ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో లాయరు, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్ కుమార్  నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలుస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఈ సారి ఆయన   వైసీపీ టార్గెట్ లో విరుచుకుపడ్డారు.  వైసీపీ నేతల ఆర్థిక మూలాలు,  పార్టీ ఫండింగ్ వ్యవహారాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో..వైసీపీ నేతలు..అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు వెనకేశారన్న జడ శ్రవణ్ కుమార్.. వాళ్లు ఎంగిలి మెతుకులను కూడా వదిలిపెట్టకుండా దోచుకున్నారని విమర్శించారు.  నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.  జగన్  హయాంలో తీసుకున్న  పలు   నిర్ణయాలను విమర్శలతో తూర్పారబట్టారు. జగన్ ఐదేళ్ల పాలనలో వందల కొద్దీ కాంట్రాక్టులు, మైనింగ్ లీజులు కేవలం పార్టీకి అనుకూలంగా ఉండే క్రోనీ క్యాపిటలిస్టులకు మాత్రమే దక్కాయన్న జడ శ్రవణ్ కుమార్.. ఆ క్రమంలో దాదాపు 5 వేలకోట్ల రూపాయలకు పైగా నిధులు క్విడ్ ప్రో కో పద్ధతిలో పార్టీ ఫండింగ్ రూపంలోకి మారాయన్నారు.  మద్యం పాలసీ, ఇసుక అక్రమ రవాణా ద్వారా వచ్చిన ఆదాయంలో దాదాపు 35 శాతం నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌కే చేరిందని సంచలన ఆరోపణలు చేశారు. సాధారణ ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసిన పన్నుల సొమ్మును ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు   ఉపయోగించారన్నారు.   ఎంతో నైతికతతో రాజకీయాలు చేస్తున్నామని చెప్పుకున్న వైసీపీ నేతలు, ఇప్పుడు అడ్డగోలుగా దొరికిపోతున్నారన్న ఆయన..  అమరావతి భూముల వ్యవహారంలోనూ, విశాఖపట్నంలో ల్యాండ్ గ్రాబింగ్ ద్వారా సుమారు రూ. పది వేల కోట్ల విలువైన భూములను వైసీపీ అస్మదీయులు హస్తగతం చేసుకున్నారనీ,  దళిత, వెనుకబడిన వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, కేవలం కొద్దిమంది బడా బాబుల జేబులు నింపడమే లక్ష్యంగా జగన్ పాలన సాగిందని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో ఈ ఆర్థిక అక్రమాలపై పూర్తిస్థాయి కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ జరగాలని.. అప్పుడే అసలు దొంగలు బయటపడతారనీ జడ శ్రావణ్ అన్నారు.   YSRCP Funding Allegations, AP Politics Shocking Comments, YSRCP Corruption Scandals, Andhra Pradesh Latest News
ఖమ్మం జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ఒక భారీ బహిరంగ సభలో ఏపీ  మాజీ సీఎం, వైసీపీ అధినేత  జగన్  బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి.  కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు హాజరైన ఈ వేదిక వద్ద ఇతర పార్టీల నేతల ఫ్లెక్సీలు కనిపించడం  సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని రైతు సమూహాలతో ముఖాముఖిగా మాట్లాడటానికి, వారి సమస్యలను తెలుసుకోవడానికి పర్యటనకు వచ్చారు.  సీఎం సభా వేదిక వద్దకు చేరుకునే సమయంలో, ఆ ప్రాంతంలో జగన్ ఫొటోలతో  ఫ్లెక్సీలు, బ్యానర్లు భారీగా వెలిశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొంటున్న సభలో పొరుగు రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం బ్యానర్లు రాజకీయ చర్చకు తెరలేపింది.  ఈ సభా ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి పాత బ్యానర్లు కూడా దర్శనమిచ్చాయి. స్థానిక టీడీపీ శ్రేణులు, పాత అనుబంధాన్ని గుర్తుచేస్తూ ఈ ఫ్లెక్సీలను అక్కడ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒకే వేదిక పరిసరాల్లో కాంగ్రెస్ నాయకులతో పాటు వైసీపీ,  టీడీపీ బ్యానర్లు కనిపించడం విశేషం.  కాగా ఈ బ్యానర్లు.. రాష్ట్రాలకూ, రాజకీయాలకు అతీతంగా పార్టీలు సీఎం రేవంత్ కు మద్దతుగా నిలుస్తున్నాయనడానికి నిదర్శనమని కాంగ్రెస్ శ్రేణులు సంబరపడుతున్నాయి. ఈ పరిస్థితి  తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయంగా మరింత బలోపేతం కావడానికి దోహదం చేస్తుందంటున్నాయి.  మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.   Revanth Reddy Khammam Meeting, YS Jagan Banners Khammam, Telangana Congress Politics, TeluguOne News Political Updates
ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్ట్ వ్యవహారం వైసీపీ తీరు రోజుకో రకంగా మారుతోంది.   ప్రశ్న రావణ్ విషయంలో వైసీపీ ఎప్పుడు ఏం మాట్లాడుతోంది, ఏ క్షణంలో ఏ ప్రకటన చేస్తుందన్న విషయం ఆ పార్టీకైనా తెలుసా? అన్న అనుమానాలు పోలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమౌతున్నాయి.   ఈ క్రమంలోనే  వైసిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా చేసిన   వ్యాఖ్యలు మరో వివాదానికి తెరలేపాయి.  ప్రశ్న రావణ్ కేసుపై స్పందించిన అంబటి రాంబాబు..  రావణుడే గెలుస్తాడు.. మేము గెలిపిస్తాం అంటూ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది.  వాస్తవానికి గత కొద్దిరోజులుగా ప్రశ్న రావణ్ ఎపిసోడ్‌లో వైసిపి సోషల్ మీడియా  తీవ్ర అయోమయంలో పడినట్లు కనిపించింది. ఒక దశలో ప్రశ్న రావణ్ గతంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడిన పాత వీడియోలను షేర్ చేస్తూ, అతను టిడిపి సానుభూతిపరుడంటూ వైసిపి ప్రచారం చేసింది. ఇప్పుడు..  ఇప్పుడు మాట మార్చి ప్రశ్న రావణ్ ను వెనకేసుకొస్తూ వైసీపీ అగ్రనేతలు మాట్లాడుతున్నారు.  ఒకరోజు టిడిపి మనిషి అని ముద్ర వేసి, ఆ మరుసటి రోజే అతనికి పూర్తి స్థాయిలో అండగా నిలబడటం విస్మయ పరుస్తోంది. పైగా మాజీ మంత్రి అంబటి ఒక అడుగు ముందుకు వేసి.. రావణుడిని గెలిపిస్తామనడం వివాదాస్పదంగా మారింది.  ప్రశ్న రావణ్ భావజాలానికీ, వైసీపీ సిద్ధాంతాలకూ సంబంధం లేదన్న అంబటి..  అతని మీద అన్యాయంగా కేసులు పెట్టి సోషల్ మీడియా గొంతు నొక్కాలని,చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. ఈ  యుద్ధంలో రావణుడే గెలుస్తాడు.. రావణుడిని  మేము గెలిపిస్తామన్నారు.   సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన ద్వేషాన్ని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశాడనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు గత వారం ప్రశ్న రావణ్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే.   సమాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రావణుడిని గెలిపిస్తామనడమంటే.. తాము రాక్షసుడి పక్కన నిలబడినట్లు అంగీకరించడమే అవుతుందని చెబుతున్నారు.  మొత్తం మీద అంబటి రాంబాబు రావణుడిని గెలిపిస్తామంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ ట్రోల్ అవుతున్నాయి.   Ambati Rambabu, Prashna Ravan, YCP Strategy, Prashna Ravan Arrest, AP Political News, Telugu YouTuber Arrest
ALSO ON TELUGUONE N E W S
యువ హీరో ఆనంద్ దేవరకొండ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘తక్షకుడు’ షూటింగ్ అధికారికంగా పూర్తయింది. ఈ విషయాన్ని ఆనంద్ దేవరకొండ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ ఒక సుదీర్ఘమైన, భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు. నటుడిగా తన కెరీర్‌లో అత్యంత సంతృప్తినిచ్చిన చిత్రాల్లో ‘తక్షకుడు’ అగ్రస్థానంలో ఉంటుందని ఆయన ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతంలో తనతో కలిసి సూపర్ హిట్ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమాను రూపొందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు వినోద్ అనంతోజుతో మళ్లీ ఈ సినిమా కోసం కలిసి పని చేయడం అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని ఆనంద్ కొనియాడారు. కథను, నటుడిని సరికొత్త కోణంలో, అత్యంత విభిన్నంగా చూసే గొప్ప దర్శకుడు వినోద్ అని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా తెలుగు ఫోక్‌లోర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుండటం విశేషం. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ ఒక ఛాలెంజింగ్ రోల్ పోషిస్తున్నారు. మొదటిసారి ఆయన ఒక అంధుడి  పాత్రలో కనిపించనున్నారు. తన గ్రామస్థుల అనుమానాస్పద మరణాలకు కారణమైన వారిపై, తన పెంపుడు కుక్కతో కలిసి కథానాయకుడు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఒక అంధుడి పాత్రలో నటించడం నటుడిగా తనకు ఎంతో సవాల్‌గా అనిపించిందని, అదే సమయంలో ప్రతి సీన్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా సాగిందని ఆనంద్ దేవరకొండ పేర్కొన్నారు. ఈ ఎమోషనల్ పోస్ట్‌తో పాటు సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్ స్కెచ్‌లు, షూటింగ్ లోకేషన్‌లో దిగిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను ఆయన అభిమానుల కోసం షేర్ చేశారు. ఈ సినిమాలో ఆనంద్‌తో పాటు కీలక పాత్రలో నటించిన ‘బెర్లిన్’ అనే పెంపుడు కుక్కతో తనకు షూటింగ్ సమయంలో ఎంతో మంచి అనుబంధం ఏర్పడిందని ఆయన గుర్తుచేసుకున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, కథలోని భావోద్వేగాలకు తగ్గట్టుగా దర్శకుడు వినోద్ అనంతోజు నటీనటుల నుండి ఎంతో సహజమైన నటనను రాబట్టుకున్నారని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్‌కు సోషల్ మీడియాలో, ప్రేక్షకులలో ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజీ ఫోక్‌లోర్ థ్రిల్లర్ ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) లో త్వరలోనే నేరుగా విడుదల కానుంది. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ‘తక్షకుడు’ మూవీ ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుందని చిత్ర యూనిట్ ఎంతో ధీమాగా ఉంది.     Anand Deverakonda, Takshakudu, Vinod Anantoju, Netflix 
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే మధ్య ఏదో నడుస్తోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. మాస్ మహారాజా రవితేజ సరసన 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముంబై భామ, మొదటి సినిమాతోనే తన గ్లామర్, యాక్టింగ్‌తో కుర్రకారు మనసు దోచుకుంది. ఆ తర్వాత రామ్ పోతినేని సరసన 'ఆంధ్రా కింగ్ తాలూకా' అనే క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారంటూ అప్పట్లో సినీ వర్గాల్లో గట్టిగానే గుసగుసలు వినిపించాయి. ఈ రూమర్లపై గతంలో హీరో రామ్ పోతినేని స్వయంగా స్పందించి, అవన్నీ కేవలం పుకార్లేనని పూర్తిగా ఖండించారు. అయితే భాగ్యశ్రీ మాత్రం ఇప్పటివరకు ఈ వ్యవహారంపై ఎక్కడా పెదవి విప్పలేదు. కానీ ఇటీవల ఆమె నటించిన 'లెనిన్' సినిమా ప్రమోషన్ల సమయంలో "హైదరాబాద్ ఇప్పుడు నాకు రెండో ఇల్లుగా మారిపోయింది" అంటూ భాగ్యశ్రీ చేసిన కామెంట్స్ ఈ ప్రేమాయణం ఊహాగానాలకు మళ్లీ ఊతమిచ్చాయి. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ బోర్సేకు ఎదురైన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సదరు యాంకర్ భాగ్యశ్రీని ఉద్దేశిస్తూ.. "మీరు కలిసి పనిచేసిన హీరోల్లో ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేస్తారు? ఎవరితో డేటింగ్ చేస్తారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు?" అని ఒక క్రేజీ ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు భాగ్యశ్రీ ఎంతో చాకచక్యంగా, అంతే ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. మొదట ఫ్రెండ్‌షిప్ విషయానికి వస్తే, అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని తనకు చాలా మంచి స్నేహితుడని ఓపెన్ అయిపోయింది. ఇక అసలైన డేటింగ్, పెళ్లి మ్యాటర్‌కు వచ్చేసరికి.. భాగ్యశ్రీ కాసేపు ఆలోచించి, తను ఇప్పటివరకు కలిసి నటించిన హీరోల్లో పెళ్లికాని బ్యాచిలర్ హీరో ఒక్కరే మిగిలి ఉన్నారంటూ అర్ధవంతంగా నవ్వేసింది. భాగ్యశ్రీ నేరుగా రామ్ పేరు ఎత్తకపోయినప్పటికీ, ఆమె పరోక్షంగా ఉద్దేశించింది రామ్ పోతినేనినే అని నెటిజన్లు, టాలీవుడ్ ఫ్యాన్స్ ఇట్టే కనిపెట్టేశారు. ఈ ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. రామ్ ఫ్యాన్స్ అయితే ఒకడుగు ముందుకు వేసి సోషల్ మీడియాలో 'భాగ్యశ్రీ పోతినేని' అంటూ క్రేజీ పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు. అయితే ఇది కేవలం ఇంటర్వ్యూలో సరదాగా, ఫన్ కోసం చేసిన వ్యాఖ్యలే అని కొందరు కొట్టిపారేస్తున్నా, మెజారిటీ నెటిజన్లు మాత్రం వీరిద్దరి మధ్య ఏదో లవ్ స్టోరీ నడుస్తోందని బలంగా నమ్ముతున్నారు. మొదటి సినిమా 'మిస్టర్ బచ్చన్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా, ఈ బ్యూటీ మాత్రం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తాజాగా విడుదలైన 'లెనిన్' సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో భాగ్యశ్రీ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. మరి ఈ డేటింగ్, పెళ్లి రూమర్లపై రామ్ పోతినేని లేదా భాగ్యశ్రీ అఫీషియల్‌గా ఎలా స్పందిస్తారో చూడాలి.     Ram Pothineni, Bhagyashri Borse, Akhil Akkineni, Lenin Movie 
టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశి ఖన్నా షూటింగ్ సెట్‌లో ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు కంటే హిందీ, తమిళ్ ప్రాజెక్టులపైనే ఎక్కువగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో స్టార్ హీరో అక్షయ్ కుమార్, సీనియర్ నటి విద్యా బాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఒక భారీ క్రేజీ ప్రాజెక్టులో రాశి ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ అనీస్ బజ్మీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ఊహించని ప్రమాదం జరిగింది. సాధారణంగా ఫీమేల్ ఓరియెంటెడ్ స్టంట్స్ లేదా కమర్షియల్ సినిమాల్లోని యాక్షన్ సీన్ల కోసం హీరోయిన్లు డూప్‌లను వాడుతుంటారు. కానీ రాశి ఖన్నా మాత్రం సినిమాపై ఉన్న ప్యాషన్‌తో రిస్క్ తీసుకున్నారు. అనీస్ బజ్మీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా కోసం డూప్ లేకుండా స్వయంగా క్లిష్టమైన యాక్షన్ స్టంట్స్ చేయడానికి ఆమె సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే సీన్ రన్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ఆమెకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ విషయాన్ని రాశి ఖన్నా స్వయంగా తన అధికారిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో ఈ వార్త కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇక్కడే రాశి ఖన్నా తన వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని చాటుకున్నారు. యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు అంత పెద్ద దెబ్బలు తగిలినప్పటికీ, ఆమె ఎక్కడా బ్రేక్ తీసుకోలేదు. తన వల్ల షూటింగ్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో, అలాగే ప్రొడ్యూసర్లకు నష్టం రాకూడదనే థాట్‌తో ఆమె పెయిన్ కిల్లర్స్ వాడుతూ గాయంతోనే ఆ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయడం, దెబ్బలు తగిలినా వెనకడుగు వేయకుండా షూటింగ్ కంటిన్యూ చేయడం చూసి సెట్స్ లోని చిత్ర యూనిట్‌తో పాటు నెటిజన్లు, అభిమానులు ఆమె డెడికేషన్‌కు సెల్యూట్ చేస్తున్నారు.     Raashii Khanna, Akshay Kumar, Anees Bazmee 
హాలీవుడ్ సంచలన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ మేకింగ్‌కు, ఆయన సినిమాల్లోని విజువల్ వండర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, తాజాగా ఆయన తన సరికొత్త భారీ చిత్రం 'ది ఒడిస్సీ' ప్రమోషన్స్‌లో భాగంగా భారతీయ సినీ రాజధాని ముంబైలో ల్యాండ్ అయ్యారు. నోలన్‌తో పాటు గ్లోబల్ ఆడియన్స్‌కు ఎంతగానో నచ్చిన స్పైడర్‌మ్యాన్ హీరో టామ్ హాలండ్, సీనియర్ నటుడు మాట్ డామన్ కూడా ఈ గ్రాండ్ ఈవెంట్‌లో సందడి చేశారు. ముంబైలో ఏర్పాటు చేసిన ఒక స్పెషల్ స్క్రీనింగ్ మరియు ప్రమోషనల్ ఈవెంట్‌కు మీడియా ప్రతినిధులతో పాటు వేలాది మంది అభిమానులు పోటెత్తారు. సాధారణంగా హాలీవుడ్ స్టార్స్ విదేశాల్లో ప్రమోషన్స్ చేసినప్పుడు అక్కడి ఆడియన్స్ క్లాస్ రెస్పాన్స్ ఇస్తుంటారు, కానీ ముంబై వేదికపై నోలన్ టీమ్ అడుగుపెట్టగానే థియేటర్ మొత్తం ఒక్కసారిగా ఈలలు, కేకలు, చప్పట్లతో మారుమోగిపోయింది. మన ఇండియన్ ఫ్యాన్స్ చూపించిన అన్‌మ్యాచ్డ్ ఎనర్జీ లెవెల్స్ మరియు అపరిమితమైన ఉత్సాహాన్ని చూసి క్రిస్టోఫర్ నోలన్, టామ్ హాలండ్ ఇద్దరూ నిజంగానే నోరెళ్లబెట్టారు. ఈ రేంజ్ మాస్ రెస్పాన్స్ వారు అస్సలు ఊహించలేదని వారి ముఖాల్లోని ఆశ్చర్యం చూస్తేనే స్పష్టంగా అర్థమైపోయింది. ముఖ్యంగా మన దేశంలో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు ఉండే క్రేజ్, మార్కెట్ వాల్యూ రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. గతంలో ఆయన అందించిన 'ఇంటర్ స్టెల్లార్', 'ఒపెన్‌హైమర్' వంటి మైండ్ బెండింగ్ సినిమాలు భారతదేశంలో, అందులోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలన విజయాలను నమోదు చేశాయి. అదే నమ్మకంతో ఈసారి 'ది ఒడిస్సీ' చిత్రాన్ని ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ భారీ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకునే జూలై 17వ తేదీన ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో వేసిన ప్రివ్యూ షోల నుంచి సినిమాకు అదిరిపోయే పాజిటివ్ టాక్ బయటకు రావడం విశేషం. నోలన్ మార్క్ విలక్షణమైన స్క్రీన్ ప్లే, దానికి తోడు టామ్ హాలండ్ అద్భుతమైన నటన కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారతీయ మార్కెట్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టిన మేకర్స్, ఈ సినిమాను కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ విజువల్ ట్రీట్ అందించడం కోసం ఈ చిత్రాన్ని నార్మల్ స్క్రీన్లతో పాటు 2D, ఐమాక్స్ (IMAX), 4DX, మరియు MX4D వంటి అత్యాధునిక ప్రీమియం ఫార్మాట్లలో భారీగా థియేటర్లలోకి దించుతున్నారు. విజువల్స్ మరియు మైండ్ బ్లోయింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ థియేటర్లలో కూర్చున్న ప్రతి ఒక్కరినీ ఒక సరికొత్త కాస్మిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు. జూలై 17 రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓ రేంజ్‌లో స్టార్ట్ అయ్యాయి. ముంబై ఈవెంట్‌లో భారతీయ అభిమానులు చూపించిన మాస్ జోష్ చూస్తుంటే, బాక్సాఫీస్ దగ్గర థియేటర్లు బద్దలైపోవడం ఖాయంగా కనిపిస్తోంది. క్రిస్టోఫర్ నోలన్ తన సరికొత్త చిత్రంతో ఈసారి ఇండియాలో ఎలాంటి ఆల్-టైమ్ రికార్డులను సృష్టిస్తారో, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి చరిత్ర లిఖిస్తారో చూడాలని హాలీవుడ్, టాలీవుడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.   Christopher Nolan, Tom Holland, The Odyssey
తెలుగు చలనచిత్ర పరిశ్రమ హిస్టరీలో ఎందరో నటీమణులు వచ్చారు, వెళ్లారు. కానీ, తరాలు మారినా, యుగాలు దాటినా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఏకైక నటి మాత్రం 'మహానటి' సావిత్రి. ఆ అద్భుత నటి, అభినయ సామ్రాజ్ఞి 90వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) లో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సినీ చరిత్రకారుడు, ప్రముఖ రచయిత సంజయ్‌ కిషోర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'సావిత్రి క్లాసిక్స్' (Savitri Classics) ఆంగ్ల పుస్తకావిష్కరణ కార్యక్రమం సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల సమక్షంలో కన్నులపండువగా నిర్వహించారు. గతంలో తెలుగులో విడుదలైన ఈ పుస్తకానికి 100 శాతం అద్భుతమైన స్పందన లభించగా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సావిత్రమ్మ అభిమానుల కోసం దీని ఇంగ్లీష్ ఎడిషన్‌ను జూలై 10న గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ అపురూప వేడుకకు సీనియర్ స్టార్ హీరోయిన్, మాజీ ఎంపీ జయప్రద ముఖ్య అతిథిగా విచ్చేసి 'సావిత్రి క్లాసిక్స్' ఇంగ్లీష్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ.. సావిత్రమ్మ నటించిన 47 అత్యుత్తమ క్లాసిక్ చిత్రాల విశేషాలతో కూడిన ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం తన పూర్వజన్మ సుకృతంగా, జీవితంలో దక్కిన అతిపెద్ద అదృష్టంగా భావిస్తున్నానని ఎమోషనల్ అయ్యారు. స్టేజ్ పైన ఉన్న సావిత్రి గారి కుమార్తె విజయ చాముండేశ్వరి గారిని చూస్తుంటే, సావిత్రమ్మ గారే స్వయంగా మా ఇంటికి నడచి వచ్చినట్లు అనిపించిందని ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా చెప్పారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్ర కథానాయకులకు సైతం స్టార్ ఇమేజ్, నటనలో సమానంగా ధీటుగా నిలబడ్డారు కాబట్టే ఆమెకు 'మహానటి' అనే అద్భుతమైన బిరుదు దక్కిందని కొనియాడారు. ఈ పుస్తకావిష్కరణ సభలో హాస్యనటుడు బ్రహ్మానందం, టాలీవుడ్ ప్రముఖ దర్శకులు, సావిత్రి గారి కుమారుడు సతీష్ కుమార్ లతో పాటు వందలాది మంది సినీ అభిమానులు పాల్గొన్నారు. రచయిత సంజయ్ కిషోర్ కొన్నేళ్లుగా సావిత్రి రేర్ ఫోటో ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తూ, ఆమె జీవితాన్ని భావితరాలకు అందిస్తున్న తీరును అతిథులంతా అభినందించారు. ఒకప్పుడు సినిమా ప్రియులు రామాయణం, మహాభారతం వంటి పవిత్ర గ్రంథాలను ఇంట్లో ఎలా దాచుకునేవారో, సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ 'సావిత్రి క్లాసిక్స్' పుస్తకాన్ని అలానే దాచుకోవాలని బ్రహ్మానందం పేర్కొనడం విశేషం.      Mahanati Savitri, Savitri Classics, Jayaprada, Brahmanandam, Sanjay Kishore
పవన్ కళ్యాణ్ ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు.. వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అప్పటికే పవన్ కళ్యాణ్ నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయం అయినందున వాటిని ముగించుకొన్న తరువాత శస్త్ర చికిత్స చేయించుకొంటాను అని ఆయన వైద్యులకు తెలియచేశారు.  రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి శనివారం ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. శనివారం రోజున నిర్వహించిన ఆపరేషన్ కు మూడున్నర గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది.  పవన్ కళ్యాణ్ కి 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరం అని సూచించినా సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్ళి చేతులు కలపాలి అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగేవారు. ఆ సందర్భంలో నొప్పి కలిగినా భరించేవారు. ఈ యాత్రల్లో అభిమానులు దూసుకువచ్చి మరీ పవన్ కళ్యాణ్ తో కరచాలనం చేయాలని ఉత్సాహంతో చేతులు గుంజేవారు. అప్పుడు నొప్పి విపరీతంగా వచ్చినా పంటి బిగువున భరించారు. ఆ తరవాత కూడా ఆ గాయాలను అశ్రద్ధ చేశారు.  2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాల్లో.. ముఖ్యంగా మదనపల్లెలో టమోటా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కళ్యాణ్‌ కి చేరువగా వెళ్ళి కరచాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకొనే సందర్భాల్లో గాయాలు తిరగబెట్టాయి. అయినా పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికలు, అంతకు ముందు వారాహి యాత్ర సందర్భంలోను అభిమానులు కరచాలనం కోసం దూసుకు వచ్చేవారు. గాయాల వల్ల నొప్పి వస్తున్నా భరించారు.  ఏప్రిల్ లో పవన్ కళ్యాణ్ ముక్కుకి శస్త్ర చికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంత తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఏ విధంగా భరిస్తున్నారు అని వైద్యులు ఆశ్చర్యపడ్డారు. వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని అప్పుడే వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కొద్ది వారాల కిందట ముంబయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది.     Pawan Kalyan, Surgery, Health Update, TeluguOne  
టాలీవుడ్‌లో విలక్షణమైన కథలతో, సరికొత్త జోనర్లతో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే యంగ్ హీరోలలో అక్కినేని నాగచైతన్య ఒకరు. లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలు, యాక్షన్ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను అలరించిన చైతూ.. ఇప్పటివరకు తన కెరీర్‌లో అడుగుపెట్టని ఒకే ఒక్క జోనర్ హారర్. ఇప్పుడు టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, నాగచైతన్య తన మొదటి హారర్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించే బాధ్యతను ఒక టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ అందుకోవడం విశేషం. కొంతకాలం క్రితం టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద 'మసూద' అనే చిన్న సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ సినిమా, ప్రేక్షకులను థియేటర్లలో భయపెట్టడమే కాకుండా భారీ వసూళ్లను సాధించి కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమై, మొదటి ప్రయత్నంలోనే టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన ప్రతిభావంతుడు సాయి కిరణ్. హారర్ ఎలిమెంట్స్‌ను ఎమోషన్స్‌తో జోడించి మసూద సినిమాను ఆయన నడిపించిన తీరుకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి. మసూద వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత దర్శకుడు సాయి కిరణ్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై పూర్తి శ్రద్ధ పెట్టారు. ప్రస్తుతం ఆయన మరో సరికొత్త హారర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ కొత్త కథ కూడా ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించేలా, మునుపెన్నడూ చూడని సరికొత్త సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగుతుందని టాక్. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత, దర్శకుడు సాయి కిరణ్ ఇటీవల అక్కినేని నాగచైతన్యను కలిసి కథను పూర్తిగా వివరించినట్లు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ సమాచారం. కథ విన్న చైతూ, సాయి కిరణ్ రాసుకున్న పాయింట్, అందులోని హారర్ ఎలిమెంట్స్ పట్ల పాజిటివ్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు నాగచైతన్య ఇంకా అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ఇతర కమిట్‌మెంట్లు, డేట్ల సర్దుబాటును పరిశీలించిన తర్వాతే చైతూ తన అంతిమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం.  నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో 'వృషకర్మ' అనే మిథికల్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత 'బెదురులంక' ఫేమ్ క్లాక్స్ డైరెక్షన్ లో ఒక సినిమా చేసే అవకాశముంది. ఆ సినిమాల డేట్స్ ని బట్టి మసూద డైరెక్టర్‌ ప్రాజెక్ట్ పై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ నాగచైతన్య ఈ కథకు ఓకే చెప్పి, ప్రాజెక్ట్ పట్టాలెక్కితే కనుక అక్కినేని అభిమానులకు ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఎందుకంటే చైతూ తన సుదీర్ఘ కెరీర్‌లో పూర్తిస్థాయి హారర్ జోనర్ సినిమా చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. 'మసూద' లాంటి జెన్యూన్ హారర్ హిట్‌ ఇచ్చిన దర్శకుడు, ఏసియన్ సినిమాస్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్, దానికి తోడు నాగచైతన్య లాంటి స్టార్ హీరో తోడైతే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఈ క్రేజీ కాంబినేషన్‌పై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.     Naga Chaitanya, Masooda Director, Horror Movie, TeluguOne  
అఖిల్ అక్కినేని నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ ఎట్టకేలకు శుక్రవారం థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.  ఈ మూవీ ఫస్ట్ డే అధికారిక కలెక్షన్ల పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ అఫీషియల్ పోస్టర్ ప్రకారం, 'లెనిన్' చిత్రం మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 16.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. మేకర్స్ ప్రకటించిన ఈ అఫీషియల్ గ్రాస్ వసూళ్లు అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ నింపాయి. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని ఊరమాస్ లుక్‌లో కనిపించి థియేటర్లలో ఈలలు వేయిస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు మాండలికంలో ఆయన చెప్పిన డైలాగులు, ఊరమాస్ యాక్షన్ సీక్వెన్సులు మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఎమోషనల్ సీన్స్ లోనూ తన నటనతో కట్టిపడేసాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ బోర్సే తన నటనతో, గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకోగా, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. 'లెనిన్' ప్రభంజనం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ఓవర్సీస్ మార్కెట్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు వంటి ఇతర పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. లాంగ్ రన్ లో ఈ సినిమా మరిన్ని భారీ వసూళ్లను సాధిస్తుందని డిస్ట్రిబ్యూటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  మొదటి రోజు వచ్చిన ఈ 16.7 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు, వీకెండ్ లో మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అఖిల్ అక్కినేని మాస్ మేకోవర్, పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ కంటెంట్ ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. మొత్తానికి మేకర్స్ వదిలిన ఈ డే 1 అఫీషియల్ కలెక్షన్ల పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.   https://x.com/AnnapurnaStdios/status/2075812269964111913
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం.  భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది.  భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది.  అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. కానీ కోడలిగా వచ్చిన ఆడపిల్లను బాధపెట్టే అత్తమామలు ఉంటే.. ఆ ఆడపిల్లల జీవితం నరకప్రాయంగా ఉంటుంది.  అయితే.. బాధపెట్టే అత్తమామలు ఉన్నారని, వివాహ బంధాన్ని తెంచుకుని వెళ్లలేరు చాలామంది అమ్మాయిలు,  బాధపెట్టే అత్తమామలతో  ఎలా ఉండాలో,  వాళ్లతో కలిసి ఎలా జీవించాలో లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు..  వీటి గురించి తెలుసుకుంటే.. మార్చాలని అనుకోకూడదు.. కొన్నిసార్లు  అత్తమామలు కోడళ్ల మీద ఒత్తిడిని, ఇబ్బందులను కలిగిస్తారు. బాధపెట్టే అత్తమామల గురించి చాలా మంది జోక్ గా చెప్తూ ఉంటారు. కానీ బాధపెట్టే అత్తమామలు ఉండటం జోక్ కాదు.. అది ఆడపిల్లలను చాలా బాధపెడుతుంది, చాలా ఒత్తిడిలోకి నెడుతుంది.  అలాంటి అత్తమామలు  మానసిక ప్రశాంతతను, వివాహ బంధాన్ని కూడా ప్రభావితం చేస్తారు. చాలా మంది కోడళ్లు తమ అత్తమామలు మారితే బాగుండు అని అనుకుంటారు. కానీ అత్తమామలు మారాలని,  వాళ్లను  మార్చాలని అనుకోవడం వ్యర్థం. అత్తమామలు ఏ విషయాల పట్ల బాధపెడతారో తెలిసినప్పుడు వాటి గురించి పట్టించుకోకుండా ఉండటమే  మంచిది. పరిమితులు..  బాధపెట్టే అత్తమామలు ఉన్నప్పుడు, ప్రతి కోడలు తన భర్త సహాయంతో  కొన్ని సొంత పరిమితులను నిర్దేశించుకుని, వాటికి కట్టుబడి ఉండడం  మంచిది. పరిమితులు ఏర్పాటు చేసుకున్నప్పుడు పెద్దవాళ్లు, అత్తమామలు మాట్లాడే ఏ మాటలు లేదా ప్రవర్తన పరిమితులను దాటి జీవితంలోకి తీసుకుని బాధపడే పరిస్థితి రాదు.   సమస్య, పరిష్కారం.. ఏదైనా సమస్యను పరిష్కరించే ముందు, దాని మూల కారణాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. అత్తమామల చెడు  ప్రవర్తన అకస్మాత్తుగా జరగదు. వారు ప్రతీదీ తమకు నచ్చినట్టుగా జరగాలని కోరుకోవడం, తమ భావాలను అదుపు చేసుకోలేకపోవడం, లేదా గతంలోని మానసిక గాయాలను మోయడం వంటి కారణాల వల్ల ఇది తరచుగా జరుగుతుంది. కొన్నిసార్లు, అత్తమామలు కోడలు పెరిగిన విధానాన్ని, కోడలి పుట్టింటి వారి పద్దతులను,  నియమాలను అగౌరవపరుస్తారు, మరికొన్ని సార్లు  స్వార్థపరురాలు అనే ట్యాగ్ వేసి  వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘిస్తారు, లేదా కుటుంబంలో కలహాలు సృష్టించి కోడలిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పద్ధతులను గుర్తించడమే కోడళ్లు అత్తారింట్లో బాధపెట్టే అత్తమామలతో కలిసి ఎలా జీవించాలనే విషయాన్ని అర్థమయ్యేలా చేస్తాయి.                                      *రూపశ్రీ.
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కొత్త వాతావరణం, కొత్త ఉపాధ్యాయులు, కొత్త తరగతులు మరియు కొత్త స్నేహితులు ఉత్సాహంతో పాటు ఆందోళనను కూడా కలిగిస్తాయి. చాలా మంది పిల్లలు మొదట్లో పాఠశాలలో తమకు ఎదురయ్యే విషయాలను, తమ మనసులోని విషయాలను  మనసు విప్పి చెప్పలేరు. అయితే తల్లిదండ్రుల బాధ్యత కేవలం పిల్లలను బడికి పంపడమే కాదు.. పిల్లల గురించి ఎన్నో విషయాలు తల్లిదండ్రులు ఆలోచించాలి. మరీ ముఖ్యంగా..  కొత్తగా స్కూల్ కు వెళ్తున్న పిల్లలను కొన్ని ప్రశ్నలు తప్పకుండా అడగాలి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. ప్రతిరోజూ పిల్లలను అడాగాల్సిన ప్రశ్నలు.. నచ్చిన విషయం.. ఈ రోజు పాఠశాలలో అన్నింటి కన్నా నీకు నచ్చిన విషయం ఏదని పిల్లలను అడగాలి.  ఈ ప్రశ్న పిల్లలో సానుకూల విషయాలను వెలికితీయడానికి సహాయపడుతుంది.  కొందరు పిల్లలు బడికి వెళ్లొచ్చిన తర్వాత మళ్లీ బడికి వెళ్లమని మారం చేస్తుంటారు. కానీ బడిలో వారికి నచ్చిన విషయాన్ని గుర్తు చేయడం వల్ల పిల్లలకు పాఠశాల పట్ల ఉత్సాహం పెరుగుతుంది.  అలాగే తల్లిదండ్రులు పిల్లలతో ఇలా మాట్లాడటం వల్ల పిల్లలు  స్వేచ్ఛగా మాట్లాడటం నేర్చుకుంటారు,  ఏ విషయాన్ని అయినా బెరుకు లేకుండా చెప్పగలుగుతారు. ఇది పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. పిల్లలకు ఏ విషయాల మీద ఆసక్తి ఉందో కూడా తల్లిదండ్రులకు అర్థం అవుతుంది. ఎవరితో ఆడుకున్నావు లేదా మాట్లాడావు అని అడగాలి.. పిల్లలు పాఠశాలలో ఎవరితో ఆడుకున్నారు, మాట్లాడారు అనే విషయాలు కొత్త స్నేహితుల గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.  పిల్లలకు సామాజిక అవగాహన అర్థం అవుతుంది. పిల్లలు బడిలో ఒంటరిగా ఉంటారా లేదా ఇతరులతో కలుస్తున్నారా,  ఎవరితో అయినా కలవడంలో  ఇబ్బంది ఫీలవుతున్నారా?  అనే విషయాలు అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులకు సహాయపడుతుంది. ఏదైనా భయం లేదా బాధ పెట్టే విషయం ఉందా అని అడగాలి.. కొందరు పిల్లలు స్కూల్ లో తోటి విద్యార్థుల వల్ల, ఉపాధ్యాయుల వల్ల బాధపడటం, భయపడటం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల పిలల్లు బడికి  వెళ్లాలంటే భయపడటారు.  ఈ కారణంగా చదువు మీద ఆసక్తి కూడా తగ్గిపోతుంది. పిల్లల భయాన్ని తగ్గించినప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు ఏం నేర్చుకున్నావని అడగాలి.. పిల్లలను  ఈ రోజు ఏం నేర్చుకున్నావని ప్రతి రోజూ అడిగితే వారికి ఏ విషయం పట్ల ఆసక్తి ఎక్కువ ఉందో అర్థమవుతుంది. తద్వారా పిల్లలను ప్రోత్సహించడంలో తల్లిదండ్రులకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇలా అడిగినప్పుడు పిల్లలు అన్ని చెబుతూ ఉంటే.. పిల్లలలో జ్ఞాపకశక్తి,  వారిలో బావ వ్యక్తీకరణ వంటివి మెరుగు పడతాయి.                          *రూపశ్రీ.
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు,  గొడవలు, అతిగా స్పందించడం, జోక్యం చేసుకోవడం వంటివి కూడా గతంలో కంటే ఎక్కువగా పెరిగాయని చెప్పవచ్చు. వీటి వల్ల బంధాల మధ్య దూరం పెరుగుతుంది. అయితే నేటికాలంలో బంధాలు బలంగా ఉండాలంటే మైక్రో ప్రైవసీ పాటించాలట. ఇంతకీ మైక్రో ప్రైవసీ అంటే ఏంటి? ఇది బంధాలను బలంగా ఉంచడంలో ఎలా సహాయపడుతుంది? తెలుసుకుంటే.. మైక్రోప్రైవసీ.. మైక్రో-ప్రైవసీ అనేది నేటికాలంలో సంబంధాల గురించి జాగ్రత్త చేసే ఒక మార్గం. సంబంధంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికీ కొంత పర్సనల్ స్పేస్  అవసరమని ఇది చెబుతుంది. ఈ స్పేస్  వ్యక్తికి మానసిక స్వేచ్ఛను అందిస్తుంది , సంబంధం భారంగా మారకుండా నివారిస్తుంది. ప్రేమ అంటే ప్రతీదాన్నీ నియంత్రించడం కాదని, ఒకరి హద్దులను మరొకరు గౌరవించుకోవడం కూడా అని మైక్రో ప్రైవసీ నొక్కి చెబుతుంది. మైక్రో-ప్రైవసీ సంబంధాలలో ఒక బాలెన్స్ ను క్రియేట్ చేస్తుంది.  దీనివల్ల ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నా ఎవరి ఐడెంటిటీ వారికి ఉంటుంది. మైక్రో ప్రైవసీలో అసలు అర్థం.. మైక్రోప్రైవసీలో ఉండే  ముఖ్యమైన అంశం  భాగస్వామి లేదా కుటుంబ సభ్యుని  పర్సనల్ ఫీలింగ్స్ ను, పర్సనల్  సమయాన్ని గౌరవించడం. ఎప్పుడూ వారితో టచ్‌లో ఉండటం లేదా ప్రతి కదలికను గమనించడం అనేది  సంబంధాలను బలహీనపరుస్తుంది. దానికి బదులుగా, ఒకరికొకరు కొంత స్వేచ్ఛను ఇచ్చుకుంటూ, ఒత్తిడి లేకుండా సంబంధాన్ని కొనసాగించడం ముఖ్యం. అతిగా డిపెండ్ అవడాన్ని, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ను నియంత్రణలో ఉంచడంలో కూడా మైక్రో ప్రైవసీ సహాయపడుతుంది. మైక్రో ప్రైవసీ ఎందుకు అవసరం.. మైక్రో ప్రైవసీ  సంబంధాలలో నమ్మకాన్ని, అర్థం చేసుకునే తత్వాన్ని పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరికి  వారి స్వంత సమయం, స్పేస్  ఉన్నప్పుడు, వారు మానసికంగా మరింత ప్రశాంతంగా, బాలెన్స్డ్ గా  ఉంటారు. ఇది సంబంధాలలో అనవసరమైన ఒత్తిడిని తగ్గించి ఎక్కువ కాలం బంధాలు పదిలంగా ఉండేలా చేస్తుంది. మైక్రో ప్రైవసీ పాటించే వ్యక్తులు తమ ఐడెంటిటీని కూడా కోల్పోకుండా ఉంటారు.  ఒకరి ముందు ఒకరు తక్కువ కాదు అనేలా బందాలు ఉంటే.. ఆ బంధాలు ఎన్నేళ్ళైనా పదిలంగా ఉంటాయి. ఇలా  చేయాలి.. భార్యాభర్తలలో ఎవరో ఒకరు అప్పుడప్పుడు ఒంటరిగా సమయం గడపాలని, అభిరుచులను కొనసాగించాలని, లేదా స్నేహితులతో సమయం గడపాలని కోరుకున్నప్పుడు, వారికి అంతరాయం కలిగించకుండా లేదా ప్రశ్నించకుండా వారి ఇష్టాలను గౌరవించడం, వారి అభిరుచులను కొనసాగించడంలో మద్దతు ఇవ్వడం వంటివి మైక్రో ప్రైవసీకి చక్కని ఉదాహరణ.  ఇది ఈ రోజు కొత్తగా  చెప్పాల్సిన విషయమేమీ కాదు.. కానీ కొందరికి అర్థం కావాలంటే కొన్ని ప్రత్యేక మార్గాలలో చెప్పాలి. అందుకే దీన్ని మైక్రో ప్రైవసీ అంటున్నారు.  ఈ మార్గాన్ని పాటిస్తే బంధాలు పదిలంగా ఉంటాయి.                                  *రూపశ్రీ.
మెనోపాజ్ (Menopause) వచ్చిన తర్వాత మళ్లీ బ్లీడింగ్ రావడం సాధారణ విషయం కాదు. చాలా మంది మహిళలు దీనిని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది కొన్ని సందర్భాల్లో గర్భసంచి క్యాన్సర్ (Endometrial Cancer / Uterine Cancer) కు తొలి హెచ్చరిక కావచ్చు.  ఈ వీడియోలో ప్రముఖ గైనకాలజిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్నేహా సాగర్ గారు గర్భసంచి క్యాన్సర్ గురించి ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను చాలా సులభంగా వివరించారు.  ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు:  ✅ మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ రావడానికి కారణాలు ఏమిటి? ✅ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే ఏమిటి? ✅ గర్భసంచి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఏమిటి? ✅ ఎవరికి ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ? ✅ ఎప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి? ✅ బయాప్సీ ఎందుకు అవసరం? ✅ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో ఎలా గుర్తిస్తారు? ✅ శస్త్రచికిత్స (Surgery), కీమోథెరపీ (Chemotherapy), రేడియేషన్ థెరపీ (Radiation Therapy) వంటి చికిత్సల గురించి పూర్తి వివరాలు.  ప్రారంభ దశలో గర్భసంచి క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స విజయవంతంగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మెనోపాజ్ తర్వాత ఎలాంటి బ్లీడింగ్ వచ్చినా ఆలస్యం చేయకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం ఎంతో ముఖ్యం. 
టీ లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బ్లాక్ టీ మాత్రమే కాకుండా..  గ్రీన్ టీ తో పాటు కుంకుమ పువ్వు  టీ,  కార్శీరీ ఖవ్వా టీ,  జాస్మిన్ టీ.. ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు బరువు తగ్గడంలో సహాయపడతాయని చెబుతారు.  ఇవన్నీ మొన్నటి వరకు ట్రెండ్ అయినవే. అయితే ఇప్పుడు మరొక కొత్త టీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.  పైగా బరువు తగ్గడం కోసం సెలబ్రిటీలు గ్రీన్ టీకి స్వస్తి చెప్పి ఈ కొత్త రకం టీ ను ఉపయోగిస్తున్నారని చెబుతారు. అసలు ఈ మాచా టీ ఏమిటి? దీన్నితాగడం వల్ల బరువు ఎలా తగ్గుతారు? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. మచా టీ.. సాధారణ గ్రీన్ టీని కేవలం ఆకులను  మరిగించిన నీటిలో వేడయం  ద్వారా తయారుచేస్తారు, అయితే మాచా అనేది మొత్తం ఆకులను పొడిగా తయారు చేసి దాన్ని  నీటిలో కలిపి తయారు చేసే టీ... ఈ కారణంగానే గ్రీన్ టీ కంటే మాచా ఎక్కువ ప్రయోజనకరమైనదిగా ఉంటందని చెబుతారు. సెలబ్రిటీలకు ఫేవరేట్ ఎందుకంటే.. మాచా గురించి అందరికీ తెలియడానికి కారణం.. ఈ టీను సెలబ్రిటీల నుండి సోషల్ మీడియాలో ఎంతో మంది దీన్ని తమ ఆరోగ్యం కోసం తాగుతున్నారు.  ఎందుకంటే మాచాలో కేటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా EGCG ఉంటాయి, ఇవి శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. మాచా  శరీరం కేలరీలను బర్న్ చేసే  సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని అనేక నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా, మాచాలో కెఫీన్ , ఎల్-థియానైన్ ఉంటాయి, ఇవి మనసును ప్రశాంతపరిచి శక్తిని అందిస్తాయి. అందుకే ఇప్పుడు చాలా మంది ఉదయం పూట టీ , కాఫీకి బదులుగా మాచా తాగడానికి ఇష్టపడుతున్నారు. మాచా బరువు తగ్గడానికి సహాయపడుతుందా?  బరువు తగ్గడానికి మాచా నిజంగా సహాయపడుతుందా అని  చాలామంది సందేహపడుతూ ఉంటారు.  అయితే మాచా అనేది అకస్మాత్తుగా బరువును తగ్గించే  మ్యాజిక్ డ్రింక్ ఏమీ కాదని ఆహార నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మాచా తాగినా లేదా బరువు తగ్గించే మరే ఇతర పానీయం తాగినా, అవి బరువు తగ్గడంలో మాత్రమే సహాయపడగలవు. కేవలం వాటిని తాగడం ద్వారా బరువు తగ్గేంత బలమైన ప్రభావం వాటికుండదు. అంటే.. ఆహారంపై శ్రద్ధ పెట్టకుండా , వ్యాయామం చేయకుండా కేవలం ఈ పానీయాలపై మాత్రమే ఆధారపడటం వల్ల బరువుపై ఎటువంటి ప్రభావం ఉండదని అంటున్నారు.                                                 *రూపశ్రీ.