LATEST NEWS
వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడేళ్లవుతోంది... సిబిఐ విచారణ ముగిసిందనుకుంటున్న సమయంలో, హఠాత్తుగా ఈడీ ఎందుకు ఎంటర్ అయింది?  అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. దీనిపై సీనియర్ జర్నలిస్టు, ఎనలిస్ట్ వీవీరావు తెలుగువన్ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో,  న్యాయ వర్గాల్లో గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హఠాత్తుగా ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హఠాత్తుగా రంగానికి దిగి తనిఖీలు చేపట్టడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 2019 మార్చి నెలలో జరిగిన వైఎస్ వివేకా  హత్య ఉదంతంలో ఇప్పటివరకు  సిబిఐ విచారణ జరుపుతుండగా, ఉన్నట్టుండి ఈడీ అధికారులు రంగప్రవేశం చేయడం వెనుక ఉన్న కారణాలపై విశ్లేషకులు మరియు సామాన్య ప్రజలు ఆసక్తికరమైన చర్చలకు తెరలేపారు. ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భాగంగా పలు కీలకమైన ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. నిందితులు, సాక్షులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తుల ఇళ్లలో జరిపిన శోధనలలో  24 లక్షల రూపాయల నగదుతో పాటు అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. అయితే హత్య జరిగిన  ఏడేళ్ల తరువాత నిందితుల ఇళ్లలో కీలక డాక్యుమెంట్లు ఉంటాయా? సంఘటన జరిగిన గంటల వ్యవధిలో సాక్ష్యాలను తారుమారు చేస్తున్న నేటి పరిస్థితుల్లో హత్య జరిగిన ఏడేళ్ల తరువాత కీలక పత్రాల స్వాధీనం అంటూ వస్తున్న వార్తలు నమ్మశక్యంగా లేవని వీవీరావు విశ్లేషించారు.  ఈ తనిఖీల వెనుక కేవలం హత్య కేసు విచారణ మాత్రమే  లేదన్నారు. అయినా ఈడీ వంటి దర్యాప్తు సంస్థల తనిఖీలు రానున్న రోజులలో జరగనున్న రాజకీయ పరిణామాలకు తార్కాణమని గత అనుభవాలను బట్టి  అవగతం చేసుకోవచ్చునన్నారు. ఇప్పుడు ఈడీ దాడుల వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇటీవలే జగన్ హయాంలో ఏపీలో చక్రం తిప్పిన ఐఏఎస్ అధికారి ఒడిషాలో కాంగ్రెస్ గూటికి చేరడం... రానున్న రోజుల్లో జగన్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఎందుకంటే.. ఏడేళ్ల తరువాత ఇప్పుడు ఈడీ ఈ కేసులో అవినాష్ రెడ్డి తదితరుల నివాసాలలో ఆధారాల కోసం తనిఖీలు నిర్వహించడం విచిత్రంగా ఉందన్నారు. రానున్న రోజులలో జరగబోయే పరిణామాలేమిటన్నది వేచి చూడాలన్నారు.   Jagan to join Congress, YS Viveka Case ED Raids, YS Vivekananda Reddy Murder Case, ED Investigation, Avinash Reddy ED Raids, TeluguOne
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ప్రకటించేశారు. శ్రావణ శుక్రవారం రోజే తాను విజయవాడ వేదికగా కొత్తపార్టీ ప్రకటన చేస్తానని వెల్లడించారు.  తాను త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు గతంలోనే వెల్లడించిన విజయసాయి. ఇప్పుడు ఆ పార్టీ ప్రకటన ఎప్పుడు, ఎక్కడ అన్న విషయంలో క్లారిటీ ఇచ్చారు.    శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు  విజయవాడ వేదికగా  పార్టీ పేరు, జెండా, అజెండా, విధివిధానాలను వెల్లడిస్తానని చెప్పారు.  ప్రజాసమస్యలపై నిలదీసేందుకు,  ప్రజల గొంతుకగా మారేందుకు చట్టసభల్లో ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంటూ, పరోక్షంగా వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ బాయ్ కాట్ ను తప్పుపడుతూ విమర్శలు గుప్పించారు.   గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి రాజకీయ అడుగులపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది.  వైసీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయి.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి రాజకీయ సన్యాసం ప్రకటించిన ఇంత కాలానికి సొంత రాజకీయ వేదక ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం విశేషం.    Vijayasai Reddy Political Party Announcement, Vijayawada, Sravana Sukrvaram, Vijayawada,   AP Politics, TeluguOne
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ పర్యటన ఏమైంది? కొన్ని వారాల కిందట జగన్ హస్తిన పర్యటనకు వెడుతున్నారనీ, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారనీ వైసీపీ ఆర్భాటంగా ప్రకటించింది. వైసీపీ సోషల్ మీడియాలో జగన్ పర్యటన గురించిన పోస్టులు పుంఖానుపుంఖాలుగా వెల్లువెత్తాయి. దీంతో జగన్ హస్తిన పర్యటనపై సర్వత్రా ఆసక్తి  వ్యక్తమైంది.   రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలు, ప్రధానంగా అధికార మార్పిడి తర్వాత చోటుచేసుకుంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో ఆయన హస్తిన టూర్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. హస్తిన పర్యటనలో జగన్ మోడీ,  షాలతో చర్చించే అంశాలేంటి?  జగన్, ఆయన పార్టీ నేతలు, సన్నిహిుతలు ఎదుర్కొంటున్న సీబీఐ, ఈడీ విచారణలు వేగవంతమై, దర్యాప్తులు కొలిక్కి వస్తున్న వేళ ఆయన మోడీ, అమిత్ షాలతో భేటీ కానున్నారన్న వార్తలు ఉత్కంఠకు తెరలేపాయి.  జగన్  ఢిల్లీ పర్యటన కేంద్రం పెద్దల ఆశీస్సులతో.. కేసుల నుంచి రక్షణ పొందేందుకేనన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తమైంది. అయితే జగన్ హస్తిన పర్యటన వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చి వారాలు గడిచిపోయినా ఆయన బెంగళూరు, తాడేపల్లి ప్యాలెస్ మధ్య తిరగడం తప్ప హస్తిన  ఫ్లైట్ ఎక్కలేదు. దీంతో  జగన్ పర్యటన సంగతేమైందన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఆయనకు మోడీ, అమిత్ షాలు అప్పాయింట్ మెంటే ఇవ్వలేదని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో  కేంద్ర ప్రభుత్వంతో  వైసీపీ సఖ్యతగా వ్యవహరించింది. జగన్ ఎప్పుడు కోరితే అప్పుడు మోడీ, షాల అప్పాయింట్ దొరికేసేది. అయితే 2024 ఎన్నికల తరువాత నుంచి  పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు వచ్చింది.   కేంద్రం కోరినా కోరకున్నా...జగన్, వైసీపీ కేంద్ర ప్రభుత్వ విధానాలన్నిటికీ బేషరతు మద్దతు ఇస్తున్నా.. కేంద్రం పెద్దలు ఆయనను పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. ఇక రాష్ట్రంలో  కొలువుదీరిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన అక్రమాలపై వరుస విచారణలు జరుపుతుంటే..  కేంద్ర దర్యాప్తు సంస్థలు జగన్ అక్రమాస్తులు, మద్యం కుంభకోణం కేసుల విచారణల్లో వేగం పెంచుతున్న పరిస్థితిప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. కేంద్రం పెద్దలను కలిసి రక్షణ కోరేందుకు జగన్ మోడీ, షాల అప్పాయింట్ మెంట్ కోరారని రాజకీయవర్గాలలో విస్తృత ప్రచారం జరిగింది. కట్ చేస్తే జగన్ ఇప్పుడు హస్తిన పర్యటన ఊసెత్తడం లేదు. వైసీపీ సోషల్ మీడియాలో  కూడా ఆయన హస్తిన పర్యటనకు సంబంధించిన వివరాలేవీ కనిపించడం లేదు. దీంతో మోడీ, షా జగన్ కు అప్పాయింట్ మెంట్  ఇవ్వలేదని స్పష్టమౌతోందని అంటున్నారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం కీలక భాగస్వామి కావడంతో..  జగన్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం  రాజకీయంగా ప్రతికూల సంకేతాలు ఇస్తుందన్న భావనతో మోడీ, షాలు జగన్ కు అప్పాయింట్ మెంట్ నిరాకరించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి.     రాబోయే రోజుల్లో ఢిల్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఏ దిశగా సాగుతుంది, కేంద్ర ప్రధాన నాయకులతో ఆయన సమావేశం అయ్యే అవకాశం దక్కుతుందా లేదా అనేది ఏపీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. కేంద్ర దర్యాప్తు సంస్థల కేసుల విచారణ గతిని, రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును ఈ పర్యటన ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వేచి చూడాల్సి ఉంది. What happend to Jagan delhi tour, Modi, Shah, Appointment, Cases, Nda, Telugudesham, Ap, TeluguOne
వైసీపీ  సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అడుగులు ఎటు అన్న విషయంపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చర్చ జోరుగా నడుస్తోంది.  శాసనమండలిలో  వైసీపీ పక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ జనసేన వైపు చూపు సారించారన్న చర్చ జోరందుగుంది.  ఆయన రాజకీయ అడుగులు జనసేన వైపు పడుతున్నాయని వైసీపీలోనే వినిపిస్తున్నది.  ఆయన ఇప్పటికే జనసేన అగ్రనేతతో ఈ విషయంగా చర్చలు జరిపారని గట్టిగా వినిపిస్తోంది.  ఈ విషయంలో  బొత్స సత్యనారాయణ స్వయంగా స్పందిస్తూ ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను పార్టీ మారుతాన్న ప్రచారం పూర్తిగా ఆధారరహితమని స్పష్టం చేశారు. ఇదంతా మైండ్ గేమ్ లో భాగమని కొట్టి పారేశారు.  బొత్స స్వయంగా ఖండిచినా ఆయన జనసేనకు షిఫ్ట్ అవుతారన్న ప్రచారం ఇసుమంతైనా తగ్గలేదు. రాజకీయ పరిశీలకులు సైతం బొత్సలో జనసేన, వైసీపీల మధ్య ఊగిసలాట కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. స్థానిక ఎన్నికలలో పార్టీ పోటీపై వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్న జనసేనాని.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం  చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంగా బొత్స జనసేన వైపు మొగ్గు చూపే అవకాశాలను కొట్టి పారేయలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తాజాగా బొత్స ఇటీవలి మౌనాన్ని వీడి మండలిలోనూ, బయటా కూడా తెలుగుదేశం పై, మంత్రి లోకేష్ పై విమర్శలకు పదును పెట్టడం, అదే సమయంలో జనసేన పట్ల ఒకింత మెతక వైఖరిని అవలంబించడం ఇందుకు తార్కానాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద బొత్స రాజకీయ అడుగుల విషయంలో అటు వైసీపీలోనూ, ఇటు జనసేనలోనూ కూడా ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది.   Botsa Satyanarayana, Janasena Party, YSRCP, AP Politics, Vizianagaram Politics
  టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..! తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ‘అదృశ్య వ్యక్తులు’ ఎవరో నిష్పాక్షికంగా గుర్తించి, వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవిని కోరారు. క్రమశిక్షణా కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ ఇచ్చానని సురేఖ తెలిపారు.  అయినప్పటికీ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఒకే తరహాలో తనపై, తన కుటుంబంపై విమర్శలు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. క్రమశిక్షణా కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై బహిరంగ విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆమె కోరారు.  పార్టీ నాయకత్వం, క్రమశిక్షణా నియమావళిపై తనకు పూర్తి గౌరవం ఉందని పేర్కొన్న సురేఖ.. సీనియర్ బీసీ మహిళా నాయకురాలిగా తనపై సామూహికంగా విమర్శలు వస్తున్నా పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. పార్టీ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి వున్న పార్టీ అని, ఆ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ కోరారు. Konda Surekha, CM Revanth Reddy, Telangana Congress, Konda Susmitha, TPCC, Congress MLAs Ultimatum, TPCC Disciplinary Committee, MP Mallu Ravi  
ALSO ON TELUGUONE N E W S
Nani’s highly anticipated pan-India action drama The Paradise is keeping its musical momentum high. After the first single Aaya Sher turned into a massive chartbuster with over 200 million views across platforms, the makers are now gearing up for the release of the much-awaited second single. Composer Anirudh Ravichander has completed the recording of the song, with director Srikanth Odela revealing the update on social media. “Just finished recording our second single... Gear up with your speakers... out soon,” he posted, raising expectations among fans. The behind-the-scenes picture shared by Odela has added further curiosity. It features Anirudh playfully seeking the blessings of lyricist Kasarla Shyam at the recording studio, hinting that the upcoming track could carry a strong local and energetic flavour. The excitement around The Paradise has already grown significantly following Nani’s recently released glimpse, which showcased the film’s intense world and generated strong anticipation. With the second single now ready, the makers are expected to announce its release date soon. Produced by Sudhakar Cherukuri, The Paradise is currently progressing through post-production and is slated for a worldwide release in multiple languages on September 24. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో బౌలర్లను తన బ్యాటింగ్‌తో భయపెట్టే ఈ దిగ్గజ క్రికెటర్, సోషల్ మీడియాలో మాత్రం పూర్తి టాలీవుడ్ మాస్ హీరోలా మారిపోతుంటాడు. పుష్ప రాజ్ తగ్గేదేలే మేనరిజం నుంచి అల్లు అర్జున్, మహేష్ బాబు పాటలకు డ్యాన్సులు వేస్తూ తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. హైదరాబాద్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని నిలుపుకుంటూ ఎప్పటికప్పుడు తెలుగు సాంప్రదాయాలు, సినిమాలపై తన ప్రేమను చాటుకునే వార్నర్, తాజాగా మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాడు. ఇటీవల టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో మరియు నెట్టింట 'ఇరుముడి' సినిమా పేరు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెటిజన్లు, ఫ్యాన్స్ రకరకాల ఏఐ (AI) క్రియేటివిటీతో సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ 'ఇరుముడి' ట్రెండ్‌లోకి ఇప్పుడు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఊహించని రీతిలో ఎంట్రీ ఇచ్చాడు. నల్లటి వస్త్రాలు ధరించి, మెడలో తులసి మాల వేసుకుని, శిరస్సుపై పవిత్రమైన ఇరుముడి కట్టును మోస్తూ పక్కా అయ్యప్ప స్వామి మాలాధారి గెటప్‌లో వార్నర్ దర్శనమిచ్చాడు. పూర్తి భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి రూపంలో కనిపించిన వార్నర్ పిక్ చూసి నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇది నిజమైన ఫొటోనా లేక ఫ్యాన్స్ తయారుచేసిన ఏఐ ఎడిటింగ్ పిక్చరా అని తెలుసుకోవడానికి వేలాది మంది  ఆసక్తి చూపడంతో ఈ ఫోటో నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. Also Read: కాపీ వివాదంలో తాప్సీ గాంధారి మూవీ..  కళ్యాణ్ బండి ఎవరు ఈ పిక్ చూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ మరియు తెలుగు క్రికెట్ ప్రేమికులు ఖుషీ అవుతున్నారు. "స్వామియే శరణం అయ్యప్ప" అంటూ కామెంట్లు పెడుతూ వార్నర్ పిక్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు. గతంలో నితిన్ నటించిన 'రాబిన్‌హుడ్' సినిమాలో విలన్ షేడ్స్ ఉన్న రోల్‌లో నటించి టాలీవుడ్ అరంగేట్రం చేసిన వార్నర్, ఇప్పుడు ఏకంగా ఆధ్యాత్మిక అవతారంలో మెరవడం విశేషం. 'ఇరుముడి' సినిమా హైప్‌తో పాటు వార్నర్ మాస్ ఇమేజ్ తోడవడంతో సోషల్ మీడియాలో ఈ ఇరుముడి ఫీవర్ ట్రెండింగ్ నంబర్ వన్‌గా దూసుకుపోతోంది. అసలు విషయం ఏంటంటే  వార్నర్‌ని ఊహిస్తూ అభిమానులు ఈ పోస్టర్‌  డిజైన్ చేశారు. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే  డేవిడ్ వార్నర్‌ని అయ్యప్ప స్వామి పిక్  ఆకట్టుకోవడంతో స్వయంగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తనే  షేర్ చేశాడు. David Warner, Irumudi, Raviteja  
మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'ఇరుముడి' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. అంతేకాదు, మొదటి సోమవారం రోజున ఏకంగా 'బాహుబలి-2' తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది.  సాధారణంగా సోమవారం వచ్చిందంటే బాక్సాఫీస్ కలెక్షన్లు పడిపోతాయి. కానీ, ఇరుముడి క్రేజ్ ముందు ఆ సోమవారం సెంటిమెంట్ కూడా నిలబడలేదు. వర్కింగ్ డే అయిన సోమవారం కూడా, మొదటి రోజు కలెక్షన్లకు చాలా దగ్గరగా ఈ సినిమా వసూళ్లు సాధించింది. ముఖ్యంగా ఫస్ట్ మండే కలెక్షన్స్ విషయంలో తెలుగు చలనచిత్ర చరిత్రలోనే 'బాహుబలి 2' తర్వాత అతిపెద్ద డే-4 నంబర్స్ నమోదు చేసిన రీజినల్ ఫిల్మ్‌గా 'ఇరుముడి' నిలిచింది. అసలు వీకెండ్ ముగిసిన తర్వాత కూడా ఇంతటి అపూర్వమైన ఆక్యుపెన్సీ రావడం ట్రేడ్ వర్గాలనే షాక్‌కి గురిచేస్తోంది. అసలు ఈ సినిమాకు ఇంతటి రెస్పాన్స్ రావడానికి పలు కారణాలు ఉన్నాయి. మాస్ మహారాజా పెర్ఫార్మెన్స్, శివ నిర్వాణ అందించిన డిఫరెంట్ ఎమోషనల్ అండ్ డివోషనల్ టచ్, తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ ప్రేక్షకుల గుండెలను పిండేస్తోంది. టాక్ పాజిటివ్‌గా రావడంతో థియేటర్ల వద్ద జనాలు క్యూ కడుతున్నారు. ఇక ఆన్‌లైన్ టికెట్ సేల్స్ చూస్తే మతిపోవాల్సిందే. ప్రముఖ టికెటింగ్ వేదికలైన బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్స్‌లలో కలిపి ఏకంగా 3.8 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఒక ప్రాంతీయ సినిమాకు ఈ స్థాయిలో డిమాండ్ చూడటం చాలా అరుదు. నార్త్ అమెరికాలో కూడా ఇదివరకెన్నడూ లేని విధంగా దాదాపు 1మిలియన్ డాలర్లకు పైగా రాబట్టి రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైలురాయిని నమోదు చేసింది. బయ్యర్లు పెట్టిన పెట్టుబడికి కేవలం ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్ సాధించి, నాలుగో రోజుకే మైండ్ బ్లోయింగ్ లాభాలను తెచ్చిపెట్టింది. డే-5 కూడా భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదుకావడంతో, రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.        Ravi Teja, Irumudi, Box Office  
  ఇరుముడి.. ఇప్పుడు ఏ ముగ్గురు కలిసినా ఇరుముడి చూసావా లేదా అని డిస్కర్షన్ చేసుకుంటున్నారంటే ఇరుముడి ఆధిపత్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. మాస్ మహారాజా  రవితేజతో పాటు కూతురు మణికంఠ(మణమ్మ) గా చేసిన చిన్నారి నక్షత్ర తన అద్భుతమైన అభినయంతో అందరి దృష్టినీ ఆకరిస్తుంది. మొదటి సినిమాతోనే లీడ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించి, అమాయకత్వంతో కూడిన నటన, ముచ్చటైన సంభాషణలు, తండ్రి-కూతుళ్ల మధ్యన ఉండే అపురూపమైన అనుబంధాన్ని పండించిన తీరు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకుంది. 'ఒక రకంగా ఇరుముడి కథ నక్షత్ర లక్ష్య సాధన కోసమే పుట్టింది.    క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన చూసి ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటూ థియేటర్స్ నుంచి వస్తున్నారంటే నక్షత్ర సృష్టించిన 'ఆరా'  ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. అంతటి  గొప్ప పెర్ ఫార్మెన్స్ ని  కనబరిచిన నక్షత్ర రియల్ లైఫ్ బ్యాక్‌గ్రౌండ్  ఇప్పుడు అందరినీ మరింత భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. నిజ జీవితంలో నక్షత్రకు చిన్నతనంలోనే తండ్రి లేరనే చేదు నిజం చాలామందిని కలిచివేస్తోంది. ఆమె చిన్నతనంలోనే తండ్రి దూరమవ్వడంతో, తల్లి అన్ని తానై  ఎంతో క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసింది. సొంత తండ్రి ప్రేమకు దూరమైన నక్షత్ర, తెరపై రవితేజ సరసన కూతురిగా నటిస్తున్నప్పుడు తనలో దాగున్న నిజమైన తండ్రి ప్రేమను, ఆ వెలితిని తీర్చుకుందని నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకుడు శివ నిర్వాణ భావోద్వేగంతో వెల్లడి చేసాడు. సినిమా షూటింగ్ సమయంలో 45 రోజుల పాటు సాగిన సుదీర్ఘమైన షెడ్యూల్‌లో నక్షత్ర ప్రదర్శించిన ప్రతిభ, సమయపాలన యూనిట్ సభ్యులందరినీ ఆశ్చర్యపరిచింది. తండ్రి లేని లోటును తన గుండెల్లో దాచుకుని, తెరపై తండ్రి-కూతుళ్ల అనుబంధాన్ని అంత సహజంగా పండించడం సామాన్యమైన విషయం కాదు. నక్షత్ర నేపథ్యం తెలిసిన తర్వాత ప్రేక్షకులు ఆమెపై మరింత ప్రేమాభిమానాలను కురిపిస్తున్నారు. ప్రతిభకు పేదరికం గానీ, జీవితంలో ఎదురయ్యే విషాదాలు గానీ అడ్డంకి కావు అని నక్షత్ర నిరూపించింది.  ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే పై లోకంలో ఉన్న నక్షత్ర తండ్రి తన కూతురు విజయాన్ని చూసి గర్వపడుతూ ఉంటాడు. ఒక వేళ ఆయన మళ్ళీ పుట్టి ఉంటే తల్లి ఒడిలో పసివాడుగా ఇరుముడి థియేటర్ కి వెళ్లి తన కూతురు పెర్ఫార్మ్ చూసి ఉండవచ్చు.  ఇక ఇరుముడి తన ప్రభంజనాన్ని చాలా స్పష్టంగా కొనసాగిస్తు బాక్స్ ఆఫీస్ వద్ద తన అజమాయిషీ చెలాయిస్తూ ఉంది. మూడు రోజులకే 80 కోట్ల క్లబ్ లో చేరడంతో వంద రోజుల పోస్టర్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. హైదరాబాద్ మియాపూర్ లోని మిరాజ్ థియేటర్ లో 'మల్లెపూల పల్లకి' సాంగ్ ని సెకండ్ టైం ప్లే చేయించి భారీ లైటింగ్ మధ్య స్క్రీన్ ముందు ప్రేక్షకులు డాన్స్ లు వెయ్యడం ఇరుముడి ఉదృతి యొక్క స్థాయికి  స్పష్టమైన సంకేతం. నక్షత్ర ది కేరళ లోని కన్నూర్. తన నెలల వయసప్పుడే తండ్రి చనిపోయాడు. ప్రెజెంట్ సెవెంత్ క్లాస్. Irumudi, Nakshathra, Raviteja, Shiva Nirvana
  హీరో.. అభిమానులతో పాటు టోటల్ మానవాళికి లభించిన మిరుమిట్లు గొలిపే అరుదైన గ్రహం. ఎప్పటికప్పుడు నవ శకానికి నాంది పలికే  డైనమేట్ కూడా. హీరో అంటే కేవలం ఫైట్లు, డ్యాన్సులు, బాక్సాఫీస్ రికార్డులే కాదు, సమాజానికి మంచి మార్గం చూపించే బాధ్యత గల శక్తి అని సుదీర్ఘ కాలం నుంచి నిరూపిస్తు వస్తున్నారు.  ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవితేజ నుంచి వచ్చిన ‘ఇరుముడి’ సినీ పరిశ్రమలోనే కాకుండా సమాజంలోనూ ఒక గొప్ప చర్చకి  తెరలేపింది. కేవలం ఒక తండ్రిగా తన కూతురిని ప్రేమించడమే కాకుండా, ప్రతి ఆడపిల్లలోను నా కూతుర్ని చూసుకుంటాను. వాళ్ళకి  ఏ కష్టం వచ్చినా తండ్రిగా  అండగా ఉంటాను అని రవితేజ చెప్పే సంభాషణలు ప్రేక్షకుల హృదయాలని కట్టిపడేస్తున్నాయి. అంతే కాకుండా సమాజంలో ఆడపిల్లల భద్రత మరియు గౌరవం పట్ల ఎంతటి బాధ్యత ఉండాలో ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తోంది. రవితేజ అనే కాదు అందరూ హీరోలు తమ సినిమాల్లో సామాజిక బాధ్యతని గుర్తు చేస్తున్నారు. దీని వల్ల సమాజంలో మార్పు రావడమనేది జరుగుతుంది. ముఖ్యంగా డై హార్ట్ ఫ్యాన్స్, ఫ్యాన్స్  తమ హీరో దారిలో పయనించడం తధ్యం. స్టార్ హీరోలు ఇలాంటి సందేశాత్మకమైన కథలతో ముందుకు రావడం వల్ల వారి అభిమానులు కేవలం సినిమాను ఆస్వాదించడమే కాకుండా, నిజ జీవితంలోనూ బాధ్యతాయుత పౌరులుగా మారేందుకు ప్రేరణ పొందుతున్నారు. రవితేజ చెప్పిన ఈ మాటలు, చూపించిన భావోద్వేగాలు నేటి సమాజంలో ఆడపిల్లల పట్ల చూపే కోణాన్ని తప్పకుండా మారుస్తాయని, ఒక మంచి సామాజిక మార్పుకు పునాది వేస్తాయని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.   Also Read: చితి చివరి దాకా ఆయనే  ఇరుముడి సినిమా విషయానికి వస్తే సాధారణ కుటుంబాలలో ఆడపిల్లలు బయటకు వెళ్లి మాట్లాడటానికి భయపడే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, ఈ చిత్రం ఆడపిల్లలకు ధైర్యాన్ని నూరిపోసేలా ఉందనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి 100 మంది తల్లిదండ్రులలో 80 శాతం మంది తమ పిల్లలకు రక్షణ గురించి నేర్పించే విధానంలో ఇరుముడి ఒక కొత్త ఆలోచనని  రేకెత్తిస్తోంది. అందుకే అంటారు సినిమా ఆదిపరాశక్తితో సమానమని . Irumudi, Raviteja, Tollywood    
Ravi Teja is visibly overwhelmed by the response to Irumudi, which has emerged as a record-breaking blockbuster with strong weekday momentum. Speaking at the film’s success meet, the Mass Maharaja said the emotional response from audiences has been unlike anything he has experienced in his career. Ravi Teja revealed that he has been receiving congratulatory messages, audience videos and constantly coming across emotional reactions to the film on social media. He was particularly surprised to see families and aged audiences turning up in theatres. “I have never seen such an emotional response in my life,” he said, crediting the story for connecting deeply with viewers. The actor also spoke about his long-standing desire to explore rooted stories. Having watched films across languages during the pandemic, he wondered whether Telugu audiences would embrace such realistic narratives. Irumudi, according to him, has answered that question emphatically. Director Shiva Nirvana was praised for his conviction and clarity, while Ravi Teja said he gives complete freedom to directors once a script is locked. The actor thanked producers Mythri Naveen and Mythri Ravi and the entire team for making the film possible. With Irumudi continuing its phenomenal weekday run, Ravi Teja promised to keep choosing films that combine entertainment with strong content. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  కామెడీ నటుడుగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి క్యారక్టర్ ఆర్టిస్ట్ గాను పర్ఫెక్ట్ ఫిగర్ అని ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకుంటున్నాడు రాహుల్ రామకృష్ణ.. సోషల్ మీడియా వేదికగా తను చేసే పోస్ట్ లు వైరల్ గా నిలుస్తాయి. తాజాగా ఎక్స్ వేదికగా ‘చితి చివరిదాంక… KCR!’ అనే పోస్ట్ చేసాడు. దీంతో ఆనవాయితీ ప్రకారం సదరు  పోస్ట్ క్షణాల్లో  వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ వెనుక ఉన్న అసలు సందర్భం లేదా ఉద్దేశం ఏంటనేది ఆయన స్పష్టంగా వివరించకపోయినప్పటికీ, నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ అభిమానులు ఆ పోస్టుకి మద్దతుగా కామెంట్లు చేస్తుండగా, మరికొందరు రాహుల్ రామకృష్ణని  లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. Also Read:  కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం Rahul Ramakrishna, kcr  
  సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 1 నేనొక్కడినే మూవీతో జతకట్టి  తెలుగు ప్రేక్షకులని పలకరించిన  కృతిసనన్ ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ లో దూసుకెళ్తుంది. రీసెంట్ గా కాక్ టెయిల్ 2 తో అలరించిన కృతి  ఈ నెల 28 న రాబోతున్న రక్షాబంధన్ పండుగని పురస్కరించుకొని చేసిన యాడ్ వివాదంగా మారింది. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ 'గివా' (GIVA) తమ రక్షాబంధన్ మరియు పెట్ కలెక్షన్ ప్రమోషన్ లో భాగంగా ఈ కమర్షియల్ యాడ్‌ను రూపొందించింది. ఈ ప్రకటనలో కృతి  ఆఫ్ వైట్ రంగులో ఉన్న బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, దానిపై ష్రగ్ (కేప్) మరియు డ్రేప్డ్ స్కర్ట్‌తో కూడిన మోడ్రన్ ఇండో-వెస్ట్రన్ లుక్‌లో కనిపించారు. పవిత్రమైన రక్షాబంధన్ పండుగ వేళ, సొంత సోదరుడికి రాఖీ కట్టే సమయంలో ఇలాంటి బోల్డ్ బ్రాలెట్ దుస్తులు ధరించడం సంప్రదాయాలకి విరుద్ధం. రాఖీ కట్టేటప్పుడు కనీసం పూజా పళ్లెం, తిలకం, పసుపు కుంకుమ వంటి ప్రాథమిక సాంప్రదాయ అంశాలు కనిపించకపోవడంపై కూడా నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంప్రదాయ వేడుకల పవిత్రతను ఈ ప్రకటన తగ్గించేలా ఉందంటూ నెటిజన్లలో ఒక వర్గం మండిపడుతోంది.  Also Read: హయ్యస్ట్ టికెట్ రేట్ ఇదే వివాదానికి తోడైన మరో కీలకమైన అంశం ఏమిటంటే.. ఈ యాడ్‌లో కృతి సనన్ తన సోదరుడికి రాఖీ కట్టిన తర్వాత, కుటుంబ సభ్యుడిగా భావిస్తూ తమ పెంపుడు కుక్కకు కూడా రాఖీ కడుతుంది. జ్యువెలరీ బ్రాండ్ తమ పెట్ రాఖీ సేకరణను ప్రమోట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నప్పటికీ, పెంపుడు జంతువులకు రాఖీ కట్టడాన్ని పండుగ మూల భావనను అపహాస్యం చేయడమేనంటూ ట్రోలర్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.  Kriti Sanon, Raksha Bandhan
The Drishyam franchise is not ending with its third chapter. Producer Antony Perumbavoor has confirmed that another instalment, Drishyam 4, is definitely in the works, giving fans of Mohanlal’s iconic Georgekutty yet another reason to look forward to the franchise. The announcement comes just months after Drishyam 3 continued the story of Georgekutty and his family. The third film itself became a major success, further strengthening the case for another chapter in the popular thriller franchise. Perumbavoor made the confirmation at a recent event, stating that a fourth Drishyam would happen. However, there is an interesting question surrounding the project. While the producer has confirmed Drishyam 4, Mohanlal and director Jeethu Joseph have not separately made an official announcement confirming their involvement in the fourth film. Mohanlal had earlier spoken about the possibility of continuing Georgekutty’s story, while Jeethu has maintained that he would only pursue another sequel if he found a story strong enough to justify it.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  రాకింగ్ స్టార్ యష్ వన్ మాన్ షో 'టాక్సిక్' టెంపరేచర్ అభిమానుల్లోను, ప్రేక్షకుల్లోను రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇందుకు నిదర్శనంగా ముందస్తు బుకింగ్ లో సాధిస్తున్న రికార్డులు చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.ఈ క్రేజ్ ఎంతలా ఉందంటే, ప్రధాన మహానగరాల్లో టికెట్ ధరలు భారీ స్థాయిలో ఉన్నాయి.  ముఖ్యంగా ముంబై బాంద్రాలోని జియో వరల్డ్ డ్రైవ్ వంటి ప్రీమియం థియేటర్లలో ఎంపిక చేసిన ప్రత్యేక షోల కోసం టికెట్ ధర ఏకంగా 2600 వరకు ఉండగా, బెంగళూరులోని ఫోరమ్ రెక్స్ వాక్ వంటి ప్రసిద్ధ ప్రదేశాల్లో 2,181 గా నమోదైంది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే, కన్నడ వెర్షన్ సగటు టికెట్ రేట్ 404 ,హిందీ వెర్షన్ సగటు టికెట్ ధర  364 గా  కొనసాగుతోంది. ఇంత భారీ ధరలు ఉన్నప్పటికీ, బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే థియేటర్లు హౌస్ ఫుల్ అయిపోవడం యశ్ బాక్సాఫీస్ స్టామినాకి  అద్దం పడుతోంది.  అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే  విడుదల రోజుకి సంబంధించి ఇండియాలోనే  నేరుగా 5,55,328 టికెట్లు అమ్ముడై  21.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.  Also Read: నిర్మాతగా మారనున్న నిత్యామీనన్.. హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు దేశవ్యాప్తంగా మొత్తం 13,591 షోలలో ఈ భారీ బుకింగ్స్ నమోదుకాగా, హోల్డ్ చేసిన స్థానాలని  (Block Seats) కూడా పరిగణనలోకి తీసుకుంటే విడుదల మొదటి రోజు ముందస్తు గ్రాస్ కలెక్షన్ ఏకంగా 30.14 కోట్లకు చేరుకోవడం ఒక సంచలనం. ఇందులో యశ్ స్వరాష్ట్రమైన కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. కర్ణాటకలో 8.08 కోట్లకు పైగా గ్రాస్ సాధించగా, అందులో రాజధాని బెంగళూరు ఒక్కటే 648 షోల ద్వారా  6.07 కోట్లను రాబట్టింది.  కేవలం దక్షణాదినే కాకుండా ఉత్తరాది మార్కెట్ లో కూడా యశ్ మానియా కొనసాగుతోంది. హిందీ డబ్బింగ్ వెర్షన్ ముందస్తు బుకింగ్స్ లో 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై రూ. 7.35 కోట్ల వసూళ్లను సాధించింది. విదేశాల్లో కూడా ఈ మూవీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తర అమెరికా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటికే 1,63,150 డాలర్ల పైగా గ్రాస్ నమోదు కాగా, 260 కి పైగా ప్రాంతాల్లో 709 షోలకు గాను 7,545 టికెట్లు అమ్ముడయ్యాయి. ఇందులో విచిత్రంగా కన్నడ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ అడ్వాన్స్ కలెక్షన్స్ లో ముందంజలో ఉండటం గమనార్హం. యుఎస్ లో తెలుగు వెర్షన్ ద్వారా 4,359 టికెట్లతో 94,706 డాలర్లు రాగా, కన్నడ వెర్షన్ 3,173 టికెట్లతో 68,246 డాలర్లు వసూలు చేసింది.   Yash, Toxic, Kaira Adwani, Nayanthara, Geethu Mohandas
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
చిన్న పిల్లలు కొద్దిగా దగ్గినా లేదా జలుబుతో బాధపడినా వెంటనే ఆందోళనకు గురై మెడికల్ షాప్‌కు వెళ్లి ఓవర్ది  కౌంటర్ (OTC) దగ్గు సిరప్‌లు కొని వేయడం చాలామంది తల్లిదండ్రులకు ఉన్న అలవాటు. కానీ, ఈ అలవాటు పిన్న వయస్కులైన పిల్లల ప్రాణాలకే తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని వైద్యాధికారులు మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా 2 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పసిపిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యుల అనుమతి లేని దగ్గు సిరప్‌లను వాడకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే 4 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా సాధారణ దగ్గు, జలుబు సమస్యల కోసం డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా విచ్చలవిడిగా ఈ సిరప్‌లను ఇవ్వడం శ్రేయస్కరం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా విక్రయమవుతున్న కొన్ని రకాల దగ్గు సిరప్‌లలో విషపూరితమైన డైఎథిలీన్ గ్లైకాల్ (Diethylene Glycol) మరియు ఎథిలీన్ గ్లైకాల్ (Ethylene Glycol) వంటి ప్రమాదకర రసాయనాల అవశేషాలు ఉండటంతో పాటు, 4 ఏళ్ల లోపు పిల్లల్లో వీటి డోసేజ్ తేడా వస్తే ఊపిరితిత్తులు మరియు కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP) అందించిన మార్గదర్శకాల ప్రకారం, దగ్గు అనేది శరీరానికి సహజంగా వచ్చే ఒక రక్షణ వ్యవస్థ. శ్వాసనాళాల్లోకి చేరిన శ్లేష్మం లేదా దుమ్మును బయటకు పంపడానికి శరీరం చేసే సహజ ప్రయత్నమే దగ్గు. కాబట్టి ప్రతీ చిన్న దగ్గుకు మందులు వాడాల్సిన అవసరం లేదని పీడియాట్రిషియన్లు చెబుతున్నారు. పసిపిల్లలకు ఓవర్ ది కౌంటర్ కోల్డ్ మరియు సిరప్‌లు ఇవ్వడం వల్ల వారి గుండె కొట్టుకునే వేగం అసాధారణంగా పెరగడం, మూర్ఛ రావడం, విపరీతమైన మగత మరియు శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు రావడం వంటి 100% ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఎదురయ్యే అవకాశం ఉందని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.       Kids cough syrup health advisory alert,is cough syrup safe for toddlers.
నేటి ఫిట్‌నెస్ ప్రపంచంలో జిమ్‌కు వెళ్లే యువత నుండి క్రీడాకారుల వరకు ప్రతీ ఒక్కరి నోట వినపడే ఏకైక పేరు 'క్రియేటిన్' (Creatine). వర్కౌట్ రోటీన్‌ను వేగవంతం చేయడానికి, కండరాల పరిమాణాన్ని పెంచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సప్లిమెంట్‌గా సామాజిక మాధ్యమాల్లో మరియు ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా విపరీతంగా ప్రచారం పొందుతోంది. కేవలం బాడీబిల్డర్లకే కాకుండా, బ్రెయిన్ పవర్ మరియు జ్ఞాపకశక్తిని పెంచే కాగ్నిటివ్ బెనిఫిట్స్ కూడా దీని ద్వారా లభిస్తాయని పెద్ద ఎత్తున దావాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ గ్లామరస్ హైప్ వెనుక ఉన్న అసలు శాస్త్రీయ ఆధారాలు ఏమిటి? సైన్స్ దీని గురించి ఏం చెబుతోంది అనే విషయాలను సైన్స్ ఎడిటర్ ఇయాన్ శాంపిల్ మరియు ఇంగ్లాండ్‌లోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ న్యూట్రిషనల్ ఫిజియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జస్టిన్ రాబర్ట్స్‌లతో కలిసి ద గార్డియన్ 'సైన్స్ వీక్లీ' పాడ్‌కాస్ట్‌లో హోస్ట్ మెడలైన్ ఫిన్లే సమగ్రంగా విశ్లేషించారు. క్రియేటిన్ అనేది మానవ శరీరంలో కాలేయం, మూత్రపిండాలు మరియు ప్యాంక్రియాస్‌లలో సహజంగా తయారయ్యే ఒక రసాయన సమ్మేళనం. మన రోజువారీ ఆహారంలో భాగమైన రెడ్ మీట్, చికెన్ మరియు చేపల వంటి జంతు ఆధారిత ప్రోటీన్ల ద్వారా కూడా ఇది శరీరానికి లభిస్తుంది. శరీరంలో ఇది అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ లేదా ఎటిపి (ATP) ను వేగంగా తిరిగి ఉత్పత్తి చేయడానికి ఒక ఫ్యూయల్ మూలంగా పనిచేస్తుంది. ఎటిపి అనేది మన శరీర కణాలు తక్షణ శక్తి కోసం ఉపయోగించే ప్రాథమిక అణువు. వ్యాయామం లేదా జిమ్‌లో తీవ్రమైన వర్కౌట్లు చేస్తున్నప్పుడు, కండరాలు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి క్రియేటిన్ సహాయపడుతుంది. ఉదాహరణకు, బరువులు ఎత్తే వేళ లేదా స్ప్రింట్ రన్నింగ్ లాంటి హై ఇంటెన్సిటీ యాక్టివిటీలలో అదనంగా మరికొన్ని రిపిటీషన్లు చేయడానికి ఇది శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే, సుదీర్ఘ సమయం పాటు సాగే మారథాన్ రన్నింగ్ వంటి వర్కౌట్లకు ఇది పెద్దగా ఉపయోగపడదని పరిశోధనలు తేల్చాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, క్రియేటిన్ మోనోహైడ్రేట్ (Creatine Monohydrate) అనేది అత్యధికంగా పరిశోధించబడిన మరియు అత్యంత సురక్షితమైన ఫార్ములేషన్. సాధారణ ఆరోగ్యవంతులైన వ్యక్తులకు రోజూ 3 గ్రాముల నుండి 5 గ్రాముల మోతాదులో దీనిని తీసుకోవడం వల్ల కండరాల బలం పెరగడంతో పాటు వ్యాయామ పనితీరు మెరుగవుతుందని సైన్స్ ఆధారాలు నిరూపిస్తున్నాయి. కొన్ని పరిశోధనాత్మక అధ్యయనాలలో, క్రియేటిన్ సప్లిమెంటేషన్ తీసుకున్న వ్యక్తులు తమ లిఫ్టింగ్ కెపాసిటీని 30 శాతం కంటే ఎక్కువగా పెంచుకోగలిగారని మరియు కండరాల పునరుద్ధరణను వేగవంతం చేసుకున్నారని గుర్తించారు.     creatine health benefits and side effects,how creatine works for muscle growth.
సంగీత ప్రపంచంలో తన ప్రత్యేకమైన గాత్రంతో, అద్భుతమైన స్టేజ్ పెర్ఫార్మెన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ క్వీన్ (Queen) బ్యాండ్ ఫ్రంట్‌మాన్ ఫెడ్డీ మెర్క్యురీ (Freddie Mercury) 80వ జయంతి సందర్భంగా లండన్‌లోని ప్రసిద్ధ విక్టోరియా అండ్ ఆల్బర్ట్ (V&A) మ్యూజియంలో ఆయన అరుదైన కాస్ట్యూమ్స్ ప్రదర్శనకు సిద్ధమయ్యాయి. 1946 సెప్టెంబర్ 5న జాన్జిబార్‌లో ఫారోఖ్ బల్సారాగా జన్మించిన ఫెడ్డీ మెర్క్యురీ, ప్రపంచ సంగీత శిఖరాలను అధిరోహించిన తీరు ఓ అద్భుతం. ఆయన జ్ఞాపకార్థం  ఫెడ్డీ మెర్క్యురీ: స్ప్లెండిడ్ థింగ్స్  పేరుతో ఒక ఉచిత ప్రదర్శన ట్రయల్‌ను 2026 అక్టోబర్ 24 నుండి 2027 జనవరి 17 వరకు లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రత్యేకమైన ఎగ్జిబిషన్‌ను మెర్క్యురీ మాజీ కాబోయే భార్య మరియు ఆయన ఆత్మీయ మిత్రురాలు మేరీ ఆస్టిన్ భాగస్వామ్యంతో రూపుదిద్దారు. 1978లో ఫెడ్డీ మెర్క్యురీ వ్యాఖ్యానిస్తూ, నేను ఎల్లప్పుడూ అద్భుతమైన మరియు శ్రేష్ఠమైన వస్తువుల (Splendid Things) నడుమ జీవించడానికి ఇష్టపడతాను  అని చెప్పిన మాటల ఆధారంగా ఈ ప్రదర్శనకు ఆ పేరును ఖరారు చేశారు. ఈ ప్రదర్శనలో ఫెడ్డీ మెర్క్యురీ యొక్క 1970ల ప్రారంభ రోజుల నుండి ఆయన చివరి లైవ్ పెర్ఫార్మెన్స్ వరకు ఉన్న 8 అత్యంత ప్రసిద్ధ కాస్ట్యూమ్స్‌ను ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. వీటిలో 7 కాస్ట్యూమ్స్‌ను మేరీ ఆస్టిన్ స్వయంగా తన వ్యక్తిగత సేకరణ నుండి మ్యూజియానికి అందిస్తున్నారు. మేరీ ఆస్టిన్‌కు 19 ఏళ్లు, ఫెడ్డీకి 24 ఏళ్లు ఉన్నప్పుడు 1969,70 కాలంలో కెన్సింగ్టన్ ఫ్యాషన్ రంగంలో వారిద్దరి మొదటి పరిచయం ఏర్పడింది. అనంతరం 1973 క్రిస్మస్ రోజున వారు నిశ్చితార్థం చేసుకున్నారు. 1970ల మధ్యకాలంలో వీరి వ్యక్తిగత బంధం ముగిసినప్పటికీ, 1991లో ఫెడ్డీ మెర్క్యురీ మరణించే వరకు వారి మధ్య అత్యంత బలమైన మైత్రి కొనసాగింది. అందుకే ఆయన తన లండన్ కెన్సింగ్టన్ నివాసమైన గార్డెన్ లాడ్జ్ తో పాటు తన సమస్త వ్యక్తిగత వస్తువులను కూడా మేరీ ఆస్టిన్‌కే కేటాయించారు. ఫెడ్డీ మెర్క్యురీ కేవలం బట్టలు ధరించలేదని, వేలాది మంది ప్రేక్షకుల ముందు తన సంగీత పరిమాణానికి సరిపోయేలా తన రూపాన్ని తీర్చిదిద్దుకోవడంలో దుస్తులను ఒక శక్తివంతమైన సాధనంగా వాడారని మేరీ ఆస్టిన్ పేర్కొన్నారు.       freddie mercury 80th birthday costume trail,mary austin freddie mercury fashion collection.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఒత్తిడి, ఆందోళన, అలసట, ఏకాగ్రత తగ్గడం వంటి ఇబ్బందులు కనిపించవచ్చు. ఇలాంటి సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు యోగా, ప్రాణాయామం కూడా కొంతమందికి ఉపయోగకరంగా ఉండొచ్చు. అలాంటి ప్రాణాయామాల్లో ఉజ్జయి ప్రాణాయామం (Ujjayi Pranayama) ఒకటి. దీనిని చేస్తూ శ్వాస తీసుకునేటప్పుడు గొంతు భాగంలో స్వల్పంగా శబ్దం వస్తుంది. అందుకే దీనిని కొందరు “Ocean Breath” అని కూడా అంటారు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్, ఆయుర్వేద డైటీషియన్ స్రవంతి రఘు ఉజ్జయి ప్రాణాయామాన్ని ఎలా చేయాలి? శ్వాసను ఎలా  నియంత్రించాలి? రోజువారీ జీవితంలో దీనిని ఎలా ప్రాక్టీస్ చేయాలి? వంటి విషయాలను సులభంగా వివరిస్తున్నారు. థైరాయిడ్ సమస్యలతో పాటు ఒత్తిడి, మానసిక ఆందోళన లేదా ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఉన్నవారు ఈ ప్రాణాయామం గురించి తెలుసుకోవచ్చు. అయితే ప్రాణాయామం థైరాయిడ్‌కు వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. థైరాయిడ్‌కు మందులు వాడుతున్నవారు వైద్యుల సూచనలను తప్పకుండా పాటించాలి. గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాత యోగా లేదా ప్రాణాయామాన్ని ప్రారంభించడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
సూపర్‌మార్కెట్‌లో, షాప్స్ లో, చిన్న అంగళ్లలో కొనుగోలు చేసే బిస్కెట్లు, ప్యాకెట్ ఫుడ్స్, పాల ఉత్పత్తులు, జ్యూస్‌లు, సాస్‌లు, రెడీ-టు-ఈట్ ఆహార పదార్థాలపై “Best Before”, “Use By”, “Expiry Date” వంటి పదాలు కనిపిస్తుంటాయి. చాలామందికి వీటి మధ్య తేడా స్పష్టంగా తెలియదు. “తేదీ అయిపోయింది కదా… ఇక ఆహారం మొత్తం పారేయాలా?” అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అంతే కాదు.. తేదీ దాటి ఇంకా ఒక్కరోజే, ఒక్క వారమే.. కాబట్టి ఏమి కాదు అనుకుని  వాడేవాళ్ళు  కూడా ఉంటారు. అయితే Best Before తేదీ , Use By/Expiry తేదీ ఒకే అర్థాన్ని ఇవ్వవు. ఆహారం ఎంతకాలం నాణ్యతగా ఉంటుంది? ఎప్పుడు దాన్ని తినడం సురక్షితం కాదు? అనే విషయాల్లో ఈ తేదీలకు చాలా తేడా ఉంది. దీని గురించి ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. తేదీ ఎందుకు వేస్తారు? ఆహార పదార్థాలను తయారు చేసిన తర్వాత వాటి రుచి, వాసన, రంగు, ఆకృతి, పోషకాల నాణ్యత, భద్రత కాలం గడిచేకొద్దీ మారవచ్చు. అందుకే తయారీదారులు ప్యాకెట్‌పై ఒక నిర్దిష్ట తేదీని సూచిస్తారు. అయితే ఆ తేదీ ప్రతి సందర్భంలో “ఆ రోజు తర్వాత ఆహారం విషంగా మారుతుంది” అని అర్థం కాదు.  ఇక్కడే Best Before, Use By మధ్య తేడా వస్తుంది. “Best Before” అంటే ఏమిటి? Best Before అంటే ఆ ప్యాక్ లో ఉన్న ఆహార పదార్థం  మంచి నాణ్యతను కలిగి ఉండే కాలం. అంటే, ప్యాకెట్‌పై..  ఒక నిర్దిష్ట తేదీ వరకు ఆహారం తన రుచి, వాసన, క్రిస్పీనెస్, రంగు వంటి నాణ్యతలను బాగా కలిగి ఉంటుందనీ అర్ధం. తేదీ దాటిన వెంటనే ఆహారం పాడైపోతుందా? సరిగ్గా నిల్వ చేసిన కొన్ని ఆహార పదార్థాలు Best Before తేదీ దాటిన తర్వాత కూడా కొంతకాలం తినడానికి అనుకూలంగా ఉండవచ్చు. అయితే వాటి నాణ్యత తగ్గి ఉండవచ్చని చెబుతున్నారు. ఉదాహరణకు.. బిస్కెట్లు మెత్తబడవచ్చు, సీరియల్స్ క్రిస్పీనెస్ కోల్పోవచ్చు, కొన్ని ప్యాకెట్ ఫుడ్స్ రుచి తగ్గవచ్చు, టీ, కాఫీ వంటి పదార్థాల సువాసన తగ్గవచ్చు. అందుకే  Best Before అనేది ప్రధానంగా నాణ్యతకు సంబంధించిన అంశం అని చెబుతారు. “Use By” అంటే ఏమిటి? Use By అనేది ఆహారం  భద్రతకు సంబంధించిన గడువు. ఈ తేదీ ముఖ్యంగా త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలకు వర్తిస్తుంది. ఉదాహరణకు: కొన్ని తాజా పాల ఉత్పత్తులు,  తాజా మాంసం, చేపలు, కొన్ని రెడీ-టు-ఈట్ ఆహారాలు, త్వరగా పాడయ్యే ఇతర ఆహారాలు ప్యాకెట్‌పై నిర్ణీత తేదీ ఉంటే.. ఆ తేదీ దాటిన తర్వాత అది బయటికి చూడటానికి లేదా వాసనకు బాగానే ఉన్నప్పటికి తినడం సురక్షితం అని అని అనుకోకూడదు.  అందుకే Use By తేదీ దాటిన ఆహారాన్ని తినకుండా ఉండటం మంచిది. Best Before తేదీ దాటితే ఏం చేయాలి? ఆహారం ఏ రకమైనది, ఎలా నిల్వ చేశారు, ప్యాకెట్ తెరిచారా లేదా అనే విషయాలపై ఇది ఆధారపడి ఉంటుంది. కొన్ని ఆహారాలు ఈ తేదీ దాటిన తర్వాత కూడా తినడానికి అనువుగానే ఉంటాయి. కానీ వాటిలో నాణ్యత మాత్రం తగ్గిపోయి ఉంటుంది. అలాంటి ఆహారం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాసన చూసి ఆహారం సురక్షితమా కాదా తెలుసుకోగలమా? కొన్ని హానికరమైన బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులు ఆహారంలో పెరిగినా, ఆహారంలో  దుర్వాసన, రంగు మార్పు కనిపించకపోవచ్చు కూడా. అందువల్ల ఆహారం వాసన రాలేదనే కారణంతో తినడం సరైనది కాదు. ముఖ్యంగా Use By తేదీ దాటిన ఆహారాన్ని కేవలం వాసన లేదా రుచి చూసి ఏమి కాదని  నిర్ధారించుకోవడం సరైన పద్ధతి కాదు. ప్యాకెట్ తెరిచిన తర్వాత గడువు మారుతుందా? కొన్ని ఆహార పదార్థాలకు ఇది చాలా ముఖ్యమైన విషయం. కొన్ని ఆహారాల మీద best before అని ఉన్నా.. ప్యాకెట్ లు లేదా బాటిల్ మూతలు తెరిచిన తర్వాత వాటిని ఎక్కువ రోజులు వాడటం మంచిది కాదు. వాటిని తొందరగా వాడేయాలి.                                                                                                                                                   *రూపశ్రీ.
ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి? అనే విషయాలను ఈ వీడియోలో డాక్టర్ ఆర్. బాలాజీ సులభంగా వివరిస్తున్నారు. కాలేయ కణాల్లో అధికంగా కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ (Fatty Liver Disease) అంటారు. చాలా మందిలో దీనివల్ల ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే కొంతమందిలో అలసట, బరువు తగ్గడం లేదా పొత్తికడుపులో అసౌకర్యం వంటి సమస్యలు కనిపించవచ్చు. అధిక బరువు, ఊబకాయం, జీవనశైలి వంటి కారణాలు ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును నియంత్రించుకోవడం ద్వారా ప్రమాద కారకాలను తగ్గించుకోవచ్చు. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కొంతమందిలో ఈ సమస్య కాలేయంలో తీవ్రమైన మార్పులకు దారితీసే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్‌కు కారణాలు ఏమిటి? దాని లక్షణాలు ఏంటి? ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి పూర్తి వివరాలను డాక్టర్ ఆర్. బాలాజీ ఈ వీడియోలో వివరించారు. వీడియోను పూర్తిగా చూడండి.. ఫ్యాటీ లివర్ గురించి ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా లక్షణాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)