LATEST NEWS
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అనుకోని వ్యక్తిగత కారణాల వల్ల లేదా అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో తాము ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో చాలా మంది కన్ఫర్మ్ అయిన తమ టికెట్‌ను రద్దు చేసుకుని క్యాన్సిలేషన్ ఛార్జీల రూపంలో డబ్బులు నష్టపోతుంటారు. కానీ, ప్రయాణికులకు ఆర్థిక నష్టం కలగకుండా ఉండేందుకు భారతీయ రైల్వే ఒక అద్భుతమైన సదుపాయాన్ని కల్పిస్తోంది. మీ ప్రయాణం రద్దయినప్పుడు మీ కన్ఫర్మ్ అయిన రైల్వే టికెట్‌‌ను మీ కుటుంబ సభ్యుల పేరు మీదకు చట్టబద్ధంగా బదిలీ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఈ నిబంధనలు మరియు విధివిధానాల గురించి ప్రయాణికులు కచ్చితంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, మీరు మీ కన్ఫర్మ్ రైలు టికెట్‌ను మీ సమీప కుటుంబ సభ్యులకు మాత్రమే బదిలీ చేయడానికి అనుమతి ఉంది. ఇందులో మీ తండ్రి, తల్లి, భార్య, భర్త, సోదరుడు, సోదరి, కొడుకు లేదా కుమార్తె వంటి ఇన్‌స్టంట్ ఫ్యామిలీ మెంబర్స్‌కు మాత్రమే ఈ టికెట్ ట్రాన్స్‌ఫర్ వర్తిస్తుంది. మీరు మీ స్నేహితులు, ఇరుగుపొరుగు వారు లేదా ఇతర దూరపు బంధువులకు ఈ టికెట్‌ను బదిలీ చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. రైల్వే శాఖ ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి ప్రధాన కారణం ఏజెంట్లు లేదా దళారులు సీట్లను బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించకుండా నిరోధించడమే. ఒకవేళ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా తమ స్నేహితులకు టికెట్ ఇస్తే, వారిని టికెట్ లేని ప్రయాణికులుగా పరిగణించి రూ.500 వరకు జరిమానా విధించే ప్రమాదం ఉంది. ఈ టికెట్ బదిలీ ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో మాత్రమే జరుగుతుంది. IRCTC వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో నేరుగా టికెట్‌ను వేరే వ్యక్తి పేరు మీదకు మార్చుకునే ఆప్షన్ అందుబాటులో లేదు. మీ కన్ఫర్మ్ టికెట్‌ను కుటుంబ సభ్యులకు మార్చాలంటే, రైలు బయలుదేరే సమయానికి కనీసం 24 గంటల ముందుగా సంబంధిత ప్రక్రియ పూర్తి చేయాలి. దీనికోసం మీరు ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్ ప్రింటవుట్, టికెట్ యజమాని మరియు ఎవరి పేరు మీదకు మార్చాలనుకుంటున్నారో వారి చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డులు (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మొదలైనవి)  సంబంధాన్ని రుజువు చేసే పత్రాలను తీసుకుని సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ను సంప్రదించాలి. కౌంటర్‌లో స్టేషన్ మేనేజర్ లేదా చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్‌కు ఒక వ్రాతపూర్వకమైన దరఖాస్తును సమర్పించాలి. ఆ అప్లికేషన్‌లో మీరు ఎందుకు ప్రయాణించలేకపోతున్నారో కారణం తెలిపి, ఎవరి పేరు మీదకు టికెట్ బదిలీ చేయాలో వారి పూర్తి వివరాలు పొందుపరచాలి. రైల్వే అధికారులు మీ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, బంధుత్వాన్ని ధృవీకరించిన తర్వాత రిజర్వేషన్ సిస్టమ్‌లో ప్రయాణికుడి పేరును అప్‌డేట్ చేస్తారు. ఇలా కేవలం ఒక్కసారి మాత్రమే టికెట్ మార్పునకు రైల్వే శాఖ అనుమతి ఇస్తుంది. RAC లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు ఈ బదిలీ నియమం వర్తించదు. కేవలం కన్ఫర్మ్ అయిన సీట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది కాబట్టి, ప్రయాణికులు ఈ నిబంధనలను సద్వినియోగం చేసుకుని క్యాన్సిలేషన్ ఛార్జీల భారం నుంచి సులభంగా బయటపడవచ్చు.       [ Indian Railways, Train ticket transfer, IRCTC ticket name change rules, transfer confirmed ticket, Indian railways rules, family ticket transfer, railway ticket update, Telugu One, Telugu News ] 
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది. మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో వెలుగు చూసిన ఒక సంచలన సంఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది. కన్నతండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయిన ఒక కుమార్తె, ఆయన ప్రాణాలు కోల్పోయినప్పటికీ తనతోనే ఉండాలని భావించింది. ఈ వికృతమైన ప్రేమతో ఏకంగా నాలుగేళ్ల పాటు తండ్రి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా ఒక డే కేర్ సెంటర్‌లో భద్రపరిచిన వైనం స్థానికంగా కలకలం రేపింది. ముంబైలోని మలాడ్ ఈస్ట్ ప్రాంతంలో ఈ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మలాడ్ ఈస్ట్ పరిధిలో మూసివేసి ఉన్న ఒక డే కేర్ సెంటర్ నుంచి గత కొంతకాలంగా తీవ్రమైన దుర్వాసన వస్తుండటాన్ని స్థానికులు గమనించారు. రోజురోజుకూ ఆ వాసన మరింత తీవ్రం కావడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతమంతా కంపు కొట్టడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మూసి ఉన్న డే కేర్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. సెంటర్ గేట్కు వేసి ఉన్న లాక్‌ను బలవంతంగా బ్రేక్ చేసి లోపలకు ప్రవేశించారు. అక్కడ పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. సెంటర్ లోపల పరిశీలించగా పూర్తిగా కుళ్లిన స్థితిలో ఒక మృతదేహం పడిఉంది. దీనిపై పోలీసులు లోతుగా విచారణ జరపగా, ఆ వృద్ధుడు సరిగ్గా 2022 సంవత్సరంలోనే గుండెపోటుతో మరణించినట్లు తేలింది. తండ్రి మరణవార్తను జీర్ణించుకోలేని ఆయన కుమార్తె, ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి నిరాకరించింది. తండ్రి మృతదేహం తనను వీడిపోకూడదని భావించిన ఆమె, ఒక విదేశీ సంస్థ సహాయాన్ని తీసుకుని మృతదేహం కుళ్లిపోకుండా ప్రత్యేకంగా భద్రపరిచే ఏర్పాట్లు చేసింది. తండ్రిపై ఆ మహిళకు ఉన్న అమితమైన ప్రేమే ఈ అసాధారణ నిర్ణయానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి చట్టపరమైన అంశాలను, కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, ఈ కేసులో తన తరఫున వాదించడానికి ఆ మహిళ ప్రత్యేకంగా లాయర్లను కూడా నియమించుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు. కన్న తండ్రి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా నాలుగేళ్ల పాటు కాపాడుకుంటూ వచ్చిన ఈ ఉదంతం ముంబైలో తీవ్ర చర్చనీయాంశమైంది.       [ Mumbai news, dead body preserved, 4 years, Dad day care, Malad East, bizarre incident, Malad East, Crime news,  Telugu One, Telugu News ]
తెలంగాణలో ఎన్నికల వేడి రగిలింది. ఒకవైపు శాసనమండలి ఎన్నికల హడావుడి కొనసాగుతుండగా..  మరోవైపు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నిక రాజకీయాలను వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ స్థానాన్ని దక్కించుకోవడం కోసం సర్వశక్తులు ఒడ్డుతుండగా, తాజాగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూడా  ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరి  నిలిచేందుకు సై అంటున్నది. ఈ పరిణామంతో   రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాజకీయం రసకందాయంలో పడింది.  ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వం రద్దు కావడంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ తమ స్థానాన్ని కాపాడుకోవడానికి పట్టుదలగా ఉండగా, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా సత్తా చాటుకోవడానికి ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది.  . ఇక భారతీయ జనతా పార్టీ సైతంఖైరతాబాద్ లో విజయం సాధించి  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో  ఉనికిని చాటుకోవడానికి  శ్రమిస్తోంది. ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.   ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమతమ అభ్యర్థుల ఎంపికపై అంతర్గత కసరత్తును ప్రారంభించాయి. ఈ తరుణంలో జనసేన పార్టీ కూడా ఖైరతాబాద్ బైపోల్‌‌లో పోటీ చేయాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేన ఏదో నామ మాత్రపు పోటీ మాదిరిగా కాకుండా.. విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలని భావిస్తోంది.  ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తగిన అంగబలంతో పాటు ఆర్థిక బలం ఉన్న బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు ఆ పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.   ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు పొత్తులో ఉండటమే కాకుండా, అధికారంలో కూడా భాగస్వాములుగా ఉన్నాయి. అయితే తెలంగాణ కు వచ్చే సరికి మాత్రం బీజేపీ, జనసేనలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితులు ఉంటాయని చెబుతున్నాయి.  ఇదే జరిగితే జనసేన పోటీ బీజీపీ ఓట్లకు గండి కొట్టే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ (కల్వకుంట్ల కవిత) బరిలో ఉండటం బీఆర్ఎస్ కు ఒకింత ఇబ్బందేనని చెబుతున్నారు.     [Janasena,  Khairatabad Bypoll, Telangana Politics, Khairatabad Assembly Election, Pawan Kalyan, Danam Nagender Disqualification, Kalvakuntla, Kavita, Trs, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడ కనిపించినా అభిమానులు భారీగా తరలివస్తుంటారు. అయితే ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ సాధారణంగా ఉండటానికి ఇష్టపడే రజనీకాంత్ మరోసారి తన సింప్లిసిటీతో అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా తన సినిమా షూటింగ్ కోసం ఏకంగా ఆటోలో స్పాట్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజనీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధర్మన్’ సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో పాల్గొనేందుకు రజనీకాంత్ ఆటోలో అక్కడికి వచ్చారు. మెరూన్ రంగు షర్ట్, పంచె ధరించిన ఆయన ఆటో నుంచి దిగగానే బయట వేచి ఉన్న అభిమానులకు చేతులు జోడించి నమస్కరించారు. అనంతరం వారిని పలకరిస్తూ షూటింగ్ సెట్‌లోకి వెళ్లారు. రజనీకాంత్ వస్తున్నాడని తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. అయితే సెట్‌లోకి వెళ్లిన తర్వాత కూడా అభిమానుల కోసం తలైవా మరోసారి బయటకు వచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది గేటు మూసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బయట నుంచి అభిమానుల నినాదాలు వినిపించడంతో రజనీకాంత్ వారిని పలకరించారు. దీంతో అభిమానులు మరింత ఉత్సాహంగా నినాదాలు చేశారు. షూటింగ్ స్పాట్‌కు రజనీకాంత్ ఆటోలో రావడం, అభిమానులను ఆప్యాయంగా పలకరించడం వంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ‘ధర్మన్’ విషయానికొస్తే.. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రజనీకాంత్ ఇందులో డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ద్వారా తెలుస్తోంది. సిమ్రాన్, రాశీ ఖన్నా, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైసూరులో సినిమా మూడో షెడ్యూల్ కూడా పూర్తయినట్లు సమాచారం.     [Rajinikanth, Rajinikanth Auto Video, Rajinikanth Dharman, Dharman Movie, Rajinikanth Viral Video, Rajinikanth Simplicity, Ashwath Marimuthu, Kamal Haasan, Raashii Khanna, Rajinikanth Latest News]
King Nagarjuna’s Geethanjali, one of the most celebrated romantic films in Telugu cinema, is set to return to theatres in an enhanced 4K version. The Mani Ratnam directorial, which continues to remain fresh even 37 years after its original release, will hit the big screens again on November 13. Geethanjali remains special for several reasons, including being Mani Ratnam’s only direct Telugu film. The story of two people battling terminal illness finding love was presented with a poetic treatment, making the film stand apart from conventional romances of its time. Nagarjuna and Girija’s performances and chemistry remain among the film’s biggest highlights. The film’s music by Maestro Ilaiyaraaja has also attained cult status over the years, with the songs continuing to remain popular among music lovers. From its emotional core to its visuals, performances and music, Geethanjali has retained its appeal across generations and is now being brought back to theatres for a new generation of audiences. Originally produced by Narasa Reddy, Geethanjali is regarded as one of the important films in Nagarjuna’s career. The actor has previously spoken about the film as one of his Top 5 films and expressed his pride in being part of a timeless classic directed by a filmmaker of Mani Ratnam’s stature. With the enhanced 4K presentation, audiences will get an opportunity to experience the classic on the big screen once again. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని సినిమాలు థియేటర్లలో మాదిరిగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి. ఇప్పుడు ‘ఇరుముడి’ సినిమా కూడా అదే జాబితాలో చేరింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా నాన్-ఇంగ్లిష్ సినిమాల విభాగంలో నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఇరుముడి’ నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోందని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన వస్తోందని చిత్రబృందం పేర్కొంది. ముఖ్యంగా నాన్-ఇంగ్లిష్ మూవీస్ కేటగిరీలో టాప్ ట్రెండింగ్ సినిమాగా నిలవడం విశేషంగా చెప్పుకోవచ్చు. దీంతో ‘ఇరుముడి’కి గ్లోబల్ స్థాయిలో కూడా ఆదరణ లభిస్తోందంటూ చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ హార్ట్ ఎమోజీలతో పోస్ట్ చేసింది. మరోవైపు ‘ఇరుముడి’ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐదు భాషల్లో అందుబాటులో ఉండటంతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులు ఈ సినిమాను చూసే అవకాశం ఏర్పడింది. అదే సమయంలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి రావడం సినిమాకు మరింత క్రేజ్ తీసుకొస్తోంది. ఇక ఒక సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత ఇతర భాషల ప్రేక్షకులకు కూడా చేరువ కావడం ప్రస్తుతం సర్వసాధారణంగా మారింది. అయితే ఏకంగా గ్లోబల్ నాన్-ఇంగ్లిష్ సినిమాల ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానానికి చేరుకోవడం మాత్రం చిత్రబృందానికి ప్రత్యేకమైన విజయంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ‘ఇరుముడి’కి సంబంధించిన ఈ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.     [Irumudi, Irumudi Netflix, Irumudi Movie, Irumudikattu, Irumudi Global Trending, Netflix Trending Movies, Irumudi Telugu, Irumudi Tamil, Irumudi Hindi, Irumudi OTT]
Ravi Teja’s Irumudi is continuing its successful run on OTT, emerging as the number one film on Netflix’s Global Top 10 Non-English Movies chart. The Shiva Nirvana directorial recorded 3.4 million views worldwide between September 21 and 27, marking a new milestone for a Telugu film on the streaming platform. The latest numbers come after the film registered another 3.4 million views during its initial three days on Netflix. With that, Irumudi has now clocked a total of 6.8 million views, delivering a strong first full week on the platform. The film’s global streaming performance comes after its successful theatrical run, where it emerged as a profitable venture for all parties involved. At the heart of Irumudi is the emotional bond between a father and his daughter, with Ravi Teja’s portrayal of a father and his relationship with his daughter forming the film’s central emotional core. The performances of Sai Kumar and Priya Bhavani Shankar also add to the film’s appeal, while Shiva Nirvana’s treatment has helped the story connect with audiences beyond the Telugu market. Produced by Mythri Movie Makers, Irumudi is currently streaming globally on Netflix in Telugu, Hindi, Tamil, Malayalam and Kannada. Its latest chart-topping performance shows the film continuing to find a wider audience even after its theatrical success. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్‌గా 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమాను ప్రత్యేకంగా వీక్షించి, ఆ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు.  మహేష్ బాబు సాధారణంగా ఒక సినిమా నచ్చితే మనస్ఫూర్తిగా అభినందిస్తారు. అలాంటిది తన 'వారణాసి' దర్శకుడు రాజమౌళి సమర్పణలో వస్తున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' చూడకుండా ఉంటారా?. చూశారు.. సోషల్ మీడియా వేదికగా రివ్యూ కూడా ఇచ్చేశారు. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా చూసిన తర్వాత మహేష్ పెట్టిన సుదీర్ఘమైన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. "ఇదొక బ్యూటిఫుల్, కంప్లీట్ ఎంటర్‌టైనింగ్ అండ్ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్" అంటూ సినిమా ఎంత హార్ట్ టచింగ్‌గా ఉందో ఆయన వివరించారు. ఇక ఈ సినిమాలో నటించిన యాక్టర్ ఫహాద్ ఫాజిల్ నటనపై మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. "ఫహాద్ సర్.. మీరు అద్భుతమైన నటుడు. ప్రతీ సినిమాలోనూ మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకునే తీరు, మీ నటన నాలాంటి వారికి ఎంతో ఇన్‌స్పిరేషన్" అని కొనియాడారు. అంతేకాదు, ఈ సినిమాలో నటించిన పాప ఎస్సారా, ఫహాద్ కాంబినేషన్ తెరకు సరికొత్త అందాన్ని తెచ్చిపెట్టిందని, వాళ్లిద్దరూ క్యారెక్టర్లలో జీవించారని అన్నారు. ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్న ఎస్.కార్తికేయను మహేష్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. "కార్తీ.. ఇన్నాళ్లకు నీ శ్రమ ఫలించింది, ప్రశాంతంగా శ్వాస తీసుకో. నువ్వు, శోభు కలిసి ఒక అద్భుతమైన సినిమాని అందించారు" అని ఆనందం వ్యక్తం చేశారు. డైరెక్టర్ శశాంక్ క్రియేట్ చేసిన ఈ వర్ల్డ్ ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తుందని, అక్టోబర్ 2న థియేటర్లలో ప్రతి ఒక్కరూ ఈ మ్యాజిక్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయాలని పిలుపునిచ్చారు. మొత్తానికి మహేష్ నుంచి 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమాకి పాజిటివ్ రివ్యూ వచ్చేసింది.  ఇది కూడా చదవండి: ‘ధురంధర్ 2’కు 50 కట్స్.. టీవీలో రాబోతున్న వెర్షన్‌లో ఏముందంటే.? https://x.com/urstrulyMahesh/status/2105281978283221008       [Mahesh Babu Review On Dont Trouble The Trouble, Don't Trouble The Trouble Movie, Don't Trouble The Trouble Review, Dont Trouble The Trouble, Mahesh Babu Twitter, Fahadh Faasil, SS Rajamouli, Telugu Film News, Tollywood Updates]  
Mahesh Babu has watched Dont Trouble the Trouble and is completely impressed with the film. The superstar took to social media to praise the film, calling it a beautifully complete experience and appreciating the entire team for delivering a warm and entertaining film. “Just watched the Don't Trouble The Trouble Movie!!! What a beautifully complete experience this is. Such a well crafted and happy film… thoroughly entertaining and deeply moving at the same time. The film carries such a rare sense of warmth throughout!!!” Mahesh had special praise for Fahadh Faasil and young actress Ssara. “Fahadh sir - u are a stupendous actor. Watching u evolve, experiment and reinvent yourself is truly inspiring. Fahadh sir and our lil cute Ssara are simply brilliant together. You can see the characters living, breathing and feeling every moment!!!” He also congratulated the film’s team, particularly producer Karth, Shobu and director Shashank. “Karth - you couldn’t have asked for a more special beginning. After everything you have poured into this film, you can finally breathe easy. You and Shobu have created something truly special and I couldn’t be happier for you both. Shashank you have done a fantastic job. The way you have brought this beautiful world together is truly commendable…” Mahesh concluded by calling the film a “gem” and urged audiences to watch it in theatres. “Sending all my love and best wishes to the entire team. You have a gem on your hands.. October 2nd… everyone should experience this magic.” Don't Trouble the Trouble is gearing up for its theatrical release on October 2. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Superstar Rajinikanth once again surprised his fans with a simple gesture. The actor arrived at the sets of his upcoming film Dharman in Mysuru in an auto-rickshaw, leaving the fans gathered outside the location excited. Videos of his arrival have now gone viral on social media. Rajinikanth was spotted stepping out of the auto with his security team around him before heading towards the shooting location. As soon as the fans spotted him, loud cheers erupted outside the set. The actor waved at the crowd and acknowledged their presence before entering the location. The excitement continued after he entered the set. With the cheers growing louder, Rajinikanth reportedly came out once again to greet the fans. Dressed in a maroon shirt and veshti, the superstar waved at the crowd, with several children also seen waiting outside the location. Some fans even recreated his iconic hand gesture from Baba. Dharman is being directed by Ashwath Marimuthu and features Rajinikanth alongside Simran, Raashii Khanna and Yogi Babu. The film is currently progressing with its shoot in Mysuru, while reports about additional cast members including Ram Pothineni and Sreeleela are yet to be officially confirmed. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Vijay Deverakonda and Rashmika Mandanna's the much-awaited pan-India film Ranabaali is directed by Rahul Sankrityan. Presented by T-Series and produced by Naveen Yerneni and Y. Ravi Shankar under the Mythri Movie Makers banner, the film is being made on a lavish scale. Ranabaali is gearing up for a grand worldwide theatrical release on October 16, on the occasion of Vijayadashami. As part of the four-episode documentary series titled “Ranabaali – Never Forget the Truth,” the second episode, “The History We Forgot,” is now streaming on YouTube. In this episode, Vijay Deverakonda and Rashmika Mandanna discuss historical truths that, according to the documentary, were deliberately kept out of public knowledge during British rule. They also explore how India’s agricultural wealth was exploited and how the British-built railway network was used to transport the country’s resources. Rashmika Mandanna said that if certain truths from history remained unknown to people, one reason was that the British prevented those facts from reaching the public, while Indians themselves also did not discuss them extensively. She added that while researching for the film, she gained a deeper understanding of that period, the circumstances of the time and the lives of people then. Learning about what actually happened during that era left her deeply emotional, she said. Vijay Deverakonda spoke about the commonly discussed narrative that the British built the Indian railway system as a contribution to India. He said that while the British did construct railway lines, the motives behind their construction and the interests they served were not always discussed. According to Vijay, he later learned that the railway network was largely built using Indian labour and served British economic interests.  He explained that railway lines enabled the British to transport agricultural produce from different parts of the country to ports and then ship it to Britain. He further claimed that enormous quantities of grain, cotton, spices and gold were transported through the railway network, describing this as part of the exploitation of India’s resources during British rule. The third episode, titled “The Men We Forgot,” will begin streaming on October 2. The streaming date for the fourth episode, “The Last Load,” will be announced soon. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
నేటి వేగవంతమైన జీవనశైలిలో అధిక రక్తపోటు లేదా సైలెంట్ కిల్లర్‌గా పిలిచే హై బీపీ సమస్య మిలియన్ల మంది ప్రజలను వేధిస్తోంది. బీపీని సహజసిద్ధంగా అదుపులో ఉంచుకోవడానికి సరైన ఆహార నియమాలు పాటించడం అత్యంత కీలకమని వైద్య నిపుణులు నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మన దైనందిన ఆహారంలో ఎక్కువగా భాగమయ్యే అరటిపండు, నారింజలలో ఏది రక్తపోటును తగ్గించడానికి ఎక్కువ మేలు చేస్తుందనే ఆసక్తికరమైన ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ మెదులుతుంది. నిజానికి ఈ రెండు పండ్లూ ఆరోగ్యానికి ఎంతో శ్రేష్ఠమైనవే అయినప్పటికీ, వాటిలో ఉండే పోషక విలువలు శరీరంలో భిన్నమైన రీతిలో ప్రభావం చూపుతాయి. హై బీపీని నియంత్రించడంలో పొటాషియం అనే ఖనిజ లవణం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారంలో పొటాషియం తగినంతగా లభించినప్పుడు అది శరీరంలో ఉండే అధిక సోడియం లేదా ఉప్పు ప్రభావాన్ని సమర్థవంతంగా సమతుల్యం చేస్తుంది. అలాగే రక్తనాళాల మూత్రపిండ వ్యవస్థ ద్వారా అదనపు సోడియంను మూత్రం రూపంలో బయటకు పంపివేసి, రక్తనాళాల గోడలపై పడే విపరీతమైన ఒత్తిడిని తగ్గించి వాటి సాధారణ పనితీరుకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది. అరటిపండును పరిశీలిస్తే, ఇది పొటాషియానికి ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన మూలంగా నిలుస్తుంది. ఒక సాధారణ మధ్యస్థ పరిమాణంలో ఉండే అరటిపండు ద్వారా శరీరానికి సుమారు 400 మిల్లీగ్రాముల అత్యధిక పొటాషియం లభిస్తుంది. ఈ అధిక పొటాషియం మోతాదు రక్తనాళాల సంకోచ సడలికలను క్రమబద్ధీకరించి, పెరిగిన రక్తపోటును తక్షణమే నియంత్రణలోకి తేవడానికి అమితంగా తోడ్పడుతుంది. మరోవైపు నారింజ పండు విషయానికి వస్తే, అరటిపండుతో పోలిస్తే ఇందులో పొటాషియం మోతాదు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, ఇది రోగనిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన విటమిన్ సి, ఫోలేట్ మరియు ఫ్లేవనాయిడ్స్ వంటి విశిష్టమైన పోషకాలను, యాంటీఆక్సిడెంట్లను పుష్కలంగా అందిస్తుంది. నారింజను కేవలం జ్యూస్‌ రూపంలో కాకుండా నేరుగా పూర్తి పండుగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసినంత విటమిన్ సీతో పాటు నాణ్యమైన ఫైబర్ కూడా లభించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల హై బీపీ ఉన్నవారు ఈ రెండింటిలో కేవలం ఒకే పండుపై ఆధారపడవలసిన అవసరం లేదు. అరటిపండు శరీరానికి కావలసిన పొటాషియంను అందిస్తే, నారింజ విటమిన్ సి, ఫోలేట్ వంటి పోషకాలతో రక్తనాళాల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. కాబట్టి రోజువారీ డైట్‌లో ఈ రెండింటితో పాటు ఆపిల్, కివి, పుచ్చకాయ మరియు అవకాడో వంటి రకరకాల పండ్లను సమతుల్యంగా చేర్చుకోవడం అత్యంత శ్రేయస్కరం. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి; కేవలం పండ్లు తినడం వల్లే బీపీ పూర్తిగా తగ్గిపోదు. దీనితో పాటు ఉప్పు వాడకం తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు బరువును అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి. అలాగే తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఉన్నవారు పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్ల వంటి ఆహారాన్ని తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.     Potassium Vs Vitamin C For Blood Pressure, High BP Control Potassium Benefits, Potassium 400mg For Hypertension, Vitamin C Blood Pressure Lowering, Best Nutrient To Lower BP, Sodium And Potassium Balance BP, Natural Remedies For High Blood Pressure, Hypertension Control Tips Telugu.  
నేటి తరం యువత లేదా జెన్ జీ (Gen Z) పండుగల షాపింగ్ చేసే విధానం పాత పద్ధతులకు పూర్తి భిన్నంగా, అత్యంత వినూత్నంగా మారుతోంది. ఒకప్పుడు పండుగ వస్తోందంటే నేరుగా బట్టల షాపులకు వెళ్లడం, నచ్చిన దుస్తులను కొనుగోలు చేయడం ఒక ఆనవాయితీగా ఉండేది. కానీ నేటి జెన్ జీ వినియోగదారులకు పండుగ షాపింగ్ అనేది కేవలం ఒక ట్రెండ్ చూసి వెంటనే బట్టలు కొనడం మాత్రమే కాదు; అదొక పెద్ద రీసెర్చ్ ప్రాసెస్. సోషల్ మీడియా ఆధారిత ఐడియాలు, పాత బట్టలను సరికొత్తగా మార్చే అప్‌సైక్లింగ్ హ్యాక్స్, నిజమైన కస్టమర్ రివ్యూలు, మరియు ఏఐ పరిజ్ఞానంతో బేరాలు ఆడటం వంటి అనేక ఆసక్తికరమైన వ్యూహాలు వీరి షాపింగ్ ప్లాన్‌లో ప్రధాన భాగంగా మారాయి. ఇటీవల వెలువడిన ప్రముఖ స్నాప్‌చాట్  జీడబ్ల్యూఐ (Snapchat GWI) అధ్యయనం ప్రకారం, ప్రతి 10 మంది జెన్ జీ వినియోగదారులలో ఏకంగా 7 మంది (70%) కొత్త దుస్తులు లేదా ప్రాడక్ట్‌లను కనుగొనడానికి సోషల్ మీడియా క్రియేటర్ల కంటెంట్‌‌పైనే ఆధారపడుతున్నారు. అంతేకాకుండా, అందులో 40 శాతం మంది ఏదైనా వస్తువును కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఇతర నెటిజన్లు లేదా స్నేహితుల సలహాలు, అభిప్రాయాలను కోరుతున్నారని ఈ గణంకాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. జెన్ జీ పండుగ షాపింగ్‌లో  అప్‌సైక్లింగ్  (Upcycling) అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాక్‌గా నిలుస్తోంది. దుస్తుల కోసం వేలాది రూపాయలు తగలేయకుండా, ఇంట్లో ఉండే అమ్మల, నానమ్మల పాత పట్టు చీరలను, సూట్లను సరికొత్త డిజైనర్ దుస్తులుగా మార్చుకోవడానికి నేటి యువత అమితంగా ఇష్టపడుతున్నారు. ఉదాహరణకు, దీపావళి వంటి పెద్ద పండుగలకు తల్లి పట్టు చీరను ట్రెండీ కో ఆర్డ్ సెట్ (Co ord set) గా మార్చడం, లేదా పాత పట్టుచీర సరిహద్దులను (Borders) కొత్త కుర్తాలకు లేదా ప్లెయిన్ దుస్తులకు కుట్టించి సరికొత్త లుక్ తీసుకురావడం నేటి ట్రెండ్. ఇటీవలే ట్రెండ్ అయిన  గోటా పట్టీ  (Gota Patti) లేస్‌ను సాధారణ కుర్తాలకు జతచేసి సరికొత్త పండుగ డ్రెస్‌గా డిజైన్ చేసుకోవడం యువతను బాగా ఆకట్టుకుంటోంది. సంప్రదాయబద్ధమైన దుస్తుల రూపాన్ని కోల్పోకుండానే, బ్లౌజ్ డిజైన్, శారీ డ్రేపింగ్, ట్రెండీ జ్యువెలరీ లేదా సరికొత్త రంగుల కాంబినేషన్‌తో మోడర్న్ టచ్ ఇవ్వడం జెన్ జీ క్రియేటివిటీకి అద్దం పడుతోంది. పండుగ ఫ్యాషన్ ట్రెండ్స్‌‌ను తెలుసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్ (Instagram), పింటరెస్ట్ (Pinterest) వంటి ప్లాట్‌ఫామ్‌లు వీరికి ప్రధాన ఆమోదయోగ్యమైన మూలాలుగా మారాయి. పండుగలకు నెల రోజుల ముందే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ధరించే దుస్తులు రాబోయే పండుగ సీజన్ ట్రెండ్స్‌ను నిర్దేశిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా కొత్త ఫ్యాషన్ ఐడియాలను చూసే యువత, వాటిని తాము నిజంగా కొనుగోలు చేయవచ్చా లేదా అని లోతుగా విశ్లేషించడానికి పింటరెస్ట్‌లో రీసెర్చ్ చేస్తున్నారు. ఇక్కడే కాకుండా, ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లలో బెస్ట్ డీల్స్ పొందడానికి కూడా ప్రత్యేకమైన ట్రిక్స్ వాడుతున్నారు. ఆన్‌లైన్ విష్‌లిస్ట్ (Wishlist) లేదా కార్ట్‌‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, ధరలు తగ్గగానే నోటిఫికేషన్లు పొందడం ద్వారా బడ్జెట్ ఆదా చేస్తున్నారు. ఉత్పత్తుల నాణ్యతను అంచనా వేయడానికి ఫేక్ రివ్యూలను పక్కనబెట్టి, అత్యంత నిజాయితీతో కూడిన రివ్యూలు లభించే  రెడ్డిట్  (Reddit) వేదికను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మరో ఆసక్తికరమైన అంశమేమిటంటే, ఈ ఆధునిక పండుగ షాపింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరగడం. రకరకాల ఈ కామర్స్ సైట్లలో ఉన్న ధరలను పోల్చి చూడటానికి, అలాగే ఏవి ఒరిజినల్ కస్టమర్ రివ్యూలు, ఏవి బాట్ (Bot) రివ్యూలు అని విశ్లేషించడానికి జెన్ జీ యువత ఏఐ ప్రాంప్ట్‌లను వాడుతోంది. లగ్జరీ డిజైనర్ వేర్ నచ్చినప్పుడు, అదే డిజైన్ కలిగిన కాపీ లేదా డ్యూప్ (Dupe) దుస్తులు తక్కువ ధరలో ఎక్కడ లభిస్తాయో ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. ఒకవేళ ఆన్‌లైన్ డ్యూప్ ధర, సొంతంగా బట్ట తీసి కుట్టించే ఖర్చు సమానంగా ఉంటే, లజపత్ నగర్ లేదా సరోజినీ నగర్ వంటి స్థానిక మార్కెట్లలో మెటీరియల్ కొని డిజైనర్ చేత కుట్టించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా ట్రెండ్స్, మరియు సాంప్రదాయకమైన పొదుపు సూత్రాలను సమ్మేళనం చేస్తూ జెన్ జీ జరిపే పండుగ షాపింగ్ ఇప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తోంది.     Gen Z Festive Fashion, Old Saree Conversion Ideas, DIY Designer Dresses Saree, Sustainable Fashion Gen Z, Old Saree to Indo Western Dress, Festive Shopping Hacks, Old Silk Saree Upcycling, Trending Saree Reuse Ideas.  
ఎవరూ దోచుకోలేని సంపద ఇదే.. చాణక్యుడు చెప్పిన గొప్ప సత్యం! జీవితంలో మనిషికి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. డబ్బు, పదవి, అధికారం ఉన్నా.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతే అవేవీ మనకు ఉపయోగపడవు. అందుకే చాణక్యుడు జ్ఞానానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. చాణక్య నీతి ప్రకారం.. మనిషి నిరంతరం జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండాలి. ఎందుకంటే జ్ఞానం అనేది ఎవరూ దోచుకోలేని సంపద. మన దగ్గర ఉన్న డబ్బు పోవచ్చు.. పదవి మారిపోవచ్చు.. కానీ మనం నేర్చుకున్న జ్ఞానం మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది. జ్ఞానం ఒక ఆయుధంలా పనిచేస్తుంది. ఏ పరిస్థితిలో ఎలా వ్యవహరించాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఎవరిని నమ్మాలి? ఎలాంటి సమస్యను ఎలా పరిష్కరించాలి? అనే విషయాల్లో జ్ఞానం మనకు మార్గనిర్దేశం చేస్తుంది. జ్ఞానం ఉన్న వ్యక్తి సమస్యలను చూసి భయపడకుండా.. వాటికి పరిష్కారం వెతుకుతాడు. ఒక సమస్య ఎదురైతే నిరాశ చెందకుండా, దాని నుంచి పాఠం నేర్చుకుని మరింత తెలివిగా ముందుకు సాగుతాడు. అందుకే జీవితంలో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునే అలవాటు చేసుకోవాలి. పుస్తకాలు చదవడం, అనుభవజ్ఞుల మాటలు వినడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, మన తప్పుల నుంచి పాఠాలు తీసుకోవడం.. ఇవన్నీ జ్ఞానాన్ని పెంచే మార్గాలే. గుర్తుంచుకోండి.. సంపదను కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ జ్ఞానం లేకపోతే.. సంపద ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టం. కాబట్టి జీవితంలో ఎదగాలంటే.. డబ్బుతో పాటు జ్ఞానాన్ని కూడా సంపాదించండి. ఎందుకంటే జ్ఞానం మీకు దారి చూపే దీపం మాత్రమే కాదు.. కష్టాలను ఎదుర్కొనే ఆయుధం కూడా. ఇక నుంచి రోజుకు కనీసం 20 నిమిషాలు మీ జ్ఞానం కోసం కేటాయించండి. ఒక మంచి పుస్తకం చదవండి.. ఒక కొత్త విషయం నేర్చుకోండి.. ఒక తప్పు నుంచి ఒక పాఠం తీసుకోండి. ఎందుకంటే ఒక మంచి జ్ఞానం.. ఒక జీవితాన్నే మార్చగలదు.! 
క్యాన్సర్ పేరు వినగానే భయపడాల్సిన అవసరం లేదు. అయితే శరీరంలో చాలాకాలంగా కొనసాగుతున్న కొన్ని అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయకుండా, వాటికి కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సాధారణ సమస్యలుగా భావించే కొన్ని లక్షణాలు తరచూ కనిపిస్తుంటే వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. నోటిలో తగ్గకుండా ఉండే పుండ్లు, రొమ్ములో కనిపించే మార్పులు, జీర్ణవ్యవస్థలో సమస్యలు, కారణం లేకుండా బరువు తగ్గడం, శరీరంలో అసాధారణ మార్పులు వంటి వాటిని ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి? క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు ఎంతవరకు ఉపయోగపడతాయి? ఏ వయసులో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? అంతేకాదు, క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా విధానాలు ఏమిటి? రోబోటిక్ సర్జరీ, ఆంకో-రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, మైక్రోసర్జరీ, బ్రెస్ట్ రీకన్‌స్ట్రక్షన్ వంటి విధానాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి క్యాన్సర్‌కు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడంతో పాటు, శరీరం ఇచ్చే అసాధారణ సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. గమనిక: ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. ఏదైనా అసాధారణ లక్షణం కొనసాగితే స్వయంగా నిర్ధారణ చేసుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించండి.మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఒక వినూత్నమైన వ్యాయామ విధానం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నెమ్మదిగా, ప్రశాంతంగా, డాన్స్ చేస్తున్నట్లుగా సాగే ఆ కదలికలే "తాయ్ చి". నార్మల్ గా అందరూ చేసే  జిమ్ వర్కౌట్లు, వేగంగా రన్నింగ్ చేయడం వంటివి కాకుండా  మానసిక ప్రశాంతతతో పాటు శరీరానికి  దారుఢ్యాన్ని ఇచ్చే ఈ ప్రాచీన విధానం వైపు నేటి యువత, ఫిట్‌నెస్ ప్రేమికులు విశేషంగా ఆకర్షితులవుతున్నారు. సోషల్ మీడియా లో రీల్స్, షార్ట్స్ లో వేలాదిమంది దీనికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుండటంతో ఇది నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఏమిటీ తాయ్ చి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. తాయ్ చి.. తాయ్ చి అనేది చైనాకు చెందిన ఒక ప్రాచీన మార్షల్ ఆర్ట్ విధానం. మొదట్లో  ఇది ఒక ఆత్మరక్షణ విద్యగా ఉద్భవించినప్పటికీ, కాలక్రమేణా ఇది ఒక అద్భుతమైన ఆరోగ్య, ఫిట్‌నెస్ సాధనగా రూపాంతరం చెందింది. దీనిని తరచుగా మూమెంట్ మెడిటేషన్ అని పిలుస్తారు. ఈ విధానంలో వేగవంతమైన కదలికలు ఉండవు. చాలా నెమ్మదిగా, శ్వాసపై ధ్యాస ఉంచుతూ, శారీరక సమతుల్యతను కాపాడుకుంటూ ఒక పోజిషన్ నుంచి మరొక పొజిషన్ కు  శరీరాన్ని తిప్పుతారు. శ్వాస ప్రక్రియను శరీర కదలికలతో అనుసంధానించడమే దీనిలోని ప్రధాన సూత్రం. ఇది శరీరంలోని అంతర్గత శక్తిని నిద్రలేపి, శరీరం అంతటా సరిగ్గా ప్రసరించేలా చేస్తుంది. చైనీస్ సంస్కృతిలో దీనిని 'చి' అని పిలుస్తారు. తాయ్ చి చేసే విధానం.. తాయ్  చి సాధనలో మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి.. నెమ్మదిగా చేసే కదలికలు.. శరీరంలోని ప్రతి కండరాన్ని ఉపయోగిస్తూ, కీళ్లపై ఎటువంటి ఒత్తిడి పడకుండా చాలా సజావుగా కదలికలు ఉంటాయి. లోతైన శ్వాస.. కదలికలకు అనుగుణంగా ప్రశాంతంగా, లోతుగా శ్వాస తీసుకోవడం , వదలడం జరుగుతుంది. మానసిక ఏకాగ్రత.. వ్యాయామం చేసే సమయంలో దృష్టి మొత్తం శరీరం , శ్వాసపైనే ఉంటుంది. దీనివల్ల బయటి ఆలోచనల నుంచి మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది. తాయ్ చి అందించే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. సోషల్ మీడియాలో ఇది కేవలం ఒక ఫ్యాషన్ గా మాత్రమే ట్రెండ్ కావడం లేదు, దీని వెనుక ఎన్నో శాస్త్రీయ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి తగ్గింపు.. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన సర్వసాధారణమయ్యాయి. తాయ్ చి లోని లోతైన శ్వాస , ఏకాగ్రతతో కూడిన కదలికలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. ఇది శారీరక ఒత్తిడిని తగ్గించి, మనస్సుకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. శరీర బ్యాలెన్స్ , దృఢత్వం.. వయసు పైబడిన వారికి లేదా కాళ్ళ బలం తక్కువగా ఉన్నవారికి తాయ్ చి ఒక వరప్రసాదం. ఇది కాళ్ళు, నడుము భాగాల్లోని కండరాలను బలోపేతం చేసి, శరీర సమతుల్యతను పెంచుతుంది. దీనివల్ల కింద పడిపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.. ఇది తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామం అయినప్పటికీ, రక్తాప్రసరణను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం.. ఆర్థరైటిస్ (కీళ్ల వాతం) లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. వేగవంతమైన వర్కౌట్ల వల్ల కీళ్లపై పడే భారంతో పోలిస్తే, తాయ్ చి కీళ్లను మెల్లిగా కదిలిస్తూ నొప్పులను తగ్గిస్తుంది. శ్వాసకోశ వ్యవస్థకు మంచిది.. దీనిలో శ్వాసపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలోని ప్రతి కణానికి ప్రాణవాయువు సమృద్ధిగా అందుతుంది. నిద్రలేమి సమస్యకు పరిష్కారం.. ప్రతిరోజూ కొద్దిసేపు తాయ్ చి సాధన చేయడం వల్ల రాత్రి వేళల్లో మంచి, ప్రశాంతమైన నిద్ర పడుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. ఏకాగ్రత , జ్ఞాపకశక్తి.. శరీరం , మనస్సు రెండింటినీ ఒకేసారి ఉపయోగించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇది ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచడంలో దోహదపడుతుంది. ఎవరైనా చేయవచ్చా? తాయ్ చి యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, దీనికి ప్రత్యేక పరికరాలు కానీ, పెద్ద స్థలం కానీ అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ దీనిని సాధన చేయవచ్చు. ఎటువంటి శారీరక శ్రమ లేకుండా, సున్నితమైన పద్ధతిలో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన మార్గం.                    *రూపశ్రీ.