ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది. రాజధాని ఢిల్లీ వేదికగా శనివారం జరిగిన ఒక కీలక భేటీ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.  ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక నివాసంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దిశగా భారతీయ జనతా పార్టీ అప్పుడే సమరశంఖం పూరించినట్లు ఈ ఉన్నత స్థాయి సమావేశం స్పష్టం చేస్తోంది. ఎన్నికలకు కొన్ని నెలల వ్యవధి మాత్రమే మిగిలి ఉండటంతో, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలు, ప్రభుత్వ పనితీరు మరియు రాబోయే ఎన్నికల ముందస్తు వ్యూహాలపై ఇరువురు అగ్రనేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. భారతదేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. జాతీయ రాజకీయాల్లో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలో నిర్ణయించడంలో యూపీ పాత్ర అత్యంత కీలకమైంది. ఇప్పటికే వరుసగా 2 సార్లు యూపీలో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఇప్పుడు మూడోసారి కూడా రికార్డు విజయాన్ని నమోదు చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. 2027 ప్రారంభంలో జరగబోయే ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, తదుపరి జరగబోయే 2029 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలపై ప్రత్యక్షంగా  అత్యంత బలంగా ప్రభావం చూపనున్నాయి. అందుకే కేంద్ర నాయకత్వం, ముఖ్యంగా ప్రధాని మోడీ మరియు సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఇప్పటినుంచే ఎన్నికల ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల పురోగతి, మౌలిక వసతుల కల్పన మరియు యోగి ప్రభుత్వ పనితీరుతో పాటు ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న సాధారణ అభిప్రాయాలపై ఈ సమావేశంలో లోతుగా సమీక్షించారు. ప్రధాని మోడీతో భేటీ ముగిసిన అనంతరం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్  ఇతర కేంద్ర నాయకులతో కూడా సీఎం యోగి వరుసగా సమావేశం కానుండటం ఈ పరిణామాల ప్రాధాన్యతను మరింత పెంచుతోంది. ఎన్నికల సమయానికి తగినంతగా పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో సిద్ధం చేయడం, ప్రతి నియోజకవర్గంలోనూ బూత్ స్థాయి బలపర్చడంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ భేటీ కేవలం ఒక సాధారణ రాజకీయ సమావేశం మాత్రమే కాదు.. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలు  2029 సార్వత్రిక ఎన్నికల విజయానికి ఒక బలమైన పునాది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సాధించిన విజయాలను, అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత వేగంగా తీసుకెళ్లేలా పక్కా కార్యాచరణను రూపొందిస్తున్నారు. ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన ఎన్నికల వ్యూహాలు యూపీ రాజకీయ వేదికపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, ప్రతిపక్షాల ప్రచార హోరును ఎలా తిప్పికొడతాయో రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ఈ సంచలన రాజకీయ పరిణామాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. PM Modi Yogi Adityanath meeting, UP Elections 2027, BJP strategy UP, Yogi Adityanath Delhi visit, PM Modi news, Uttar Pradesh politics  
  టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని.. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పకపోతే.. తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే ప్రమాదం ఉందని అన్నారు. గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. డీఎస్సీ పరీక్షల విషయంలోనూ దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించారని.. అయితే వాస్తవాలను ప్రజలకు వివరించి గట్టిగా కౌంటర్ ఇవ్వగలిగామని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉందని.. అయితే ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా చేసే నిరసనలను ఉపేక్షించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. కర్నూలులో జరిగిన నిరసనలను ప్రస్తావిస్తూ.. గొడ్డలి పార్టీ ఆందోళనల్లో రౌడీలు, గంజాయి బ్యాచ్‌లు తప్ప ఒక్క డీఎస్సీ అభ్యర్థి అయినా ఉన్నారా అని ప్రశ్నించారు. కర్నూలులో ఈరోజు ఆందోళనకు దిగిన వారంతా మెగా డీఎస్సీ-2025 ద్వారా ఎంపికైన టీచర్లేనని తెలిపారు.డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని స్పష్టంగా చెప్పగలిగామని.. అందుకే గొడ్డలి పార్టీ మినహా ఇతర పార్టీల నేతలు సైతం తప్పులు జరగలేదని బహిరంగంగా చెబుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించగలిగితే.. కుట్రలను ప్రజలే అడ్డుకుంటారని అన్నారు. మంచి పనులు చేస్తే ప్రజలు సహకరించి భాగస్వాములు అవుతారనడానికి భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవమే నిదర్శనమని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవలే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చానని.. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యవస్థలను గాడిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సాధారణ కార్యకర్త అయినా.. పార్టీ అగ్రనాయకుడు అయినా పార్టీనే సుప్రీం అని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని చెప్పారు. కార్యకర్తలను పట్టించుకోని వారిపై, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై జీరో టాలరెన్స్ ఉంటుందని హెచ్చరించారు. గొడ్డలి పార్టీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. రాబోయే ప్రతి ఎన్నికల్లో ప్రతి బూత్‌లోనూ గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకుల ప్రవర్తన ఓట్లపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. యూనిట్, క్లస్టర్ ఇంఛార్జ్‌లు, మండల అధ్యక్షులకు తగిన గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. CM Chandrababu,TDP,NTR Bhavan, TDP Central Office,TDP Training Programme, Mega DSC 2025, AP Politics, Minister naralokesh  
జగన్ ఇక ఎప్పటికీ సీఎం కాలేరా?  ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తర్కబద్ధంగా తొడగొట్టి మరీ చెప్పిన 40 శాతం ఓటు షేర్ సంకేతం అదేనా? ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఇప్పుడు ఇదే విషయమై హాట్ హాట్ చర్చ జరుగుతోంది.  2024  ఎన్నికల్లో  రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా   40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు. ఇప్పటికీ ఆ ఓట్ షేర్ తమకు పదిలంగా చెక్కుచెదరకుండా ఉందన్నారు.  ఆ ఓటు షేర్ తో రాబోయే రోజుల్లో  జగన్   నేతృత్వంలో వైసీపీ రాష్ట్రంలో  తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని తొడగొట్టి మరీ చెప్పారు. అయితే ఆయన చెప్పిన 40 శాతం ఓటు షేరు లెక్కలను బట్టి చూస్తే..  జగన్ ఎన్నటికీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేరని పరిశీలకులు అంటున్నారు. అంబటి 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పొందిన ఓటు షేర్‌తో   తమ పార్టీ ఓటు షేర్‌ను పోల్చి మాట్లాడారు.   అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ వైసీపీ  40 శాతానికి పైగా ప్రజల ఆమోదాన్ని నిలబెట్టుకుందన్నారు. కేవలం గెలిచిన అసెంబ్లీ సీట్ల సంఖ్యను బట్టి ఒక పార్టీ ప్రజాదరణను అంచనా వేయలేమని, నేటికీ రాష్ట్రంలోని కోట్లాది మంది ఓటర్లు  జగన్ సంక్షేమ పాలనపై, ఆయన నాయకత్వంపై చెక్కుచెదరని విశ్వాసంతో ఉన్నారన్నారు అంబటి.   కానీ వాస్తవానికి..  రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిధులలో.. ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేవలం ఒక శాతం  ఓట్ల తేడా సరిపోతుంది. అంతే కాకుండా..  మొత్తం ఓట్ షేర్ కంటే..  అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుచుకున్న సీట్ల సంఖ్య గెలుపు నిర్ణయిస్తుంది. దీనిని బట్టి అంబటి రాంబాబు రాంబాబు చెబుతున్న ఓట్ షేర్ లెక్కల  , వైసీపీ తమకున్న 40శాతం ఓట్ల వాటాతో  తెలుగుదేవం కూటమి ఐక్యంగా ఉన్నంత కాలం జగన్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేనేలేదన్న మాటే. కాంగ్రెస్, వైఎస్ లెగసీ నుంచి  సంప్రదాయబద్ధంగా వచ్చే 40శాతం ఓట్ షేర్ తో  జగన్ అధికారంలోకి వచ్చే అవకాశలే లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అందుకే తమ 40 శాతం ఓటు షేరుతో హ్యాపీగా ఉన్నామంటూ అంబటి చెబుతున్న దానిని బట్టి చూస్తే జగన్ సీఎం ఆశలు వదలిలేసుకున్నట్లేగా?  Ambati Rambabu 40percent vote share narrative, YS Jagan, CM dream neverfullfill, YSR Congress Party, AP Politics, TeluguOne
ALSO ON TELUGUONE N E W S
విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా చిత్రం 'కింగ్‌డమ్'లో పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ నటుడు వెంకటేష్ వీపీ (Venkitesh VP) టాలీవుడ్‌లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రతికూల షేడ్స్ ఉన్న పాత్రలతో మెప్పించిన ఆయన, ఇప్పుడు ఏకంగా తెలుగు సినిమాలో కథానాయకుడిగా అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు. 'రుద్రాంశ సెల్యూలాయిడ్' పతాకంపై తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఒక ఆసక్తికర చిత్రంలో వెంకటేష్ వీపీ హీరోగా నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడటంతో పాటు, చిత్ర యూనిట్ రూపొందించిన ఒక ఆకర్షణీయమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "దాదాపు ఏడాది కాలంగా హీరోగా నటించే సరైన అవకాశం కోసం నిరీక్షిస్తున్నాను. ఎట్టకేలకు ఆ కల నెరవేరింది. ఈ ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు చిత్ర నిర్మాణ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు" అని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి మలయాళ రియాలిటీ షో ద్వారా సినీ ప్రయాణం మొదలుపెట్టిన వెంకటేష్, టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తొమ్మిదేళ్ల పాటు తీవ్రంగా శ్రమించారు. 'ది ప్రీస్ట్', 'స్టాండ్ అప్' మరియు తమిళ చిత్రం 'రెబెల్' లలో నటించి గుర్తింపు పొందిన ఆయన, 'కింగ్‌డమ్' చిత్రంలో మురుగన్ పాత్రతో విలన్‌గా రఫ్ అండ్ టఫ్ నటనతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించారు. గతంలో 'కింగ్‌డమ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో వెంకటేష్ మాట్లాడిన ఎమోషనల్ స్పీచ్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. "నన్ను ఒక్కసారైనా కథానాయకుడిగా చూడాలనుంది.. అవకాశాలు ఇవ్వండి" అని ఆయన వేడుకున్న తీరు అందరి హృదయాలను తాకింది. అన్నట్లుగానే ఇప్పుడు ఆయన కోరిక నెరవేరి హీరోగా మారడం విశేషం. స్వయంకృషితో ఎదిగిన ఈ యంగ్ యాక్టర్ హీరోగా ప్రమోషన్ పొందడంపై నెటిజన్లు, సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కష్టపడే తత్వమున్న వెంకటేష్‌కి టాలీవుడ్‌లో మంచి భవిష్యత్తు ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణ నేటివిటీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన దర్శకుడు, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు. విలన్‌గా మెప్పించిన వెంకటేష్, కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తారో వేచి చూడాల్సిందే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖపట్నం వేదికగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఏఏఏ (AAA) సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆసియన్ సునీల్‌తో కలిసి వైజాగ్ ఇన్ఆర్బిట్ మాల్ ప్రాంగణంలో నిర్మించిన ఈ అత్యాధునిక థియేటర్ల కాంప్లెక్స్ లాంచ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో బన్నీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వేడుకలో ప్రసంగించిన అల్లు అర్జున్ విశాఖ నగరంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. విశాఖపట్నం తనకు అత్యంత ప్రియమైన ఊరని స్పష్టం చేశారు. "నా తొలి చిత్రం 'గంగోత్రి' చిత్రీకరణ సమయంలో ఈ నగర వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నన్ను ఎవరూ గుర్తుపట్టేవారు కూడా కాదు. కానీ ఈ రోజు ఇక్కడ అడుగుపెడితే మీరందరూ చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలతో నడవలేకపోతున్నాను" అంటూ తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం తను సాధించిన ఈ విజయం గురించి చెప్తూ.. "ఆ రోజుల్లోనే వైజాగ్‌లో ఒక భారీ మాల్ నిర్మిస్తారని, అందులో నా సొంత ప్రెస్టీజియస్ మల్టీప్లెక్స్ అందుబాటులోకి వస్తుందని నా కల్లో కూడా అనుకోలేదు. ఇది నిజంగా నా జీవితంలో ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్" అని వ్యాఖ్యానించారు. అభిమానుల అపూర్వ స్పందనకు మురిసిపోయిన బన్నీ, మధ్యలో వారిని ఉద్దేశించి “కొంచెం రిలాక్స్ అవ్వండి డాడీ” అంటూ సరదాగా వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వుల పూవులు పూసాయి. ప్రస్తుతం తను నటిస్తున్న భారీ చిత్రం 'రాకా' మూవీ షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోందని, వైజాగ్ ప్రజల కోసం చిత్రబృందాన్ని ఒక రోజు బ్రేక్ అడిగి ఇక్కడికి వచ్చానని బన్నీ తెలిపారు. విమానాశ్రయం నుంచి ఈ వేడుక వద్దకు వచ్చే క్రమంలో స్థానిక పోలీసులు తనను ఎంతో భద్రంగా, 'పువ్వుల్లో పెట్టుకుని' తీసుకొచ్చారని చెబుతూ విశాఖ పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వైజాగ్ ప్రేక్షకుల అనుభూతి కోసం ఈ మల్టీప్లెక్స్‌లోని ప్రతి స్క్రీన్‌ను పర్సనల్ కేర్ తీసుకుని రూపొందించామని బన్నీ తెలిపారు. భారతదేశంలోనే మరెక్కడా లేని వినూత్న టెక్నాలజీతో ఈ థియేటర్లు పనిచేస్తాయని, ఇక్కడి స్క్రీన్‌కు 'వైల్డ్ ఫైర్' అని నామకరణం చేశామని గర్వంగా ప్రకటించారు. విశాఖ నగరం అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం అల్లు అర్జున్ స్పీచ్ క్లిప్పింగ్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. గంగోత్రి రోజుల నుంచి నేటి పాన్-ఇండియా స్టార్ హోదా వరకు బన్నీ ఎదిగిన తీరును అభిమానులు, సినీ ప్రేమికులు కొనియాడుతున్నారు. పాన్-వరల్డ్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ తదుపరి చిత్రం 'రాకా'పై ఇప్పటికే దేశవ్యాప్తంగా అపారమైన అంచనాలు నెలకొన్నాయి. వ్యాపారవేత్తగా 'ఏఏఏ సినిమాస్' విస్తరణతో పాటు, వెండితెరపై సరికొత్త రికార్డులు సృష్టించేందుకు ఐకాన్ స్టార్ సిద్ధమవుతున్నారు.
కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ కార్తి వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల దర్శకుడు మోహన్ రాజాతో తన 31వ చిత్రాన్ని ('కార్తి 31') అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పూర్తిస్థాయి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ప్రకటించినప్పటి నుంచే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా ఈ చిత్రంలో కార్తి సరసన నటించబోయే కథానాయిక ఎవరనే అంశంపై కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటించేందుకు ప్రధానంగా ఇద్దరు చెన్నై భామల పేర్లు వినిపిస్తున్నాయి. మొదట మేకర్స్ లేడీ సూపర్ స్టార్ నయనతారను ఎంపిక చేయాలని భావించారు. గతంలో కార్తి-నయన్ కాంబోలో వచ్చిన 'కాశ్మోరా' హిట్ అవ్వడం, అలాగే మోహన్ రాజాతోనూ నయనతారకు మంచి హిట్ ట్రాక్ రికార్డ్ ఉండటం ఇందుకు కారణం. అయితే నయనతార కాల్ షీట్లు, డేట్స్ అడ్జస్ట్ కాకపోతే ప్రత్యామ్నాయంగా గ్లామరస్ స్టార్ త్రిష కృష్ణన్‌ను ఆ స్థానంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ త్రిష ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, మళ్లీ 'పొన్నియిన్ సెల్వన్' కాంబినేషన్ వెండితెరపై పునరావృతం కానుంది. ఆ సినిమాలో కార్తి (వల్లవరాయన్ వందియదేవన్), త్రిష (కుందవై)ల మధ్య సాగిన సీన్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో వీరిద్దరూ మరోసారి పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాలో జంటగా కనిపిస్తే చూడాలని అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. కథానాయిక విషయంలో చిత్రబృందం త్వరలోనే ఒక స్పష్టతనిచ్చి అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో కార్తి సరికొత్త మాస్ అండ్ క్లాస్ లుక్‌లో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. మరోవైపు హీరో కార్తి కేరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో ఆయన నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, కళ్యాణ్ శంకర్ కాంబినేషన్‌లో 'కార్తి 30' చిత్రం కూడా సెట్స్‌పై ఉంది. ఈ బిజీ లైనప్ మధ్య మోహన్ రాజా ప్రాజెక్ట్ కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్ సాంకేతికతలతో సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్న మూకలపై ప్రముఖ కథానాయిక, గాయని శ్రుతిహాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, గొంతును వ్యాపార ప్రకటనలకు, అశ్లీల వీడియోల మార్ఫింగ్‌కు ఉపయోగిస్తున్నారంటూ బాంబే హైకోర్టులో శ్రుతిహాసన్ వాణిజ్య పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పర్సనాలిటీ రైట్స్‌ను ఉల్లంఘిస్తూ ప్రయోజనం పొందుతున్న ఈ-కామర్స్ సైట్లు, ఏఐ చాట్‌బాట్ ప్రొవైడర్లు మరియు సామాజిక మాధ్యమ వేదికలు సహా మొత్తం 18 మంది డిఫెండెంట్లను ఈ కేసులో చేర్చారు. ఈ అనధికారిక చర్యల వల్ల తన ప్రతిష్ఠకు తీవ్ర భంగం వాటిల్లిందని, ఇందుకు గానూ రూ. 15 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆమె దావాలో కోరారు. జూన్ చివరి వారంలో తన పేరు, బొమ్మలతో ఆన్‌లైన్‌లో నకిలీ మర్చండైజ్ విక్రయాలు జరుగుతున్నట్లు శ్రుతిహాసన్ దృష్టికి వచ్చింది. ఆ వెంటనే సామాజిక మాధ్యమాల్లో ఏఐ సాంకేతికతతో తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి సృష్టించిన అశ్లీల చిత్రాలు, డీప్‌ఫేక్ వీడియోలు ప్రచారంలోకి రావడంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. చిత్రసీమలో నటులు, కళాకారులకు ఉండే 'ఫెర్ఫార్మర్స్ మోరల్ రైట్స్'ను ఉల్లంఘిస్తూ, తన సినిమాలలోని కొన్ని దృశ్యాలను సేకరించి జిఫ్‌లు, నకిలీ వీడియోలుగా మారుస్తున్నారని శ్రుతి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నకిలీ కంటెంట్ వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడటమే కాకుండా ఒక కళాకారిణిగా తన వృత్తిపరమైన గౌరవానికి విఘాతం కలుగుతోందని తెలిపారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అనీల్ కపూర్ వంటి అగ్ర నటులు తమ పర్సనాలిటీ రైట్స్‌ను కాపాడుకునేందుకు న్యాయస్థానాల నుంచి ఉత్తర్వులు పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రుతిహాసన్ కూడా అంతర్గత డిజిటల్ భద్రత మరియు వ్యక్తిగత గుర్తింపు హక్కుల పరిరక్షణ కోసం గళం విప్పడం విశేషం. ఈ కేసును విచారణకు స్వీకరించిన బాంబే హైకోర్టు జస్టిస్ అభయ్ అహుజా ధర్మాసనం, తదుపరి చర్యలకు అనుమతినిచ్చింది. ఇంటర్నెట్‌లో తన పేరుతో ఉనికిలో ఉన్న నకిలీ కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని, ఈ అక్రమాలకు పాల్పడుతున్న అనామక ఖాతాదారుల వివరాలను అందజేయాలని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను కోర్టు ఆదేశించే అవకాశాలు ఉన్నాయి.
భాగ్యనగరంలో ఆషాఢ/శ్రావణ బోనాల వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. పాతబస్తీలో జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చారిత్రాత్మక లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని విజయ్ దేవరకొండ ఆదివారం దర్శించుకున్నారు. విజయ్‌తో పాటు ఆయన సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండ, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా అమ్మవారి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయలు కొట్టి, మొక్కులు చెల్లించుకుని మహంకాళి అమ్మవారి దివ్య ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకోవడం తనకు ఇదే తొలిసారి అని సంతోషం వ్యక్తం చేశారు. "ప్రజలందరి కోరికలు నెరవేరాలని, అందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను. దర్శనం చాలా బాగా జరిగింది. సందీప్ ప్రొడక్షన్ హౌస్ పేరు కూడా భద్రకాళి కావడం విశేషం. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు" అని వ్యాఖ్యానించారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గుడికి వచ్చారనే వార్త తెలియడంతో పాతబస్తీ పరిసరాల్లో అభిమానులు, స్థానిక భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలన్నీ 'రౌడీ' నినాదాలతో హోరెత్తిపోయాయి. విజయ్ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తెలుగు చిత్రసీమలో 'అర్జున్ రెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ క్లాసిక్‌ను అందించిన విజయ్ దేవరకొండ - సందీప్ రెడ్డి వంగాల కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చాలా రోజుల తర్వాత వీరిద్దరూ ఇలా ఒకే ఫ్రేమ్‌లో, అదీ ఆధ్యాత్మిక వేడుకలో కలిసి కనిపించడంతో సోషల్ మీడియాలో ఈ ఫోటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రాజెక్టులతో పాటు రాహుల్ సాంకృత్యన్, శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో 'స్పిరిట్' చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఇద్దరూ త్వరలోనే మళ్లీ కలిసి పనిచేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులతో పాటు సినీ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆయన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పంచుకున్న ఒక ప్రత్యేకమైన పిక్ ఇప్పుడు నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతోంది. ‘వారణాసి’ సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి మహేశ్ బాబుతో కలిసి దిగిన ఒక అరుదైన బిహైండ్ ది సీన్స్ (BTS) చిత్రాన్ని ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఆఫ్రికా షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో తీసిన ఈ ఫోటోలో మహేశ్ పక్కన ప్రియాంక కూర్చుని కనిపిస్తోంది. “హ్యాపీ బర్త్‌డే బాబ్.. వారణాసి లాంటి అల్టిమేట్ అడ్వెంచర్ ప్రయాణాన్ని నీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది” అంటూ ప్రియాంక క్యాప్షన్ జోడించింది. మహేశ్ బాబును అభిమానంతో ‘బాబ్’ అని సంబోధిస్తూ ప్రియాంక పెట్టిన ఈ పోస్ట్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ విజిట్ సమయంలో మహేశ్ సతిమణి నమ్రతా శిరోద్కర్, కుమార్తె సితారలతో ప్రియాంక దిగిన ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా సందడి చేశాయి. మహేశ్ కుటుంబంతో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ప్రియాంక తరచూ వ్యక్తపరుస్తూనే ఉంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న ఈ గ్లోబల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అద్భుతమైన స్లో-మోషన్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయని, తన కెరీర్‌లోనే ఇదొక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అని ప్రియాంక గతంలోనూ ఒక టాక్ షోలో వెల్లడించింది. ప్రియాంక షేర్ చేసిన ఈ లొకేషన్ పిక్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. హాలీవుడ్, టాలీవుడ్ క్రేజీ కాంబోను ఒకే ఫ్రేమ్‌లో చూడటం ఎంతో ముచ్చటగా ఉందంటూ మహేశ్ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆఫ్రికాలోని కిలిమంజారో, మసాయ్ మారా వంటి ప్రకృతి అందాల మధ్య జరిగిన షూటింగ్ అనుభవాలు విజువల్‌గా సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్రబృందం చెప్తోంది. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్టు షూటింగ్ హైదరాబాద్‌లోనే శరవేగంగా జరుగుతుండగా, త్వరలోనే సినిమాకు సంబంధించిన తదుపరి కీలక అప్‌డేట్‌లను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస పరాజయాల తర్వాత గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమైన కొత్త చిత్రం 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వినూత్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద విశేష ఆదరణ పొందుతోంది. తొలి రోజు నుంచే కలెక్షన్ల పరంగా జోరు చూపిస్తూ వరుణ్ తేజ్ కేరీర్‌లోనే మంచి ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో రాయలసీమ యువకుడిగా వరుణ్ తేజ్ పాత్ర, అతడి శరీరాత్మలోకి కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ప్రవేశించే కాన్సెప్ట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అనంతపురం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో కామెడీ సన్నివేశాలు థియేటర్లలో నవ్వుల పూవులు పూయిస్తున్నాయి. ముఖ్యంగా కన్యాకుమారి నుంచి కొరియా కనెక్టింగ్ పాయింట్‌తో దర్శకుడు రాసుకున్న నవ్వుల ట్రాక్ బాగా వర్కవుట్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 4 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టగా, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తొలిరోజే 6.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. రెండో రోజు నాటికే దేశవ్యాప్తంగా నెట్ కలెక్షన్లు 8 కోట్ల మార్కును దాటి, వరల్డ్ వైడ్ 12 కోట్ల మైలురాయిని చేరడం విశేషం. దారితప్పిన వరుణ్ తేజ్ కెరీర్‌కి ఈ వసూళ్లు పెద్ద ఊరటగా నిలిచాయి. గతంలో వచ్చిన 'మట్కా', 'గాండీవధారి అర్జున' వంటి సీరియస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాలను ఇవ్వలేకపోయాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న వరుణ్, ఈసారి పూర్తిగా వినోదాత్మక శైలిని ఎంచుకుని సరైన సమయంలో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కామెడీ టైమింగ్, డ్యూయల్ షేడ్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. నటి రితికా నాయక్ హీరోయిన్‌గా మెప్పించగా, నటుడు సత్య కామిక్ టైమింగ్ సినిమాకు ప్రధాన అసెట్‌గా నిలిచింది. కమెడియన్ సత్య తనదైన శైలి నటనతో థియేటర్లని వినోదంతో ముంచెత్తుతున్నాడు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ వంటి అగ్ర కథానాయకులు కూడా ఈ సినిమా విజయాన్ని అభినందిస్తూ పోస్టులు పెట్టడం బిగ్ ప్లస్ పాయింట్‌గా మారింది. సోషల్ మీడియాలో కూడా 'కొరియన్ కనకరాజు' ట్రెండ్ అవుతోంది. వీకెండ్ కావడం, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ లభించడంతో కుటుంబ సమేతంగా వచ్చి థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య పెరిగింది. మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్లలోనూ రాత్రి షోలకు దాదాపు 50 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదవుతోందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వారాంతంలో ఈ కలెక్షన్ల జోరు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ సినిమాతో వరుణ్ తేజ్ మార్కెట్ మళ్లీ పుంజుకుందని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఈ సూపర్ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో వరుణ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్టులను కూడా త్వరలోనే పట్టాలెక్కించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి దక్షిణాది వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన 'ప్రేమలు' చిత్రంతో ఎంతోమంది కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది అందాల భామ మమితా బైజు. తన సహజసిద్ధమైన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ నటి తాజాగా ఒక అనూహ్య నిర్ణయం తీసుకుని అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇకపై సోషల్ మీడియా వేదికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మమితా వెల్లడించింది. వర్చువల్ ప్రపంచంలో లభించే పబ్లిసిటీ కంటే మనశ్శాంతే అత్యంత ప్రధానమని ఆమె స్పష్టం చేసింది. ఇక నుంచి తన వ్యక్తిగత ఖాతాల ద్వారా కాకుండా, సినిమాలకు సంబంధించిన ప్రతి చిన్న అధికారిక సమాచారాన్ని కేవలం పీఆర్ టీమ్ మాత్రమే చూసుకుంటుందని తేల్చిచెప్పేసింది. ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది ఈ మలయాళ బ్యూటీ. తనకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే అమితమైన అభిమానమని, ఆయన నటించిన సినిమాలను పదుల సంఖ్యలో చూశానని చెప్పింది. ముఖ్యంగా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో బన్నీ ధరించిన క్యాజువల్ దుస్తులు, క్యాసియో వాచ్ స్టైల్‌ను చూసి తాను కూడా చిన్నప్పుడు అలాగే అనుకరించేదాన్నని సరదాగా గుర్తుచేసుకుంది. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన మమితా తండ్రి వృత్తిరీత్యా డాక్టర్ కాగా, ఆమె సైకాలజీలో పట్టభద్రురాలైంది. కుటుంబంలో తన అన్నయ్య మిథున్ రాష్ట్రస్థాయి క్రికెటర్ అని తెలిపింది. తన జీవితంలోని కీలక నిర్ణయాలన్నింటినీ అన్నయ్యే దగ్గరుండి చూసుకుంటాడని, చివరికి లవ్ ప్రపోజల్స్ డీల్ చేయడం నుంచి పెళ్లి వ్యవహారాల వరకు ప్రతీది అతడే నిర్ణయిస్తాడని చిరునవ్వుతో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మమితా చేతిలో వరుస భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ సూర్యతో కలిసి 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంలో నటిస్తుండటంతో పాటు, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో పలు విలక్షణమైన కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ, తన సినిమాలతో ప్రేక్షకాభిమానులను అలరిస్తూనే ఉంటానని ఈ భామ నమ్మకం వ్యక్తం చేస్తోంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు అయితే.. రాత్రంతా రైళ్లలోనే ఉండాల్సి వస్తుంది.  అయితే రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది.  పక్కన ప్రయాణికుల నుండి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. రైల్వే రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ప్రత్యేక "నైట్ జర్నీ కండీషన్స్" అమలు చేసింది. ప్రతి రైలు ప్రయాణికుడు ఈ నియమాల గురించి తెలుసుకోవాలి. లేకపోతే రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అవేంటో తెలుసుకుంటే.. శబ్దం చేయకూడదు.. రాత్రి 10 గంటల తర్వాత రైలులో నిశ్శబ్ద వాతావరణాన్ని పాటించడం ప్రధాన నియమం. ఈ సమయంలో మొబైల్ ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడకూడదు, లేదా ఇయర్‌ఫోన్‌లు లేకుండా స్పీకర్‌లపై వీడియోలు లేదా సంగీతాన్ని ప్లే చేయకూడదు. ఇతర ప్రయాణికుల నిద్రకు భంగం కలగకుండా ఉండేందుకు, స్నేహితులతో గుంపులుగా బిగ్గరగా నవ్వడం , జోకులు వేయడం కూడా నిషేధించబడింది. లైట్స్ ఆఫ్.. కొన్నిసార్లు ప్రయాణికులు ఎవరైనా రాత్రి పొద్దుపోయే వరకు  ఏదో ఒక కారణంతో మెయిన్ లైటును ఆన్ చేసి ఉంచుతారు. దీనివల్ల ఇతర ప్రయాణికులు నిద్రపోలేరు. పక్క వారి నిద్రకు ఇబ్బంది అవుతుంది.  రైల్వే నిబంధనల ప్రకారం, రాత్రి 10 గంటల తర్వాత ప్రధాన కోచ్‌లోని లైట్లన్నీ తప్పనిసరిగా ఆపివేయాలి. రాత్రిపూట కేవలం నైట్‌లైట్ బల్బులు మాత్రమే ఆన్ చేసి ఉండవచ్చు. ఎవరైనా  అవసరం అనిపిస్తే వారు  తమ సీటులోని పర్సనల్ రీడింగ్ లైటును ఉపయోగించుకోవచ్చు. మధ్య బెర్త్ లకు రైల్వే నియమాలు.. లోయర్ బెర్త్  , మధ్య బెర్త్ ప్రయాణీకుల మధ్య సీట్ల తగాదాలను నివారించడానికి, రైల్వే ఒక స్పష్టమైన నియమాన్ని పెట్టింది. మధ్య బెర్త్ ప్రయాణీకుడు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య మాత్రమే తన సీటును విప్పి నిద్రపోవచ్చు. ఉదయం 6 గంటల తర్వాత, ఇతరులు దిగువ బెర్త్‌లో కూర్చోవడానికి వీలుగా  మధ్య బెర్త్‌ను దించాలి. అదేవిధంగా, రాత్రి 10 గంటల తర్వాత, లోయర్ బెర్త్ ప్రయాణీకుడు తన సీట్ లో ఎవరినీ కూర్చోబెట్టుకోకూడదు. వారు తమ పక్కన కూర్చోమని ఎవరినీ బలవంతం చేయలేరు. టికెట్ చెకింగ్.. ప్రయాణికుల నిద్రను దృష్టిలో ఉంచుకుని, రైల్వే తన టికెట్ చెకింగ్ సిబ్బందికి సూచనలు జారీ చేసింది. రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 6:00 గంటల మధ్య  టికెట్‌ను తనిఖీ చేయడానికి ఏ టిటిఇ మిమ్మల్ని నిద్రలేపకూడదు. వారు రాత్రి 10:00 గంటల లోపు తమ పనిని పూర్తి చేసుకోవాలి. అయితే, రాత్రి 10:00 గంటల తర్వాత రైలు ఎక్కిన ప్రయాణికులు ఈ సమయంలో తమ టికెట్లను తనిఖీ చేయించుకోవచ్చు. ఇది కాకుండా రాత్రి 10 గంటల తర్వాత రైలులో వీధి వ్యాపారులు లేదా విక్రయదారులు గట్టిగా అరుస్తూ ఎలాంటి వస్తువులను అమ్మకూడదు.  కానీ ఎవరైనా ఈ-క్యాటరింగ్ ద్వారా ఆహారాన్ని ముందుగానే బుక్ చేసుకుని ఉంటే, అది ఖచ్చితంగా వారి సీటుకే తెచ్చిస్తారు. నియమాలు ఉల్లింఘిస్తే.. రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికుడు ఈ నియమాలను ఉల్లంఘిస్తే, వారితో వాదించాల్సిన అవసరం లేదు.  వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), TTE, లేదా రైలులోని కోచ్ అటెండెంట్‌కు ఫిర్యాదు చేయవచ్చు.  రైల్వే అధికారిక యాప్ 'రైల్‌మదాద్' లేదా 139 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా కూడా సహాయం పొందవచ్చు. నియమాలను ఉల్లంఘించిన వారిపై రైల్వే జరిమానాలు కూడా విధించవచ్చు. కాబట్టి రైలు ప్రయాణం చేసేటప్పుడు పై నియమాలు గుర్తుంచుకుని,  వాటిని అనుసరిస్తూ ప్రయాణించడం మంచిది.                                      *రూపశ్రీ.  
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు.  వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని,  తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది.  రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం,  పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా  మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు.  అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల  భవిష్యత్తులో  చాలా సమస్యలు వస్తాయి.  మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం,  పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి.  ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు.  తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు.  ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు.  సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ  భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును,  తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు.  ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ  భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా  భాగస్వామిపై ఆధారపడటం  తప్పు. ఈ అలవాటు  భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం  సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు.  ఎవరి కోసమూ  అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం,  చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది.                                              *రూపశ్రీ.
సిబ్లింగ్ థెరపీ..  తోబుట్టువుల మధ్య వచ్చే మనస్పర్థలు సులువుగా తొలగించే భలే మార్గం..! అన్నా తమ్ముడు, అక్కా చెల్లి, అన్నా చెల్లెళ్లు,  అక్కా తమ్ముళ్లు.. ఇలా తోబుట్టువుల బంధాలు చాలా గొప్పవి. ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన వారి మధ్య బంధం ఎంతో అపురూపమైనది.  చిన్నతనంలో తోబుట్టువులు కొట్టుకున్నా, తిట్టుకున్నా, గొడవ పడినా అది జరిగిన తర్వాత కొన్ని నిమిషాలు లేదా గంటల్లోనే తిరిగి కలిసిపోతారు.  ఒక్కటిగా పెరుగుతారు.  కానీ పెద్దయ్యాకే సమస్యలు వస్తాయి.  చాలామందికి అపార్థాలు చోటుచేసుకుంటాయి. మనస్పర్థలు వస్తాయి. వీటి వల్ల కేవలం ఆ మనిషి మాత్రమే కాకుండా కుటుంబం అంతా కలత చెందుతుంది.  పైగా ఇలాంటి మనస్పర్థలు,  అపార్థాల వల్ల దూరం కూడా పెరుగుతుంది. ఇలాంటి దూరాలను తగ్గించి, మనస్పర్థలు పోగొట్టి తిరిగి తోబుట్టువులను ఒక్కటిగా ఉంచే మార్గమే సిబ్లింగ్ థెరపీ.. అసలు సిబ్లింగ్ థెరపీ అంటే ఏంటి? దీని ప్రయోజనం ఏంటి? ఇదెలా సహాయపడుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. సిబ్లింగ్ థెరపీ అంటే.. సిబ్లింగ్ థెరపీ అనేది కుటుంబ చికిత్సలో ఒక భాగం. తోబుట్టువుల మధ్య మాట్లాడుకునే విధానాన్ని  మెరుగుపరచడం, గత విభేదాలను పరిష్కరించడం,  సంబంధంలో నమ్మకాన్ని తిరిగి వచ్చేలా చేయడం  దీని లక్ష్యం. ఈ చికిత్సలో బాగా ట్రైనింగ్ అయిన వ్యక్తి మనస్పర్థలు ఉన్న ఇద్దరు వ్యక్తులను  స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తపరచనవు చెబుతారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడానికి గల కారణాలను అర్థం చేసుకోవడంలో సహాయపడతారు. తోబుట్టువుల మధ్య తరచుగా  జరిగే గొడవలు, ఇద్దరి మధ్య మాటలు లేకపోవడం, సవతి కుటుంబ సమస్యల కారణంగా సంబంధాలు దెబ్బతినడం, లేదా  పెద్దవయలు అయిపోయిన తల్లిదండ్రులను చూసుకోవడం.. ఇలా చాలా కారణాల వల్ల తోబుట్టువుల మధ్య విబేధాలు ఏర్పడితే వాటికి సరైన సొల్యుషన్ చెప్పి తోబుట్టువులను తిరిగి కలుపుతారు. ప్రయోజనం... సిబ్లింగ్ థెరపీ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, అది వారి మధ్య కమ్యునికేషన్ ను  మెరుగుపరుస్తుంది. థెరపీ సమయంలో, తోబుట్టువులు శ్రద్ధగా వినడం, తమ భావాలను సరైన విధంగా  వ్యక్తపరచడం,  అవతలి వ్యక్తి కోణాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. దీనివల్ల క్రమంగా అపార్థాలు తగ్గుతాయి. ఒకవేళ చిన్ననాటి అనుభవం లేదా గతంలోని వివాదం వారి సంబంధంలో సమస్యకు కారణమైతే, ఈ సమస్యలను బహిరంగంగా చర్చించడానికి థెరపీ ఒక మంచ వాతావరణాన్ని అందిస్తుంది. కొన్నిసార్లు, పక్షపాతం, పగ, లేదా చెప్పుడు మాటలు వంటివి సంవత్సరాల తరబడి ఆ సంబంధాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి.  థెరపిస్ట్ సహాయంతో ఈ సమస్యలను చర్చించి పరిష్కరించడం జరుగుతుంది, తద్వారా ఆ సంబంధం సాఫీగా  సాగడానికి వీలవుతుంది. ఎమోషనల్ సపోర్ట్.. సిబ్లింగ్ థెరపీ  రిలేషన్స్ ను ఎమోషన్ పరంగా బలంగా మారుస్తుంది.  తోబుట్టువులకు ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది. కష్ట సమయాల్లో  కలసికట్టుగా ఉండటం, ఒకరి సంతోషాన్ని మరొకరు పంచుకోవడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడుగా ఉండటం.. ఇలా   మొత్తం కుటుంబంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంట్లో ఒత్తిడి తగ్గుతుంది , ఇతర కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడటం ప్రారంభిస్తాయి. తోబుట్టువుల మధ్య ఎప్పుడూ గొడవలు ఉంటే,  లేదా పూర్తీగా మాటలు ఆగిపోయి ఉంటే.. కుటుంబంలో పెద్ద మార్పు తర్వాత సంబంధాలు క్షీణిస్తే, లేదా కుటుంబ నిర్ణయాలపై తరచుగా వివాదాలు అవుతూ ఉంటే, సిబ్లింగ్ థెరపీని తీసుకోవడం చాలా మంచిది.                              *రూపశ్రీ.  
కాల్షియం, ఐరన్ లోపం ఉందా? పాలు, పాల ఉత్పత్తుల విషయంలో కల్తీపై ఆందోళన ఉందా? అయితే మన ఇంట్లోనే సులభంగా లభించే ఒక ఆకుకూర మీ ఆహారంలో మంచి పోషక వనరుగా ఉపయోగపడవచ్చు. ఇంతకీ ఆ ఆకుకూర ఏంటి? దానిలో ఉండే పోషకాలు ఏమిటి? ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? ఎంత మోతాదులో తీసుకోవాలి? ఈ వీడియోలో ఆయుర్వేద వైద్యులు చిట్టి బొట్ల మధుసూదన్ శర్మ ఈ ఆకుకూర గురించి ఆసక్తికరమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. కాల్షియం మన ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజం. అలాగే ఐరన్ శరీరంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, ఇతర సహజ ఆహార పదార్థాలను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఆహార విధానంలో భాగం. అయితే ఒక ఆహార పదార్థం తీసుకోవడం వల్ల మాత్రమే కాల్షియం లేదా ఐరన్ లోపం పూర్తిగా సరిచేయబడుతుందని భావించకూడదు. ఇప్పటికే లోపం ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలితే, వైద్యుల సూచన మేరకు సరైన ఆహారం లేదా అవసరమైన చికిత్స తీసుకోవడం ముఖ్యం. ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: • కాల్షియం, ఐరన్ మన శరీరానికి ఎందుకు అవసరం? • ఇంట్లో సులభంగా లభించే ఈ ఆకుకూరలో ఉన్న పోషకాలు ఏమిటి? • ఈ ఆకుకూరను ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చు? • ఆకుకూరలను తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి? • సహజ ఆహారాల ద్వారా పోషకాలను పొందడంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలను ఈ వీడియోలో ఆయుర్వేద వైద్యులు చిట్టి బొట్ల మధుసూదన్ శర్మ వివరించారు. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా పోషక లోపం, అనారోగ్య సమస్య ఉంటే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి. వైద్యుల సూచన లేకుండా మందులు లేదా సప్లిమెంట్లను ప్రారంభించవద్దు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
ఐస్ క్రీమ్.. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. చాలామంది వర్షాకాలంలో కూడా ఐస్ క్రీమ్ తింటే ఆ కిక్కే వేరు అంటారు.  కాలం ఏదైనా ఐస్ క్రీమ్ పట్ల చాలా ఇష్టం ఉంటుంది. అయితే నేటి కాలంలో ఐస్ క్రీమ్ మాత్రమే కాకుండా ఫ్రోజెన్ డెజర్ట్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.  షాప్ కు వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ ఏదో,  ప్రోజెన్ డెజర్ట్ ఏదో అర్థం కాకుండా చాలా మంది పొరపాటుగా ఐస్ క్రీమ్ కు బదులు ఫ్రోజెన్ డెజర్ట్ ఎంచుకుంటారు. ఆ తర్వాత ఇది ఐస్ క్రీమ్ కాదని నాలుక కరుచుకుంటారు. అందుకే ఐస్ క్రీమ్ కు,  ఫ్రోజెన్ డెజర్ట్ కు మధ్య తేడా ఎలా తెలుసుకోవాలి? తెలుసుకుంటే.. ఫ్రోజెన్ డెజర్ట్‌లు ఐస్ క్రీమ్‌కు చాలా భిన్నంగా ఉంటాయి, కానీ  చాలామంది అవి  రెండూ ఒకటే అని పొరబడతారు. ఈ రెండూ చూడటానికి, రుచిలో ఒకేలా కనిపించినప్పటికీ, వాటి మధ్య చాలా తేడా ఉంటుంది. పదార్థాలు.. ఐస్ క్రీమ్ , ఫ్రోజెన్ డెజర్ట్‌ల మధ్య ఉన్న అతిపెద్ద తేడా వాటి తయారీలో ఉపయోగించే కొవ్వు పదార్థం. ఐస్ క్రీమ్‌ను పాలు, క్రీమ్ , పాల ఫ్యాట్ తో తయారు చేస్తారు. అందువల్ల, ఐస్ క్రీమ్‌గా పరిగణించబడాలంటే, ఏ ఫ్రోజెన్ డెజర్ట్‌లోనైనా కనీసం 10% పాల కొవ్వు ఉండాలి. మరోవైపు, ఫ్రోజెన్ డెజర్ట్‌లలో పాలకు బదులుగా పామాయిల్ లేదా పామ్ కెర్నల్ ఆయిల్ వంటి వెజిటెబుల్ నూనె లేదా వెజిటెబుల్ ఫ్యాట్ ను ఉపయోగిస్తారు. పాల ఘనపదార్థాలను కలుపుతారు, కానీ పాల కొవ్వును ఉపయోగించరు. రుచి, టెక్చర్.. పాల కొవ్వును ఉపయోగించడం వల్ల ఐస్ క్రీమ్ మరింత క్రీమీగా, రుచికరంగా , మృదువుగా తయారవుతుంది. ఐస్ క్రీమ్ నోటిలో సులభంగా కరిగిపోతుంది. మరోవైపు, ఫ్రోజెన్ డెజర్ట్‌లు కొద్దిగా జిగటగా లేదా నూనెగా ఉంటాయి. అంతేకాకుండా, పాల కొవ్వుతో పోలిస్తే వెజిటబుల్  కొవ్వుకు కరికే గుణం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ప్యాకెట్ల పై లేబులింగ్.. చాలామంది ఐస్ క్రీమ్ అనుకుని  ఫ్రోజెన్ డెజర్ట్ లు కొనుగోలు చేసి తరువాత బాధపడుతూ ఉంటారు. అందుకే.. ఉత్పత్తి ఐస్ క్రీమా లేక ఫ్రోజెన్ డెజర్టా అనేది కంపెనీలు ప్యాకేజింగ్‌పై స్పష్టంగా పేర్కొనాలి. ఉత్పత్తిలో 0.5% కంటే ఎక్కువ వెజిటేబుల్ ఆయిల్  ఉంటే, దానిని ఐస్ క్రీమ్‌గా కాకుండా, కేవలం ఫ్రోజెన్ డెజర్ట్‌గా మాత్రమే అమ్మాలని FSSAI నిబంధనలు విధించింది. ధర తేడా.. పాల కొవ్వు కంటే వెజిటేబుల్ ఆయిల్  చాలా చౌకగా ఉంటుంది. అందువల్ల ప్రోజెన్ డెజర్ట్‌లు కంపెనీలకు మరింత పొదుపుగా ఉంటాయి . తక్కువ ధరకే లభిస్తాయి. మరోవైపు, ఐస్ క్రీమ్‌లో పాల కొవ్వును ఉపయోగిస్తారు, అందుకే దీని ధర ప్రోజెన్  డెజర్ట్‌ల కంటే ఎక్కువగా ఉంటుంది. కొనుగోలు చేసేముందు ఇవి గుర్తుంచుకోవాలి..  ప్యాక్ చేసిన డెజర్ట్‌ను కొనుగోలు చేసినప్పుడల్లా, ప్యాకేజీ ముందు లేదా వెనుక ఉన్న పదార్థాల జాబితాను జాగ్రత్తగా చదవాలి. ఆ పదార్థాలలో పామాయిల్ లేదా కూరగాయల నూనె ఉంటే, అది ఫ్రోజెన్ డెజర్ట్,  అందులో పాల కొవ్వు ఉంటే, అది ఐస్ క్రీమ్. ఇవన్నీ ప్యాకెట్ పైన కూడా మెన్షన్ చేసి ఉండాలి.                                    *రూపశ్రీ