బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్పందించారు. ఏటా 2500 నుంచి 3000 టీఎంసీల గోదావరి జలాలు వరదల రూపంలో వృధాంగా సముద్రంలో కలిసిపోతుండగా, కేవలం 200 టీఎంసీలను బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఉపయోగించుకోవాలన్న ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ నాయకులు ద్వేషభావంతో వ్యవహరించడం బాధాకరమని  సోమిరెడ్డి అన్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఏం తప్పు మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారు?" అని సోమిరెడ్డి ప్రశ్నించారు. గోదావరి నీటి వాటాలపై స్పష్టత ఉందని, 1540 టీఎంసీల నికర జలాల్లో ఏపీకి 572 టీఎంసీలు, తెలంగాణకు 968 టీఎంసీలు కేటాయించగా, ఇప్పటివరకు రెండు రాష్ట్రాలు కలిపి 800 టీఎంసీలను కూడా వినియోగించలేకపోతున్నాయని ఆయన గుర్తు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమ, నెల్లూరు, పల్నాడు ప్రాంతాల్లో 7.42 లక్షల ఎకరాలకు సాగునీరు, 2.58 లక్షల ఎకరాలకు స్థిరీకరణ, 80 లక్షల మందికి తాగునీరు, పరిశ్రమలకు 20 టీఎంసీల నీటిని అందించాలన్నది ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని సోమిరెడ్డి వివరించారు.  "గోదావరి జలాలతో రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను మరిచిపోవద్దు. ఒక్క చుక్క నీరు ఇవ్వమని హరీశ్ రావు చెప్పడం బాధాకరం" అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 450 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారని, అయినా ఏపీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, అలాగే తెలంగాణలో ఇతర ప్రాజెక్టులపైనా వ్యతిరేకత వ్యక్తం చేయలేదని సోమిరెడ్డి పేర్కొన్నారు. "తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. ఏపీ ప్రజలను పాకిస్తాన్ ఉగ్రవాదులుగా చూడవద్దు. రాష్ట్రం విడిపోయినా మన మధ్య బేధాలెందుకు?" అని తెలంగాణ నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
  ఏపీ మెగా డీఎస్సీ కీ విడుదలైంది. 16,347 టీచర్ల నియామకాల కోసం జూన్ 6 నుంచి జూలై 2 వరకు పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక కీ విడుదల చేశాక అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించాక ఫైనల్ కీ రిలీజ్ చేసినట్లు డీఎస్సీ కన్వీనర్ ఎం. వి కృష్ణారెడ్డి తెలిపారు. దీనిపై అభ్యంతరాల స్వీకరణ ఉండదని పేర్కొన్నారు.  కీ కోసం అభ్యర్థులు ఈ  https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి చెక్ చేసుకోవచ్చును. ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీలోని అన్ని ఖాళీలకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.
  వరుసగా నాలుగు సెంచురీలు. ఆపై మొన్నటికి మొన్నపద్మ అవార్డు. ఆపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఎన్టీఆర్ అవార్డు. ఇప్పుడు చూస్తే ఏకంగా ఆయన చిత్రానికి జాతీయ అవార్డు. ఎటు నుంచి ఎటు చూసినా బాలకృష్ణ ప్రభ నానాటికీ వెలిగిపోతూ కనిపిస్తోంది. ఆ మాటకొస్తే ఆయన పానిండియా స్టార్ కావడానికి పెద్దగా కష్టపడనవసరం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అఖండ- 2 మేకింగ్ లో ఉన్నారు. ఇది చాలు బాలకృష్ణను మరో టాలీవుడ్ టర్న్ డ్ పానిండియా స్టార్ ని చేయడానికని తెలుస్తోంది. కారణమేంటంటే అది ఎలాగూ జాతీయ వ్యాప్తంగా గుర్తు పట్టే పాత్ర. కాబట్టి ఈ దిశగా బాలకృష్ణ ఇమేజీని  పెంచడంలో ఏమంత కష్టం కాదంటున్నారు విశ్లేషకులు. బాలకృష్ణతో సమానంగా అప్పట్లో ఒక వెలుగు వెలిగిన వారెవరని చూస్తే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున. ఆ రోజుల్లో చిరంజీవి- బాలకృష్ణ- వెంకటేష్- నాగార్జున ఒక టాలీవుడ్ హీరో సెట్ గా పిలిచేవారు. వీరందరిలోనూ ప్రెజంట్ హైపర్ యాక్టివ్ గా ఉన్నవారెవరని చూస్తే బాలకృష్ణ మెయిన్ గా తెలుస్తోంది.  బాలయ్య బాబు ఏ శుక్రయోగంలో ఉన్నారో తెలీదు గానీ.. ఇటు చూస్తే రాజకీయంగా టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించి వరుసగా రెండో ఏడాది కూడా దూసుకెళ్తోంది. ఇటు చూస్తే బాలయ్య బాబు కూడా అన్ని  రకాలుగా విజయపరంపర కొనసాగిస్తున్నారు. ఆ మాటకొస్తే బాలయ్య బాబు సినిమా బాగా ఆడితే అది పార్టీకి కూడా ఎంతో మేలు చేస్తుందన్న సెంటిమెంట్లున్నాయ్.  అంతెందుకు ఆయన బాగుంటే అంతా బాగుంటుందన్న నమ్మకం అందరిలోనూ ఉంది. దీంతో బాలకృష్ణ పరి పరి విధాల ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ పరంగా చూసినా ఆయన మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్. ఎందుకంటే తన ఇద్దరు అల్లుళ్లలో ఒకరు ఎమ్మెల్యే- మంత్రి, మరొకరు విశాఖ ఎంపీ. ఇక కుమారుడి తెరంగేట్రం కూడా ఇదే టైంలో జరిగిపోతే.. బాలకృష్ణ సంతసం సంపూర్ణమయ్యేలా తెలుస్తోంది.  
ALSO ON TELUGUONE N E W S
సినిమా పేరు: సార్ మేడమ్ తారాగణం: విజయ్ సేతుపతి, నిత్యామీనన్, శరవణన్, యోగిబాబు, రోషిని హరి ప్రియన్, దీపా శంకర్, మైనా నందిని ఆర్ కె సురేష్  తదితరులు   సంగీతం:సంతోష్ నారాయణ్   ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ్  రచన, దర్శకత్వం: పాండిరాజ్  సినిమాటోగ్రాఫర్: ఎం సుకుమార్   బ్యానర్: సత్య జ్యోతి ఫిలింస్ నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్  విడుదల తేదీ: అగస్ట్ 1 ,2025  'విజయ్ సేతుపతి'(Vijay Sethupathi),'నిత్యామీనన్'(Nithya Menen)వంటి క్రేజీ కాంబినేషన్ లో ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'సార్ మేడమ్'(Sir Madam).తమిళనాట 'తలైవన్, తలేవి' పేరుతో  గత వారం జులై 25 న  విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ ఆకాష్ అలియాస్ ఆకాశరాజు(విజయ్ సేతుపతి) అతని కుటుంబం ఒక చిన్న హోటల్ ని నడుపుకుంటు  జీవనాన్ని కొనసాగిస్తు ఉంటుంది. ముక్కుసూటి తనం, మంచితనం కలగలిసిన ఆకాశరాజు వెరైటీ పరోటాలు చెయ్యటంలో స్పెషలిస్ట్. ఆకాశరాజుకి ఉన్న లక్షణాలే కలగలిసిన రాణి(నిత్యామీనన్) కి    ఆకాశరాజుకి పెళ్లి చూపులు జరుగుతాయి. తొలి చూపులోనే ఇద్దరకీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది.  పైగా ఈ పెళ్లి చూపుల్లోనే ఆ రెండు కుటుంబాలకి సంబంధించిన ఒక రహస్యం బయటపడుతుంది. ఆకాశరాజు ని రాణి పెళ్లి చేసుకోవడానికి ఆమె కుటుంబసభ్యులు నిరాకరిస్తారు. కానీ రాణి, ఆకాశరాజు ని పెళ్లి చేసుకుంటుంది. ఒకరని విడిచి ఒకరు క్షణమైనా ఉండలేనంత ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఏర్పడుతుంది. వాళ్ళ ప్రేమకి ప్రతి రూపంగా ఒక పాప కూడా పుడుతుంది. కానీ ఇద్దరు విడాకులు తీసుకుంటారు. ఎంతో ప్రేమగా ఉన్నఆ ఇద్దరు విడాకులు ఎందుకు తీసుకున్నారు. అందుకు కారణం ఆ ఇద్దరేనా,లేక మరెవరైనా ఉన్నారా? ఆ రెండు కుటుంబాలకి చెందిన రహస్యం ఏంటి? ఆ రహస్యానికి  వాళ్ళ జీవన విధానానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ ఇద్దరి జీవితాల్లో కుటుంబసభ్యుల పాత్ర ఏంటి? విడాకులు తీసుకున్న తర్వాత ఆ ఇద్దరి పరిస్థితి ఏంటి? అసలు ఈ కథ ఏ ఉద్దేశ్యంతో  తెరకెక్కిందనేదే ఈ చిత్ర కథ.  ఎనాలసిస్  ఈ చిత్ర కథ ప్రస్తుత సమాజంలో ఇంచుమించు ప్రతి ఇంట్లోను జరిగేదే. అటువంటి కథకి ఎంటర్ టైన్ మెంట్ ని మిక్స్ చేస్తు 'విజయ్ సేతుపతి, నిత్యామీనన్ ద్వారా చెప్పించిన విధానానికి మేకర్స్ కి హాట్స్ ఫ్ చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే ప్రారంభంలోనే ఇంట్రెస్ట్ సీన్ తో ఓపెన్ చేసి కథలో లీనమయ్యేలా చేసారు. ఆ తర్వాత డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో కథని ఎస్టాబ్లిష్ చేస్తు ఆకాశరాజు, రాణి లవ్ సీన్స్ తో పాటు హోటల్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అన్ని బాగున్నాయి. కాకపోతే హోటల్ లోకి వచ్చే కస్టమర్స్ తో పాటు యోగిబాబు ద్వారా మరింతగా కామెడీ ని క్రియేట్ చెయ్యాల్సింది. ఆ దిశగా కాకుండా ఆకాశరాజు, రాణి, ఇరువురి తల్లి తండ్రులపైనే దృష్టి మొత్తం కేంద్రీకరించారు. కాకపోతే ఆ  సీన్స్ అన్ని   బాగున్నాయి. ఆకాశరాజు, రాణి ఎలా విడిపోతారు అనే క్యూరియాసిటీ  కలిగింది. ఈ రోజుల్లో చాలా మంది మగవాళ్ళు తల్లి, భార్య మధ్య నలిగిపోతు, ఎంతగా నరకాయతనం అనుభవిస్తున్నారో చెప్పడంతో పాటు,  తల్లితండ్రులు తమ కొడుకు, కూతురు కాపురాలని, ఎలా నాశనం చేస్తున్నారో కూడా చూపించారు. అలా అని వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. 'ఇగో' తోనే చేస్తున్నారని చెప్పిన విధానం కన్విన్స్ గా ఉంది. ఆకాశరాజు దగ్గర్నుంచి రాణి అలిగి ఎన్నోసార్లు పుట్టింటికి  బయలుదేరుతుంటే, ఆకాశరాజు ఆమె వెనకాలే  వెళ్లి తిరిగి ఇంటికి తీసుకువస్తాడు. ఈ సీన్స్ తో  భార్యభర్త మధ్య అంతరాన్ని పెంచుతుంది, కుటుంబసభ్యులే అని చెప్పినట్టయ్యింది. సెకండ్ హాఫ్ లో నిజంగానే రాణి వెళ్ళిపోతుంది. ఇందుకు సంబంధించిన సీన్స్ అన్ని బాగున్నాయి.  కానీ ఆ టైం లో  ఆకాశరాజు ఫుల్ గా ఆల్కహాల్ తాగి మెలుకువ లేని స్థితిలో ఉన్నాడని చెప్పుండాల్సింది. ఆకాశరాజు చనిపోవడానికి బావిలో దూకి ఇరుక్కున్నాడన్నదే బాగోలేదు. రాణి తనదగ్గరకి రావాలని ఆకాశరాజు దేవుళ్ళకి మొక్కుకొనే సీన్స్ తో పాటు, ప్రీ క్లైమాక్స్  క్లైమాక్స్ సీన్స్ ప్రధాన బలంగా నిలిచాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ లు ఆకాశరాజు, రాణి క్యారక్టర్ లు తమ కోసమే పుట్టినట్టుగా జీవించారు. లవ్, ఎమోషన్, కామెడీ ఇలా అన్ని వేరియేషన్స్ ని అద్భుతంగా పెర్ఫర్మ్ చేసి, సదరు క్యారెక్టర్స్ ని చాలా  కాలంగా గుర్తు పెట్టుకునేలా చెయ్యడంలో సక్సెస్ అయ్యారు. విజయ్ సేతుపతి, నిత్యామీనన్ కుటుంబ సభ్యులుగా  చేసిన నటీనటులు కూడా  తమ క్యారెక్టర్ లతో మెప్పించారు. యోగి బాబు మరోసారి సహజమైన పెర్ఫార్మ్ తో నవ్వులు పూయించాడు. దర్శకత్వం చాలా బాగుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమాని పరుగెత్తించాడు. డైలాగులు ఇంకాస్త బాగుండాల్సింది. ఇటువంటి చిత్రాలకి  కెమెరా, ఎడిటింగ్ చాలా ప్రధానమైనవి. ఆ రెండు అతి పెద్ద ప్లస్ గా నిలిచాయి. మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదు, నిర్మాణ విలువలు  బాగున్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే చాలా మంది ఇళ్లలో నిత్యం జరిగే  కథకి, వైవిధ్యమైన బ్యాక్ గ్రౌండ్ ని, వైవిధ్యమైన  క్యారక్టరేజేషన్స్ ని ఎంచుకోవడం కొత్తగా ఉంది.  విజయ్ సేతుపతి, నిత్యామీనన్  నటన ప్లస్ పాయింట్.                రేటింగ్ 2 .75 /5                                                                                                                                                                                                                                                                        అరుణాచలం   
భారత ప్రభుత్వం శుక్రవారం (ఆగస్ట్ 1) నాడు 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్ని ప్రకటించింది. ఈ క్రమంలో తెలుగు చిత్రాలు జాతీయ స్థాయిలో సత్తా చాటుకున్నాయి. ఈ క్రమంలో ‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి గానూ ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి బండ్రెడ్డికి అవార్డు లభించింది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, గోపీ టాకీస్ బ్యానర్ల మీద తబిత సుకుమార్ సమర్పణలో పద్మావతి మల్లాది తెరకెక్కించిన ఈ ‘గాంధీ తాత చెట్టు’ చిత్రం ఇప్పుడు జాతీయ స్థాయిలో మార్మోగిపోతోంది. అందరి హృదయాల్ని తాకేలా, మనసుల్ని హత్తుకునేలా ‘గాంధీ తాత చెట్టు’ కథ ఉంటుంది. తాత కోసం మనవరాలు ఏం చేసింది? ఓ చెట్టుని కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది? చెట్టు ప్రాముఖ్యత ఏంటి? అంటూ సాగిన కథ, కథనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో సుకృతి వేణి బండ్రెడ్డి నటనకు అందరూ ముగ్దులయ్యారు. మొదటి చిత్రంలోనే అంత గొప్పగా నటించిన సుకృతి వేణి బండ్రెడ్డికి ఇప్పుడు తగిన పురస్కారం లభించింది. మొదటి చిత్రంతోనే ఇలా జాతీయ అవార్డును సాధించడం అంటే మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయగా సుకృతి వేణి నిలిచారు. జాతీయ స్థాయిలో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవార్డు గెలిచిన సుకృతి వేణి బండ్రెడ్డిపై తెలుగు చిత్ర సీమ ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు తెలుపుతోంది.
తెలుగు సినిమా మరోసారి జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. ఆగస్ట్‌ 1న కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ అవార్డులను ప్రకటించింది. 2023లో విడుదలైన పలు భాషా చిత్రాలకు సంబంధించి వివిధ కేటగిరీల్లో ప్రకటించిన అవార్డుల్లో తెలుగు సినిమాకు 7 అవార్డులు దక్కాయి. 2021 సంవత్సరానికి ‘పుష్ప’ చిత్రంలో నటించిన అల్లు అర్జున్‌  జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. 2023 సంవత్సరానికి ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్‌ కేసరి’ ఎంపికైంది.  ఇప్పటివరకు శ్రీశ్రీ, వేటూరి సుందరరామ్మూర్తి, సుద్దాల అశోక్‌తేజ ఉత్తమ గేయ రచయితలుగా జాతీయ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ‘బలగం’ చిత్రంలోని ‘ఊరూ.. పల్లెటూరు..’ పాటను రచించిన కాసర్ల శ్యామ్‌కు ఉత్తమ గేయ రచయితగా అవార్డు లభించింది. తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న నాలుగో రచయితగా కాసర్ల శ్యామ్‌ నిలిచారు. ఈ పాటను రామ్‌ మిర్యాల, మంగ్లీ ఆలపించారు. ‘హనుమాన్‌’ చిత్రానికి రెండు అవార్డులు లభించాయి. ఉత్తమ ఎవిజిసి అవార్డు(యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌ మరియు కామిక్‌)తోపాటు ఉత్తమ యాక్షన్‌ డైరెక్టర్స్‌గా నందు, పృథ్వి ఎంపికయ్యారు. సంచలన విజయం సాధించిన ‘బేబీ’ చిత్రానికి కూడా రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే రైటర్‌గా సాయిరాజేష్‌ నీలంకు, ఉత్తమ నేపథ్యగాయకుడిగా ‘ప్రేమిస్తున్నా..’ పాటను ఆలపించిన పి.వి.ఎన్‌.ఎస్‌.రోహిత్‌కు అవార్డు లభించింది. ‘గాంధీతాత చెట్టు’ చిత్రంలో ఉత్తమ నటన ప్రదర్శించిన సుకృతివేణి బండ్రెడ్డికి ఉత్తమ బాలనటిగా ఎంపికయ్యారు. సుకృతివేణి.. ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు సుకుమార్‌ కుమార్తె అనే విషయం అందరికీ తెలిసిందే. 
Shah Rukh Khan did not win the National Award as Best Actor for long and his fans do complain about it. Now, he won National Award for his performance in Jawan and he is sharing it with Vikrant Massey. Rani Mukherji won best actress for Mrs. Chatterjee vs Norway. Rocky Aur Rani Kii Prem Kahani won Popular Film award.  12th Fail won best feature film. For Telugu Cinema, Nandamuri Balakrishna's Bhagavanth Kesari won Best Telugu Film and Baby won best screenplay, Best playback singer awards. Rohit won the award for his impeccable soulful singing. NBK's Bhagavanth Kesari attracted praises for its women empowerment theme and strong message.  HanuMan won two National Awards as Best Animation, Visual Effects, Comic and Gaming film and Action Direction. The movie made on limited budget thrilled audiences with its visual effecrs and superhero theme, hence it became a Pan-India blockbuster. Prashant Varma made entire Nation look towards Telugu Cinema with his vision.    Even Harshavardhan Rameshwar won Naitonal Award for Best Background Score for Animal and GV Prakash Kumar won Best Music (Songs) for Vaathi/ Sir.    Here is a comprehensive list of the winners across various categories: Feature Films Best Feature Film: 12th Fail Best Director: Sudipto Sen (The Kerala Story) Best Actor: Shah Rukh Khan (Jawan) and Vikrant Massey (12th Fail) Best Actress: Rani Mukerji (Mrs. Chatterjee vs. Norway) Best Supporting Actor: Vijayaraghavan (Pookkalam) and Muthupettai Somu Bhaskar (Parking) Best Supporting Actress: Urvashi (Ullozhukku) and Janki Bodiwala (Vash) Best Popular Film Providing Wholesome Entertainment: Rocky Aur Rani Kii Prem Kahaani Best Film Promoting National, Social and Environmental Values: Sam Bahadur Best Children's Film: Naal 2 (Marathi) Best Debut Film of a Director: Ashish Avinash Bende (Aatmapamphlet) Best Film in AVGC (Animation, Visual Effects, Gaming and Comic): Hanu-Man (Telugu) Best Action Direction: Hanu-Man (Telugu) Best Cinematography: Prasantanu Mohapatra (The Kerala Story) Best Music Direction (Songs): G. V. Prakash Kumar (Vaathi) Best Music Direction (Background Score): Harshavardhan Rameshwar (Animal) Best Male Playback Singer: P. V. N. S. Rohit (Baby) Best Female Playback Singer: Shilpa Rao (Jawan) Best Lyrics: Kasarla Shyam (Balagam) Best Hindi Film: Kathal: A Jackfruit Mystery Best Telugu Film: Bhagavanth Kesari Best Tamil Film: Parking Best Malayalam Film: Ullozhukku Best Kannada Film: Kandeelu: The Ray of Hope Best Gujarati Film: Vash Best Marathi Film: Shyamchi Aai Best Bengali Film: Deep Fridge Best Punjabi Film: Godday Godday Chaa Best Odia Film: Pushkara Best Assamese Film: Rongatapu 1982 Non-Feature Films Best Non-Feature Film: Flowering Man (Hindi) Best Documentary Film: God Vulture and Human Best Short Film: Giddh The Scavenger (Hindi) Best Writing on Cinema Best Film Critic: Utpal Datta (Assamese)
  71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డుల్లో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'భగవంత్ కేసరి' సత్తా చాటింది. ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. అలాగే 'హనుమాన్', 'బేబీ' వంటి తెలుగు సినిమాలు కూడా సత్తా చాటాయి. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, బెస్ట్ ఫిల్మ్ (విజువల్ ఎఫెక్ట్స్) విభాగాల్లో హనుమాన్, బెస్ట్  స్క్రీన్ ప్లే విభాగంలో బేబీ అవార్డులు గెలుపొందాయి. బలగంలోని ఊరు పల్లెటూరు పాటకు ఉత్తమ గీత రచయితగా కాసర్ల శ్యామ్ అవార్డు గెలుచుకున్నారు.   2023 ఏడాది గాను ఉత్తమ జాతీయ నటుడు విభాగంలో ఇద్దరు ఎంపికయ్యారు. జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ చిత్రానికి విక్రాంత్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుపొందారు. ది కేరళ స్టోరీ సినిమాకి గాను సుదీప్తో సేన్ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ ఎంపికైంది.   71st National Awards  బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: 12th ఫెయిల్  బెస్ట్ యాక్టర్: షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మెస్సీ (12th ఫెయిల్) బెస్ట్ యాక్టర్ ఫిమేల్: రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే) బెస్ట్ డైరెక్టర్: కేరళ స్టోరీ, సుదీప్తో సేన్ బెస్ట్ ఫిల్మ్: యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్: హనుమాన్  బెస్ట్ చిల్డ్రన్ సినిమా: నాల్ 2 (మరాఠీ) బెస్ట్ ఫీచర్ పిల్మ్ ప్రమోటింగ్ నేషనల్ సోషల్ ఎన్విరాన్మెంటల్: స్యామ్ బహద్దూర్ బెస్ట్ పాపులర్ ఫిల్మ్ హోల్ సమ్ ఎంటర్‌టైన్మెంట్స్: రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్: ఆత్మ పామ్ప్లేట్ బెస్ట్ తెలుగు ఫిల్మ్: భగవంత్ కేసరి  బెస్ట్ తమిళ్ ఫిల్మ్: పార్కింగ్ బెస్ట్ పంజాబి ఫిల్మ్: గోడే గోడే ఛా  బెస్ట్ ఒడియా ఫిల్మ్: పుష్కరా  బెస్ట్ మరాఠీ ఫిల్మ్: శ్యామ్చి ఆయ్  బెస్ట్ మలయాళం ఫిల్మ్: ఉల్లుజు బెస్ట్ కన్నడ ఫిల్మ్: ది రే ఆఫ్ హోప్ బెస్ట్ హిందీ ఫిల్మ్: కఠల్: ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ బెస్ట్ గుజరాతీ ఫిల్మ్: వష్ హైఫ్నోసిస్  బెస్ట్ బెంగాలి ఫిల్మ్: దీప్ ఫ్రిడ్జ్ బెస్ట్ అస్సామి ఫిల్మ్: రొంగటపు 1982  బెస్ట్ యాక్షన్ డైరెక్షన్: నందు పృథ్వీ (హనుమాన్ ) బెస్ట్ కొరియోగ్రఫీ: ధింధోర బజే రే, వైభవి మర్చంట్ బెస్ట్ లిరిక్స్: కాసర్ల శ్యామ్ (బలగం - ఊరు పల్లెటూరు) బెస్ట్ మ్యూజిక్ డైరెక్ఠర్: సాంగ్స్ జివి ప్రకాశ్ కుమార్ (వాతి ), బ్యాగ్రౌండ్ స్కోర్ హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్) బెస్ట్ సౌండ్ డిజైనింగ్: సచిన్ సుధాకరన్ అండ్ హరిహరన్ మురళీధరన్ (యానిమల్ ) బెస్ట్ స్క్రీన్ ప్లే: సాయి రాజేష్ (బేబీ), రామ్ కుమార్ బాలకృష్ణన్ (పార్కింగ్) బెస్ట్ సినిమాటోగ్రఫీ: ప్రశాంతను మోహపాత్ర (కేరళ స్టోరీ) బెస్ట్ ఫీమేల్ సింగర్: శిల్పా రావు (జవాన్- చెలియా) బెస్ట్ మేల్ సింగర్: రోహిత్ విపిఎస్ఎన్ (బేబీ - ప్రేమిస్తున్నా) బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: సుకృతి వేణి బండ్రెడ్డి(గాంధీ తాత చెట్టు), కబీర్ ఖాన్దారే (గిప్సీ - మరాఠీ), త్రీషా తోసర్, శ్రీనివాస్ పోకలే అండ్ భార్గవ్ జాగ్తాప్ (నాల్ 2 - మరాఠీ)
2025 జనవరి నుంచి జూలై వరకు పలు భాషల్లో ఎన్నో సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. అయితే ఆగస్ట్‌ నెలలో రిలీజ్‌ అయ్యే సినిమాలు కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ఈ ఏడు నెలల్లో ఎక్కువ సినిమాలు రిలీజ్‌ అవుతున్నది ఈ నెలలోనే. జూలై 31న విడుదలైన విజయ్‌ దేవరకొండ సినిమా ‘కింగ్డమ్‌’ డివైడ్‌ టాక్‌తోనే మొదలై కలెక్షన్ల పరంగా ఫర్వాలేదు అనిపించుకుంటోంది. ఇక ఆగస్ట్‌ 1న విజయ్‌ సేతుపతి, నిత్యా మీనన్‌ ప్రధాన పాత్రల్లో పాండిరాజ్‌ రూపొందించిన ‘సార్‌ మేడమ్‌’ తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ అయింది. వారం క్రితమే ఈ సినిమా తమిళ్‌ వెర్షన్‌ విడుదలై మంచి టాక్‌ సంపాదించుకుంది.  వీటితో పాటు శుక్రవారం ఉసురే, థాంక్‌ యు డియర్‌, బాలీవుడ్‌ మూవీస్‌ సన్నాఫ్‌ సర్దార్‌ 2 , ధఢక్‌ 2 లాంటి మూవీస్‌ వచ్చేస్తున్నాయి. వీటిలో ఏ సినిమా ఆడియన్స్‌ను మెప్పిస్తుందో చూడాలి. ఇక రెండో వారంలో ఆగస్ట్‌ 8న వైవా హర్ష, ప్రవీణ్‌ ప్రధాన పాత్రల్లో ‘బకాసుర రెస్టారెంట్‌’ రిలీజ్‌ కాబోతోంది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. హిందీ చిత్రాలు ‘హీర్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘అందాజ్‌2’ కూడా ఇదే రోజు రిలీజ్‌ అవుతున్నాయి. ఈ కొత్త సినిమాల వరసలోనే సూపర్‌స్టార్‌ మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో 20 సంవత్సరాల క్రితం విడుదలైన ‘అతడు’ చిత్రాన్ని ఆగస్ట్‌ 9న మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా 4కె వెర్షన్‌లో రీరిలీజ్‌ చేయనున్నారు. ఇక స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రెండు సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి. రజినీకాంత్‌ హీరోగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కూలీ’ ఆగస్ట్‌ 14న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో నాగార్జున నెగెటివ్‌ షేడ్స్‌ వున్న క్యారెక్టర్‌ పోషించారు. అలాగే కన్నడ హీరో ఉపేంద్ర కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ ఒక ప్రత్యేక పాత్రలో అలరించబోతున్నారు. ఈ సినిమాపై తమిళ్‌, తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.  ఇక భారతదేశంలోని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో సినిమా ‘వార్‌2’. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా ఆగస్ట్‌ 14నే రిలీజ్‌ కాబోతోంది. ఈ సినిమాతో ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘వార్‌’ చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ‘వార్‌2’పై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. అందులోనూ ఎన్టీఆర్‌ నటించిన తొలి హిందీ సినిమా కావడం కూడా ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ భారీ వ్యూస్‌ సాధించడమే కాకుండా థియేటర్లలో సినిమా చూసేందుకు ప్రేక్షకుల్ని సిద్ధం చేసింది. కూలీ, వార్‌2 చిత్రాలు బాక్సాఫీస్‌పై భారీ ప్రభావం చూపించే అవకాశం ఉంది.  ఆగస్ట్‌ మూడో వారంలో అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ‘పరదా’ చిత్రం 22న విడుదల కాబోతోంది. ప్రేమ, భావోద్వేగాలతో నిండిన ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ కూడా ఇదేరోజు రిలీజ్‌ అవుతోంది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే అవకాశం ఉంది. ఈ కొత్త సినిమాల మధ్యలోనే మెగాస్టార్‌ చిరంజీవి ‘స్టాలిన్‌’ చిత్రాన్ని రీరిలీజ్‌ చెయ్యబోతున్నారు. దాదాపు 20 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ ఓపెనింగ్స్‌ సాధించి చిరంజీవి కెరీర్‌లో ఓ మంచి సినిమాగా నిలిచింది. చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్‌ 22న ‘స్టాలిన్‌’ చిత్రాన్ని 4కె వెర్షన్‌లో రీరిలీజ్‌ చేస్తున్నారు.  మాస్‌ మహారాజ్‌ రవితేజ నటించిన 75వ చిత్రం ‘మాస్‌ జాతర’ రాబోతోంది. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని వినాయకచవితి కానుకగా ఆగస్ట్‌ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌ కృషి చేస్తోంది. అయితే రిలీజ్‌ డేట్‌ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు. నారా రోహిత్‌ హీరోగా వెంకటేష్‌ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సుందరకాండ’ చిత్రాన్ని ఆగస్ట్‌ 27న విడుదల చేయబోతున్నారు. ఇక నెలాఖరులో సిద్ధార్థ్‌ మల్హోత్రా, జాన్వీ కపూర్‌ జంటగా రూపొందిన ‘పరమ్‌ సుందరి’ చిత్రాన్ని ఆగస్ట్‌ 29న విడుదల చేస్తున్నారు. నార్త్‌ ఇండియన్‌ అబ్బాయి, సౌత్‌ ఇండియన్‌ అమ్మాయి మధ్య జరిగే ప్రేమ కథగా తుషార్‌ జలోటా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అదేరోజున కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో కె.చంద్రు దర్శకత్వంలో రూపొందిన ‘రివాల్వర్‌ రీటా’ విడుదల కాబోతోంది. కామెడీ నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడున్న ట్రెండ్‌కి భిన్నంగా పాత సినిమా టైటిల్‌తో వస్తుండడం విశేషం. ఇలా ఆగస్ట్‌ నెల మొత్తం ఎన్నో సినిమాలు సందడి చేయబోతున్నాయి. మరి ఏ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుంది, ఏ సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది అనేది చూడాలి. 
Following the sensational success of the chart-topping single "Kattanduko Janaki," the creators of the upcoming film Mithra Mandali have released their second track, "Swecha Standuu." This playful and light-hearted song is already creating a buzz for its unique style and catchy rhythm. Composed by RR Dhruvan with lyrics co-written by Dhruvan and director Vijayendar S, the song is a quirky proposal anthem. It cleverly mixes Telugu and "broken English" in a way that feels fresh and humorous, reminiscent of the viral sensation "Why This Kolaveri Di." This genre-defying approach makes "Swecha Standuu" a perfect fit for a youthful and fun-loving audience. Vocalists Dhanunjay Seepana and RR Dhruvan deliver a vibrant and relatable performance that's sure to strike a chord with Gen Z listeners. The track is filled with youthful energy and clever storytelling, positioning it to become the next big hit and another success for the highly anticipated film.   Priyadarshi, Niharika NM, Vishnu Oi, Rag Mayur, Prasad Behara, with an ensemble that also includes Vennela Kishore, Satya, and VTV Ganesh are cast in the film. 
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)తన ప్రీవియస్ మూవీ 'హరిహరవీరమల్లు'(HariHara Veeramallu)తో అభిమానులని,ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అందరి దృష్టి అప్ కమింగ్ మూవీ 'ఓజి'(Og)పై ఉంది.  గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 'ఆర్ఆర్ఆర్'(RRR)నిర్మాత 'దానయ్య'(Dvv Danayya)నిర్మిస్తుండగా . 'సాహూ' మూవీ ఫేమ్ సుజిత్(Sujeeth)దర్శకుడు. పవన్ సరసన ప్రియాంక మోహన్(Priyanka MOhan)జత కడుతుండగా  ఇమ్రాన్ హష్మీ, శ్రీయరెడ్డి, 'అర్జున్ దాస్' కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajinikanth),నాగార్జున(Nagarjuna),దర్శకుడు 'లోకేష్ కనగరాజ్'(Lokesh Kanagaraj)కాంబోలో తెరకెక్కిన 'కూలీ'(Coolie)పై పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ బిగ్ హీరో అమీర్ ఖాన్(Amirkhan)కూడా ఒక స్పెషల్ రోల్ లో కనిపించనున్నాడు. అగస్ట్ 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ మూవీ ఆగస్ట్ 13న యుఎస్ లో గ్రాండ్ ప్రీమియర్స్ కి సిద్ధం అయ్యింది. ఈ ప్రీమియర్స్ లో కూలీ ప్రింట్ తో పాటు ఓజి స్పెషల్  గ్లింప్స్ ని కూడా అటాచ్ చేసి విడుదల చేస్తున్నారనే టాక్ వినపడుతుంది. మేకర్స్ అయితే ఈ విషయంలో అధికార ప్రకటన ఇవ్వలేదు.  ఓజి నుంచి రేపు ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది. సంగీత దర్శకుడు థమన్(Taman)చాలా ఇంటర్వ్యూలలో  ఓ జి సాంగ్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయని చెప్పిన నేపథ్యంలో రేపు విడుదల కానున్న సాంగ్ ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఉంది. 'ఓజి' నుంచి ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ తో పాటు,టీజర్ రిలీజై సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.    
  ఎప్పుడు ఏ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చెప్పలేము. ఒక్కోసారి పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తాయి. ఇటీవల విడుదలైన 'మహావతార్ నరసింహ' చిత్రం ఆ కోవలోకే వస్తుంది. జూలై 25న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ యానిమేషన్ ఫిల్మ్.. అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది. (Mahavatar Narsimha)   'కేజీఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి సినిమాలతో పాన్ ఇండియా సక్సెస్ లు అందుకున్న హోంబలే ఫిలిమ్స్.. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ ను ప్రకటించినప్పుడు పెద్దగా అంచనాలు లేవు. ఈ యూనివర్స్ నుంచి ఏడు సినిమాలు వస్తాయని.. మొదటి సినిమా 'మహావతార్ నరసింహ' ఈ ఏడాది వస్తుందని.. ఆ సంస్థ కొద్దిరోజుల క్రితం ప్రకటించింది.    'మహావతార్ నరసింహ'  చిత్రం జూలై 25న విడుదలైంది. విడుదలకు ముందురోజు వరకు ప్రేక్షకుల్లో కానీ, ట్రేడ్ లో కానీ.. ఈ సినిమాపై అంచనాలు లేవు. అందరూ దీనిని ఒక మామూలు యానిమేషన్ సినిమాలాగే చూశారు. అయితే ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది.     'మహావతార్ నరసింహ'  సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రోజురోజుకి వసూళ్లు పెరుగుతున్నాయి. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. మొదటి వారంలోనే ఈ చిత్రం రూ.53 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఫుల్ రన్ లో రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.   డివోషనల్ ఫిల్మ్ కావడం, యానిమేషన్ వర్క్ బాగుందని టాక్ రావడం, పిల్లలు ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపించడం.. వంటి కారణాలతో 'మహావతార్ నరసింహ'కు ఈ స్థాయి ఆదరణ లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల ప్రేక్షకులు థియేటర్ బయట చెప్పులు విప్పి మరీ లోపలికి వెళ్తున్నారంటే.. ఈ సినిమాకి వారు ఎంతలా కనెక్ట్ అవుతున్నారో అర్థంచేసుకోవచ్చు. మొత్తానికి, స్టార్స్ లేకపోయినా కంటెంట్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకోవచ్చని 'మహావతార్ నరసింహ' మరోసారి రుజువు చేసింది.   
టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో ఉన్న అమెరికాలోనే అతిపెద్ద హనుమాన్ టెంపుల్ మెక్కినీలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి సువర్ణ హస్తాలతో RP పట్నాయక్ స్వీయ సంగీత దర్శకత్వంలో పాడిన హనుమాన్ చాలీసా విడుదల జరిగింది. శ్రీ గోస్వామి తులసీదాసు 16వ శతాబ్దంలో అవధి భాషలో రచించిన ఈ హనుమాన్ చాలీసా, తెలుగు, తమిళ్, కన్నడ, ,హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో ఆయా భాషలవారు చదువుకుంటూ పాడుకునేలా వీడియో రూపొందించటం జరిగింది అని దీని కార్యనిర్వహక నిర్మాత రఘురామ్ బొలిశెట్టి తెలియజేశారు.  హనుమంతుని అపార శక్తి గురించి వర్ణించే ఈ హనుమాన్ చాలీసా వినేటప్పుడు ఒక అద్భుతమైన అనుభూతి ఖచ్చితంగా కలుగుతుందని దీనిని రూపొందించిన RP పట్నాయక్ అన్నారు.  శ్రీ గణపతి సచ్చిదానంద వారు విని ఇది నేటి యువతకు బాగా చేరువవుతుందని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో హనుమాన్ టెంపుల్ ఫౌండర్ శ్రీ ప్రకాష్ రావు గారు కూడా పాల్గొన్నారు. ఇది RP పట్నాయక్ తన స్వీయ యూట్యూబ్ ఛానెల్ లో విడుదల అయ్యింది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఒక రిలేషన్ ఏర్పడటం పెద్ద సమస్య కాదు.. కానీ ఆ రిలేషన్ అన్ని సమస్యలను ఎదుర్కొని విజయవంతం కావడం నేటి కాలంలో చాలా పెద్ద సాహసమనే చెప్పాలి. ఎందుకంటే సంబంధాలు  ఏర్పడినంత తొందరగానే బ్రేకప్ అవుతున్నాయి. ముఖ్యంగా బార్యాభర్తల బంధం మన భారతదేశ ధర్మానికి ఒక ముఖ్యమైన మూల స్తంభం. అలాంటి మూల స్తంభం చాలా బలహీనం అయి, బీటలు వారుతోంది. ఈ కారణంగా నేటికాలంలో వివాహాలు చేసుకోవాలన్నా కూడా చాలామంది సంకోచిస్తున్నారు. ఒక రిలేషన్  విజయవంతం కావడానికి ప్రేమ, నమ్మకం, గౌరవంతో పాటు ఇద్దరి మధ్య  స్పష్టమైన సంభాషణ  అవసరం. సంతోషకరమైన సంబంధానికి పునాది అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. సంబంధంలో నిజాయితీ, అర్థం చేసుకోవడం,  ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనవి. సంబంధం కొత్తదైనా లేదా పాతదైనా,  ఇవన్నీ  ప్రతి జంటకు ముఖ్యమైనవే. ఇది సంబంధాన్ని బలపరుస్తుంది,  సంబంధంలో సమస్యలు రాకుండా చేస్తుంది.  ప్రతి జంట సంతోషకరమైన వైవాహిక జీవితం కావాలంటే ఏం చేయాలి అనేది రిలేషన్షిప్ నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.  వాటి గురించి తెలుసుకుంటే..  వినడం.. వినడం అనేది ఒక సాధారణమైన విషయమే  కానీ సంబంధంలో చాలా ముఖ్యమైనది.   ఇది ప్రతి ఒక్కరూ అది అబ్బాయి అయినా లేదా అమ్మాయి అయినా తెలుసుకోవాలి. భార్యాభర్తల రిలేషన్ లో  మాట్లాడటం,  అభిప్రాయాన్ని వ్యక్తపరచడంతో పాటు, వినడం కూడా చాలా ముఖ్యం. తరచుగా భార్యాభర్తలు ఒకరు చెప్పేది మరొకరు వింటారు.  కానీ కొందరి ఉద్దేశ్యం ఎలా ఉంటుందంటే కేవలం వినడం ఆ తరువాత ఆ విషయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం తనకు నచ్చినట్టే జరగాలని అనుకోవడం జరుగుతుంది.  ఇది సంబంధాన్ని చాలా దెబ్బ తీస్తుంది.ఆరోగ్యకరమైన రిలేషన్ ఉండాలంటే అవతలి వ్యక్తి చెప్పే మాటలను వినడమే కాదు.. వారికి ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. స్పేస్.. భార్యాభర్తల బంధంలో ప్రేమదే అగ్రస్థానం. భాగస్వాములు అయ్యాక ఒకరికొకరు ఇచ్చే ప్రాధాన్యత,  ఒకరికి మరొకరు ఇచ్చే విలువ ఆ బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. కానీ ప్రేమ అంటే మనిషిని కట్టడి చేసినట్టు ఉండకూడదు.  ప్రతి విషయం తనకు తెలియాలి అనుకోకూడదు. కొంతమంది ప్రేమ ఎలా ఉంటుందంటే.. పెళ్లైంది కదా.. ఆ మనిషి నా సొంతం.. తనకు ఎలాంటి స్పేస్ కూడా ఉండకూడదు అని అనుకుంటారు. కానీ సంబంధంలో ప్రేమ ఎంత ముఖ్యమో.. వారికంటూ కాస్త స్పేస్.. వారికంటూ పర్సనల్ సమయం ఇవ్వడం కూడా ముఖ్యం.  స్పేస్ అనేది లేకపోతే బంధాన్ని గట్టిగా బిగించినట్టు ఉంటుంది. నిజానికి కొందరు ఇలా స్పేస్ ఇవ్వకుండా ఉండటం వల్ల అనుమాన పూరిత ప్రవర్తన అనుకునే అవకాశం కూడా ఉంటుంది. సారీ.. థ్యాంక్స్.. రిలేషన్ ను బలంగా మార్చేది ఏదైనా ఉందంటే అది తనకు ఏదైనా సహాయం చేసినప్పుడు కృతజ్ఞత చెప్పడం. అలాగే తన వైపు ఏదైనా తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడం. పెళ్లి చేసుకున్నారు, భాగస్వామి అయ్యారు కాబట్టే కదా బాధ్యత కాబట్టి మనకోసం ఏదైనా చేశారు అనుకోవడం,  కనీసం థ్యాంక్స్ చెప్పకపోవడం.. ఏదైనా తప్పు జరిగినప్పుడు సారీ చెప్పకపోగా అయితే ఏంటి? అని రివర్స్ లో వాళ్ళ మీద అరవడం,  సమర్థించుకోవడం వంటివి చేయడం వల్ల ఒకరిమీద ఒకరికి ఆశించినంత ప్రేమ,  గౌరవం నిలబడవు. ఎప్పుడైతే ఇట్లా సందర్బానుసారంగా సారీలు,  థ్యాంక్సులు చెపుతూ ఉంటారో అప్పుడు ప్రేమ,  గౌరవం పెరుగుతాయి.  నిజమైన ప్రేమ పెరుగుతూ ఉంటుంది.                                 *రూపశ్రీ.
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతికి ఇప్పటికీ ప్రసిద్ధి చెందాడు. మన జీవితంలో చాణక్యుడి సూత్రాలను అనుసరించడం ద్వారా మనం అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. జీవితంలో పురోగతి, విజయం సాధించాలంటే మనం కొన్ని నియమాలను పాటించాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. మీరు కూడా జీవితంలో చాలా పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించాలనుకుంటే, వీటిని పాటించండి. ఆ నియమాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. మీ సమస్యలను మీలోనే ఉంచుకోండి: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో తన జీవితంలో పురోగతి సాధించాలని, డబ్బు సంపాదించాలని కోరుకునే వ్యక్తి తన సమస్యలను లేదా బాధలను ఇతరులతో పంచుకోకూడదని చెప్పాడు. మీరు మీ సమస్యలను ఇతరులతో పంచుకున్నప్పుడు, వారు దానిని మరింత తీవ్రతరం చేయవచ్చు. జ్ఞానుల సమాజం: చాణక్యుడి ప్రకారం, మనం పురోగతి సాధించాలంటే లేదా విజయవంతమైన వ్యక్తిగా మారాలంటే, మనం మొదట జ్ఞానులతో సహవాసం చేయాలి. మీరు అజ్ఞానులతో లేదా మూర్ఖులతో ఎప్పుడూ సహవాసం చేయకూడదు. అలాంటి వారితో సహవాసం చేయడం ద్వారా మీరు మీ జ్ఞానాన్ని పెంచుకునే బదులు కోల్పోతారు. వారిని నమ్మవద్దు: చాణక్య నీతి ప్రకారం, ఇతరులను విశ్వసించే ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిది కాకుండా వేరే ప్రపంచంలో ఉన్న వ్యక్తిని ఎప్పుడూ నమ్మవద్దు లేదా సరిగ్గా వినకుండా మిమ్మల్ని పట్టించుకోకండి. అలాంటి వారు మీరు చెప్పినదానిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సగం మనస్ఫూర్తిగా వినడం ద్వారా, ఇతరులకు వేరే విధంగా చెప్పడం ద్వారా మీకు సమస్యలను కలిగించవచ్చు. ఎక్కువ నిరీక్షణ, అనుబంధం వద్దు: ఇతరులపై మితిమీరిన అంచనాలు పెట్టుకోవడం మంచిది కాదని చాణక్య నీతిలో పేర్కొన్నారు.  ఓవర్ అటాచ్మెంట్ కూడా తప్పు. సంబంధాలు ఎప్పుడు అర్థాన్ని కోల్పోతాయో చెప్పడం కష్టం. ఈ సమయంలో మంచి సంబంధం మరొక క్షణంలో దాని అర్ధాన్ని కోల్పోవచ్చు. ఖర్చుపై పరిమితులు ఉండాలి: సంపాదించిన డబ్బును కూడబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. మీ ఖర్చులు మీ ఆదాయానికి సమానంగా లేదా మించకూడదు. ఎడిటింగ్ ఎల్లప్పుడూ సరైన మార్గంలో మాత్రమే చేయాలి.  
రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు అన్నట్టుగా ఈ కాలంలో మంచి ఉద్యోగాలు, బోలెడు వసతులు, కావలసినంత సంపాదన ఉన్నా ఆరోగ్యమే సరిగ్గా ఉండటం లేదు. పుట్టడంతోనే జబ్బులతో పుట్టేస్తున్నారు పిల్లలు. పెరిగే వయసులో తగినంత శారీరక ఎదుగుదలకు సహకరించే ఆటలకు దూరం ఉండి ఎప్పుడూ పుస్తకాలతో ఉండటం వల్ల శారీరకపరంగా దృఢంగా ఉండలేకవుతున్నారు. ఇక ఉద్యోగాలు, పెళ్లిళ్లు, పిల్లలు సంసారం ఇదంతా గడుస్తూ ఉంటే వాటితో సతమతం అవ్వడం తప్ప ఆరోగ్యం అనే ఆప్షన్ గురించి సీరియస్ గా తీసుకోలేరు. పైపెచ్చు ఏదైనా జబ్బులొస్తే టెంపరరీగా నయమయ్యేందుకు మెడిసిన్స్ వాడి హమ్మయ్య అనుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో మనిషిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది అనారోగ్యమే. డబ్బు పెట్టినా కూడా పూర్తిగా కోలుకోలేని విధంగా తయారైపోతున్నారు. అలాంటి అనారోగ్యాలు ఉండకుండా చక్కగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మొట్టమొదట సంతోషంగా వుండాలి....  సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. సంతోషంగా ఉన్నప్పుడు సమస్యలు పెద్దగా ప్రభావం చూపించవు. అలాగని లేని సంతోషాన్ని ఎలా మనం తెచ్చిపెట్టుకోవడం అనిపిస్తుందేమో కానీ సంతోషం అంటే ఉన్నదనితో తృప్తిగా ఉండటం అలాగే పరిష్కరించలేని సమస్యల విషయంలో అనవసరంగా ఆలోచించి బాధపడి లాభంలేదు. పరిష్కరించ గలిగిన సమస్యల గురించి ఆలోచించనవసరం లేదు. ఎందుకంటే పరిష్కరించలేము అని తెలిసాక కేవలం రోజువారీ పనులు చేసుకుంటూ పోవడమే, ఇక పరిష్కారం అవుతాయి అని తెలిసిన పనుల గురించి అసలు ఆలోచనే అవసరం లేదు కదా. ఆహార మార్గం! శారీరకంగా మనిషి బాగుండాలి. శరీరంలో ఏర్పడే అసమతుల్యత చాలా సమస్యలకు దారితీస్తుంది. అందుకే మంచి ఆహారం ఎంతో ముఖ్యం. కేవలం ఆహారం తీసుకుంటూ ఉంటే సరిపోదు.తినే ఆహారానికి తగినంత వ్యాయామం కూడా ఎంతో ముఖ్యం. వ్యాయామం మనిషిలో ఉల్లాసాన్ని పెంచుతుంది. మంచి ఆహారం తీసుకుంటూ కనీసం గంట సేపు వ్యాయామం చేస్తూ వుంటే ఆరోగ్యం బావుంటుంది. బాడ్ హబిట్స్ బంద్! చెడు అలవాట్లు శరీరాన్ని కుళ్ళబొడుస్తాయి. ఏ రకమైన చెడు అలవాట్లను దగ్గరకు రానీయకండి. చాలామంది స్మోకింగ్, డ్రింకింగ్, కొన్ని ఇతర అలవాట్లను ( తినకుడాని ఆహార పదార్థాలు అతిగా తినడం, టైమ్ మేనేజ్మెంట్ లేకపోవడం, సోమరితనంగా ఉండటం. కష్టపడే అవసరం లేదని ఎలాంటి ఉద్యోగాలు చేయకపోవడం. ఇవన్నీ కూడా నిజానికి బాడ్ హాబిట్స్ ఏ)  నిజానికి పొగ త్రాగడం కాని, ఆల్కహాలు కాని, జూదం కాని మనకు హాయిని ప్రశాంతతను ఇవ్వలేవు. ప్రతి మనిషికి ఒక వ్యాపకం అంటూ ఉండాలి.  రీడింగ్ ఈజ్ ఏ వండర్! మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. పుస్తకాలలో కావలసినంత విజ్ఞానం లభిస్తుంది. ఎంతోమంది జీవితాలు, ఆ జీవితాలలో జరిగిన ఎన్నో విషయాలు, వాటిని ఎలా డీల్ చేయాలి, గొప్ప ఆలోచనలు ఎలా ఉంటయి?? జీవితం ఉన్నతంగా ఉండటం అంటే ఏమిటి?? ఆర్థిక, మానసిక సమస్యలు, మనుషుల మధ్య అటాచ్మెంట్స్ వంటివి అన్నీ పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు.  అదొక అద్భుత ప్రపంచం అవుతుంది.  మెడిసిన్ లెస్ లైఫ్! ఎన్ని సార్లు చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన మాట సాధ్యమైనంత వరకు ఔషధాల వాడకం తగ్గించాలి.  శరీరానికి ఆహారపదార్థాల ద్వారానే జబ్బును నయం చేసుకునే మార్గాన్ని తెలుసుకోవాలి. వీలైనంత వరకు ఇమ్యూనిటీ పెంచుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా సీజనల్ వారిగా దొరికే ఆహారం అమృతంతో సమానంగా పనిచేస్తుంది. రుచి కోసమో, సీజన్ దాటి దొరుకుతున్నాయనే ఆశతోనో వేటినీ తీసుకోవద్దు. కుదిరితే ఇంటి ముందు నాలుగు రకాల ఆకుకురా మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుకోవచ్చు అప్పుడు రసాయనాలు లేని ఆహారం మీ ముందున్నట్టే. బాగా అవసరమైనప్పుడు మాత్రమే మందులను అల్లో చేయాలి.  ప్రశాంతత! ప్రస్తుతం అందరి సమస్య ఒకటే ప్రశాంతత లేకపోవడం. దానివల్లనే ఎన్నోరకాల మానసిక సమస్యలు చుట్టుముడతాయి.  మనసు ప్రశాంతంగా వుంటే చక్కటి నిద్ర పడుతుంది. మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనసును బయట ప్రపంచం నుండి వెనక్కి లాక్కొచ్చి ఒక్కచోట ఉంచుకోవాలి. అదే ధ్యానం చేసే పని. అలా చేస్తుంటే చక్కటి నిద్ర సొంతమవుతుంది.  చక్కటి నిద్ర మాత్రమే మంచి ఆరోగ్యానికి చిహ్నం. ఎక్కువగా పనిచేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి అనే ఆలోచనతో మానసికంగా, శారీరకంగా కష్టపెట్టుకోవద్దు. ఇవన్నీ పాటిస్తే చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది.                                 ◆వెంకటేష్ పువ్వాడ
  కాఫీ.. భారతీయులు ఎక్కువగా తీసుకునే పానీయాలలో ఒకటి.  భారతదేశంలోని ప్రతి ఇంట్లో.. కాఫీ లేదా టీ.. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా తాగుతూ ఉంటారు.  అయితే చాలామంది కాఫీ వైపు మొగ్గు చూపుతారు. కాఫీ సువాసనే మనిషికి పెద్ద బూస్టింగ్ ఇస్తుంది. ప్రపంచంలోనే ఆదరణ ఉన్న పానీయాలలో కాఫీ ఒకటి. కాఫీ ఆరోగ్యానికి మంచిదే అని అంటూ ఉంటారు.  పరిమిత మోతాదులో కాఫీ తీసుకుంటే అది ఆరోగ్యానికి చేసే మేలు ఎక్కువే.. ఇది పరిమితంగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కూడా. అయితే ఇటీవల కాఫీ మీద జరిగిన పరిశోదనలలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అసలు కాఫీ తాగిన తరువాత 30 నిమిషాలలోపు శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. మెదుడు ప్రభావితం అవుతుంది.. కాఫీ తాగిన 30 నిమిషాల్లోనే అది  మెదడును ప్రభావితం చేస్తుందట.   కాఫీ తాగిన వారిని  మరింత అప్రమత్తంగా,  చురుగ్గా ఉండేలా చేస్తుంది. నిజానికి కాఫీలో ఉండే కెఫిన్  జ్ఞాపకశక్తి పనితీరును,  దృష్టిని మెరుగుపరిచే ఉద్దీపన . బాత్‌రూమ్ కు వెళ్లాలని అనిపిస్తుంది.. చెప్పుకోవడానికి కాస్త తమాషాగా,  చెప్పడానికి సిగ్గుగానూ అనిపిస్తుందేమో.. కానీ కాఫీ తాగిన తరువాత 30 నిమిషాలలోపు బాత్రూమ్ కు వెళ్ళాలి అనిపిస్తుందట. కాఫీ తాగడం వల్ల మలబద్ధకం సమయంలో  ప్రేగులలో కార్యకలాపాలు పెరుగుతాయి. ఇది బాత్రూమ్ కు వెళ్లేలా చేస్తుందట. రక్తప్రసరణ.. కాఫీ  గుండెలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది గుండెను మరింత బలపరుస్తుంది. ఇది ఏ రకమైన మంటనైనా తగ్గిస్తుంది. అందుకే కాఫీ గుండె ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కాఫీ వీరు తాగకూడదు.. కాఫీని పరిమితమైన మోతాదులో తాగడం ఆరోగ్యానికి మంచిదే.. అయితే అందరికీ కాఫీ తాగడం మంచిదని చెప్పలేం. ముఖ్యంగా ఆందోళన, రక్తపోటు, మద్యపానం అలవాటు ఉన్నవారు కాఫీ తాగడం మంచిది కాదట.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  చాలా మంది రాత్రి నిద్రపోతున్నప్పుడు కాళ్ళ సిరలు అకస్మాత్తుగా ఉబ్బుతాయి. నరాలు ఉబ్బి చాలా నొప్పిని కలిగిస్తాయి.  నిద్రకు కూడా భంగం కలిగిస్తాయి. ఇది కొన్నిసార్లు జరగడం సాధారణం.  కానీ ఇది చాలా ఎక్కువగా   జరుగుతుంటే అది విటమిన్ లోపం  సంకేతం కావచ్చని అంటున్నారు ఆహార నిపుణులు. ఏ విటమిన్ లోపం వల్ల సిరలు ఉబ్బుతాయో.. ఇది ఎందుకు జరుగుతుందో.. విటమిన్ల ప్రధాన పాత్ర ఏంటో.. తెలుసుకుంటే.. విటమిన్ల పాత్ర.. శరీర అభివృద్ధికి విటమిన్లు చాలా ముఖ్యమైనవి. విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా నరాలు,  గుండె పనితీరుకు కూడా చాలా ముఖ్యమైనవి. విటమిన్ లోపం నరాలపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. విటమిన్ సి లోపం.. విటమిన్ బి12 తో పాటు, విటమిన్ సి లోపం వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ వస్తాయి. నిజానికి విటమిన్ సి లోపం వల్ల రక్త కణాలు బలహీనపడతాయి. దీనివల్ల వెరికోస్ వెయిన్స్ వస్తాయి. విటమిన్ సి లోపాన్ని అధిగమించడానికి నారింజ, నిమ్మ, జామ వంటి సిట్రస్ పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ఇంటి చికిత్సలు.. ఐస్ కంప్రెస్.. నిద్రలో నరాలు ఉబ్బడం, పట్టేసినట్టు అవ్వడం,  నొప్పి కలిగించడాన్ని వెరికోస్ వెయిన్ అంటారు.  ఈ వెరికోస్ వెయిన్  నుండి తక్షణ ఉపశమనం పొందడానికి  కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు. వెరికోస్ వెయిన్ వచ్చినప్పుడు తీవ్రమైన నొప్పి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆ భాగానికి ఐస్ కంప్రెస్ వేయవచ్చు. 3 నుండి 5 నిమిషాలు కంప్రెస్ వేయడం వల్ల  తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఆయిల్ మసాజ్..  అకస్మాత్తుగా నరాల నొప్పి వస్తే ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి అమ్మమ్మలు సూచించిన  ది బెస్ట్ ఇంటి నివారణను ఆయిల్ మసాజ్. నరాల నొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయవచ్చు. తేలికపాటి చేతులతో మసాజ్ చేయడం వల్ల  తక్షణ ఉపశమనం లభిస్తుంది.                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  రోగనిరోధక వ్యవస్థను శరీరానికి కవచం అని పిలుస్తారు. ఇది అనేక రకాల అంటు వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. అందుకే కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే చర్యలను అందరూ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ఈ దిశలో నిరంతరం ప్రయత్నించడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనికోసం ఆహారం,  జీవనశైలిని సరిగ్గా ఉంచుకోవడం  చాలా ముఖ్యమైనది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో  విటమిన్-సి,  డి చాలా ముఖ్యమైనవి. ఈ విటమిన్లు ఆహారాలను బాగా తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుందని అంటారు. అయితే..  రోగనిరోధక వ్యవస్థకు ఈ రెండు మాత్రమే సరిపోవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడే రోగనిరోధక వ్యవస్థను  ఎలా బలోపేతం చేయవచ్చో తెలుసుకుంటే.. విటమిన్ సి-డి  ప్రయోజనాలు.. విటమిన్ సి అనేది బయోసింథటిక్, జన్యు నియంత్రణ ఎంజైమ్‌లకు అవసరమైన శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది తెల్ల రక్త కణాలు వ్యాధికారక క్రిములతో పోరాడటానికి సహాయపడుతుంది. అదేవిధంగా, విటమిన్ (డి3) రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని పరిశోధకులు అంటున్నారు. ఉదయం 10-15 నిమిషాలు ఎండలో ఉండటం ద్వారా లేదా విటమిన్-డి  అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా తగినంత మొత్తంలో విటమిన్ డి పొందవచ్చని,  రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. విటమిన్ ఇ కూడా అవసరం.. విటమిన్లు సి,  డి లాగానే, విటమిన్ ఇ కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.  ఇది శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ ముఖ్యమైన విటమిన్  శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ముఖ్యమైన 200 జీవరసాయన ప్రతిచర్యలలో భాగం. జుట్టు,  కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ ఇ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారం ద్వారా దీనిని తీసుకునేలా చూసుకోవాలి. ప్రోటీన్ కూడా ముఖ్యం.. ప్రోటీన్.. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో పాత్ర పోషిస్తున్న అమైనో ఆమ్లాలతో రూపొందించబడింది. ఈ సమ్మేళనాలు  రోగనిరోధక వ్యవస్థ కీలకమైన T కణాలు, B కణాలు,  సూక్ష్మక్రిములతో పోరాడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. ప్రోటీన్ లేని వ్యక్తులు బలహీనమైన కండరాలను కలిగి ఉండటమే కాకుండా ఇతరుల కంటే అంటు వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో జింక్ ఉందా? బలమైన రోగనిరోధక వ్యవస్థకు జింక్ కూడా చాలా అవసరం. ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడే తెల్ల రక్త కణాలలో ఒక ముఖ్యమైన భాగం. జింక్ లోపం తరచుగా  ఫ్లూ, జలుబు,  ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లకు గురి చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులు జింక్ సప్లిమెంట్లను తీసుకోవాలని సలహా ఇస్తారు. జింక్‌ను ఆహారం ద్వారా సులభంగా పొందవచ్చు.                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..