తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీ పెట్టి టీఆర్ఎస్ బ్రాండ్ ఓన్ చేసుకుందామనుకున్న కవితకు ఆ పేరే  ఇప్పుడు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. టీఆర్ఎస్ పేరును కేటాయించవద్దని ఇప్పటికే బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.  అదలా ఉంటే.. మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న  తెలంగాణ రాష్ట్రసామాజిక సేన  టీఆర్ఎస్ పేరు తమ పార్టీకి కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతోంది. ఇక కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, కవిత పత్రికల్లో ఇచ్చిన ప్రకటనపై కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టీఆర్ఎస్ పేరును ఆమె పార్టీకి కేటాయించడంపై దాదాపు 600 నుంచి 700 వరకు  అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందాయి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే  టీఆర్ఎస్ పేరుతో నమోదైన మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాజ్య సమితి పేరుతో నమోదైన మరో రాజకీయ పార్టీ కూడా టీఆర్ఎస్ పేరును ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు కవిత ప్రతినిధుల బృందం కూడా ఈసీని కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. భారీ సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో కవిత పార్టీకి టీఆర్ఎస్ సెంటిమెంట్ దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పశ్చిమ బెంగాల్ లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతున్నది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో  ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.  ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.  తాజాగా  టీఎంసీ రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ చిక్ బారైక్  పార్టీకీ,  తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఒకే వారంలో  ముగ్గురు టీఎంసీకి గుడ్ బై చెప్పడం గమనార్హం.  వరుస రాజీనామాలతో పార్టీలో అసమ్మతి స్వరాలు బలపడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా  చిక్ బారైక్  రాజీనామాకు గల కారణాలేమిటన్నది తెలియాల్సి ఉంది.  అయితే పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తి కారణంగానే ఆయన రాజీనామా చేశారని అంటున్నారు.  
దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనా రికార్డులపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ప్రధాని మోడీ పాలనలో దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయని ఆరోపించింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు.   మోడీ  పాలనా మైలురాయి కేవలం  స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు. గత పన్నెండేళ్లుగా సాగుతున్న మోదీ పాలన దేశ ప్రగతికి, అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారిందని జైరాం రమేశ్ విమర్శించారు.  2024 ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా   మెజారిటీ రాలేదని గుర్తు చేసిన ఆయన,   సొంత బలం లేని ప్రభుత్వాన్ని నడుపుతూ చారిత్రక నాయకులతో పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాగా.. ఎన్‌సీపీ 27వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా  ముంబైలో జరిగిన కార్యక్రమంలో  శరద్ పవార్   మాట్లాడుతూ.. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనను తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అసమానమైన దేశ నిర్మాణ కృషితో ఏ మాత్రం పోల్చలేమన్నారు. 
ALSO ON TELUGUONE N E W S
    ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు గ్లామర్ ప్రపంచంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. కొందరు కేవలం ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్స్ అయిపోతే, మరికొందరు వరుస విజయాలు అందుకున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణని పొందలేకపోతుంటారు. సరిగ్గా ఇదే కోవకి చెందుతుంది టాలీవుడ్ ముద్దుగుమ్మ శాన్వి మేఘన.  1998 సెప్టెంబరు 12న హైదరాబాద్‌లో జన్మించిన ఈ అందాల భామ తన సినీ ప్రయాణాన్ని 2019లో మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం "సైరా నరసింహారెడ్డి"తో స్టార్ట్ చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీలో శాన్వి ప్రాధాన్యత గల రోల్ నే పోషించింది. అదే సంవత్సరంలో "బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్" చిత్రంలోనూ , ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన మొదటి తెలుగు ఆంథాలజీ సిరీస్ "పిట్ట కథలు" (2021) లోని 'రాముల' సెగ్మెంట్‌లో అద్భుతమైన నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆపై అఖిల్ అక్కినేని హిట్ చిత్రం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్" లో కేమియో రోల్ చేయడమే కాకుండా, ఆనంద్ దేవరకొండ సరసన "పుష్పక విమానం" లో షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ రేఖగా చేసి నటించి ఆడియెన్స్‌ని  కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రంలోని ఆమె కామెడీ టైమింగ్, నటన ప్రేక్షకులని  ఎంతగానో ఆకట్టుకున్నాయి.  రీసెంట్‌గా వచ్చిన ఫాంటసీ రైడ్ "టుక్ టుక్" వంటి చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా, కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టి 2025లో విడుదలైన తమిళ కామెడీ డ్రామా "కుడుంబస్థాన్" లో వెన్నెల పాత్రలో మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 25 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాతో తమిళంలోనూ క్రేజీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఆమె కెరీర్‌లో చేసిన 100 శాతం ప్రాజెక్టులు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. సినిమా హిట్టైనా, ఆ విజయాల్లో తను కూడా ఒక ముఖ్యమైన భాగమైనా, ప్రేక్షకుల్లో మాత్రం ఇంకా సరైన గుర్తింపు రావడం లేదనే చెప్పాలి. Also read: Allu Arjun: పవన్ కళ్యాణ్‌ని కలిసిన అల్లు అర్జున్.. సీక్రెట్ మీటింగ్ వెనుక అసలు కథ ఇదేనా? సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, తన గ్లామరస్ ఫోటోషూట్లతో నెటిజన్ల మతిపోగొడుతున్న ఈ హైదరాబాద్ బ్యూటీపై ప్రేక్షకులకి ఎప్పుడు దయ కలుగుతుందో చూడాలి. శాన్వి అచ్చ తెలుగు తెలంగాణ అమ్మాయి.      
Varalaxmi Sarathkumar has reacted indirectly after facing allegations from the director of her upcoming film Police Complaint. The controversy began after director Sanjeev Megoti claimed that the actress was not cooperative during the film’s promotional activities and alleged that she did not actively participate despite repeated requests from the team. The comments created discussion around the project ahead of its release. While Varalaxmi had earlier maintained that she attended every event she was invited to and fulfilled her commitments, she has now shared what many see as a cryptic and no nonsense response.  Taking to Instagram Stories, the actress posted a cryptic message that read: “Barking dogs seldom bite. I don’t bark. I bite..” Though she did not mention anyone directly, the timing of the post has led many to interpret it as her response to the allegations. The post has since gone viral across social media and added fresh attention to Police Complaint ahead of release.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయాలు సాధిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కానీ నాణేనికి మరోవైపు ఉన్నట్లు.. ఈ భారీ విజయాల వెనుక నిర్మాతలు మోస్తున్న బడ్జెట్ భారం టాలీవుడ్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తోంది. 'పాన్ ఇండియా' ట్రెండ్ పేరుతో ప్రతి సినిమాకు వందల కోట్లు కుమ్మరించడం ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక పెద్ద సవాల్‌గా మారింది. విజువల్ వండర్స్, భారీ సెట్స్, వీఎఫ్ఎక్స్ హంగుల కోసం పెడుతున్న ఖర్చు నిర్మాతలకు తడిసి మోపెడవుతోంది. ఒకప్పుడు ఏడెనిమిది నెలల్లో పూర్తయ్యే సినిమాలు, ఇప్పుడు రెండేళ్ల నుంచి మూడేళ్ల పాటు సాగుతున్నాయి. షూటింగ్ ఆలస్యమయ్యే కొద్దీ ప్రొడక్షన్ కాస్ట్ పెరగడంతో పాటు వడ్డీల భారం కూడా ఎక్కువవుతోంది. దీనికి తోడు సినిమా బడ్జెట్‌లో సగానికి పైగా వాటా కేవలం హీరో, దర్శకుడి రెమ్యునరేషన్లకే సరిపోతుండటం గమనార్హం. కొందరు స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు భారీ పారితోషికాలు డిమాండ్ చేస్తుండటంతో స్టార్స్ చిత్రాల బడ్జెట్ ఏకంగా రూ. 300 కోట్ల నుంచి రూ. 500 కోట్లకు చేరుకుంటోంది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే.. మార్కెట్ లేని, కనీసం వంద కోట్ల వసూళ్ల ట్రాక్ రికార్డ్ లేని యంగ్ హీరోల సినిమాలకు కూడా వందల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు. క్రేజ్ లేని సినిమాలపై ఇంత భారీగా పెట్టుబడి పెట్టడం నిర్మాతలకు కోలుకోలేని దెబ్బగా మారుతోంది. మరోవైపు ఓటీటీ బిజినెస్ కూడా మునుపటిలా సులువుగా సాగడం లేదు. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఆశించిన స్థాయిలో అమ్ముడుపోకపోతే థియేట్రికల్ రిలీజ్ చేయడం కూడా గగనమైపోతోంది. ప్రస్తుతం భారీ అంచనాలతో వస్తున్న పలు క్రేజీ ప్రాజెక్టులు కూడా ఈ విధమైన బిజినెస్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇలా పెరిగిపోయిన బడ్జెట్‌ను రికవరీ చేయడానికి మేకర్స్ థియేటర్లలో టికెట్ల రేట్ల పెంపుపై ఆధారపడుతున్నారు. కానీ ఈ నిర్ణయం కాస్త రివర్స్ కొడుతోంది. టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకపోవడంతో, ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి వెనకాడుతున్నారు. ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలు కళ్ళు తెరిచి బడ్జెట్లను అదుపులో పెట్టుకోకపోతే, భవిష్యత్తులో టాలీవుడ్ మరిన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో అయినా కథకు తగ్గ బడ్జెట్‌తో సినిమాలు ప్లాన్ చేస్తారేమో చూడాలి.
Kiran Abbavaram is set to make his directorial debut in a new film produced by Joy Films. Alongside directing, Abbavaram has written the story and screenplay and will star in the lead role. This upcoming project also serves as the first production venture for overseas film distributor Sudhakar Chaganti under his newly launched banner. The untitled movie is described as a family entertainer and is reported to be the highest-budget project of Abbavaram’s career so far. The actor previously showcased his writing background with the film SR Kalyanamandapam. He is currently awaiting the release of Chennai Love Story, following his recent appearances in Ka and K-Ramp. A formal launch ceremony for the film is scheduled to take place tomorrow. The production team has indicated that the movie will feature several recognized actors and technicians, with complete details about the cast and crew expected to be announced shortly.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. తెలుగు సినీ పరిశ్రమకి దొరికిన అరుదైన హీరోలు.. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఇద్దరి సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వర్షంతో తడిసి ముద్దవుతుంది. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో ఇప్పుడు ఒక వార్త  హల్‌చల్ చేస్తోంది.  పవన్ కల్యాణ్‌కి ఇటీవల ఒక సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సర్జరీ తర్వాత డాక్టర్లు ఆయనకి దాదాపు 7 రోజుల పాటు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని సూచించారు. వైద్యుల సలహా మేరకు గత కొన్ని రోజులుగా తన ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్, ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్నారు. చాలా ముఖ్యమైన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఉంటే తప్పితే  బయటకు రావడం లేదు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి, ఆయనని  స్వయంగా పరామర్శించడానికి అల్లు అర్జున్ నిన్న రాత్రి పవన్ నివాసానికి వెళ్లారు. అక్కడ పవన్ హెల్త్ కండిషన్‌తో పాటు పలు వ్యక్తిగత, ఫ్యామిలీ విషయాల గురించి కూడా వీరిద్దరూ దాదాపు గంటకు పైగా సుదీర్ఘంగా చర్చించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. Also read: Peddi: ఓటిటి డేట్ పై ఇంట్రెస్టింగ్ బజ్.. ఫస్ట్ వీక్ రికార్డు కలెక్షన్స్   సాధారణంగా అల్లు అర్జున్ చేసే ప్రతి చిన్న పనిలోను  లేదా పర్యటనలోనూ భారీగా పబ్లిసిటీ కనిపిస్తుంది. కానీ ఈసారి పవన్  ఇంటికి బన్నీ అత్యంత సీక్రెట్‌గా, ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లారు. అలా వెళ్లడం వెనుక ఒక బలమైన వ్యూహం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ పరామర్శని  కేవలం ఒక కుటుంబ సభ్యుడిగా మాత్రమే ఉంచాలని, దీనికి ఎలాంటి రాజకీయ రంగు, పబ్లిసిటీ స్టంట్ అనే ముద్ర పడకూడదని బన్నీ భావించారట. అందుకే ఈ మీటింగ్‌కి   సంబంధించిన ఎలాంటి ఫొటోలు గానీ, కనీసం ఒక్క వీడియో క్లిప్ కూడా బయటకి రాలేదు. గతంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన ఒక ప్రమాదం నుండి కోలుకున్నప్పుడు కూడా బన్నీ ఇలాగే పరామర్శించారు. ఈ కలయిక మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య ఉన్న విభేదాలకి  100 శాతం ఎండ్ కార్డ్ పడినట్లే అని  ఇరువర్గాల పెద్దలు ఆశిస్తున్నారు.     
  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కట్ అవుట్ కి ఉన్న చరిష్మాని మరోసారి నిరూపిస్తు పెద్ది(Peddi)రికార్డుల కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.  జూన్ 4 న థియేటర్స్ లోకి అడుగుపెట్టిన పెద్ది ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి వారానికి 345 కోట్లకి పైగా గ్రాస్ తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ స్టేటస్ సాధించాలంటే 400 కోట్ల నుండి 425 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లని లేదా  220 కోట్ల నెట్ వసూళ్లని పెద్ది రాబట్టాల్సి ఉంటుంది. మరి  ప్రస్తుత రన్‌  చూస్తుంటే, అతి త్వరలోనే ఆ మైలురాయిని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. పెద్ది ఓటీటీ హక్కులని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకుంది. అన్ని దక్షిణ భారత భాషలతో పాటు హిందీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ. 105 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించినట్లు సమాచారం. ఈ సినిమా జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల అంచనా. అయితే, బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ కొనసాగితే, థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాతే అధికారిక స్ట్రీమింగ్ తేదీని ప్రకటిస్తారు. ఓటిటి ప్రేమికులకి గుడ్ న్యూస్ ఏంటంటే కట్ చేసిన సన్నివేశాలు కూడా పెద్దిలో ఉందనున్నట్టుగా టాక్.  Also read: శ్మశానంలో 6 అడుగులే నా ఆస్తి.. ప్రముఖ హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్   
టాలీవుడ్‌లో విలక్షణ నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదం నడుస్తోంది. సాధారణంగా సినిమా ప్రమోషన్లలో యాక్టివ్‌గా ఉండే ఆమెపై ఇటీవల ఒక దర్శకుడు సంచలన ఆరోపణలు చేశారు. "పోలీస్ కంప్లైంట్" (Police Complaint) అనే సినిమాకు సంబంధించి వరలక్ష్మి పూర్తిగా డబ్బులు తీసుకుని కూడా, మూవీ ప్రమోషన్స్‌కు హాజరు కాలేదంటూ ఆ చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి మీడియా ముందుకు వచ్చి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం రెమ్యూనరేషన్ తీసుకున్న తర్వాత ప్రమోషన్లకు రాకపోవడం వల్ల సినిమాకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆయన ఆరోపించారు. ఈ వివాదం టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దర్శకుడు చేసిన ఈ ఆరోపణలపై వరలక్ష్మి శరత్ కుమార్ ఎలా స్పందిస్తారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఈ క్రమంలోనే ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ ఒక్కసారిగా సెన్సేషన్‌గా మారింది. నేరుగా ఎవరి పేరు ఎత్తకపోయినప్పటికీ, తనపై వస్తున్న ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చేలా ఆమె పెట్టిన స్టేటస్ అందరి దృష్టిని ఆకర్షించింది. 'మొరిగే కుక్కలు కరవవు.. కరిచే కుక్కలు మొరగవు.. నేను మొరగను... కరుస్తా..' అంటూ చాలా పవర్‌ఫుల్ కోట్‌తో ఆమె ఒక పోస్ట్ పెట్టారు. ఈ వ్యాఖ్యలు నేరుగా తనపై పోలీస్ కంప్లైంట్ మూవీ టీం చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌గానే పెట్టారంటూ నెటిజన్లు భావిస్తున్నారు. ఆమెలోని ఫైర్‌ను చూపిస్తూ పెట్టిన ఈ పోస్ట్ క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఇన్ స్టాలో ఈ సంచలన పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే వరలక్ష్మి శరత్ కుమార్ దానిని తన ప్రొఫైల్ నుండి డిలీట్ చేసేశారు. ఆమె ఈ పోస్ట్‌ను ఎందుకు డిలీట్ చేశారనే దానిపై ఇప్పుడు రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తీవ్రమైన ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత అనవసరమైన వివాదాలు ఎందుకని తొలగించారా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే చర్చ నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, ఆమె పోస్ట్ డిలీట్ చేయడానికి ముందే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయిపోయాయి. మూవీ టీమ్ చేసిన వ్యాఖ్యలకు, వరలక్ష్మి ఇచ్చిన ఈ ఘాటు సమాధానం టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.  
 'బ్రహ్మముడి' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు తమిళ నటి దీపిక రంగరాజు. ఆ సీరియల్‌లో పోషించిన 'కావ్య' క్యారక్టర్ తో ప్రతి ఇంటికీ ఇలాంటి కూతురు లేదా కోడలు ఉంటే బాగుండు అనేంతలా పాపులారిటీ తెచ్చుకుంది. తెరపై ఎంతో హుందాగా, ఆనందంగా కనిపించే ఈ సెలబ్రిటీల నిజ జీవితాలు పైకి కనిపించేంత అందంగా ఉండవనేది చేదు నిజం. తాజాగా గ్లామర్ ప్రపంచం వెనుక ఉన్న తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలు, తనకున్న ఒకే ఒక్క చివరి కోరిక గురించి దీపిక రంగరాజు ఒక ఇంటర్వ్యూలో చెప్పి  తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్  వైరల్ అవుతున్నాయి.  ఆమె మాట్లాడుతు ప్రస్తుతం టాప్ రేటింగ్‌లో ఉన్న సీరియల్ లీడ్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నప్పటికీ, నాకు చెన్నై నగరంలో కనీసం సొంత ఇల్లు కూడా లేదని చెప్పుకొచ్చింది. దీంతో  'మీరు ఇన్నేళ్లుగా నటిస్తున్నారు కదా, మరి సొంత ఇల్లు ఎందుకు లేదు?" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉంది. ఈ ప్రపంచంలో మనం జన్మించినప్పుడే భగవంతుడు లేదా ప్రభుత్వం మనకంటూ ఒక స్థలాన్ని ఖచ్చితంగా కేటాయించి ఉంటుంది. అది మరేదో కాదు మనం చనిపోయిన తర్వాత స్మశానవాటికలో లభించే ఆ ఆరు అడుగుల నేల మాత్రమే. మనిషి బ్రతికున్నంత కాలం ఎన్ని కలలు కన్నా, చివరికి శాశ్వతంగా మనకంటూ మిగిలేది ఆ ఆరడుగుల స్థలం మాత్రమే. Also read: Governor: 50 రూపాయలకే బాల్కనీ టికెట్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన మేకర్స్  నేను ఇండస్ట్రీలో కోట్లకు కోట్లు సంపాదించడం లేదు. కేవలం వేలు, లక్షల్లో మాత్రమే పారితోషికం అందుకుంటున్నాను. ఒక 10 సంవత్సరాల క్రితం ఇప్పుడు సంపాదిస్తున్న రేంజ్‌లో సంపాదించి ఉంటే చెన్నైలో సొంత ఇల్లు కొనేదానినని, కానీ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల సాధారణ మధ్యతరగతి స్థాయి నుండి వచ్చిన నేను అంత బడ్జెట్ భరించలేకపోతున్నాను. ప్రస్తుతం చేతి నిండా సంపాదన ఉన్నా, ఒకసారి పెద్ద మాల్‌కి వెళ్లి షాపింగ్ చేసినా, కొద్దిగా బంగారం కొనుగోలు చేసినా  బ్యాంక్ బ్యాలెన్స్ 'జీరో' అయిపోతుంది. డబ్బు కంటే మనుషులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. పేర్కొన్నారు. జీవితంలో ఎన్ని లక్షలు ఉన్నా ఖర్చు పెడితే కరిగిపోతాయి. కానీ మనకు ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఏదైనా బాధను పంచుకోవాలనుకున్నప్పుడు తోడుగా నిలబడేందుకు మనుషులు మాత్రమే కావాలని నమ్ముతానని చెప్పారు.     
డిజిటల్ వినోద ప్రపంచంలో సరికొత్త రికార్డులు సృష్టించిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'. సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడిగా నటిస్తూనే, తెరవెనుక దేశాన్ని కాపాడే సీక్రెట్ ఏజెంట్‌గా శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ పండించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా ఈ మోస్ట్ అవేటెడ్ సిరీస్ తదుపరి భాగం 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 4' కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. గత సీజన్ (సీజన్ 3) ముగింపులో మేకర్స్ వదిలిన క్లిఫ్‌హ్యాంగర్ ట్విస్టులు చూసి ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. కథ మధ్యలోనే ఆగిపోవడంతో, అసలు తర్వాత ఏం జరగబోతోంది? శ్రీకాంత్ తివారీ పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేశారు. వీటన్నింటికీ స్వయంగా కథానాయకుడు మనోజ్ బాజ్‌పాయ్ సోషల్ మీడియా వేదికగా సమాధానమిస్తూ సీజన్ 4ను అధికారికంగా ఖరారు చేశారు. ట్విట్టర్ (X) వేదికగా అభిమానులతో ముచ్చటించిన మనోజ్.. మూడో సీజన్‌ ముగింపుపై తికమకపడుతున్న ఒక నెటిజన్‌కు రిప్లై ఇస్తూ, "మీ ప్రశ్నలన్నింటికీ నాల్గవ సీజన్‌లో సమాధానం దొరుకుతుంది, త్వరలోనే కలుద్దాం" అంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈసారి సరికొత్త సీజన్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ 'మార్ కాట్ కల్లాస్' (భీభత్సమైన యాక్షన్) రేంజ్‌లో ఉండబోతున్నాయని హింట్ ఇచ్చి సిరీస్‌పై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చారు. సౌత్ ఇండియన్ టాలెంటెడ్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే (రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే) సృష్టించిన ఈ వెబ్ సిరీస్ యూనివర్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్‌తో పాటు టాలీవుడ్ సీనియర్ నటి ప్రియమణి, శారీబ్ హష్మీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గత సీజన్లలో సమంత, జయదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్ వంటి స్టార్స్ ఎంట్రీ ఇచ్చి సిరీస్ రేంజ్‌ను మరింత పెంచేశారు. ప్రస్తుతం ఈ నాల్గవ సీజన్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో దర్శకులు రాజ్ అండ్ డీకే స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేస్తున్నారట. ఈ భారీ సిరీస్ షూటింగ్ మరియు గ్రాఫిక్స్ పనుల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉందని, వచ్చే ఏడాది నాటికి ఇది ప్రేక్షకుల ముందుకు రావచ్చని భావిస్తున్నారు. మనోజ్ బాజ్‌పాయ్ ఇచ్చిన ఈ క్రేజీ అప్‌డేట్‌తో నెట్టింట 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 4' హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. శ్రీకాంత్ తివారీగా మనోజ్ యాక్షన్‌ను, జేకే కామెడీ టైమింగ్‌ను మిస్ అవుతున్నామని, త్వరగా కొత్త సీజన్‌ను స్ట్రీమింగ్‌లోకి తీసుకురావాలని ఓటిటి ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ వెబ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచిన 'ది ఫ్యామిలీ మ్యాన్'.. ఈ నాల్గవ సీజన్‌తో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో చూడాలి. శ్రీకాంత్ తివారీ ఫ్యామిలీ డ్రామా మరియు హై-వోల్టేజ్ దేశభక్తి యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న 'ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్' అధినేత అనిల్ సుంకర మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. గతంలో కొన్ని భారీ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో కొంత కాలం పాటు ఈ నిర్మాణ సంస్థ స్లో అయింది. అయితే ఆ చేదు జ్ఞాపకాలను వెనక్కి నెట్టేస్తూ, సరికొత్త ఉత్సాహంతో, భారీ ప్రణాళికలతో టాలీవుడ్‌లో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు అనిల్ సుంకర సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఒకేసారి మూడు సరికొత్త ప్రాజెక్టులను ప్రకటించడానికి రంగం సిద్ధం చేశారు. విభిన్నమైన కథాంశాలతో, కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న స్క్రిప్ట్‌లను ఆయన ఇప్పటికే లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు సినిమాలు కూడా వేర్వేరు జానర్లలో వైవిధ్యంగా ఉండబోతున్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ కొత్త ప్రాజెక్టుల కోసం టాలీవుడ్‌లోని క్రేజీ హీరోలతో పాటు టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్లను అనిల్ సుంకర లైన్ లో పెట్టినట్లు వినికిడి. గతంలో మాస్, యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యానర్.. ఇప్పుడు కూడా అదే పంథాలో భారీ బడ్జెట్‌తో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను నిర్మించనుంది. ఈ మూడు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలోనే వరుసగా రానున్నాయని సమాచారం. గతంలో మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన అనిల్ సుంకర, ఆ తర్వాత అఖిల్ అక్కినేనితో 'ఏజెంట్', మెగాస్టార్ చిరంజీవితో 'భోళా శంకర్' వంటి భారీ చిత్రాలను నిర్మించారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చాయి. దీంతో ఆయన కొంతకాలం విరామం తీసుకుని, కథల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇటీవల కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు సరికొత్త రియాలిటీ షోలను కూడా ప్లాన్ చేశారు. అనిల్ సుంకర లాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ మళ్లీ వరుస చిత్రాలతో యాక్టివ్ కావడం పట్ల టాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు సినిమా లవర్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ కమ్‌బ్యాక్ ప్రాజెక్టులపై నెటిజన్లు ఆసక్తికరంగా చర్చిస్తున్నారు. ఈ సారి అనిల్ సుంకర ఖచ్చితంగా గట్టి హిట్లతో బౌన్స్ బ్యాక్ అవుతారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు ప్రతిష్టాత్మక చిత్రాలకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నుంచి రాబోయే ఈ క్రేజీ అప్‌డేట్స్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అనిల్ సుంకర ఈ కొత్త ఇన్నింగ్స్‌తో ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా అపురూపమైనది.  భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా ఉంటూ,  ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ బంధం బాగుటుంది.  అయితే ఈ బంధంలో చాలామంది భర్తలు తమ భార్యకు ఎంతో ప్రేమను పంచుతున్నామని, ఎంతో బాగా చూసుకుంటున్నామని అంటూ ఉంటారు.  కానీ ఇది చాలా తప్పు. కేవలం ప్రేమతో మనిషి సంతోషంగా ఉండటం అనేది జరగదు. గిఫ్ట్ లు,  గోల్డ్,  చీరలు.. ఇవన్నీ కొనిపెట్టడం మీద మహిళల సంతోషం ఆధారపడి ఉండదు.  చాలామంది పెద్ద గొడవలు ఏమీ జరగడం లేదు కాబట్టి ఆ బంధంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారని అనుకుంటారు.  కానీ అది నిజం కాదు.. కొన్ని చిన్న చిన్్న అలవాట్లు, కొన్ని చిన్న చిన్న విషయాలు బంధాన్ని బహీనంగా మారుస్తాయి.  మహిళలు ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము ఎక్కువగా బాధపడే కొన్ని విషయాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. ఇతర మహిళల పై ఎక్కువ శ్రద్ద చూపడం.. మగాడు తన భాగస్వామితో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇతర స్త్రీల వైపు చూడటం లేదా వారిపై ఎక్కువ శ్రద్ధ చూపడం వంటివి చేస్తే. ఆతనితో బంధంలో ఉన్న  స్త్రీ అభద్రతా భావానికి లోనై, నిర్లక్ష్యానికి గురైనట్లు భావించబడుతుంది. ఇతర స్త్రీల వైపు చూసే మగాడు తన భార్యను అవమానించినట్టు. కేవలం అవమానం మాత్రమే కాదు.. ఆమె గౌరవాన్ని కూడా దెబ్బతీసినట్టే. అసలు జీవితంలో ఆమెకు ప్రాధాన్యత  ఇవ్వనట్టు. ప్రత్యేక సందర్బాలు మరచిపోవడం.. చాలామంది మగాళ్లకు పెళ్లిరోజు తేదీలు కూడా గుర్తుండవు అని తరచుగా అంటుంటారు.  ఇది బయటకు తమాషాగా,  సరదాగా మాట్లాడే విషయం అయినా.. మహిళలకు ఇవి ఎంతగానో బాధపెడతాయి. మొదటిసారి కలుసుకున్న రోజు,  భాగస్వామి పుట్టినరోజు,  మ్యారేజ్ డే వంటి ముఖ్యమైన తేదీలు, సందర్భాలు వంటివి గుర్తుంచుకోకపోతే మహిళలు చాలా బాధపడతారు. ఎక్కువగా ఆలోచించవద్దని చెప్పడం.. మహిళలు  ఆందోళనలను లేదా సమస్యలను తన  భర్తతో షేర్ చేసుకున్నప్పుడు,  దానికి పరిష్కారం చెప్పకపోయినా కనీసం అర్థం చేసుకుంటే చాలని,  ఎంతో ఊరటగా ఫీల్ అవుతుంది. కానీ మహిళలు తమ భయాలు, ఆందోళనలు షేర్ చేసుకున్నప్పుడు , అంతగా ఆలోచించకు అని చెప్పడం వల్ల ఆమె తన మాటలను పట్టించుకోవడం లేదని ఫీలవుతుంది. భార్య కంటే స్నేహితులు, బయటివారి మాటకే విలువ ఇవ్వడం.. ప్రతి మగాడి జీవితంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కానీ ప్రతి మగాడు తన నిర్ణయాలలో ఎల్లప్పుడూ స్నేహితుల అభిప్రాయాలకే ప్రాధాన్యతనిస్తూ, భార్య చెప్పే విషయాలను, భార్య ఫీలింగ్స్ ను విస్మరిస్తే అది ఆ సంబంధంలో దూరాన్ని సృష్టిస్తుంది. అంతే కాదు.. బయటి వాళ్ల మాటలతో భార్యను చిన్నతనంగా మాట్లాడటం,  భార్యకు విలువ ఇవ్వకపోవడం కూడా బంధాన్ని బలహీనపరుస్తుంది. మద్దతు ఇవ్వకపోవడం.. ఎన్నో ఏళ్లు కని పెంచిన తల్లిదండ్రులను వదిలి ప్రతి ఆడపిల్ల  భర్త వెంట అత్తింటికి వెళుతుంది. కానీ చాలామంది మహిళలు అత్తింట్లో, భర్త వైపు కుటుంబ సభ్యుల నుండి అవమానం ఎదుర్కొంటూ ఉంటారు.  భార్యను ఏదైనా మాటలు అన్నా,  భార్యను చిన్నతనంగా చూసినా ఆమెకు మద్దతు ఇచ్చి మాట్లాడాల్సింది పోయి,  వాళ్లతో కలిసి భార్యను నిందించడం చేస్తుంటారు.  ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది.  మహిళలు చాలా భాధపడతారు. ఒంటరితనం.. ప్రతి ఒక్కరూ తమ సంబంధాలలో , కుటుంబంలో తమకు విలువ ఉండాలని కోరుకుంటారు. ప్రతి మహిళ తన మాటకు, తన అభిప్రాయానికి,  తనకు ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటారు.  ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా కేవలం వివాహ బంధంతో ఇంటికి తెచ్చుకున్న ఒక వ్యక్తిలాగా ఆమెను ట్రీట్ చేస్తే ఆమె మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. ఇతరులతో పోల్చడం.. చాలామంది మగవారు తమ భార్యలను ఇతరులతో పోల్చుతారు.  అమ్మలా వంట చేయలేవు, అక్కలాగా పని చేయలేవు,  ఇలాంటివి మాత్రమే కాకుండా.. శారీరకంగా, ఇతర విషయాలలోనూ ఇతరులతో పోల్చి మాట్లాడటం వల్ల మహిళలు చాలా బాధపడతారు.  ప్రతి మనిషిని మనిషిగా చూడాలి,  వారిలో ప్లస్ పాయింట్స్ ను ఎలా స్వీకరిస్తారో అలాగే మైనస్ ను స్వీకరించాలి. పోల్చడం వల్ల మహిళల ఆత్మగౌరవం దెబ్బతింటుంది.                                    *రూపశ్రీ.
ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి. కానీ భార్యాభర్తల మధ్య కేవలం గొడవలు మాత్రమే ఎక్కువ ఉండి,  ఇద్దరి మధ్య సరైన అవగాహన,  పరస్పర గౌరవం వంటివి లేకపోతే.. ఆ బంధం చాలా పెళుసుగా మారిపోయే అవకాశం ఉంటుంది.  గొడవలు అలకలు ఇద్దరి మద్య బంధాన్ని ఎంత బలం చేస్తాయో.. అవి ఎక్కువైతే ఇద్దరిని అవే విడదీస్తాయి కూడా. నేటికాలంలో చాలామంది తమ బంధం గురించి ఆలోచించి బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికోసం ఒక మంచి మార్గం ఉంది. అదే  రిలేషన్షిప్ డిటాక్స్.. శరీరాన్ని డిటాక్స్ చేసుకోవడం కోసం చాలా  మంది డిటాక్స్ డ్రింకులు తాగుతూ ఉంటారు.  దీనివల్ల శరీరంలో విషపదార్థాలు బయటకు వెళ్లిపోయి శరీరం శుభ్రం అవుతుంది. అదేవిధంగా.. రిలేషన్షిప్ ను డిటాక్స్ చేసుకుంటే.. బంధంలో ఉన్న అనవసర గొడవలు,  ఇబ్బందులు,  అపార్థాలు అన్నీ మంత్రమేసినట్టు మాయమవుతాయి. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. భాగస్వామిని బాధపెట్టకుండా బంధాన్ని డిటాక్స్ చేసుకోవాలంటే.. భాగస్వామితో మాట్లాడాలి..  రిలేషన్ షిప్ డిటాక్స్ చేయించుకోవాలనుకుంటే, ముందుగా  భాగస్వామితో మాట్లాడాలి. ఎందుకు రిలేషన్షిప్ డిటాక్స్ చేయించుకోవాలని అనుకుంటున్నారో వివరించాలి.ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించాలి. సమస్యలకు కారణమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. భాగస్వామి పైవన్నీ అర్థం చేసుకుంటే.. రిలేషన్షిప్ డిటాక్స్ చేయించుకోవడం సులువు అవుతుంది. దృష్టి.. ప్రతి ఒక్కరు తమపై తాము  దృష్టి పెట్టాలి. ఇది  మానసిక,  భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తమపై తాము దృష్టి పెట్టినప్పుడు, తమ  బలాలు,  బలహీనతలను బాగా అర్థం చేసుకోగలుగుతారు.  ఇవి భవిష్యత్తులో సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో సహాయపడతాయి. సమయం.. నేటికాలంలో ప్రతి ఒక్కరు  నిరంతరం ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. ముఖ్యంగా ఎప్పుడూ  ఫోన్‌లో ఉండటం వల్ల తమకు తాము సమయం కేటాయించుకోలేకపోతారు. తమకు తాము సమయం కేటాయించుకోనప్పుడు అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. బంధాన్ని డిటాక్స్ చేసుకోవాలంటే.. సమయం కేటాయించాలి.  ఫోన్ కు దూరంగా ఉండాలి. బందం గురించి ఆలోచించాలి.  అలాంటప్పుడు అలోచనలు కూడా సరిగ్గా పనిచేస్తాయి. దూరం.. రిలేషన్షిప్ డిటాక్స్ అంటే.. బంధం నుండి విడిపోవడానికి ప్రయత్నించడం కాదు.. బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం.  బంధంలో గొడవలు, అపార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు.. భాగస్వామికి కొన్నాళ్లు దూరంగా ఉండి అన్నీ ఆలోచించుకోవడం వల్ల అన్ని విషయాలు క్షుణ్ణంగా అర్థం అవుతాయి. అప్పుడు బంధాన్ని నిలబెట్టుకోవడానికి మార్గాలు కనిపిస్తాయి. బంధం ఎంత ముఖ్యమైనదో కూడా అర్థమవుతుంది.                                        *రూపశ్రీ.
ప్రతి వ్యక్తికి నేటికాలంలో ఇల్లు, ఆఫీసు అంటూ రెండు ప్రదేశాలు ముఖ్యంగా మారాయి.  ఒకటి కుటుంబ సభ్యులతో కలసి ఉండేది అయితే రెండవది కుటుంబ సభ్యులను పోషించడానికి మరొక ప్రదేశంలో విభిన్న వ్యక్తులతో కలిసి పనిచేసే స్థలం. చాలామంది ఆఫీసులో ఒత్తిడి ఎదుర్కుంటున్నామని చెబుతూ ఉంటారు. ఆఫీసులో గనుక పని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని చిన్న చిన్న మార్పులు, చిట్కాలతో ఒత్తిడి నుండి బయట పడవచ్చు. ఇవి నేరుగా ఆఫీసుకు వెళ్లి పని చేసే వారికి అయినా,  లేక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి అయినా చాలా చక్కగా పని చేస్తాయి.  అవేంటో తెలుసుకుంటే.. పనుల జాబితా.. ఈ చిట్కా ఖచ్చితంగా  సహాయపడుతుంది. ఉదయాన్నే డైరీలో రోజు పనులను రాసుకోవాలి. పైన తేలికైన పనులను,  దిగువన ఎక్కువ సమయం,  శ్రద్ధ అవసరమయ్యే పనులను లిస్ట్  చేయాలి. ఇది  మనస్సు గందరగోళం లేకుండా క్లారిటీగా  ఉంచడానికి సహాయపడుతుంది.  రోజులో ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి.. వాటిని ఎప్పుడు చేయాలో అనుకుంటూ  అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది. బ్రేక్ ముఖ్యం..  ఎంత పని ఉన్నా సరే.. గంటల తరబడి కూర్చుని పని చేయడం తప్పు. ప్రతి 25-30 నిమిషాల పని తర్వాత 5 నిమిషాల విరామం తీసుకోవాలి. నీరు త్రాగడం,  కళ్ళు మూసుకోవడం  లేదా కొద్దిగా శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం.. ఇవన్నీ  మనసు అలసిపోకుండా  విశ్రాంతిని ఇస్తాయి.   ఒత్తిడిని తగ్గిస్తాయి. నో చెప్పడం నేర్చుకోండి.. ఇది అతి ముఖ్యమైన చిట్కా ఏమిటంటే.. ప్రతి పనినీ, మీటింగ్‌నీ లేదా పనిని.. ఇట్లా ఏదైనా సరే.. ఆఫీసులో  అదనపు బాధ్యతను ఎప్పుడూ తీసుకోకూడదు. చాలా మంది కాస్త మంచిగా మాట్లాడుతూ,  కాస్త పొగుడుతూ ఏదైనా పని చేసిపెట్టమని అడుగుతూ ఉంటారు.  అలాంటి సందర్భాలలో  మర్యాదగా తిరస్కరించాలి.  ఇది  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే అదనపు పని భారం ఒత్తిడికి దారి తీస్తుంది.  ప్రతి ఒక్కరూ నో చెప్పడం నేర్చుకోవాలి. ఇది ఎంతో సహాయపడుతుంది. శారీరక శ్రమ..  పనిలో బిజీగా ఉన్నప్పటికీ, ప్రతిరోజూ 15-30 నిమిషాలు నడవడం, యోగా చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది సహజ ఒత్తిడిని తగ్గించే మార్గం.  ఒత్తిడి హార్మోన్లు వ్యాయామం వల్ల తగ్గుతాయి. వ్యాయమం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది  ఫిట్‌గా ఉంచుతుంది. డెస్క్ దగ్గరే కూర్చుని చేయగల యోగా భంగిమలు కొన్ని ఉంటాయి.  అలాంటివి చేసినా బాగుంటుంది.                          *రూపశ్రీ.
నేటి కాలంలో నిమ్మరసం ఎంతో ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి . శరీరాన్ని చల్లబరచడం నుండి డీహైడ్రేషన్‌ను నివారించడం వరకు నిమ్మరసం ప్రయోజనాలు చాలా ఉన్నాయి. నిమ్మకాయతో చాలామంది చేసుకునే రిఫ్రెష్ డ్రింక్ లలో లెమన్ షర్బత్ ఏ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అయితే  దాని రుచి కోసం అధిక మొత్తంలో చక్కెరను కలుపుతారు. ఈ అలవాటు ఆరోగ్యకరమైన నిమ్మరసం   ప్రయోజనాలను నాశనం చేస్తుంది.  ఏదో అప్పుడప్పుడు  నిమ్మరసం తాగే వారైతే పర్లేదు. కానీ రోజు లెమన్ షర్బత్ తాగేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.  అధికంగా చక్కెర కలపడం  ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నిమ్మరసం.. భారతీయ ఇళ్లలో ఎన్నో సంవత్సరాల నుండి ఇంటికి వచ్చిన అతిథులకు నిమ్మరసం నీటిని ఇవ్వడం జరుగుతోంది. సాధారణంగా కొందరు నిమ్మరసం తయారీలో తరచుగా నల్ల ఉప్పు, రాతి ఉప్పు లేదా వేయించిన జీలకర్ర పోసి కలుపుతారు. ఇది శరీరానికి తేమను అందించి, అవసరమైన ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడానికి సహాయపడుతుంది. ఈ డ్రింక్ ముఖ్యంగా వేడి,  తేమతో కూడిన  రోజులలో మంచి  ఉపశమనాన్ని అందిస్తుంది. ఆయుర్వేదంలో కూడా నిమ్మకాయకు ప్రాముఖ్యత ఉంది. చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగుతారు. ఇది జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుందని, శరీరాన్ని తాజాగా ఉంచుతుందని,  రోజంతా చురుగ్గా ఉండటంలో సహాయపడుతుందని చెబుతారు.  నిమ్మకాయలోని విటమిన్ సి శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చక్కర కలిపితే.. నిమ్మరసంలో ఎక్కువ చక్కెర కలిపినప్పుడు, దానిలోని కేలరీలు పెరుగుతాయి. క్రమం తప్పకుండా అధిక చక్కెర తీసుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం, రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.  అందుకే  నేటి కాలంలో చాలా మంది ఆరోగ్య నిపుణులు , డైటీషియన్లు నిమ్మరసంలో చక్కెర లేకుండా లేదా తక్కువ చక్కెరతో తాగమని చెబుతుంటారు. నారింజ రసం కూడా.. నిమ్మరసం మాత్రమే కాకుండా, నారింజ రసం కూడా చక్కెర కలపకపోవడం మంచిది. నారింజ పండ్లు సహజంగానే తీపిగా ఉంటాయి, కాబట్టి అదనపు చక్కెరను జోడించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పుల్లని నారింజ పండ్ల రసం ఉంటే అందులో కాస్త నల్ల ఉప్పులేద సాధారణ ఉప్పు కొద్దిగా కలిపి తీసుకోవచ్చు. తాజాగా ఉండే, చక్కెర కలపని నారింజ రసం విటమిన్ సి కి మంచి మూలం . శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే ఫిట్‌నెస్ మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వ్యక్తులు  అదనపు చక్కెర లేని పానీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రుచి మెరుగవ్వాలంటే.. నిమ్మరసం రుచిని మెరుగుపరచడానికి చక్కెర బదులుగా పుదీనా ఆకులు, నల్ల ఉప్పు, రాతి ఉప్పు లేదా వేయించిన జీలకర్ర పొడి ఉపయోగించవచ్చు. ఇది రుచిని మెరుగుపరచడమే కాకుండా, పానీయం  పోషక విలువలను కూడా కాపాడుతుంది. నారింజ రసాన్ని ఎప్పుడూ తాజాగా, చక్కెర కలపకుండా తాగితేనే ఉత్తమంగా ఉంటుంది. ప్యాక్ చేసిన, అధికంగా తీపి కలిపిన పానీయాలకు దూరంగా ఉండాలని  అనుకునేవారు నిమ్మరసం , నారింజ రసం వంటి సహజ ప్రత్యామ్నాయాలకు మారడం మంచిది.   చక్కెర కలపడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. కొన్నిసార్లు ఒక చిన్న అలవాటు కూడా  ఆరోగ్యంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది.                         *రూపశ్రీ
కొన్నిసార్లు శరీరంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు  కనిపిస్తాయి. చాలా వరకు ఇలాంటి మచ్చలు ఏవైనా గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు బయటకు రక్తం కారడం, చర్మం దెబ్బ తినడం  వంటివి జరగకపోయినా, చర్మం మీద నీలం రంగులో మచ్చలు మాత్రం ఏర్పడుతూ ఉంటాయి. కొందరికి ఎలాంటి గాయాలు అయినట్లు కూడా గుర్తుండదు.  చాలామంది తరచుగా ఇది సాధారణమే అనుకుని నిర్లక్ష్యం చేస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో, ఇది ఒక శరీరం లోపల ఏదో  సమస్యకు సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. పదేపదే కారణం లేకుండా ఏర్పడే గాయాలను తేలికగా తీసుకోవడం మంచిది కాదని  అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే…  మచ్చలు ఎందుకు కనిపిస్తాయి?  కొన్నిసార్లు అధిక శారీరక శ్రమ లేదా తీవ్రమైన వ్యాయామం చర్మం కింద ఉండే చిన్న రక్తనాళాలను ప్రభావితం చేయగలదని నిపుణులు అంటున్నారు. కండరాలపై అధిక ఒత్తిడి ఈ నాళాలు చిట్లిపోవడానికి,  చర్మం కింద రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది, దీని ఫలితంగా నీలి రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇలా జరిగినప్పుడు  ఆ వ్యక్తికి గాయం అయినట్టు తెలియకపోవచ్చు, కానీ మచ్చలు కనిపినస్తుంటాయి. మందులు.. కొన్ని మందులు కూడా చర్మం మీద ఇలా నీలి రంగు మచ్చలకు కారణం కావచ్చు. రక్తాన్ని పల్చబరిచే మందులు, ముఖ్యంగా ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్,  నాప్రోక్సెన్ వంటివి, రక్తం మరింత త్వరగా గడ్డకట్టేలా చేస్తాయి. రక్తం సాధారణ వేగంతో గడ్డకట్టనప్పుడు, అది చర్మం కిందకు కారిపోయి, సులభంగా కమిలిపోతుంది. కొత్త మందులు తీసుకున్న తర్వాత ఈ సమస్య మొదలైతే వైద్యుడిని సంప్రదించడం ఎంతో ముఖ్యం.  పోషకాల లోపం.. కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం కూడా ఈ సమస్యను తీవ్రతరం చేస్తుంది. విటమిన్ సి లోపం చర్మాన్ని, రక్తనాళాలను బలహీనపరిచి, చిన్న ఒత్తిడికే మచ్చలు ఏర్పడేలా చేస్తుంది. ఐరన్ లోపం రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది, విటమిన్ కె లోపం రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదింపజేస్తుంది. అందువల్ల, ఎటువంటి కారణం లేకుండా పదేపదే నీలి మచ్చలు రావడం పోషకాహార లోపానికి సంకేతం కావచ్చట..  ఈ సమస్య ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం.. ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా వంటి అరుదైన సమస్యలలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడానికి కారణమవుతాయి. రక్తం గడ్డకట్టడంలో ప్లేట్‌లెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. వాటి లోపం వల్ల చర్మంపై అకస్మాత్తుగా నీలం లేదా ఊదా రంగు మచ్చలు ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో, పదేపదే వచ్చే నీలం మచ్చలు నాన్-హాడ్కిన్స్ లింఫోమా లేదా ఇతర రక్త సంబంధిత సమస్యల వంటి తీవ్రమైన వైద్య పరిస్థితికి సంకేతం కావచ్చు. ఇది అరుదైనప్పటికీ, తీవ్రమైన అలసట, బరువు తగ్గడం లేదా తరచుగా రక్తస్రావం వంటి లక్షణాలతో పాటుగా ఉంటే వైద్యులను కలిసి పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. వైద్యుడిని ఎప్పుడు కలవాలి? ఎటువంటి స్పష్టమైన గాయం లేకుండా  శరీరంపై పదేపదే నీలి మచ్చలు కనిపిస్తే, ఆ మచ్చలు క్రమంగా పెద్దగా అవుతూ పరిమాణంలో పెరుగుతుంటే, తరచుగా ముక్కు నుండి రక్తం కారుతుంటే, లేదా ఆ రక్తస్రావం సులభంగా ఆగకపోతే,  వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సకాలంలో వైద్య పరీక్ష చేయించుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్యాన్ని దాని ప్రారంభ దశలోనే గుర్తించి, వ3ఎలైనంత తొందరగా చికిత్సను ప్రారంభించవచ్చు.                          *రూపశ్రీ 
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి చాలామంది ఆశ్రయించేది "మల్టీవిటమిన్ టాబ్లెట్లు" (Multivitamin Tablets). అయితే, ఈ టాబ్లెట్లను ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? ఎక్కువగా వాడితే ఎలాంటి నష్టాలు జరుగుతాయి? అనే విషయాలపై ప్రముఖ వైద్యులు డాక్టర్ లక్ష్మి కోన గారు అందించిన పూర్తి వివరాలు ఈ VIDEO ద్వారా తెలుసుకుందాం. మల్టీవిటమిన్ టాబ్లెట్ల ఉపయోగాలు (Uses of Multivitamins) మన శరీరంలో వివిధ అవయవాలు సక్రమంగా పనిచేయడానికి, రోగనిరోధక శక్తి బలంగా ఉండటానికి విటమిన్లు ఎంతగానో తోడ్పడతాయి. మల్టీవిటమిన్ల వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు: పోషకాహార లోపాన్ని భర్తీ చేయడం: మనం తినే ఆహారంలో లోపించిన ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్‌ను ఇవి శరీరానికి అందిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల (Immunity Boost): విటమిన్ C, D, మరియు జింక్ వంటి పోషకాలు శరీరంలో ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. శక్తిని అందించడం (Energy Levels): విటమిన్ B-కాంప్లెక్స్ శరీరంలో ఆహారాన్ని శక్తి గా మార్చడంలో సహాయపడుతుంది, దీనివల్ల అలసట, నీరసం తగ్గుతాయి. చర్మం, జుట్టు ఆరోగ్యం: విటమిన్ E, బయోటిన్ వంటివి చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఎముకల బలం: క్యాల్షియం మరియు విటమిన్ D కలిసిన మల్టీవిటమిన్లు ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచుతాయి. సరైన డోసేజ్ మరియు వేసుకునే విధానం (Correct Dosage & Guidelines) మల్టీవిటమిన్లను ఎప్పుడు పడితే అప్పుడు, ఎన్ని పడితే అన్ని వేసుకోకూడదు. వాటికంటూ ఒక పద్ధతి ఉంటుంది: మల్టీవిటమిన్ టాబ్లెట్లను సాధారణంగా ఉదయం లేదా मధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకోవడం మంచిది. పరగడుపున (ఖాళీ కడుపుతో) వేసుకుంటే కొంతమందిలో కడుపులో మంట లేదా వికారం కలగవచ్చు. కొన్ని విటమిన్లు (A, D, E, K) కొవ్వులో కరిగేవి (Fat-soluble vitamins). కాబట్టి, కొద్దిగా కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత వీటిని వేసుకుంటే శరీరం బాగా గ్రహిస్తుంది. ఎల్లప్పుడూ డాక్టర్ సూచించిన డోస్ మాత్రమే వాడాలి. సొంత నిర్ణయాలతో రోజుకు ఒకటి కంటే ఎక్కువ టాబ్లెట్లు వేసుకోకూడదు. జాగ్రత్త: మితిమీరిన విటమిన్ల వాడకం  చాలామంది మల్టీవిటమిన్లు ఆరోగ్యానికి మంచిదే కదా అని విపరీతంగా వాడుతుంటారు. కానీ, డాక్టర్ లక్ష్మి కోన గారి ప్రకారం, విటమిన్లు ఎక్కువైతే "విటమిన్ టాక్సిసిటీ" (Vitamin Toxicity / Hypervitaminosis) అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా విటమిన్ A, D, E, K లు శరీరంలో పేరుకుపోయి కాలేయం (Liver) మరియు మూత్రపిండాల (Kidneys) పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, విటమిన్ D ఎక్కువైతే శరీరంలో క్యాల్షియం పెరిగిపోయి కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విటమిన్ A ఎక్కువైతే తలనొప్పి, వాంతులు మరియు కాలేయ సమస్యలు రావచ్చు. దుష్ప్రభావాలు (Side Effects) సాధారణంగా పరిమితికి లోబడి వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ కొంతమందిలో క్రింది లక్షణాలు కనిపించవచ్చు: కడుపులో అశాంతి, వికారం లేదా వాంతులు. మలబద్ధకం (Constipation) లేదా విరేచనాలు (Diarrhea) - ముఖ్యంగా ఐరన్ (Iron) ఎక్కువగా ఉన్న మల్టీవిటమిన్ల వల్ల మలం నల్లగా రావడం మరియు మలబద్ధకం జరుగుతుంది. నోటిలో వింత రుచి (Metallic Taste). ఇతర మందులతో పరస్పర చర్యలు (Drug Interactions) మీరు ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యల కోసం మందులు వాడుతుంటే, మల్టీవిటమిన్లు వేసుకునే ముందు జాగ్రత్త వహించాలి: యాంటీబయాటిక్స్: మల్టీవిటమిన్లలో ఉండే క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ కొన్ని రకాల యాంటీబయాటిక్స్ (ఉదాహరణకు Tetracyclines) శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వీటి మధ్య కనీసం 2 గంటల వ్యవధి ఉండాలి. బ్లడ్ థిన్నర్స్ (రక్తాన్ని పలచబరిచే మందులు): విటమిన్ K రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు రక్తాన్ని పలచబరిచే మందులు (Warfarin వంటివి) వాడుతుంటే, విటమిన్ K ఉన్న మల్టీవిటమిన్లు వాటి పనితీరును దెబ్బతీస్తాయి. చివరిగా:-  మల్టీవిటమిన్ టాబ్లెట్లు అనేవి సమతుల్య ఆహారానికి ప్రత్యామ్నాయం కావు.. సహజసిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరల ద్వారా వచ్చే పోషకాలే శరీరానికి అత్యంత శ్రేష్ఠమైనవి.  మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)