LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారపగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయ్యింది. మరో మూడేళ్లలో మళ్లీ ఎన్నికలు రానున్నాయి. అయితే ముందస్తుగానే రాష్ట్రంలో రాజకీయ వేడి పీక్స్ కు చేరింది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా అన్న రేంజ్ లో  పొలిటికల్ హీట్ ఉంది. రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.   తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై  వైసీపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. అయితే.. అదే సమయంలో  వైసీపీ ఈ రెండేళ్లలో ఇసుమంతైనా పుంజుకోలేదన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాని, ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించడంపై జన సామాన్యంలో కూడా అసంతృప్తి వెల్లువెత్తుదోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ సీఎంను అవుతానంటూ ధీమాగా ప్రకటనలు గుప్పిస్తున్న జగన్ పొలిటికల్ ఫ్యూచర్ పై రాజకీయ పండితులు, పరిశీలకులు ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు.  ప్రస్తుత పాలనలోని కొన్ని అంశాలను తటస్థ వేదికలపై విమర్శించే విశ్లేషకులు సైతం..  రాబోయే ఎన్నికలలో వైపీపీ విజయం సాధించి అధికారంలోకి రావడం సాధ్యమేనా అంటే ఔనని చెప్పలేమంటున్నారు.   వైసీపీకి ఏ మాత్రం సానుకూల పరిస్థితి లేదని, వైసీపీ పుంజుకుని జగన్ మళ్లీ సీఎం అవ్వడం సులువు కాదని ఎలాంటి శషబిషలూ లేకుండా చెబుతున్నారు.  సాధారణంగా  పబ్లిక్ ఒపీనియన్ ను ప్రభావితం చేయడంలో పొలిటికల్ అనలిస్టుల పాత్ర కీలకంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా తటస్థ అనలిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా చూసినా తటస్థ విశ్లేషకులు సైతం వైసీపీ తీరుపై పెదవి విరుస్తున్నారు. వైసీపీ అసెంబ్లీ బహిష్కరణ ఆ పార్టీ చేసుకున్న సెల్ఫ్ గోల్ గా అభివర్ణిస్తున్నారు.   ప్రభుత్వ వైఫల్యాలు లేదా లోపాలను ఎత్తిచూపుతూనే విశ్లేషకులు  వైఎస్సార్సీపీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు మృగ్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.  గతంలో  అంటే 2014 నుండి 2019 మధ్యకాలంలో   తెలుగుదేశం   అధికారంలో ఉన్న సమయాన్ని గుర్తుచేసుకుంటే, నాటి రాజకీయ వాతావరణం వైసీపీకి   సానుకూలంగా ఉండేది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న  వైసీపీ . ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయడం, బలమైన మీడియా మద్దతు లభించడం మరియు అప్పటి జాతీయ సమీకరణాలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారాయి. ఆ కాలంలో ప్రతిపక్షంలో ఉన్న తీవ్రమైన దూకుడు, ప్రభుత్వ నిర్ణయాలను నిలదీసే నైతిక బలం జగన్ వైపు స్పష్టంగా కనిపించాయి. అంతేకాకుండా, 2014-2019 మధ్యకాలంలో నాటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మేధావులు, రిటైర్డ్ అధికారులు, తటస్థ విశ్లేషకులు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. ఉదాహరణకు, నాటి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టిన పలువురు ప్రముఖులు, ఐఏఎస్ అధికారులు మరియు ఇతర రంగాల ప్రముఖులు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని బహిరంగంగానే  చెప్పారు.   అయితే, 2019 నుండి 2024 వరకు సాగిన ఐదేళ్ల  జగన్ పాలన తరువాత   పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆయన అధికారంలో ఉండా తీసుకున్న  వివాదాస్పద నిర్ణయాలు, పాలనా విధానాలు విధానాల కారణంగా ప్రజా వ్యతిరేకత అధికమైంది. అదే 2024 ఎన్నికలలో ప్రభుత్వ పతనానికి కారణమైంది. అన్నిటికీ మించి మూడు రాజధానులు, బాబాయ్ గొడ్డలి పోటు, మద్యం కుంభకోణం వంటి అంశాలు జగన్ క్రెడిబులిటీని కోలుకోలేనంతగా దెబ్బతీశాయి.   ఆ తరువాత అధికారం కోల్పోయిన తరువాత జగన్ ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితం కావడం, వారానికోసారి చుట్టపు చూపుగా రాష్ట్రానికి వచ్చినా తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా సమావేశాలతో సరిపెట్టేయడం వంటివి పార్టీ శ్రేణులలో నిరుత్సాహానికి కారణమయ్యాయి. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు నామమాత్రమయ్యాయి.  అన్నిటికీ మించి అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి పుంజుకోవడానికి కావలసిన రాజకీయ వ్యూహాలు, ప్రజా విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నాలు జగన్ నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ జరగలేదు. దీంతో పార్టీ ఇమేజ్ రోజురోజుకూ మసకబారుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విధానాలను విమర్శించే మేధావులు కూడా వైసీపీకి అనుకూలంగా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది.    Can Jagan Become CM Again, AP politics, YS Jagan Mohan Reddy, YCPs Future, AP elections, Telugu One
తెలంగాణ కాంగ్రెస్ లో  ఇటీవలి కాలంలో పెను సంచలనం సృష్టించిన కొండా సురేఖ ఎపిసోడ్ కు లాజికల్ కంక్లూజన్ దిశగా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తున్నది.  పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించారనే ఆరోపణలపై కొండా సురేఖపై చర్యలకు సిఫారసు చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.  అయితే రక్షాబంధన్ రోజున కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి అప్పాయింట్ మెంట్ తీసుకుని మరీ ఆయనతో భేటీ అవ్వడం, రాఖీ కట్టడం తెలిసిందే. ఆ తరువాత రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించిన ఆమె.. తన కుమార్తె  వ్యాఖ్యలతో తనకు ఎటువంటి సంబంధం లేదని క్లియర్ కట్ గా, క్లారిటీ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే కొండా సురేఖపై వేటు విషయంలో పార్టీ హైకమాండ్ వైఖరి మారిందని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది.    పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు ఆమెపై చర్య తీసుకోవడం ఖాయమే అని చెబుతూనే.. త్వరలో రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆమెకు ఉద్వాసన చెప్పడం కాకుండా.. రాజీనామా కోరాలని హైకమాండ్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.  మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టి కొత్తవారికి అవకాశం   పేరుతో కొండా సురేఖను రాజీనామా చేయాల్సిందిగా సూచించేందుకే హైకమాండ్ భావిస్తోందంటున్నారు. ఏది ఏమైనా రానున్న రెండు రోజుల్లో  ఈ విషయంపై క్లారిటీ వస్తుందని అంటున్నారు.   [Congress High Command Softcorner on Konda Surekha, Telangana Congress, CM Revanth, Cabinet Expanssion, Telugu One] 
వైసీపీ అధినేత జగన్.. తన వ్యాఖ్యలతో పార్టీకి కలిగిన నష్టాన్ని నివారించేందుకు బొత్స రంగంలోకి దిగారు. నష్ట నివారణ కోసం ఆయన జగన్ వ్యాఖ్యలకు కొత్త భాష్యం చెప్పారు.  స్థానిక ఎన్నికలలో ఏకగ్రీవాలు ఉండడానికి వీల్లేదన్న జగన్ ఆదేశాలకు భిన్నంగా, బొత్స సత్యనారాయణ స్థానిక ఎన్నికలలో  ఏకగ్రీవాలు రెండు రకాలుగా ఉంటాయంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.  వాటిలో ఒకటి.. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం వాటిని ప్రోత్సహించడం. మరొకటి, రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలను నిర్వహించడమంటూ బొత్స చెప్పిన భాష్యంపై నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. ఇక వైసీపీ వర్గాలైతే.. అసలు బొత్స చెప్పిందేంటో అర్ధం కాక తలలు పగలకొట్టుకుంటున్నారు. ఇంతకీ బొత్స చెప్పినదేంటంటే.. జగన్ ఆదేశించినంత మాత్రాన ఏకగ్రీవాలు జరగకుండా పోవని, అంటే పార్టీ అధినేత మాటను ఆయన ఖండిచారన్న మాట.  ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.   ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల ప్రతినిధులకు తదుపరి ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు దక్కవంటూ జగన్ చేసిన హెచ్చరిక నేపథ్యంలో బొత్స వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  అలాగే.. తాజాగా వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిపై కూడా బొత్స విరుచుకుపడ్డారు. విజయసాయిని ఆయన మరో కేఏపాల్ గా అభివర్ణించారు. విజయసాయి.. నోటికి వచ్చినట్లు మాట్లాడతారనీ, ఆయన మాటలకు ఇసుమంతైనా విలువ ఉండదని బొత్స అన్నారు.   అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చన్న స్పీకర్ హెచ్చరికపై.. తనదైన శైలిలో సవాల్ విసిరారు... నిజంగా స్పీకర్ కు ఆ అధికారం ఉంటే రద్దు చేసుకోవచ్చన్నారు. సభ్యత్వాలు రద్దు చేస్తే.. వైసీపీ రాజ్యాంగ బద్ధంగా పోరాడుతుందన్నారు.   [Botsa New Interpretation on  Jagan Comments, Botsa, YS Jagan Mohan Reddy, YCP Unanimous Elections, Localbodies,   AP Politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా, వైవిధ్యమైన నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జీవీ ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన మ్యూజిక్ అందించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ, తన వ్యక్తిగత జీవితంపై చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గాయని సైంధవితో పెళ్లి బంధం ముగిసినప్పటికీ, వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి జీవీ ప్రకాష్ తొలిసారిగా మనసు విప్పి మాట్లాడారు. తమ మధ్య వైవాహిక జీవితం ముగిసినంత మాత్రాన శత్రువులుగా మారాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన స్కూల్ ఫ్రెండ్స్ కావడం వల్ల ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం ఎప్పటికీ తగ్గిపోదని తెలిపారు. అందుకే విడాకులు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ మంచి మిత్రులుగా రిలేషన్ మెంటైన్ చేస్తున్నామని సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా తమ ముద్దుల కూతురు అన్వి బాధ్యతల గురించి కూడా జీవీ ప్రకాష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ కూతురు అన్వి తన ప్రాణమని, ఆమె భవిష్యత్తు కోసం ఇద్దరం బాధ్యతగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. జీవితంలో సైంధవి, అన్వి ఇద్దరూ తనకు ఎంతో కీలకమైన వ్యక్తులని, ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవించుకుంటూ పాప పెంపకం విషయంలో కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇదివరకు తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ఆదర్శవంతమైన జంటగా పేరొందిన జీవీ ప్రకాష్, సైంధవిలు ఒకరినొకరు ప్రేమించుకుని 2013లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 11 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత మనస్పర్థల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించారు. విడిపోయిన సమయంలో మీడియాలో రకరకాల రూమర్లు వచ్చినప్పటికీ, వారు ఎంతో పరిణతితో వ్యవహరించారు. సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న జీవీ ప్రకాష్ కుమార్, తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు స్వరాలు అందించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మేనల్లుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన, మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా హీరోగా కూడా వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం జీవీ ప్రకాష్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ నడుస్తోంది. విడిపోయినా కూతురి కోసం ఎంతో మెచ్యూర్డ్‌గా కో-పేరెంటింగ్ చేస్తున్నారని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు నెటిజన్లు మాత్రం అంత మంచి బాండింగ్ ఉన్నప్పుడు విడిపోవడం ఎందుకంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా జీవీ ప్రకాష్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.     [GV Prakash Kumar, Saindhavi Divorce, GV Prakash Wife, Tamil Music Director, Entertainment News Telugu]
ఎస్ఆర్‌డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వేట’. సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీని సోమవారం (ఆగస్ట్ 31) నాడు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాలకు కొణిదెల నాగబాబు, కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్‌కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.  ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందజేయగా.. కేఎస్ రవి కుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్‌కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో మెహర్ రమేష్, యదు వంశీ, అనుదీప్ దేవ్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో.. హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో అందరికీ పరిచయం అయ్యాను. ఈ రోజు మా కొత్త సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన నాగబాబు గారికి, ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘వేట’ అనేది చిరంజీవి గారి టైటిల్. మాఈ కథకి ఈ టైటిల్ యాప్ట్‌గా ఉంటుంది. మా సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. కేఎస్ రవి కుమార్ మాట్లాడుతూ .. ‘డైరెక్టర్ అశోక్ గారు ‘వేట’ కథని నాకు కాల్‌లో వివరించారు. కథ నాకు అద్బుతంగా అనిపించింది. అందరూ కొత్త వాళ్లు కలిసి పని చేస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో ఊర్లో పెద రాయుడు టైపు పాత్ర నాది. నా కారెక్టర్ నాకు నచ్చింది. జెన్ జీ ఆడియెన్స్‌కి కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఈ మూవీ బిగ్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. దర్శకుడు అశోక్ కోటిపల్లి మాట్లాడుతూ .. ‘‘వేట’ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన నాగబాబు గారికి, ఇతర అతిథులందరికీ ధన్యవాదాలు. ఇదే నా మొదటి సినిమా. కథ చెప్పిన వెంటనే కేఎస్ రవి కుమార్ గారు అంగీకరించారు. ఈ సినిమాతో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, ఈటీవీ విన్ టీంకు థాంక్స్’ అని అన్నారు. నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ .. ‘‘ఈటీవీ విన్‌తో కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్ట్. సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్నారు. కేఎస్ రవి కుమార్ మా సినిమాలో గొప్ప పాత్రను పోషించనున్నారు. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేస్తున్న కల్కి రాజా గారికి థాంక్స్. మాకోసం వచ్చిన నాగబాబు గారు, సాయి రాజేష్ గారు, మెహర్ రమేష్ గారు, వీఎన్ ఆదిత్య గారు, ఎస్‌కేఎన్ గారికి థాంక్స్. నా సినీ జర్నీలో సపోర్ట్ చేస్తున్న నిహారిక గారికి థాంక్స్. ‘కమిటీకుర్రోళ్లు’ చిత్రంలానే ఇది కూడా ఓ గ్రామీణ కథ. అశోక్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. సినిమా ఎంతో సహజంగా ఉంటూనే కమర్షియల్ పంథాలో ఉంటుంది’ అని అన్నారు. సాత్విక మాట్లాడుతూ .. ‘‘మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘వేట’ సినిమా నా కెరీర్‌లో గొప్ప ప్రారంభంగా మారుతుందని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
The teaser of Kurma Avatar attempts something more ambitious than a conventional mythological film. Starring Shiva Rajkumar, Varalaxmi Sarathkumar, Raj Tharun, Shivaji and Sai Kumar, the film combines the mythology surrounding Lord Vishnu’s Kurma Avatar with a contemporary conflict involving the rise of demonic forces on Earth. Sai Kumar’s narration establishes the central idea of the teaser, explaining the presence of Lord Vishnu within every human while setting up the threat of a powerful demon king. Instead of presenting the mythology in isolation, director Harsha Vardhan Kadiyaala appears to have built a story around the idea of evil taking over the present-day world and Vishnu returning to restore balance. Shiva Rajkumar is easily the biggest highlight of the teaser. He is introduced in a striking yogi look before being linked to the Kurma Avatar, creating curiosity around how his character fits into the larger conflict. The actor’s screen presence gives the teaser the weight it needs, particularly in the more intense moments. The teaser also deliberately keeps the characters played by Varalaxmi Sarathkumar, Raj Tharun and Shivaji under wraps. Their appearances suggest that each of them has an important place in the story, but very little is revealed about their actual roles. That restraint helps the teaser build curiosity rather than explain the entire premise. Visually, Kurma Avatar stands out for the scale of its world-building. The VFX-heavy imagery, grand sets and Ajaneesh Loknath’s background score create the larger-than-life mythological atmosphere the concept demands. More importantly, the idea of taking the Kurma Avatar mythology and placing it against a conflict rooted in the modern world gives the film a distinct hook. The teaser looks like a promising attempt to combine mythology, fantasy and commercial thrills without revealing too much before the theatrical release. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  భాగ్యశ్రీ బోర్స్ ని చూస్తే చాలు 'అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా అని పాడని వాళ్ళు ఉండరు. అలాంటిది అభిమానుల గుండెలో ఎంతటి కవిత్వం తన్నుకొస్తూ ఉంటుందో చెప్పక్కర్లేదు. కళ్ళతోనే తన క్యారక్టర్ భావజాలం మొత్తాన్ని చెప్పేసే ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా అఖిల్ అక్కినేని తో కలిసి 'లెనిన్' తో విజయాన్ని అందుకుంది. భాగ్యశ్రీకి తొలి విజయం కూడా..  లెనిన్  విజయం తర్వాత భాగ్యశ్రీ కి టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తాయని అందరూ భావించారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఏ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఈ ఆలస్యానికి వెనుక ప్రధాన కారణం భాగ్యశ్రీ స్క్రిప్ట్ ఎంపికలో చూపిస్తున్న జాగ్రత్తలేనని, తొందరపడి సినిమాలు ఒప్పుకోవడం కంటే, బలమైన క్యారెక్టర్స్ ఉన్న ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని  భావిస్తోందట.  Also Read: రీ రిలీజ్ బాక్సాఫీస్ సునామీ: వామ్మో అడ్వాన్స్ బుకింగ్ లో అన్ని కోట్లా! ఇండస్ట్రీ వర్గాల్లో తాజాగా వినిపిస్తున్న ప్రకరాం రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్ట్స్ లో చరణ్ కి జోడిగా భాగ్యశ్రీ కనిపించబోతుందనే సమాచారం అయితే వినిపిస్తూనే ఉంది. అదే జరిగితే టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ పోస్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఖాళీ లేనట్టే.    [ Bhagyashri Borse , Ram Charan, Sukumar, Akhil Akkineni, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]        
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో చోటుచేసుకున్న అంతర్గత విభేదాలు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ నాయకత్వంలో మెజారిటీ సభ్యులు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుత అసోసియేషన్ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య సుమలత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యూనియన్‌లో చిచ్చుపెట్టేందుకు చూస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. సోమవారం మీడియా ముందుకు వచ్చిన సుమలత, ఫిల్మ్ ఫెడరేషన్ వైఖరిని అలాగే రఘు మాస్టర్ వర్గం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా ఖండించారు. తమ అసోసియేషన్‌కు ఏ నిబంధన ప్రకారం ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేస్తోందో సూటిగా ప్రశ్నించారు. అసోసియేషన్‌ను రెండు ముక్కలు చేయాలని ఎవరు చూసినా, అలాంటి వారిని నడిరోడ్డుపై నిలబెట్టి కొడతామంటూ చాలా ఘాటుగా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం నిర్వహించిన అడ్ హాక్ కమిటీ సమావేశం ఎంతమాత్రం చెల్లదని సుమలత స్పష్టం చేశారు. ఆ కమిటీలో ఉన్న కొందరు సభ్యులు గతంలో అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయినవారేనని ఆమె ఆరోపించారు. 35 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న తమ యూనియన్‌ను ముక్రాజ్ మాస్టర్ ఎంతో శ్రమించి స్థాపించారని, ఎవడో ఒక ఫ్రాడ్ చేసిన వ్యక్తి వచ్చి అడ్ హాక్ కమిటీ వేస్తామంటే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. గతంలో తమ అసోసియేషన్ తరఫున నిర్వహించిన ఉపఎన్నికలు చట్టబద్ధంగానే జరిగాయని ఆమె సమర్థించుకున్నారు. 500 మంది ఉన్న యూనియన్‌లో 114 మంది ఓటు వేసినా అది ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల ప్రక్రియే అవుతుందని, చట్టపరమైన నిబంధనలకు కట్టుబడి మాత్రమే తాము ముందుకు వెళ్తున్నామని వివరించారు. లీగల్‌గా తమ కమిటీకే అన్ని అధికారాలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ఇటీవలే ఫెడరేషన్ సహాయ నిరాకరణ, జానీ మాస్టర్ సస్పెన్షన్ పొడిగింపు వార్తల మధ్య రఘు మాస్టర్ కు శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వంటి ప్రముఖ కొరియోగ్రాఫర్లు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఫెడరేషన్ తీరు మారకపోతే తాము కూడా ప్రత్యమ్నాయ చర్యలకు వెనుకడమని సుమలత తేల్చిచెప్పారు. డ్యాన్సర్ల ప్రయోజనాలు కాపాడేందుకు తాము ఎంత దూరమైనా వెళ్తామని సుమలత స్పష్టం చేయడంతో ఈ వివాదం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఒకవైపు ఫెడరేషన్ మద్దతుతో రఘు మాస్టర్ వర్గం ముందుకు వెళ్తుంటే, మరోవైపు సుమలత చట్టపరమైన హెచ్చరికలతో తిరుగుబాటు చేయడం వల్ల ఈ అసోసియేషన్ సంక్షోభం రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.       [Sumalatha Jani, Jani Master Wife, TFTDDA Dispute, Raghu Master Dancers Union, Tollywood Film Federation]
Shree Radha Damodar Studios (SRD Studios) and ETV WIN Originals have officially launched their third production, ‘VETA’, with a pooja ceremony. Directed by Ashok Kotipalli, the film stars Sandeep Saroj and Satwika Jampa in the lead roles. The title and first look at the world of the film introduce an untold tale from the heartlands of Godavari, promising a raw, rustic world of love and pain. Chief Guest Konidela Nagendra Babu participated in the ceremony and handed over the script to the team. K.S. Ravi Kumar performed the clap, while Sai Rajesh, SKN, VN Aditya and producer Phani Adapaka switched on the camera. Directors Meher Ramesh and Yadhu Vamsee, along with music director Anudeep Dev, also attended the ceremony and extended their support to the team. Speaking at the event, K.S. Ravi Kumar revealed that director Ashok Kotipalli had narrated the story to him over WhatsApp around 15 days earlier. He recalled how Ashok explained the characters, scenes and dialogues with expressions and emotion while narrating the story. His narration made such an impression that even his wife, who happened to see part of it, asked him whether he had agreed to do the film. He said he came to the pooja along with his wife and wished the entire team, particularly Ashok Kotipalli, the producers and the new lead pair. He said he could not reveal anything about his character because of the suspense surrounding it, but added that he liked the character and found the film’s line different. He also joked that his Telugu would become better after the film because he has a lot of dialogues in it. Tanmai N, Creative Producer at ETV WIN, thanked the print, electronic and social media representatives for attending the event. He spoke about VETA being the second project with Sandeep Saroj for ETV and the first project for SRD Studios, while noting the recognition already achieved by the team associated with Committee Kurrollu. He said the team is attempting to explore a genre that they believe will connect with Telugu audiences and added that more updates from ETV WIN will follow. Producer Phani Adapaka introduced VETA as the third production from ETV WIN and SRD Studios and thanked the guests, media, influencers and the entire team for their support. He expressed particular gratitude to Niharika Konidela, recalling their association with Committee Kurrollu, which went on to receive a National Award, and thanked her for continuing to support and encourage him in his journey as a producer. He also expressed his heartfelt gratitude to Nagendra Babu, describing him as someone who has guided him throughout his journey in cinema and encouraged him to make films with confidence. Speaking about VETA, he said that, like Committee Kurrollu, it is rooted in a village setting and carries the kind of emotional quality that can connect strongly with audiences. He said Ashok Kotipalli’s writing impressed him and that after hearing the story, he felt it was one that they had to make. He stressed that VETA is not merely a rural story, but a very commercial film with a natural village backdrop. He revealed that Sandeep Saroj will be seen in a completely different space, as a commercial hero with aggressive action and substantial fight sequences. He wished *Sandee*p the very best for taking up the new role and expressed confidence in the film. Sandeep Saroj thanked Nagendra Babu and all the guests for attending and blessing the team. He spoke about his journey following Committee Kurrollu and his continuing association with ETV WIN and SRD Studios. Addressing the title, he clarified that VETA was not chosen simply because it was once associated with a Chiranjeevi film. He said the title is genuinely apt for the story, and what exactly the “hunt” in VETA refers to will become clear as further updates are released. Satwika Jampa described getting the opportunity to be part of VETA as something very special and said she considers it an important step in her career. She expressed her happiness at working with such a strong team and said she is excited to work with director Ashok Kotipalli, co-star Sandeep Saroj, SRD Studios and ETV WIN, while learning through the process and contributing to a good film. Director Ashok Kotipalli, making his directorial debut with VETA, thanked everyone who attended the ceremony, including Nagendra Babu, Sai Rajesh, SKN and Meher Ramesh. He thanked K.S. Ravi Kumar for immediately accepting his story and expressed his gratitude to producer Phani Adapaka, Kalki Raja and the ETV WIN team for giving him the opportunity to make his first film as a director. He assured that more updates about VETA will follow. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య ఉండే స్నేహసంబంధాలు, ఒకరికొకరు చూపించే మద్దతు ఎప్పుడూ ప్రత్యేకమే. ముఖ్యంగా తోటి నటులకు కష్టకాలంలో లేదా అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పుడు స్టార్ హీరోలు సైతం ముందుకెళ్లి సహాయం చేస్తుంటారు. తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు సాయికుమార్ వెల్లడించిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ తన కోసం ఏకంగా బాడీ డబుల్‌గా ఎలా మారారో ఆయన స్వయంగా పంచుకున్నారు. ఓ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న సాయికుమార్, గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని బయటపెట్టారు. గతంలో తాను, శివరాజ్ కుమార్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేశామని, దాన్ని రెండు భాషల్లో వేర్వేరుగా తెరకెక్కించారని తెలిపారు. కన్నడలో శివన్న హీరోగా నటించగా, తెలుగు వెర్షన్‌లో సాయికుమార్ ప్రధాన పాత్ర పోషించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఘటన తమ బంధాన్ని మరింత బలపడేలా చేసిందని ఆయన పేర్కొన్నారు. మురుడేశ్వర్‌లో ఒక భారీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో సాయికుమార్‌కు అనుకోకుండా ప్రమాదం జరిగింది. ఆవేశంగా చేస్తున్న ఒక షాట్‌లో ఆయన కింద పడిపోవడంతో ముక్కుకు తీవ్ర గాయమై రక్తం వచ్చింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి కుట్లు వేయించుకుని తిరిగి లొకేషన్‌కు చేరుకున్నారు. ఆయన పరిస్థితిని చూసి శివరాజ్ కుమార్ ఎంతో ఆందోళన చెందారు. అయితే ఆ సమయంలో నిర్మాత అందుబాటులో లేకపోవడంతో దర్శకుడు షూటింగ్ ఆపడానికి ఇష్టపడలేదు. సినిమాలో విలన్‌గా నటిస్తున్న ఆశిష్ విద్యార్థిని సాయికుమార్ కొట్టే ఒక కీలకమైన క్లోజప్ షాట్ తీయాల్సి ఉంది. ఆ షాట్ కథకు చాలా ముఖ్యమని ఫైట్ మాస్టర్ రామ్ శెట్టి చెప్పినా, ముఖానికి ఉన్న గాయం కారణంగా సాయికుమార్ ఆ షాట్ చేయడానికి ఇబ్బంది పడ్డారు. తన పరిస్థితిని అర్థం చేసుకున్న కన్నడ సూపర్‌స్టార్ శివన్న, తన స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి మరీ ఆ ఒక్క షాట్ కోసం స్వయంగా సాయికుమార్‌కు బాడీ డబుల్‌గా నటించేందుకు ముందుకు వచ్చారు. ఆ చిన్న షాట్ థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని, ఆ సీన్ వచ్చినప్పుడు థియేటర్ దద్దరిల్లిపోయిందని సాయికుమార్ గుర్తుచేసుకున్నారు. ఆ షాట్ చేసింది తాను కాదని, శివన్నే స్వయంగా ఆ సాహసం చేశారని చెబుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు. తోటి నటుడి కోసం అంత పెద్ద స్టార్ తన బాడీ డబుల్‌గా మారడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని సాయికుమార్ కొనియాడారు. ప్రస్తుతం ఈ విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు శివన్న సింప్లిసిటీని తెగ ప్రశంసిస్తున్నారు.     [Sai Kumar, Shiva Rajkumar, Body Double, Tollywood Kannada Cinema, Kurmavatar]
          పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజంటే(సెప్టెంబర్ 2 ) రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులతో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులకి పండుగ రోజు. కొంత మంది అభిమానులైతే ఆ రోజున తాము చేసే పనికి సెలవు పెట్టి ఏ ఏ ఏరియాల్లో పవన్ పుట్టిన రోజు జరుపుతున్నారో, చేసే మంచి పనులు ఏంటో చూడటం తరాల నుంచి ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరి కోసం పవన్ క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా అభిమానులు భావించే  'పంజా' సెప్టెంబర్ 2 నే థియేటర్స్ లో అడుగుపెడుతుంది  ఈ నేపథ్యంలో  అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతుండటం విశేషం. కేవలం ముందస్తు బుకింగ్స్ ద్వారానే ఇండియా గ్రాస్ ఏకంగా 1.56 కోట్లని దాటేసి పవన్ కళ్యాణ్ మానియాను ప్రపంచానికి చాటిచెప్పింది.  బాక్సాఫీస్ అంకెల వివరాల్లోకి వెళితే, విడుదల రోజున ప్రదర్శించబడే షోల కోసం ఇప్పటివరకు భారతదేశంలో 1,15,161 కి పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దాదాపు 141 నగరాల్లో  304 థియేటర్లలో 662 షోలకు గాను ముందస్తు బుకింగ్స్ నిర్వహించగా, ఏకంగా 40.2% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇందులో ఇప్పటికే 86 షోలు హౌస్‌ఫుల్ కాగా, 91 కి పైగా షోలు ఫాస్ట్ ఫిలింగ్ మోడ్‌లో బుక్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ₹80.13 లక్షల గ్రాస్ వసూలై 51.3% వాటాను నమోదు చేయగా, ఆంధ్రప్రదేశ్‌లో ₹64.38 లక్షల అడ్వాన్స్ గ్రాస్ నమోదు కావడం విశేషం. నగరాల పరంగా చూస్తే, హైదరాబాదులోనే 116 షోలలో 44,805 టిక్కెట్లు అమ్ముడై అత్యధికంగా 65.26 లక్షల వసూళ్లు సాధించాయి. అలాగే వైజాగ్ 11.58 లక్షలు, విజయవాడ 10.67 లక్షలు, కర్ణాటకలోని బెంగళూరులో 10.66 లక్షల అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లతో పవన్ హవా స్పష్టంగా కనిపిస్తోంది.   Also Read: గోల గోల చేస్తున్నారుగా: యేష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల సాంగ్ రికార్డు ఇదే   డిసెంబర్ 9, 2011న విడుదలైన పంజా 33 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా ₹40 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆ తర్వాతి కాలంలో టాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్ స్టేటస్ దక్కించుకుంది. ఆర్కా మీడియా వర్క్స్, సంఘమిత్ర ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్, గడ్డం లుక్, స్టైలిష్ యాక్షన్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేసాయి. అంతేకాకుండా యువన్ శంకర్ రాజా అందించిన సమర్థవంతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బిజిఎమ్, అడివి శేష్ విలనిజం, సారా జాన్ డియాస్, అంజలీ లావానియా గ్లామర్ పంజాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.  అప్పట్లో థియేటర్లలో దక్కని విజయాన్ని ఇప్పుడు ఈ 4K రీ-రిలీజ్‌తో పవర్ స్టార్ అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కన్నడ మేకర్  విష్ణువర్ధన్ దర్శకుడు.       Pawan Kalyan, Panjaa Re Release, Box Office Collection, Vishnu vardhan, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood    
నాన్ వెజ్ ప్రియుల ఆహారపు అలవాట్లలో చికెన్‌కి ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఉంటుంది. రుచికరమైన రకరకాల వంటకాలు చేసుకోవడానికి చికెన్ అనువుగా ఉండటమే కాకుండా, మన శరీరానికి అవసరమైన అత్యంత విలువైన పోషకాలను కూడా ఇది అందిస్తుంది. చికెన్ కేవలం రుచికి మాత్రమే కాకుండా సరైన పద్ధతిలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ అజ్మీరా భగత్ సింగ్ స్పష్టం చేశారు. రోజూవారీ ఆహారంలో చికెన్ చేర్చుకోవడం వల్ల మన శరీరంలో ఎలాంటి సానుకూల మార్పులు వస్తాయో, అది ఏ విధంగా కండరాల బలానికి మరియు గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుందో తెలుసుకోవడం ఎంతో అవసరం. చికెన్ గురించి మాట్లాడగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అందులో ఉండే అత్యధిక ప్రొటీన్. చికెన్‌లో హై క్వాలిటీ ప్రొటీన్ లభిస్తుంది. ఇది మన శరీరంలోని కండరాల పెరుగుదలకు మరియు వర్కవుట్స్ లేదా కష్టమైన పనుల వల్ల దెబ్బతిన్న కండరాలు త్వరగా కోలుకోవడానికి (మజిల్ రికవరీ) అద్భుతంగా తోడ్పడుతుంది. అందుకే క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లేవారు, క్రీడాకారులు తమ డైట్‌లో చికెన్ బ్రెస్ట్ భాగాన్ని తప్పనిసరిగా చేర్చుకుంటారు. అంతేకాకుండా రోజంతా తీవ్రమైన నీరసంతో బాధపడేవారికి చికెన్ ఒక మంచి శక్తి వనరుగా పనిచేస్తుంది. చికెన్‌లో నియాసిన్ అని పిలిచే విటమిన్ B3 మరియు విటమిన్ B6 పుష్కలంగా ఉంటాయి. మనం తీసుకునే ఆహారాన్ని శరీరానికి కావలసిన శక్తిగా మార్చడంలో ఈ విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఫలితంగా బద్ధకం తగ్గి, రోజంతా ఉత్సాహంగా మరియు ఎనర్జెటిక్‌గా ఉండేందుకు ఇది దోహదపడుతుంది. చికెన్ తింటే బరువు పెరుగుతారనేది సమాజంలో ఉన్న ఒక పెద్ద అపోహ మాత్రమే. నిజానికి సరైన పద్ధతిలో వండుకుని తింటే చికెన్ బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. చికెన్ లోని ప్రొటీన్ వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన (సృప్తి) కలుగుతుంది. దీనివల్ల పదే పదే అనవసరమైన స్నాక్స్ తినాలనే కోరిక తగ్గి, కేలరీల స్వీకరణ అదుపులోకి వస్తుంది. ఫలితంగా శరీర బరువును వేగంగా మరియు ఆరోగ్యకరంగా నియంత్రించుకోవచ్చు.       Chicken for bone density and heart health,healthy ways to cook and eat chicken.
మన తాతముత్తాతల కాలం నుండి భారతీయ సాంప్రదాయ ఆహారంలో నల్ల శెనగలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. నిత్యం మనం తీసుకునే ఆహారంలో లభించే పోషకాల కంటే నల్ల శెనగలు అందించే పోషక విలువలు ఎంతో ప్రత్యేకమైనవి. ప్రతిరోజూ మనం 10 గుడ్లు తినడం ద్వారా లేదా లీటర్ పాలు తాగడం ద్వారా పొందే శక్తిని, కేవలం కొద్దిగా ఉడకబెట్టిన నల్ల శెనగలను తినడం ద్వారా డబుల్ చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బలహీనతతో బాధపడేవారికి, కండరాల బలం పెంచుకోవాలనుకునేవారికి మరియు ప్రతిరోజూ ఉత్సాహంగా ఉండాలనుకునేవారికి ఇది ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్‌గా నిలుస్తుంది. ఈ శెనగలను వివిధ రూపాల్లో ఆహారంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట నానబెట్టిన శెనగలను ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లో ఉడకబెట్టి గుగ్గిళ్ల మాదిరిగా తాలింపు పెట్టుకుని తింటే శరీరానికి అవసరమైన పుష్కలమైన ప్రోటీన్ లభిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉండి తరచూ నిరసించిపోయే వారికి నానబెట్టిన లేదా వేయించిన నల్ల శెనగలు తిరుగులేని శక్తిని అందిస్తాయి. వీటిలో లభించే పీచు పదార్థం (ఫైబర్) జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియ సులభతరం కావడమే కాకుండా కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపి కడుపును పరిశుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారికి నల్ల శెనగలు ఒక దివ్యౌషధంలా పనిచేస్తాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది, తద్వారా పదేపదే ఆకలి వేయకుండా ఉండి అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. రక్తం లోని గ్లూకోజ్ లేదా షుగర్ లెవెల్స్ సమతుల్యంగా ఉంచడంలో ఇవి ఎంతో తోడ్పడతాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారు అలాగే గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు వీటిని తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా హృద్రోగాల ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుంది.         black chickpeas for weight loss and health, black chickpeas nutrition benefits in Telugu.
వాతావరణంలో హఠాత్తుగా సంభవిస్తున్న మార్పులు మరియు రుతుపవనాల ప్రభావంతో మనదేశంలో H1N1 ఇన్ఫెక్షన్లు లేదా స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. ఆసుపత్రుల్లో సాధారణ జ్వరం, దగ్గు, గొంతు నొప్పితో చేరే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో పాటు ఫ్లూ వ్యాక్సిన్ కోసం జనం క్యూ కడుతున్నారు. ప్రారంభంలో ఇది ఒక సాధారణ జలుబు లేదా ఇన్ఫ్లుయెంజాలా కనిపించినప్పటికీ, కొందరిలో ఈ వైరస్ తీవ్రంగా మారి ఊపిరితిత్తులపై దాడి చేసి తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో H1N1 నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఫ్లూ వ్యాక్సిన్ ఎవరెవరు తప్పనిసరిగా తీసుకోవాలో వైద్య నిపుణులు స్పష్టమైన సమాచారాన్ని అందించారు. స్వైన్ ఫ్లూ బారిన పడిన సాధారణ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు అవసరం లేదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. కానీ కొన్ని రకాల తీవ్రమైన ప్రమాదం ఉన్న హై రిస్క్ వర్గాల ప్రజలకు లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే పరీక్ష చేయించుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఆస్తమా, సీఓపీడీ, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం లేదా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అదేవిధంగా 65 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే 5 ఏళ్ల లోపు చిన్న పిల్లలలో ఈ ప్రమాదం చాలా ఎక్కువ. గర్భధారణ సమయంలో మహిళల్లో రోగనిరోధక వ్యవస్థలో అనేక మార్పులు వస్తాయి కాబట్టి, గర్భిణీలకు స్వైన్ ఫ్లూ సోకితే శ్వాసకోశ కాంప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరంతో పాటు తీవ్రమైన అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన వారికి సరైన నివారణ చికిత్స అందించడానికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్లూ ఇన్ఫెక్షన్ తీవ్రరూపం దాల్చకుండా అడ్డుకోవడానికి ఫ్లూ టీకా ఒక గొప్ప రక్షణ కవచంలా పనిచేస్తుంది. వైద్య నిపుణుల ప్రకారం 6 నెలల నుండి 5 ఏళ్ల వరకు ఉన్న చిన్న పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించడం చాలా అవసరం. 65 ఏళ్లు పైబడిన వృద్ధులలో వయస్సు పెరిగే కొద్దీ సహజ నిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి వీరు ముందస్తుగా ఫ్లూ షాట్ తీసుకోవాలి. అలాగే గర్భిణీ స్త్రీలు తమ భద్రతతో పాటు కడుపులోని బిడ్డ క్షేమం కోసం ఈ వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా, బిపి, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారితో పాటు, రోజూ ఆసుపత్రుల్లో రోగుల మధ్య ఉండే డాక్టర్లు, నర్సులు మరియు హెల్త్‌కేర్ సిబ్బందికి ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం అత్యంత ఆవశ్యకం.           Annual flu shot importance H1N1, swine flu prevention high risk groups.
భారతీయ సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో పిప్పళ్లకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. నల్లగా, చిన్న పొడుగు ఆకారంలో ఉండే ఈ పిప్పళ్లు కేవలం వంటగదిలోని దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న దివ్యౌషధం. శతాబ్దాల నుంచి మన పెద్దలు, ఆయుర్వేద నిపుణులు రకరకాల ఆరోగ్య సమస్యల నివారణకు పిప్పళ్లను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. పిప్పళ్లు చేసే మేలు.. పిప్పళ్లలో ఉండే కెమికల్ కాంపౌండ్ పైపరీన్ శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పిప్పళ్లు చేసే మేలు అపారం. జలుబు, దగ్గు, ఉబ్బసం, గొంతు నొప్పి, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పిప్పళ్లు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. పిప్పళ్ల పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం సులభంగా బయటకు వచ్చేస్తుంది. పిప్పళ్ల గురించి ఆయుర్వేదం ఏం చెబుతుంది? ఆయుర్వేదంలో పిప్పళ్లను రసాయన మూలికగా వర్గీకరించారు. అంటే ఇవి శరీరానికి పునరుజ్జీవనాన్ని అందిస్తాయి. ఆయుర్వేదంలో దీనిని త్రిదోషాలలో ప్రధానమైన కఫ, వాత దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు. శరీరంలో జఠరాగ్నిని అంటే జీర్ణశక్తిని రగిల్చే గుణం పిప్పళ్లకు ఉంది. తిన్న ఆహారం సరిగ్గా అరగకపోయే సమస్యను, ఆకలి మందగించడాన్ని ఇది నివారిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ లేదా విష పదార్థాలను బయటకు పంపడంలో ఆయుర్వేద వైద్యంలో పిప్పళ్లను క్రియాశీలకంగా ఉపయోగిస్తారు. పిప్పళ్ల వల్ల కలిగే మరికొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం..  గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను పిప్పళ్లు త్వరితగతిన నివారిస్తాయి. జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆహారం వేగంగా అరిగేలా చేస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల..  యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తరచూ వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. బరువు నియంత్రణ..  శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచి, చెడు కొవ్వును కరిగించడంలో పిప్పళ్లు ఎంతో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి సహజ నివారణి. నొప్పులు , వాపుల నివారణ..  పిప్పళ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాతపు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాలేయ ఆరోగ్యం.. కాలేయంలోని వ్యర్థాలను తొలగించి, కాలేయం సరిగ్గా పనిచేయడానికి పిప్పళ్లు తోడ్పడతాయి. పిప్పళ్లను నిత్య జీవితంలో తగిన మోతాదులో వాడటం వల్ల అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఇవి శరీరంలో వేడిని పెంచే గుణం కలిగి ఉంటాయి కాబట్టి, పిత్త ప్రకృతి ఉన్నవారు లేదా గర్భిణులు ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది.                        *రూపశ్రీ.  
కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది శరీరంలోని కణాల నిర్మాణానికి మరియు కొన్ని రకాల హార్మోన్ల తయారీకి ఎంతో అవసరం. అయితే, రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగితే అది గుండె ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడి, గుండెపోటు , పక్షవాతం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రస్తుతం కాలంలో ఉన్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం , తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో కొలెస్ట్రాల్ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడమే కాకుండా, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు ఏమిటో, అవి ఎలా సహాయపడతాయో తెలుసుకుంటే.. ఫైబర్.. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో  పీచు పదార్థం లేదా ఫైబర్ పాత్ర చాలా కీలకమైనది. ముఖ్యంగా కరిగే పీచు పదార్థం పుష్కలంగా ఉండే ఆహారాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఓట్స్ , బార్లీ వంటి ధాన్యాలలో కరిగే ఫైబర్  ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించి, శరీరం నుండి దాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. రోజూ ఉదయం అల్పాహారంలో ఓట్స్ లేదా బార్లీ చేర్చుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. పప్పుధాన్యాలు, గింజలు.. వివిధ రకాల పప్పుధాన్యాలు , గింజలు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. శనగలు, పెసలు, రాజ్మా, మినుములు , కందిపప్పు వంటి వాటిలో ప్రోటీన్లు, విటమిన్లు , పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగించి, అనవసరమైన కేలరీలు తీసుకోకుండా నిరోధిస్తాయి. అలాగే నట్స్ అని పిలిచే బాదం, వాల్‌నట్స్ , పిస్తా పప్పులు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే అసంతృప్త కొవ్వులు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. కాకపోతే వీటిని పరిమిత పరిమాణంలోనే తీసుకోవడం మంచిది. తాజా కూరగాయలు , ఆకుకూరలు.. రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. పాలకూర, తోటకూర, మెంతి కూర వంటి ఆకుకూరలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బెండకాయ, వంకాయ, క్యారట్ , బీట్‌రూట్ వంటి కూరగాయలలో కరిగే పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి కొలెస్ట్రాల్ శోషణను అడ్డుకుంటాయి.  వెల్లుల్లి.. వెల్లుల్లి రక్తనాళాలను శుభ్రపరచడంలో , కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. రోజూ ఒకటో రెండో వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా తగ్గుతుంది. పండ్లు.. పండ్లు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. బొప్పాయి, ఆపిల్, నారింజ, జామ, దానిమ్మ  వంటి పండ్లలో పెక్టిన్ అనే ప్రత్యేకమైన కరిగే పీచు పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతుంది. అలాగే పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి.  నిమ్మజాతి పండ్లు.. నిమ్మ జాతి పండ్లలో ఉండే విటమిన్ సి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హెల్తీ ఫ్యాట్స్.. చేపలు , ఆరోగ్యకరమైన నూనెలు కూడా కొలెస్ట్రాల్ నిర్వహణకు సహాయపడతాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలను తినడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి. వంటల కోసం ప్రాసెస్ చేసిన నూనెలకు బదులుగా ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె లేదా ఆవనూనె వంటి వాటిని పరిమితంగా ఉపయోగించడం మంచిది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచకుండా కాపాడతాయి. ఈ ఆహారాలు తినకూడదు.. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కొన్ని ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసం, మైదాతో చేసిన పదార్థాలు, తీపి పదార్థాలు, బేకరీ ఆహారాలు , పూర్తి కొవ్వు ఉన్న పాల పదార్థాలను తగ్గించాలి. వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ , సంతృప్త కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా పెంచుతాయి. ఆహారాలు మాత్రమే కాదు.. ఇవి కూడా ముఖ్యమే.. కేవలం మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా, రోజువారీ జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం అవసరం. ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు నడక లేదా ఇతర వ్యాయామాలు చేయడం, తగినంత నీరు తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం , మంచి నిద్ర వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. సరైన ఆహార నియమాలు , ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే కొలెస్ట్రాల్‌ను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు.                         *రూపశ్రీ.