ఈ ఎన్నికలలో ఎవరైనా ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈ క్రింది విషయాలను ఒప్పుకున్నట్లే అని సోషల్ మీడియాలో ఒక బాధ్యతగల పౌరుడు స్పందించాడు. నిప్పులాంటి నిజాలను గుర్తు చేశాడు. మీరు ఆంధ్రప్రదేశ్ ఓటరా? మీ మనసులో ఏ మూలనైనా జగన్‌కి ఓటు వేయాలన్న ప్రమాదకరమైన ఆలోచన వుందా? అయితే ఆ బాధ్యత గల పౌరుడు చేస్తున్న హెచ్చరికలు చూడండి.. ఆలోచించి ఓటు వేయండి. ఈసారి జగన్‌కి ఓటు వేస్తే.... * మాకు డెవలప్‌మెంట్ అక్కర్లేదు అని ఒప్పుకున్నట్లే... * మా రాష్ట్రానికి రాజధాని అవసరం లేదని ఒప్పుకున్నట్లే.... * మా ఆస్తులు మీ దగ్గర తాకట్టు పెట్టుకోవచ్చని ఒప్పుకున్నట్లే... * పోలవరం ప్రాజెక్టు కట్టనవసరం లేదని ఒప్పుకున్నట్లే.... * పరిశ్రమలు అవసరం లేదని ఒప్పుకున్నట్లే..... * మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు అని ఒప్పుకున్నట్లే... * కడప స్టీల్ ప్లాంట్ అవసరం లేదని ఒప్పుకున్నట్లే.... * ప్రత్యేక హోదా అనేది ఒక ముగిసిన అధ్యాయం అని ఒప్పుకున్నట్లే.... * కేంద్రం నుండి మాకు ఒక్క రూపాయి రాకపోయినా పర్లేదు మేము ఊడిగం చేస్తాం అని ఒప్పుకున్నట్లే..... * సిపిఎస్ అవసరమే లేదు మీరు ఎంతిస్తే అంత అదే మాకు పదివేలు అని ఒప్పుకున్నట్లే.... * పీఆర్సీలు, అరియర్స్ అవసరం లేదు.. మీకు బుద్ధి పుట్టినప్పుడు ఇవ్వండి అని ఒప్పుకున్నట్లే..... * రోడ్లు మాకు అక్కర్లేదు మాకు ఇలాగే బాగున్నాయి అని ఒప్పుకున్నట్లే.... * రైల్వే జోన్ అవసరం లేదని ఒప్పుకున్నట్లే..... * మా రాష్ట్రాన్ని పులివెందుల తోడేళ్ళకు రాసిచ్చేశాం అని ఒప్పుకున్నట్లే.... * మాకు మంచి మద్యం వద్దు, ఇలా బూమ్ బూమ్ లాంటి కల్తీ మద్యం కావాలని ఒప్పుకున్నట్లే.... * మేము స్వేచ్ఛగా మాకు కావలసినది అడగం, మీ కింద బానిసలాగా బతుకుతాం అని ఒప్పుకున్నట్లే.... * రాష్ట్రంలో మీకు నచ్చినవి తాకట్టు పెట్టుకోండి అని ఒప్పుకున్నట్లే.... * కావలసిన అప్పులు చేసుకొమ్మని ఒప్పుకున్నట్లే.... * ప్రజా సమస్యల మీద కాకుండా ప్రశ్నించే వారిని అరెస్ట్ చేసుకొమ్మని ఒప్పుకున్నట్లే.... * ఇసుక దందా చేసుకొమ్మని ఒప్పుకున్నట్టే.... * డిఎస్సీ మాకు అవసరం లేదని ఒప్పుకున్నట్లే..... * మా బతుకులకి 5 వేల వాలంటీర్ జాబులు చాలా ఎక్కువ అని ఒప్పుకున్నట్లే... * మిగతా నీటి ప్రాజెక్టులు కట్టకపోయినా పర్వాలేదు అని ఒప్పుకున్నట్టే.... * మీ ఇష్టం వచ్చినట్లు కబ్జాలు చేసుకోండి, మేమేమీ అనం అని ఒప్పుకున్నట్లే.... * ఎంతమందినైనా హత్య చేసుకోండి మేం ఏమీ అడగమని ఒప్పుకున్నట్లే...
రాయలవారి కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఉదయగిరి జ‌గ‌న్ పాల‌న‌లో కళావిహీనంగా మారింది.  పట్టణ ముఖ ద్వారంలోని  ఉదయగిరి ఆనకట్ట చెరువు ఆధునికీకరణ పనులు నిధులులేక ఆగిపోయాయి. గండిపాళెం జలాశయం రూపురేఖలు కోల్పోయింది.  ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు, మర్రిపాడు, కొండాపురం మండలాల్లోని ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించటానికి వీలుగా గండిపాళెం జలాశయం వద్ద ఏర్పాటు చేసిన సబ్‌ మిషన్‌ ప్రాజెక్టు జ‌గ‌న్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోయింది. 2002లో సబ్‌ మిషన్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో 46 ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలకు నీటిని సరఫరా చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిధుల మంజూరును నిలిపేసింది. దీన్ని వినియోగంలోకి తెచ్చేందుకు  పంపిన ప్రతిపాదనలు  బుట్టదాఖలయ్యాయి.  గ్రామీణ ప్రాంత క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయటానికి వీలుగా పట్టణంలోని గండిపాళెం మార్గంలో 2018 తెదేపా ప్రభుత్వ హయాంలో రూ. 2 కోట్ల నిధులతో మినీ స్టేడియం మంజూరైంది. అయితే ప్రభుత్వం మారటంతో ఈ మినీ స్టేడియం నిర్మాణ పనులకు నిధులు నిలిపేశారు. తాగునీటి సమస్య తో పాటు, ఇరిగేషన్ ప్రాజెక్టులు  కూటమి అధికారం లోకి రాగానే పూర్తి చేస్తామ‌ని తెలుగుదేశం పార్టీ హామీనిస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తోంది.  కూట‌మి అభ్య‌ర్థి కాక‌ర్ల సురేష్ గెలుపు కోసం ఆయ‌న తల్లి మస్తానమ్మ, సతీమణి ప్రవీణ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విఆర్ లక్ష్మీ శ్యామల  ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక ప్ర‌జ‌లు  వారికి కర్పూర హారతులు ఇచ్చి పూలను వేదజల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు.  టీడీపీతోనే ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని,  ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్‌ను, ఎంపీ అభ్యర్థి వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను అఖండ మెజారిటీ తో గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా వున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విఆర్ లక్ష్మీ శ్యామల తెలిపారు.  వినూత్నంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను, కాకర్ల సురేష్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని అభ్యర్థించారు.  వైసీపీ గెలిచే అవకాశాలు లేవు కాబట్టి.. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఓట్లను వేయించుకోవాలనే కుట్రలకు అధికార పార్టీ పాల్పడుతోంద‌ని,  మద్యం, నగదు పంపిణీతో పాటు పోలింగ్‌ రోజు గొడవలతో భయోత్పాత  సృష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విఆర్ లక్ష్మీ శ్యామల ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.   వైసీపీకి ఇవే చివరి ఎన్నికలంటూ అభ్యర్థి కాకర్ల సురేష్ త‌న దైన స్టైల్‌లో ప్ర‌చారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ టీడీపీ కూట‌మికే జైకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే, అన్నీ స‌ర్వేల్లో తేలిపోయింది.  ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తానని, ఉదయగిరి కోటను, సిద్దేశ్వరం, శ్రీ వెంగమాంబ టెంపుల్, గండిపాలెం రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా మార్చి ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు సురేష్ హామీలు ఇస్తున్నారు.
వైసీపీలో కొన్ని రోజుల నుంచీ ఒక విధమైన నైరాశ్యం కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ నుంచి, కీలక నేతలైన విజయసాయిరెడ్డి వంటి వారి వరకూ అందరూ అన్యాపదేశంగా తమ పార్టీ ఓటమి తథ్యమన్న సంకేతాలే ఇస్తున్నారు.  ముందుగా జగన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లపై నమ్మకం పోయిందంటూ చేతులెత్తేశారు. ఎన్నికల కమిషన్ తమ పథకాలను నిలిపివేస్తోందనీ, తమకు మద్దతుగా ఉన్న అధికారులపై బదలీ వేటు వేసి.. అధికారులెవరూ అధికార పార్టీకి సహకరించకుండా చేస్తోందనీ వ్యాఖ్యానించి. అటువంటి అనుచిత సహకారం లేకపోతే గెలుపు సాధ్యం కాదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఇక తొలి సారిగా ప్రత్యక్ష ఎన్నికలలోకి అడుగుపెట్టిన విజయసాయిరెడ్డి పరిస్థితి అయితే మరీ దారుణంగా మారిపోయింది. ఆయన ప్రచారానికి జనం సంగతి పక్కన పెడితే సొంత పార్టీ క్యాడర్ కూడా పెద్దగా రావడం లేదు. సొమ్ములిచ్చి రప్పించుకున్న వారు కూడా ఇలా కనిపించి అలా మాయమై పోతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి తన ఓటమి తానే ఓప్పుకునేలా చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను సైతం నైరాశ్యంలో ముంచేశాయి. ఇంతకీ ఆయన సమాజిక మాధ్యమం వేదికగా ఏమన్నారంటే.. నిజాయితీగా పని చేస్తున్న అనంత రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని, అనంతపురం డీజీపీని ఎన్నికల కమిషన్ బదిలీ చేసేసింది. ఇదేక్కడి న్యాయం. వాస్తవానికి తెలుగుదేశం కదిరి అభ్యర్థి కందికుంట ప్రసాద్ కారులో  రూ. 2 కోట్ల భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నందుకు పోలీసులు వారిని అభినందించాలి అని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా ఎన్నికల సంఘం అనంత పోలీసు అధికారులను బదిలీ చేయడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడని పేర్కొన్నారు.   సాధారణంగా ఇలాంటి బేల మాటలు.. ఓటమి బాటలో ఉన్నప్పుడే నేతల నోట వస్తాయని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో గత ఎన్నికలలో ఎన్నికల సంఘం తీరును అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు విమర్శించిన సందర్భంలో చంద్రబాబు ఓటమి భయంతో  మాట్లాడుతున్నారంటూ ఇదే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.   అదలా ఉంచితే విజయసాయి రెడ్డి జగన్ సర్కార్ లో, వైసీపీలో అత్యంత కీలకమైన నాయకుడు. వరుసగా రెండు సార్లు జగన్ ఏరి కోరి ఆయనను రాజ్యసభకు పంపారు. అయితే ఇప్పుడు తన సొంత జిల్లా అంటూ చెప్పుకుని తగదునమ్మా నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయసాయి జిల్లాకు చేసింది మాత్రం శూన్యం.  కూటమి తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక పోటీదారుగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థి విజయసాయి తాను స్థానికుడిననని ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా సొంత పార్టీలోని కీలక నేతలే ఆయనకు మద్దతుగా నిలవడం లేదు. నుంచి పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి స్థానిక అభ్యర్థి అయినప్పటికీ ఆయనకు కీలక నేతలు, ప్రజల నుంచి గట్టి మద్దతు లేదు. ఇటీవలే జగన్ తో విభేదించి వైసీపీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి మద్దతుగా   చాలా వరకూ వైసీపీ క్యాడర్ ఆయనతో పాటే తెలుగుదేశం వైపు వచ్చేసింది.  
ALSO ON TELUGUONE N E W S
బిచ్చగాడు తో విజయ్ ఆంటోనీ  తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోగా మారాడు. కొన్ని నెలల క్రితం ఆయన కూతురు చనిపోయినప్పుడు కూడా అందరు  ఎంతగానో బాధపడ్డారు. అంతగా తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాడు. లేటెస్ట్ గా ఆయనకి సంబంధించిన న్యూస్ ఒకటి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది  విజయ్ ఆంటోనీ రీసెంట్ మూవీ లవ్ గురు. కామెడీ అండ్ రొమాన్స్  నేపథ్యంలో  తెరకెక్కింది. ఏప్రిల్ 11 న తమిళ, తెలుగు భాషల్లో  విడుదల అయ్యింది. కాకపోతే తమిళంలో మాత్రం రోమియో అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు చోట్ల కూడా మంచి విజయాన్నే  నమోదు చేసింది ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లోకి అడుగుపెడుతుంది. పైగా తెలుగు తమిళంలో ఒకే సారి స్ట్రీమింగ్ కి రానుంది. మే 10 నుంచి తెలుగు వెర్షన్ ఆహా లో, తమిళ వెర్షన్  అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది   మలేషియాలో ఏకాంత జీవితాన్ని గడిపే  అరవింద్ క్యారక్టర్ లో విజయ్ సూపర్ గా నటించాడు. నిజమైన ప్రేమను కనుక్కోవాలనే పట్టుదలతో ఉంటాడు. ఈ క్రమంలో ఇష్టం లేకుండానే పెళ్లి  జరుగుతుంది.ఆ తర్వాత ఏం జరిగిందనేదే కథ. వైఫ్ క్యారక్టర్ లో మృణాళిని  రవి నటించింది. వినాయక్ వైద్యనాధన్ దర్శకత్వం వహించగా భారత్ ధనశేఖర్ సంగీతాన్ని అందచేసాడు.విజయ్ ఆంటోనీ నే నిర్మాతగా వ్యవహరించాడు. యోగి బాబు, జైలర్ గణేష్,సుధ తదితరులు ముఖ్య పాత్రల్లో మెరిశారు  
బేబీ సినిమా ఘన విజయంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన  దర్శకుడు సాయి రాజేష్. 2014 లో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు  హీరోగా వచ్చిన హృదయకాలేయం ఆయన మొదటి మూవీ.. స్టీఫెన్ రాజేష్ పేరుతో ఆ చిత్రానికి దర్శకత్వం వహించాడు.మళ్ళీ సంపూర్ణేష్ తోనే  కొబ్టరి మట్ట కూడా తీసాడు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో  ఒక సీక్రెట్ ని బయటపెట్టాడు. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2020 లో ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా లో కలర్ ఫోటో మూవీ స్ట్రీమింగ్ అయ్యింది. సుహాస్, చాందిని చౌదరి,సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అశేష ప్రేక్షకాదరణని పొందటంతో పాటు  నేషనల్ అవార్డు ని సైతం సాధించింది.  కలర్ ఫోటో కథ సాయి రాజేష్ దే. ఇప్పుడు ఈ కథ విషయంలోని  సీక్రెట్  నే రాజేష్ బయటపెట్టాడు. కలర్ ఫోటో కథ నిజ జీవితంలో తనకి తన భార్యకి మధ్య జరిగిందని చెప్పాడు. అంటే సాయి రాజేష్ వైఫ్ కలర్ సాయి రాజేష్ బ్లాక్     ఈ సందర్భంగా పెద్ద హీరో సినిమాల ప్రస్తావన కూడా వచ్చింది..నాకు స్టార్ హీరోలతో సినిమా చేయాలనే  మైండ్ సెట్ లేదు. ముందు వాళ్లు ఛాన్స్ ఇవ్వాలి. పైగా  నాకు రియాలిటీ ఏంటో తెలుసు. వాళ్లు సెట్‌లోకి వస్తే.. వాతావరణం మొత్తం మారిపోతుంది. సినిమా మన చేతుల్లో ఉండదనే భయం కూడా  ఉందని చెప్పాడు.ప్రస్తుతానికి రెండు చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. సాయి రాజేష్  మెగాస్టార్ కి వీరాభిమాని అనే విషయం  అందరకి తెలిసిందే  
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం వెయ్యికి పైగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే.. స్టార్ హీరోల రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. అలాంటి బ్రహ్మానందం ఇప్పుడు తన కుమారుడు కోసం తాత అవతారం ఎత్తుతున్నారు. 'పల్లకిలో పెళ్లికూతురు' సినిమాతో బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'బసంతి', 'మను' వంటి సినిమాలతో మెప్పించిన గౌతమ్.. తన తండ్రికి పూర్తి భిన్నంగా చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు. అతని నుంచి సినిమా వచ్చి చాలా కాలమే అయింది. ఇలాంటి సమయంలో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ.. గౌతమ్-బ్రహ్మానందం కలయికలో సినిమా ప్రకటన వచ్చింది. తాజాగా విడుదలైన ఈ అనౌన్స్ మెంట్ వీడియోలో.. బ్రహ్మానందం ఫ్రస్ట్రేషన్ ని చూపించడంతో పాటు, సినిమాకి సంబంధించిన వివరాలను రివీల్ చేశారు. వీడియోలో వెన్నెల కిషోర్ తో కలిసి ఇంట్లో చెస్ ఆడుతూ.. తన కుమారుడు గౌతమ్ గురించి మాట్లాడుతుంటారు బ్రహ్మానందం. "పుష్కరమైంది వాడి సినిమా వచ్చి. స్టోరీలు వింటాడు, డెప్త్ లేదని పక్కన పెడతాడు" అని కిషోర్ తో బ్రహ్మి చెప్తారు. అప్పుడు కిషోర్, గౌతమ్ కలిసి.. కొత్త సినిమా డీటెయిల్స్ ని రివీల్ చేస్తారు. అంతేకాదు ఆ సినిమాలో తాత పాత్ర ఉందని, అది మీరే చేయాలని బ్రహ్మానందంతో చెప్తారు. మొదట షాకైన బ్రహ్మి.. ఆ తర్వాత తాత పాత్ర చేయడానికి అంగీకరిస్తారు. అలా గౌతమ్-బ్రహ్మానందం ల సినిమా ప్రకటన వచ్చింది. అంతేకాదు ఈ సినిమాకి 'బ్రహ్మానందం' అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. బ్రహ్మగా గౌతమ్, ఆనంద్ గా బ్రహ్మానందం కనిపించనున్నారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిఖిల్ దర్శకుడు. మరి తండ్రీకొడుకులు.. తాతమనవడిగా నటిస్తున్న ఈ 'బ్రహ్మానందం' చిత్రం ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
అమెరికాలోని డల్లాస్ నగరంలో సుస్వర మ్యూజిక్ అకాడెమీని విజయవంతంగా నిర్వహిస్తున్నారు డాక్టర్ మీనాక్షి అనిపిండి. ఈ అకాడెమీ 21వ వార్షికోత్సవం ఆదివారం (మే 5న) ఘనంగా నిర్వహించారు. గ్రాండ్ సెంటర్ ఆడిటోరియంలో జరిగిన ఈ సంబరాల్లో డల్లాస్ నగరంలోని ప్రముఖులతో సహా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అతిధులుగా పాల్గొన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్ శ్రీ ప్రసాద్ తోటకూర, డల్లాస్ లో ఇండో అమెరికన్ కౌన్సిల్ సభ్యులు శ్రీ గోపాల్ పోనంగి, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కిషోర్ కంచర్ల, శ్రీమతి శారద సింగిరెడ్డి, శ్రీ ప్రకాష్ రావు అతిధులుగా హాజరయ్యారు. ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, డైరెక్ట‌ర్ వీఎన్ ఆదిత్య‌తో సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సంద‌డి చేశారు. సుస్వర మ్యూజిక్ అకాడెమీ 21వ వార్షిక సంబరాల్లో మీనాక్షి అనిపిండి తన శిష్య బృందంతో 7 సిగ్మెంట్లలో దాదాపు 30కి పైగా సంప్రదాయ సంగీత కీర్తనలను ప్రదర్శన ఇచ్చారు. 10 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ సాంస్కృతిక గాన ప్రదర్శన ప్రేక్షకులందరినీ అలరించింది.ఈ వేదికపై చంద్రబోస్ కు "సుస్వర సాహిత్య కళానిధి", ఆర్పీ పట్నాయక్ కు "సుస్వర నాద‌నిధి" అనే బిరుదులు అందించారు. కుమారి సంహిత అనిపిండి,  శ్రీమతి ప్రత్యూష ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
Lovely Young Hero Aadi Sai Kumar and talented director Veerabhadram Chowdary collaborated for the second time for a new movie titled 'Krishna From Brindavanam'. Produced jointly by Thumu Narasimha and Jami Srinivasa Rao under the Lakshmi Prasanna Productions banner, it is a village drama, laced with family, love, comedy, and feel-good emotions. The movie was launched recently. Meanwhile, the makers began musical sittings of the movie in Goa, in the presence of the core team. Anup Rubens who previously provided many super hit albums to Aadi such as Prema Kavali, Lovely, Sukumarudu, and Pyaar Mein Padipoyane, is on a mission to deliver another chartbuster album. The makers have also announced to commence the regular shoot of the movie in June. Digangana Suryavanshi who earlier worked with Aadi in Crazy Fellow is the leading lady in the new movie. Shyam takes care of cinematography of the movie, whereas the editing will be done by Chota K Prasad. Ramu Mannar provides the dialogues, while Dragon Prakash and Shankar will oversee fights in the movie.
నీహారిక  కొణిదెల.. మెగా డాటర్ అనే గుర్తింపుతో సినిమాల్లో రాణిస్తూ మంచి నటి అనే పేరు సంపాదించింది. ఇప్పుడు నిర్మాతగా మారి కమిటీ కుర్రోళ్లు అనే సామాజిక స్పృహతో కూడిన సినిమాని నిర్మిస్తుంది. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు అందులోని ఒక  పాటని ప్రముఖ సామాజిక వేత్త జయప్రకాష్ నారాయణ విడుదల చెయ్యడం ప్రాధాన్యత సంతరించుకుంది మనిషివా గొర్రెవా అనే లిరిక్ తో పాట స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత  రోడ్లన్నీ గతుకులు పాలే.. ఊరంతా చీకటి పాలే.. రేషన్లు పింఛన్లన్నీ గల్లంతాయే అనే పల్లవి తో సాగింది.  ఎలక్షన్లలో ఓటు అమ్ముకోవద్దనే ఒక మంచి మెసేజ్ ని  చెప్తుంది. ఇప్పుడు ఈ పాటనే జయప్రకాశ్ నారాయణ విడుదల చేసాడు.అనంతరం అయన మాట్లాడుతు గొర్రెవా పాట అందరిలో ఆలోచన కలిగించే విధంగా  ఉందని చెప్పాడు.  దేశ భవిష్యత్తుని కాపాడాలంటే యువతలో సరైన  ఆలోచన ఉండాలి.  ఓటు వేసే విషయంలో మార్పు కూడా  రావాలి. నిరాశని వదిలి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని కూడా తెలిపాడు    ఆ తర్వాత నీహారిక కూడా పలు ఆసక్తికర విషయాలని వెల్లడించింది. జయప్రకాశ్ సర్ ప్రసంగం వినే మా దర్శకుడు ఈ సినిమాని మొదలు పెట్టాడు. అలాంటిది ఆయన చేతుల మీదుగా పాట రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. యదు వంశీ దర్శకుడు కాగా సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, గోపరాజు రమణ, ఈశ్వర్,శ్రీనాధ్,శ్రీ లక్ష్మి తదితరులు నటించారు. నిహారిక తల్లి పద్మజ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తోంది   
నేడు తెలుగు సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూసే పరిస్థితి. అంతటి ఖ్యాతిని తెలుగు సినిమా ఓవర్ నైట్ సంపాదించలేదు. అహర్నిశలు  శ్రమిస్తు ఎన్నో అద్భుతమైన కథల్ని ఎంచుకొని ఒక సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులని తీసుకెళ్లింది. అందుకే ఇప్పుడు తెలుగు సినిమా ఫెస్టివల్ మూడ్ లోకి ఎంటర్ అవ్వబోతుంది  తెలుగు సినిమా వైభవాన్ని, వారసత్వ సంపదని తెలియచేసేలా తెలుగు సినిమా తొంభైయేళ్ల వేడుక జరగబోతుంది.  ఈ విషయాన్ని మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు  తెలిపాడు. జులై 26 న  మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని బూకీట్ జలీల్ ప్రతిష్టాత్మక స్టేడియంలో జరగనున్నాయి. ఇటీవలే అందుకు సంబంధించిన ఏర్పాట్లు  మీద విష్ణు మలేసియాలో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసాడు. మలేషియాలోని తెలుగు మాట్లాడే ప్రజల మధ్య స్థానికుల మధ్య ఈ వేడుకలు ఒక వారధిగా నిలుస్తాయని కూడా  తెలిపాడు   మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మలేసియా టూరిజం, ఎం సి ఎంటర్ టైన్మెంట్స్ లు ఈ కార్యక్రమంలో భాగం కానున్నాయి. మొదటి తెలుగు సినిమా  భక్త ప్రహ్లద.1932 ఏప్రిల్ 2 న విడుదల అయ్యింది.సంవత్సరం తర్వాత  అయినా వేడుకలు జరగడం శుభపరిణామం. ఇక విష్ణు ప్రస్తుతం కన్నప్ప అనే చారిత్రాత్మక మూవీని  చేస్తున్నాడు. పరమేశ్వరుడికి భక్తితో తన రెండు కళ్ళు సమర్పించిన కన్నప్ప జీవిత  కథ ఆధారంగా తెరకెక్కుతుంది. నిర్మాత కూడా విష్ణునే  
  రెండు తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ డ్రామా నడుస్తోంది. అయితే ఈ తరుణంలో పొలిటికల్ పార్టీలు తమ ప్రత్యర్థులను బలహీన పరిచేందుకు వినూత్నంగా పోటీపడుతుంటారు. అయితే ఇదే తరహాలో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్ రూపొందింది. భీమిలి కబడ్డీ జట్టు, హ్యాపీ, కాంతారా సినిమాలలో నటించిన కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ " తలైమై సేయలగం". జీ5 వేదికగా తమిళంతో పాటు తెలుగులోను ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ని వాస్తవికతకు దగ్గరగా ఉండేలా నిర్మించారంట. అందుకే ఈ సిరీస్ ని భారీ అంచనాలతో రిలీజ్ చేస్తున్నారు. సలార్ మూవీ ఫేమ్ శ్రియారెడ్డి, కస్తూరి, భరత్, రమ్య నంబీశన్, దర్శన గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధిక శరత్ కుమార్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. గిబ్రాన్ మ్యూజిక్ అందించగా..నేషనల్ అవార్డ్ విన్నర్ వసంత బాలన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సిరీస్ మేకర్స్ ఓ కీలక ప్రకటన చేశారు. మే 17 నుండి ఈ సిరీస్ జీ5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు.  తమిళనాడులో బిజేపీ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికలలో భాగంగా రాధిక పోటీ చేస్తోంది. అయితే తమిళనాడులో ఎన్నికల సమయంలో కొంతమంది రాజకీయ పెద్దలు ఆడిన చదరంగాన్ని ఈ సిరీస్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు మేకర్స్. మరికొన్ని రోజుల్లో ఓటీటీలోకి రాబోయే ఈ వెబ్ సిరీస్ ని మిస్ కాకుండా చూసేయ్యండి మరి.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ఫ్యాన్.. ప్రతి ఇంట్లో చాలా సాధారణంగా ఉండే ఎలక్ట్రిక్ పరికరం.  బయట నుండి ఇంటికి రాగానే ఫ్యాన్ వేసుకుని దాని కింద కూర్చుని రిలాక్స్  అవుతుంటాం. అయితే వేసవి కాలంలో ఫ్యాన్ వేగం తగ్గినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఫ్యాన్ వేసినా అసలు వేయనట్టే అనిపిస్తుంది. అందుకే చాలా మంది ధర ఎక్కువైనా ఏసీ వైపు మొగ్గు చూపుతారు. కానీ ఫ్యాన్ సెట్టింగ్ లో 5 మార్పులు చేయడం వల్ల ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతుంది. దాని వేగం.. అది ఇచ్చే చల్లదనం ముందు ఏసీ కూడా బలాదూర్ అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. ఇంతకీ ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుంటే.. కెపాసిటర్.. సీలింగ్ ఫ్యాన్‌లో అమర్చిన కెపాసిటర్ మోటార్‌కు అవసరమైన విద్యుత్‌ను అందించడానికి పనిచేస్తుంది. కెపాసిటర్ల పనితీరు మందగించినట్టైతే  90% కంటే ఎక్కువ సీలింగ్ ఫ్యాన్ సమస్యలు ఎదురవుతాయి. కెపాసిటర్ పని చేయడం ఆపివేసినప్పుడు మోటారుకు విద్యుత్ సరిగా అందదు.  దీంతో ఫ్యాన్ వేగం తగ్గుతుంది.  70 నుండి 80 రూపాయల కెపాసిటర్‌ను తిరిగి అమర్చితే  ఫ్యాన్ వేగం పెరుగుతుంది.   బ్లేడ్.. కొన్ని సార్లు ఫ్యాన్ బ్లేడ్ వంగడం వల్ల కూడా ఫ్యాన్ వేగం తగ్గుతుంది. అలాంటి పరిస్థితిలో ఫ్యాన్ బ్లేడును మార్చాలి.  దీనివల్ల కూడా సీలింగ్ ఫ్యాన్ వేగం పెరుగుతుంది. బాల్ బేరింగ్ ఫెయిల్యూర్.. సీలింగ్ ఫ్యాన్లు కాలం గడిచేకొద్దీ వాటిలో బాల్ బేరింగ్స్ లో ధూళి పేరుకుపోతుంది. దీని కారణంగా సీలింగ్ ఫ్యాన్ వేగం తగ్గుతుంది.  దాన్ని మరమ్మత్తు చేయడం ద్వారా ఫ్యాన్ వేగం పెంచవచ్చు. స్క్రూలు.. ఫ్యాన్ లో స్క్రూలు వదులైతే ఫ్యాన్ వేగాన్ని దెబ్బతీస్తాయి. అందుకే ఫ్యాన్ స్క్రూలు సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. సరళత. సరళత లేకపోవడం కూడా ఫ్యాన్ వేగాన్ని దెబ్బతీస్తుంది. దీన్ని కూడా రిపేర్ చేయించడం ద్వారా ఫ్యాన్ వేగాన్ని పెంచవచ్చు.                                                *రూపశ్రీ.
ఆఫీసులో పనిచేస్తున్న వారిలో పనిపట్ల శ్రద్ధలేకపోయినా, పని చేయడంలో విసుగు చిరాకు ప్రదర్శిస్తున్నా వారి సమస్య ఒత్తిడికాదు... పని ఒత్తిడి ఎక్కువైందని...! పనితో అలసిపోతున్నామని చెప్పేవారి సమస్య ఏమిటంటే వారికి ఆ పనిపట్ల ఇష్టం లేకపోవడం. అందువల్ల పనిమీద శ్రద్ధ చూపించలేకపోయారు. దాని వలన వారు పని ఒత్తిడి ఎక్కువైందని భావిస్తారు. అయిష్టంతో పనిని చేయడం వలన ఏ వ్యక్తి అయినా, ఆ పనిని రెండుసార్లు చేస్తారు. ఎన్నిసార్లు చేసినా ఆ పనిలో వారు చురుకుదనంగా ఉండరు. ఆ పనిని అంత సమర్థవంతంగా చేయలేరు. ఆ పనిపట్ల అయిష్టతకు కారణం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు, లేక వేరే ఇంకేమైనా కావచ్చు. అందువల్ల ఆవ్యక్తి ఆ పని పట్ల ఆసక్తి చూపకపోవచ్చు.  ఎప్పుడైనా మనం ఒక ఫీల్డ్లోకి వెళ్ళినపుడు, మనం మన  వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలి. ఆ ఫీల్డ్కి మనం ఇష్టంతో అంకితమవ్వాలి. అప్పుడు ఆ ఫీల్డ్కి మనం న్యాయం చేసినవారం అవుతాము. వ్యక్తిగత జీవితంలో ఎవరు హుషారుగా ఆనందంగా గడుపుతారో అటువంటివారే ఎంత ఒత్తిడినైనా తట్టుకుని, ఎంత పనైనా చేయగలుగుతారు. జీవితంలో తృప్తిగలవారికే పనిలోనూ తృప్తి లభిస్తుంది. జీవితాన్ని ఆనందించలేనివారు చిన్నచిన్న పనుల్లో కూడా చాలావరకు తప్పులనే చేస్తూ వుంటారు. "పనులు నువ్వు చేయడంలేదు. జరుగుతున్నాయ" అనే మాటను  గ్రహించి నిరహంకారంగా ఎవరి  కర్తవ్యం వారు నిర్వర్తించాలి. ఈ పని తర్వాత ఇంకేం చెయ్యాలి అని ఆలోచించకూడదు కేవలం చరిస్తూ వెళ్ళాలి. అలా ఆచరిస్తూంటే, ఒకదానివెంట మరొకటి అవే వస్తుంటాయి. మొదలుపెట్టిన పని సక్రమంగా పూర్తయితే ఆ పనిపట్ల నీవు ఇష్టతను చూపించావు అని అర్థం. మొదలుపెట్టినపని అవలేదంటే నీవు ఆ పనిపట్ల అయిష్టతను చూపించావు అని అర్థం. కొంతమంది ఇష్టంతో చేసినా ఆ పని ఆపలేదంటే దానికి కారణం ఆ పనిని వాయిదా వేయడం. ఇలా వాయిదా వేయడం వలన క్రమేపీ ఆ పనిపట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. దీని వలన ఆ పనులు పూర్తికావు. అందువలన ఎప్పుడూ పనులను వాయిదా వేయకూడదు. కాబట్టి మనం ఏదైనా పనిని మొదలు పెట్టినపుడు ఆ పనిని ఇష్టంతో వాయిదా వేయకుండా ఆ పనిని త్వరగా పూర్తిచేసుకోవాలి. ఎప్పుడైన ఒక పనిని ఇష్టంతో చేస్తే ఆ పని కష్టమనిపించదు ఆ పనిలో విజయాన్ని పొందుతారు. ఎప్పుడైనా ఒక పనిని కష్టపడి చేస్తే మనకి ఆ పని కష్టంగా వుంటుంది. ఆ పని విజయవంతం కాదు. ఓటమి, విఘ్నం, అనేవి బయటెక్కడో లేవు. నీలోనే వున్నాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు కొందరు, ఇంకేదో విషయంపై ఉత్సాహంతోనే పనులు మానేస్తారు మరికొందరు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా పనిని తలపెడితే ఆ పని అయ్యేవరకూ ఆ పనిపట్ల ఇష్టాన్ని చూపించాలి. అప్పుడే ఆ పనిలో ఆనందాన్ని పొందగలం. అలా చేస్తే ఇక విజయం మన  సొంతమవుతుంది. ఒక సాకర్ ఆటలో ఆటగాళ్ళను మారుస్తూ, ఒకరు సరిగ్గా ఆడకపోతే వారికి బదులు ఇంకొకరిని అడటానికి పంపవచ్చు. కానీ - జీవితం అలాకాదు. ఒకసారి ఏదైనా తప్పుచేస్తే, దాన్ని వెనక్కి తీసుకుని, దానిస్థానే ఇంకోపని చెయ్యటం కుదరదు. మీ జీవితంలో సంభవించిన విషాద సంఘటనలని వెనక్కి తిప్పి సరిచూసుకోడానికి మీకు రెండో అవకాశం దొరకదు.                                      ◆నిశ్శబ్ద.
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత అయిన జంధ్యాల. ఈయన నవ్వు గురించి చెప్పినప్పుడు ఆ నవ్వు ప్రాముఖ్యత ప్రజలకు అంతగా తెలియలేదు. కానీ ఇప్పుడూ లాఫింగ్ క్లబ్బులు పెట్టుకుని మరీ నవ్వేస్తున్నారు. నవ్వు ఓ గొప్ప ఔషధం అని వైద్యులు కూడా క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు. ఒక చిన్న నవ్వుతో ఎలాంటి వారిని అయినా గెలవచ్చు, ఎంత కఠిన హృదయం గలవారిని అయినా మార్చేయచ్చు అంటారు. అసలు నవ్వుకు ఇంత గొప్ప శక్తి ఉందంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నవ్వుకున్న గొప్పదనాన్ని గుర్తుచేసుకుంటూ, నవ్వుతో ప్రపంచాన్ని కాస్తో కూస్తూ మార్చాలనే తపనతో ప్రతి ఏడాది నవ్వుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కూడా. ఒక మనిషి జీవితంలో నవ్వు ఎంత మార్పు తెస్తుందో.. ఎలాంటి మార్పు తెస్తుందో కాసింత వివరంగా తెలుసుకుంటే ఔషధం.. నవ్వును ఔషధం అంటుంటే చాలామందికి కామెడీగా అనిపిస్తుంది కానీ ఇది అక్షరాలా నిజం. సైన్సే కూడా ఇదే నిజమని చెప్పింది. నవ్వినప్పుడు శరీరంలో విడుదల అయ్యే హ్యాపీ హార్మోన్లు మనిషికి ఉన్న ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి మానసిక రుగ్మతలను సులువుగా తగ్గిస్తుంది. అందుకే నవ్వును ఔషధం అన్నారు. ప్రతి రోజూ ఉదయాన్నే ఎలాంటి సంకోచం లేకుండా కొన్ని సెకెన్ల నుండి నిమిషాల పాటూ  అలా పెదవులు సాగదీసి నవ్వితే ఇక ఆ రోజంతా చాలా హ్యాపీ మూమెంట్లోనే గడిచిపోతుంది. పాజిటివ్.. మనిషి జీవితంలో పాజిటివ్, నెగిటివ్ అంటూ రెండూ ఉన్నాయి. పాజిటివ్ ఆలోచనలు మనిషి జీవితంలో ఉన్నతికి తోడ్పడతాయి. నెగిటివ్ ఆలోచనలు ఉంటే మనిషి పతనానికి కారణం అవుతాయి. పాజిటివ్ వైబ్రేషన్ ను కలిగించడంలో నవ్వుదే కీలక  పాత్ర. ఎవరితోనైనా బాగా గొడవ పడినప్పుడు వారితో విభేదాలు వచ్చినప్పుడు ఇక వారితో మాట్లాడకుండా ఉండిపోతారు. కానీ వారు ఎప్పుడైనా తారసపడినప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వి చూడండి. పాత గొడవలు, కలహాలు అన్నీ మర్చిపోయి వారు కూడా తిరిగి నవ్వుతారు. మళ్ళీ బంధం చిగురిస్తుంది. విజయానికి మెట్టు.. నవ్వు విజయానికి తొలిమెట్టు అవుతుంది. నవ్వు వల్ల జీవితంలో ఎంత కష్టాన్ని అయినా సునాయాసంగా అధిగమించగలుగుతారు. ఎక్కడలేని ఓర్పు, సహనం, నవ్వుతో వచ్చేస్తాయి. నవ్వుతూ ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తే ఇంకొకరు విజయంలో భాగస్వాములు కూడా అవుతారు. సంబంధాలు.. పైన చెప్పుకున్నట్టు.. మనుషుల మధ్య ఎలాంటి సమస్యలున్నా నవ్వు పరిష్కరిస్తుంది. ఎంత గొడవ వచ్చినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నవ్వుతూ సర్థి చెప్పడం వల్ల పెద్దగా మారాల్సిన గొడవలను చిన్నగా ఉండగానే పరిష్కరించుకోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతరులు, ఆఫీసులో కొలీగ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే నవ్వు వల్ల బలంగా ఉండే బంధాలు బోలెడు.                                                   *నిశ్శబ్ద.
వేసవిలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.  ఎందుకంటే ఈ సీజన్‌లో జీర్ణక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఆహారంలో జీర్ణక్రియను ప్రేరేపించే ఆహారాలు తీసుకోవాలి. దీనివల్ల  జీర్ణక్రియ  ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే వేసవి కాలంలో లిక్విడ్ ఫుడ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వేసవి కాలంలో  ఎక్కువగా పండ్లు,  కూరగాయల రసాలను తాగుతారు. ఇది  మాత్రమే కాకుండా సత్తును త్రాగితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. యూట్యూబ్ పుణ్యమా అని  ఎన్నో రాష్ట్రాలు, దేశాల ఆహారాలు తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో సత్తు కూడా ఒకటి.  ఇది వేసవిలో సూపర్ ఫుడ్ గా పరిగణించబడుతుంది. దీన్ని పాలలో కలుపుకుని తాగితే పొట్ట చల్లగా ఉండడంతో పాటు మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. సత్తులో పోషకాలు..  సత్తులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కాకుండా  ఐరన్, కాల్షియం, మెగ్నీషియం,  పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. సత్తును  పాలతో కలిపి త్రాగితే ఇది పోషక లక్షణాలను పెంచుతుంది. వేసవి కాలంలో శరీరం  శక్తి స్థాయి కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది. ఇలాంటి  పరిస్థితిలో సత్తును తీసుకుంటే శక్తివంతంగా ఉండవచ్చు. ఇది కాకుండా శరీరంలో రక్త హీనతతో బాధపడుతున్న వ్యక్తులు సత్తును తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వేసవిలో  జీర్ణవ్యవస్థ కొద్దిగా బలహీనపడుతుంది. ఇలాంటి సమయంలో సత్తును తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం, లూజ్ మోషన్ మొదలైన కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక పాలతో సత్తును తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. బరువు తగ్గడానికి ప్రయత్నం చేసేవారు  దీన్నితమ డైట్ లో భాగంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సత్తు కేవలం చల్లదనాన్ని, శరీరానికి పోషణను, జీర్ణ ఆరోగ్యాన్ని బాగు చెయ్యడమే కాదు.. ఎముకలకు బలాన్ని కూడా ఇస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అయితే.. దీన్ని రెగ్యులర్ గా డైట్ లో భాగం చేసుకునే ముందు  ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.                                                  *రూపశ్రీ.
కిడ్నీ క్యాన్సర్ తరచుగా వస్తూ ఉంటె దీనిని రినాల్ సెల్ కార్సి నోమా గా పిలుస్తారు.. కిడ్నీ సైజ్ 4 సెం గా ఉంటుంది. ఇందుకోసం హీటింగ్ లేదా ఫ్రీజింగ్ పద్దతిద్వారా ట్యూమర్ కు సాధారణంగా తెరఫీ మాత్రమే ప్రత్యామ్నాయం.తెరఫీ క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. దీనిని ఎబ్లేషణ్ గా అందరికీ తెలుసు. దీనివల్ల చాలామంది జీవితాలు కాపాడ వచ్చు.అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.క్లినికల్ స్టేజి లోనే టి వి ఏ అవసరం లేకుండా కిడ్నీ సర్జరీ చేయవచ్చు.పెన్సిల్వేనియా లో నిర్వహించిన ప్రాధమిక పరిశోదనలో యురాలజీఅసోసియేషన్  అమెరిక అధికారిక జర్నల్ లో ప్రాధమిక స్థాయిలో ఉన్న రినాల్ కార్సినోమా ను గుర్తించారు.ఆర్ సి సి ద్వారా ౩ నుండి 4 సెమి క్రియో అబ్ లేషన్ క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. ఫ్రీజింగ్ పద్ధతి ద్వారా క్యాన్సర్ కణాలు పెరుగుదలను నివారిస్తుంది.కిడ్నీ క్యాన్సర్ సంబందిత మరణాలు తక్కువే అయిన అబ్లేషణ్ ప్రభావం తక్కువే అని హీట్ పద్ధతికన్న  ధర్మల్ ఎబిలేషణ్ పద్ధతి  ఎబిలేషణ్ ఉత్తమమని నిర్ధారించారు.రెండిటిని పోల్చినప్పుడు ౩ సెమి లు తక్కువ ఉన్నప్పుడు చల్లటి పద్దతిలో హీట్ పద్దతిలో తెరఫీ ద్వారా క్యాన్సర్ నివారించ వచ్చు.రచయిత గాబ్రియల్ ఐ ఆర్ సి సి ఎస్ ఎం డి సైంటిఫిక్ ఇన్స్టిట్యుట్ మిలాన్ చేసిన పరిశోదన లో ఎబిలేషణ్ ఎలా వినియోగించాలి.అన్న అంశాల పై రోగులకు చిన్న ఆర్ సి సి ఎస్ పద్ధతి పై మరిన్ని పరిశోదనలు చేయాల్సి ఉంది.హీటింగ్ కన్నా క్రియో ఎబిలేషన్ వల్ల ప్రభావం తక్కువే. కిడ్నీ క్యాన్సర్ ను రినాల్ కార్సినోమా గా ప్పిలుస్తారు.రోగులలో అర సి సి 4 సెమీ కన్నా తక్కువ ఉంటుంది. ఇందులో ఫ్ర్రీజింగ్ పడ్డతి హీటింగ్ విధానాల ద్వారా ట్యూమర్ ను సహజంగా ఇచ్చే థెరపీ లానే ఉంటుంది.ఇది క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. దీనిని ఎబ్లేషణ్ అంటారు ఎబ్లేషణ్ కూడా క్యాన్సర్ స్టేజ్ ను బట్టి  ఇవాల్సి ఉంటుంది.కిడ్నీ సర్జర్రీ లేకుండా నే  ఎబ్లేషణ్ పద్దతి అమలు చేయవచ్చు.ఏది ఏమైనా ఎబ్లేషణ్ వల్ల తక్కువ లాభాలే వ్యక్తిగతంగా వివిధ స్తేజిలలో టి ఎల్ క్యు అర్ సి సి ఎస్ ట్యూమర్ లు ౩ నుండి 4 సెమీ కణి తలు ఉంటె యురోపియన్ గైడ్ లైన్స్ ప్రాకారం చికిత్చ ఫ్రీజింగ్ ఫ్రీజింగ్ వినియోగించవచ్చు. అంతార్జాతీయ పరిశోదనా సంస్థ బృందం వివిధ స్తేజిలలో ఉన్న వారిని పరీక్షించి ఆర్ సి సి ని ఫ్రీజింగ్ హీటింగ్ పద్దతిని 2౦౦ 4-2౦18 లో కేసులు సర్వ్ లెన్స్ ఎపిడ మాలజీ ద్వారా ఫలితం నషనల్  క్యాన్సర్ ఇన్స్టిట్యుట్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ట్యూమర్ లు ౩,4 సెమీ ఉంది రెండు మూడు గ్రూపు లతో సరిపోయాయి. ఇందులో 75 7 మందికి క్రియో బిలేషణ్ చికిత్చ చేయాగా ౩ 88 మందికి హీట్ ధర్మల్ ఎబ్లేషణ్ చికిత్చ్చ చేసినట్లు నిపుణులు పేర్కొన్నారు.72 సం వచ్చరాలు పై బడిన 4 22 మందికి హీట్ పద్ధతి ద్వారా 2౩8 మందికి ఫ్రీజింగ్ పద్ధతి ని అందించారు.కిడ్నీ క్యాన్సర్ కాక ఇతర అనారోగ్య సమస్యల వల్ల చనిపోయిన వారే ఎక్కువ.౩ నుండి 4 సెమీ ఉన్న వారికి క్రియోబిలేషణ్ 8.5 % క్రియో బిలేషణ్ ద్వారా 18.9 హీట్ పద్ధతి ద్వారా ఎబిలేషణ్ రెన్దొఇ కొన్ని కేసులలో వినియోగించినట్లు తెలిపారు.కిడ్నీ త్యుమర్లను నివారించేందుకు స్మాల్ ఎబిలేషణ్ చికిత్చ చేయవచ్చు అన్నది పరిశోదన సారాంశం.