ప్రతిష్టాత్మక  జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన నేపథ్యం లో ఢిల్లీలో ఏఐసిసి అగ్రనేత రాహు ల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జూబ్లీ హి ల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన నవీన్ యాదవ్ ను రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నవీన్ యాదవ్ ను అభినందించారు. అలాగే వెల్ డన్ గుడ్ వర్క్ అంటూ సీఎం రేవంత్ నూ అభినందించినట్లు తెలిసింది.   ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవ హారాలు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై రాహుల్ తో కాంగ్రెస్ బృందం చర్చించింది.  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ సాధించిన విజయంపై రాహుల్  సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీ బ లా న్ని మరింత పటిష్ఠం చేయడానికి తీ సుకోవాల్సిన చర్యలపై నాయకులకి రాహుల్‌ సూచనలు ఇచ్చారు.  స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తు న్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, బలహీన ప్రాంతాల్లో పార్టీ బలోపేతం తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అనంతరం ఢిల్లీ పర్యటన ముగిం చుకుని రేవంత్ బృందం శనివారం (నవంబర్ 15) రాత్రి హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. 
కేసీఆర్ రాజకీయంగా క్రీయాశీలంగా లేరు. ఆయన స్థానంలో ఆయన కుమారుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. పార్టీ బాధ్యతలను కేటీఆర్ స్వీకరించిన తరువాత  జూబ్లీ ఉప ఎన్నిక పరాజయంతో కేటీఆర్ వరుస వైఫల్యాలలో హ్యాట్రిక్ సాధించినట్లైంది.  2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత కేసీఆర్ పూర్తిగా క్రీయాశీల రాజకీయాలకు దూరమై, ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అడపాదడపా.. పార్టీ నేతలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడినా, వారికి రాజకీయ దిశానిర్దేశం చేసినా గత రెండేళ్లుగా ఆయన తీరు చూస్తుంటే ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారని అనిపించక మానదు.  సరే అది పక్కన పెడితే.. తండ్రి క్రీయాశీల రాజకీయాలకు దూరమైనప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలన్నీ తానై నడిపిస్తున్న కేసీఆర్ ఆ విషయంలో విఫలమయ్యారనే చెప్పాలి. జూబ్లీ ఉప ఎన్నిక ఓటమి ద్వారా కేటీఆర్ వరుసగా మూడు ఎన్నికలలో పార్టీని పరాజయం దిశగా సక్సెస్ ఫుల్ గా నడిపించారు. ఔను.. గత ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత నుంచీ కేసీఆర్ బాధ్యతలను పూర్తిగా కేటీఆర్ కు అప్పగించి తాను క్రియాశీల రాజకీయాలకు విరామం ప్రకటించారు. అప్పటి నుంచీ బీఆర్ఎస్ బాధ్యతలన్నీ కేసీఆర్ తన భుజస్కంధాలపై పెట్టుకుని నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ జీరో స్కోర్ చేసింది. ఆ తరువాత కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో పరాజయం పాలై సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి పరాజయాలలో హ్యాట్రిక్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు పరాజయాలూ కేటీఆర్ ఖాతాలోనే పడ్డాయి.   పార్లమెంటు ఎన్నికల తరువాత రాష్ట్రంలో జరిగిన రెండు ఉప ఎన్నికలూ.. గత అసెంబ్లీ ఎన్నికలలో  బీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన జీహెచ్ఎంసీ పరిధిలోనివి కావడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికలలో జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ విజయం సాధించలేదు. అటువంటిది ఇప్పుడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ విజయాలతో సత్తా చాటింది. దీంతో పార్టీ క్యాడర్ లో కేటీఆర్ నాయకత్వం పట్ల నమ్మకాన్ని సడిలేలా చేశాయి ఈ పరాజయాలు.   
బీఆర్ఎస్ చావో రేవో అన్నట్లు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జూబ్లీ హిల్ ఉప ఎన్నికలో అనూహ్యంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.  కాంగ్రెస్ కు కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దాదాపు పాతిక వేల ఓట్ల తేడాతో ఇక్కడ పరాజయాన్ని మూటగట్టుకుంది. 2023 ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత జరిగిన రెండు ఉప ఎన్నికలలోనూ కూడా బీఆర్ఎస్ పరాజయం పాలైంది. అయితే కంటోన్మెంట్ పరాజయంతో పోలిస్తే ఈ పరాజయం బీఆర్ఎస్ కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. 2023 ఓటమి తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపుగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావే ముందుండి నడిపిస్తున్నారు. అయితే జూబ్లీ ఉప ఎన్నికలో మాత్రం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ముందుగా కేసీఆర్ పేరు కూడా ఉంది. దీంతో పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జూబ్లీ ఉప ఎన్నిక ప్రచార సారథ్యం కేసీఆర్ చేపడతారని అంతా భావించారు. బీఆర్ఎస్ క్యాడర్ కూడా అలానే అనుకుంది. అయితే కేసీఆర్ మాత్రం గడపదాటి బయటకు రాలేదు. జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారం చేయలేదు. దీంతో ఇప్పుడు పార్టీ ఓటమి తరువాత.. కేసీఆర్ జూబ్లీ ఓటమిని ముందే ఊహించారా? అన్న చర్చ మొదలైంది.   జూబ్లీ హిల్స్ లో క్షేత్రస్థాయి పరిస్థితి ఏమిటన్నది అర్ధం అయ్యింది కనుకనే కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎటూ ఓడిపోయే ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం అనవసరమని ఆయన భావించి ఉంటారని  అంటున్నారు. తాను ప్రచారం చేసిన తరువాత కూడా పార్టీ అభ్యర్థి పరాజయం పాలైతే అది గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం కంటే ఎక్కువ అవమానకరమని కేసీఆర్ భావించి ఉంటారని అంటున్నారు.  జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారం వైపు కేసీఆర్ కన్నెత్తి కూడా చూడకపోవడంతో  పార్టీ క్యాడర్ కూడా ఇదే  అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నది. 
ALSO ON TELUGUONE N E W S
సాధారణంగా హీరోయిన్లకు ఎక్కువ స్పాన్‌ ఉండదు. కొన్ని సంవత్సరాలు మాత్రమే వారి హవా కొనసాగుతుంది. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా కొనసాగుతుంటారు. తనకి జంటగా నటించిన హీరోకే అమ్మగా నటించిన హీరోయిన్లు కూడా ఉన్నారు. కానీ, రెండు దశాబ్దాలుగా హీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిష మాత్రం ఇప్పటికీ హీరోయిన్‌గా అందర్నీ అలరిస్తోంది.  ఇదిలా ఉంటే.. త్రిష చుట్టూ ఎప్పుడు పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. ఇటీవలికాలంలో ఆమె పెళ్లికి సంబంధించిన రూమర్స్‌ బాగా పెరిగిపోయాయి. 41 ఏళ్లు దాటినప్పటికీ త్రిష ఇంకా సింగిల్‌గానే ఉండటం, మరో పక్క వరసగా సినిమాలు చేస్తూ ఉండడం వల్ల ఇలాంటి గుసగుసలు ఎక్కువయ్యాయి. కొన్ని సంవత్సరాల క్రితం హీరో విజయ్‌తో త్రిషకు ఎఫైర్‌ ఉందంటూ వార్తలు వచ్చాయి. సోషల్‌ మీడియాలో అవి బాగా హల్‌చల్‌ చేశాయి. విజయ్‌ పుట్టినరోజున ఒక కుక్క పిల్లతో విజయ్‌ ఫోటో సోషల్‌ మీడియాలో వచ్చింది. పక్కన త్రిష ఉండడం.. ఈ రూమర్స్‌కి బలాన్ని చేకూర్చింది. అప్పట్లో ఈ ఫోటో బాగా వైరల్‌ అయింది. దీనిపై త్రిష ఫైర్‌ అయిందని టాలీవుడ్‌లో వార్తలు వచ్చాయి.  తనపై లేనిపోని రూమర్స్‌ పుట్టిస్తున్న వారిపై మండిపడిరది త్రిష. తనకు ఎంతో మంది స్నేహం ఉండొచ్చు. అంత మాత్రాన వారందర్నీ తన భర్తలుగా చూపించడం చాలా తప్పు అంటూ కామెంట్‌ చేసింది. ‘స్నేహితులతో ఉన్న ఫోటోలను చూసి పెళ్లి వార్తలు రాయడం అసహ్యం వేస్తుంది. ఇకనైనా ఇలాంటి దుష్ప్రచారం ఆపండి అంటూ త్రిష వార్నింగ్‌ ఇచ్చింది. ఇప్పుడు తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, తన వ్యక్తిగత విషయాల గురించి అనవసరమైన రాతలు రాయడం వల్ల తన ఇమేజ్‌ దెబ్బతింటుందని చెబుతోంది త్రిష. ప్రస్తుతం మెగాస్టార్‌ హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తోంది. 
మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రానికి సంబంధించి నవంబర్‌ 15న రామోజీ ఫిలింసిటీలో జరిగిన గ్లోబ్‌ ట్రాటర్‌ ఈవెంట్‌లో మహేష్‌ గురించి, సినిమా పట్ల అతనికి ఉన్న ప్యాషన్‌ గురించి, అతని క్రమశిక్షణ గురించి మాట్లాడారు రాజమౌళి.  ‘మహేశ్‌బాబు నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. అతను సెట్‌లో అడుగు పెట్టాడు అంటే సెల్‌ ఫోన్‌ అనేది అతని దగ్గర ఉండదు. కారులోనే పెట్టేసి వస్తాడు. షూటింగ్‌ పూర్తి చేసి కారెక్కిన తర్వాతే సెల్‌ ఫోన్‌ వాడతారు. ఇప్పటి జనరేషన్‌లో అది చాలా గొప్ప విషయం. నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ మహాభారతం అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. నాకు రామాయణం, మహాభారతం అంటే ఎంతో ఇష్టం. నేను రామాయణంలోని సీన్స్‌ తీస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమా కోసం ఒక్కో సీన్‌ రాస్తుంటే నేను గాలిలో ఉన్నానేమో అనిపించింది. మహేష్‌.. కృష్ణుడిగా అయితే బాగుంటాడని నా ఫీలింగ్‌. కానీ, ఫస్ట్‌ రోజే అతనికి రాముడి వేషం వేస్తుంటే నాకే గూస్‌బంప్స్‌ వచ్చాయి. మీరు ఊహించనంత అందంగా, పరాక్రమంగా, కోపంగా మహేశ్‌ కనిపిస్తాడు. రాముడిగా అన్ని రసాలు పలిపించేశాడు. ఆ ఫోటోని మొదట నేను నా ఫోన్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకున్నారు. ఎవరైనా చూస్తారేమోనని మళ్ళీ తీసేశాను’ అంటూ మహేష్‌ని ‘వారణాసి’ చిత్రంలో రాముడిగా చూపించబోతున్న విషయాన్ని రివీల్‌ చేశారు. 
సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన చాలా అప్‌డేట్స్‌ ఒక్కసారే బయటికి తీసుకొచ్చారు మేకర్స్‌. ఈ సినిమాకి ‘వారణాసి’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. సినిమా ఎలా ఉండబోతోంది అనేది ఒక వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. రామోజీ ఫిలింసిటీలో ఎంతో గ్రాండ్‌గా జరిగిన ఈ ఈవెంట్‌లో ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడారు.  ‘నన్ను, మహేష్‌ని కలిపినందుకు కె.ఎల్‌.నారాయణగారికి థాంక్స్‌. నేను చేసిన కొన్ని సినిమాలకు రిలీజ్‌కి ముందే కథ చెప్పాను. ఈ సినిమా విషయానికి వస్తే మాటల్లో చెప్పడానికి కుదరదు. ఈ సినిమా గురించి ఒక్క మాట చెప్పకుండా ఒక వీడియో ద్వారా చెబుదామనుకున్నాము. మార్చిలోనే ఈ వీడియో రిలీజ్‌ చేద్దామనుకున్నాం. చివరికి నవంబర్‌ 15కి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాం. చిన్నప్పుడు నాకు కృష్ణగారి గొప్పతనం గురించి తెలీదు. ఆ తర్వాత తెలిసింది. ఒక కొత్త టెక్నాలజీని పరిచయం చెయ్యాలంటే ఎన్నో అడ్డంకుల్ని తొలగించుకుంటూ కొత్త దారులు వేసుకుంటూ వెళ్లాలి. అలాంటిది కృష్ణగారు ఒకటి కాదు, ఎన్నో టెక్నాలజీస్‌ను తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్‌ చేశారు. మొదటి ఈస్ట్‌మన్‌ కలర్‌ సినిమా, మొదటి సినిమా స్కోప్‌ సినిమా, మొదటి 70ఎంఎం సినిమా.. ఇలా అన్ని టెక్నికల్‌గా చాలా వాటిని మనకు పరిచయం చేశారు. అలాంటి కృష్ణగారి అబ్బాయి మహేష్‌తో సినిమా చేస్తూ.. ఎంతో గర్వంగా చెబుతున్నాము.. మేం ఒక కొత్త టెక్నాలజీని తెలుగు సినిమాకి పరిచయం చేస్తున్నాం. ప్రీమియం లార్జ్‌ స్కేల్‌ ఫార్మాట్‌ ఫిల్మ్‌డ్‌ ఫర్‌ ఐమాక్స్‌. ఇప్పటివరకు మనం చేసిన సినిమాస్కోప్‌ మూవీస్‌ని బ్లోఅప్‌ చేసి ఐమాక్స్‌ బ్రాండ్‌ వేసుకొని చూస్తుంటాం. అది నిజమైన ఐమాక్స్‌ కాదు. ఈ సినిమాని 1:1.9 ఫార్మాట్‌లో షూట్‌ చేసి అసలైన ఐమాక్స్‌ ఫార్మాట్‌లో చేశాం’ అంటూ ట్రైలర్‌ని ఐమాక్స్‌ ఫార్మాట్‌లో ప్రదర్శించారు.  
మహేష్‌బాబు, రాజమౌళి లేటెస్ట్‌ భారీ ప్రాజెక్ట్‌ ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన బోలెడన్ని అప్‌డేట్స్‌ ప్రేక్షకుల ముందుకు, అభిమానుల ముందుకు వచ్చేశాయి. నవంబర్‌ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో ఎంతో గ్రాండ్‌గా నిర్వహించిన గ్లోబ్‌ ట్రాటర్‌ ఈవెంట్‌లో కావాల్సినన్ని అప్‌డేట్స్‌ ఇచ్చారు. ఈ ఈవెంట్‌ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను ఐమాక్స్‌ ఫార్మాట్‌లో ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యపరిచారు రాజమౌళి. ఈ సందర్భంగా వేదికపైకి మహేష్‌ ఎంట్రీని కూడా చాలా డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశారు. ఓ పక్క ట్రైలర్‌ ప్లే అవుతుండగా స్మోక్‌ ఎఫెక్ట్‌లో నందిపై త్రిశూలం పట్టుకొని మహేష్‌ వెళుతున్నట్టుగా క్రియేట్‌ చేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు.  అనంతరం సూపర్‌స్టార్‌ మహేష్‌ మాట్లాడుతూ ‘అందరూ అప్‌డేట్‌, అప్‌డేట్‌ అని అడుగుతున్నారు కదా. ఇదే అప్‌డేట్‌.. ఎలా ఉంది? మన మాటల్లో చెప్పాలంటే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అయింది. నాక్కూడా. ఇది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. జీవితంలో ఒక్కసారి మాత్రమే సాధ్యమయ్యే ప్రాజెక్ట్‌. అందరూ గర్వపడేలా కష్టపడతాను. ముఖ్యంగా నా డైరెక్టర్‌ రాజమౌళి గర్వపడేలా చేస్తాను. నాన్నగారంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాను. ఒక్కటి తప్ప. నన్ను పౌరాణిక సినిమాలు చెయ్యమని పదే పదే చెప్పేవారు నాన్నగారు. కానీ, నేను వినలేదు. ఈ సినిమా రాజమౌళిగారు నన్ను రాముడిగా చూపించారు. ఇప్పుడు నాన్నగారు నా మాటలు వింటూ వింటారు.  నేను ఈ ఈవెంట్‌లో క్యాజువల్‌గా ఎంట్రీ ఇద్దామనుకున్నారు. రాజమౌళిగారు కుదరదన్నారు. చూస్తున్నారుగా.. ఇలా వచ్చాను. ఓ బ్లూ షర్ట్‌ వేసుకొని వస్తానన్నాను. కుదరదన్నారు. ఈ షర్ట్‌ వేసుకొమ్మన్నారు. ఇంకా నయం షర్ట్‌ వేసుకొని రమ్మన్నారు. తర్వాత షర్ట్‌ లేకుండానే రమ్మంటారేమో. చాలా రోజుల తర్వాత మీ అందరినీ ఇలా చూడడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. నామీద ఎంతో అభిమానాన్ని చూపిస్తారు మీరు. మీకు నేను ఎప్పుడూ పెద్ద పెద్ద మాటలు చెప్పలేదు. చెప్పలేను కూడా. చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకింకేం తెలీదు. మేం, మా టీమ్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ సహకారంతో మీకోసం ఇంత గ్రాండ్‌గా చేశాం. ఎంతో కష్టపడి మా మా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చారు. మీరు క్షేమంగా ఇంటికి వెళ్లండి. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు. 
Superstar Mahesh Babu, Priyanka Chopra, Prithviraj Sukumaran starrer SSMB29 has been titled as Varanasi. SS Rajamouli is directing the film and Vijayendra Prasad, SS Kaanchi have written the story. Deva Katta has written the dialogues for the film.  Rajamouli grandly revealed the title of the movie and stated that he wanted to do it in March, before starting shoot but it got dragged till November. He got emotional due to the delays while playing the video on the stage but revealed that he is lucky to have met Mahesh Babu, as he brought Lord Rama to life in Ramayanam episode.  The title reveal trailer showcased wide variety of landscapes and timeline jumps the story takes. From Ramayanam to modern day asteroid strike, the story goes through great lengths and breadths in uniting science fiction and mythology. The stunning visuals and scope of the story are gigantic.  With Lord Shiva's trident Mahesh Babu riding a bull, looks like modern day Lord Shiva. Mahesh speaking at the event stated that he is lucky to be able to do the movie and he is proud of it. He stated that entire India and world will be proud post release. Keeravaani revealed that the movie is planned for 2027 Summer release.   
మహేష్‌బాబు, ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకి ‘వారణాసి’ అనే టైటిల్‌ని అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చేశారు. నవంబర్‌ 15న రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌గా జరిగిన గ్లోబ్‌ ట్రాటర్‌ ఈవెంట్‌లో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఇచ్చారు. అందులో భాగంగానే ఎన్నో విషయాలను పంచుకున్నారు రాజమౌళి. ఈ చిత్రాన్ని 2027 మార్చి 25న సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.  ‘వారణాసి’ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని మొదటి నుంచీ చెబుతున్నారు. అయితే ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది అనే విషయంలో అందరూ ఆసక్తిగా ఉన్నారు. రాజమౌళి చేసే ప్రతి సినిమా రిలీజ్‌కి ముందే కథను రివీల్‌ చేసేవారు. అయితే అది అన్ని సినిమాలకూ కుదరదు అని రాజమౌళి. అయితే కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ మాత్రం ఈ సినిమా కథపై ఓ హింట్‌ ఇచ్చారు. ఈ సినిమాలో 30 నిమిషాల లెంగ్త్‌లో మహేష్‌బాబు విశ్వరూపం చూపించారు. అందులో సీజీ లేదు, బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. ఏమీ లేకపోయినా మహేష్‌ తన నట విశ్వరూపం చూపించాడు. కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు.. కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. అనుక్షణం రాజమౌళి గుండెల మీద హనుమాన్‌ ఉన్నాడు.. ఊపిరితో కర్తవ్యం బోధిస్తున్నాడు. హనుమకు రామనామం ఇష్టం’ అంటూ సినిమా బ్యాక్‌డ్రాప్‌ హనుమాన్‌ అని చెప్పకనే చెప్పారు విజయేంద్రప్రసాద్‌.
  సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ కి ముందు నుండి ప్రచారం జరుగుతున్నట్టుగానే 'వారణాసి' టైటిల్ ని ఖరారు చేశారు. అంతేకాదు, ఈ మూవీ రిలీజ్ డేట్ డీటెయిల్స్ ని కూడా రివీల్ చేశారు. (Varanasi)   హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో వారణాసి మూవీ మొదటి ఈవెంట్ ని భారీగా నిర్వహించారు. ఈ వేడుకలో టైటిల్ తో పాటు మహేష్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు.   Also Read: వారణాసి.. నెవర్ బిఫోర్ లుక్ లో మహేష్ బాబు   గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో రాజమౌళి, మహేష్ బాబు, ఎం.ఎం కీరవాణితో పాటు మూవీ టీమ్ అంతా పాల్గొంది. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ.. సినిమా విడుదల ఎప్పుడో చెప్పేశారు. 2027 వేసవిలో విడుదల కానుందని తెలిపారు.    2027 మార్చి 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అంటే సరిగ్గా ఏడాదిన్నరకు 'వారణాసి' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.   
Well-known film actor Rajendra Prasad, who has acted in more than 300 films and earned a special place in the hearts of Telugu people with his versatile performances, has been selected for the “Nata Prapoorna T.L. Kantha Rao Memorial National Award.   This announcement was made in a press release by the Selection Committee Chairman K.V. Ramana Chary and Convener Nagabala Suresh Kumar, on the occasion of Kantha Rao’s 102nd birth anniversary (November 16).   The award will be presented on the 21st of this month at a program to be held in the Film Chamber. Telangana State Minister Komatireddy Venkat Reddy, Telangana State FDC Chairman Dil Raju, along with several other prominent personalities from the film industry and political leaders, will attend the event as chief guests.   The organizers stated that for the past 18 years, they have been celebrating Kantha Rao's birth anniversary on November 16, but due to certain reasons, this year's event is being held on November 21. They also mentioned that members of Kantha Rao’s family will take part in the program that day..    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Superstar Mahesh Babu and SS Rajamouli have come together for the first time for a film. The combination has been eagerly awaited by Telugu Cinema fans and post RRR, entire world is waiting to see what SSR has to offer next. So, the movie title launch event has become the biggest ever in Indian Cinema.  Now, the movie makers have revealed the title and it is Varanasi. From past few months, the rumors have been aplenty that the title has been locked as Varanasi. Now, with visuals, they have announced the title and it is sensational.    Mahesh Babu is riding on a bull - Nandi, like Lord Shiva holding the holy trident in the background of Varanasi aka Kasi. Mahesh Babu's look in the long hair and riding the bull is fantastic to look at. Looks like the director has decided to give complete makeover to Mahesh and just in stills and visual, we can see that he is presenting him like never-seen-before.  Well, more exciting details are eagerly awaited.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  ప్రముఖ సినీ నటుడు 300 పైగా చిత్రాలలో విభిన్న తరహ పాత్రలతో తనకంటూ తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్ననవరస నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కి, నట ప్రపూర్ణ టి.ఎల్. కాంతారావు స్మారక జాతీయ పురస్కారాన్ని ఆయన 102వ  జయంతి (నవంబర్ 16న) సందర్భంగా అందించనున్నట్లు ఎంపిక కమిటీ చైర్మన్ కే.వి. రమణా చారి, కన్వీనర్ నాగబాల సురేష్ కుమార్ లు పత్రిక ప్రకటనలో తెలియచేసారు.    ఈ నెల 21వ తేదిన ఫిల్మ్ ఛాంబర్ లో జరిగే కార్యక్రమం లో ఈ అవార్డు ప్రదానం ఉంటుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణా రాష్ట్ర మంత్రివర్యులు కోమటి రెడ్డి వెంకట రెడ్డి , తెలంగాణా రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు తో పాటు మరెందరో పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నట్లు వారు తెలియ చేసారు.    గత 18 ఏళ్ళుగా కాంతారావు గారి జన్మ దినాన్ని తాము నవంబర్ 16న నిర్వహిస్తున్నామని, కాని ఈ సారి కొన్ని కారణాల వలన నవంబర్ 21న నిర్వహించాల్సి వచ్చిందని, ఆ రోజు కాంతారావు కుటుంభ సభ్యులు కూడా కార్యక్రమం లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  మానవ సంబంధాలు చాలా గమ్మత్తైనవి.  కొన్నిసార్లు ఇవి ఆశ్చర్యానికి గురి చేస్తాయి.  మరికొన్ని సార్లు అయోమయానికి,  గందరగోళానికి లోను చేస్తాయి. మరీ ముఖ్యంగా వేర్వేరు జెండర్ ల మధ్య సాగే ప్రేమ,  వైవాహిక బంధం చాలా క్లిష్టమైనది.  ఆపోజిట్ జెండర్ కావడంతో అబిప్రాయాలు,  అభిరుచులు, నిర్ణయాలు,  లక్ష్యాలు.. ఇలా అన్నీ వేర్వేరు గానే ఉంటాయి. అయినా సరే.. వీటన్నింటిని బాలెన్స్ చేసుకుంటూ ఇద్దరూ కలిసి ఉండటమే బార్యాభర్తల బంధానికి స్పెషల్ గుర్తింపును తెచ్చి పెడుతుంది.  భార్యాభర్తల బంధంలో ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఉన్నా అవన్నీ వయసు,  జెండర్ వల్ల కలిగేవని చాలా మంది అనుకుంటారు. కానీ ఏ వ్యక్తి అయినా మానసికంగా మెరుగ్గా లేకపోయినా భార్యాభర్తల బంధంలో సమస్యలు వస్తాయి. లైఫ్ పార్ట్నర్ మానసికంగా పరిణితి చెందిన వారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి కొన్ని విషయాలు బాగా సహాయపడతాయి. అవేంటో తెలుసుకుంటే.. భాగస్వామిని అర్థం చేసుకుని,  విలువ ఇచ్చే లైఫ్ పార్ట్నర్  ఉండటం చాలా ముఖ్యం.    చిన్న అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని వాటిని ఎప్పటికప్పుడు తీరుస్తూ,  తనతో ఉండే వ్యక్తిని సురక్షితంగా ఉంచడం లైఫ్ పార్ట్నర్  బాధ్యత. ఇలా ఉంటే ఏ భార్యాభర్తల బందం అయినా చాలా వరకు సక్సెస్ ఫుల్ గా ఉంటుంది. భార్యాభర్తల బంధంలో అతి ముఖ్యమైన విషయం  ఒకరికొకరు సపోర్ట్ గా ఉండటం.  ఏ విషయంలో అయినా ఒక్కటిగా ఉండటం, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఒక్కటిగా నిలబడటం.  మానసికంగా మెచ్యురిటీ ఉన్న లైప్ పార్ట్నర్   కష్ట సమయాల్లో మంచి సలహా ఇవ్వడానికి, ప్రతి సంతోషాన్ని కలిసి పంచుకోవడానికి సిద్దంగా ఉంటారు. నిందలు, గొడవలు లేకుండా  బార్యాభర్తల బంధం  ముందుకు సాగదు. ఒక వ్యక్తి తన తప్పులను,  లోపాలను అంగీకరించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని గొడవలు వచ్చినా భార్యాభర్తల బంధం దృఢంగా ఉంటుంది. ప్రస్తుత జనరేషన్ లో  ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. మెచ్యురిటీ  చెందిన లైఫ్ పార్ట్నర్  దీనిని అర్థం చేసుకుంటారు.   అవతలి వ్యక్తికి వారి పర్సనల్ స్పేస్ ఇస్తారు. వారి ఇష్టాలను వారికి ఉంచుతారు. ఏ సంబంధానికైనా నిజాయితీ పునాది. లైఫ్ పార్ట్నర్ తో  ఎంత నిజాయితీగా అంటారో,  వారు తమ పార్ట్నర్ ను ఎంతగా నమ్ముతారు అనే విషయాన్ని వారిలో ఉండే మెచ్యురిటీ స్పష్టం చేస్తుంది. తాము మాట్లాడే దానికంటే ఎక్కువగా వినే లైఫ్ పార్ట్నర్స్  తమ భాగస్వామిని బాగా అర్థం చేసుకోగలుగుతారట,  అలాగే  వారి గురించి బాగా తెలుస్తుందట. అందువల్ల ఎప్పుడూ ఓపెన్ గా మాట్లాడుకుంటూ, బంధంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని ఆరోగ్యకరమైన మార్గంలో పరిష్కరించుకునేవారు చాలా మెచ్యురిటీ చెందిన లైఫ్ పార్ట్నర్స్ గా పిలవబడతారు.             ఏ సంబంధంలోనైనా అతి ముఖ్యమైనది ప్రేమ. ప్రేమ అంటే బహుమతులు ఇవ్వడం లేదా సమయం గడపడం మాత్రమే కాదు. ప్రేమ అనేది మనసుకు సంబంధించినది.   ప్రతి ఒక్కరూ తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక విభిన్నమైన మార్గాన్ని కలిగి ఉంటారు. ప్రేమను వ్యక్తం చేయడం,  తమ భాగస్వామి వ్యక్తం చేసే ప్రేమను అర్థం చేసుకోవడం కేవలం మెచ్యురిటీ ఉన్నవారికి మాత్రమే సాధ్యం.  ఇలా ఉంటే భార్యాభర్తల బందం ఎంతో బాగుంటుంది.                             *రూపశ్రీ.
  వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలనే చేసుకుంటారు.  కానీ దురదృష్టం కొద్ది పెళ్ళి చేసుకున్న జంటలు అన్నీ కలిసి ఉండటం జరగదు. కుటుంబ కారణాలు కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు, వేరే ఇతర కారణాలు కూడా కావచ్చు.  నేటికాలంలో భార్యాభర్తలు విడిపోవడానికి చాలా రకాలుగా కారణాలు ఉంటున్నాయి. అయితే భార్యాభర్తలు  మాత్రమే చేసే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి.  వీటి వల్ల భార్యాభర్తల బంధం బలహీనపడి విడిపోవడానికి దారి తీస్తుంది. భార్యాభర్తలు విడిపోవడానికి కారణం అయ్యే ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటే.. ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త పడవచ్చు.  తద్వారా భార్యాభర్తల బంధం పదిలంగా ఉంచుకోవచ్చు. ఇవి మాట్లాడకూడదు.. భార్యాభర్తలలో ఏవరైనా లేకా ఇద్దరూ అయినా వివాహానికి ముందు వేరే వ్యక్తులను ప్రేమించి ఉండవచ్చు.  కొందరు తమ వివాహం సమయంలో నిజాయితీగా ఉండాలనుకుని తమ గత ప్రేమ విషయాన్ని చెబుతుంటారు.  అయితే వారు నిజాయితీగా తమ ప్రేమ గురించి చెప్పిన తరువాత  మాజీ ప్రియుడు లేదా ప్రియురాలి గురించి  పదే పదే మాట్లాడటం, ఏదైనా సమయం లేదా  సందర్బంలో మాజీ వ్యకులతో పోల్చి అసహనం వ్యక్తం చేయడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే బార్యాభర్తల బంధం దెబ్బతింటుంది. ఎందుకంటే ఎవరూ ఇలా పోలికలు పెట్టి మాట్లాడటం గురించి సహించరు. చిన్న విషయాలు, గొడవలు.. భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే ఒకరితో మరొకరు గొడవ పెట్టుకుంటే లేదా ఎటువంటి కారణం లేకుండా  కోపాన్ని, అసహనాన్ని చూపిస్తుంటే ఆ బంధం ఎక్కువకాలం నిలవడం కష్టమవుతుంది. అందుకే భార్యాభర్తలు మిగతా సమయాలలో ఎలా ఉన్నా ఒకరి పక్కన ఒకరు ఉన్నప్పుడు ఓపికగా, ప్రశాంతంగా ఉండాలి. అబద్దాలు.. భార్యాభర్తలు ఒకరితో మరొకరు పదే పదే అబద్ధం చెబితే  సంబంధం బెడిసికొట్టే అవకాశం ఉంది. ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి,  నిజాన్నే మాట్లాడాలి.  ఎప్పుడైనా అబద్దం అనేది చెబితే భాగస్వామిని బాధపెట్టకూడదనే ఉద్దేశంతో చెప్పాలి తప్ప..  మోసం చేసే ఉద్దేశంతో చెప్పకూడదు.  భాగస్వామిని మోసం చేయడం వల్ల భార్యాభర్తల  బంధం ఒక్క క్షణంలో నాశనం అవుతుంది. తప్పులు, క్షమాపణ.. భార్యాభర్తల మధ్య గొడవలు, వాదనలు వచ్చినట్టే తప్పులు కూడా జరుగుతాయి.  భార్యాభర్తలలో ఎవరైనా సరే.. తప్పు చేస్తే మరొకరు క్షమించడానికి సిద్దంగా ఉండరు. జరిగిన తప్పు గురించి పదే పదే సమయం,  సందర్భం వచ్చిన ప్రతి సారి నిందిస్తూ, తిట్టుకుంటూ ఉంటారు.  కానీ ఇది చాలా కాలం పాటు కొనసాగితే అది  సంబందాన్ని దెబ్బతీస్తుంది. ఇలా గొడవ చేస్తుంటే ఏ లైప్ పార్ట్నర్ కూడా కలిసి ఉండాలని అనుకోరు. ఫలితంగా ఇద్దరూ విడిపోయే అవకాశాలు పెరుగుతాయి. అందుకే  ఏ తప్పును ఎక్కువ కాలం మనసులో పెట్టుకుని ఉండకూడదు.  తప్పు జరగగానే దాని గురించి మాట్లాడుకుని, ఆరోగ్యకర సంభాషణలతో పరిష్కరించుకుని, దాని గురించి వదిలేయాలి.                              *రూపశ్రీ.  
  నేటి బిజీ జీవితాల్లో అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించడం వల్ల మనల్ని మనం కోల్పోవడం, మనకు మనం ప్రాధాన్యత ఇచ్చుకోవడం తగ్గుతుంది. ఇతరులు ఏదైనా అడిగినప్పుడు చాలామంది  నో చెప్పాలనుకుంటారు. కానీ చివరికి సరే అని చెబుతుంటారు. నో చెబితే ఎదుటివారు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ ఒకటైతే.. మనం కాకపోతే ఎవరు సహాయం చేస్తారు అనే మంచితనం కూడా ఇలా సరే అని చెప్పడానికి కారణం అవుతుంది.  కానీ ఇలా సరే అని చెప్పిన తరువాత చాలామంది ఆ పని పూర్తీ చేయడంలో చాలా అలసిపోతారు,  తమ మీద తాము చిరాకు పడతారు, నేనెప్పుడూ ఇంతే ఇలా తప్పు  చేస్తుంటాను అని అసంతృప్తి కలిగిస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ సరిహద్దులు నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. సరిహద్దులు నిర్ణయించుకోవడం అంటే ఇతరులను దూరం పెట్టడం లేదా దూరం చేసుకోవడం అస్సలు కాదు.. తమను తాము గౌరవించుకుంటూ ఇతరులను కూడా గౌరవించేలా చేసేది ఇలా సరిహద్దులు నిర్ణయించుకోవడమే..  సరిగ్గా సరిహద్దులను నిర్ణయించినప్పుడు సంబంధాలు బలపడతాయి. అపరాధ భావన  లేదా తప్పు చేసిన ఫీలింగ్ లేకుండా ఎవరికైనా నో చెప్పాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే.. దేని వల్ల ఎక్కువ అలసిపోతున్నాం, చిరాకు వడుతున్నాం,  ఒత్తిడి గురవుతున్నాం అనే విషయాలు ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకుంటే ఏది ముఖ్యం,  ఏది ముఖ్యం కాదు.. అనే విషయాలు అర్థం చేసుకోవచ్చు.  ఇది ఎవరికైనా ఏ విషయానికి నో చెప్పాలి,  దేనికి చెప్పకూడదు  అని నిర్ణయించుకోవడంలో సహాయపడుతుంది. ఎవరైనా ఏదైనా సహాయం అడిగినప్పుడు దాని విషయంలో పరిమితులు,  సామర్థ్యం మొదలైనవి మొహమాటం లేకుండా చెప్పాలి.  షో-ఆఫ్ చేయడానికి చాలామంది తమ గురించి కొండంత చెప్పుకుని తరువాత ఇబ్బంది పడుతుంటారు. అందుకే తమ గురించి తాము ఎక్కువ చెప్పుకోకూడదు. ఇలా చేస్తే ఇండైరెక్ట్ గా నో చెప్పినట్టు అవుతుంది. ఇతరులు ఏదైనా అడిగినప్పుడు ఆ పని చేసే సామర్థ్యం లేదా సమయం లేనప్పుడు అదే విషయాన్ని చెప్పాలి.  అంతేకానీ ఎదుటివారికి అనవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వకూడదు. ఇది అపార్థాలకు,  తగాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఎవరికైనా దేని గురించి అయినా కారణాలు చెప్పే బదులు,  తాము ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం వంటివి వివరించి చెప్పాలి.  ఇది ఎదుటి వ్యక్తిని బాధపడకుండా ఉంచుతుంది. ఎదుటివారు సరిహద్దులను మరచిపోయి అన్ని విషయాలను, పనులను సహాయం అడుగుతుంటే.. అలాంటి వారికి సున్నితంగానే సరిహద్దును గుర్తు చేయాలి.  సాధ్యమైనంత వరకే సమయాన్ని ఇవ్వాలి కానీ ఇతరుల కోసమే పూర్తీ సమయాన్ని వెచ్చించకూడదు. ఎదుటివారి దృష్టిలో ఎప్పుడూ తటస్థంగానే ఉండాలి.  అంచనాలు పెరుగుతూ ఉంటే వారి దృష్టిలో ఆశించడం కూడా పెరుగుతుంది. ఎవరి అవసరాలు వారికి ముఖ్యమని ఎదుటివారికి అర్థమయ్యేలా చేస్తుండాలి. ఇలా ఉంటే ఎదుటివారు కూడా ఏ విషయం అడగాలి, ఏది అడగకూడదు  అనే విషయం అర్థం చేసుకోగలుగుతారు. సొంత పనులు వదులుకుని మరీ ఇతరుల కోసం పాకులాడకూడదు.  ఎవరికోసం ఖర్చయ్యే సమయం అయినా సరే.. ఎన్ని కారణాలు చూపించినా  ఒక్క సెకెను కూడా తిరిగి తెచ్చుకోలేం. కాబట్టి సొంత పనుల తర్వాతే ఇతరుల పనులు చేసివ్వాలి.  ఇది స్వార్థం అని చాలామంది అనుకుంటారు. కానీ మనం బాగుంటేనే.. ఇతరుల కోసం మనం చేసే పనులకు గౌరవం ఉంటుంది.                                  *రూపశ్రీ
మానవ శరీరానికి  నీరు చాలా ముఖ్యం. దాహం తీర్చుకోవడానికి మాత్రమే కాదు..  శరీరం సరిగ్గా పనిచేయడానికి,  వ్యాధులను నివారించడానికి కూడా నీరు  ఇంధనంలా పనిచేస్తుంది.  మానవ శరీరంలో దాదాపు 70 శాతం నీటితో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సరిగ్గా పనిచేయడానికి ప్రతిరోజూ 2 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. కొందరు చల్లని నీరు తాగితే.. కొందరు వేడినీరు తాగుతుంటారు. చల్లని,  వేడి నీరు రెండింటికీ వాటి స్వంత ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాయామం తర్వాత చల్లటి నీరు తాగితే శరీరం చల్లబడుతుంది.  వేడి నీరు శరీరంలో విషాలను  బయటకు పంపడానికి,  జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అయితే వేడి నీరు తాగడం వల్ల బరువు తగ్గడానికి, శరీరంలో కొవ్వు కరగడానికి సహాయపడుతుందని చెబుతుంటారు. ఇది ఎంత వరకు నిజం? దీని గురించి తెలుసుకుంటే.. కొన్ని పరిశోధనలు ఎక్కువ నీరు త్రాగడం వల్ల బరువు తగ్గడంలో  సహాయపడుతుందని చెబుతున్నాయి.  నీరు తాగడం వల్ల  కడుపు నిండినట్లు అనిపించడం,  తక్కువ తినడం జరుగుతుంది. ఇది శరీరం పోషకాలను బాగా గ్రహించడానికి,  హానికరమైన పదార్థాలను తొలగించడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు.  భోజనానికి ముందు అర లీటరు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల జీవక్రియ రేటు 30శాతం మెరుగ్గా ఉంటుందని అంటున్నారు. వేడి నీరు, బరువు.. ఉదయం లేదా రోజంతా ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల బరువు తగ్గడానికి మూడు విధాలుగా సహాయపడుతుందట. గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. దీన్ని సమతుల్యం చేయడానికి శరీరం అదనపు శక్తిని ఖర్చు చేస్తుంది. ఇది జీవక్రియను సక్రియం చేస్తుంది. గోరువెచ్చని నీరు శరీర కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి,  చిన్న అణువులుగా మార్చడానికి సహాయపడుతుంది.  జీర్ణవ్యవస్థ వాటిని మరింత సులభంగా బర్న్ చేయడానికి  వీలు కల్పిస్తుంది. భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల ఆకలి తగ్గుతుంది, తద్వారా కేలరీల తీసుకోవడం తగ్గుతుంది. వేడి నీటి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు.. నీరు జీర్ణవ్యవస్థను బాగుచేస్తుంది. జీర్ణం కావడానికి కష్టంగా ఉండే ఆహారాలను కరిగించడంలో సహాయపడుతుంది.  గోరువెచ్చని నీరు నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది. తద్వారా శరీరంలో నొప్పి,  ఒత్తిడి రెండింటినీ తగ్గిస్తుంది. గోరువెచ్చని నీరు ప్రేగుల కదలికను పెంచుతుంది. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. వేడినీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.   చెమట ద్వారా చర్మ రంధ్రాల నుండి విష పదార్థాలు విడుదలవుతాయి.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  మూత్రపిండాలు మానవ శరీరంలో ఒక భాగం. ఇవి 24 గంటలు నిశ్శబ్దంగా తమ విధులు నిర్వర్తిస్తాయి.  మూత్రపిండాలు  శరీరం నుండి విషాన్ని,  అదనపు నీటిని తొలగిస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి.   ఖనిజాల సమతుల్యతను కాపాడుతాయి. కానీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే  శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది వీటిని పట్టించుకోరు. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించకపోతే అవి తీవ్రమైన అనారోగ్యంగా డవలప్ అవుతాయి.  ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మంది ఏదో ఒక రకమైన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారని,  వీటి కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. మూత్రపిండాలు సరిగా పని చేయకపోతే ఏ లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుంటే.. లక్షణాలు.. కిడ్నీ సమస్యలు తరచుగా చాలా చిన్న లక్షణాలతో మొదలవుతాయి. కానీ వాటిని పట్టించుకోకపోతే చాలా పెద్ద సమస్యగా మారతాయి.   అలసట,బలహీనత.. ఎప్పుడూ అలసట, కాళ్ళలో లేదా కళ్ళ కింద వాపు, మూత్రం రంగు లేదా పరిమాణంలో మార్పులు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా చర్మం పొడిబారడం, చర్మం దురదగా ఉండటం  మొదలైనవన్నీ మూత్రపిండాలు బలహీనపడుతున్నాయనడానికి సంకేతాలు. ఎప్పుడూ  అలసట లేదా బలహీనత అనేవి శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతున్నాయని,  మూత్రపిండాలు వాటిని సరిగ్గా తొలగించలేకపోతున్నాయని అర్థం. బాగా  నిద్రపోయిన  తర్వాత కూడా  అలసిపోయినట్లు అనిపించడాన్ని , అస్సలు  తేలికగా తీసుకోకూడదు.  శరీరంలో వాపు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మూత్రపిండాలు అదనపు ద్రవాన్ని తొలగించలేనప్పుడు అది శరీరంలోని కొన్ని భాగాలలో పేరుకుపోవడం మొదలుపెడుతుంది. ఇది మొదట పాదాలు, చేతులు లేదా ముఖంలో కనిపిస్తుంది. దీనిని వైద్య పరిభాషలో ఎడెమా అంటారు. మూత్రంలో మార్పులు.. మూత్రపిండాల సమస్యలకు చాలా స్పష్టమైన సంకేతం. ముదురు రంగు మూత్రం, మూత్రంలో నురుగు లేదా బుడగలు, తరచుగా మూత్రవిసర్జన లేదా మంట వంటివి మూత్రపిండాల సమస్యను సూచిస్తాయి. శ్వాస ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా మూత్రపిండాల వైఫల్యాలు ఎదుర్కునే చాలామందిలో ఉండే లక్షణం. మూత్రపిండాలు శరీరం నుండి అదనపు ద్రవాన్ని తొలగించలేనప్పుడు ఆ ద్రవం ఊపిరితిత్తులకు చేరుకుంటుంది.  శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. చాలా మంది ఇలాంటి సమస్య వచ్చినప్పుడు  గుండె లేదా ఊపిరితిత్తుల సమస్య అనుకుంటారు. కానీ అసలు కారణం మూత్రపిండాల సమస్య. పొడి, దురద చర్మం.. మూత్రపిండాలు రక్తం నుండి అవసరమైన ఖనిజాలు,  వ్యర్థ ఉత్పత్తులను ఫిల్టర్ చేయలేకపోవడం వల్ల పొడి చర్మం,  దురద వంటి సమస్యలు వస్తాయి. ఇది శరీరంలో ఖనిజ అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది చర్మాన్ని పొడిగా, దురదగా చేస్తుంది. మూత్రపిండాల వ్యాధి సమస్యలు ముదిరే కొద్ది ఈ సమస్య బయటకు కనిపిస్తుంది. పై లక్షణాలు ఏవైనా  కనిపిస్తే ఆలస్యం చేయకుండా  వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ముందుగా గుర్తించడం వల్ల వ్యాధిని నివారించడమే కాకుండా మూత్రపిండాల పనితీరును కూడా గణనీయంగా కాపాడుకోవచ్చు. మూత్రపిండాల ఆరోగ్యానికి సమతుల్య,  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం  చాలా ముఖ్యం. ఉప్పు తీసుకోవడం తగ్గించాలి.  అధిక సోడియం రక్తపోటును పెంచుతుంది,  మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఆపిల్, బెర్రీలు, ద్రాక్ష, కాలీఫ్లవర్, క్యాబేజీ,  క్యాప్సికం వంటి పొటాషియం తక్కువగా ఉన్న పండ్లు,  కూరగాయలు మూత్రపిండాల సమస్యలు రాకుండా చేయడం లేదా, మూత్ర పిండాలను సంరక్షించడం చేస్తాయి. అందుకే వీటిని తీసుకోవాలి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గిస్తాయి,  మూత్రపిండాల ఒత్తిడిని తగ్గిస్తాయి.  చేపలు, కాయధాన్యాలు లేదా గుడ్డులోని తెల్లసొన వంటి లీన్ ప్రోటీన్ లను  తీసుకోవాలి. రెడ్ మీట్,  ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించాలి.  వీటిలోని ప్రిజర్వేటివ్‌లు మూత్రపిండాలు  ఎక్కువగా పని చేయడానికి కారణం అవుతాయి. ప్రతి చిన్న సమస్యకు అధికంగా  మందులు వాడటం, ముఖ్యంగా నొప్పి నివారణ మందులు, మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. వైద్యుల సలహా లేకుండా  పదే పదే పెయిన్ కిల్లర్స్ తీసుకోకూడదు.                             *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  మందులు వాడటం నేటి కాలంలో చాలా సహజం అయిపోయింది. చిన్న సమస్య నుండి, పెద్ద ఆరోగ్య సమస్య వరకు ప్రతి సమస్య తగ్గడానికి మందులు వాడుతుంటారు.  ఇందులో టాబ్లెట్లు, ఇంజెక్షన్లు  ఉంటాయి. కొందరు వైద్యుల సలహాతో మందులు వాడితే.. మరికొందరు సొంతంగా మందులు కొని అడపాదడపా వాడుతూనే ఉంటారు. అయితే మందులను ఎక్కువ కాలం వాడితే ఎవ్వరూ ఊహించనంత డేంజర్ సమస్య ఎదురవుతుందని చాలామందికి తెలియదు. ఏదైనా ఆరోగ్య సమస్య కారణంగా మందులను ఎక్కువ కాలం వాడటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు క్రమంగా తగ్గుతాయట.  ఈ లోపం శరీరం లోపల పెరుగుతూనే ఉంటుందని, దీని కారణంగా అలసట,  రోగనిరోధక శక్తి తగ్గడం, ఎముకలు బలహీన పడటం.. వంటి అనేక సమస్యలకు కారణమవుతుందట.  అసలు ఏ మందులు వాడటం వల్ల ఇలాంటి సమస్య ఎదురవుతుంది? ఎక్కువ కాలం మందులు వాడాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుంటే.. ఆస్ప్రిన్ ఆస్ప్రిన్ శరీరం విటమిన్ సి శోషణను తగ్గిస్తుంది. దీని వలన విటమిన్ సి క్రమంగా క్షీణిస్తుంది. దీర్ఘకాలిక ఆస్ప్రిన్ వాడకం వల్ల ఐరన్ నిల్వలు కూడా తగ్గుతాయి.  రోజుకు 100 mg తక్కువ మోతాదులో ఆస్ప్రిన్ తీసుకునే 65 ఏళ్లు పైబడిన వారిలో రక్తహీనత ప్రమాదం 20 శాతం పెరిగిందని ఒక అధ్యయనం తేల్చింది. టైలెనాల్, ఎసిటమైనోఫెన్ గ్లూటాతియోన్ శరీరంలోని ప్రధాన యాంటీఆక్సిడెంట్. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. టైలెనాల్ వంటి మందులు దాని స్థాయిలను తగ్గిస్తాయి, కాలేయం దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతాయి. తక్కువ గ్లూటాతియోన్ స్థాయిలు వృద్ధాప్యం, మధుమేహం, ఇన్ఫెక్షన్లు,  బలహీనమైన రోగనిరోధక పనితీరు వంటి సమస్యలకు కారణం అవుతుంది. గర్భనిరోధక మాత్రలు గర్భనిరోధక మాత్రలను నిరంతరం ఉపయోగించడం వల్ల శరీరంలో ఫోలిక్ యాసిడ్, బి2, బి6, బి12, విటమిన్ సి, విటమిన్ ఇ, మెగ్నీషియం, సెలీనియం,  జింక్ వంటి అనేక విటమిన్లు,  ఖనిజాలు క్షీణిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఈ లోపం చాలా తీవ్రంగా ఉంటుంది. చాలా మంది మహిళలు సప్లిమెంట్లను తీసుకోవలసి వస్తుంది. దీనికి గల కారణాలపై స్పష్టత లేదు.. కానీ ఈ మాత్రలలోని ఈస్ట్రోజెన్,  ప్రొజెస్టెరాన్ శరీర పోషక ప్రక్రియలను ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. మెట్‌ఫార్మిన్ మధుమేహం ఉన్నవారికి సూచించబడే మెట్‌ఫార్మిన్, పేగులో విటమిన్ బి12 శోషణను తగ్గిస్తుంది. ఎక్కువకాలం  ఉపయోగించడం వల్ల విటమిన్ బి12 లోపానికి దారితీస్తుంది. ఇది నరాల దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది. యాంటాసిడ్లు యాంటాసిడ్లు కడుపులోని ఆమ్లాన్ని తగ్గిస్తాయి. కానీ ఇదే ఆమ్లం ఆహారం నుండి విటమిన్ బి12 విడుదలకు సహాయపడుతుంది. దీర్ఘకాలిక యాంటాసిడ్ వాడకం వల్ల కాల్షియం, పొటాషియం,  జింక్ లోపాలు కూడా ఏర్పడతాయి, దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి,  కండరాల పట్టు తగ్గుతుంది. స్టాటిన్స్ స్టాటిన్ మందులు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి,  గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ అవి కండరాల శక్తి ఉత్పత్తికి అవసరమైన కోఎంజైమ్ Q10 ను  తగ్గిస్తాయి. ఈ లోపం కండరాల నొప్పి, బలహీనత,  వాపుకు కారణమవుతుంది. యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ హానికరమైన బ్యాక్టీరియాను చంపుతాయి. కానీ అవి మంచి గట్ బాక్టీరియాకు కూడా హాని చేస్తాయి. ఇది గట్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఊబకాయం, అలెర్జీలు, జీర్ణ సమస్యలు,   రోగనిరోధక శక్తి తగ్గడానికి దారితీస్తుంది. స్టెరాయిడ్స్ స్టెరాయిడ్లు శరీర ఖనిజ సమతుల్యతను అనేక విధాలుగా దెబ్బతీస్తాయి.  కాల్షియం శోషణను తగ్గిస్తాయి, ఎముకలు బలహీనపడటానికి దారితీస్తాయి,  విటమిన్ డి పనితీరును కూడా తగ్గిస్తాయి. ఇది మెగ్నీషియం,  పొటాషియం స్థాయిలను తగ్గిస్తుంది.  బలహీనత, అలసట,  తిమ్మిరికి దారితీస్తుంది. దీర్ఘకాలిక స్టెరాయిడ్ వాడకం కూడా బి విటమిన్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. నరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. జాగ్రత్త.. ఎక్కువ కాలంగా ఏవైనా మందులు వాడుతుంటే, వాటితో పాటు ఏ విటమిన్ లేదా మినరల్ సప్లిమెంట్లు తీసుకోవాలో  వైద్యుడిని లేదా డైటీషియన్‌ను అడగాలి. ఈ సాధారణ జాగ్రత్తలు అలసట, రక్తహీనత, ఎముకల నష్టం,  హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...