తమిళనాడు రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి  విజయ్ కరూర్ జిల్లాలో పర్యటించకుండా నిరోధించాలని కోరుతూ ప్రతిపక్ష  డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు   నిరాకరించింది. ఒక రాష్ట్ర   ముఖ్యమంత్రి పర్యటనలను తాము ఏ విధంగా నియంత్రించగలమని న్యాయస్థానం  ప్రశ్నించింది. గతంలో   తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కరూర్ ప్రాంతంలో తీవ్రమైన తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలనూ, అలాగే గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఈ నెల  10న కరూర్ సందర్శనకు  సీఎం విజయ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే..  సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. డీఎంకే తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. బాధితులను కలిసి ప్రభుత్వ పరంగా ఉద్యోగ నియామక పత్రాలు, ఇతర ఆర్థిక సాయం అందించేందుకు సీఎం వెళ్తున్నారని, దీనివల్ల సీబీఐ దర్యాప్తు పారదర్శకత దెబ్బతింటుందని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ..  బాధిత కుటుంబాలను పరామర్శించడం సాక్షులను ప్రభావితం చేయడం ఎలా అవుతుందని ప్రశ్నించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోకపోతే కొట్టివేస్తామని స్పష్టం చేయడంతో..  డీఎంకే న్యాయవాది పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో కోర్టు ఆ వ్యాజ్యాన్ని ముగించింది. దీంతో  ఈ నెల   10న సీఎం విజయ్  కరూర్ పర్యటనకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.   DMK Petition Dismissed, Tamil Nadu CM Joseph Vijay, Karur Stampede Case, Tamil Nadu Politics, TeluguOne
కల్వకుంట్ల కవిత కొత్త  రాజకీయ పార్టీ పేరు   ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి చేరింది. తన నూతన పార్టీకి  తెలంగాణ రక్షణ సమితి  (టీఆర్ఎస్)  పేరు  ఖరారు చేయాలని కోరుతూ ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత..  ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం  టీఆర్ఎస్  పేరు ఖరారు విషయంలో  పంపిన లేఖను సవాల్ చేస్తూ ఆమె   న్యాయపోరాటానికి దిగారు.  పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా తమ పార్టీ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జూన్ 23న కేంద్ర ఎన్నికల సంఘం తనకు ఒక అధికారిక లేఖను పంపిందని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో, పార్టీ పేరు ఆమోదం పొందేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ‘టీఆర్ఎస్’ అనే సంక్షిప్త నామం చుట్టూ ఈ వివాదం తిరుగుతోంది. గతంలో కవిత తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్)గా మార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఉద్యమం గుర్తుకు వచ్చేలా.. తన పార్టీకి  తెలంగాణ రక్షణ సమితి  అని పేరు పెట్టుకున్నారు. అయితే ఈ పేరుపై, ముఖ్యంగా  టీఆర్ఎస్  అనే సంక్షిప్త అక్షరాల వాడకంపై అభ్యంతరం తెలుపుతూ ఈసీకి పలు పిటిషన్లు వచ్చాయి.    ప్రస్తుతం చలామణిలో ఉన్న..  లేదా ప్రజల్లో గుర్తింపు పొందిన ఇతర పార్టీల పేర్లను పోలి ఉండేలా కొత్త పేర్లు ఉంటే ఓటర్లలో గందరగోళం నెలకొనే అవకాశం ఉంటుంది. కనుక కవిత ప్రతిపాదించిన పేరు పాత టీఆర్ఎస్ పార్టీని పోలి ఉండటంతో, దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ ఈసీ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన కవిత  చట్టప్రకారం తాము పెట్టుకున్న పేరు చెల్లుబాటు అవుతుందని వాదిస్తున్నారు.  ఈ పేరు మార్పు లేదా అభ్యంతరాలపై ఎన్నికల సంఘం అడిగిన వివరాలకు కవిత ఇప్పటికే బదులిచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు,  తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.  ఈ పిటిషన్‌పై రానున్న రోజుల్లో ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయస్థానం ఈ విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుంది, కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తుంది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.   Telangana Rakshana Sena, TRS Party Name Row, Delhi High Court, Election Commission of India
తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీకి ఇటీవల జరిగిన  ఎన్నికలలో   దళపతి విజయ్ సృష్టించిన సంచలన విజయం తెలిసిందే.  రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే విజయం సాధించి   ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి  విజయ్ చరిత్ర సృష్టించారు.  కమల్ హాసన్ వంటి మహామహులకే సాధ్యం కాని ఈ ఫీట్ ను విజయ్ సాకారం చేయడంతో..  ఇప్పుడు కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి  అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే   స్టార్ హీరో ధనుష్ కూడా   రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.  తాజాగా ధనుష్ అభిమాన సంఘం నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో  పార్టీ  జెండాను ఆవిష్కరించడం ఆయన పొలిటికల్ ఎంట్రీకి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కేవలం జెండా రూపకల్పనకే పరిమితం కాకుండా..  తమిళనాడు వ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అభిమాన సంఘాల నేతలకు ధనుష్ పిలుపునివ్వడం కూడా  ఆయన పోలిటికల్ ఎంట్రీని కన్ ఫర్మ్ చేస్తోందంటున్నారు.   Hero, Dhanush, Fans, Flag, Public, Service, Teluguone
ALSO ON TELUGUONE N E W S
  ఇళయదళపతి విజయ్(Vijay) వన్ మాన్ షో 'జన నాయగన్' (Jana Nayagan) చుట్టూ జరుగుతున్న హైప్, వివాదాలు రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులు మాత్రం జన నాయగన్ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో అడుగుపెడుతుందా అనే అతృతతో ఎదురుచూస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా జన నాయగన్  సెన్సార్ రిపోర్ట్ మరియు విడుదల తేదీపై అనేక రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శనివారం రోజున 'జన నాయగన్' చిత్రానికి సెన్సార్ బోర్డు 'A' (అడల్ట్) సర్టిఫికేట్ ఇచ్చిందంటూ ఒక సెన్సార్ సర్టిఫికేట్ నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. సుమారు 3 గంటల రన్‌టైమ్‌తో కూడిన ఈ నకిలీ పత్రంలో డైలాగ్స్ మ్యూట్ చేయడం, హింసను తగ్గించడం వంటి మార్పులను కూడా ప్రస్తావించారు. అయితే, ఈ సెన్సార్ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని గంటల్లోనే అసలు నిజం బయటపడింది. కొందరు నెటిజన్లు ఆ సర్టిఫికేట్‌ను నిశితంగా పరిశీలించగా, అది గతంలో విజయ్ నటించిన 'లియో' (Leo) సినిమా ఒరిజినల్ సెన్సార్ సర్టిఫికేట్‌ని  ఎడిట్ చేసి సృష్టించిన నకిలీ (ఫేక్) పత్రమని తేలింది. ఈ తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) మరియు బిజినెస్ హెడ్ సుప్రీత్ మోహన్ తక్షణమే స్పందించారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సదరు సెన్సార్ సర్టిఫికేట్ పూర్తిగా నకిలీది.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇటీవల తాజా సమీక్షని పూర్తి చేసింది. అందులో భాగంగా కొన్ని తుది సవరణల (Final Revisions) జాబితాని  పంపింది. ఆ సవరణలన్నీ పూర్తి చేసి బోర్డుకు సమర్పించిన తర్వాతే అధికారికంగా సెన్సార్ సర్టిఫికేట్ జారీ అవుతుంది. బోర్డు సూచించిన తుది మార్పులను వేగంగా పూర్తి చేస్తున్నాం. అన్ని అనుకూలిస్తే జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. Also read: Anirudh vs sai abhayankar: అనిరుధ్ వర్సెస్ సాయి అభయంకర్.. బాగుపడేది మాత్రం వాళ్ళే  vijay, kvn productions, h vinoth
మలయాళ చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన కథలతో, విలక్షణమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన సరికొత్త చిత్రం 'ఐ, నోబడీ' (I, Nobody) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ తెలుగు రిలీజ్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటూ, సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చింది. 1 నిమిషం 13 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్, ప్రేక్షకుడికి ఒక సరికొత్త మైండ్ గేమ్, పవర్‌ఫుల్ సోషల్ డ్రామాను పరిచయం చేయబోతున్నట్లు స్పష్టం చేస్తోంది. ఈ టీజర్‌లో వినిపించే డైలాగ్స్ ఆలోచనాత్మకంగా, నేటి సమాజపు చేదు నిజాలను కళ్లకు కట్టేలా ఉన్నాయి. "రాజీవ్.. స్కూల్లో ఫుడ్ చైన్ గురించి చదివావు కదా, ఆహారపు గొలుసు.. బహుశా మర్చిపోయి ఉంటావు. నేను చాలా సింపుల్ గా చెప్తాను విను. మిడత గడ్డిని తింటుంది, మిడతని కప్ప తింటుంది, కప్పని పాము తింటుంది, పాముని డేగ తింటుంది. ఈ డేగ చచ్చిన తర్వాత మొదట చెప్పిన గడ్డికి ఇది ఎరువవుతుంది. మన సొసైటీ కూడా సరిగ్గా ఇలాంటి ఒక ఫుడ్ చైన్ లాంటిదే రాజీవ్" అంటూ సాగే వాయిస్ ఓవర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కలిసి ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సమాజంలో బలవంతుడు బలహీనుడిని ఎలా అణచివేస్తాడో, చివరకు ప్రకృతి న్యాయం ఎలా జరుగుతుందో వివరించే ఈ సంభాషణలు సినిమా థీమ్‌ను ఎలివేట్ చేస్తున్నాయి. అయితే, ఈ కథ అక్కడితోనే ఆగిపోలేదు. ఈ ఫుడ్ చైన్ సిద్ధాంతానికి ఒక షాకింగ్ ట్విస్ట్ ఇస్తూ టీజర్‌లో ముందుకు సాగుతారు. "కానీ ఈ సొసైటీ చైన్ లో ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి, అంటే బ్రతికి బట్టకట్టడానికి ఆ మిడత కేవలం గడ్డిని మాత్రం తింటే సరిపోదు, అవసరమైతే కప్పను కూడా తినాలి. ఇక సమాజంలో పైకి రావడానికి నువ్వు ఎవరి తలలు తినాలో నువ్వే నిర్ణయించుకో రాజీవ్..." అంటూ వచ్చే పవర్‌ఫుల్ డైలాగ్ సినిమా ఎంత ఇంటెన్స్ గా ఉండబోతుందో ముందే హింట్ ఇస్తోంది. బ్రతకడం కోసం ఎంతటి క్రూరమైన నిర్ణయాలైనా తీసుకోవాల్సి వస్తుందనే కోణంలో సాగే ఈ కథాంశం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నిండి ఉందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు నటి పార్వతి తిరువోతు (Parvathy Thiruvothu) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ అనగానే సహజంగానే సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. నిసామ్ బషీర్ (Nisam Basheer) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, జేక్స్ బిజోయ్ (Jakes Bejoy) అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విజువల్స్ చూస్తుంటే థియేటర్లలో ప్రేక్షకులకు ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ గ్యారెంటీ అనిపిస్తోంది. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, E4 ఎక్సపెరిమెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 9న విడుదల కానుంది.     I Nobody Teaser, Prithviraj Sukumaran, Parvathy Thiruvothu, TeluguOne  
Vishal's ambitious project Magudam, which marks his return to the director's chair alongside playing the lead role, has reportedly been put on hold despite completing its shoot. The film was initially expected to begin promotions soon and target a July release, but the plans are now said to have changed. According to industry buzz, the delay is linked to the unfortunate demise of veteran producer R. B. Choudary. Sources suggest that discussions related to succession and the future functioning of the production banner are currently underway among his sons, resulting in major decisions, including Magudam's release strategy, being temporarily deferred. While there has been no official announcement from the makers regarding a new release date, the film is believed to be awaiting clarity before promotional activities begin. With the shoot already wrapped up, the project is essentially ready for release once the internal discussions are concluded. Magudam is one of Vishal's most anticipated films as he has taken on both acting and directing responsibilities. Fans were expecting the promotional campaign to kick off this month, but the unexpected developments behind the scenes appear to have pushed the film's release plans further down the calendar. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'OG'లో తన పవర్‌ఫుల్ యాక్టింగ్, గంభీరమైన వాయిస్‌తో తెలుగు ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు కోలీవుడ్ విలక్షణ నటుడు అర్జున్ దాస్. ఆయన హీరోగా, 'కల్కి 2898 AD' ఫేమ్ అన్నా బెన్ హీరోయిన్‌గా నటించిన సరికొత్త చిత్రం ‘కాన్ సిటీ’ (Con City). హరీష్ దురైరాజ్ దర్శకత్వంలో ఫ్యామిలీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల జూన్ 26న థియేటర్లలో విడుదలైంది.  డిఫరెంట్ కంటెంట్, అదిరిపోయే ట్విస్టులతో కూడిన తమిళ, మలయాళ చిత్రాలకు ఈ మధ్య కాలంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఎలాంటి ఆదరణ దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే బాటలో థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, ప్రముఖ సినిమా రేటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఎమ్‌డీబీ (IMDb)లో ఏకంగా 9 రేటింగ్ సొంతం చేసుకుని ‘కాన్ సిటీ’ చిత్రం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ క్రేజీ మూవీ కథాంశం విషయానికి వస్తే.. ఇందులో హీరో, హీరోయిన్, వారితో పాటు ఒక దివ్యాంగుడైన కుమారుడు ఉంటారు. వీరితోపాటే హీరోయిన్ తల్లి, ఆమె సోదరుడు కూడా కలిసి ఒకే ఇంట్లో నివసిస్తుంటారు. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తమ గతాన్ని దాచిపెట్టి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటం కోసం  చిన్న చిన్న స్కామ్స్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఒకరోజు ఊహించని విధంగా విలన్‌కు హీరో చాలా పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చేతిలో రూపాయి లేని తీవ్రమైన నిరాశ, ఫ్రస్టేషన్‌లో తన ఇంట్లో ఉన్న ఒక పాత ప్రింటర్‌ను హీరో పగలగొట్టబోతుండగా, అనుకోకుండా అందులోని ఒక బటన్ ప్రెస్ అవుతుంది. ఆశ్చర్యకరంగా ఆ ప్రింటర్ నుండి ఒరిజినల్ రూ. 500 నోటు బయటపడుతుంది. అలా బటన్ నొక్కిన ప్రతిసారీ నోట్ల వరద కురుస్తూనే ఉంటుంది. అసలు ఆ ప్రింటర్ రహస్యం ఏంటి, ఆ తర్వాత ఈ ఫ్యామిలీ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది, కొడుకు కిడ్నాప్ వెనుక ఉన్న కథేంటి అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ క్రైమ్ కామెడీ సాగుతుంది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ‘కాన్ సిటీ’ మూవీని జూలై 24 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా తెలుగు ఆడియోతో కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.      Arjun Das, Con City, Netflix, OTT, TeluguOne  
 ఏ రంగంలో అయినా పోటీ అనేది ఉన్నపుడే అసలైన టాలెంట్ బయటపడుతుందనే నానుడి ఉంది. మరి ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఇద్దరు వ్యాఖ్యల మధ్యన పోటీ ఉంటే ప్రేక్షకులంతా అదృష్టవంతులు మరొకరు ఉండరు. అందులోనూ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య ఉంటే మాత్రం సంగీత ప్రియులు ఎంతో పెట్టి పుట్టిన వాళ్లే అని చెప్పవచ్చు.  సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక సరికొత్త మ్యూజిక్ వార్ నడుస్తోంది. సినిమాలకు కథ, కథనంతో పాటు సంగీతం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లు, హీరోలు అంతా కూడా క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ల వెంట పడుతున్నారు. ఈ క్రమంలోనే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ కంపోజర్లుగా మారిపోయారు అనిరుధ్ రవిచందర్, నయా సెన్సేషన్ సాయి అభయంకర్. కేవలం వీరి పాటల హవా మాత్రమే కాదు, వీరిద్దరూ అందుకుంటున్న పారితోషికాలు కూడా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలని  తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సౌత్ ఇండియా మొత్తం మీద ప్రస్తుతం అత్యధిక ప్యాకేజ్ తీసుకుంటున్న నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే అందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు అనిరుధ్ రవిచందర్. ఒకప్పుడు సాధారణ పారితోషికంతో ప్రారంభమైన ఆయన ప్రయాణం.. ఇప్పుడు ఆకాశాన్నంటుతోంది. గత ఏడాది వరకు అనిరుధ్ ఒక సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ దాదాపు 12 కోట్ల రూపాయలుగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆయన క్రేజ్, సక్సెస్ రేట్ చూసి స్టార్ ప్రొడ్యూసర్లు లైన్ కడుతుండడంతో తన రేట్‌ను ఏకంగా డబుల్ చేసేశాడు.ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్టుకి ఏకంగా 25 కోట్ల రూపాయల భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. కేవలం ఒకే ఏడాదిలోనే రెమ్యునరేషన్ రెట్టింపు అవ్వడం గమనార్హం. ప్రస్తుతం అనిరుధ్ చేతిలో దాదాపు 10 భారీ సినిమాలు ఉన్నాయి.  అనిరుధ్ రేంజ్ ఇలా ఉంటే, అస్సలు తగ్గనంటూ దూసుకొస్తున్నాడు జెన్ జీ నయా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభయంకర్. కేవలం ప్రైవేట్ ఆల్బమ్స్ ఇండిపెండెంట్ సాంగ్స్ ద్వారా సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన సాయి అభ్యంకర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూనే అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చాడు. తన తొలి సినిమా  'బాల్తీ' చిత్రానికి ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకొని సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత కూడా వరుసగా 'డ్యూడ్', 'కరుప్పు' వంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లని  తన ఖాతాలో వేసుకున్నాడు. మొన్నటి వరకు ఒక సినిమాకు మూడు కోట్ల రూపాయలు వసూలు చేసిన సాయి అభయంకర్, ఈ తాజా హిట్స్ తర్వాత తన మార్కెట్ రేటును అమాంతం పెంచేశాడు. ప్రస్తుతం ఆయన కొత్త సినిమాలకు ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. Also read: దేవుళ్ళకి యమా గిరాకి.. ఇది యాపారం  ప్రస్తుతం సాయి అభయంకర్ చేతిలో ఐదు క్రేజీ సినిమాలు ఉన్నాయి. సినిమా రంగంలో ఉన్న ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ప్రస్తుతం చేతిలో ఉన్న ఈ ఐదు చిత్రాలలో ఏ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే, సాయి అభయంకర్ నేరుగా అనిరుధ్ రవిచందర్ రెమ్యూనరేషన్‌ను కూడా బీట్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు 25 కోట్లతో అనిరుధ్, మరోవైపు 8 కోట్లతో సాయి అభయంకర్ పోటాపోటీగా ఆఫర్లు కొల్లగొడుతూ సౌత్ సినిమా ఇండస్ట్రీపై తమ మ్యూజికల్ హవాని  స్పష్టంగా చూపిస్తున్నారు.    
Sai Abhyankkar has quietly built one of the strongest brands in the Tamil indie music space. While his songs have become chartbusters on streaming platforms, another interesting pattern has emerged over the last few releases—every new single features a popular young actress, adding to the song's reach and recall. While his fans are naming his "iSai" and fighting fan wars with Anirudh Ravichander fans, he seems to be inviting most popular leading ladies to feature in his indie songs. After his breakthrough hit Katchi Sera, which featured Samyuktha Viswanathan, Sai teamed up with Preity Mukundhan for Aasa Kooda. He later shared screen space with Meenakshi Chaudhary in Sithira Puthiri, while Vizhi Veekura featured Saanve Megghana. His latest release, Pavazha Malli, brought Shruthi Haasan on board as the singer, with Kayadu Lohar appearing in the music video. Now, industry buzz suggests Sai's next indie single will feature Popular Star Mamitha Baiju in the lead. If the reports turn out to be true, it would continue the composer's trend of collaborating with actresses who already enjoy a strong youth following across South India. The strategy seems to be working in Sai Abhyankkar's favour. His songs are no longer driven only by catchy music but also by visually appealing music videos featuring rising stars, making every release a social media event. The combination has helped his independent tracks attract millions of views while expanding their appeal beyond Tamil audiences. With Mamitha Baiju reportedly joining the next project, expectations are naturally high. It remains to be seen whether Sai Abhyankkar can deliver yet another viral chartbuster and continue his successful streak in the indie music scene. He has been announced to composing music for the film she is headlining in Pradeep Ranganathan's production. His songs for her and Pradeep's film, Dude, have been trending still all over.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కేవలం వెండితెరపైనే కాదు, నిజజీవితంలోనూ తానేంటో నిరూపించుకుంటూ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఒక గొప్ప సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎటువంటి ఆటంకాలు కలగకూడదనే సత్సంకల్పంతో ఆయన ఒక భారీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్షాదళ్ మహేందర్ నేతృత్వంలో సాగిన ఈ విశిష్టమైన సేవా ఉత్సవంలో నిఖిల్ ముఖ్య అతిథిగా పాల్గొని తన పెద్ద మనసును చాటుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా భీమవరం పరిసర ప్రాంతాలలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఏకంగా 1,000 మందికి పైగా విద్యార్థులకు హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేతుల మీదుగా ఉచిత స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. నూతన విద్యా సంవత్సరానికి అవసరమైన పుస్తకాలు, బ్యాగులు, ఇతర స్టేషనరీ వస్తువులతో కూడిన ఈ కిట్లను అందుకున్న సమయంలో ఆ చిన్నారి విద్యార్థుల ముఖాల్లో కనిపించిన ఆనందం అక్కడికి వచ్చిన వారందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.  ఈ సందర్భంగా నిఖిల్ కేవలం కిట్లను పంపిణీ చేసి వెళ్ళిపోకుండా, అక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థితో ఎంతో ఓపికగా, ఆత్మీయంగా మాట్లాడటం విశేషం. పిల్లల చదువుల గురించి, వారి ఇష్టాల గురించి అడిగి తెలుసుకుంటూ వారితో సరదాగా సమయాన్ని గడిపారు. చదువు యొక్క ప్రాముఖ్యతను వారికి వివరిస్తూ, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలని పిల్లల్లో ఎనలేని ప్రేరణ నింపారు. విద్యార్థులలో దాగి ఉన్న విభిన్నమైన ప్రతిభను, నైపుణ్యాలను చిన్నతనం నుంచే గుర్తించి వాటిని పదును పెట్టుకోవాలని నిఖిల్ వారికి సూచించారు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుందని, దానికి కష్టపడే తత్వాన్ని జోడిస్తే అనుకున్న లక్ష్యాలను సులువుగా సాధించవచ్చని ఆయన అన్నారు. తాను ఎల్లప్పుడూ సమాజ సేవకు కట్టుబడి ఉంటానని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో వినూత్నమైన సేవా కార్యక్రమాలను చేపడతానని నిఖిల్ తెలిపారు. సమాజంలో ఒక సానుకూల మార్పును తీసుకురావడానికి, ఎంతో మందికి స్ఫూర్తినిచ్చేలా మరిన్ని ప్రజాహిత పనులను మున్ముందు నిర్వర్తిస్తానని ఆయన ప్రకటించారు. నిఖిల్ చేసిన ఈ 1,000 మంది విద్యార్థుల మెగా సాయం, ఆయన చూపించిన సామాజిక బాధ్యత పట్ల ఇటు భీమవరం ప్రజలతో పాటు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.     Nikhil Siddhartha, School Kits, 1000 Students, Bhimavaram, TeluguOne  
  తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఒక అద్భుతమైన స్వర్ణయుగాన్ని అనుభవిస్తోంది. టాలీవుడ్ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాలు కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ విశ్లేషణ ప్రకారం, తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన ఘనత మన అగ్ర దర్శకులు మరియు స్టార్ హీరోల విజన్ కే దక్కుతుంది. ఈ క్రమంలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన వైజ్ఞానిక మరియు పౌరాణిక అద్భుతం 'కల్కి 2898 AD' భారతీయ సినిమా రికార్డులను తిరగరాసింది. వారణాసి పుణ్యక్షేత్రం నేపథ్యంలో మొదలై, మహాభారత కాలం నాటి పురాణాలను భవిష్యత్తు సాంకేతికతతో ముడిపెడుతూ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త మైలురాయిని నిర్మించింది. గాడ్ ఆఫ్ వార్ (యుద్ధ దేవుడు) తరహాలో సాగే యాక్షన్ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ ట్విస్టులు ప్రభాస్ అభిమానులకే కాకుండా సగటు సినిమా ప్రేమికుడికి కూడా కంటిమీద కునుకు లేకుండా చేశాయి. మరోవైపు టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న 'వారణాసి'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం మహేష్ బాబు విభిన్నమైన మేక్ ఓవర్ లో కనిపించనున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఈ భారీ ప్రాజెక్ట్ బడ్జెట్ దాదాపు 800 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. రాజమౌళి గత చిత్రం 'RRR' సాధించిన అంతర్జాతీయ గుర్తింపు నేపథ్యంలో, ఈ సినిమా హాలీవుడ్ నిర్మాణ విలువలకి ఏమాత్రం తీసిపోకుండా ఉండబోతోందని జర్నలిస్ట్ భరద్వాజ్ స్పష్టం చేశారు. హాలీవుడ్ స్టూడియోల భాగస్వామ్యంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్ భారతీయ సినిమా మార్కెట్ ను మరో 50 శాతం మేర విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, త్రివిక్రమ్  కాంబినేషన్ లో శివ స్తుతుడు సుబ్రమణ్య స్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కితున్న సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్స్ పై కూడా భారీ చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఇమేజ్ కు పురాణాల నేపథ్యాన్ని జోడించి ఒక మైండ్ బ్లోయింగ్ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.  'హనుమాన్' సినిమాతో కేవలం 30 కోట్ల బడ్జెట్ తో 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అద్భుతం సృష్టించిన ప్రశాంత్ వర్మ, ఇప్పుడు తన 'పివిసియు' (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) పరిధిని పెంచుతున్నారు. ఈ పాన్ ఇండియా డివోషనల్ సంచలనాలు తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి.  
తెలుగు చిత్రసీమలో ఒక విలక్షణమైన కథతో సంచలనం సృష్టించిన 'బలగం' సినిమా గుర్తుంది కదా? ఆ అద్భుత విజయం తర్వాత దర్శకుడు వేణు యెల్దండి తన తదుపరి ప్రాజెక్ట్‌ను అగ్ర నిర్మాత దిల్‌ రాజు బ్యానర్‌లోనే పట్టాలెక్కించారు. అదే 'ఎల్లమ్మ'. దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంది. ముఖ్యంగా ఈ చిత్రంలో లీడ్ రోల్ ఎవరు చేస్తారనే విషయంపై టాలీవుడ్‌లో గత ఆరు నెలలుగా పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. మొదట్లో ఈ ప్రాజెక్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తాడని అందరూ భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత యంగ్ హీరో నితిన్‌తో షూటింగ్ ప్రారంభం ఖాయమని ప్రచారం జరిగినా, చివరకు ఆ కాంబినేషన్ కూడా సెట్ కాలేదు. ఎట్టకేలకు ఈ భారీ సస్పెన్స్‌కు తెర దించుతూ 'ఎల్లమ్మ' సినిమాతో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌ను హీరోగా పరిచయం చేస్తున్నట్లు దిల్‌ రాజు అండ్ టీమ్ అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ నటుడిగా, అది కూడా లీడ్ రోల్‌లో కనిపించబోతుండటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే హీరో సస్పెన్స్ వీడినా, ఇప్పుడు అంతకు మించిన కొత్త సస్పెన్స్ టాలీవుడ్‌లో మొదలైంది. అదే 'ఎల్లమ్మ' చిత్రంలో దేవి శ్రీ ప్రసాద్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరు? దేవి శ్రీ వంటి సీనియర్‌ టెక్నీషియన్‌కు జోడీగా నటించాలంటే కాస్త మెచ్యూరిటీ, మినిమం ఏజ్ ఉన్న భామ కావాలనేది చిత్ర యూనిట్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ రేసులో నెటిజన్లు, సినీ ప్రియులు ఎక్కువగా సౌత్ స్టార్ బ్యూటీ సాయి పల్లవి పేరును బలంగా వినిపించారు. గతంలో దిల్‌ రాజు బ్యానర్‌లో 'ఫిదా', 'MCA' వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన సాయి పల్లవి అయితే ఈ వైవిధ్యమైన పాత్రకు వంద శాతం న్యాయం చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ తాజా ఫిలిం నగర్ సమాచారం ప్రకారం సాయి పల్లవి వైపు మేకర్స్ అసలు ప్రయత్నాలే చేయలేదని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం సాయి పల్లవి డిమాండ్ చేస్తున్న పారితోషికం చాలా ఎక్కువ. ఆమెను తీసుకుంటే బడ్జెట్ పరిమితులు దాటిపోతాయని నిర్మాత దిల్‌ రాజు భావిస్తున్నారట. అందుకే సాయి పల్లవిని పక్కన పెట్టి, కేవలం కోటి రూపాయల లోపు పారితోషికం తీసుకునే హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు. ఈ బడ్జెట్ లెక్కల ప్రకారం చూస్తే కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిగాయని, దాదాపు ఆమెనే ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ టాక్. రుక్మిణితో పాటు సమంత, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చినా, కోటి రూపాయల లోపు బడ్జెట్ సమీకరణాలు రుక్మిణి వసంత్‌కే ఎక్కువగా అనుకూలిస్తున్నాయి. దర్శకుడు వేణు యెల్దండి ఇప్పటికే నటీనటుల ఎంపికను పూర్తి చేశారని, హీరోయిన్ విష‌యంలో కావాలనే సస్పెన్స్ మెయింటెన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. హీరో విషయంలో ఆరు నెలలు ఊరించిన మేకర్స్, ఇప్పుడు హీరోయిన్ విషయంలోనూ అదే తంతు కొనసాగిస్తుండటంతో "బాబోయ్ ఎల్లమ్మ.. ఇంత సస్పెన్స్ అవసరమా?" అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి దిల్‌ రాజు, వేణు కలిసి ఈ క్రేజీ ప్రాజెక్ట్ హీరోయిన్‌ను ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి!     Yellamma, DeviSri Prasad, Dil Raju, Venu Yeldandi, Sai Pallavi, Rukmini Vasanth 
Nikhil Siddhartha participated in a school kit distribution drive in Bhimavaram, where educational kits were handed over to 1,000 students studying in government schools. The initiative, organized in association with the Rakshadal organization, received a positive response from students, parents, and the local community. The event was conducted under the guidance of Rakshadal's Mahender, with the aim of supporting children from government schools as they prepare for the new academic year. Each kit included essential study materials such as textbooks, notebooks, and stationery required for daily classroom learning. Interacting with the students, Nikhil stressed the importance of education and encouraged them to make the most of the opportunities available to them. He said education has the power to transform lives and urged the children to work hard, pursue their goals, and always respect their parents and teachers. The actor also appreciated Rakshadal for consistently taking up social service initiatives and contributing to the welfare of the community. According to the organizers, the group plans to continue conducting similar educational and welfare programs in the future to support students and families in need. Nikhil has been associated with several community initiatives over the years, and this latest drive adds to his efforts to promote education and encourage students through direct interaction. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే అవసరానికి మించి మొబైల్ వాడటం క్రమంగా వ్యసనంగా మారి మన ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వీడియోలో Dr. వేణుగోపాల్ మొబైల్ వ్యసనం వల్ల మెదడులో జరిగే మార్పులు, ఏకాగ్రత తగ్గిపోవడం, జ్ఞాపకశక్తిపై పడే ప్రభావం, నిద్ర సమస్యలు, ఆందోళన, ఒత్తిడి వంటి అంశాలను చాలా సులభంగా వివరించారు.  అలాగే మొబైల్‌కు బానిస కాకుండా ఉండేందుకు పాటించాల్సిన అలవాట్లు, స్క్రీన్ టైమ్‌ను ఎలా తగ్గించుకోవాలి, పిల్లలు మరియు యువతలో మొబైల్ వినియోగాన్ని ఎలా నియంత్రించాలి అనే విషయాలపై కూడా విలువైన సూచనలు అందించారు.  మొబైల్‌ను పూర్తిగా వదిలేయడం అవసరం లేదు. కానీ దానిని సరైన విధంగా ఉపయోగించడం ద్వారా మన మెదడు ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను మరియు జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు. మొబైల్ వ్యసనం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి.  
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది. ఇది వందలాది, వేలాది సంవత్సరాలుగా సాగుతున్న సంప్రదాయం.  అయితే భారతదేశంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. భారతీయులు విదేశాలలో పుట్టిన సంప్రదాయాలను పాటిస్తూ వెర్రిగా మారిపోతున్నారు. డేటింగ్ లు, సహజీవనాలు, రకరకాల కొత్త కల్చర్లు పాటిస్తూ భారతీయ సంస్కృతికి దూరం అవుతున్నారు. ఇప్పుడు డింక్ పేరిట ఏకంగా ఒక తరాన్ని పుట్టకుండా ఆపేస్తున్నారు.  అసలు డింక్ అంటే ఏమిటి?  దీని పట్ల భారతీయ జంటలు ఎందుకు అంత ఆకర్షితులు అవుతున్నారు? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. దశాబ్దాలుగా కుటుంబ వంశాన్ని కొనసాగించే మార్గంగా వివాహాన్ని చూసేవారు. కానీ కొత్త తరం దీనికి వ్యతిరేకంగా ఉంది, వంశాన్ని ముందుకు తీసుకెళ్లడం అనే విషయం కంటే.. ప్రపంచం పట్ల ఆసక్తి పెరిగింది,  సంబంధాల తీరు కూడా మారుతోంది. ఇప్పుడు ఒక బిడ్డను కనాలన్నా,  వంశాన్ని ముందుకు నడపాలన్నా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.దీన్నే డింక్ అంటున్నారు. విదేశాలలో పుట్టిన ఈ సంస్కృతి పట్ల భారతీయులు కూడా  నెమ్మదిగా అలవాటు పడుతున్నారు. డింక్ అంటే.. DINK అంటే ' డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ', పేరులోనే దీని  అర్థం ఉంది. దీని అర్థం పెళ్లి తర్వాత పిల్లలను కనాలని అనుకోకపోవడం. డింక్ జంటలు ఎందుకు పెరుగుతున్నాయ్.. కొన్నేళ్ల క్రితం వరకు ఇంకా పిల్లలు ఎందుకు పుట్టలేదు అనేదే చాలా పెద్ద ప్రశ్నగా ఉండేది పెళ్లైన జంటల్లో.. కానీ ఇప్పుడు పిల్లలు వద్దు అనే నిర్ణయం వస్తోంది. ముఖ్యంగా బారతదేశంలోని పట్టణాలలో ఉన్న జంటలలో చాలా మార్పు వస్తోంది. చదువుకున్న, ఇద్దరూ సంపాదించే భార్యాభర్తలు అసలు మనకు పిల్లలు అవసరమేనా అనే ప్రశ్న వేసుకుంటున్నారు. ముఖ్యంగా 20, 30 ఏళ్ల వయసులో  పెళ్లిచేసుకున్న జంటలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆర్థిక భారం.. చాలామంది ఎదుర్కునే స్పష్టమన కారణం ఆర్థిక విషయాలే..   ఇరవై, ముప్పై సంవత్సరాల కిందట పిల్లలను పెంచినట్టు నేటికాలంలో మెట్రో సిటీలలో పిలలను పెంచడం కష్టమవుతోందని చాలామంది అంటున్నారు. పాఠశాల ఫీజులు,ఇల్లు కొనడం లేదా అద్దె, పిల్లల సంరక్షణ , ఆరోగ్య సంరక్షణ.. ఇవన్నీ పిల్లలు వద్దు అనుకోవడానికి కారణం అవుతున్నాయి. మెట్రో పట్టణాలలో ఇద్దరు వ్యక్తుల సంపాదన కూడా వీటికి సరిగా సరిపోవడం లేదని ఆవేదన చాలా మందిలో ఉంది. క్వాలిటీ లైఫ్.. పిల్లలు పుడితే లైఫ్ క్వాలిటీ పోతుందని చాలామంది జంటలు అబిప్రాయం.  పిల్లల బాధ్యతలలో తాము ఎన్నో సంతోషాలు, సరదాలు, ఇష్టాలు కోల్పోవడానికి, జీవితాన్ని సరదాగా గడపడానికి, ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడానికి సరిపడినంత సమయం దొరకడం లేదని అనుకుంటున్నారు.  పైగా పిల్లల కారణంగా జీవితంలో కాస్త విలాసంగా బ్రతికే అవకాశం ఉన్నా దాన్ని పిల్లల కోసం త్యాగం చేయాల్సి వస్తుంది. అందుకే పిల్లలు వద్దని అనుకుంటున్నారు. మరొక మార్గం.. చాలా మంది DINK జంటగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే అది  బాధ్యతల నుండి తప్పించుకోవడం కోసం లేదా వారి విలాసవంతమైన జీవితం కోసం అనుకుంటారు.  కానీ ఇది తప్పు.. చాలామంది పిల్లల పట్ల తీసుకోవాల్సిన బాధ్యతలను ఒకరికొకరు బాధ్యతగా చూసుకోవడంలో, అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, జంతు సంక్షేమం వంటి  తమకు ఇష్టమైన విషయాల ద్వారా బాధ్యతను తీసుకుంటున్నారు. ఇది తమ తరువాత వంశం లేకపోయినా,   కుటుంబాన్ని కాపాడుకోవడం ,  జీవన నాణ్యతను మెరుగ్గా ఉంచుకోవడం వంటి కారణాల వల్లే చేస్తున్నారు.                                    *రూపశ్రీ.
  నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా, ఒకరినొకరు సరైన విధంగా కమ్యూనికేట్ చేయడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలాముఖ్యం. నిజానికి చాలామంది రిలేషన్ లో ఉన్నప్పుడు  తమ మనసులో ఉన్న విషయాలను ఓపెన్ గా చెప్పడానికి ధైర్యం చేయరు. చాలా సందేహపడుతూ ఉంటారు. దీని వల్ల అపార్థాలు పెరిగి  రిలేషన్స్ లో దూరం ఏర్పడుతుంది. అందుకే రిలేషన్ లో ఉన్నప్పుడు ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం అంటుంటారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నమ్మకాన్ని పెంచుతుంది.. చక్కగా, ఎలాంటి విమర్శలు లేకుండా ఓపెన్ గా మాట్లాడుకోవడం ఏ  సంబంధానికైనా బలమైన పునాది ఏర్పరుస్తుంది. రిలేషన్ లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా మాట్లాడినప్పుడు, వారి మధ్య నమ్మకం దానంతట అదే పెరుగుతుంది. మంచి కమ్యూనికేషన్  వల్ల అవతలి వ్యక్తి మన మాటలను శ్రద్ధగా వింటున్నారని మనకు అనిపిస్తుంది. ఇది అపార్థాల అవకాశాన్ని తగ్గిస్తుంది , సంబంధాలు దీర్ఘకాలం పాటు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.  కమ్యూనికేషన్ బలహీనంగా ఉంటే.. అనుమానం,  అపార్థాలు, దూరం పెరుగుతాయి. అపార్థాలు తొలగిస్తుంది.. రిలేషన్స్ లోని సమస్యలు చాలా వరకు పెద్ద కారణం వల్ల కాకుండా, చిన్న చిన్న అపార్థాల వల్ల తలెత్తుతాయి. సరైన సంభాషణ ద్వారా ఈ అపార్థాలను సులభంగా పరిష్కరించవచ్చు. ప్రజలు తమ ఆలోచనలను, భావాలను బహిరంగంగా మాట్లాడుకున్నప్పుడు, వారికి ఉండే  సందేహాలు తొలగిపోతాయి. ఇది సంబంధాలలో స్పష్టతను తీసుకువచ్చి, అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎమోషనల్ బాండింగ్.. కమ్యూనికేషన్ చేయడం అంటే కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే కాదు..  అది భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక మార్గం కూడా.   మనసులోని మాటలను పంచుకున్నప్పుడు ఇద్దరి మధ్య మరింత గాఢమైన భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. ఇది ఒకరిలో ఒకరికి చెందిన ఫీలింగ్ ను పెంపొందించి, సంబంధాలను మరింత సన్నిహితంగా చేస్తుంది. ఈ అనుబంధమే ఏ సంబంధాన్నైనా ప్రత్యేకంగా నిలుపుతుంది. సమస్యల పరిష్కారం.. ప్రతి సంబంధంలో లేదా పరిస్థితిలో సమస్యలు సర్వసాధారణం, కానీ సరైన కమ్యూనికేషన్  ద్వారా వాటిని సులభంగా పరిష్కరించవచ్చు. ఇరు పక్షాలు తమ అభిప్రాయాలను ఓపెన్ గా వ్యక్తపరిచినప్పుడు, పరిష్కారాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ వల్ల  తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గుతుంది.  ఇద్దరు వ్యక్తులు ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్లడానికి మార్గం కల్పిస్తుంది.  అందుకే ఓపెన్ గా మాట్లాడుకోవడం  అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. మానసిక ఒత్తిడి.. మనసులో భావాలను, ఆందోళనలను ఇతరులతో పంచుకున్నప్పుడు మనసు తేలికపడుతుంది. ఏ విషయాన్ని అయినా మనసులోనే దాచుకోవడం ఒత్తిడిని పెంచుతుంది, కానీ మాట్లాడటం ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మంచి కమ్యూనికేషన్ ఒక వ్యక్తి మరింత ప్రశాంతంగా, సమతుల్యంగా , సంతోషంగా ఉండేలా చేస్తుంది.                                      *రూపశ్రీ.
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం,  ప్రోటీన్ కూడా ఉంటుంది.  భారతీయులు భోజనం చివర పెరుగుతో తింటే తప్ప వారికి తృప్తి ఉండదు. వేసవి కాలంలో పెరుగును ఇష్టంగా తింటారు. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు.  పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని,  జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడుతుందని అంటుంటారు.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. పెరుగు కడుపుకు మేలు చేసే ప్రోబయోటిక్ ఆహారంగా పరిగణించబడుతుంది, కానీ వర్షాకాలంలో పెరుగు తినడం పై  భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని కొందరు చెబుతారు, అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం వేరే విధంగా చెబుతున్నారు. వర్షాకాలంలో పెరుగు తినవచ్చా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వర్షాకాలంలో పెరుగును తినవచ్చు, కానీ దాని పరిమాణం , పెరుగు తినే  సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే, వర్షాకాలంలో జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల కొంతమందికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది,  పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది, శరీరాన్ని చల్లబరచడమే కాకుండా ఉత్తేజపరుస్తుంది.   రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. వర్షంలో పెరుగు తినడం వల్ల కలిగే నష్టాలు.. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు , ఫ్లూ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పెద్దలు జలుబు, జ్వరం ఉన్నప్పుడు పెరుగు తినకూడదని చెబుతారు. పెరుగు తినడం వల్ల   కఫం , శ్లేష్మంతో సమస్యలు రావచ్చు. కొంతమందికి కడుపు ఉబ్బరం కలగవచ్చు.  రాత్రిపూట తినడం జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. పెరుగు ఎలా తింటే శ్రేష్టం..  పగటిపూట మాత్రమే పెరుగు తినడం మంచిది.  రాత్రిపూట పెరుగు తినడం మానుకోవాలి.   కొద్దిగా వేయించిన జీలకర్ర లేదా నల్ల మిరియాల పొడి వేసుకుని  పెరుగు తీసుకుంటే మంచిది.  తాజాగా,  ఇంట్లో తయారుచేసిన పెరుగును మాత్రమే తినడం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం. పెరుగు ఎవరు తినకూడదు? జలుబుతో బాధపడుతున్న వాళ్లు,  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, ఆస్తమా లేదా అలర్జీ రోగులు, రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారు.. పెరుగు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.                                   *రూపశ్రీ.
శరీరంలో అధిక వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ లక్షణాలు సాధారణంగా కనిపించినప్పటికీ, ఆయుర్వేదం ప్రకారం ఇవి పిత్త దోషం (Pitta Dosha) పెరగడం వల్ల వచ్చే సంకేతాలు కావచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చి. మధుసూదన్ శర్మ వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిత్త దోషం ఎందుకు పెరుగుతుంది? దానికి కారణమయ్యే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వాతావరణ ప్రభావాలు ఏమిటి? అలాగే పిత్తాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన జీవనశైలి, ఆయుర్వేదంలో సూచించే సహజ చిట్కాలు వంటి అనేక ఉపయోగకరమైన విషయాలను సులభంగా వివరించారు. శరీరంలో వేడి ఎక్కువగా అనిపించడం, పాదాల్లో లేదా కళ్లలో మంట, తరచూ నోటి పూత రావడం, గ్యాస్, అసిడిటీ సమస్యలు వేధిస్తుంటే ఈ వీడియోలో చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: పిత్త దోషం అంటే ఏమిటి? శరీరంలో వేడి పెరగడానికి ప్రధాన కారణాలు పాదాలు, కళ్లలో మంట ఎందుకు వస్తుంది? నోటి పూత, గ్యాస్, అసిడిటీకి ఆయుర్వేద వివరణ పిత్తాన్ని తగ్గించే ఆహారాలు నివారించాల్సిన ఆహార పదార్థాలు రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచే ఆయుర్వేద సూచనలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పిత్త దోషాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆయుర్వేద అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కోసం తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని లేదా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు. అయితే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి ముదిరే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు డా. ఏవి రవి కుమార్ పురుషుల్లో ఎక్కువగా కనిపించే ఐదు ప్రధాన క్యాన్సర్ల గురించి సులభంగా వివరించారు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, వృషణాల క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్ వంటి వ్యాధుల లక్షణాలు, ప్రమాద కారకాలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి అనే అంశాలను తెలియజేశారు.  అలాగే చాలామందికి ఉండే సందేహమైన యూరాలజీ (Urology) మరియు ఆండ్రాలజీ (Andrology) మధ్య ఉన్న తేడాను కూడా స్పష్టంగా వివరించారు. మూత్ర సంబంధిత వ్యాధులు, పురుషుల లైంగిక ఆరోగ్యం, సంతానలేమి సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు వంటి సందర్భాల్లో ఏ నిపుణుడిని సంప్రదించాలో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు.  పురుషులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు ఎందుకు అవసరం? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియోలో డా. ఏవి రవి కుమార్ వివరించారు.  ప్రతి పురుషుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆరోగ్య సమాచారం కోసం ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.   మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)