ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి బెయిల్ లభించిన నేపథ్యంలో ఆయన తీహార్ జైల్ నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఆయన అరెస్టు అయ్యారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జూన్ 1 వరకు ఆయనకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో తీహార్ జైలు అధికారులు ఆయనను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. జైలు నుంచి కారులో బయటకి వెళ్తూ కేజ్రీవాల్ ప్రజలకు అభివాదం చేశారు. కేజ్రీవాల్ విడుదల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తీహార్ జైలు వద్దకు వచ్చారు. కేజ్రీవాల్ తన వాహనంలో ఇంటికి బయల్దేరారు. కేజ్రీవాల్ వాహనంలో ఆయన భార్య, కుమార్తె, ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ వున్నారు.  హనుమాన్ దయ వల్లే తాను బయటకి వచ్చానని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు తాను హనుమాన్ ఆలయాన్ని సందర్శించనున్నానని ఆయన ప్రకటించారు. 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు మాచర్లలో పర్యటించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి, పల్నాటి పౌరుషాన్ని చూపించడానికి సిద్ధంగా వున్న మాచర్ల నియోజకవర్గ ప్రజలను పలకరించడానికి చంద్రబాబు వెళ్ళాలని అనుకున్నారు. అయితే అనుకోకుండా భారీ వర్షం కురవడం వల్ల చంద్రబాబు మాచర్ల పర్యటన రద్దు చేసుకోవలసి వచ్చింది. అనంతరం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో ఒంగోలు బయల్దేరారు. ఈ సందర్భంగా మాచర్ల ప్రజలకు చంద్రబాబు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. వాతావరణం ఇబ్బంది కారణంగా రద్దయిన తన ప్రయాణాన్ని మాచర్ల ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. మాచర్ల వెళ్లేందుకు అన్ని అవకాశాలు పరిశీలించినా సాధ్యపడలేదు కాబట్టే రద్దు చేసుకున్నానని, దీనిని మాచర్ల ప్రజలు సహృదయంతో స్వీకరిస్తారన్న నమ్మకం తనకు వుందని చంద్రబాబు చెప్పారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న బ్రహ్మానంద రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి తీసుకురావాలి ఆయన మాచర్ల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రౌడీ రాజకీయానికి పల్నాడు ప్రజలు తమ ఓటుతో గట్టి గుణపాఠం చెప్పాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
వైసీపీకి ఓటు వేయకపోతే చెప్పుచ్చుకుని కొడతానని అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాణెం హనిమిరెడ్డి నియోజకవర్గంలోని ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం నాడు అద్దంకిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హనిమిరెడ్డి ఈ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలలో వైసీపీకి ఓటు వేయకుండా, ఆ తర్వాత నా దగ్గర అన్ని వేల ఓట్లు వున్నాయి, ఇన్ని వేల ఓట్లు వున్నాయి. మీ పార్టీలో చేరతానని ఎవరైనా అంటే, వాళ్ళని చెప్పు తీసుకుని కొడతానని హెచ్చరించారు. నేను రవికుమార్, గరటయ్య లాంటి వాడిని కాదని, చాలా తేడాగాడినని, తనతో జాగ్రత్తగా వుండాలని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు తనకు ఓటు వేసిన వాళ్ళకే తాను సేవకుడినని, తనకు ఓటు వేయని వాళ్ళు తన దగ్గరకి వస్తే మర్యాదగా వుండదని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. తనకు ఓటు వేయని వాళ్ళకు తాను పని చేయనని స్పష్టం చేశారు. నేను మీకే ఓటు వేశాను. మా అబ్బాయి ఓటు వేయలేదు.. అతని పని చేసి పెట్టండి అని ఏ తండ్రి అయినా అడిగితే నేను వాళ్ళ పని చేయనుగాక చేయనని చెప్పేశారు. తనకు ఓటు వేసిన వాళ్లకి మాత్రమే తన సేవలు అందుతాయని పాణెం హనిమిరెడ్డి బెదిరిస్తున్నట్టు చెప్పారు.  ఏమయ్యా హనిమిరెడ్డి.. నీ పార్టీకి ఓటు వేయకపోతే చెప్పుచ్చుకుని కొడతావా? ఓటర్లకు ఇలాంటి వార్నింగ్ ఇచ్చిన నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి? నీకు ఓటు వేసినవాళ్ళకే నువ్వు సేవ చేసే పనయితే, నీకు ఓటు వేయని వాళ్ళ మీద నీకు అధికారం ఏముంటుందయ్యా? నీకు ఓటు వేయని వాళ్ళకి నువ్వెలా ఎమ్మెల్యే (గెలిచినప్పుడు సంగతిలే) అవుతావయ్యా? నీకు ఓటు వేయని వాళ్ళు చెల్లించే పన్నుల మీద నీకెందుకు హక్కుంటుందయ్యా. ఓటర్లని చెప్పుతో కొట్టడమేంటి? మతి వుండే మాట్లాడావా.. లేక జగన్ బ్రాండ్ గంజాయి గానీ, మందుగానీ కొట్టి మాట్లాడావా? ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడే ఈ రేంజ్ పొగరు చూపిస్తున్నావు.. అద్దంకి ఓటర్లు పొరపాటున నీకు ఓటు వేశారంటే.. వాళ్ళ చెప్పుతో వాళ్ళే కొట్టుకున్నట్టు! హనిమిరెడ్డి వ్యాఖ్యల పట్ల అద్దంకి నియోజకవర్గ ఓటర్లు చాలా సీరియస్‌గా వున్నారు. ఈనెల 13వ తేదీన హనిమిరెడ్డిని తమ ఓటుచ్చుకుని కొట్టడానికి రెడీగా వున్నారు. అద్దంకి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున గొట్టిపాటి రవికుమార్ పోటీలో వున్నారు. రవికుమార్ విక్టరీ ఆల్రెడీ కన్ఫమ్ అయిపోయింది. ఈ ఫ్రస్టేషన్లోనే హనిమిరెడ్డి ఓటర్లను చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చి వుంటారని పరిశీలకులు అంటున్నారు.
ALSO ON TELUGUONE N E W S
మెగాస్టార్‌ చిరంజీవి సినీ పరిశ్రమకు చేసిన సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. అదే సంవత్సరం ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్‌ ప్రదానం చేసి గౌరవించింది. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌ వంటి పురస్కారానికి చిరంజీవిని ఎంపిక చేసింది. ఢల్లీిలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్‌ చిరంజీవి పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నారు చిరంజీవి.  ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల కారణంగానే నాకు ఈ అవార్డు లభించింది. పద్మవిభూషణ్‌ అవార్డును అందుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ ప్రయాణంలో నా అభిమానుల అండదండలు ఎప్పటికీ మరచిపోలేను. ఈ సందర్భంగా అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని అంటూ ‘ప్రస్తుతం ఉన్న ఎన్నికల వాతావరణం గురించి మాట్లాడాలంటే నేను పార్టీలోనూ లేను. పిఠాపురంలో నా తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ గెలవాలని కోరుకుంటున్నాను. పవన్‌కి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఎన్నికల ప్రచారానికి నేను వెళ్ళడం లేదు. పవన్‌ నాకు ఆ వెసులుబాటు ఇచ్చాడు. అలాగే ఎన్నికల ప్రచారానికి రమ్మని పవన్‌ కూడా నన్ను ఎప్పుడూ అడగలేదు’ అన్నారు. ఈ సందర్భంలోనే భారతరత్న అవార్డు గురించి ప్రస్తావించారు చిరంజీవి. ఎన్‌.టి.రామారావుగారికి భారతరత్న అవార్డు వస్తే సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారంతో ఆ అవార్డు త్వరగా రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు చిరంజీవి. 
Hero Sundeep Kishan and director CV Kumar are working together for the second time for the second installment of the sensational hit in their combination ProjectZ/Maayavan. The film titled MaayaOne is being made on a grand canvas with a high budget under AK Entertainments banner. This Sci-Fi Action Thriller set in the Maayavan world is presented by Adventures International Pvt Ltd with Rambrahmam Sunkara producing it. Kishore Garikipati (GK) is the executive producer. Extending birthday wishes to hero Sundeep Kishan, the makers recently revealed the first look which received a tremendous response. Today, they unveiled the film’s teaser. The teaser introduces us to the world of Maayavan and also the main characters in it. It opens by showing a science lab in the snow, where experiments are happening to transfer the brain from one person to the other. The supervillain played by Neil Nitin Mukesh has superpowers, whereas the common man played by Sundeep Kishan also possesses some powers in the end. It also shows the love track of Sundeep Kishan with Akansha Ranjan Kapoor. The teaser ends on an action-packed note with an intense action block. The teaser generates inquisitiveness for the movie. Sundeep Kishan looked manly and he’s seen performing stunts. CV Kumar created an imaginary world and the visuals looked great. MaayaOne is the story of a common man’s clash with a supervillain. will be seen as the heroine opposite Sundeep Kishan.
National-award-winning superstar Dhanush wields the megaphone for the second time for his 50th movie as an actor. Sundeep Kishan plays the other lead role in the movie titled Raayan, alongside Kalidas Jayaram in the movie produced by Sun Pictures. The makers began the musical promotions by releasing the lyrical video of the first single Thala Vanchi Eragade. Oscar-winning composer AR Rahman composed a mass number which was filmed grandly. Dhanush is seen enacting mass dances alongside many villagers at a carnival. Prabhu Deva has done some wonderful choreography for the song crooned powerfully by Hemachandra and Sarath Santosh with lyrics by Oscar-winning lyricist Chandrabose. This song will appeal to all sections, particularly the masses will love it to the core. Dhanush sports short hair with a handlebar mustache in the movie. Thala Vanchi Eragade is a perfect song to begin the musical promotions of the movie. SJ Surya, Selvaraghavan, Aparna Balamurali, and Dhushara Vijayan play the other important characters in the movie which is going to be high technically with first-class production standards. AR Rehman provides the music, while the camera is handled by Om Prakash. Prasanna GK takes care of editing, while Jacki is the production designer and Peter Hein is the action choreographer. The makers have also announced to release Raayan worldwide on June 13th. Asian Suresh Entertainment LLP will release the Telugu version.
Mass Ka Das Vishwak Sen has proven his versatility with different films in various genres. Now, he is coming up with a gangster flick, Gangd of Godavari in the direction of Krishna Chaitanya.  Masterful composer Yuvan Shankar Raja is composing music for the film. Already, first single from the album, melodious "Suttamla Soosi" has gone viral with more than 50 Million views. After that chartbuster, the makers have now unveiled "BAD" theme song of Gangs of Godavari on 10th May.  Yuvan Shankar Raja, who is known for creating distinctive themes for films, has once again delivered his best. "BAD" introduces us to the dark world that the makers have explored for this film and "grey" characters that they've created.  Lyrics represent the attitude of the main character, "Lankala Rathna" and saki lyrics written by popular writer-director Trivikram Srinivas set up the tone perfectly. Kalyan Chakravarthy’s lyrics add layers to the character with lines that showcase his commitment, gutsy nature to excel despite being in a very dark and ruthless world.  Synth beats, flowy theme, rap and typical Yuvan style instrumentation make this song addictive to the listeners. Neha Sshetty and Anjali are playing female leads in the film produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya of Sithara Entertainments and Fortune Four Cinemas, respectively.  Venkat Upputuri and Gopichand Innumuri are co-producing the film and Srikara Studios is presenting it. Anith Madhadi is handling cinematography and Navin Nooli is editing the film. More details to be announced soon.
The movie "Mr. Idiot," starring Maadhav, Mass Maharaj RaviTeja's nephew, features Simran Sharma as the heroine. Produced by JJR Ravichand under the banner of JJR Entertainments and Ms. Yalamanchi Rani, the film is directed by Gauri Ronanki, who achieved commercial success with "Pelli Sanda D." Today, RaviTeja released the teaser of "Mr. Idiot" on social media. The teaser introduces Satya (played by Simran Sharma), a top student at Dhruva Fashion Designing College, known for her unbeatable design skills. During this time, Hero (Maadhav) enters the college and playfully teases Satya, calling her a "multiple." The teaser intriguingly showcases how their tumultuous friendship evolves into love. Maadhav channels the energetic essence of RaviTeja and impresses with both his stylish appearance and performance. "Mr. Idiot," which has completed all production stages, is set for a grand theatrical release soon. The release date will be announced by the makers.
'Love, Mouli' is a new-age youthful drama featuring Navdeep in a brand-new get-up. His free-spirited character in this content-driven movie will bring to the fore his second version - Navdeep 2.0. The super-talented actor is going to be seen as a hero after a break from movies. Avaneendra is the director of this novel and diverse film, which is produced by Nyra Creations and Srikara Studios under the banner CSpace, which has been the 'adda' for talented technicians from Tollywood. Every update from this film has been innovative and impresses everyone. The film completed its censor formalities today. It is a pakka A-certified movie! Sharing the news, Navdeep wrote that 'Love Mouli' will head to theatres on June 7th. "Censor done and ready for the cinemas! Love, Mouli. Releasing on 7th June," he tweeted. The film is going to be bohemian and musical. Ahead of its release, the promotional activities will be intensified.
In a heartwarming gesture, Icon Star Allu Arjun took to social media to express his unwavering support and love for his uncle, Shri. Pawan Kalyan, as he embarks on his political journey. Allu Arjun tweeted on X, "My heartfelt wishes to @PawanKalyan garu on your election journey. I have always been immensely proud of the path you've chosen, dedicating your life to service. As a family member, my love and support will always be with you. My best wishes for achieving all that you aspire for." This message underscores the strong familial bond between the two renowned figures in the Telugu film industry and highlights Allu Arjun's admiration for Pawan Kalyan's commitment to public service.
Eternity Entertainment is thrilled to announce the release of the teaser for their upcoming film, 'Vidya Vasula Aham' ('A Long Long Ego Story'). Directed by Manikant Gelli, the film promises an engaging narrative centered around the dynamics of a couple's relationship. Starring Rahul Vijay and Shivani Rajasekhar in the lead roles, 'Vidya Vasula Aham' explores the journey of Vasu and Vidya, two individuals thrust into marriage against their will. As they navigate the ups and downs of married life, the backdrop of the story adds depth and intrigue. Director Manikanth Gelli expressed his vision for the film, emphasizing the theme of breaking down the walls of ego to truly embrace married life. Despite the characters being portrayed as mature, the film resonates with audiences by addressing relatable challenges within relationships. Produced by Mahesh Dutta Mothuru and Lakshmi Navya Makkapati under the banner of Tanvika and Jasvika Creations, 'Vidya Vasula Aham' boasts a talented ensemble cast including Avasarala Srinivas, Abhinaya, Srinivas Reddy, Tanikella Bharani, Mounika Reddy, Ravi Varma Adduri, Kashi Vishwanath, Rupalakshmi, Rajasrinayar, and Viva Raghava. Stay tuned for the release of 'Vidya Vasula Aham' on Aha, as audiences prepare to embark on an emotional journey filled with love, laughter, and introspection.
Talented hero Varun Sandesh picked a unique and concept-based movie 'Nindha' which garnered a huge attention for its exceptionally destined title poster. The film based on real incidents is written and directed by Rajesh Jagannadham who is also producing it. Produced under the banner of The Fervent Indie Productions, the team has unveiled the film’s first look poster which astounds us for its unique design. The top portion of the poster shows Varun Sandesh with innocence in his face, whereas there is a shadow of a suspicious man behind him. We can see the same shadow behind the upside down blindfolded Lady Justice statue in the down portion. The poster adds to the excitement for the movie. The movie Nindha unfolds – A Kandrakota Mystery. In a blame-filled world, innocence hangs by a thread. Get ready for a wild ride through twists of truth and deceit. Santhu Omkar scores the music, Ramiz Naveeth cranks the camera, and Anil Kumar takes care of editing. The movie is getting ready for release.
సినిమా పేరు: కృష్ణమ్మ తారాగణం: సత్యదేవ్, మీసాల లక్ష్మణ్, కృష్ణ బూరుగుల, అతిర, అర్చన అయ్యర్, నందగోపాల్, రఘు కుంచే తదితరులు సంగీతం: కాలభైరవ డీఓపీ: సన్నీ కూరపాటి  ఎడిటర్: తమ్మిరాజు రచన, దర్శకత్వం: వి.వి. గోపాల కృష్ణ నిర్మాత: కృష్ణ కొమ్మాలపాటి బ్యానర్: అరుణాచల క్రియేషన్స్ విడుదల తేదీ: మే 10, 2023  జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న కథలు, పాత్రలతో అలరిస్తుంటాడు సత్యదేవ్. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు 'కృష్ణమ్మ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రచారం చిత్రాలు ఆకట్టుకోవడం, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పకుడు కావడంతో.. 'కృష్ణమ్మ' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ: అనాథలైన భద్ర(సత్యదేవ్), కోటి(మీసాల లక్ష్మణ్), శివ(కృష్ణ బూరుగుల) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. చిన్నతనంలోనే జైలు జీవితం గడిపిన శివ.. నేరాల జోలికి పోకుండా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని జీవనం సాగిస్తుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి స్వంగ్లింగ్ వంటివి చేస్తూ.. పొట్ట నింపుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో మీనా(అతిర)తో శివ ప్రేమలో పడతాడు. మీనా రాకతో భద్రలో మార్పు వస్తుంది. ఆమెని సొంత చెల్లిలా చూసుకుంటూ.. స్మగ్లింగ్ మానేసి, ఆటో నడుపుతూ సొంత కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేస్తాడు. ఇలా జీవితాలు సాఫీగా సాగిపోతున్నాయనుకుంటున్న సమయంలో.. మీనా తల్లి ఆపరేషన్ కోసం డబ్బు అవసరమవుతుంది. అంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో భద్ర, కోటి, శివ స్వంగ్లింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ముగ్గురూ ఒక పెద్ద నేరంలో ఇరుక్కుంటారు. అసలు ఆ నేరం ఏంటి? అందులో ఈ ముగ్గురు ఎలా ఇరుక్కున్నారు? శివ-మీనా ప్రేమ కథ ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: ఎవరో చేసిన నేరానికి అమాయకులు బలైన కథలు ఎన్నో వినుంటాం, చూసుంటాం. 'కృష్ణమ్మ' కూడా ఆ కోవకి చెందినదే. ఫ్రెండ్ షిప్ బ్యాక్ డ్రాప్ లో ఉండే రివేంజ్ స్టోరీ ఇది. బలమైన ఎమోషన్స్ తో రా అండ్ రస్టిక్ గా దర్శకుడు ఈ సినిమాని మలిచాడు. ఓ భారీ ఫైట్ సీన్ తో సత్యదేవ్ పాత్రని పరిచయం చేస్తూ.. సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ తర్వాత భద్ర, కోటి, శివ ల గతం చూపిస్తారు. వారి మధ్య స్నేహం, శివ-మీనా ప్రేమకథ వంటి సన్నివేశాలతో ప్రథమార్థం నడుస్తుంది. హీరో లవ్ ట్రాక్ మాత్రం తేలిపోయింది. విరామ సన్నివేశాలకు ముందు వరకు ఫస్టాఫ్ లో పెద్దగా మెరుపులు లేవనే చెప్పాలి. ముగ్గురు స్నేహితులు స్వంగ్లింగ్ చేసే క్రమంలో పోలీసులకు దొరికిపోయి, ఓ పెద్ద కేసులో ఇరుక్కునే సన్నివేశాలు మాత్రం మెప్పించాయి. విరామ సన్నివేశాలు ద్వితీయార్థంపై ఆసక్తి కలిగేలా చేశాయి. ఇక సెకండాఫ్ అంతా సీరియస్ టోన్ లోనే ఉంటుంది. చేయని నేరాన్ని ఒప్పించడం కోసం వారిని పోలీసులు చిత్రహింసలకు గురిచేసే సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. వారు పోలీసులపై తిరగబడే సన్నివేశాలు, జైలు నుంచి బయటకు వచ్చాక చేసే హత్యలు థ్రిల్ ని పంచుతాయి. క్లైమాక్స్ ఊహలకు తగ్గట్టుగా ఉన్నప్పటికీ.. దానిని ఎమోషనల్ మలచిన తీరు బాగుంది.  తాను ఎంచుకున్న కథలో కొత్తదనం లేనప్పటికీ.. ప్రేక్షకులను మెప్పించేలా దానిని తెర మీద చూపించడంలో బాగానే సక్సెస్ అయ్యాడు. పాటలతో పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయిన కాలభైరవ.. నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: భద్ర పాత్రలో మరోసారి తన సజహమైన నటనతో సత్యదేవ్ మ్యాజిక్ చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అతని నటన టాప్ క్లాస్ లో ఉంది. కోటిగా మీసాల లక్ష్మణ్, శివగా కృష్ణ బూరుగుల కూడా ఆయా పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అతిర, అర్చన అయ్యర్, నందగోపాల్, రఘు కుంచే తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఫైనల్ గా.. బలమైన ఎమోషన్స్ తో రా అండ్ రస్టిక్ ఫిల్మ్ గా రూపొందిన 'కృష్ణమ్మ' ఆకట్టుకుంది. కథలో కొత్తదనం లేనప్పటికీ భావోద్వేగాలు, సహజత్వం ఈ సినిమాని నిలబెట్టాయి. రేటింగ్: 2.75/5
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం కాస్త కష్టమైన పనే. చదివిన చదువుకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షించేవారు ప్రస్తుతం తక్కువే. పట్టణాలలో మంచి మంచి కంపెనీలలో గౌరవప్రదమైన వేతనంతో, హుందాగా ఉండే ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. చాలామంది ఆ ఉద్యోగాల విషయంలో కూడా గందరగోళానికి గురవుతూ ఉంటారు. కారణం ఇంటర్వ్యూ లో సక్సెస్ కాకపోవడం. ఎంతో బాగా చదివి, మంచి ర్యాంక్ లు సాధించిన వారు కూడా ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికి ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి ఇంటర్వ్యూ లో సక్సెస్ కావాలంటే ఏమి చేయాలి??  ఎంపిక: కొంతమంది ఖాళీగా ఉన్నాం ఏదో ఒక జాబ్ తొందరగా చూసుకోవాలి, ఏదో ఒకటి క్లిక్ అవ్వకపోతుందా అనే ఆలోచనతో వరుసపెట్టి అన్నిటికి అప్లై చేసేస్తూ ఉంటారు. దీనివల్ల నెలకొనేదే పెద్ద గందరగోళం. కాన్ఫిడెంట్ లేకుండా పది కంపెనీలలో ఇంటర్వ్యూ కు వెళ్లడం కంటే కాన్ఫిడెంట్ తో ఒక్కదానికి అటెండ్ అవ్వడం మంచిదనే విషయం మర్చిపోకండి.  నాట్ ఓన్లీ దట్: ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పటి నుండి అందరూ చేసే పని, తాము అప్లై చేసిన జాబ్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మననం చేసుకుంటూ వాటిని బట్టి పట్టడం. దీనివల్ల ఒనగూరేది ఏమి ఉండదు. ఎందుకంటే వాటిని మననం చేసుకుంటూ మిగిలిన వాటిని ఎంతో సులువుగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. పైపెచ్చు ఇంటర్వ్యూ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది సంస్థకు సంబంధించిన వారి ఇష్టం. వారు పూర్తి జాబ్ కు సంబంధం లేని విషయం అయినా అడగవచ్చు. ఎందుకంటే వాళ్లకు కావలసింది పని చేయడం మాత్రమే కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి వర్క్ కు సంబంధించిన విషయాలు ఒక అంశం మాత్రమే. మరింకేం కావాలి?? నమ్మకం ఇవ్వగలగాలి. బాధ్యతాయుతంగా ఉండగలరు అనే నమ్మకాన్ని ఇవ్వగలగాలి. చాలా సంస్థల్లో మొదట ప్రాధాన్యత ఇచ్చే విషయం కూడా ఇదే.  పని చేయబోయే సంస్థ  విషయంలో, చేయబోయే వృత్తి విషయంలో ఎంత బాధ్యతాయుతంగా ఉండగలరు అనే విషయం మీదనే ఎంపిక ఎక్కువగా జరుగుతుంది. అలాగే పని పట్ల నిబద్ధత ఎంతో అవసరం. పనికి ప్రాధాన్యత ఇచ్చేవారి వైపు కంపెనీ మొగ్గు చూపుతుంది. కాబట్టి పని విషయంలో భరోసా ఇవ్వగలగాలి. స్పృహ కలిగి ఉండాలి: ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు కంపెనీ భవంతిలో అడుగుపెట్టినప్పటి నుండి చుట్టుపక్కల వాతావరణం ను గమనించుకుంటూ వెళ్ళాలి. కంపెనీలలో ప్రతిచోటా సీసీ కెమెరాల నిఘా ఉంటుందనే విషయం మరువకూడదు. మనిషి కదలిక నుండి ఆహార్యం వరకు ప్రతి విషయంలో ఒక నిజాయితీ కనిపించాలి. నటించాలని చూస్తే ఖాళీ చేతులతో బయటకు రావడం ఖాయం. తన పని మాత్రమే చూసుకుని పోయే వాళ్లకు ప్రాధాన్యత తక్కువగానే ఉంటుంది. ఇంటర్వ్యూ రూమ్ దగ్గరకు వెళ్లే మార్గంలో ఉన్న క్యాబిన్ లలో ఎవరు లేకుండా ఉండి, ఫ్యాన్ లు, లైట్ లు వంటివి ఆన్ లో ఉంటే వాటిని ఆఫ్ చేయడం. నీటిని వృథా చేయకపోవడం, లిఫ్ట్ సౌకర్యం ఉన్నా మెట్లెక్కి వెళ్లడం. మంచినీళ్లు వంటివి ఇచ్చే బాయ్ ని నవ్వుతూ పలకరించడం, థాంక్స్ చెప్పడం. ముఖ్యంగా సంస్థ గూర్చి ఇంటర్వ్యూ కు వచ్చిన తోటి వ్యక్తులతో ఎలాంటి చర్చా చేయకుండా ఉండటం. సంస్థ గురించి ముందుగానే వివరంగా తెలుసుకోవడం. అంటే సంస్థ స్థాపన నుండి ప్రస్తుతం అధికారుల వరకు అన్నిటి గూర్చి వారి కృషి గురించి కూడా అధ్యయనం చేసి తెలుసుకోవడం. స్కిల్స్ ఎప్పుడు కిల్ చేయకూడదు: కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంటర్వ్యూ లో అధికారులతో మాట్లాడేటపుడు కావాలని వారిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించకూడదు. లేకపోతే మీ స్కిల్స్ ను మీరే కిల్ చేసుకున్నట్టు అవుతుంది.  ముందుగా మరింత ఉత్సాహంగా: ఇక చివరగా చెప్పుకున్నా అన్నిటికంటే ముందు చేయవలసిన పని. ఇంటర్వ్యూ కు హడావిడిగా చివరి నిమిషంలో వెళ్లకుండా, వీలైనంత ముందుగా వెళ్లడం. దీనివల్ల కంపెనీని అక్కడి వాతావరణాన్ని, పని విధానాన్ని అంతో ఇంతో గమనించే వెసులుబాటు ఉంటుంది. తద్వారా సహజంగానే గందరగోళం తగ్గిపోతుంది.  ట్రస్ట్ యువర్ కాన్ఫిడెన్స్: మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు నమ్మండి. ఎవరో ఏదో భయపెట్టేలా చెప్పే మాటలు, విషయాలు ఏవి పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఉన్నట్లయితే, మీ వ్యక్తిత్వం నుండి, పని విషయం వరకు మీ అభిప్రాయాలు నచ్చాయంటే ఏ కంపెనీ ఎం.డి కూడా మిమ్మల్ని వదులుకోడు.  సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది సుమా!! ◆ వెంకటేష్ పువ్వాడ
ఎక్కువసేపు టీవీ చూస్తున్నారా? అయితే మిమ్మల్ని త్వరలోనే మతిమరుపు పలకరిస్తుంది అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. రోజుకి గంటకన్నా తక్కువ సమయం మాత్రమే టీవీ చూస్తున్న వారికి మధ్య జ్ఞాపకశక్తి విషయంలో చాలా తేడా వుందని వీరి పరిశోధనలో తేలింది. కొన్ని వేలమందిపై రకరకాల పరీక్షలు నిర్వహించి తేల్చిన విషయమిది. చిన్న చిన్న విషయాలని కూడా టీవీని అతిగా చూసేవారు మర్చిపోతుండటం గమనించారట వీరు. ముఖ్యంగా పిల్లల జ్ఞాపకశక్తిపై టీవీ చాలా ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు వీరు. స్కూలుకి వెళ్ళేముందు లేదా చదువుకోవటానికి కూర్చునే ముందు టీవీ చూస్తే వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై ప్రభావం ఖాయమని గట్టిగా చెబుతున్నారు. మరి జ్ఞాపకశక్తి పెరగడానికి ఏం చేయమంటారు అని వీరిని అడిగితే అందుకు చాలా మార్గాలున్నాయ్. అయితే టీవీ చూడటం తగ్గించమంటున్నాం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని ఆహ్లాదపరిచే మరో మార్గం ఉంది. దానివల్ల మానసిక, శారీరక ఆరోగ్యం కూడా స్వంతమవుతుంది జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు అంటున్నారు. ‘కాల్పనిక సాహిత్యం’ చదివితే మెదడు పదునెక్కుతుంది. జ్ఞాపకశక్తి పెరగుతుంది. మతిమరుపు తగ్గుతుంది. మానసిక ఉల్లాసం సొంతమవుతుంది. నమ్మకం లేకపోతే ఓ 20 రోజులపాటు మేం చెప్పింది పాటించి చూడండి అని చెబుతున్నారు ఈ ఆస్ట్రేలియా పరిశోధకులు. మరి టీవీ చూడటం తగ్గించి చదవటం మొదలుపెడదామా!? -రమ
ఫ్యాన్.. ప్రతి ఇంట్లో చాలా సాధారణంగా ఉండే ఎలక్ట్రిక్ పరికరం.  బయట నుండి ఇంటికి రాగానే ఫ్యాన్ వేసుకుని దాని కింద కూర్చుని రిలాక్స్  అవుతుంటాం. అయితే వేసవి కాలంలో ఫ్యాన్ వేగం తగ్గినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఫ్యాన్ వేసినా అసలు వేయనట్టే అనిపిస్తుంది. అందుకే చాలా మంది ధర ఎక్కువైనా ఏసీ వైపు మొగ్గు చూపుతారు. కానీ ఫ్యాన్ సెట్టింగ్ లో 5 మార్పులు చేయడం వల్ల ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతుంది. దాని వేగం.. అది ఇచ్చే చల్లదనం ముందు ఏసీ కూడా బలాదూర్ అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. ఇంతకీ ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుంటే.. కెపాసిటర్.. సీలింగ్ ఫ్యాన్‌లో అమర్చిన కెపాసిటర్ మోటార్‌కు అవసరమైన విద్యుత్‌ను అందించడానికి పనిచేస్తుంది. కెపాసిటర్ల పనితీరు మందగించినట్టైతే  90% కంటే ఎక్కువ సీలింగ్ ఫ్యాన్ సమస్యలు ఎదురవుతాయి. కెపాసిటర్ పని చేయడం ఆపివేసినప్పుడు మోటారుకు విద్యుత్ సరిగా అందదు.  దీంతో ఫ్యాన్ వేగం తగ్గుతుంది.  70 నుండి 80 రూపాయల కెపాసిటర్‌ను తిరిగి అమర్చితే  ఫ్యాన్ వేగం పెరుగుతుంది.   బ్లేడ్.. కొన్ని సార్లు ఫ్యాన్ బ్లేడ్ వంగడం వల్ల కూడా ఫ్యాన్ వేగం తగ్గుతుంది. అలాంటి పరిస్థితిలో ఫ్యాన్ బ్లేడును మార్చాలి.  దీనివల్ల కూడా సీలింగ్ ఫ్యాన్ వేగం పెరుగుతుంది. బాల్ బేరింగ్ ఫెయిల్యూర్.. సీలింగ్ ఫ్యాన్లు కాలం గడిచేకొద్దీ వాటిలో బాల్ బేరింగ్స్ లో ధూళి పేరుకుపోతుంది. దీని కారణంగా సీలింగ్ ఫ్యాన్ వేగం తగ్గుతుంది.  దాన్ని మరమ్మత్తు చేయడం ద్వారా ఫ్యాన్ వేగం పెంచవచ్చు. స్క్రూలు.. ఫ్యాన్ లో స్క్రూలు వదులైతే ఫ్యాన్ వేగాన్ని దెబ్బతీస్తాయి. అందుకే ఫ్యాన్ స్క్రూలు సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. సరళత. సరళత లేకపోవడం కూడా ఫ్యాన్ వేగాన్ని దెబ్బతీస్తుంది. దీన్ని కూడా రిపేర్ చేయించడం ద్వారా ఫ్యాన్ వేగాన్ని పెంచవచ్చు.                                                *రూపశ్రీ.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉండటంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. , ప్రతిఒక్కరూ  ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగాలని వైద్యుల నుండి ఆరోగ్యం మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు చెబుతారు. ఎండాకాలంలో  సాదారణం కంటే నీరు మరింత ఎక్కువ అవసరం అవుతుంది. ఎండవేడిమి  కారణంగా, శరీరం నుండి చాలా నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది. పెద్దలు రోజుకు 3-4 లీటర్ల నీటిని తాగడం చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మోతాదులో నీరు తీసుకోవడం వల్ల  డీహైడ్రేషన్ ప్రమాదం నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు. శరీరపనితీరు ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.  రక్షించడంలో సహాయపడుతుంది మరియు శరీర అవయవాల పనితీరును సరిగ్గా ఉంచుతుంది. నీరు తక్కువ తీసుకోవడం  వల్ల డీహైడ్రేషన్,  కిడ్నీలో రాళ్లు, పొడి చర్మం, పొడి  కళ్ళు వంటి అనేక దుష్ప్రభావాలు ఏర్పడతాయి. అయితే ఆరోగ్యానికి మంచిదని చాలామంది ఎక్కువ నీరు తాగేస్తుంటారు. దీని వల్ల బోలెడు ఆరోగ్యమని అనుకుంటారు కానీ.. శరీరానికి ఇది చాలా హాని కలిగిస్తుందని మీకు తెలుసా?  నీరు ఎక్కువగా తాగితే, దాని వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..  రోజుకు కచ్చితంగా ఇంత  నీరు త్రాగాలి అని నిర్ణయించడానికి ఎటువంటి సూత్రం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా రోజుకు మూడు నుండి మూడు లీటర్ల నీరు శరీరానికి అవసరం అవుతుంది. అది కూడా  వాతావరణం, వ్యాయామం, ఆహారం, మొత్తం ఆరోగ్యం, మహిళలు  గర్భంతో ఉండటం  లేదా మహిళలు పిల్లలకు పాలు ఇవ్వడం  వంటి పరిస్థితులపై శరీరానికి కావలసిన  నీటి పరిమాణం ఆదారపడి ఉంటుంది. కానీ నీరు అధికంగా తీసుకుంటే ఈ క్రింది అనర్థాలు కచ్చితంగా జరుగుతాయి.  నీరు ఎక్కువగా తాగుతుంటే  వాటర్ పాయిజనింగ్ సంభవించే అవకాశం ఉంటుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల  మూత్రపిండాల పనితీరును బాగా పెంచుతుంది, దీని ఫలితంగా  శరీరంలోని ఎలక్ట్రోలైట్లు కరిగిపోతాయి. ఉదాహరణకు, సోడియం (ఉప్పు) కరిగించినట్లయితే, హైపోనాట్రేమియా డవలప్ అవుతుంది. శరీరంలో చాలా తక్కువ సోడియం ఉంటే  కణాల లోపల నీరు చేరుతుంది.  ఇది శరీరం  వాపుకు దారితీస్తుంది. హైపోనాట్రేమియా  లక్షణాలు ఎలా ఉంటాయంటే.. హైపోనాట్రేమియా ను ఓవర్ హైడ్రేషన్ అని అంటారు. ఓవర్ హైడ్రేషన్ యొక్క లక్షణాలు ప్రారంభ దశల్లో గుర్తించడం కష్టం. అయితే, ఎక్కువ సార్లు  మూత్రవిసర్జన చేయాల్సి రావడం దీనికి ఒక సంకేతం. వాటర్ పాయిజన్ జరిగితే శరీరంలో ఈ క్రింది లక్షణాలు కనబడతాయి. వికారం మరియు వాంతులు. మెదడుపై ఒత్తిడి పెరిగి దాని కారణంగా తలనొప్పి. గందరగోళం లేదా దిక్కుతోచని స్థితి వంటి మానసిక స్థితిలో మార్పులు. కండరాల తిమ్మిరి. తరచుగా మూత్రవిసర్జన సమస్య. వాంతులు కావడం. మన శరీరంలో మూత్రపిండాలు  ఒక సమయంలో ఎంత నీటిని విసర్జించాలనే పరిమితి కలిగి ఉంటాయి.  దీని ప్రకారం గరిష్టంగా గంటకు 800 నుండి 1,000 ml మూత్రం విసర్జించాలి.   ఎక్కువ నీరు తాగడం ప్రారంభిస్తే, శరీరం నుండి అదనపు నీటిని తొలగించడం మూత్రపిండాలకు కష్టమవుతుంది, దీని కారణంగా  అపానవాయువు, వికారం వంటి  సమస్యలు ఎదురవుతాయి.                                                                               *నిశ్శబ్ద.
ఖర్జూరానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన  ఖర్జూరాలు రుచికే కాదు..  ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలు కలిగిస్తాయి. అయితే ఖర్జూరాలను రాత్రి పడుకునే ముందు తేనెతో కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. తేనె, ఖర్జూరం కాంబినేషన్ కేవలం ఒకటని కాదు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది.  రాత్రి పడుకునే ముందు తేనె,  ఖర్జూరం లో ఉండే పోషకాలేంటో.. వాటిని కలిపి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. తేనె పోషకాలు.. ఒక టేబుల్ స్పూన్ తేనెలో - కేలరీలు: 64, కొవ్వు: 0 గ్రా, సోడియం: 0 mg, పిండిపదార్థాలు: 17 గ్రా, ఫైబర్: 0 గ్రా, చక్కెరలు: 17 గ్రా, ప్రోటీన్: 0.1 గ్రా, పొటాషియం: 10.9 mg, ఇనుము: 0.1 mg, కాల్షియం: 1.3 mg ఉంటాయి. ఖర్జూరం పోషకాలు.. ఎండు ఖర్జూరంలో  కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, చక్కెరలు, ఖనిజాలు (కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్పరస్ మొదలైనవి),  విటమిన్లు (B1, B2, C, మొదలైనవి) వంటి పోషకాలు ఉంటాయి. ఇది టానిన్లు, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ మొదలైన వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలను కూడా కలిగి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఖర్జూరాన్ని తేనెతో కలిపి తింటే.. రాత్రి పడుకునే ముందు ఈ రెండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ గుణాలు వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి. తేనె, ఖర్జూరం రెండు తీసుకుంటే   శరీరంలో ఎలాంటి వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెండింటిని కలిపి తింటే ఆకలి కూడా పెరుగుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. తేనె, ఖర్జూరం కాంబినేషన్ జుట్టు పెరుగుదలను కూడా పెంచుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ రెండూ వేడిగా ఉంటాయి కాబట్టి వేసవి కాలంలో వీటి వినియోగాన్ని తగ్గించాలి.                                                       *రూపశ్రీ.
వేసవిలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.  ఎందుకంటే ఈ సీజన్‌లో జీర్ణక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఆహారంలో జీర్ణక్రియను ప్రేరేపించే ఆహారాలు తీసుకోవాలి. దీనివల్ల  జీర్ణక్రియ  ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే వేసవి కాలంలో లిక్విడ్ ఫుడ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వేసవి కాలంలో  ఎక్కువగా పండ్లు,  కూరగాయల రసాలను తాగుతారు. ఇది  మాత్రమే కాకుండా సత్తును త్రాగితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. యూట్యూబ్ పుణ్యమా అని  ఎన్నో రాష్ట్రాలు, దేశాల ఆహారాలు తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో సత్తు కూడా ఒకటి.  ఇది వేసవిలో సూపర్ ఫుడ్ గా పరిగణించబడుతుంది. దీన్ని పాలలో కలుపుకుని తాగితే పొట్ట చల్లగా ఉండడంతో పాటు మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. సత్తులో పోషకాలు..  సత్తులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కాకుండా  ఐరన్, కాల్షియం, మెగ్నీషియం,  పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. సత్తును  పాలతో కలిపి త్రాగితే ఇది పోషక లక్షణాలను పెంచుతుంది. వేసవి కాలంలో శరీరం  శక్తి స్థాయి కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది. ఇలాంటి  పరిస్థితిలో సత్తును తీసుకుంటే శక్తివంతంగా ఉండవచ్చు. ఇది కాకుండా శరీరంలో రక్త హీనతతో బాధపడుతున్న వ్యక్తులు సత్తును తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వేసవిలో  జీర్ణవ్యవస్థ కొద్దిగా బలహీనపడుతుంది. ఇలాంటి సమయంలో సత్తును తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం, లూజ్ మోషన్ మొదలైన కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక పాలతో సత్తును తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. బరువు తగ్గడానికి ప్రయత్నం చేసేవారు  దీన్నితమ డైట్ లో భాగంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సత్తు కేవలం చల్లదనాన్ని, శరీరానికి పోషణను, జీర్ణ ఆరోగ్యాన్ని బాగు చెయ్యడమే కాదు.. ఎముకలకు బలాన్ని కూడా ఇస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అయితే.. దీన్ని రెగ్యులర్ గా డైట్ లో భాగం చేసుకునే ముందు  ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.                                                  *రూపశ్రీ.