భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ'   చేపట్టిన ఉద్యమాన్ని అడ్డుకోవడానికి, లేదా అణచివేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ చేయగలిగినంతా చేస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ కీలక నేతలను అరెస్టు చేయడం, అలాగే మొదటి దశ నిరసనను అణచివేయడంలో కేంద్రం ఒకింత సక్సెస్ అయ్యింది కూడా. వరుస అరెస్టులు కేసులతో బొద్దింకల పార్టీ ఓ మెట్టు దిగి.. దీపావళి తరువాత వరకూ ఉద్యమానికి విరామం ఇస్తున్నట్లు ప్రకటించింది కూడా. కానీ అంతలోనే మళ్లీ  శుక్రవారం (అక్టోబర్23) నిరసనకు పిలుపునిచ్చారు. అది పక్కన పెడితే.. కాక్రోచ్ ఉద్యమానికి పరకాల ప్రభాకర్ బహిరంగంగా మద్దతు తెలపడం ద్వారా కేంద్రానికి బిగ్ షాక్ ఇచ్చారు. ఇంతకీ ఈ పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.    కేంద్ర విత్త మంత్రి భర్త, ప్రముఖ ఆర్థిక వేత్త అయిన  పరకాల ప్రభాకర్, ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 23న జరగనున్న బొద్దింకల నిరసనలో  పాల్గొంటానని ప్రకటించడం ద్వారా కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.  ఎన్నిక  అక్రమాలు, ఈవీఎం  నిర్వహణలో అవకతవకలపై పరకాల ప్రభాకర్ గత కొంతకాలంగా బహిరంగ విమర్శలు చేస్తున్న సంగతి విదితమే.  కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న నిర్మలా సీతారామన్ భర్తే  ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనడం కేంద్రానికి మింగుడుపడటం లేదు.    శుక్రవారం (అక్టోబర్ 23) జరగనున్న బొద్దింకల నిరసనలో కేంద్ర విత్త మంత్రి భర్త పరాకాల ప్రభాకర్‌తో పాటు నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ తదితరులు  పాల్గొంటున్నారు.  అసలింతకీ సర్ విషయంలో పరకాల ప్రభాకర్ గత కొంత కాలంగా తన అభ్యంతరాలను బాహాటంగానే వెల్లడిస్తూ వస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి అర్హుల పేర్లను కూడా తొలగిస్తున్నారంటూ ఆయన ఇప్పటికే పలుమార్లు విమర్శలు గుప్పించారు.  ఓటర్ల జాబితాల్లో పేర్లు తొలగిన వారు  తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలని కూడా ఆయన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.   ఈ నేపథ్యంలోనే ఆయన ఒక అడుగు ముందుకు వేసి ఇప్పుడీ ఆందోళనలో ప్రత్యక్షంగా పొల్గొనేందుకు సిద్ధపడటం ద్వారా కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. పరకాల ప్రభాకర్ బొద్దింకల ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లు ప్రకటించడం విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కు నిస్సందేహంగా ఇబ్బందికరంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అది పక్కన పెడితే.. విధానాల పరంగా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ ల అభిప్రాయాలు వేరు వేరు అన్న సంగతి గతంలో కూడా పలు సందర్భాలలో బయటపడింది. నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలను గతంలో కూడా పరకాల ప్రభాకర్ పలు మార్లు విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ప్రజాస్వామ్య సంస్థల పనితీరుపై పలు మార్లు ఘాటు విమర్శలు చేశారు.  మరీ ముఖ్యంగా  ఆయన రచించిన ది క్రూకడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా ( The Crooked Timber of New India) పుస్తకంలోనూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనను బాహాటంగా మద్దతు ఇవ్వడం ద్వారా ఆయన కేంద్రానికి బిగ్ షాక్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [Parakala Prabhakar Join CJP Protests, Union Minister Nirmala Sitharaman Husband, SIR Protest, Gyanesh Kumar,Resign Demand,  Shock, Center, Telugu One]
కాక్రోచ్ జనతా పార్టీ తన ఆందోళనకు విరామం ప్రకటించింది. ఆ పార్టీ  వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఇందుకు సంబంధించి స్వయంగా ప్రకటించారు.  దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.  పండుగ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కార్యకర్తలు,  మద్దతుదారులు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపేందుకు ఈ విరామాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు.  సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా, సీఈసీ జ్ణానేశ్వర్ కుమార్ రాజీనామా సహా పలు   ప్రజా సమస్యలపై రాజధాని ఢిల్లీలో సీజేపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల సమయంలో భద్రతా బలగాలు,  పోలీసుల అణచివేత కారణంగా పలువురు పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలు నిర్బంధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ కార్యకర్తల కుటుంబాలపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగించాయనీ, అందుకే కార్యకర్తలు, నాయకులు  పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు ఈ తాత్కాలిక విరామ నిర్ణయం తీసుకున్నట్లు అభిజీత్ దీప్కె పేర్కొన్నారు.  ఈ సందర్భంగా పార్టీ ప్రముఖ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాల అరెస్టులు,  జ్యుడీషియల్ కస్టడీ గురించి అభిజీత్ దిప్కే ప్రస్తావించారు. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ జైలులో గడిపినప్పటికీ వారి మొహంలో ఎలాంటి భయం కనిపించలేదని, వారి ధైర్యసాహసాలు పార్టీ శ్రేణులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని   కొనియాడిన ఆయన  చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటూనే ప్రజా సమస్యలపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేస్తామన్నారు.   [Cockroach Janata Party Gives Break Agitation, Diwali Protest Pause, CJP Agitations, Telugu One] 
రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారం పోయాక మరో మాట వినిపించడం కొత్తేమీ కాదు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి మాట్లాడే నాయకులు   వైఖరిని మరచిపోయి మాట్లాడటం విడ్డూరం. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల చుట్టూ సాగుతున్న వివాదం.. ఈ వివాదం విషయంలో వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలపై రాజకీయవర్గాలలోనూ, నెట్టింటా కడా ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది.  స్థానిక నామినేషన్ల ప్రక్రియలో తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారనీ, అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన చేసిన ఆరోపణలు నిజమా కాదా అన్న విషయం..  అన్నది ఆధారాలు, అధికారిక విచారణ తేలుస్తుంది. అ విషయం పక్కన పెడితే.. జగన్ గతంలో అంటే ఆయన అధికారంలో ఉండగా ఎన్నికల వ్యవస్థలతో వ్యవహరించిన తీరుపై ఇప్పుడు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.  అరాచకాలు జరిగాయని జగన్ చెప్పడాన్నితప్పుపట్టడం లేదు కానీ, జగన్   అధికారంలో ఉన్నప్పుడు ఎదురైన విమర్శలకు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆయన చేస్తున్న ఫిర్యాదులకు ఒకే కొలమానం వర్తిస్తుందా? ప్రజాస్వామ్యంపై ఆవేదన వ్యక్తం చేసే నాయకుడి మాటలకు విశ్వసనీయత రావాలంటే, గతంలోనూ అదే సూత్రాలకు కట్టుబడి ఉండాలి, లేదా ఉన్నట్లు కనిపించాలి.. కానీ సీఎంగా ఉన్న సమయంలో జగన్ వ్యవహరించిన తీరుపై, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు చేస్తున్న విమర్శలు ఫిర్యాదులప పోలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. తనదాకా వస్తే కానీ.. అన్న సమేతను గుర్తు చేస్తున్నదని అంటున్నారు.  స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటి పోటీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి. అలాగే పార్టీ శ్రేణుల్లో కనిపించని ఉత్సాహం. పార్టీ నాయకుల ఉదాశీనత.  మేయర్లు, మునిసిపల్ చైర్మన్ల ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల విధానం అమలులో ఉండటం కూడా వైసీపీలో పోటీకి ముందే పరాజయాన్ని అంగీకరించేసి చేతులెత్తేయడానికి ఒక కారణంగా పరీశీలకులు విశ్లేషిస్తున్నారు.   2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. పుంగనూరు, పులివెందుల, కడప, రాయచోటి, తిరుపతి తదిత ప్రాంతాల్లో తమ అభ్యర్థులను అడ్డుకున్నారని జగన్ ఆరోపిస్తున్నారు.  నామినేషన్ పత్రాలు లాక్కున్నారని, దాడులు జరిగాయని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు కోరుతూ వైసీపీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. మరోవైపు, కూటమి నాయకులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏకగ్రీవాలు, నామినేషన్ల అడ్డంకులను ప్రస్తావిస్తూ ప్రతివిమర్శలు చేస్తున్నారు.    ఇప్పుడు ఎన్నికల సంఘం స్వతంత్రత, ఎన్నికల కమిషనర్ల నియామక విధానం, నిష్పక్షపాత ఎన్నికల అవసరం గురించి మాట్లాడుతున్న జగన్.. గతంలో అంటే తాను అధకారంలో ఉన్న సమయంలో అప్పటి   రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పట్ల వ్యవహరించిన తీరుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.  ఆ సమయంలో ఎన్నికల నిర్వహణ, స్థానిక ఎన్నికల వాయిదా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారాలపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ వ్యవహారం న్యాయస్థానాల దాకా వెళ్లింది. ఇప్పుడు ఎన్నికల వ్యవస్థల గౌరవం గురించి జగన్ మాట్లాడుతున్నప్పుడు, గతంలో జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.   ప్రజాస్వామ్యం అంటే అధికారంలో ఉన్నవారు చెప్పిందే నిజమని అంగీకరించడం కాదు. ప్రతిపక్షం చెప్పిందే వాస్తవమని నమ్మడమూ కాదు. ఆధారాలు పరిశీలించి, న్యాయబద్ధమైన నిర్ణయాలకు కట్టుబడటం. జగన్ వ్యవస్థల గౌరవం గురించి మాట్లాడితే, గతంలో వాటితో జరిగిన వివాదాలపై ప్రశ్నలు రావడం సహజం. చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న తన పార్టీ శ్రేణుల ప్రవర్తనపైనా ప్రశ్నలు ఎదుర్కోవాల్సిందే. [AP Local Body Elections Violence, Jagan Mohan Reddy, Chandrababu Naidu, YCP, TDP,  Election Related Violence, Andhra Pradesh Politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వన్ మాన్ షో బద్రి సాధించిన ఘన విజయం తెలిసిందే. పవన్ బాడీ లాంగ్వేజ్, డ్రెస్ స్టైల్, డైలాగ్ డెలివరీ కుర్రకారుని పిచ్చెక్కించింది. దీంతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి నిర్మాతలకి కనక వర్షాన్ని కురిపించింది.  రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించి పవన్ కి దీటుగా అదిరిపోయే డైలాగ్ చెప్పిన పాపకి సంబంధించిన  న్యూస్ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ హోదాలో అభిమానులని, సినీ ప్రియులని అలరిస్తూ ఉంది. మరి పూర్తి మ్యాటర్ చదివాక మీరు కూడా సినీ ఆనందాన్ని పొందటం ఖాయం.  ఒక సన్నివేశంలో బద్రి(పవన్ కళ్యాణ్) పార్క్ లో దిగులుగా కూర్చొని ఉంటాడు. ఆ టైములో ఓ పాప వచ్చి ఎందుకు దిగులుగా ఉన్నారు అని అడుగుతుంది. ‘నాకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు’ అని సమాధానం ఇస్తాడు. దానికి ఆ పాప ‘నాకు కూడా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు’ అంటూ ఫన్నీ ఆన్సర్ ఇస్తుంది. చిన్న వయసులోనే ఎంతో క్యూట్ గా ఆ పాప చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్. అయితే ఆ పాప మరెవరో కాదు ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ కూతురు చేతన.  రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేతన ఈ విషయం చెప్పడంతో బద్రి మరో సారి వైరల్ గా నిలిచాడు. తనకి పిల్లలు పుట్టరని తెలిసి ఒక యువతీ తన ప్రియుడి చేత వేరే అమ్మాయిని ప్రేమించేలా చెయ్యడం అనే పాయింట్ తో బద్రి తెరకెక్కింది.   ఇది కూడా చదవండి: విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన కిచ్చా సుదీప్ దంపతులు.. మళ్లీ ఎలా ఒక్కటయ్యారో తెలుసా?   చేతన మొదటగా శ్రీకాంత్ నుంచి వచ్చిన 'గిల్లి కజ్జాలు'లో బాలశ్రీకృష్ణుడిగా చేసి   నటించింది. ఆ తర్వాత ‘బద్రి’, ‘చిత్రం’, ‘భద్రాచలం’, ‘పౌర్ణమి’ వంటి సినిమాల్లోనూ ఛైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది. 2017 లో వచ్చిన ‘పిచ్చి గా నచ్చావ్’ తో పాటు 'ప్యార్' లో  హీరోయిన్ గాను చేసింది చేతన.    [Badri Child Artist Details, Badri Child Artist chetana uttej now, chetana uttej, pawan kalyan badri movie, uttej daughter chetana, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. అవకాశాలు పెరుగుతాయని, ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వస్తుందని కొత్తగా వచ్చిన నటులు ఆశిస్తారు. కానీ విజయంతో పాటు విమర్శలు, అవమానాలు, ఒత్తిళ్లు కూడా ఎదురైతే? ఇప్పుడు నటుడు మౌళి తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఓ యాంకర్ తనను తక్కువ చేసి మాట్లాడటంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌళి.. తాజాగా ‘దొంగ నా కొడుకు’ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడాడు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తన గురించి యాంకర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయని తెలిపాడు. “పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడైతే ఇలాగే మాట్లాడేవారా?” అంటూ తన ఆవేదనను బయటపెట్టాడు. అసలు మౌళి ఎవడు? ‘లిటిల్ హార్ట్స్’ సినిమా తర్వాత మౌళి కనిపించాడా? మరో సినిమా రాకపోతే అతడిని ఎవరు గుర్తుపెట్టుకుంటారని ఒక ఇంటర్వ్యూలో ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ కామెంట్స్ చేశాడు. ఆ మాటలు చూసినప్పుడు చాలా బాధ కలిగిందని మౌళి చెప్పాడు. ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ ని అయితే అలా అనేవాళ్ళా? అని ప్రశ్నించాడు. వీడేం చేస్తాడు.. బచ్చాగాడు అనే ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేసి ఉంటారు. నిజంగానే నేనేం చేయలేను అని మౌళి అన్నాడు. ‘లిటిల్ హార్ట్స్’ విజయం తర్వాత ఏడాది కాలంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని, కొందరి నుంచి అసూయ, ద్వేషాన్ని చూశానని మౌళి వెల్లడించాడు. అయితే జరిగిన ప్రతిదాన్నీ బయటకు చెప్పలేనని, ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. మౌళి చెప్పిన మరో సంఘటన మరింత చర్చకు దారితీసింది. ‘లిటిల్ హార్ట్స్’ విడుదలైన తర్వాత ఓ న్యూస్ ఛానెల్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, ఒక ప్రోగామ్ కి రావాలని ఆహ్వానించారని తెలిపాడు. అయితే అప్పట్లో తనకు జ్వరం ఉండటంతో మరోసారి తప్పకుండా వస్తానని చెప్పినట్లు వివరించాడు. అయితే, తాను ప్రోగ్రామ్ కి రాకపోతే.. తన తదుపరి సినిమాకి నెగటివ్ అయ్యేలా చూస్తామన్న అర్థంలో మాట్లాడారని మౌళి ఆరోపించాడు. ఆ మాటలకు భయపడి, ఒంట్లో బాగోలేకపోయినా చివరకు ఆ ప్రోగ్రామ్ కి వెళ్లానని చెప్పాడు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో ఇలాంటి పరిస్థితులను కూడా భరించాల్సి వచ్చిందని వెల్లడించాడు. తనకు నచ్చిన సినిమాలు చేస్తూ, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత కష్టమైనా ఎదుర్కొంటానని చెప్పాడు. ఇది కూడా చదవండి: డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్.. ట్విస్ట్ కనిపెడితే కోటి రూపాయలు ఇస్తా.!       [Actor Mouli Emotional Comments, Donga Naa Koduku Teaser, Little Hearts Movie, Actor Mouli, Emotional, Mouli Talks, Telugu Film News]    
  హై వోల్టేజ్ పెర్ఫార్మ్ చెయ్యగల నటుల్లో కిచ్చా సుదీప్ ఒకరు. ప్రస్తుతం తెలుగు నిర్మాత హనుమాన్, సంబరాల యేటి గట్టు ఫేమ్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి తో ఒక సినిమా చేస్తున్నాడు.  సుదీప్ వ్యక్తిగత విషయానికి వస్తే రీసెంట్ గా తన భార్యతో కలిసి 25 వ (అక్టోబర్ 18 ) వార్షికోత్సవాన్ని జరుపుకున్నాడు.   ఈ సందర్భంగా  వార్షికోత్సవ వేడుకని  ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ వేడుకలో సుదీప్, ప్రియ సరదాగా ఒకరికొకరు పూలమాలలు మార్చుకున్న క్షణాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రియ సిగ్గుపడుతూ సుదీప్‌కు పూలమాల వేయమని కోరడం, సుదీప్ ఎంతో ప్రేమగా ఆమెకు మాల వేయడం, ఆ తర్వాత ప్రియ ఆయనకు మాల వేయడం వంటి అపురూప దృశ్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.   అయితే, ఈ సుందరమైన క్షనాల వెనుక ఒకప్పుడు ఎంతో బాధాకరమైన గతం కూడా ఉంది. ఈ దంపతుల ప్రయాణంలో ఒకానొక దశలో మనస్పర్థలు తలెత్తాయి. పెళ్లయిన 14 సంవత్సరాల తర్వాత, అంటే 2015వ సంవత్సరంలో విభేదాల కారణంగా ఈ జంట విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. అప్పట్లో ఈ వార్త సినీ పరిశ్రమను, అభిమానులని దిగ్భ్రాంతికి గురిచేసింది.  చట్టపరంగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఆ సమయంలో, సుదీప్ ఒక నిర్ణీత మొత్తంలో భరణం చెల్లించడానికి మరియు తమ ముద్దుల కుమార్తె సాన్వి సంరక్షణ బాధ్యతని ప్రియకి అప్పగించడానికి అంగీకరించారు. అప్పటికి  సాన్వి వయసు 11 ఏళ్ళు. . కానీ కాలం మారుతున్న కొద్దీ వారిద్దరి మధ్య ఉన్న పాత బంధం, బాధ్యతలు మరోసారి ఆలోచింపజేశాయి.  ఒకరికొకరు దూరంగా ఉండలేమని గ్రహించిన ఈ జంట, విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భావించారు. అలా 2017వ సంవత్సరంలో కర్ణాటక కోర్టులో తాము విడాకుల పిటిషన్‌ని ఉపసంహరించుకుంటున్నట్లు లిఖితపూర్వకంగా తెలిపారు. కోర్టు ద్వారా విడాకుల వరకు వెళ్లిన ఈ జంట, తమ పాత మనస్పర్థలను పూర్తిగా పక్కనపెట్టి మళ్లీ ఒక్కటయ్యారు. తమ కాపురానికి మరో అద్భుతమైన అవకాశం ఇచ్చి, అన్యోన్యంగా జీవిస్తూ నేడు విజయవంతంగా 25 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. విడాకుల అంచు నుంచి రీకన్సిలేషన్ వరకు సాగిన వీరి ప్రయాణం నేటితరానికి ఒక పెద్ద సందేశాన్ని ఇస్తోంది.      ఇది కూడా చదవండి: భయం గుప్పిట్లో బాలీవుడ్!: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ రెక్కీలతో వణికిపోతున్నసెలబ్రిటీలు!  అందుకే అంటారు జీవితానికి సంబంధించిన కఠినమైన నిర్ణయం తీసుకునే ముందు మౌత్, మైండ్ కి పని చెప్పకుండా వెయిట్ చెయ్యాలని. ఎందుకంటే వెయిటింగ్ అనేది అతి పెద్ద గురువు, ఆప్త మిత్రుడు, శ్రేయోభిలాషి. అన్నిటిని చక్కబెడుతుంది. అక్టోబర్ 18, 2001న ఆ ఇద్దరి వివాహం జరిగింది.   [kichcha Sudeep 25th Wedding Anniversary, Kichcha Sudeep, Priya Sudeep, 25th Wedding Anniversary, sandil wood,  Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
సినిమాలో ట్విస్ట్‌ను ముందే కనిపెట్టడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాల్లో అసలు విషయం ఏంటో చివరి వరకు సస్పెన్స్‌లో ఉంచితేనే ప్రేక్షకులకు కిక్ ఉంటుంది. అయితే తన సినిమా ట్విస్ట్‌ను కనిపెట్టిన వారికి ఏకంగా కోటి రూపాయలు ఇస్తానంటూ ఓ దర్శకుడు సవాల్ విసిరారు. స్టేజ్‌పై కేవలం మాటలు చెప్పడమే కాదు.. ఏకంగా కోటి రూపాయల చెక్‌తో తన ఛాలెంజ్‌ను ప్రకటించారు. ఆ దర్శకుడు మరెవరో కాదు.. సుకు పూర్వాజ్. ఆయన దర్శకత్వంలో జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కిల్లర్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సుకు పూర్వాజ్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  ‘కిల్లర్’ సినిమా ఫస్ట్ హాఫ్ సుమారు గంటసేపు ఉంటుందని సుకు పూర్వాజ్ వెల్లడించారు. కథలోని విభిన్నమైన అంశాలు ప్రేక్షకులను తమతో పాటు ప్రయాణించేలా చేస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌లో ఎవరూ ఊహించని భారీ ట్విస్ట్ ఉంటుందని, ‘ఆమె ఎవరు?’ అనే ప్రశ్నతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుందని వివరించారు.  సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఒక వాట్సాప్ నంబర్‌ను అందిస్తామని, సినిమా మొదటి షో చూస్తున్నప్పుడు ఇంటర్వెల్ పడిన ఐదు నిమిషాల్లోపు సెకండాఫ్‌లో వచ్చే కీలకమైన ట్విస్ట్ లేదా క్లూను కనిపెట్టి ఆ నంబర్‌కు పంపించాలని ఆయన తెలిపారు. సరైన సమాధానం చెప్పిన వ్యక్తికి సినిమా సక్సెస్ మీట్ రోజున కోటి రూపాయలు అందిస్తానని ప్రకటించారు.  సాధారణంగా సినిమా ఫ్లాప్ అయితే ఇండస్ట్రీని వదిలేస్తామని, షర్ట్ విప్పేస్తానని, గుండు కొట్టించుకుంటానని.. ఇలా రకరకాలుగా దర్శకులు సవాళ్లు విసరడం చూస్తుంటాం. కానీ సుకు పూర్వాజ్ మాత్రం అందుకు భిన్నంగా తన సినిమా కథలోని ట్విస్ట్‌నే ఛాలెంజ్‌గా మార్చేశారు. సైన్స్ ఫిక్షన్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ‘కిల్లర్’లో జ్యోతి పూర్వాజ్ విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. సుకు పూర్వాజ్ దర్శకత్వంతో పాటు నటించారు కూడా. ఈ సినిమా అక్టోబర్ 30న థియేటర్లలోకి రానుంది. మరి ఆయన ప్రకటించిన కోటి రూపాయల ఛాలెంజ్‌ను ఎవరైనా గెలుచుకుంటారా లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: నా మనసునే మీటకే నేస్తమా.. సిరివెన్నెల ఎంత గొప్పగా రాశారో.!       [Killer Director Poorvaj 1 Crore Challenge, Killer Movie Twist, Killer Movie 1 Crore Challenge, Director Suku Purvaj, Jyothi Poorvaj, Killer Movie, Telugu Movies 2026, Telugu Film News]  
  బాలీవుడ్.. కోనసీమలో సినిమా షూటింగ్ జరిగితే ఎంత ప్రశాంత వాతావరణం ఉంటుందో, అంతే వాతావరణంలో షూటింగ్స్ ని జరుపుకుంటూ విజయాల్ని అందుకోవడమే లక్ష్యంగా దూసుకెళ్తూ ఉంది. కానీ ఇప్పుడు  అండర్ వరల్డ్  మాఫియా వార్నింగ్, రివాల్వర్  దాడులతో బెంబేలేత్తిపోతుంది. దీంతో 1980 , 90వ దశకాలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ రూపంలో బాలీవుడ్‌కి సరికొత్త , అత్యంత భయంకరమైన గన్ షాడో ముప్పు చుట్టుముట్టింది. కేవలం ఎక్స్‌టార్షన్ లేదా డబ్బు డిమాండ్ చేయడమే కాకుండా, సెలబ్రిటీల ప్రాణాలని తీసే వరకు వెళ్తున్న ఈ పరిణామాలు చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల ముంబైలోని జుహు ప్రాంతంలో ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటన ఈ కలకలాన్ని తారస్థాయికి చేర్చింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ ప్రాణాలతో బయటపడినప్పటికీ,  డ్రైవర్, మరో వ్యక్తి గాయపడటంతో బాలీవుడ్ ప్రముఖుల్లో భయం మరింత పెరిగింది. ఈ మొత్తం హింసాత్మక పరంపర వెనుక అసలు మూలం సల్మాన్ ఖాన్ అనే చెప్పాలి.  1998 నాటి కృష్ణజంకల (బ్లాక్‌బక్) హత్యాకాండ కేసుకు సంబంధించిన పాత కక్షల కారణంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నిత్యం సల్మాన్‌ను టార్గెట్ చేస్తూ వస్తోంది. దీనికి కొనసాగింపుగా 2024 ఏప్రిల్‌లో సల్మాన్ బాంద్రా నివాసం బయట బైక్‌లపై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత 2024 అక్టోబర్ 12న సల్మాన్‌కు అత్యంత సన్నిహితుడైన మాజీ మహారాష్ట్ర మంత్రి బాబా సిద్ధిఖీని ముంబైలోనే దారుణంగా కాల్చి చంపడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సల్మాన్‌తో ఎవరికైనా స్నేహం ఉంటే లేదా ఎవరైనా ఆయనతో కలిసి పనిచేస్తే వారు తమ గ్యాంగ్‌కు శత్రువులేనని బిష్ణోయ్ గ్యాంగ్ బహిరంగంగానే హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే సల్మాన్‌ను టార్గెట్ చేసేందుకు ప్లాన్ చేసినప్పటికీ, ఆయన నివాసం వద్ద ఉన్న కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కారణంగా దుండగులు తమ వ్యూహాన్ని మార్చుకుని, టైగర్ ష్రాఫ్ సోషల్ మీడియా అప్‌డేట్స్ మరియు లొకేషన్‌ను నిరంతరం పర్యవేక్షించి ఈ దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి.      సల్మాన్ సర్కిల్ మాత్రమే కాకుండా, ఈ హింసాత్మక జాబితా రోజురోజుకూ విస్తరిస్తోంది. 2026 ఫిబ్రవరిలో ప్రముఖ నటుడు రణ్‌వీర్ సింగ్‌ని 10 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపు వాయిస్ మెసేజ్ రావడం, అదే సమయంలో ఆయన స్టాఫ్‌కు కూడా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించడం కలకలం రేపింది. సరిగ్గా అదే కాలంలో సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మకు సైతం క్రిప్టోకరెన్సీ రూపంలో భారీ రన్సమ్ ఇవ్వాలని ఈమెయిల్ ద్వారా డిమాండ్ చేశారు. కొద్ది నెలల ముందు కూడా ప్రముఖ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి బయట కాల్పులు జరగడం గమనించదగ్గ విషయం. ఇక 2026 జూలైలో బాలీవుడ్ బాద్‌షా ఆమిర్ ఖాన్‌ను కూడా ఈ బెదిరింపులు తాకాయి. బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులమని చెప్పుకుంటూ సోషల్ మీడియా మరియు ఆడియో మెసేజ్‌ల ద్వారా ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీ చేశారు.   ఒకప్పుడు కేవలం వ్యాపార లావాదేవీలు, ఆర్థిక వనరుల కోసమే అండర్ వరల్డ్ దాడులు జరిగేవి. కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. తగినంత భద్రత, కోట్లాది రూపాయల వనరులు స్టార్ డమ్ ఉన్న బాలీవుడ్ ప్రముఖులే ఇలా వరుసగా గ్యాంగ్‌స్టర్ల దాడులని  ఎదుర్కొవాల్సి రావడం కేవలం సినీ రంగానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఇదొక పెద్ద లా అండ్ ఆర్డర్ సవాల్‌గా మారింది. ఏది ఏమైనా బాలీవుడ్ సెలబ్రిటీస్ లో భయం మాత్రం నెలకొని ఉందనేది వాస్తవం.    [underworld returns to bollywood the lawrence bishnoi threat, Lawrence Bishnoi, Bollywood underworld, Tiger Shroff shooting, Bollywood, telugu cinema news, TeluguCinema, Tollywood, Tollywood news]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కట్ అవుట్ కి ఉన్న వేడి తగ్గే పనే లేదంటూ ప్రీవియస్ మూవీ 'ఓజి' సృష్టించిన విజయం తెలిసిందే. పవన్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించి ఫ్యాన్స్ కి బెస్ట్ ఆల్బమ్ గా కూడా నిలిచింది. అయితే, మొదటి భాగం ముగిసినప్పటి నుంచి  ఎప్పుడెప్పుడు పార్ట్ 2 షూట్ కి వెళ్తుందా అని వాళ్లంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తూ వస్తున్నారు.దీంతో  తదుపరి భాగం షూటింగ్, లైనప్ వివరాలపై మేకర్స్ నుంచి స్పష్టమైన క్లారిటీ రాకపోవడంతో మెగా ఫ్యాన్స్ ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలలో ‘#OG2’ మరియు ‘#OG2Update’ హ్యాష్‌ట్యాగ్‌లతో  అప్డేట్ ఇవ్వాలని  డిమాండ్ చేస్తున్నారు.    ఇది కూడా చదవండి: అఖిల్ అక్కినేని నెక్స్ట్ మూవీ అప్‌డేట్: ఫ్యాన్స్ ఆనంద బాష్పాలు!    దర్శకుడు సుజీత్ ప్రస్తుతం నాచురల్ స్టార్ నానితో ప్రాజెక్ట్ పనిలో ఉన్నాడని  మరోవైపు పవన్ కళ్యాణ్ తన పొలిటికల్, డెవలప్‌మెంట్ షెడ్యూల్స్ తర్వాత డేట్స్ కేటాయించాల్సి ఉండటంతో సెట్స్‌పైకి వెళ్లడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందనేది సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. ఏది ఏమైనా అభిమానుల కోసం అప్ డేట్ ఇస్తే బాగుండు అనేది సినీ అభిమానుల, విశ్లేషకుల అభిప్రాయం.     [Pawan Kalyan Og 2 Update, Pawan Kalyan Fans ABout Og2, Pawan Kalyan OG 2, OG Sequel Update, Director Sujeeth OG2, OG Movie Box Office, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
  అభిమానుల ముఖాల్లో చిరునవ్వు నింపుతు అఖిల్ అక్కినేని లెనిన్ తో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గుంటూరు, విజయవాడ లో అయితే చాలా మంది ఫ్యాన్స్ అఖిల్ హిట్ అందుకున్నాడంటూ కన్నీళ్లుని తమ గుండెల్లో నింపుకొని ర్యాలీలు కూడా చేసారంటే అఖిల్ అనే కట్ అవుట్ అభిమానులకి,తెలుగు సినిమాకి ఎంత ఇంపార్టెంట్ కట్ అవుట్ నో అర్ధం చేసుకోవచ్చు.  'లెనిన్'  ప్రమోషన్ల సమయంలోనే అఖిల్ తన ఫ్యాన్స్‌కి  ఒక ముఖ్యమైన మాటిచ్చారు. ఇకపై సినిమాల మధ్య ఎలాంటి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా, జెట్ స్పీడ్ తో వరుస ప్రాజెక్ట్‌లతో మీ ముందుకు వస్తానని చెప్పాడు. ఈ భారీ విజయం అందించిన ఆత్మవిశ్వాసంతో అఖిల్ తన తదుపరి చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రస్తుతం ఆయన రెండు విభిన్న కథలను ఫైనల్ చేసి, వాటిలో ఒక దానిని లాక్ చేసే పనిలో ఉన్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నాగార్జున, నాగచైతన్యతో కలిసి అఖిల్ నటించబోతున్న మల్టీస్టారర్ ప్రాజెక్ట్ పై కూడా త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది కూడా చదవండి:  నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ నయా అప్‌ డేట్ ఇదే!      అయితే, సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని పుకార్లను చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఇటీవల దర్శకుడు పవన్ సాదినేనితో అఖిల్ నెక్స్ట్ మూవీ ఉంటుందంటూ వచ్చిన వార్తలను మేకర్స్ అధికారికంగా తోసిపుచ్చారు. ఏది ఏమైనా, 'లెనిన్' వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత అఖిల్ తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నాగార్జున గారి పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్న ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడితేనే అసలు క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా  అఖిల్ తదుపరి చిత్రం ఏ జోనర్‌లో ఉండబోతోంది, ఎవరి దర్శకత్వంలో తెరకెక్కనుంది అనే విషయాలపై అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   [Akhil Akkineni Next Movie Update, Akhil Akkineni, Lenin movie, Akhil next project, Tollywood news, Nagarjuna, Akkineni updates, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
  నందమూరి మోక్షజ్ఞ , బింబిసార, విశ్వంభర ఫేమ్ వశిష్ట, పాన్ ఇండియా బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  నందమూరి మూడో తరం వారసుడు కావడంతో అభిమానులు, ప్రేక్షకులు సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తితో ఉన్నారు.  మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ముహూర్తం  రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుందనే అంశంపై ఫిల్మ్‌నగర్ వర్గాల నుండి స్పష్టమైన సమాచారం లభిస్తోంది. నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ లాంచ్ అయిన వెంటనే లేదా డిసెంబర్ మూడవ వారంలోనే ఏకధాటిగా రెగ్యులర్ షూటింగ్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేలా పక్కా షెడ్యూల్ సిద్ధం చేశారు. దశాబ్దాల కాలంగా నందమూరి వంశం అందించిన మాస్ ఎంటర్టైన్మెంట్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త చిత్రాన్ని మాస్ అంశాలు ఉంటూనే అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సోషియోఫాంటసీ, యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తీర్చిదిద్దుతున్నారు. ఇది కూడా చదవండి: రామాయణ మూవీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు: ఇచ్ఛే కానుక ఇదేనా!     కథాంశంపై బాలయ్య ఇప్పటికే దర్శకుడు వశిష్టతో చర్చలు జరిపి కొన్ని కీలకమైన సూచనలు మరియు మార్పులు ప్రతిపాదించినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా, సినిమాలో బాలకృష్ణ ఒక అత్యంత పవర్‌ఫుల్ మరియు కథని మలుపు తిప్పే కీలక రోల్ లో  (కేమియో) కనిపిస్తారని గట్టిగా ప్రచారం జరుగుతోంది.   [Nandamuri Mokshagna debut movie update, Mokshagna Teja shooting details, Balakrishna son movie launch, Director Vassishta Mokshagna, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]      
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
 భార్యాభర్తల మధ్య ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోందా..ఈ విషయాలు నిర్లక్ష్యం చేయకండి..! భార్యాభర్తల మధ్య బంధం కేవలం ఒకరికొకరు తోడుగా ఉండటం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య ఉండే భావోద్వేగాల అనుబంధం కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు దంపతులు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ, వారి మధ్య మానసిక దూరం పెరుగుతూ వస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో లేదా మనసులోని భావాలను పంచుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో భాగస్వామి మనల్ని పట్టించుకోవడం లేదనే భావన కలగడం సహజం. బంధంలో ఇలాంటి ఎమోషనల్ గ్యాప్ రావడం వల్ల ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.  ఈ విషయాన్ని ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. వివాహం తర్వాత పెరిగే దూరం.. పెళ్లయిన కొత్తలో ఉన్న ఆప్యాయత, సంభాషణలు కాలక్రమేణా మరుగున పడిపోవడం చాలా జంటల్లో కనిపిస్తుంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం, మానసిక ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల ఒకరికొకరు సమయం కేటాయించడం తగ్గిపోతుంది. అయితే, ఈ దూరం చిన్న చిన్న విషయాల నుంచి ప్రారంభమై పెద్ద సమస్యగా మారుతుంది. భాగస్వామి ప్రవర్తనలో వచ్చే మార్పులను సరిగ్గా గమనించకపోతే, అది మానసికంగా ఇద్దరినీ ఒంటరి చేసేస్తుంది. కాబట్టి సంబంధంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందో లేదో తెలుసుకోవడానికి కొన్ని కీలకమైన లక్షణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. రెస్పాండ్ కాకపోవడం.. మీరు చెప్పే విషయాలను లేదా మీ సమస్యలను భాగస్వామి గమనించకపోవడం లేదా వాటికి సరైన స్పందన ఇవ్వకపోవడం చాలా స్పష్టమైన సంకేతం. రోజులో జరిగిన విషయాలు లేదా  మనసులోని ఆందోళనలను పంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వారు ఫోన్ చూస్తూ ఉండటం లేదా మీ మాటలను మధ్యలోనే ఆపేయడం చేస్తుంటే అక్కడ ఎమోషనల్ బాండింగ్  సన్నగిల్లుతోందని అర్థం చేసుకోవాలి. కేవలం వినడం మాత్రమే కాకుండా, మీ మాటలకు విలువ ఇవ్వకపోవడం వల్ల  అభద్రతాభావం పెరుగుతుంది. నిర్లక్ష్యం.. మీ ఫీలింగ్స్  లేదా మీ ఆవేదనను తేలికగా తీసుకోవడం లేదా చిన్నచూపు చూడటం కూడా ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోందని చెప్పడానికి ఒక సంకేతం. మీకు ఏదైనా విషయంలో బాధ కలిగినప్పుడు, భాగస్వామి మిమ్మల్ని ఓదార్చాల్సింది పోయి మీరు అతిగా  ఆలోచిస్తున్నారని అనడం లేదా చిన్న విషయాలకే పెద్దవి చేస్తున్నారని అనడం సరికాదు. మీ ఫీలింగ్స్ కు  గౌరవం ఇవ్వకపోవడం వల్ల మీ మనసులోని మాటలను ఎవరితో పంచుకోవాలో తెలియని అయోమయం ఏర్పడుతుంది. ఇలాంటి ప్రవర్తన ఇద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ ను  మరింత పెంచుతుంది. షేర్ చేసుకోకపోవడం..   భాగస్వామి తమ వ్యక్తిగత విషయాలు లేదా మనసులోని ఆలోచనలను మీతో పంచుకోవడం మానేయడం కూడా ఇద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోంది అనడానికి సంకేతం. గతంలో ప్రతి చిన్న విషయాన్ని మీతో చెప్పే వారు, ఇప్పుడు తమ ప్లానింగ్స్, ఇబ్బందులు లేదా అనుభవాలను పూర్తిగా దాచడం ఒకవేళ అడిగినా కూడా   ఏదో ఒక సాకు  చెప్పి దాటవేయడం చేస్తుంటే అక్కడ దూరం పెరుగుతోందని గ్రహించాలి. ఎమోషన్స్ ను లేదా మనసులోని విషయాలను ఒకరికొకరు షేర్ చేసుకోలేని చోట బంధం కేవలం పేరుకే మిగులుతుంది. బంధం కోసం ప్రయత్నం.. బంధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎప్పుడూ ఒక  వైపు నుంచే జరగడం  అనేది కూడా భార్యాభర్తల మధ్య ఎమోషనల్ దూరం పెరుగుతోంది అనడానికి సంకేతం. మాట్లాడటం మొదలుపెట్టడం, కలిసి సమయం గడపడానికి ప్లాన్ చేయడం లేదా మనస్పర్ధలను సరిదిద్దడానికి ప్రయత్నించడం వంటి బాధ్యతలన్నీ  ఒక్కరి మీదే పడటం గమనించవచ్చు. భాగస్వామి తరపు నుంచి ఎలాంటి చొరవ లేకపోవడం వల్ల ఆ బంధం ఒకే వైపు నుంచి నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఒంటరితనం.. భాగస్వామి పక్కనే ఉన్నప్పటికీ తీవ్రమైన ఒంటరితనం అనుభవించడం. ఇద్దరూ ఒకే గదిలో ఉన్నా, ఒకరినొకరు పలకరించుకోకుండా ఎవరి ప్రపంచంలో వారు ఉండటం భావోద్వేగ శూన్యతను సూచిస్తుంది. మీ మనసులోని సంతోషాన్ని లేదా బాధను పంచుకునే ముందు అవతల వ్యక్తి వింటారో లేదో అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే, ఆ బంధంలో మార్పు అవసరమని అర్థం. పరిష్కారం ఎలా? ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కంటే ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. వారి ప్రవర్తన వల్ల మీకు కలుగుతున్న భావోద్వేగాలను నిరాశకు గురి కాకుండా, స్పష్టంగా వివరించాలి. అవతలి వ్యక్తి ఏవైనా ఇతర ఒత్తిళ్లలో ఉన్నారేమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇద్దరూ కలిసి కూర్చుని మనసు విప్పి మాట్లాడితే చాలా వరకు ఈ దూరాన్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ పరిస్థితి అలాగే కొనసాగితే, నిపుణుల సహాయం తీసుకోవడం,  కౌన్సెలింగ్ తీసుకోవడం  ద్వారా సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది.                                                                                                                                                  *రూపశ్రీ.
 భార్యాభర్తల మధ్య ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోందా..ఈ విషయాలు నిర్లక్ష్యం చేయకండి..! భార్యాభర్తల మధ్య బంధం కేవలం ఒకరికొకరు తోడుగా ఉండటం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య ఉండే భావోద్వేగాల అనుబంధం కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు దంపతులు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ, వారి మధ్య మానసిక దూరం పెరుగుతూ వస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో లేదా మనసులోని భావాలను పంచుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో భాగస్వామి మనల్ని పట్టించుకోవడం లేదనే భావన కలగడం సహజం. బంధంలో ఇలాంటి ఎమోషనల్ గ్యాప్ రావడం వల్ల ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.  ఈ విషయాన్ని ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. వివాహం తర్వాత పెరిగే దూరం.. పెళ్లయిన కొత్తలో ఉన్న ఆప్యాయత, సంభాషణలు కాలక్రమేణా మరుగున పడిపోవడం చాలా జంటల్లో కనిపిస్తుంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం, మానసిక ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల ఒకరికొకరు సమయం కేటాయించడం తగ్గిపోతుంది. అయితే, ఈ దూరం చిన్న చిన్న విషయాల నుంచి ప్రారంభమై పెద్ద సమస్యగా మారుతుంది. భాగస్వామి ప్రవర్తనలో వచ్చే మార్పులను సరిగ్గా గమనించకపోతే, అది మానసికంగా ఇద్దరినీ ఒంటరి చేసేస్తుంది. కాబట్టి సంబంధంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందో లేదో తెలుసుకోవడానికి కొన్ని కీలకమైన లక్షణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. రెస్పాండ్ కాకపోవడం.. మీరు చెప్పే విషయాలను లేదా మీ సమస్యలను భాగస్వామి గమనించకపోవడం లేదా వాటికి సరైన స్పందన ఇవ్వకపోవడం చాలా స్పష్టమైన సంకేతం. రోజులో జరిగిన విషయాలు లేదా  మనసులోని ఆందోళనలను పంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వారు ఫోన్ చూస్తూ ఉండటం లేదా మీ మాటలను మధ్యలోనే ఆపేయడం చేస్తుంటే అక్కడ ఎమోషనల్ బాండింగ్  సన్నగిల్లుతోందని అర్థం చేసుకోవాలి. కేవలం వినడం మాత్రమే కాకుండా, మీ మాటలకు విలువ ఇవ్వకపోవడం వల్ల  అభద్రతాభావం పెరుగుతుంది. నిర్లక్ష్యం.. మీ ఫీలింగ్స్  లేదా మీ ఆవేదనను తేలికగా తీసుకోవడం లేదా చిన్నచూపు చూడటం కూడా ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోందని చెప్పడానికి ఒక సంకేతం. మీకు ఏదైనా విషయంలో బాధ కలిగినప్పుడు, భాగస్వామి మిమ్మల్ని ఓదార్చాల్సింది పోయి మీరు అతిగా  ఆలోచిస్తున్నారని అనడం లేదా చిన్న విషయాలకే పెద్దవి చేస్తున్నారని అనడం సరికాదు. మీ ఫీలింగ్స్ కు  గౌరవం ఇవ్వకపోవడం వల్ల మీ మనసులోని మాటలను ఎవరితో పంచుకోవాలో తెలియని అయోమయం ఏర్పడుతుంది. ఇలాంటి ప్రవర్తన ఇద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ ను  మరింత పెంచుతుంది. షేర్ చేసుకోకపోవడం..   భాగస్వామి తమ వ్యక్తిగత విషయాలు లేదా మనసులోని ఆలోచనలను మీతో పంచుకోవడం మానేయడం కూడా ఇద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోంది అనడానికి సంకేతం. గతంలో ప్రతి చిన్న విషయాన్ని మీతో చెప్పే వారు, ఇప్పుడు తమ ప్లానింగ్స్, ఇబ్బందులు లేదా అనుభవాలను పూర్తిగా దాచడం ఒకవేళ అడిగినా కూడా   ఏదో ఒక సాకు  చెప్పి దాటవేయడం చేస్తుంటే అక్కడ దూరం పెరుగుతోందని గ్రహించాలి. ఎమోషన్స్ ను లేదా మనసులోని విషయాలను ఒకరికొకరు షేర్ చేసుకోలేని చోట బంధం కేవలం పేరుకే మిగులుతుంది. బంధం కోసం ప్రయత్నం.. బంధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎప్పుడూ ఒక  వైపు నుంచే జరగడం  అనేది కూడా భార్యాభర్తల మధ్య ఎమోషనల్ దూరం పెరుగుతోంది అనడానికి సంకేతం. మాట్లాడటం మొదలుపెట్టడం, కలిసి సమయం గడపడానికి ప్లాన్ చేయడం లేదా మనస్పర్ధలను సరిదిద్దడానికి ప్రయత్నించడం వంటి బాధ్యతలన్నీ  ఒక్కరి మీదే పడటం గమనించవచ్చు. భాగస్వామి తరపు నుంచి ఎలాంటి చొరవ లేకపోవడం వల్ల ఆ బంధం ఒకే వైపు నుంచి నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఒంటరితనం.. భాగస్వామి పక్కనే ఉన్నప్పటికీ తీవ్రమైన ఒంటరితనం అనుభవించడం. ఇద్దరూ ఒకే గదిలో ఉన్నా, ఒకరినొకరు పలకరించుకోకుండా ఎవరి ప్రపంచంలో వారు ఉండటం భావోద్వేగ శూన్యతను సూచిస్తుంది. మీ మనసులోని సంతోషాన్ని లేదా బాధను పంచుకునే ముందు అవతల వ్యక్తి వింటారో లేదో అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే, ఆ బంధంలో మార్పు అవసరమని అర్థం. పరిష్కారం ఎలా? ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కంటే ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. వారి ప్రవర్తన వల్ల మీకు కలుగుతున్న భావోద్వేగాలను నిరాశకు గురి కాకుండా, స్పష్టంగా వివరించాలి. అవతలి వ్యక్తి ఏవైనా ఇతర ఒత్తిళ్లలో ఉన్నారేమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇద్దరూ కలిసి కూర్చుని మనసు విప్పి మాట్లాడితే చాలా వరకు ఈ దూరాన్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ పరిస్థితి అలాగే కొనసాగితే, నిపుణుల సహాయం తీసుకోవడం,  కౌన్సెలింగ్ తీసుకోవడం  ద్వారా సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది.                                                                                                                                                  *రూపశ్రీ.
మన వంటింట్లో ప్రతిరోజూ ఉపయోగించే సాధారణ ఆహార పదార్థాలలో శనగలు ముందుంటాయి. వీటిని కేవలం గుడిలో ప్రసాదంగానో లేదా అప్పుడప్పుడు చేసుకునే ఉడికించిన గుగ్గిళ్లగానే చాలామంది భావిస్తారు. కానీ, శనగలు కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదని, ఇవి మాంసం కన్నా శక్తివంతమైన పోషకాలను అందించే అద్భుతమైన సూపర్‌ఫుడ్ అని ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు స్పష్టం చేస్తున్నారు. రోజూవారీ ఆహారంలో కనీసం ఒక కప్పు శనగలను చేర్చుకోవడం ద్వారా శరీమానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, మరియు ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా శాకాహారులకు, మాంసాహారం తినని వారికి ఇవి అత్యుత్తమ ప్రొటీన్ వనరుగా నిలుస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని అసాధారణ రీతిలో పెంచడంతో పాటు, చిన్నచిన్న అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఇవి దివ్యౌషధంలా కాపాడుతాయి. శనగల్లో పొటాషియం పాళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కేవలం ఒక కప్పు శనగల ద్వారా సుమారుగా 474 మిల్లీగ్రాముల పొటాషియం మన శరీరానికి అందుతుంది. ఈ పొటాషియం రక్తపోటును (బీపీ) అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిత్యం శనగలు తినడం వల్ల అధిక రక్తపోటు క్రమంగా తగ్గి, గుండె జబ్బులు మరియు హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా, శనగల్లో ఉండే సెలీనియం, మెగ్నీషియం, విటమిన్ బి, మరియు ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి తోడ్పడతాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో శనగలు ఎంతగానో సహాయపడతాయి. మన శరీరానికి ఒక రోజులో అవసరమయ్యే ప్రోటీన్‌లో మూడో వంతు కేవలం 28 గ్రాముల శనగల ద్వారానే లభిస్తుంది. ముఖ్యంగా పొట్టు తీసిన శనగల కంటే, పొట్టుతో కూడిన శనగలు మరింత ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే  రాఫినోస్  అనే సాల్యూబుల్ ఫైబర్ జీర్ణ ప్రక్రియను సులభతరం చేసి, జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన విష పదార్థాలను (టాక్సిన్లను) బయటకు పంపడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇది మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది. అయితే, వీటిని ఒకేసారి అతిగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం వంటి చిన్నపాటి అసౌకర్యం కలగవచ్చు కాబట్టి పరిమితంగా తీసుకోవడం మంచిది. మధుమేహం (డయాబెటిస్)తో బాధపడేవారికి శనగలు ఒక అద్భుతమైన వరం లాంటివి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే శనగలు తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు (షుగర్ లెవెల్స్) ఒక్కసారిగా పెరుగవు. పైగా వీటిలో ఉండే ఫైబర్ నెమ్మదిగా జీర్ణం కావడం వల్ల, షుగర్ స్థాయిలు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి. దీనివల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుందని క్లినికల్ అధ్యయనాలు నిరూపించాయి. శనగల్లో కేవలం ప్రొటీన్లు మాత్రమే కాకుండా ఐరన్, కాల్షియం, విటమిన్ సి, ఎ, ఇ, ఫోలేట్ మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఈ పోషకాల సమ్మేళనం ఎముకలను బలోపేతం చేసి, ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలను నివారిస్తుంది. అలాగే శరీరం ఐరన్‌ను మెరుగ్గా గ్రహించేలా చేసి రక్తహీనత (అనీమియా)ను తరిమికొడుతుంది. కాబట్టి రాత్రి సమయంలో నానబెట్టి, ఉదయాన్నే మొలకలుగా లేదా గుగ్గిళ్ల రూపంలో వీటిని తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.     chickpeas for weight loss heart,daily chickpeas benefits telugu.
షుగర్ వ్యాధి ఉన్నవారిలో కిడ్నీ సమస్యలు ఎందుకు వచ్చే అవకాశం ఉంది? రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే మూత్రపిండాల పనితీరుపై ఎలాంటి ప్రభావం పడుతుంది? కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలను తెలుసుకోవడం ప్రతి డయాబెటిస్ పేషెంట్‌కు ఎంతో ముఖ్యం. ఈ TeluguOne Health వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ షుగర్ వ్యాధి, కిడ్నీల ఆరోగ్యం, సంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగించే ఔషధ మొక్కల గురించి వివరిస్తారు. ముఖ్యంగా తెల్ల గలిజేరు అని పిలిచే పునర్నవ మొక్క, పల్లేరు గింజలు, పండ్ల సంప్రదాయ ఉపయోగాల గురించి తెలుసుకోవచ్చు. ఈ మూలికలను సంప్రదాయ వైద్యంలో ఎలా పరిగణిస్తారు, వాటిని ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరమో తెలుసుకోవచ్చు. డయాబెటిస్ వల్ల కిడ్నీలపై ఎలాంటి ప్రభావం పడవచ్చు? షుగర్ పేషెంట్లు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? పునర్నవ (తెల్ల గలిజేరు) మొక్కకు సంప్రదాయ వైద్యంలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి? పల్లేరు గింజలు, పండ్లను సంప్రదాయ వైద్య విధానాల్లో ఎలా ఉపయోగిస్తారు? మూలికలతో తయారుచేసే ఔషధాలను వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించడానికి వైద్య పరీక్షలు ఎందుకు ముఖ్యం? వంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం, వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడటం, అవసరమైన కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీ సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అందువల్ల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ వ్యాధి ఉన్నవారు తమ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పునర్నవ మరియు పల్లేరు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ వివరణతో కూడిన ఈ TeluguOne Health వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మూలికలు కిడ్నీ వ్యాధులను నయం చేస్తాయని నిర్ధారిత ఆధారాలు లేవు. వైద్యుల సూచన లేకుండా షుగర్ మందులను ఆపకండి లేదా మూలికలను వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించకండి.
ఆరోగ్యంగా ఉండాలని చాలామంది విటమిన్ సప్లిమెంట్లు, ఇతర మందులు వాడుతుంటారు. అయితే ఏ మందును ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎన్ని రోజులు వాడాలి? ఇతర మందులతో కలిపి తీసుకోవచ్చా? అనే విషయాలు తెలుసుకోకుండా మందులు వాడితే అనవసరమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా Vitamin D, Vitamin B12 వంటి సప్లిమెంట్లను వైద్యుల సూచనల మేరకు తీసుకోవడం ఎంతో ముఖ్యం. మందులు వాడేటప్పుడు చేసే చిన్న పొరపాట్లు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. వైద్యులకు తమ ఆరోగ్య సమస్యలను పూర్తిగా చెప్పకపోవడం, వాడుతున్న మందుల వివరాలను తెలియజేయకపోవడం, సొంతంగా మందుల మోతాదును మార్చుకోవడం వంటి అలవాట్లు చికిత్సకు ఆటంకం కలిగించవచ్చు. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం (World Patient Safety Day) సందర్భంగా, రోగుల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను హోమియోపతి వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ వీడియోలో వివరించారు. Vitamin D, B12 సప్లిమెంట్లు వాడేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? Vitamin D శరీరంలో కాల్షియం శోషణకు, ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది. Vitamin B12 నరాల పనితీరుకు, ఎర్ర రక్తకణాల తయారీకి అవసరం. ఈ విటమిన్ల లోపం ఉన్నప్పుడు వైద్యులు తగిన పరీక్షలు చేసి, అవసరాన్ని బట్టి సప్లిమెంట్లను సూచించవచ్చు. అయితే ఈ మందులను ఎక్కువ మోతాదులో తీసుకుంటే త్వరగా ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించడం సరైంది కాదు. ముఖ్యంగా Vitamin D అధిక మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో కాల్షియం స్థాయులు పెరిగి ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందువల్ల వైద్యుల సలహా లేకుండా మోతాదును పెంచడం లేదా ఎక్కువకాలం కొనసాగించడం చేయకూడదు. వైద్యులకు మీ ఆరోగ్య సమస్యలను ఎందుకు పూర్తిగా చెప్పాలి? కొంతమంది తమకు ఉన్న లక్షణాలను, గతంలో ఎదురైన ఆరోగ్య సమస్యలను లేదా ప్రస్తుతం వాడుతున్న మందులను వైద్యులకు పూర్తిగా తెలియజేయరు. మరికొందరు ఇతరుల సలహాతో మందులు వాడుతుంటారు. ఇలాంటి వివరాలు దాచడం వల్ల సరైన చికిత్స నిర్ణయించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ఉన్న లక్షణాలు, అలర్జీలు, ఇప్పటికే వాడుతున్న మందులు, విటమిన్ సప్లిమెంట్లు, గతంలో తీసుకున్న చికిత్సల గురించి వైద్యులకు స్పష్టంగా చెప్పాలి. ఈ సమాచారం సరైన చికిత్స అందించడానికి, మందుల మధ్య అవాంఛిత ప్రతిచర్యల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మందుల మోతాదులో చేసే పొరపాట్లు ఎంత ప్రమాదకరం? వైద్యులు సూచించిన మోతాదు కంటే ఎక్కువగా లేదా తక్కువగా మందులు తీసుకోవడం, సమయానికి తీసుకోకపోవడం, ఒకరి మందులను మరొకరు వాడటం వంటి పొరపాట్లను నివారించాలి. మందుల పేర్లు, మోతాదు, తీసుకోవాల్సిన సమయం, వాడే కాలం గురించి స్పష్టత లేకపోతే వైద్యుడిని లేదా ఫార్మసిస్ట్‌ను అడిగి తెలుసుకోవాలి. మందుల వల్ల ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సలహా లేకుండా సూచించిన చికిత్సను నిలిపివేయడం లేదా మోతాదును మార్చడం కూడా సరికాదు. రోగుల భద్రతలో మన బాధ్యత ఏమిటి? రోగుల భద్రత అనేది వైద్యుల బాధ్యత మాత్రమే కాదు. రోగులు కూడా తమ ఆరోగ్యం గురించి అవగాహన కలిగి ఉండాలి. మందుల వివరాలను సరిచూసుకోవడం, వైద్యులు సూచించిన విధంగా వాడటం, సందేహాలు ఉంటే అడగడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం వంటి అలవాట్లు చికిత్సను మరింత సురక్షితంగా మార్చడంలో సహాయపడతాయి. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ అందించే ఈ వీడియోలో Vitamin D, Vitamin B12 మందుల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యులకు ఆరోగ్య వివరాలను చెప్పడం ఎందుకు అవసరం, మందుల మోతాదులో పొరపాట్లను ఎలా నివారించాలి, సురక్షితమైన చికిత్స కోసం రోగులు పాటించాల్సిన పద్ధతులు వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా మందులు, విటమిన్ సప్లిమెంట్లు వాడేందుకు వైద్యులను సంప్రదించండి. వైద్యుల సూచన లేకుండా మందుల మోతాదును మార్చవద్దు.