ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల పోరులో భాగంగా కృష్ణా జిల్లాలోని పెడన మున్సిపాలిటీలో జనసేన పార్టీ తన తొలి విజయాన్ని నమోదు చేసుకుని ఘనమైన బోణీ కొట్టింది. పెడన మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానానికి జరిగిన హోరాహారీ పోరులో జనసేన అభ్యర్థి జ్యోత్స్నరాణి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తన సమీప ప్రత్యర్థి అయిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై ఏకంగా 4,380 ఓట్ల భారీ మెజారిటీతో ఆమె విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తం 28 వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 19, జనసేన 6 వైసీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో మిత్రపక్షాల మధ్య సమన్వయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే పొత్తులో భాగంగా పెడన మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాన్ని జనసేనకు కేటాయించగా, ఆ పార్టీ అభ్యర్థి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన నాటి నుంచి పెడనలో జనసేన అభ్యర్థికి ఓటర్ల నుంచి మద్దతు లభించింది. రౌండ్లవారీగా ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయిన జ్యోత్స్నరాణి, చివరకు భారీ ఓట్ల తేడాతో విజయం ఖాయం చేసుకున్నారు. దీంతో స్థానిక కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ఈ విజయంతో పెడన పట్టణంలో జనసేన పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వెలువడుతున్న ఇతర ఫలితాల్లోనూ కూటమి అభ్యర్థులు దూసుకుపోతుండటం పార్టీ కేడర్‌లో జోష్ నింపుతోంది. మరోవైపు, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో మాత్రం ఈ ఫలితాలతో నిరాశాజనక వాతావరణం నెలకొంది. కొన్ని కీలక స్థానాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో స్థానిక నాయకులు ఆత్మపరిశీలనలో పడ్డారు. ప్రజల నాడిని అంచనా వేయడంలో విఫలమయ్యామనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. ఈ విజయాలు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వ విధానాలకు స్థానిక ప్రజల నుంచి వస్తున్న మద్దతుకు ఈ ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. పెడన మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకున్న జనసేన పార్టీ, రాబోయే కాలంలో స్థానిక సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుతో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి, పట్టణాభివృద్ధికి పునాది వేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. [ Janasena, Pedana Municipal Elections, Jyotsna Rani, AP Municipal Results, TDP BJP Janasena Alliance, Janasena Party, Deputy CM Pawan Kalyan, Telugu One, Telugu News ]
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో  విజయవాడ మేయర్ స్థానానికి సంబంధించిన ఫలితాలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి అధికారిక  తెలుగుదేశం కూటమి అభ్యర్థి  అభ్యర్థి, జనసేన నాయకుడు వంగవీటి రాధాకృష్ణ స్పష్గమైన ఆధిక్యిన్ని ప్రదర్శిస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతులో మేయర్ అభ్యర్థిగా నిలిచిన స్వతంత్ర అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ వైసీపీ మూడో స్థానానికి పరిమితమైంది. ఇక పోతే వంగవీటి రాధాకృష్ణ బెజవాడ నగరంలో తనకున్న విస్తృతమైన ప్రజాదరణకు తోడు కూటమి శ్రేణుల బలం తోడవడంతో ఆరంభం నుంచీ గెలుపు బాటలో దూసుకుపోతున్నారు. ఒక్కో రౌండుకూ వంగవీటి రాధా ఆధిక్యం పెరుగుతూ వస్తున్నది. అలాగే విజయవాడ నగరంలోనిమెజారిటీ డివిజన్లలో తెలుగుదేశం కూటమికి ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు.   ఇక విజయవాడ మేయర్ బరిలో నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి, స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు   రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మేధావులు, వామపక్షాల మద్దతుతో పాటు నగరంలోని విద్యావంతులైన ఓటర్ల మద్దతును పొందడంలో ఆయన సక్సెస్ అయ్యారని అవగతమౌతుంది. ఈ ప్రతిష్ఠాత్మక స్థానంలో వైసీపీ   అభ్యర్థి, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మూడో స్థానానికి పరిమితమౌతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని భావించినప్పటికీ, నగర ఓటర్లు కూటమి అభ్యర్థికే జైకొడుతున్నారని కౌంటింగ్ లో వెల్లడౌతున్న ఫలితాన్ని బట్టి స్పష్టమౌతోంది.   ఎన్నికల ప్రచారంలో వంగవీటి రాధాకృష్ణ,  ఏబీ వెంకటేశ్వరరావు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు పోకుండా హుందాతనంతో వ్యవహరించడం విశేషం. నగరాభివృద్ధికి సంబంధించి మేధావుల, అనుభవజ్ఞుల సలహాలను స్వీకరిస్తానని రాధా ప్రకటించగా, ఇది కేవలం సిద్ధాంతాల పోరాటమని ఏబీవీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఈ ఎన్నికల పోరులో బెజవాడ ప్రజల మొగ్గు తెలుగుదేశం కూటమి వైపే ఉన్నట్లు ఓటింగ్ ను బట్టి స్పష్టంగా అవగతమౌతోంది.  తుది రౌండ్ల లెక్కింపు కూడా త్వరలోనే పూర్తయిన అనంతరం  విజయవాడ కొత్త మేయర్ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.   [Vijayawada Mayor Election Results, Vangaveeti Radha Leading, AB Venkateswara Rao, Second Place, Vijayawada Corporation Counting, AP Local Body Polls, Telugu One] 
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీల ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది. అధికార తెలుగుదేశం కూటమి  ప్రారంభం నుంచే స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ పలు స్థానాలను కైవసం చేసుకుంటున్నది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వెలువడుతున్న ఫలితాలు అధికార కూటమికి హవాకు అద్దం పడుతున్నాయి. పుర పోరులో భాగంగా  పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన సిబ్బంది, ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. ఇక్కడ మెజారిటీ వార్డులను కైవసం చేసుకోవడంతో పాటు, ఎర్రగుంట్ల నగర పంచాయతీలోనూ కూటమి అభ్యర్థులు   విజయం సాధించారు. ఇక ఉమ్మడి  ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ తెలుగుదేశం కూటమి అభ్యర్థులు తమ ప్రాబల్యాన్ని చాటుతున్నారు. పెద్దాపురం లాంటి ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించగా, మిగిలిన అర్బన్ లోకల్ బాడీస్‌లోనూ కూటమి పార్టీల మధ్య సమన్వయం సత్ఫలితాలను ఇస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించిన కూటమి నాయకత్వం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడమే ఈ విజయాలకు ప్రధాన కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మరోవైపు, కొన్ని తీర ప్రాంతాల్లో మాత్రం ప్రతికూల వాతావరణం, భారీ వర్షాల ప్రభావం కౌంటింగ్ ప్రక్రియపై పడింది. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో తుఫాను ప్రభావం కారణంగా ఓట్ల లెక్కింపులో  స్వల్ప ఆలస్యం చోటుచేసుకుంది. అయినప్పటికీ అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గట్టి భద్రతా ఏర్పాట్లతో కౌంటింగ్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. పోలీసుల పటిష్ట నిఘా నడుమ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా తుది ఫలితాలు పూర్తిగా వెలువడే కొద్దీ ఏయే పురపాలక సంఘాలు ఏ పార్టీ  ఖాతాలో  చేరనున్నాయనే అంశంపై స్పష్టత రానుంది.   [AP Municipal Election Results, Vote Counting, TDP Jana Sena BJP Alliance, AP Local Body Elections, Telugu One] 
ALSO ON TELUGUONE N E W S
చిన్న చిత్రంగా విడుదలై సెల్యులాయిడ్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'మయూఖ'.ఈ మూవీ తాజాగా అద్భుతమైన మైలురాయిని అందుకుంది. ఎటువంటి భారీ అంచనాలు లేకుండా, కేవలం విభిన్నమైన కంటెంట్ మరియు బలమైన కథనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా 25 రోజులను పూర్తి చేసుకుంది. నేటి పోటీ ప్రపంచంలో, చిన్న సినిమాలు థియేటర్లలో కనీసం ఒక వారం పాటు నిలదొక్కుకోవడమే గగనమైపోతున్న తరుణంలో, 'మయూఖ' సినిమా ఏకంగా 25 రోజుల థియేట్రికల్ రన్‌ను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఘనంగా 25 డేస్ సక్సెస్ మీట్ నిర్వహించి, తమ ఆనందాన్ని పంచుకున్నారు. దర్శకుడు శ్రీ తేజ్ ఎస్.కె. తెరకెక్కించిన ఈ చిత్రంలో పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించగా, అమన్ మసూద్, దేవ్ డి, అభిలాష్, మురళీధర్ గౌడ్ వంటి నటీనటులు తమ అద్భుతమైన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఎప్పుడూ లేనివిధంగా 'ఫ్రాంగింగ్' అనే సరికొత్త కాన్సెప్ట్ మరియు సైకో కిల్లర్ నేపధ్యం ఆధారంగా ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను రూపొందించడం విశేషం. దివ్య అనే యువతి హత్యతో ప్రారంభమయ్యే ఈ కథ, మయూఖ అపార్ట్‌మెంట్‌లో జరిగే అనూహ్య పరిణామాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టింది. ఇది కూడా చదవండి: కులాల్ని, మతాలని ఆమడ దూరం విసిరేసిన సినిమా: ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోవాలి!     సినిమా సక్సెస్ మీట్ వేడుకల్లో నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు మాట్లాడుతూ.. మొదట్లో చిన్న సినిమా కావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని, కానీ మంచి కంటెంట్‌ను ఆదరించే ప్రేక్షకులు సినిమాను బిగ్గెస్ట్ హిట్ చేశారని భావోద్వేగంతో తెలిపారు. సీబీ మాథ్యూ అలెక్స్ అందించిన టెన్షన్ క్రియేట్ చేసే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. నిర్మాత శశిధర్ నల్ల ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేసిన రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి, వైవిధ్యమైన థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు 'మయూఖ' ఒక అద్భుతమైన అనుభూతిని పంచుతూ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది.అక్టోబర్ 9  సెల్యులాయిడ్ రిలీజ్ డేట్.     [Mayookha Movie 25 Days Success, Mayookha movie, Payal Chengappa, Mayookha 25 days success, Shree Tej SK, Tollywood thriller, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]    
What happens when financial struggles push a group of youngsters towards a life-changing gamble? The teaser of Pocket Rockkets introduces an intriguing premise revolving around ambition, temptation and unexpected consequences. Presented by Niharika Konidela's Pink Elephant Pictures in association with Maximum City Studios, the film is written and directed by Rudra Atri. The teaser captures the struggles and aspirations of a young group before taking them into the unpredictable world of casinos. Roulette tables, gambling machines and humorous exchanges establish an entertaining yet suspenseful atmosphere. The central idea revolves around an opportunity that could change their fortunes, but the risks involved make their journey equally unpredictable. Featuring Trinadh Varma, Nirmal and Shriya Kontham, the film also has JD Chakravarthy in a pivotal role. Produced by Padmaja Konidela, Rahul Raghavendra and Rahul Nimmakuri, with Ramesh Manyam as executive producer, the technical team includes cinematographer Edurolu Raju, music composer Gyaani and editor Anwar Ali. With its youthful ensemble, interesting premise and blend of humour and suspense, Pocket Rockkets promises an entertaining ride. The film arrives in cinemas on December 11, 2026. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.  ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ‘జైలర్ 2’ సినిమా థియేటర్లలో ఇంకా స్ట్రాంగ్‌గానే రన్ అవుతున్నప్పటికీ.. ఓటీటీ డీల్ కారణంగా త్వరగానే డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో.. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్ చేసేలా డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నవంబర్ 12 లేదా 13 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. రజినీకాంత్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి థియేటర్లలో సంచలనం సృష్టించిన ‘జైలర్ 2’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. నవంబర్ 12 లేదా 13న స్ట్రీమింగ్ మొదలైతే మాత్రం డిజిటల్ ప్రేక్షకులకు పండగే.  ఇది కూడా చదవండి: బాలయ్య vs మంచు మనోజ్.. ‘దాదా’లో రక్తపాతం లేని వార్.!       [Jailer 2 OTT Release Date, Jailer 2 Movie OTT, Jailer 2 Amazon Prime Video, Jailer 2 OTT Telugu, Rajinikanth, Nelson Dilipkumar, Anirudh Ravichander, Telugu Film News]  
Superstar Rajinikanth has once again rewritten Tamil cinema's box-office history. Jailer 2, directed by Nelson Dilipkumar, has emerged as the new Industry Hit, surpassing the existing records and becoming the highest-grossing Tamil film of all time. The sequel has crossed the Rs.800 crore worldwide gross mark in just 19 days, setting an unprecedented benchmark for Kollywood. Renowned producer and trade analyst G Dhananjheyan took to social media to celebrate the achievement, stating, "Every box office record has been broken and we should all celebrate the Team #Jailer2 for giving us the New Industry Hit." He further expressed confidence that the film would cross Rs.900 crore worldwide, appreciating the team for delivering such a remarkable achievement for Tamil cinema. According to trade estimates, Jailer 2 has collected approximately Rs.812 crore worldwide by the end of its 19th day, with its India gross standing at Rs.537.75 crore and overseas collections contributing Rs.274.25 crore. The film has also surpassed Rajinikanth's own 2.0 to claim the all-time Tamil cinema box-office record. It has emerged as the second-highest-grossing Indian film of 2026, behind Dhurandhar: The Revenge. Featuring an ensemble cast including Mohanlal, Shivarajkumar, SJ Suryah, Vidya Balan, Mithun Chakraborty, Jackie Shroff, Ramya Krishnan and Yogi Babu, the film is produced by Kalanithi Maran under Sun Pictures. Anirudh Ravichander composed the music.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  సినిమా.. ఏ కార్యాన్ని విశ్వానికి, తన టీం మేట్స్ కి అందించడానికి వచ్చిందో గాని అనాదిగా సినిమా చేస్తున్న మంచి అంతా ఇంతా కాదు. అందుకే సినిమా లవర్స్ సినిమా అనేది ముమ్మాటికీ గాడ్ గిఫ్ట్ అంటారు. అది నిజం కూడా కావచ్చేమో. ఎందుకంటే సినిమా దేశానికి, మనుషులకి చేస్తున్న మంచి అంతా కాదు. అంతకు మించి కూడా.  మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సినిమా అనేది కేవలం రెండున్నర గంటల వినోదం మాత్రమే కాదు. అది కోట్లాది మంది ప్రజల హృదయాలని ఒకే వేదికపైకి తీసుకువచ్చే భావోద్వేగ బంధం. ఒకప్పుడు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట తీవ్రమైన వ్యత్యాసాలు, సామాజిక దూరాలు స్పష్టంగా కనిపించేవి. కానీ వెండితెరపై నటులు చూపించే అద్భుతమైన నటన, వారు పోషించే మహోన్నత పాత్రలు సమాజ ఆలోచనా ధోరణిలోనే విప్లవాత్మకమైన మార్పుని  తీసుకువచ్చాయి. దీంతో దశాబ్దాలుగా ఉన్న కులమతాల సరిహద్దులను కరిగించి వేయడంలో చలనచిత్ర పరిశ్రమ వందకు వంద శాతం సఫలీకృతమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నేడు థియేటర్లలో ఏ హీరో సినిమా విడుదలైనా, అక్కడ అభిమానులు చూపించే ప్రేమాభిమానాలకు కులంతో కానీ మతంతో కానీ ఎలాంటి సంబంధం ఉండదు. వివిధ కులాలు, భిన్న మతాలకు చెందిన ప్రజలు తమ అభిమాన హీరోలను ఎంతో పవిత్రంగా, తమ స్వంత కుటుంబ సభ్యులుగా మరియు ఆరాధ్య దైవాలుగా కొలుస్తున్నారు. గణాంకాల ప్రకారం, మన దగ్గర దాదాపు 95 శాతానికి పైగా ఉన్న ఫ్యాన్స్ క్లబ్‌లలో సభ్యులు తమ సొంత కులాన్ని లేదా మతాన్ని పక్కనపెట్టి, కేవలం నటుడి ప్రతిభ మరియు వ్యక్తిత్వాన్ని బట్టే ఒకే వేదికపైకి వచ్చి కలిసికట్టుగా పండగలు చేసుకుంటున్నారు. ఒకే బెనిఫిట్ షో కోసం, ఒకే కటౌట్‌కు పాలభిషేకం చేయడానికి లేదా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడానికి వేలాది మంది అభిమానులు తమ సామాజిక గుర్తింపులను మరచిపోయి చేతులు కలుపుతున్నారు. ఈ సాంస్కృతిక విప్లవంలో ముఖ్యంగా యువత పాత్ర ఎంతో ప్రశంసనీయం. నేటి తరంలో దాదాపు 90 శాతం మంది అభిమానులు తమ అభిమాన కథానాయకుడు చేసే సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రేరణ పొందుతున్నారు. రక్తాక్షయాలు, ఉచిత వైద్య శిబిరాలు, వరద బాధితులకు విరాళాలు మరియు పేద విద్యార్థులకు చదువు చెప్పించడం వంటి సత్కార్యాలలో వివిధ మతాలకు చెందిన యువకులు భుజం భుజం కలిపి పనిచేస్తున్నారు. పండుగల సమయంలో ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లడం, పాయసం మరియు ఈద్ స్వీట్లు పంచుకోవడం కంటే ఎక్కువగా, సినిమా థియేటర్ వద్ద ఒకే హీరో సినిమా చూస్తూ అందరూ కలిసి కేరింతలు కొట్టడం సమాజంలో గొప్ప సహోదరభావాన్ని నింపుతోంది.  ఇది కూడా చదవండి: 100 కోట్ల క్లబ్ లో ఆదర్శ కుటుంబం: పూర్తి వివరాలు ఇవే!     మరోవైపు మతపరమైన సామరస్యానికి కూడా సినిమా రంగం ఊపిరి పోసింది. భక్తి రస చిత్రాలు మరియు పౌరాణిక సినిమాలు విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద సాధించే 400 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు కేవలం ఒకే వర్గం ప్రజల వల్ల సాధ్యం కావడం లేదు. అన్ని మతాల ప్రజలు థియేటర్లకు వచ్చి ఆ కథలలోని నైతిక విలువలను, మానవత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగే విభిన్న నేపథ్యాలు ఉన్న నటులను, దర్శకులను ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. ఒకప్పుడు విడదీసిన కులాల గోడలను నేడు వెండితెరపై వచ్చే దృశ్యాలు, పాటలు మరియు నటుల స్ఫూర్తివంతమైన మాటలు పూర్తిగా కూల్చివేశాయి. సినిమా సృష్టించిన ఈ ఐక్యత వల్ల సమాజంలో కులపిచ్చి, మతాంధత తగ్గిపోయి, కేవలం 'మానవత్వమే' పెద్ద మతంగా మారుతోంది. అభిమానం అనేది కులానికి, మతానికి అతీతమైనదని, అది ఒక స్వచ్ఛమైన భావోద్వేగమని నేటి సినిమాలు, ప్రేక్షకులు నిరూపిస్తున్నారు. అందుకే సినీ ప్రేమికులు, మేకర్స్, హీరోలు, హీరోయిన్లు, ఆల్ టెక్నీషయన్స్  సినీ కళామ తల్లి ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోవాలని తమ రోజు వారి దినచర్యలో ఒక్కసారైనా తలుచుకుంటూనే ఉంటారు.     [Telugu Cinema Social Unity, telugu cinema unity, societal impact of tollywood, star worship in south india, fan clubs social service, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]  
నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే భారీ ఫైట్లు, పవర్‌ఫుల్ డైలాగులు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా ఆయన మాస్ యాక్షన్ సన్నివేశాలకు థియేటర్లలో వచ్చే రెస్పాన్స్ వేరే లెవల్‌లో ఉంటుంది. అయితే ఈసారి బాలయ్య తన రెగ్యులర్ ఫార్ములాకు భిన్నంగా ఓ సరికొత్త ప్రయోగం చేయబోతున్నారా? ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘దాదా’ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మంచు మనోజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. బాలకృష్ణ, మనోజ్ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. సాధారణంగా ఇద్దరు బలమైన ప్రత్యర్థులు తలపడితే భారీ ఫైట్లు, రక్తపాతం ఉంటాయని భావిస్తాం. కానీ ‘దాదా’లో మాత్రం అలాంటివేమీ లేకుండా కేవలం మాటలతోనే ఇద్దరి మధ్య యుద్ధం నడుస్తుందని టాక్. బాలయ్య తనదైన గంభీరమైన గొంతుతో పవర్‌ఫుల్ డైలాగులు చెబితే.. మంచు మనోజ్ కూడా అంతే ధీటుగా కౌంటర్లు ఇస్తాడని అంటున్నారు. ఇద్దరి మధ్య సాగే ఈ సంభాషణలు ప్రేక్షకుల్లో హై వోల్టేజ్ టెన్షన్ క్రియేట్ చేసేలా దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా మాటలతోనే ప్రత్యర్థిని దెబ్బతీసే ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. 'వీరసింహారెడ్డి' తర్వాత బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో 'దాదా'పై భారీ అంచనాలు ఉన్నాయి. 1980ల నాటి ముంబై నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ ఇందులో రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కూడా చదవండి: పాకెట్ రాకెట్స్ టీజర్.. గ్యాంబ్లింగ్ స్టోరీతో నిహారిక మరో కొత్త ప్రయత్నం.!       [Balakrishna Manchu Manoj Face Off, Dada Movie Update, Dada Movie, Nandamuri Balakrishna, Manchu Manoj, Gopichand Malineni, Kajal Aggarwal, Telugu Film News]
Tamil Nadu Chief Minister C Joseph Vijay has announced a major relaxation in cinema screening regulations, allowing theatres across the state to screen up to six shows daily for newly released Tamil films. The new permission allows screenings between 6 AM and 2:30 AM the following day for the first seven days of a film's release. The relaxation also extends to local festival days, public holidays, Saturdays and Sundays, with six shows permitted on these occasions. The decision follows representations from the Tamil Film Active Producers Association, Tamil Film Producers Council and Tamil Nadu Theatre and Multiplex Owners Association. The industry bodies had sought extended screening hours and more shows to improve theatrical revenue and provide sufficient slots for multiple releases. The government has now agreed to increase the existing five-show limit to six shows. Under the Tamil Nadu Cinemas (Regulation) Rules, 1957, theatres were originally restricted to four shows daily. An additional fifth show was permitted on public holidays and local festival days with approval from the concerned authorities. In May this year, the Vijay government relaxed the regulations, allowing five shows for the first seven days of new Tamil releases, as well as on weekends and holidays, without requiring separate permissions. The latest decision takes that relaxation further and brings back early morning screenings, which were discontinued in 2023 following safety concerns during the release celebrations of Ajith's Thunivu. The move is expected to benefit big-ticket releases and theatre owners by creating additional screening opportunities during the crucial opening week. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్,శ్రీనిధిశెట్టి ల ఆదర్శ కుటుంబం పాజిటివ్ టాక్ తో రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఎలక్షన్స్ హడావుడి, తుఫాన్ ప్రభావం లేకపోతే తెలుగు సినీ మార్కెట్ దగ్గర 'ఆదర్శ కుటుంబం'తో ఒక రేంజ్ లో సందడి వాతావరణం నెలకొని ఉండేదని సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.  ఏది ఏమైనా విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల గ్రాస్ కలెక్షన్లని సాధించి టాలీవుడ్ వర్గాలని ఆశ్చర్యపరిచింది. అయితే సోమవారం కలెక్షన్లు భారీగా పడిపోయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆదివారం సెలవులు ముగియడం.. సోమవారం వర్కింగ్ డే కావడంతో మూవీ చూసే వాళ్లు తగ్గిపోయారు. ఇది కూడా చదవండి:చరణ్, సుకుమార్ మూవీపై రాజమౌళి కామెంట్స్ వైరల్: ఓపెనింగ్ సీన్ రివీల్!   అయితే  వీకెండ్ తో పాటు దీపావళి మూడ్  నేపధ్యం దృష్ట్యా రాబోయే రోజుల్లో వసూల్లు పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో  వంద కోట్ల క్లబ్ లోకి చేరుతుందా లేదా అనే ఆసక్తి అభిమానులు, మూవీ లవర్స్ లో ఉంది.      [Aadarsha Kutumbam Collections, 100 crors club in Aadarsha Kutumbam, Aadarsha Kutumbam, AK 47 movie box office, Venkatesh Trivikram film, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి , అనేక రకాల చిన్న చిన్న కారణాల వల్ల చాలా మంది క్షణాల వ్యవధిలోనే తీవ్రమైన కోపం తెచ్చుకుంటూ ఉంటారు. కొందరికైతే చిన్న చిన్న విషయాలు కూడా విపరీతమైన అసహనాన్ని, కోపాన్ని తెప్పిస్తుంటాయి. ఇలా తరచూ కోపపడటం వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతినడమే కాకుండా, శారీరక ఆరోగ్యం కూడా తీవ్రంగా క్షీణిస్తుంది. రక్తపోటు పెరగడం, గుండె జబ్బులు రావడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే, కొంచెం శ్రద్ధ, సరైన మానసిక వ్యాయామాలతో కోపాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు. కోపాన్ని జయించి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. లోతుగా శ్వాస తీసుకోవడం.. కోపం తీవ్రంగా వచ్చిన సమయంలో  దాన్ని నియంత్రించుకోవడానికి చాలా ప్రభావవంతమైన మార్గం దీర్ఘ శ్వాస తీసుకోవడం. కోపం తారస్థాయికి చేరినప్పుడు ఊపిరి వేగం పెరుగుతుంది. ఆ సమయంలో కొద్దిసేపు కళ్ళు మూసుకుని గాలిని గట్టిగా లోతుగా లోపలికి పీల్చుకుని, మెల్లగా వదలాలి. ఇలా కొన్నిసార్లు చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సాధారణ స్థితికి వస్తుంది, మనసు కుదుటపడుతుంది. ఆలోచించే శక్తి మెరుగుపడుతుంది. ప్రదేశం నుండి పక్కకు వెళ్లడం.. మనం ఉన్న ప్రదేశం లేదా పరిస్థితిని కొద్దిసేపు మార్చడం ద్వారా కూడా కోపాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు. చిన్న విషయానికే కోపం వచ్చినప్పుడు ఆ క్షణంలో అక్కడ నుంచి పక్కకు వెళ్లడం మంచిది. కొద్దిసేపు నడవడానికి వెళ్లడం లేదా మనసుకు నచ్చిన ప్రశాంతమైన సంగీతం వినడం చేయాలి. వాతావరణం మారినప్పుడు మెదడులోని ఉద్రిక్తత తగ్గి, ఆలోచనల తీరు మారుతుంది. మౌనం.. కోపం వచ్చిన సమయంలో మాట్లాడే మాటలు చాలాసార్లు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే కోపం ముంచుకొస్తున్నప్పుడు మౌనంగా ఉండటం చాలా మంచిది. మాట్లాడటానికి ముందు పది వరకు నెంబర్స్ ను  మనసులో లెక్కపెట్టుకోవాలి. ఈ చిన్న సమయంలో  మన ఆలోచనలు అదుపులోకి వస్తాయి. అనర్థాలు జరగకుండా ఆపవచ్చు. వ్యాయామం.. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మిగిలిపోయిన ఉద్రిక్తత, ఒత్తిడి తగ్గిపోతాయి. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇవి మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచడానికి, ఎమోషన్స్ ను నియంత్రించుకోడానికి ఎంతగానో సహాయపడతాయి. జీవితంలో చిన్న చిన్న విషయాలకు కోపపడటం వల్ల మన సంతోషాన్ని మనమే దూరం చేసుకున్నట్టవుతుంది. కోపం అనేది మనల్ని మనం శిక్షించుకోవడంతో సమానం. కాబట్టి ప్రతి విషయాన్ని పాజిటివ్  దృక్పథంతో చూడటం నేర్చుకోవాలి. చిన్న సమస్యలను పెద్దవిగా చేసుకోకుండా, ఓర్పుతో ఆలోచించడం అలవాటు చేసుకుంటే కోపాన్ని సులభంగా జయించవచ్చు. ప్రశాంతమైన, సంతోషకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.                                                                                                                               *రూపశ్రీ.
సాయంత్రం వేళ వేడి వేడి టీ తాగుతూ ఏదైనా కరకరలాడే స్నాక్ తినాలనిపించడం చాలా సహజం. అందులోనూ మన ఇంట్లోనే శుభ్రంగా తయారు చేసుకున్న పిండి వంటల రుచే వేరు. అటువంటి అద్భుతమైన టీ టైమ్ స్నాక్స్‌లో మురుకులకు ఉండే ప్రత్యేకతే వేరు. ఏళ్ల తరబడి మన సంప్రదాయంలో భాగమైన ఈ కమ్మని మురుకులను మరింత సులభంగా, ఎక్కడా నూనె పీల్చకుండా గుల్లగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మురుకులు అనగానే పప్పులు నానబెట్టి, పిండి పట్టించుకోవాలనే పెద్ద ప్రాసెస్ గుర్తుకు వస్తుంది. కానీ ఎలాంటి కష్టం లేకుండా కేవలం పొడి బియ్యప్పిండితో అκαశ్శంగా ఈ అరిసెలను తలపించే రుచితో మురుకులను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సులభమైన రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి, అందులోకి సరిగ్గా 2 కప్పుల పొడి బియ్యప్పిండిని తీసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, పిండి రంగు మారకుండా 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఇలా చేయడం వల్ల మురుకులకు అద్భుతమైన సువాసన, రుచి వస్తాయి. పిండి వేడెక్కగానే దానిని ఒక వెడల్పాటి బౌల్‌లోకి మార్చుకోవాలి. అదే సమయంలో, ఒక మిక్సీ జార్‌లోకి ముప్పావు కప్పు పుట్నాలను తీసుకుని మెత్తగా పౌడర్ లా గ్రైండ్ చేయాలి. ఈ పుట్నాల పిండిని ఉండలు లేకుండా జల్లెడ పట్టి, ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యప్పిండిలో కలపాలి. జల్లెడ పట్టిన తర్వాత మిగిలిన రవ్వ వంటి పదార్థాన్ని పక్కకు తీసివేయాలి. ఇప్పుడు అదే పాన్‌లో సరిగ్గా 2 కప్పుల నీళ్లను తీసుకుని బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ఆ వేడి నీళ్లను కొద్దికొద్దిగా పిండి మిశ్రమంలో పోస్తూ ఒక చెంచాతో బాగా కలపాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, 2 కప్పుల బియ్యప్పిండికి సరిగ్గా 2 కప్పుల నీళ్లు సరిగ్గా సరిపోతాయి. నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి వెంటనే చేత్తో కలపకుండా, మూత పెట్టి సరిగ్గా 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. పిండి కొద్దిగా చల్లారిన తర్వాత మూత తీసి చేత్తో బాగా మెదపాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ సాఫ్ట్‌గా కాకుండా సెమీ సాఫ్ట్ పద్ధతిలో ఉండేలా చూసుకోవాలి. పిండి మరీ సాఫ్ట్‌గా ఉంటే మురుకులు నూనెను ఎక్కువగా లాగేస్తాయి. పిండిని నొక్కి చూస్తే కొద్దిగా బరకగా, మృదువుగా అనిపించాలి. తర్వాత జంతికల గొట్టానికి స్టార్ గుర్తు ఉన్న బిళ్లను సెట్ చేయాలి. గొట్టం లోపల కొద్దిగా నూనెను అప్లై చేసి, సిద్ధంగా ఉన్న పిండిని అందులో నింపాలి. మిగిలిన పిండి ఆరిపోకుండా దానిపై ఒక తడి కాటన్ క్లాత్ కప్పి ఉంచాలి. ఒక పెద్ద స్టీల్ ప్లేట్‌కు లేదా చిల్లుల గరిటె వెనుక భాగంలో కొద్దిగా నూనె రాసి, దానిపై రెండు లేదా మూడు చుట్ల చుట్టి మురుకుల షేప్‌లో ఒత్తుకోవాలి. మరో పక్కన కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె చక్కగా వేడయ్యాక, ప్లేట్‌పై లేదా గరిటెపై తయారు చేసుకున్న మురుకులను జాగ్రత్తగా తీసుకుని నూనెలో జారవదలాలి. నూనెలో వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు, అలా చేస్తే మురుకులు విరిగిపోతాయి. మీడియం మంటపై ఒక వైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరో వైపుకు తిప్పి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. నూనెలోని నురగ మరియు పొంగు పూర్తిగా తగ్గిపోయిందంటే మురుకులు చక్కగా వేగాయని అర్థం. ఈ ప్రక్రియను మొత్తం పిండి అయిపోయే వరకు కొనసాగించాలి. ఈ పద్ధతిలో చేసిన మురుకులు ఎక్స్‌ట్రా క్రిస్పీగా వస్తాయనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే దాదాపు నెల రోజుల పాటు తాజాగా, కరకరలాడుతూ ఉంటాయి.     Rice Flour Murukku Recipe, Crispy Murukku At Home, Tea Time Snack Ideas, South Indian Chakkli Recipe, Easy Evening Snacks, Traditional Indian Fritters, Cooking Tips In Telugu.
మనలో చాలామందికి వేరుశెనగలు ఒక సాధారణ చిరుతిండిగా మాత్రమే తెలుసు. అయితే, ప్రతిరోజూ క్రమం తప్పకుండా వేరుశెనగలు తినడం వల్ల మన మెదడు ఆరోగ్యానికి, ముఖ్యంగా జ్ఞాపకశక్తికి ఎంతో మేలు జరుగుతుందని ఇటీవలి శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రఖ్యాత  ఫుడ్ అండ్ ఫంక్షన్  (Food & Function) జర్నల్‌లో ప్రచురితమైన ఈ తాజా పరిశోధన ప్రకారం, ఉప్పు కలపని, పొట్టుతో రోస్ట్ చేసిన వేరుశెనగలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల వయసుతో పాటు వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలను తగ్గించవచ్చని తేలింది. వయసు పెరుగుతున్న కొద్దీ మెదడులో జరిగే మార్పులను అడ్డుకోవడంలో ఈ సాధారణ ఆహారం అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ పరిశోధనలో భాగంగా వృద్ధులకు 16 వారాల పాటు రోజువారీగా సుమారు రెండు సర్వింగ్‌ల వేరుశెనగలను అందించారు. దీనివల్ల వారి మెదడు పనితీరులో ఊహించని సానుకూల మార్పులు వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా మెదడులో ఇన్సులిన్ ప్రతిస్పందన మెరుగుపడటం వల్ల జ్ఞాపకశక్తితో ముడిపడి ఉన్న కణాలకు సరికొత్త శక్తి లభించిందని అధ్యయనం స్పష్టం చేసింది. శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇన్సులిన్ ఎంత ముఖ్యమో, మెదడు కణాలు పెరగడానికి, జీవించడానికి మరియు ఒకదానితో ఒకటి సంభాషించుకోవడానికి కూడా ఇన్సులిన్ సిగ్నలింగ్ అదే స్థాయిలో సహకరిస్తుంది. వయసు పైబడే కొద్దీ మెదడు కణాలు ఇన్సులిన్‌కు తక్కువగా స్పందిస్తాయి, దీనివల్ల జ్ఞాపకశక్తి మందగించే ప్రమాదం ఉంది. అయితే, నిపుణులు జరిపిన ఈ పరీక్షల్లో పాల్గొన్న వారు రోజువారీగా వేరుశెనగలు తీసుకోవడం ద్వారా వారి మెదడులోని కుడి అర్ధగోళంలోని హిప్పోకాంపస్, పారాహిప్పోకాంపల్ గైరస్ వంటి కీలక ప్రాంతాలలో ఇన్సులిన్ ప్రతిస్పందనలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. అంతేకాకుండా, ఈ పరిశోధనలో అత్యంత ఆశ్చర్యకరమైన గణాంకాలు వెలుగు చూశాయి. వేరుశెనగలు క్రమం తప్పకుండా తినడం వల్ల మొత్తం సెరెబ్రల్ రక్త ప్రవాహంలో 3.6% వృద్ధి నమోదవగా, గ్రే మేటర్‌లో రక్త ప్రవాహం ఏకంగా 4.5% పెరిగినట్లు తేలింది. కేవలం రక్త ప్రవాహం పెరగడమే కాకుండా, డీలేడ్ రికాల్ టెస్ట్ సమయంలో పాల్గొన్న వృద్ధులలో వెర్బల్ మెమరీ (మాటల ద్వారా గుర్తుంచుకునే శక్తి) ఏకంగా 5.8% మెరుగైనట్లు పరిశోధకులు స్పష్టం చేశారు. వేరుశెనగలలో లభించే పోషకాలు మెదడును చురుగ్గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో పుష్కలంగా లభించే అసంతృప్త కొవ్వులు, ప్లాంట్  బేస్డ్ ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు మరియు ఖనిజాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా వేరుశెనగలలో ఎల్  ఆర్జినైన్  (L arginine) అనే అమైనో ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపించి, రక్తనాళాల పనితీరును క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. అయితే, మార్కెట్లో దొరికే హెవీగా ఉప్పు లేదా చక్కెర కోటింగ్ చేసిన వేరుశెనగలు కాకుండా, కేవలం ఉప్పు కలపని, సహజమైన రోస్ట్ చేసిన వేరుశెనగలను మాత్రమే సరైన మోతాదులో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిశోధన వేరుశెనగలు అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను పూర్తిగా నయం చేస్తాయని లేదా నివారిస్తాయని నిరూపించనప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా వీటిని తీసుకోవడం మెదడు రక్తనాళాల ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు.     Peanuts For Brain Memory, Daily Peanuts Health Benefits, Brain Boosting Foods Research, Cognitive Health And Peanuts, Nutritious Nuts For Focus, Scientific Facts On Peanuts, Health Tips In Telugu.
వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు మనుషుల జీవన శైలిని , బాధ్యతలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పటివరకు కుటుంబ నియంత్రణ , గర్భనిరోధక బాధ్యతలు ఎక్కువగా మహిళల మీదే ఉంటూ వచ్చాయి. మార్కెట్లో లభించే వివిధ రకాల గర్భనిరోధక మాత్రలు లేదా పద్ధతులు అన్నీ మహిళల శారీరక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే. కానీ మారుతున్న కాలానికి తగినట్టుగా వైద్య శాస్త్రం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా పురుషుల కోసం ప్రత్యేకంగా గర్భనిరోధక మాత్రలను తీసుకువచ్చే దిశగా పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. ఈ కొత్త  ఆవిష్కరణ భవిష్యత్తులో గర్భనిరోధక పద్ధతులపై  చాలా అంచనాలు సృష్టిస్తోంది.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..  గర్బనిరోధక మాత్రలు.. సాధారణంగా మహిళలు వాడే గర్భనిరోధక మాత్రలు వారి శరీరంలోని హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల వారిలో కొన్ని రకాల శారీరక మార్పులు లేదా దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది. కానీ పురుషుల కోసం తయారు చేస్తున్న ఈ సరికొత్త  మాత్రల ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఎలాంటి హార్మోన్ మార్పులకు గురిచేయవు. కేవలం పురుషుల శరీరంలో ఉండే శుక్రకణాల కదలికలను మాత్రమే నేరుగా ప్రభావితం చేసేలా ఈ మందులను రూపొందిస్తున్నారు. మానవ శరీరంలో , పురుషుల వ్యవస్థలో ప్రత్యేకంగా ఉండే ఒక ఎంజైమ్ పై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. శుక్రకణాలు ముందుకు కదలడానికి , మహిళల అండం వరకు సులభంగా చేరుకోవడానికి ఈ ప్రత్యేక ఎంజైమ్ చాలా కీలకంగా పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగా కనిపెడుతున్న  ఔషధం తీసుకున్నప్పుడు ఆ ఎంజైమ్ కొన్ని గంటల పాటు తాత్కాలికంగా నిలిచిపోతుంది. దీనివల్ల శుక్రకణాలు సాధారణ పద్ధతిలో ముందుకు కదలలేవు. ఫలితంగా అవి అండం వరకు చేరే సామర్థ్యాన్ని కోల్పోతాయి కాబట్టి  గర్భధారణ జరిగే అవకాశం చాలావరకు తగ్గిపోతుంది. పురుషుల కోసం కనిపెడుతున్న ఈ కొత్త  గర్భనిరోధక మాత్రల గురించి శాస్త్రవేత్తలు వెల్లడించిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే వీటిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా మింగాల్సిన అవసరం ఉండదు. శారీరక సంబంధానికి కేవలం ముప్పై నిమిషాల ముందు ఈ మాత్రను తీసుకుంటే సరిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మొదటి దశలో జరిపిన పరీక్షల ప్రకారం ఈ మందు ప్రభావం శరీరంలో కొన్ని గంటల పాటు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ భవిష్యత్తులో జరిగే క్లినికల్ పరీక్షలు , పరిశోధనలు విజయవంతమైతే పురుషులు రోజూ ఎలాంటి మందులు వాడకుండా కేవలం అవసరమైనప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించే వెసులుబాటు కలుగుతుంది. ఈ మాత్రలు తీసుకుంటే పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుందా అని చాలా మందిలో ఒక  సందేహం కలుగుతుంది . అయితే ఈ మాత్రల ప్రధాన ఉద్దేశం పురుషులలో శుక్రకణాలు పుట్టకుండా చేయడం కాదు. కేవలం తాత్కాలికంగా వాటి కదలికలను నిలిపివేయడం లేదా మందగించడం మాత్రమే. ఈ  మాత్ర  ప్రభావం పూర్తిగా ముగిసిన తర్వాత శుక్రకణాలు నార్మల్ గా  తమ సాధారణ స్థితికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ మందు ప్రభావం పోయిన తర్వాత పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందా లేదా అనేదానిపై మరింత లోతైన పరీక్షలు అవసరం అంటున్నారు. ఈ కొత్త ఆవిష్కరణను ప్రస్తుతం జంతువులపై ప్రయోగించి పరిశీలిస్తున్నారు. మనుషులపై వీటిని వాడే ముందు వాటి భద్రత , సరైన మోతాదును నిర్ణయించడం  చాలా ముఖ్యం. ఏవైనా దుష్ప్రభావాలు వస్తాయా లేదా అని నిరంతరం పరిశీలించాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు అన్నీ విజయవంతమైతే భవిష్యత్తులో గర్భనిరోధక బాధ్యతలను కేవలం మహిళలు మాత్రమే కాకుండా  భాగస్వాములిద్దరూ సమానంగా పంచుకోవడానికి ఒక చక్కటి అవకాశం లభిస్తుంది. అయితే ఈ మాత్రలు కేవలం గర్భధారణను మాత్రమే నివారిస్తాయి కానీ ఎలాంటి లైంగిక  వ్యాధుల నుంచి రక్షణ ఇవ్వలేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు                             *రూపశ్రీ.
గుండెపోటు (Heart Attack) అనగానే చాలామందికి ఛాతీలో తీవ్రమైన నొప్పి గుర్తుకొస్తుంది. అయితే గుండెకు సంబంధించిన సమస్యలు కొన్నిసార్లు గ్యాస్ నొప్పిగా అనిపించవచ్చు. గ్యాస్ నొప్పి అనుకుని గుండెపోటు లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం కలగవచ్చు. మరి గ్యాస్ నొప్పికి, గుండె నొప్పికి మధ్య తేడా ఏమిటి? గుండెపోటు వచ్చే ముందు శరీరం ఎలాంటి హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది? నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి (Stress), నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం, పని ఒత్తిడి, సరైన విశ్రాంతి లేకపోవడం గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఒత్తిడి వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా? జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భీష్మ చౌదరి గారు గుండె ఆరోగ్యానికి సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలను వివరించారు. గుండెపోటు లక్షణాలను ఎలా గుర్తించాలి? గ్యాస్ నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేయకూడని సంకేతాలు ఏమిటి? ఒత్తిడి, నిద్రలేమి గుండెపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు? వంటి సందేహాలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకోవచ్చు. గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడంతో పాటు, గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించడం ఎంతో ముఖ్యం. ఛాతీలో నొప్పి, బిగుతుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన చెమటలు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందండి మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)