తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏర్పడిన భేదాభిప్రాయాల కారణంగా ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్యే కొండా సురేఖను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. మంత్రి పదవిని కోల్పోయిన నాటి నుంచి అసెంబ్లీ జరుగుతున్న ప్రస్తుత వర్షాకాల సమావేశాలకు దూరంగా ఉంటున్న ఆమెతో, తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా ఫోన్లో మాట్లాడారు.  పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలను పక్కనబెట్టి, వ్యక్తిగత సమస్యలను విడనాడి మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాల్సిన ఆవశ్యకతను ఆమెకు వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ఆమె హాజరుకాకపోవడం కాంగ్రెస్ పార్టీ సర్కిళ్లలో తీవ్ర దుమార రేపింది.  ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను మీనాక్షి నటరాజన్‌కు అప్పగించినట్లు సమాచారం. ఫోన్ సంభాషణ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఢిల్లీ నుంచి నేరుగా రావాల్సిందిగా కొండా సురేఖకు పార్టీ పెద్దల నుంచి పిలుపు అందడం ప్రాధాన్యత సంతరించుకుంది.  మంత్రి పదవిని కోల్పోయి తీవ్ర అసంతృప్తితో రగులుతున్న సురేఖను కూడగట్టే క్రమంలో భాగంగానే హైకమాండ్ ఈ చర్యలు చేపట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఆమెకు త్వరలోనే కేబినెట్ స్థాయి లేదా సముచితమైన మరో ఉన్నత పదవిని అప్పగించే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటం గమనార్హం. గతంలో వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఆమె కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, పరకాల అసెంబ్లీ స్థానంపై చెలరేగిన వివాదం తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి.   తన బిడ్డ చేసిన వ్యాఖ్యలకు తల్లిగా తనను బాధ్యురాల్ని చేసి బలిపశువును చేయడం ఎంతవరకు సమంజసమని సురేఖ గతంలో బహిరంగంగానే ప్రశ్నించిన సంగతి తెలిసిందే. బీసీ వర్గానికి చెందిన తనపైనే కఠిన చర్యలు తీసుకున్నారని, పార్టీలో కొందరికే ఒక రకమైన న్యాయం, తమలాంటి వారికి మరో న్యాయం జరుగుతోందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారకుండా చూసేందుకు హైకమాండ్ వేగంగా పావులు కదుపుతోంది. ఫోన్ కాల్ చర్చల తర్వాత, ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న కొండా సురేఖతో పార్టీ పెద్దలు జరిపే సమావేశం తర్వాత ఈ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందనే అంశంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.         [ Konda Surekha, Congress High Command, Meenakshi Natarajan, Telangana Politics, CM Revanth Reddy, Congress Cabinet, Congress party, Parakala assembly, Konda Sushmita Patel, Telugu One, Telugu News ]
  ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..? తెలంగాణ రాజకీయ రంగంలో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను రేపుతున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నాయకులు అందరూ పాల్గొని, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. గత మూడు రోజులుగా శాసనసభ ప్రాంగణంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న హైడ్రామా, నాటకీయ పరిణామాలు మరియు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వైఖరిపై ప్రభుత్వం ప్రజల నాడిని పట్టేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫ్లాష్ సర్వే ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నేతల ముందుంచడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు, పాలనా విధానాలకు ప్రజల నుంచి పూర్తి స్థాయి సానుకూలత లభిస్తోందని, కాంగ్రెస్ పరిపాలనపై ఎలాంటి ప్రజా వ్యతిరేకత లేదని సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా జరిగిన పరిణామాలు, ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులు, స్పీకర్ పదవిని కించపరిచేలా జరిగిన వ్యాఖ్యలు  ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద చోటుచేసుకున్న శుద్ధీకరణ వివాదాస్పద ఘటనలను ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల, రాజ్యాంగబద్ధ పదవుల పట్ల ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, త్వరలోనే వారికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో, అలాగే ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ఎర్రవల్లి ఘటనపై మంత్రులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని, చట్టపరమైన చర్యలు కచ్చితంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరియు నియోజకవర్గ ఇంచార్జ్‌లు అందరూ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజలకు వివరించి బలంగా ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియా  డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. ఈ ఫ్లాష్ సర్వే రిపోర్ట్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుండగా, రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.       [ CM Revanth Reddy, flash survey, BRS party, CLP meeting, Telangana news, Congress government,Telangana goverment, KCR, KTR, BRS Party, Telugu One, Telugu News ]  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యధిక కాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతున్న నాయకులలో ఒకరు. ఆయన ప్రస్తుతం నాలుగవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే వ్యక్తిగత స్థాయిలో, సరిగ్గా మూడేళ్ల కిందట   అప్పటి జగన్ ప్రభుత్వం ఆయనను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసింది. ఏడు పదుల వయస్సులో ఈ అరెస్టు సమయంలో చంద్రబాబు క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనేలా చేసిందని చెప్పాలి. ఏకంగా 53 రోజుల పాటు ఆయనను రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో నిర్బంధించింది. ఐసోలేటెడ్ సెల్ లో, కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా వేధించింది అప్పటి జగన్ సర్కార్. నాటి రోజులను తాజాగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సామాజిక మాధ్యమ వేదికపై తనను అక్రమంగా అరెస్టు చేసిన నాటి రోజులను గుర్తు చేసుకుంటూ షేర్ చేసిన పోస్టులో తనను అరెస్టు చేసిన తీరు దారుణమనీ పేర్కొన్న చంద్రబాబు.. అయితే ఈ ఘటన తనను ఏ మిత్రం కుంగదీయలేదన్నారు. తనను అరెస్టు చేయించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి తనకు ఒక్క నిమిషం కంటే ఎక్కువ సమయం పట్టదన్న ఆయన అయితే తన విధానం అది కాదన్నారు.  తనను చాలా మంది మెతక అనీ, కఠిన నిర్ణయాలు తీసుకోలేని మృదు స్వభావిననీ చెబుతుంటారు.   కానీ వాస్తవానికి తాను చేసే  ప్రతి పనీ తెలుగు ప్రజల శ్రేయస్సు,  సమాజ హితం కోసమే ఉండాలి అని భావిస్తానని పేర్కొన్నారు. రాజకీయాలు అంటే  సవాళ్లు విసురుకోవడం, తొడలు కొట్టుకోవడం కాదన్నారు. అలాగే   ఎన్నికల ఫలితాల ఆధారంగా ఒకరినొకరు అరెస్టు చేయించుకోవడం కూడా కాదన్నారు.  తాను ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాజిక హితం గురించి ఆలోచిస్తానని పేర్కొన్నారు.  [Chandrababu Naidu, AP Politics, YS Jagan Mohan Reddy, Revenge Politics, Telugu Desam Party, Andhra Pradesh News, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
  సినీ ప్రేమికుల్ని, సంగీత ప్రియుల్ని నిద్రలో లేపి పలరించండి... సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబో ఒక లెవల్, వాళ్ళ కాంబోలో వచ్చిన మొదటి సినిమా దగ్గరనుంచి అన్ని పాటలు వరుసగా వింటూనే ఉన్నాను. ఆర్ సి 17 సాంగ్స్  కోసం వెయిటింగ్ అని అంటుంటారు. అంతలా ఆ ఇద్దరి కాంబోకి క్రేజ్ ఉంది. సుకుమార్ మొదటి సినిమా ఆర్య దగ్గర్నుంచి ప్రీవియస్ పుష్ప 2 వరకు దేవినే మ్యూజిక్. దీన్ని బట్టి ఆ కాంబోకి ఏర్పడిన ఫ్యాన్ బేస్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.      దాదాపు 20 ఏళ్లకు పైగా కొనసాగిన ఈ సుదీర్ఘ అనుబంధంలో వీరి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో మ్యూజికల్ చార్ట్‌బస్టర్స్ మరియు సరికొత్త రికార్డులను నెలకొల్పింది.  అయితే,  రామ్ చరణ్, సుకుమార్ ల  RC17 తో  ఈ కాంబోకి బ్రేక్ పడనుందనే వార్తలు టాలీవుడ్‌లో వైరల్ గా మారాయి . 2024 హోలీ పండగ సందర్భంగా ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించినప్పుడు రిలీజ్ చేసిన ఫస్ట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌పై దేవిశ్రీ ప్రసాద్ పేరే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ఆస్థాన సంగీత దర్శకుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.     Also Read: యూత్ మూవీ అంటే బూతు సినిమానేనా: ఎపిక్ లో ఏం చెప్పారు!  ఈ మార్పు వెనుక ఇటీవల విడుదలైన 'పుష్ప 2: ది రూల్' చిత్రం నిర్మాణ సమయంలో తలెత్తిన తీవ్రమైన క్రియేటివ్ డిఫరెన్సెస్ ముఖ్య కారణమని ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా ప్రచారం సాగుతోంది. సినిమా విడుదలకు సమయం చాలా తక్కువగా ఉండటం, అనుకున్న గడువులోగా రీ-రికార్డింగ్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) అవుట్‌పుట్ రాకపోవడంతో సుకుమార్ ఇతర సంగీత దర్శకులైన ఎస్.ఎస్. తమన్, సామ్ సి.ఎస్ సేవలను అత్యవసరంగా ఉపయోగించుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామంతో ఇద్దరి మధ్య కొంత దూరం పెరిగిందని, అందువల్లే RC17 ప్రాజెక్ట్ నుంచి దేవిశ్రీ బయటకు వచ్చాడని టాక్. ఈ క్రమంలోనే సుకుమార్ తన తదుపరి చిత్రం కోసం సరికొత్త సౌండింగ్ అండ్ మ్యూజిక్ అందిచేందుకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్‌దేవ్, కోలీవుడ్ యంగ్ సెన్సేషన్స్ సాయి అభ్యంకర్, హర్షవర్ధన్ రామేశ్వర్ లేదా అనిరుధ్ రవిచందర్ వంటి ఇతర సంగీత దర్శకుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా  సగటు సినీ, సంగీత అభిమాని RC 17  కి సుకుమార్, దేవి కలిసి పని చేయాలని తమ ఇష్టదైవాన్ని కోరుకుంటాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్పెషల్ సాంగ్స్ ప్రేమికులు కూడా.       [RC17, Sukumar, Devisriprasad, Split Rumours, Pushpa 2 creative differences, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]  
విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ టీజర్ తాజాగా విడుదలైంది. కుటుంబ నేపథ్యంతో కూడిన వినోదం, యాక్షన్, సరదా సంభాషణలతో టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. మధ్యతరగతి కుటుంబం.. ఆ కుటుంబంలో చోటుచేసుకునే సరదా సంఘటనలు.. వాటి చుట్టూ అల్లుకున్న వినోదం.. ఇలా ‘ఆదర్శ కుటుంబం – AK47’ ప్రపంచాన్ని టీజర్ ఆసక్తికరంగా పరిచయం చేసింది. వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్‌ రచన, పదునైన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో టీజర్‌లోని యాక్షన్ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. వెంకటేష్ కుటుంబాన్ని మొదట మధ్యతరగతి కుటుంబంగా పరిచయం చేశారు. చిన్న ఉద్యోగంతో అప్పులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్టుగా వెంకటేష్ పాత్రను చూపించారు. ఆ తర్వాత లాటరీ లాంటిది తగిలి, ఆ ఫ్యామిలీ రిచ్ లైఫ్ చూస్తుంది. అంతవరకు బాగానే ఉంది కానీ, టీజర్ చివర్లో క్రైమ్ ఎలిమెంట్స్ చూపించడం సర్ ప్రైజింగ్ గా ఉంది. "నాకు ఫ్యామిలీ ఇమేజ్ ఉందని నాకు తెలుసు. కానీ, సిట్యుయేషన్ డిమాండ్ చేస్తే యాక్షన్ చేయడానికి వెనకాడను" అంటూ వెంకటేష్ తనలోని వయలెంట్ యాంగిల్ ను చూపించాడు. మొదట్లో టీజర్ ఎంత సరదాగా ఉందో, చివర్లో టీజర్ అంత వయలెంట్ గా మారిపోయింది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుందని ఆశించిన ఫ్యాన్స్ కు.. ఇది ఒక రకంగా షాక్ అని చెప్పొచ్చు. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది.       [Aadarsha Kutumbam Teaser, AK47 Teaser Telugu, Aadarsha Kutumbam House No 47, Venkatesh, Trivikram, Srinidhi Shetty, Telugu Film News, Telugu News]  
Nikhil has been patient over three years for his upcoming biggie, Swayambhu. The actor has taken a gigantic leap in his career with the film after Karthikeya 2 becoming a big success. With Swayambhu, he is pushing himself to the brink and he confirmed that the movie is a Pan-India film.  He wrote, "SWAYAMBHU is going to be a Multi Language PAN INDIAN film Releasing Nationwide - WorldWide. Good things take time. We r almost there... I never expected to shoot for 175 days and 2500 graphics shots for a single film. But... Raccha Lepadaniki Ready .. Release Date announcement coming."  Nikhil seems to be confirming this after The Paradise makers stated that they are making a Telugu Film but not a Pan-India one. Currently, the post production works of the film are going on at a rapid pace. Samyuktha and Nabha Natesh are playing leading roles in this film produced by Bhuvan and Sreekar. The movie is directed by Bharat Krishnamachari. KK Senthil Kumar has handled cinematography for the film.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ఒక మనిషికి ఈ భూమ్మీద ఎవరు పంచలేనంత ప్రేమని, మంచిని సినిమా మాత్రమే ఇస్తుంది. సినిమా చూసి బాగుపడని వారంటూ ఉండరు. ఎంత పెద్ద పండితులైనా వారానికి రెండు మూడు సినిమాలైనా చూడనిదే నిద్రపోరు. అష్టవదాని గరికిపాటి నరసింహారావునే ఒక ఉదాహరణ. అంతటి గొప్ప విజ్ణానానికి కేంద్ర బిందువైన సినిమాని అడ్డు పెట్టుకొని  యూత్ ముసుగులో శృతిమించిన శృంగారాన్ని చూపిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   నిన్న విడుదలైన ‘ఎపిక్’ సినిమా తర్వాత సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ ఈ చర్చ మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ సినిమాలో ఉపయోగించిన కొన్ని బోల్డ్ డైలాగ్స్, సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి తీవ్రమైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది దీనిని యథార్థ జీవితానికి అద్దం పట్టే ప్రయత్నంగా సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం యూత్ సినిమాల పేరిట బూతుని  గ్లోరిఫై చేస్తున్నారని మండిపడుతున్నారు. అసలు ఒక సినిమాలో లైంగికతను లేదా శృంగారాన్ని చూపించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? లైంగిక సంబంధాలు, శృంగారాన్ని తెరపై చూపించడం వెనుక ఉన్న హద్దులేంటి అనే కోణంలో లోతైన విశ్లేషణ అవసరం. సినిమా అనేది సమాజానికి ప్రతిబింబం అని అంటుంటారు. నేటి యువత మాట్లాడుకునే భాష, వారి ఆలోచనా విధానం, బంధాలలో వారు ఎదుర్కొనే సమస్యలను నిజాయితీగా చూపించడమే తమ ఉద్దేశమని దర్శకులు చెబుతున్నారు. ‘ఎపిక్’ చిత్రంలో కూడా పాత్రల మధ్య ఉండే ఆవేశం, సంభాషణలు చాలా సహజంగా ఉన్నాయని కొందరు బావిస్తున్నారు. అయితే, 100% నగ్నత్వాన్ని లేదా కేవలం లైంగిక చర్యలను మాత్రమే తెరపై చూపించడం వల్ల సినిమా గొప్పది అయిపోదు. ఒక కథలో శృంగార సన్నివేశం ఎందుకు ఉందో తెలిపే బలమైన భావోద్వేగం  ఉన్నప్పుడు మాత్రమే ప్రేక్షకుడు దానికి కనెక్ట్ అవుతాడు. అలా కాకుండా కేవలం పబ్లిసిటీ కోసం లేదా ఓపెనింగ్స్ రాబట్టడం కోసమే బోల్డ్ సీన్లు పెడితే, అది సినిమా స్థాయిని దిగజార్చుతుంది.     Also Read: అలాంటి పుకార్లని నమ్మకండి: అందుకు హామీ ఇదే! గతంలో వచ్చిన అనేక ప్రపంచ ప్రసిద్ధ సినిమాలలో కూడా శృంగారాన్ని అత్యంత వినూత్నంగా, కళాత్మకంగా చూపించారు. కానీ అక్కడ కథనంలో 80% శాతానికి పైగా భావోద్వేగాలు, క్యారెక్టర్ డెవలప్‌మెంట్ మాత్రమే ప్రధానంగా ఉండేవి. తెలుగులో కూడా యూత్ సినిమాల ట్రెండ్ మారుతోంది. 18 నుండి 35 ఏళ్ల వయస్సు గల యువతనే లక్ష్యంగా చేసుకుని దాదాపు 60% పైగా చిన్న చిత్రాలు నిర్మితమవుతున్నాయి. వీటిలో దాదాపు 40% చిత్రాలు కేవలం సెన్సేషనలిజం మీదే ఆధారపడుతున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే కేవలం బూతు మాటలు లేదా బోల్డ్ సీన్లు ఉంటే సరిపోదు, బలమైన కథాంశం 100% ఉండి తీరాలి. లైంగికత అనేది మానవ జీవితంలో ఒక సహజమైన భాగం. దానిని సినిమాలో చూపించడం తప్పు కాదు, కానీ దానిని ఏ రకంగా ప్రెజెంట్ చేస్తున్నారు అనేదే ముఖ్యం. ‘ఎపిక్’ వంటి సినిమాలు తెచ్చిన ఈ చర్చ కేవలం ఒక సినిమాకే పరిమితం కాదు, భవిష్యత్తులో రాబోయే యూత్ సినిమాల ధోరణిని నిర్దేశిస్తుంది. ప్రేక్షకులు కూడా కేవలం గ్లామర్, బూతు కంటెంట్‌ను మాత్రమే ఆదరించడం లేదని, కంటెంట్‌లో దమ్ముంటేనే 50 రోజులు థియేటర్లలో నిలబెడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి యూత్ సినిమా అంటే బూతు సినిమా కాదు, అది యువత ఆలోచనలను, వారి భావోద్వేగాలని  ప్రతిబింబించే ఒక శక్తివంతమైన సాధనం అని నిరూపించాల్సిన బాధ్యత నేటి తరం దర్శకులపై ఉంది.        [Youth Movies, Bold Content, Epic Analysis, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]
Trivikram Srinivas is known for his style of comical entertainers. He is working for the first time with Victory Venkatesh for their Aadarsha Kutumbam AK 47 with Srinidhi Shetty in leading lady role. The movie teaser has been unveiled and it showcases the life of a family who rise from middle class to rich.  Venkatesh as a middle class man looks like his character being developed from Malliswari Pelli kani Prasad after marriage. He does everything from house work to office work while Srinidhi as his wife spends luxuriously. They have huge amount of debt and their lives change with a lottery ticket.    But there is a huge crime angle and Venkatesh has to go out of his zone to fight. With Trivikram at the helm, the comedy elements in the film work brilliantly and the character of Venkatesh is designed very well too. We have to wait and see how the other elements come together but Trivikram is in good form as a writer.  The jokes work well enough for family audiences to come and watch the film from 2nd October. S Thaman is scoring music for the film and Nara Rohit is playing a prominent role in the movie as a police officer.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  తక్కువ సమయంలోనే వరుస చిత్రాలతో బిజీగా మారి స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న భామ శ్రీలీల. విచిత్రంగా అంతే తక్కువ సమయంలో వరుస ప్లాప్ లతో స్టిల్ తెలుగులో సినిమాలు లేని పరిస్థితి. ప్రస్తుతం తన లిస్ట్ లో  ధనుష్ 'ఓం'తో పాటు బాలీవుడ్ మూవీ ఉంది. ఈ రెండు ఆడితే శ్రీలీల జాతకం మళ్ళీ మొదటికి  వస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో హిట్టునే అసలైన ఆత్మ బంధువు.    Also Read: ది ప్యారడైజ్ కోసం 2000 లీటర్ల రక్తం: ఆ రక్తం ఎవరిదో తెలుసా!  శ్రీలీల తోటి నటీనటుల పట్ల ఈగో ప్రదర్శిస్తోందని, తనతో సమానంగా నటించే నటులు గానీ నటీమణులు గానీ లేరనే గర్వంతో వ్యవహరిస్తోందంటూ గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో నెగెటివ్ ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల మాట్లాడుతు 'నాతో సమానంగా నటించే నటుడు లేదా నటి ఎవరూ లేరని నేను గర్వపడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. నాకు ఎలాంటి అహంకారం లేదు, నేనెప్పుడూ ఎవరి దగ్గరా ఈగో ప్రదర్శించలేదు. అందరినీ సమానంగా గౌరవించే మనస్తత్వం నాది. కాబట్టి ఇలాంటి అనవసర పుకార్లని ఎవరూ నమ్మకూడదు, వాటిని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. నా ధ్యాస అంతా ప్రస్తుతం నటనపైనే ఉంది. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి స్థానాన్ని పదిలపరుచుకోవడమే  లక్ష్యం. తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులకు దగ్గరవ్వడం తనకెంతో ఆనందంగా ఉందని, ఇరు రాష్ట్రాల అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది.         [Sreeleela, Ego Rumors, Dhanush, Om, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]  
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న 'రాకా' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే 'పుష్ప' లాంటి ఆల్-టైమ్ బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ చేస్తోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. అసలు ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం.. ఈ ఏడాది దసరా నాటికే ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి, 2027 క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. షూటింగ్ షెడ్యూల్స్‌లో తీవ్రమైన జాప్యం జరగడంతో, 'రాకా' మూవీ రిలీజ్ ఏకంగా 2028కి వాయిదా పడిందని సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం... ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు 2027 మార్చి లేదా ఏప్రిల్ వరకు కొనసాగే అవకాశం ఉంది. డైరెక్టర్ అట్లీ తన సినిమాల్లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాడు. 'రాకా'లో భారీ గ్రాఫిక్స్ వర్క్ ఉండటంతో, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఆయనకు చాలా ఎక్కువ సమయం కావాల్సి వస్తోంది. క్వాలిటీ విషయంలో ఎలాంటి లోటు ఉండకూడదనే ఉద్దేశంతోనే 2027 క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకోవాలని టీమ్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి 2028 రిపబ్లిక్ డే కానుకగా ఈ విజువల్ వండర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఆ డెడ్‌లైన్ కూడా మిస్ అయితే, 2028 సమ్మర్ లో ఈ సినిమాను థియేటర్లలోకి దించడానికి ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తిగా పూర్తయిన తర్వాతే అఫీషియల్ రిలీజ్ డేట్‌ను లాక్ చేసి అనౌన్స్ చేయనున్నారట. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో కాస్టింగ్ కూడా అదే స్థాయిలో ఉంది. ఈ చిత్రంలో దీపికా పడుకోణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. వాయిదా పడిందన్న వార్త ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ కలిగించినా.. అవుట్‌పుట్ మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా ఉండబోతోందట.        [Raaka Postponed, Allu Arjun, Raaka Movie, Raaka 2028 Release, Director Atlee, Allu Arjun, Telugu Film News, Tollywood News]  
  'హే చికితా' అంటూ పవన్ కళ్యాణ్ తో 'వస్తా నీ వెనుక' అంటూ మహేష్ బాబుతో ఆడిపాడి   తెలుగు ప్రేక్షకులని వశం చేసుకున్న భామ 'అమీషా పటేల్. బాలీవుడ్ లో అయితే తన హవా చాలా బలంగానే చాటి చెప్పింది.ముంబై నగరంలోని చర్చిగేట్ ప్రాంతంలో ఉన్న అమీషా పటేల్ తల్లిదండ్రుల నివాసంలో సుమారు 5 లక్షల రూపాయల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలు చోరీకి గురికావడం చిత్రపరిశ్రమలోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర కలకలం రేపింది.  ఈ దొంగతనం సంఘటనపై అమీషా పటేల్ తల్లి ఆశా పటేల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెరైన్ డ్రైవ్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి విచారణని వేగవంతం చేశారు. ఈ క్రమంలో అనుమానితురాలిగా ఉన్న ఇంట్లో పనిచేసే మహిళని పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఈ కేసులో మలుపుగా మారింది. పోలీసు వివరాల ప్రకారం, ఈ దొంగతనానికి పాల్పడిన నిందితురాలిని పాల్ఘర్ జిల్లాకు చెందిన 40 ఏళ్ల సీమా ఘాటేగా పోలీసులు గుర్తించారు. ఈమె గత 18 నెలలుగా (సుమారు ఒకటిన్నర సంవత్సరాలుగా) అమీషా పటేల్ తల్లిదండ్రుల నివాసంలో నమ్మకంగా పనిచేస్తోంది. జనవరి 2026లో ఇంట్లోని ఒక విలువైన వజ్రాలు పొదిగిన బంగారు గాజు ఉన్నట్టుండి కనిపించకుండా పోవడంతో ఈ వ్యూహాత్మక దొంగతనం వెలుగులోకి వచ్చింది. అనుమానం వచ్చిన అమీషా తల్లి ఆశా పటేల్, సుమారు 5 నుండి 6 నెలల పాటు సీమాను నిలదీస్తూ, నిజం చెప్పి ఆభరణాన్ని తిరిగి ఇచ్చేయమని కోరారు. కానీ, ఆమె నుండి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో, చివరకు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు.       Also Read: ది ప్యారడైజ్ కోసం 2000 లీటర్ల రక్తం: ఆ రక్తం ఎవరిదో తెలుసా!   ఫిర్యాదు నమోదు చేసుకున్న ముంబై మెరైన్ డ్రైవ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. ప్రత్యేక క్రైమ్ డిటెక్షన్ టీమ్ సమర్థవంతంగా పనిచేసి, నిందితురాలు సీమా ఘాటే విరార్ ప్రాంతంలో ఉందనే పక్కా సమాచారాన్ని సేకరించి అక్కడ ఆమెను అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు సెప్టెంబర్ 15 వరకు పోలీస్ కస్టడీ విధించింది.   Ameesha Patel, Pawan Kalyan, Ameesha Patel theft case,Mumbai, Mahesh Babu, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood  
ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఢీ-10 విన్నర్ రాజు అరెస్ట్ అయ్యాడు. ఈ సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో రాజుపై ఒక యువతి ఫిర్యాదు చేసింది.  బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని రాజు ఆమెకు ఆశ చూపాడట. పెద్ద ప్రాజెక్టుల్లో ఛాన్సులు ఇప్పిస్తానని నమ్మబలికి, ఆ తర్వాత ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడని ఆరోపించింది.  అవకాశాల పేరుతో తనను దారుణంగా మోసం చేశాడని, వేధింపులకు గురిచేశాడని ఆ యువతి మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన మియాపూర్ పోలీసులు.. తాజాగా రాజును అరెస్ట్ చేశారు. కోర్టు రెండు వారాల రిమాండ్ విధించినట్లు సమాచారం.     [Dhee 10 Winner, Dancer Raju Arrest, Dhee Raju Case, Sexual Harassment Case, Dhee Raju, Telugu Film News, Telugu News]  
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ టాలీవుడ్‌లో సరికొత్త రికార్డుకు తెరదీశారు. కేవలం 36 రోజుల వ్యవధిలోనే ఏకంగా 3 విభిన్నమైన సినిమాలతో థియేటర్లలోకి రాబోతున్నారు. అక్టోబర్ 30న 'కల్ట్', నవంబర్ 19న 'ఈ నగరానికి ఏమైంది 2', డిసెంబర్ 4న 'లెగసీ' సినిమాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం హీరోలు ఒక్కో సినిమాకు ఏడాది నుంచి రెండేళ్లు సమయం తీసుకుంటున్నారు. కానీ విశ్వక్ సేన్ ఏకంగా ఐదు వారాల గ్యాప్‌లోనే మూడు పూర్తి డిఫరెంట్ జానర్ సినిమాలను థియేటర్లలోకి దించుతున్నాడు. అక్టోబర్ 30న 'కల్ట్'.. ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహిస్తుండడం విశేషం. పోస్టర్స్, టీజర్లతోనే మాస్ ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేసింది. నవంబర్ 19న 'ENE REPEAT'.. యూత్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రానికి ఇది అఫీషియల్ సీక్వెల్. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పాత గ్యాంగ్ అంతా కలిసి ఈ కామెడీ రైడ్ తో మళ్ళీ రచ్చ చేయడానికి వస్తున్నారు. డిసెంబర్ 4న 'లెగసీ'.. పవర్, ఫ్యామిలీ, పాలిటిక్స్ అండ్ రివెంజ్ నేపధ్యంలో సాగే సాలిడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. బాలీవుడ్ నటుడు కే కే మీనన్ విలన్‌గా, 'పిండం' ఫేమ్ సాయికిరణ్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విశ్వక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామా కాబోతోంది. కేవలం 36 రోజులు.. అంటే అక్టోబర్ 30 నుంచి డిసెంబర్ 4 మధ్యలోనే ఈ మూడు సినిమాల విడుదల జరగబోతోంది. ఒక పక్క హర్రర్ స్లాషర్, ఇంకో పక్క ప్యూర్ యూత్‌ఫుల్ కామెడీ, మరొక పక్క ఇంటెన్స్ పొలిటికల్ డ్రామా. ఒకే హీరో మూడు డిఫరెంట్ షేడ్స్‌లో ఇంత తక్కువ టైమ్‌లో కనిపించడం టాలీవుడ్ హిస్టరీలోనే ఒక రేర్ ఫీట్.        [Vishwak Sen, 3 Films in 36 Days, Cult Movie, ENE Repeat, Legacy Movie, Ee Nagaraniki Emaindi, Telugu Film News, Telugu News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ప్రశాంతమైన నిద్ర మానవ ఆరోగ్యానికి అత్యంత ఆవశ్యకమైన నిధి. రాత్రంతా హాయిగా, ఎటువంటి ఆటంకం లేకుండా నిద్రపోతేనే మరుసటి రోజు ఉదయం ఉత్సాహంగా, చురుగ్గా పనులు చేసుకోగలుగుతాం. అయితే చాలామందికి రాత్రివేళల్లో హఠాత్తుగా మెలకువ రావడం, ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోవడం వంటి తీవ్రమైన సమస్య వేధిస్తుంటుంది. రాత్రి సమయం ముఖ్యంగా తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో అకస్మాత్తుగా మెలకువ వచ్చి మళ్లీ గంటల తరబడి నిద్ర కోసం తల్లడిల్లడం మనం చాలామందిలో గమనిస్తుంటాం. దీనిని కేవలం ఒక సాధారణ అలవాటుగానో లేదా ఏదో చిన్న నిద్రలేమి సమస్యగానో భావించి నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు. నిద్ర మధ్యలో పదే పదే మెలకువ రావడానికి మన జీవనశైలితో పాటు శరీరంలో అంతర్గతంగా ఉండే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ప్రధాన కారణాలు కావచ్చు. ఈ సమస్యకు మొదటి మరియు అత్యంత ప్రధానమైన కారణం విపరీతమైన మానసిక ఒత్తిడి (స్ట్రెస్) మరియు ఆందోళన. మనసులో ఏవైనా ఆందోళన కలిగించే ఆలోచనలు ఉన్నప్పుడు, మన శరీరంలో  కోర్టిసాల్  అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు రాత్రి సమయంలో ఒక్కసారిగా పెరుగుతాయి. సాధారణంగా నిద్రపోతున్నప్పుడు తగ్గే ఈ హార్మోన్, మానసిక ఒత్తిడి వల్ల అర్ధరాత్రి వేళ హెచ్చుతగ్గులకు లోనై మెదడును తక్షణమే మేల్కొలిపేస్తుంది. అంతేకాకుండా, రాత్రి పడుకునే ముందు కాఫీ, టీ లేదా ఎనర్జీ డ్రింక్స్ వంటి కెఫిన్ ఉన్న పదార్థాలను తీసుకోవడం కూడా నిద్ర భంగానికి ప్రధాన కారణం. కెఫిన్ ప్రభావం శరీరంలో దాదాపు 6 నుండి 8 గంటల వరకు ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను దెబ్బతీసి, గాఢ నిద్రలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. మరొక ముఖ్యమైన కారణం నిద్రపోయే ముందు భారీగా ఆహారం తీసుకోవడం లేదా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు. రాత్రి వేళ ఆలస్యంగా, ముఖ్యంగా కొవ్వులు మరియు కారం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిని వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ లేదా అసిడిటీ సమస్య తలెత్తుతుంది. కడుపులోని ఆమ్లాలు పైకి రావడం వల్ల గుండెల్లో మంట, అసౌకర్యం కలిగి రాత్రిపూట ఉలిక్కిపడి లేస్తుంటారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్ షుగర్ లెవల్స్) హఠాత్తుగా పడిపోవడం వల్ల కూడా నిద్ర మధ్యలో మెలకువ వస్తుంది. రాత్రి సమయంలో రక్తంలో గ్లూకోజ్ తగ్గగానే, దాన్ని సరిచేయడానికి శరీరం అడ్రినలిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది గుండె వేగాన్ని పెంచి మనకు మెలకువ వచ్చేలా చేస్తుంది. రాత్రివేళ పదే పదే మెలకువ రావడానికి  స్లీప్ ఆప్నియా  అనే భయంకరమైన శ్వాసకోశ సమస్య కూడా కారణం కావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో నిద్రపోతున్నప్పుడు గొంతు కండరాలు సడలిపోవడం వల్ల గాలి పీల్చుకోవడం కొన్ని సెకన్ల పాటు నిలిచిపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ స్థాయిలు తగ్గి, ఊపిరి ఆడక మెదడు రక్షణ చర్యగా శరీరాన్ని వెంటనే మేల్కొలుపుతుంది. వీటితో పాటు రాత్రిళ్లు తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం (నాక్టూరియా), పడుకునే గదిలో ఎక్కువ వెలుతురు ఉండటం, తీవ్రమైన ఉష్ణోగ్రత లేదా ధ్వనులు ఉండటం కూడా నిద్రకు విఘాతం కలిగిస్తాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే రాత్రి పూట లలితమైన ఆహారం తీసుకోవడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం మరియు తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స పొందడం చాలా అవసరం.         [Sleep Problems, Sleep Disorders, Night Waking, Insomnia, Stress and Anxiety, Caffeine, Acid Reflux, Blood Sugar, Sleep Apnea, Healthy Sleep]  
మన వంటింట్లో సులభంగా మరియు తక్కువ ధరకు లభించే ఆకుకూరల్లో పాలకూర అత్యంత విలక్షణమైనది. మార్కెట్లో అత్యంత చవకగా లభించినప్పటికీ, ఇది శరీరానికి అందించే పోషక విలువలు మాత్రం ఎంతో అమూల్యమైనవి. నేటి ఆధునిక జీవనశైలిలో విపరీతమైన కాలుష్యం, పోషకాహార లోపం మరియు రసాయన ఆహారాల కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిపోతోంది. ఈ క్రమంలో నిత్యం మన ఆహారంలో పాలకూరను భాగం చేసుకోవడం వల్ల ఎటువంటి ఖరీదైన మందులు లేకుండానే పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందే వీలుంది. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్, ఫోలేట్, కాల్షియం మరియు పొటాషియం వంటి అపరిమితమైన పోషకాలు దాగై ఉన్నాయి. దీనితో పాటు శరీర కణాలను దృఢంగా మార్చే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. పాలకూరను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల లభించే మొదటి మరియు అత్యంత ముఖ్యమైన ప్రయోజనం కంటి చూపు మెరుగుపడటం. పాలకూరలో ల్యూటిన్ మరియు జియాజాంతిన్ అనే రెండు ప్రధాన యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి వయస్సు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలను అరికట్టడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్ల ముందు గంటల తరబడి పనిచేసే వారికి ఇది డిజిటల్ స్క్రీన్ల వల్ల కంటిపై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. కంటి చూపు మందగించకుండా కాపాడటంతో పాటు దృష్టిని మరింత స్పష్టంగా మారుస్తుంది. అలాగే విటమిన్ ఏ పుష్కలంగా ఉండటం వల్ల రేచీకటి వంటి సమస్యలను కూడా ఇది నిరోధిస్తుంది.   రక్తహీనత లేదా ఎనీమియాతో బాధపడే వారికి పాలకూర ఒక అద్భుతమైన దివ్యౌషధం. ఇందులో ఐరన్ శాతం సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల (RBC) ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడి నీరసం, అలసట మరియు తల తిరగడం వంటి సమస్యలు మాయమవుతాయి. అంతేకాకుండా, పాలకూరలోని నైట్రేట్లు రక్తనాళాలను విస్తరించి రక్తప్రసరణ సులభంగా జరిగేలా చేస్తాయి. దీనివల్ల అధిక రక్తపోటు (బిపి) అదుపులోకి వచ్చి, గుండెపోటు మరియు పక్షవాతం వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేయడంలో మరియు బరువు అదుపులో ఉంచడంలో పాలకూర ఎంతో తోడ్పడుతుంది. ఇందులో కరిగే మరియు కరగని నార పదార్థం (ఫైబర్) పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారించడమే కాకుండా, పేగుల ఆరోగ్యాన్ని క్షణాల్లో మెరుగుపరుస్తుంది. పాలకూరలో కేలరీలు అత్యంత తక్కువగా మరియు నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ డైట్ ఫుడ్. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి, అనవసరమైన కేలరీలు తీసుకోకుండా అడ్డుకుంటుంది. చర్మ సౌందర్యం మరియు ఎముకల దృఢత్వానికి కూడా పాలకూర ఒక వరప్రసాదంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కే మరియు కాల్షియం ఎముకల సాంద్రతను పెంచి, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా కాపాడతాయి. పాలకూరలోని విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది. కాబట్టి రోజువారీ పప్పులు, సూప్‌లు, స్మూతీలు లేదా కూరల రూపంలో పాలకూరను క్రమం తప్పకుండా తీసుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు ఖాయం.       [Spinach, Spinach Benefits, Eye Health, Iron Rich Foods, Anemia, Heart Health, Blood Pressure, Digestive Health, Bone Health, Healthy Diet]
  నేటి వేగవంతమైన జీవనశైలి, విపరీతమైన మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం మరియు పెరిగిన కాలుష్యం కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరినీ తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. తల దువ్వుకున్న ప్రతిసారీ గుప్పెడు జుట్టు చేతికి రావడం, వెంట్రుకలు పల్చబడిపోవడం లేదా కాలక్రమేణా కుదుళ్లు బలహీనపడటం చాలామందిలో ఆందోళన కలిగిస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే ఖరీదైన కెమికల్ షాంపూలు, నూనెలు లేదా రకరకాల హెయిర్ ట్రీట్‌మెంట్ల వైపు మొగ్గు చూపుతుంటారు. కానీ, ఇవన్నీ కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి మరియు కొన్నిసార్లు జుట్టుకు మరింత హాని కలిగిస్తాయి. అయితే మన సాంప్రదాయ ఆయుర్వేదంలో ఎటువంటి పార్శ్వ ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) లేకుండా ఇంట్లోనే జుట్టును సహజంగా ఒత్తుగా, బలంగా మార్చే అద్భుతమైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా మన వంటింట్లో నిత్యం లభించే నల్ల నువ్వులు జుట్టు ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తాయి. మన పూర్వీకుల కాలం నుంచి నల్ల నువ్వులను ఆరోగ్యానికి మరియు కేశ సంరక్షణకు ఒక మహోన్నతమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. నల్ల నువ్వులలో కేవలం ఆకలిని పెంచే గుణాలు మాత్రమే కాకుండా జుట్టుకు అవసరమైన ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ మరియు ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి తలలో రక్త ప్రసరణను గణనీయంగా పెంచి, కుదుళ్లను లోపలి నుంచి దృఢంగా మారుస్తాయి. ముఖ్యంగా జుట్టు విరిగిపోకుండా అడ్డుకోవడంలోనూ, చివర్లు విడిపోకుండా చూడటంలోనూ నల్ల నువ్వులు అద్భుతంగా తోడ్పడతాయి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా అర టీస్పూన్ నల్ల నువ్వులను నమలి తినడం లేదా రాత్రి వేళ నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటితో పాటు నువ్వులను తీసుకోవడం వల్ల జుట్టుకు అవసరమైన పోషకాలు అంతర్గతంగా లభిస్తాయి. నల్ల నువ్వులను కేవలం ఆహారంగా తీసుకోవడమే కాకుండా, వాటితో ప్రత్యేకమైన హెయిర్ ఆయిల్ తయారుచేసి తలకు పట్టించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. దీని కోసం గుప్పెడు నల్ల నువ్వులను తీసుకుని శుభ్రమైన కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో వేసి చిన్న మంటపై బాగా వేడెక్కించాలి. నువ్వులలోని సారం మొత్తం నూనెలోకి దిగి, నూనె రంగు మారేంత వరకు మరగబెట్టాలి. ఆ తర్వాత ఆ నూనెను చల్లార్చి వడకట్టి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ పవిత్రమైన మూలికా నూనెను వారానికి రెండు లేదా మూడు సార్లు తలకు రాసి, చేతి వేళ్లతో తలపైన కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు తేలికపాటి మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల మాక్యులేషన్ పెరిగి వెంట్రుకల కుదుళ్లకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. ఈ నూనె మసాజ్ చేసిన గంట తర్వాత లేదా మరుసటి రోజు ఉదయం రసాయనాలు లేని కుంకుడుకాయలు లేదా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. క్రమం తప్పకుండా ఈ చిట్కాను రెండు నుంచి మూడు నెలల పాటు పాటిస్తే జుట్టు రాలడం గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, పల్చబడిన చోట కొత్త వెంట్రుకలు రావడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా నల్ల నువ్వులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు చిన్న వయస్సులోనే తెల్లబడకుండా కాపాడతాయి. సహజమైన కాంతిని, నిగనిగలాడే నలుపును జుట్టుకు ప్రసాదిస్తాయి. కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే లభించే ఈ నల్ల నువ్వుల ఉపాయాన్ని పాటించి, ఆరోగ్యకరమైన, దృఢమైన మరియు ఒత్తైన జుట్టును మీ సొంతం చేసుకోండి.       [Black Sesame Seeds, Hair Fall, Hair Growth, Hair Care, Hair Loss Remedies, Ayurvedic Hair Care, Hair Oil, Healthy Hair, Scalp Massage, Natural Hair Care]
కీళ్ల నొప్పులు, వాపు, ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ (Rheumatoid Arthritis)లో కనిపించవచ్చు. ఇది సాధారణ కీళ్ల నొప్పులతో పోలిస్తే భిన్నమైన ఆటో ఇమ్యూన్ సమస్య. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ఆయుర్వేదం పనిచేస్తుందా? ఇంగ్లీష్ మెడిసిన్ తప్పనిసరా? కొన్ని సందర్భాల్లో సంప్రదాయ వైద్య చికిత్స అవసరం లేదా? ఆటో ఇమ్యూన్ కీళ్ల సమస్యల్లో ఆయుర్వేదాన్ని ఎందుకు కొందరు నిపుణులు సిఫారసు చేయరు? ఫంక్షనల్ మెడిసిన్ విధానం ఎలా భిన్నంగా ఉంటుంది? ఈ వీడియోలో Acupuncture మరియు Functional Medicine నిపుణులు డా. పి.ఎస్. సాగర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు సంబంధించిన వివిధ చికిత్సా విధానాల గురించి వివరిస్తున్నారు. ఆయుర్వేదం, కన్వెన్షనల్ మెడిసిన్, ఫంక్షనల్ మెడిసిన్ మధ్య ఉన్న తేడాలు, వాటి విధానాలు, పరిమితులు మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో చికిత్సను ఎంచుకునేటప్పుడు పరిగణించాల్సిన అంశాల గురించి తెలుసుకోండి. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య పరిస్థితికి సరైన చికిత్సను నిర్ణయించుకునే ముందు అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది భక్తిశ్రద్ధలు, రంగురంగుల మండపాలు, అంతకుమించి స్వామివారికి నివేదించే రకరకాల నైవేద్యాలు. బొజ్జ గణపయ్యకు పెట్టే ప్రసాదాలు కేవలం సంప్రదాయంలో భాగం మాత్రమే కాదు, వాటి వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే ఈ పండుగ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాల వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుంది. మన పెద్దలు ఆ కాలానికి తగినట్లుగా, శరీరానికి మేలు చేసే పదార్థాలనే వినాయకుడి ప్రసాదాలుగా మార్చారు. ఆ ప్రసాదాలు ఏమిటి, వాటి వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే.. కుడుములు , ఉండ్రాళ్ళు.. వినాయక చవితి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి కుడుములు, ఉండ్రాళ్ళు. వీటిని నూనె లేకుండా కేవలం ఆవిరి మీద మాత్రమే ఉడికిస్తారు. ఆవిరి మీద ఉడికే ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి చాలా సులభంగా ఉంటాయి. బియ్యపు పిండి, పెసరపప్పు లేదా శనగపప్పు, బెల్లం, కొబ్బరి కలగలిపి వీటిని తయారుచేస్తారు. బియ్యపు పిండి కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఆవిరి వంటకం కావడం వల్ల జీర్ణక్రియకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా పొట్టలో మంట, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఇవి కాపాడతాయి. కొందరు కుడుములను మైదా పిండితో నూనెలో డీప్ ఫ్రై చేసి చేస్తారు. ఇది అంత ఆరోగ్యానికి మంచిది కాదు.   బెల్లం , పప్పుధాన్యాల కాంబినేషన్.. అన్ని రకాల ప్రసాదాలలో బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయాన్ని శుభ్రపరచడానికి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది. కుడుముల్లో వాడే శనగపప్పు, పెసరపప్పుల ద్వారా శరీరానికి కావలసిన ప్రోటీన్లు లభిస్తాయి. వర్షాకాలంలో పెరిగే బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి బెల్లం, పప్పుధాన్యాల కాంబినేషన్ శరీరానికి మంచి బలవర్ధకమైన ఆహారంగా పనిచేస్తుంది. జిల్లేడు కాయలు , మోదకాలు.. విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మోదకాలను బియ్యపు పిండిలో బెల్లం, కొబ్బరి పూరకంతో చేస్తారు. కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు చర్మానికి, జుట్టుకు చాలా మంచివి. అంతేకాకుండా కొబ్బరి శరీరానికి అవసరమైన శక్తిని త్వరగా అందిస్తుంది. కొబ్బరి , బెల్లం కలిపి తినడం వల్ల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు, వాత రోగాల నివారణకు  ఈ కాంబినేషన్ చక్కగా తోడ్పడుతుంది. పాయసం , పరమాన్నం.. పాలు, బియ్యం, బెల్లం లేదా చక్కెరతో తయారుచేసే పాయసం నివేదనలో ముఖ్యమైనది. పాలల్లో లభించే కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. ఇందులో వేసే యాలకులు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, కడుపులో ఉన్న ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. పాయసంలో వాడే నెయ్యి శరీరానికి కావలసిన విటమిన్లు ఎ, డి లభించేలా చేస్తుంది , కీళ్ళకు అవసరమైన నూనెను అందిస్తుంది. పులిహోర.. ఏ పండుగైనా పులిహోర లేకపోతే నివేదన పూర్తికాదు. వినాయక చవితి నాడు నిమ్మకాయ లేదా చింతపండు పులిహోరను ప్రసాదంగా పెడతారు. చింతపండు, నిమ్మకాయలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో విటమిన్ సి లభించడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పుల వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. పులిహోర తాళింపులో వాడే పసుపు సహజమైన యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. పసుపులోని కుర్కుమిన్ అనే అంశం శరీరంలో మంటను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే ఇందులో వేసే అల్లం, మిరియాలు జీర్ణరసాలను ఉత్పత్తి చేసి ఆకలిని పెంచుతాయి. చలిమిడి , వడపప్పు.. వినాయక చవితి పూజ ముగిసిన తర్వాత ఇచ్చే ముఖ్యమైన ప్రసాదం చలిమిడి ,   పచ్చి పెసరపప్పును నీటిలో నానబెట్టి వడపప్పుగా ఇస్తారు. నానబెట్టిన పెసరపప్పులో పీచు పదార్థం, ప్రోటీన్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. వేడి చేసిన బియ్యపు పిండి, బెల్లం కలిపి చేసే చలిమిడి శరీరానికి తక్షణ బలాన్ని ఇస్తుంది. వర్షాకాలంలో కలిగే అలసటను నివారించడంలో ఈ  కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. పండ్ల నివేదన , పత్రీ ప్రభావం.. స్వామివారికి ప్రసాదాలతో పాటు రకరకాల పండ్లను సమర్పిస్తారు. ముఖ్యంగా వెలగపండు, నేరేడు పళ్ళు, అరటిపళ్ళు నివేదిస్తారు. వెలగపండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, కడుపులోని క్రిములను సంహరిస్తుంది. నేరేడు పళ్ళు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. వీటితో పాటు పూజలో ఉపయోగించే ఏకవింశతి పత్రి కూడా ఒక రకమైన ఔషధ గని. పూజ చేసే సమయంలో ఆ పత్రి తాకిడి, వాటి సువాసనల వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ విధంగా వినాయక చవితి ప్రసాదాలు కేవలం నైవేద్యం మాత్రమే కాకుండా, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధాలుగా పనిచేస్తాయి. మన సంస్కృతిలో భాగమైన ఈ ప్రసాదాలను తిని, పండుగను భక్తితో పాటు ఆరోగ్యకరంగా జరుపుకోవడం ఆ వినాయకుడు ఇచ్చే అదృష్టం.. !                          *రూపశ్రీ.  
ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారింది. బిజీ జీవనశైలి, వేళపాళ లేని తిండి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది అనతికాలంలోనే అధిక బరువు బారిన పడుతున్నారు. అయితే, బరువు తగ్గడానికి గంటల తరబడి జిమ్‌లో కష్టపడాల్సిన పనిలేదు లేదా కఠినమైన ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు. మన రోజువారీ ఆహారపు అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా, ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు.  అధిక బరువును తగ్గించుకోవడానికి సహాయపడే కొన్ని సులభమైన ఆహార నియమాలు , చిట్కాల గురించి  వివరంగా తెలుసుకుంటే.. ప్రోటీన్ ఫుడ్.. ప్రోటీన్ లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. రోజూ తీసుకునే ఆహారంలో గుడ్లు, పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పనీర్, లేదా చికెన్ వంటి వాటిని చేర్చుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. దీనివల్ల అనవసరంగా చిరుతిళ్లు తినే అలవాటు తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది శరీరంలో కండరాల నిర్మాణానికి , జీవక్రియ రేటును పెంచడానికి తోడ్పడుతుంది. మంచినీరు మ్యాజిక్.. భోజనం చేసే సమయానికి కనీసం అర్ధగంట ముందు ఒక పెద్ద గ్లాసు మంచి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది , భోజనం చేసేటప్పుడు అతిగా తినకుండా నిరోధించవచ్చు. రోజూ సరిపడా నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి , మెటబాలిజం వేగవంతమవుతుంది. దాహం వేసినప్పుడు శీతల పానీయాలు లేదా ప్యాక్ చేసిన జ్యూస్‌లు తాగడానికి బదులుగా సాధారణ నీరు లేదా నిమ్మరసం, మజ్జిగ తీసుకోవడం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫైబర్.. రోజువారీ ఆహారంలో పీచు పదార్థం లేదా ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, హోల్ గ్రెయిన్స్ , ఓట్స్ వంటి వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను నెమ్మదింపజేసి, రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగకుండా ఫైబర్ నిరోధిస్తుంది. దీనివల్ల త్వరగా ఆకలి వేయదు. కనుక ప్రతిరోజూ  తినే భోజనంలో సగం భాగం కూరగాయలు లేదా సలాడ్లు ఉండేలా చూసుకోవడం మంచిది. తినేటప్పుడు ఈ జాగ్రత్త తప్పనిసరి.. ఆహారం తినేటప్పుడు టీవీ, మొబైల్ ఫోన్లు చూడటం వంటి పనులు మానుకోవాలి. ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమలి తినడం చాలా ముఖ్యం. ఆహారాన్ని బాగా నమిలి తిన్నప్పుడు జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది , కడుపు నిండిందనే సంకేతం మెదడుకు త్వరగా అందుతుంది. తొందరపడి తింటే తెలియకుండానే ఎక్కువ ఆహారాన్ని తినేసే అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్స్.. ప్యాక్ చేసిన ఆహారాలు, బేకరీ తిళ్లు, వేపుళ్లు, , ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వీటిలో కేలరీలు, ఉప్పు , ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి బరువు పెరగడానికి ప్రధాన కారణమవుతాయి. అలాగే పంచదార , తీపి పదార్థాలను పూర్తిగా తగ్గించడం వల్ల శరీరంలో కొవ్వు చేరకుండా చూసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు చక్కెర కలిపిన స్వీట్లకు బదులుగా ఖర్జూరాలు లేదా తాజా పండ్లను ఎంచుకోవచ్చు. వ్యాయామం ముఖ్యమే.. ఆహార నియమాలతో పాటు రోజుకి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే శరీరంలో ఆకలిని పెంచే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. దీనివల్ల అనవసరమైన ఆకలి పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది. మానసిక ఒత్తిడి కూడా బరువు పెరగడానికి ఒక కారణం, కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటివి సాధన చేయాలి. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం.. బరువు తగ్గడం అనేది ఒక రాత్రిలో జరిగే అద్భుతం కాదు. దీనికి సహనం, నిలకడ చాలా అవసరం. కఠినమైన డైటింగ్స్ చేసి అనారోగ్యం పాలవడం కంటే, ఇటువంటి చిన్న చిన్న మార్పులను జీవనశైలిలో భాగం చేసుకుంటే సులభంగా , శాశ్వతంగా బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చు.                        *రూపశ్రీ.