందని భావించకూడదు. ఇప్పటికే లోపం ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలితే, వైద్యుల సూచన మేరకు సరైన ఆహారం లేదా అవసరమైన చికిత్స తీసుకోవడం ముఖ్యం. ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: • కాల్షియం, ఐరన్ మన శరీరానికి ఎందుకు అవసరం? • ఇంట్లో సులభంగా లభించే ఈ ఆకుకూరలో ఉన్న పోషకాలు ఏమిటి? • ఈ ఆకుకూరను ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చు? • ఆకుకూరలను తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి? • సహజ ఆహారాల ద్వారా పోషకాలను పొందడంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలను ఈ వీడియోలో ఆయుర్వేద వైద్యులు చిట్టి బొట్ల మధుసూదన్ శర్మ వివరించారు. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా పోషక లోపం, అనారోగ్య సమస్య ఉంటే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి. వైద్యుల సూచన లేకుండా మందులు లేదా సప్లిమెంట్లను ప్రారంభించవద్దు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
ఐస్ క్రీమ్.. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. చాలామంది వర్షాకాలంలో కూడా ఐస్ క్రీమ్ తింటే ఆ కిక్కే వేరు అంటారు.  కాలం ఏదైనా ఐస్ క్రీమ్ పట్ల చాలా ఇష్టం ఉంటుంది. అయితే నేటి కాలంలో ఐస్ క్రీమ్ మాత్రమే కాకుండా ఫ్రోజెన్ డెజర్ట్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.  షాప్ కు వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ ఏదో,  ప్రోజెన్ డెజర్ట్ ఏదో అర్థం కాకుండా చాలా మంది పొరపాటుగా ఐస్ క్రీమ్ కు బదులు ఫ్రోజెన్ డెజర్ట్ ఎంచుకుంటారు. ఆ తర్వాత ఇది ఐస్ క్రీమ్ కాదని నాలుక కరుచుకుంటారు. అందుకే ఐస్ క్రీమ్ కు,  ఫ్రోజెన్ డెజర్ట్ కు మధ్య తేడా ఎలా తెలుసుకోవాలి? తెలుసుకుంటే.. ఫ్రోజెన్ డెజర్ట్‌లు ఐస్ క్రీమ్‌కు చాలా భిన్నంగా ఉంటాయి, కానీ  చాలామంది అవి  రెండూ ఒకటే అని పొరబడతారు. ఈ రెండూ చూడటానికి, రుచిలో ఒకేలా కనిపించినప్పటికీ, వాటి మధ్య చాలా తేడా ఉంటుంది. పదార్థాలు.. ఐస్ క్రీమ్ , ఫ్రోజెన్ డెజర్ట్‌ల మధ్య ఉన్న అతిపెద్ద తేడా వాటి తయారీలో ఉపయోగించే కొవ్వు పదార్థం. ఐస్ క్రీమ్‌ను పాలు, క్రీమ్ , పాల ఫ్యాట్ తో తయారు చేస్తారు. అందువల్ల, ఐస్ క్రీమ్‌గా పరిగణించబడాలంటే, ఏ ఫ్రోజెన్ డెజర్ట్‌లోనైనా కనీసం 10% పాల కొవ్వు ఉండాలి. మరోవైపు, ఫ్రోజెన్ డెజర్ట్‌లలో పాలకు బదులుగా పామాయిల్ లేదా పామ్ కెర్నల్ ఆయిల్ వంటి వెజిటెబుల్ నూనె లేదా వెజిటెబుల్ ఫ్యాట్ ను ఉపయోగిస్తారు. పాల ఘనపదార్థాలను కలుపుతారు, కానీ పాల కొవ్వును ఉపయోగించరు. రుచి, టెక్చర్.. పాల కొవ్వును ఉపయోగించడం వల్ల ఐస్ క్రీమ్ మరింత క్రీమీగా, రుచికరంగా , మృదువుగా తయారవుతుంది. ఐస్ క్రీమ్ నోటిలో సులభంగా కరిగిపోతుంది. మరోవైపు, ఫ్రోజెన్ డెజర్ట్‌లు కొద్దిగా జిగటగా లేదా నూనెగా ఉంటాయి. అంతేకాకుండా, పాల కొవ్వుతో పోలిస్తే వెజిటబుల్  కొవ్వుకు కరికే గుణం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ప్యాకెట్ల పై లేబులింగ్.. చాలామంది ఐస్ క్రీమ్ అనుకుని  ఫ్రోజెన్ డెజర్ట్ లు కొనుగోలు చేసి తరువాత బాధపడుతూ ఉంటారు. అందుకే.. ఉత్పత్తి ఐస్ క్రీమా లేక ఫ్రోజెన్ డెజర్టా అనేది కంపెనీలు ప్యాకేజింగ్‌పై స్పష్టంగా పేర్కొనాలి. ఉత్పత్తిలో 0.5% కంటే ఎక్కువ వెజిటేబుల్ ఆయిల్  ఉంటే, దానిని ఐస్ క్రీమ్‌గా కాకుండా, కేవలం ఫ్రోజెన్ డెజర్ట్‌గా మాత్రమే అమ్మాలని FSSAI నిబంధనలు విధించింది. ధర తేడా.. పాల కొవ్వు కంటే వెజిటేబుల్ ఆయిల్  చాలా చౌకగా ఉంటుంది. అందువల్ల ప్రోజెన్ డెజర్ట్‌లు కంపెనీలకు మరింత పొదుపుగా ఉంటాయి . తక్కువ ధరకే లభిస్తాయి. మరోవైపు, ఐస్ క్రీమ్‌లో పాల కొవ్వును ఉపయోగిస్తారు, అందుకే దీని ధర ప్రోజెన్  డెజర్ట్‌ల కంటే ఎక్కువగా ఉంటుంది. కొనుగోలు చేసేముందు ఇవి గుర్తుంచుకోవాలి..  ప్యాక్ చేసిన డెజర్ట్‌ను కొనుగోలు చేసినప్పుడల్లా, ప్యాకేజీ ముందు లేదా వెనుక ఉన్న పదార్థాల జాబితాను జాగ్రత్తగా చదవాలి. ఆ పదార్థాలలో పామాయిల్ లేదా కూరగాయల నూనె ఉంటే, అది ఫ్రోజెన్ డెజర్ట్,  అందులో పాల కొవ్వు ఉంటే, అది ఐస్ క్రీమ్. ఇవన్నీ ప్యాకెట్ పైన కూడా మెన్షన్ చేసి ఉండాలి.                                    *రూపశ్రీ  
చండీపురా వైరస్ (Chandipura Virus) ప్రస్తుతం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న వైరస్‌లలో ఒకటి. ముఖ్యంగా 15 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ వైరస్ తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. వర్షాకాలంలో దీని ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ ప్రధానంగా సాండ్ ఫ్లై (Sand Fly) అనే చిన్న ఈగ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇది సాధారణంగా ఒకరి నుంచి మరొకరికి నేరుగా వ్యాపించదు. అయితే వైరస్ సోకిన పిల్లల్లో చాలా వేగంగా ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశం ఉండటంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. చండీపురా వైరస్ సోకినప్పుడు మొదట జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి సాధారణ లక్షణాలు కనిపించవచ్చు. కొంతమందిలో మూర్ఛలు, స్పృహ కోల్పోవడం, మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తవచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో 24 నుంచి 36 గంటల్లోనే ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్‌కు ప్రత్యేకమైన వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదు. అందువల్ల లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స ప్రారంభిస్తే ప్రాణాపాయం తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణుడు డా. హరిచరణ్ మోడమ్ చండీపురా వైరస్ ఎలా వ్యాపిస్తుంది, ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంది, ప్రారంభ లక్షణాలు ఏమిటి, ఏ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి వంటి ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: చండీపురా వైరస్ అంటే ఏమిటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? పిల్లల్లో కనిపించే ప్రారంభ లక్షణాలు ప్రమాదకర లక్షణాలను ఎలా గుర్తించాలి? ఎవరికి ఎక్కువ రిస్క్? వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాండ్ ఫ్లై కాట్ల నుంచి ఎలా రక్షించుకోవాలి? వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పిల్లల సంరక్షణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. అవగాహన, పరిశుభ్రత మరియు త్వరితగతిన వైద్య సహాయం తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచడం కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)