LATEST NEWS
  కర్ణాటక పాలిటిక్స్‌లోకి టీవీకే ఎంట్రీ సంచలన వ్యూహం.. దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి, ఇటీవల జరిగిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు సృష్టించిన కోలీవుడ్ సూపర్ స్టార్, 'దళపతి' విజయ్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. తమిళనాడులో తన సొంత పార్టీ 'తమిళగ వెట్రి కజగం' (TVK) తరఫున ఒంటరిగా బరిలోకి దిగి 34.9 శాతం ఓట్ల శాతాన్ని కొల్లగొట్టడమే కాకుండా, ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్, కాంగ్రెస్ మరియు సీపీఐ(ఎం) మద్దతుతో 118 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.  అయితే తమిళనాడులో సాధించిన ఈ చారిత్రాత్మక విజయంతో ఆయన ప్రస్థానం ఆగడం లేదు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టేందుకు దళపతి విజయ్ వ్యూహాత్మక అడుగులు వేస్తుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ వార్త రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేపుతోంది.  ముఖ్యంగా కర్ణాటకలోని బెంగుళూరు నగరంతో పాటు తమిళ ప్రజలు అధిక సంఖ్యలో నివసించే సరిహద్దు జిల్లాలను లక్ష్యంగా చేసుకుని విజయ్ తన 'టివికె' పార్టీని విస్తరించాలని యోచిస్తున్నారు.  కర్ణాటకలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా బృహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) మరియు గ్రామీణ స్థానిక సంస్థల (GBA) ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించడానికి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కర్ణాటక వ్యాప్తంగా విజయ్‌కు లక్షలాది మంది అభిమానులు ఉండటం, బెంగళూరులోని కొన్ని ప్రాంతాలలో తమిళ ఓటర్ల శాతం దాదాపు 25 నుండి 30 శాతం వరకు ఉండటంతో ఈ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవచ్చని టీవీకే అధినేత భావిస్తున్నారు.  ఈ పరిణామాలు కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ప్రతిపక్ష బీజేపీ-జేడీఎస్ కూటమికి పెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే అంతర్గత నివేదికల ద్వారా విజయ్ ఎంట్రీ ప్రభావంపై ఆరా తీస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. తమిళనాడులో 2024 ఫిబ్రవరిలో పార్టీ పెట్టిన కేవలం రెండేళ్లలోనే ద్రావిడ దిగ్గజాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలను మట్టికరిపించి 234 స్థానాల్లోనూ బలమైన ఉనికిని చాటుకున్న విజయ్ క్రేజ్ సాధారణమైనది కాదు.  గతంలో 2025 సెప్టెంబర్ 27న జరిగిన కరూర్ భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది అభిమానులు మరణించిన దురదృష్టకర సంఘటన జరిగినప్పటికీ, విజయ్ ప్రజాబలం ఏమాత్రం తగ్గలేదు. అటువంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు బెంగళూరు రాజకీయాల్లో వేలు పెడితే, అది కర్ణాటక పాలిటిక్స్ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తుందనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో దళపతి విజయ్ కర్ణాటక పర్యటనకు రానున్నట్లు సమాచారం రావడంతో కన్నడ నాట రాజకీయం మరింత వేడెక్కింది  
  బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్సే అసలు కారణమన్న మాజీ డిప్యూటీ సీఎం.. తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) మైనారిటీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా మద్దతు ప్రకటించింది. ఈ పరిణామంతో డీఎంకే కూటమిలో తీవ్ర అసంతృప్తి, అగ్నిపర్వతం బద్దలైంది. డీఎంకే యువజన విభాగం అధినేత ఉదయనిధి స్టాలిన్ కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక ముఖ్యమైన పార్టీ అంతర్గత సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, హస్తం పార్టీకి కనీస కృతజ్ఞతా భావం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రతిష్ఠ, డీఎంకే కార్యకర్తల అహర్నిశల శ్రమ వల్లే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదుగురు శాసనసభ్యులను గెలిపించుకోగలిగిందని గుర్తు చేశారు. కానీ నేడు అధికార కాంక్షతో, తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విజయ్ పార్టీ వైపు వెళ్లడం దారుణమన్నారు. కాంగ్రెస్‌ను ఒక 'వెన్నుపోటుదారు'గా అభివర్ణించారు. ఇకపై కాంగ్రెస్ పార్టీని ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకూడదని, ఆ పార్టీని తమ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదని డీఎంకే శ్రేణులకు ఉదయనిధి పిలుపునిచ్చారు. స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న వారికి తమిళనాడు ఓటర్లు త్వరలోనే సరైన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దేశంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇంతలా బలోపేతం కావడానికి నరేంద్ర మోదీ, అమిత్ షా కారణం కాదని, అసలు కారణం కాంగ్రెస్ చేతకానితనమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో డీఎంకే పార్టీ ప్రత్యేక తీర్మానాలను ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీని మిత్రపక్షాల శ్రమను దోచుకునే జలగలుగా ఆ తీర్మానంలో పేర్కొనడం గమనార్హం. గతంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉనికిని కాపాడింది డీఎంకే అధినేత ఎంకే స్టాలినే అని పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే సుప్రీమో ఎంకే స్టాలిన్ సైతం సరికొత్త విజయ్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు విసిరారు. నటుడు విజయ్ నేతృత్వంలోని ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని జోస్యం చెప్పారు. కేవలం 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో నడుస్తున్న ఈ సర్కార్ ఏ క్షణంలోనైనా కూలిపోవడం ఖాయమని అన్నారు. సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి డీఎంకే పాత మిత్రపక్షాలన్నీ ఇప్పుడు మంత్రిపదవుల కోసం విజయ్ ప్రభుత్వంలో చేరడాన్ని స్టాలిన్ తప్పుబట్టారు. చిన్న పిల్లలకు కొత్త బొమ్మలు దొరికితే కొద్దిరోజులు ఆడుకుని బోర్ కొట్టినట్లు, ప్రజలకు కూడా ఈ నటుడి పాలనపై త్వరలోనే విరక్తి కలుగుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలు మళ్లీ తమ వైపే చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తమిళనాడులో సరికొత్త రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. డీఎంకే ఒంటరి పోరాటానికి సిద్ధమవుతుండగా, విజయ్ నేతృత్వంలోని కూటమి తమ బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తమిళ రాజకీయాల్లో ప్రజా తీర్పు ఎటువైపు మొగ్గుతుందో వేచి చూడాలి.  
గొడ్డలి పార్టీ. ఈ పదం ప్రధానంగా వైసీపీని విమర్శించడానికి కూటమి నేతలు తరచూ వాడుతున్నారు. ఇక చంద్రబాబు అయితే.. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం అని మరో మారు కామెంట్ చేశారు. గొడ్డలి పార్టీ నెవర్‌ అగైన్‌ అనే క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు.  రప్పారప్పా రంకెలు.. జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలా? సీబీఎన్‌ దగ్గర తోక జాడిస్తే.. ప్రజాహితం కోసం తోక కట్ చేస్తానని హెచ్చరించారు. గొడ్డలి పార్టీ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు, ప్రజాస్వామ్యంలో ఆ పార్టీకి చోటులేదని కూడా అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ ఇవ్వాలి. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రోజుకొక నాటకమాడుతున్నారు. అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కోడి కత్తి, గులకరాయి నాటకాలు గుర్తున్నాయి కదా? దళిత యువకుడు సుబ్రమణ్యాన్ని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన వారికి సన్మానాలా? కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు.. తల్లి, చెల్లికి ఆస్తులివ్వకుండా వేధించారు. తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వారు.. ప్రజలను ఏం చూస్తారని ప్రశ్నించారు.  కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. నేను ప్రజల సేవకుణ్ణి.. పెత్తందారు కాదు. నిరంతరం పనిచేసి పేదల రుణం తీర్చుకుంటా. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించింది- ఎన్డీయే కూటమి  అంటూ కామెంట్ చేశారు ఏపీ సీఎం. దీనంతటికీ కారణం.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో గొడ్డలి వాడకం తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటినుంచి ప్రత్యర్థి పార్టీలు వైసిపిని టార్గెట్ చేస్తూ గొడ్డలి పార్టీ అని, ఆ పార్టీ సంస్కృతిని గొడ్డలి సంస్కృతి అని పిలుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు చంద్రాబు తదితర కూటమి పార్టీల నేతలు.. ఇక పోతే కాక్రోచ్ ఆర్ బొద్దింక. ఇటీవల దేశ రాజకీయాల్లో బాగా వైరల్ అయిందీ పదం. ఎలా పుట్టింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ? అని చూస్తే.. సుప్రీం కోర్ట్  కోర్టు విచారణల సందర్భంలో దేశంలోని నిరుద్యోగ యువతను, కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులను ఉద్దేశించి బొద్దింకలు, సమాజ పరాన్న జీవులు అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చుకున్నా.. అది కాక్రోచ్ జనతా పార్టీ అంటూ కొత్త రూపు తీసుకుని ఫాలోయర్స్ సంఖ్య అమాంతం పెంచుకుని కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుత కాలమాన పరిస్థితులపై ఒక వ్యంగ్యాస్త్రంగానూ నిలుస్తోంది.  ఇలాంటివే మరికొన్ని పదాలను చూస్తే.. పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని.  ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని,  మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు  పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో  ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు. ఇక పోతే ఇటీవలి కాలంలో బాగా ట్రెండింగ్ లోకి వచ్చిన ఇంకో పదం..  మెలోడీ- ఇది మరీ ఇంటర్నేషనల్ క్రేజ్. ఇది ఏ ఒక్క దేశానికో పరిమితమైన పదం కాదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పేర్లను కలిపి నెటిజన్లు సృష్టించిన   నేమ్ మెలోడీ.  అంతర్జాతీయ సదస్సుల్లో వీరిద్దరూ కలిసినప్పుడు దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వక సంభాషణలు, నవ్వులను చూసి నెటిజన్లు  మెలోడీ అనే హ్యాష్‌ట్యాగ్‌తో వేల సంఖ్యలో రీల్స్, మీమ్స్ సృష్టించారు. స్వయంగా ఇటలీ ప్రధాని మెలోని కూడా ఒక సెల్ఫీ వీడియో పెడుతూ " హలో ఫ్రం మెలోడీ టీమ్’  అనడంతో ఈ పదం గ్లోబల్ ట్రెండ్ అయిపోయింది. టాఫీ డిప్లమసీ లేదా చాక్లెట్ రాజకీయం కూడా ఇదే కోవలోకి వచ్చే పదమే.  ఇక రీల్స్ మంత్రి, బిర్యానీ పాలిటిక్స్ అంటూ రకరకాల మీమ్స్ కమ్ వర్డ్స్ కూడా ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఒకప్పుడు రాజకీయం అంటే కేవలం సీరియస్ ఉపన్యాసాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు.. గొడ్డలి పార్టీ, కాక్రోచ్ పార్టీ అంటూ సెటైరికల్ కామెంట్లతో పాటు మెలోడీ, టాఫీలాంటి సిల్లీ పదాల వల్ల పాలిటిక్స్ కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌గా, మీమ్స్ మెటీరియల్‌గా మారిపోయాయి.
ALSO ON TELUGUONE N E W S
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక సుదీర్ఘమైన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రష్యాకు చెందిన అన్నా.. భారతదేశానికి కోడలిగా వచ్చిన తర్వాత తన జీవితంలో జరిగిన మార్పులు, తన పుట్టిన ఊరిపై ఉన్న మమకారాన్ని గుర్తుచేసుకుంటూ పెట్టిన పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రష్యాలోని అందమైన నగరం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పుట్టి పెరిగిన అన్నా.. పెళ్లయ్యాక ఎంతో భిన్నమైన సంస్కృతి కలిగిన భారతదేశంలో స్థిరపడ్డారు. నిత్యం కోలాహలం, సూర్యకాంతితో నిండి ఉండే భారత్‌లో ఎంతో సంతోషంగా గడుపుతున్నప్పటికీ, తన స్వస్థలంపై ఉండే ‘హోమ్‌సిక్‌నెస్’ (ఇంటిపై బెంగ) గురించి ఆమె ఎంతో కవితాత్మకంగా వివరించారు. చల్లటి గాలి, మంచు కురిసే సాయంత్రాలు, అక్కడి థియేటర్లలో వినపడే క్లాసికల్ మ్యూజిక్ జ్ఞాపకాలు ఇప్పటికీ తన ఆత్మలో సజీవంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, భారతదేశం తన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఇక్కడి ఘాటైన సుగంధ ద్రవ్యాలు, ఉరకలెత్తే జనజీవనం, ప్రేమపూర్వకమైన మనుషులు తనను ఎంతగానో మార్చేశారని అన్నా చెప్పుకొచ్చారు. ఈ దేశం తనకు ఒక అద్భుతమైన కుటుంబాన్ని, ఎన్నో మధురమైన జ్ఞాపకాలను అందించి మరో ఇల్లుగా మారిందని ఆమె కొనియాడారు. విదేశాలలో దశాబ్దాల పాటు గడిపినప్పుడు మనిషి ఒకేసారి రెండు ప్రాంతాలకు చెందినవాడిగా ఉంటూనే, కాలక్రమేణా ఆ రెండింటికీ పూర్తిగా చెందకుండా మిగిలిపోతాడనే ఒక తాత్వికమైన నిజాన్ని ఆమె ఈ సందర్భంగా పంచుకున్నారు. ఈ హృద్యమైన పోస్టుతో పాటు అన్నా లెజినోవా సాంప్రదాయ నీలం రంగు చీర కట్టుకుని దిగిన కొన్ని అద్భుతమైన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. సాధారణంగా చాలా సింపుల్‌గా కనిపించే అన్నా.. ఇలా పక్కా భారతీయ నారిలా ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమివ్వడంతో అభిమానులు మురిసిపోతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న తరుణంలో, అన్నా తనదైన శైలిలో ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే ఇలాంటి తాత్విక ఆలోచనలను పంచుకోవడం విశేషం. ఈ పోస్ట్‌పై మెగా అభిమానులు, నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. "ఈ హాట్ సమ్మర్‌లో మిమ్మల్ని ఇలా సాంప్రదాయ చీరకట్టులో చూడటం ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంది వదినమ్మ" అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మహిళలు ఈ పోస్ట్‌కు కనెక్ట్ అవుతూ.. పెళ్లయిన తర్వాత ప్రతి అమ్మాయి పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండింటినీ సమానంగా ప్రేమిస్తూ ఇలాంటి భావోద్వేగాలనే అనుభవిస్తుందని అన్నా రాసిన మాటలను సమర్థిస్తున్నారు. ప్రస్తుతం రష్యా పర్యటనలు తగ్గినప్పటికీ, ఒక నిశ్శబ్ద నగర ప్రేమికురాలిగా సెయింట్ పీటర్స్‌బర్గ్ ఎప్పటికీ తనలోనే బ్రతికే ఉంటుందని చెబుతూ అన్నా తన భావాలను ముగించారు. పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాల షూటింగ్ అప్‌డేట్స్ కోసం ఒకవైపు ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా, మరోవైపు వదినమ్మ షేర్ చేసిన ఈ బ్యూటిఫుల్ ఫోటోలు, ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నటసింహం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీ అభివృద్ధిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగు సినిమా రంగానికి ప్రధాన కేంద్రంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏపీ చిత్ర పరిశ్రమ, టెలివిజన్ మరియు నాటక అభివృద్ధి సంస్థ (APFDC) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలయ్య బాబు.. టాలీవుడ్ భవిష్యత్తుపై సరికొత్త దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదొక సరికొత్త అధ్యాయమని అభివర్ణించారు. తెలుగు చిత్రసీమకు వచ్చే మొత్తం కలెక్షన్లలో దాదాపు 70 శాతం కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే లభిస్తోందని ఈ సందర్భంగా ఆయన ఒక కీలకమైన విషయాన్ని గుర్తు చేశారు. ప్రకృతి సిద్ధమైన అద్భుతమైన లొకేషన్లు ఏపీలో ఎన్నో ఉన్నాయని, తన కెరీర్‌లో సూపర్ హిట్ అయిన 'అఖండ' సినిమా షూటింగ్‌ను కూడా రంపచోడవరంలోనే జరిపినట్లు ఆయన ఉదాహరణగా చెప్పారు. పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే తాను, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అందరూ కలిసికట్టుగా అడుగులు వేస్తున్నట్లు బాలయ్య పేర్కొన్నారు. షూటింగులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సింగిల్ విండో అనుమతుల విధానాన్ని త్వరలోనే తీసుకురాబోతున్నామని, దీనికి సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్‌ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుత ఇండస్ట్రీ పరిస్థితులపై బాలకృష్ణ కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిత్రాల నిర్మాణం తగ్గుముఖం పట్టడంతో ఎంతోమంది సినీ కార్మికులు, యూనియన్ సభ్యులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన చెందారు. ఒకప్పుడు సాంకేతికత లేకపోయినా సినిమాలు వేగంగా పూర్తయ్యేవని, కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగినా మేకింగ్ లేట్ అవుతోందని విశ్లేషించారు. థియేటర్ల యజమానులు, పంపిణీదారులు ఎదుర్కొంటున్న సమస్యలపైనా ఆయన స్పందించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌ను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఎక్కువ చిత్రాలను నిర్మించి థియేటర్లను కళకళలాడించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, ఇండస్ట్రీ పురోభివృద్ధి కోసం పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కూడా కోరుతున్నట్లు బాలయ్య బాబు పేర్కొన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస చిత్రాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు ప్రజాసేవలోనూ, సినీ పరిశ్రమ సంక్షేమంలోనూ చురుగ్గా పాల్గొనడంపై నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య తీసుకుంటున్న ఈ సరికొత్త చొరవతో ఏపీలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సినిమా షూటింగులు జరిగి, టాలీవుడ్ మరింత సత్తా చాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు గట్టిగా ఆశిస్తున్నాయి.
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న ‘దృశ్యం’ సిరీస్‌లో భాగంగా వచ్చిన ‘దృశ్యం 3’ ప్రస్తుతం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రేజీ మూవీ విడుదలైన నాటి నుంచే థియేటర్ల వద్ద వసూళ్ల వేట మొదలుపెట్టింది. సరిగ్గా చెప్పాలంటే కేవలం 58 గంటల్లోనే (మూడు రోజుల్లో) ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ విషయాన్ని స్వయంగా మోహన్‌లాల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. గత 13 సంవత్సరాలుగా ఈ ఫ్రాంచైజీ జర్నీలో భాగమైన అభిమానుల నమ్మకమే ఈ విజయానికి కారణమని మేకర్స్ పేర్కొంటున్నారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'దృశ్యం 3' చిత్రం మొదటి మూడు రోజుల్లోనే దాదాపు రూ. 117.17 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి మాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త మైలురాయిని అధిగమించింది. నిజానికి ఈ చిత్రానికి ఆరంభంలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. జార్జ్‌కుట్టి పాత్రపై ఉన్న విపరీతమైన అంచనాల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మొదటి రెండు భాగాలతో పోలిస్తే సస్పెన్స్ కొద్దిగా తగ్గినప్పటికీ, ఈసారి ఎమోషనల్ ఎలిమెంట్స్‌కు దర్శకుడు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు జార్జ్‌కుట్టి చేసే పోరాటంలో మోహన్‌లాల్ నటన మరోసారి ఆడియన్స్‌ను మెప్పించింది. గతంలో వచ్చిన దృశ్యం 1, దృశ్యం 2 చిత్రాలు తెలుగులో రీమేక్ అయి ఇక్కడ కూడా భారీ విజయాన్ని సాధించాయి. అయితే ఈ మూడో భాగాన్ని మాత్రం రీమేక్ చేయకుండా నేరుగా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. తెలుగు ఆడియన్స్ రాంబాబు పాత్రకు బాగా కనెక్ట్ అవ్వడం వల్ల, ఇక్కడి నేటివిటీ పరంగా కొద్దిగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ చిత్రంపై విపరీతమైన బజ్ నడుస్తోంది. బుకింగ్స్ యాప్స్‌లో రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడవుతుండటంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాంగ్ రన్‌లో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మరిన్ని భారీ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’  ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం మంచి మౌత్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ చెప్పేందుకు చిత్రయూనిట్ శనివారం నాడు థాంక్స్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..  పవన్ కళ్యాణ్ బత్తుల మాట్లాడుతూ .. ‘‘పురుష:’ సినిమాని సపోర్ట్ చేసిన మీడియా వారికి థాంక్స్. నేను సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పలేదు. ఒక వేళ నా నేను బాగా నటించకపోతే మీ పేరుకి ఎఫెక్ట్ అవుతుందని అనుకున్నాను. ఈ రోజు నా నటనకు మంచి పేరు వస్తోంది. అందుకే ఈ రోజు నేను సత్యానంద్ మాస్టర్ గారి శిష్యుడిని అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇదంతా వీరు గారి వల్లే సాధ్యమైంది. ప్రీమియర్ల నుంచీ మా సినిమాకి మంచి టాక్ వచ్చింది. మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. సప్తగిరి అన్న, కసిరెడ్డి అన్న నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచారు. రాయంచ, విషిక, హాసిని ఇలా అందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు. సతీష్ గారు నన్ను చాలా డిఫరెంట్‌గా చూపించారు. శ్రవణ్ గారు మంచి పాటలు, బీజీఎం ఇచ్చారు. చిత్రంలో నటించిన ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కి థాంక్స్. మూవీని చూసి నాలోని ప్లస్, మైనస్‌లు చెప్పండి. మైనస్‌లు చెబితే వాటిని నేను అధిగమించేందుకు ప్రయత్నిస్తాను. మా సినిమాని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. ఇంకా చూడనివారు మా మూవీని చూసి సపోర్ట్ చేస్తారని, మా కష్టాన్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మాట్లాడుతూ .. ‘‘పురుష:’ సినిమాను ఇంతటి స్థాయికి తీసుకు వెళ్లిన మీడియాకి థాంక్స్. ముగ్గురు హీరోయిన్లు చక్కగా నటించారు. వీరు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. కెమెరామెన్ సతీష్ గారు మంచి వ్యక్తి. సప్తగిరి గారు, కసిరెడ్డి గారు అద్భుతంగా నటించారు. పవన్ కళ్యాణ్ బత్తులని హీరోగా పెట్టి సినిమా తీస్తామని నా కంటే కోటీశ్వరులు ఫోన్ చేసి చెప్పారు. నేనే ఇంకో రెండు చిత్రాలు చేస్తానని వారికి చెప్పాను. ఎక్కడా కొత్త అబ్బాయిలా అనిపించలేదు. మా అబ్బాయి యాక్టింగ్ నాకు నచ్చింది. దర్శకుడు వీరు వులవల మాట్లాడుతూ .. ‘‘పురుష:’ చిత్రాన్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్స్. బత్తుల కోటేశ్వరరావు గారి వల్లే ఈ ప్రాజెక్ట్ మొదలై ఇక్కడి వరకు వచ్చింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు. సోదరి సరస్వతి గారి సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. రాయంచ, విషిక, హాసిని ఇలా హీరోయిన్లంతా అద్భుతంగా నటించారు. సప్తగిరి గారు, కసిరెడ్డి గారు ఎంతో సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ మూవీకి ఓ పిల్లర్‌లా నిలబడ్డాడు. రెండు నెలలు వర్క్ షాప్ చేశాడు. ప్రతీ ఒక్క సీన్‌ను ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేశాడు. అందుకే ఆడియెన్స్‌కి ఎక్కడా కూడా కొత్త కుర్రాడిలా అనిపించడు. ఈ జర్నీలో పవన్ కళ్యాణ్ నాకెంతో సపోర్ట్ చేశాడు. సతీష్ గారు, రవి గారు అందరూ నాకు అండగా నిలిచారు. మా ఆర్టిస్టులు, మా టీం కలిసి ఎంతో కష్టపడి ఈ మూవీని తీశాం. మా మూవీని ఆడియెన్స్ వరకు రీచ్ చేసిన మీడియాకి థాంక్స్. సినిమాని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు. కసిరెడ్డి రాజ్ కుమార్ మాట్లాడుతూ .. ‘పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి. మొహమాటం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ సినిమాలా జనాలకు అనిపించకూడదు.. అంత బాగా నటించాలని పవన్ కళ్యాణ్‌కి చెప్పాను. ఇప్పుడు ఆడియెన్స్ నుంచి అదే రెస్పాన్స్ వస్తోంది. పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు. నాకు ఆనందంగా ఉంది. రాయంచ అద్భుతంగా నటించారు. హాసిని, విషిక అందరూ చక్కగా నటించారు. సప్తగిరి అన్నతో నటించడం ఆనందంగా ఉంది. నాలుగేళ్ల నుంచి వీరు గారితో పరిచయం ఉంది. నన్ను గుర్తు పెట్టుకుని పాత్రను ఇచ్చిన వీరు గారికి థాంక్స్. కెమెరామెన్ సతీష్ గారు బడ్జెట్‌ను కంట్రోల్‌లో పెడతారు. ఆర్ట్ డైరెక్టర్ రవి గారు చాలా పాజిటివ్ వ్యక్తి. మా సినిమాని ఆడియెన్స్ వరకు రీచ్ చేసిన మీడియాకి థాంక్స్’ అని అన్నారు. రాయంచ మాట్లాడుతూ .. ‘‘పురుష:’ మూవీని మీడియా ముందుండి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇది నాకు తొలి చిత్రం. ఇంత పాజిటివ్ వైబ్స్ చూస్తుండటం ఆనందంగా ఉంది. దీనంతటికి మా దర్శక, నిర్మాతలే కారణం. నాకు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్‌కి థాంక్స్. మా సినిమాని ఇంకా ఇలానే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. విషిక మాట్లాడుతూ .. ‘మహిళా ప్రేక్షకులు ‘పురుష:’ మూవీని చూసి ఎక్కువగా ప్రశంసలు కురిపిస్తున్నారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన వీరు గారికి థాంక్స్. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన కోటేశ్వరరావు గారికి థాంక్స్. సినిమాని చూసిన వాళ్లు మళ్లీ చూడండి.. చూడని వాళ్లు వెంటనే వెళ్లి చూడండి’ అని అన్నారు. హాసిని సుధీర్ మాట్లాడుతూ .. ‘‘పురుష:’ మూవీని మీడియా చాలా బాగా ప్రమోట్ చేసింది. మా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందరం కష్టపడి ఈ చిత్రాన్ని చేశాం. ఇంకా చూడని వాళ్లు ఉంటే వెంటనే అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు. నటి సంధ్య మాట్లాడుతూ .. ‘‘పురుష:’లో నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు. కెమెరామెన్ సతీష్ మాట్లాడుతూ .. ‘‘పురుష:’ మూవీ విషయంలో కోటేశ్వరరావు గారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. పవన్ కళ్యాణ్‌కి సక్సెస్ రావడం ఆనందంగా ఉంది. ఇలానే మా జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఆర్ట్ డైరెక్టర్ రవి మాట్లాడుతూ .. ‘‘పురుష:’ మూవీని సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్. ఈ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. టాలీవుడ్‌లో పంపిణీదారుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గుజ్జలపూడి హరి (47) ఆదివారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఎంతో చురుగ్గా ఉంటూ ఇండస్ట్రీ వృద్ధిలో భాగస్వామి అయిన ఆయన ఇంత చిన్న వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లడం చిత్రసీమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన గుజ్జలపూడి హరి.. సినిమా రంగంపై ఉన్న మక్కువతో పంపిణీ రంగంలోకి అడుగుపెట్టారు. అక్కడ ‘హరి వెంకటేశ్వర పిక్చర్స్’ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్థాపించి, నెల్లూరు ఏరియాలో తిరుగులేని పంపిణీదారుడిగా ఎదిగారు. వ్యాపార రంగంలో తనదైన వ్యూహాలతో ఎన్నో ఘన విజయాలను అందుకొని ట్రేడ్ వర్గాల్లో క్రేజీ డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. సినిమా బిజినెస్‌పై ఉన్న అపారమైన పట్టుతో ఆయన టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లైన వైజయంతీ మూవీస్, దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్ మరియు శ్రేష్ఠ మూవీస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ల చిత్రాలను నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేశారు. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు చేరవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేవలం డిస్ట్రిబ్యూటర్‌గానే కాకుండా, తమిళంలో మంచి విజయం సాధించిన పలు చిత్రాలను తెలుగులోకి డబ్ చేసి నిర్మాతగా కూడా సత్తా చాటారు. హరి ఆకస్మిక మరణవార్త విన్న టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జున తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "గుజ్జలపూడి హరికుమార్ గారి మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌తో ఆయనకు ఎంతో కాలంగా మంచి అనుబంధం ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా గాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ ప్రముఖులు, నిర్మాతలు, నెల్లూరు ఏరియా థియేటర్ యాజమాన్యాలు హరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించడం పంపిణీ రంగానికి తీరని లోటని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తరలివెళ్తున్నారు.
డిజిటల్ వినోదాన్ని ఇష్టపడే వీక్షకుల కోసం సరికొత్త మరియు వైవిధ్యమైన కంటెంట్‌తో దూసుకు పోతోంది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్'. ఎప్పటికప్పుడు విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న ఈ సంస్థ, తాజాగా 'కథాసుధ' సిరీస్‌లో భాగంగా మరో క్రేజీ వినోదాత్మక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. అదే 'కాలనీ సర్కస్'. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాలనీలో అందరికంటే విభిన్నంగా ఉండాలని, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని ఆశపడతాడు ఒక లెక్కల మాస్టారు. అందుకోసం సూర్యనారాయణ అనే ఆ మాస్టారు ఒక సరికొత్త కలర్ టీవీని కొనుగోలు చేస్తాడు. అయితే, అసలు కథ అక్కడే మొదలవుతుంది. ఆ టీవీలో తమకు నచ్చిన ప్రోగ్రామ్స్ చూస్తామంటూ కాలనీలో ఉండే జనాలు అంతా కలిసి గొడవకు దిగుతారు. చివరకు ఆ టీవీ రిమోట్ ఎవరి దగ్గర ఉండాలనే విషయంపై ఏకంగా కాలనీలోనే ఎన్నికలు (ఎలక్షన్స్) నిర్వహిస్తారు. ఈ విచిత్రమైన రిమోట్ ఎలక్షన్స్‌లో చివరికి ఎవరు గెలిచారు? ఆ కాలనీలో ఎలాంటి సర్కస్ నడిచింది? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమాను ఎంతో వినోదాత్మకంగా మలిచారు. ఈ వినూత్న చిత్రంలో ప్రముఖ నటుడు, దర్శకుడు వెంకటేష్ మహా, కిరీటి దామరాజు, ఉద్విత హర్ష, మాస్టర్ ఆరవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. శశాంక్ పోసింశెట్టి దర్శకత్వం వహించిన ఈ హిల్ బస్టర్ మూవీని రాహుల్ తమడ, సాయిదీప్ బొర్ర సంయుక్తంగా నిర్మించారు. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ నెట్టింట విపరీతంగా ఆకట్టుకుంది. "మా కాలనీ ప్రశాంతంగా ఉన్నా.. మా కాలనీ వాళ్లు మాత్రం అంత ప్రశాంతంగా ఉండరు" అంటూ సాగే డైలాగులు, కామెడీ సీన్లు సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ కాలనీల్లో జరిగే చిన్న చిన్న గొడవలను, హ్యూమర్‌ను దర్శకుడు అద్భుతంగా ప్రెజెంట్ చేసినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా కాన్సెప్ట్‌పై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. రిమోట్ కోసం ఎలక్షన్స్ అనే పాయింట్ చాలా కొత్తగా మరియు ఫన్నీగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. వెంకటేష్ మహా మరియు కిరీటిల కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి నుంచే ఈ క్రేజీ మూవీ ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుండటంతో, వీకెండ్ లో ఫుల్ వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసిన 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న, ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో దుమ్మురేపుతోంది. అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా ఖ్యాతిని చాటుతూ సరికొత్త మైలురాళ్లను అందుకుంటోంది. తాజాగా ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఈవెంట్ 'యానిమే అవార్డ్స్ 2026' వేడుకలో రష్మిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పాప్ కల్చర్, యానిమేషన్ రంగాల్లోని అద్భుతమైన సృజనాత్మకతను గౌరవించే ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ వేడుకకు రష్మికకు ఆహ్వానం దక్కడం విశేషం. ఈ అంతర్జాతీయ అవార్డుల వేదికపై రష్మిక ప్రెజెంటర్గా సందడి చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన హాలీవుడ్ స్టార్లు, టాప్ క్రియేటర్స్ సమక్షంలో ఆరెంజ్ కార్పెట్‌పై నడుస్తూ ఈ భామ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ గ్లోబల్ ఈవెంట్ కోసం రష్మిక డిజైనర్ ప్రబల్ గౌరంగ్ రూపొందించిన బ్లాక్ సీక్విన్డ్ ఆఫ్-షోల్డర్ గౌన్‌లో మెరిసిపోయింది. పూల డిజైన్లతో కూడిన ఈ డ్రెస్‌కు మ్యాచింగ్‌గా ఒక అందమైన జెమ్‌స్టోన్ నెక్లెస్‌ను ధరించి గ్లామరస్ లుక్‌లో వావ్ అనిపించింది. కేవలం కార్పెట్ పైనే కాకుండా.. ఈ వేడుకలో అత్యంత కీలకమైన 'బెస్ట్ యానిమేషన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందించడానికి రష్మిక వేదికపైకి రావడం విశేషం. పాపులర్ హాలీవుడ్ నటుడు విన్‌స్టన్ డ్యూక్‌తో కలిసి రష్మిక స్టేజ్ పైకి నడిచి వచ్చిన దృశ్యం ఈ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది. అంతర్జాతీయ స్టార్లతో సమానంగా రష్మిక స్టేజ్ మేనేజ్ చేసిన తీరు, వారిద్దరి మధ్య జరిగిన ఇంటరాక్షన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, పెళ్లి తర్వాత రష్మిక తన వ్యక్తిగత జీవితానికి సమయం ఇస్తూనే క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది. ఈ ఏడాది ఇప్పటికే హిందీలో 'థామా', 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం తన భర్త, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ర‌ణ‌బాలి అనే భారీ తెలుగు చిత్రంలో నటిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ - రష్మిక కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్ మరియు ఆడియన్స్‌లో విపరీతమైన బజ్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాను 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఒకవైపు గ్లోబల్ ఈవెంట్స్‌లో మెరుస్తూ, మరోవైపు క్రేజీ సినిమాలతో రష్మిక దూసుకుపోతుండటం విశేషం.
ఎ.పి. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ)కి సీఎం చంద్రబాబు నాయుడు కొత్త ఊపు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ పంపిణీదారుడు భరత్ భూషణ్‌ను ఛైర్మన్‌గా నియమించిన ప్రభుత్వం, ఆయనతో పాటు సినిమా రంగానికి చెందిన పలువురిని డైరెక్టర్లుగా ఎంపిక చేసింది. ఇప్పటివరకు ఎఫ్‌డీసీలో రాజకీయ నేపథ్య వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఉండగా, ఈసారి మాత్రం నటులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలు, సినిమాటోగ్రాఫర్లు, నాటకరంగ ప్రతినిధులు, ఎగ్జిబిటర్లకు చోటు కల్పించడం ప్రత్యేకతగా నిలిచింది.  దర్శకుడు మెహర్ రమేశ్‌, నటులు సుమన్‌, శివాజీ, ఝాన్సీ, రచయిత సాయిమాధవ్ బుర్రా, దర్శకుడు సముద్ర, సీనియర్ పాత్రికేయుడు ఉమా మహేశ్వరరావు తదితరులు డైరెక్టర్లుగా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఎఫ్‌డీసీ ప్రభావం తగ్గిపోయిన నేపథ్యంలో, ఇప్పుడు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వస్తోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.  ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, డైరెక్టర్లు విజయవాడలోని కార్యాలయంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచనలతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఎఫ్‌డీసీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా మంచి గ్రేడ్‌లు సాధించడం అని చాలామంది అనుకుంటారు. కానీ పిల్లలలో  మానసిక బలాన్ని పెంపొందించడం, వారు భవిష్యత్తులో గొప్పగా ఎదగడం మరీ ముఖ్యంగా నాయకత్వ లక్షణాలతో ఉండటం చాలా ముఖ్యం.  ఆత్మవిశ్వాసం అనేది ఏ బిడ్డ వ్యక్తిత్వానికైనా పునాది. అది వారికి తమ మనసులోని మాటను నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని, అలాగే వైఫల్యాల నుండి నేర్చుకుని ఓపికతో ముందుకు సాగే బలాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్న పిల్లలు కాలక్రమేణా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. అయితే, ఈ లక్షణాలు రాత్రికి రాత్రే పుట్టేవి కాదు.. వీటికి చిన్నతనం నుండే సరైన మార్గదర్శకత్వం అవసరం. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచి వారిలో నాయకత్వ లక్షణాలు మెరుగుపడి వారు లీడర్లుగా తయారవ్వాలంటే.. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను పెంచే సమయంలో కొన్ని టిప్స్ పాటించాలి.  అవేంటో తెలుసుకుంటే.. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచి నాయకత్వ లక్షణాలు పెంచే టిప్స్.. వ్యక్తీకరణ..  పిల్లలకు వారి అభిప్రాయాలను, భావాలను వ్యక్తపరిచే అవకాశం ఇవ్వడం వల్ల వారు స్వేచ్ఛగా తమను తాము వ్యక్తపరచుకోవడానికి , వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. విజయాల గుర్తింపు.. పిల్లలు ఒక చిత్రాన్ని గీసినా లేదా ఒక పద్యాన్ని చదివినా, వారి కృషిని ప్రశంసించాలి. ఇలా మెచ్చుకోవడం వల్ల  పిల్లలలో తాము గౌరవించబడుతున్నామనే భావన కలుగుతుంది, ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని, ప్రేరణను రెండింటినీ పెంచుతుంది. విలువలు,సంప్రదాయాలు.. పిల్లలను కుటుంబ సంప్రదాయాలు, పండుగలు , ఆచారాలతో అనుసంధానించడం వారిలో సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి , వారి గుర్తింపు పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. సహనం, ఓర్పు..  గెలవడం ఎల్లప్పుడూ అవసరం కాదని, వెంటనే  ఫలితాలు ఆశించాల్సిన అవసరం లేదని పిల్లలకు నేర్పించడం ముఖ్యం. ఓర్పు, సహనం వారు పరిణతి చెందడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు..  సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానికి నిద్రలేవడం , రాత్రి సమయానికి నిద్రపోవడం,  వంటివి పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని అంతర్గతంగా బలపరుస్తాయి. ఇది క్రమశిక్షణ , ఆత్మనియంత్రణను కూడా నేర్పిస్తుంది. వైఫల్యాల నుండి నేర్చుకోవడం..  పిల్లలు చేసే  ఏదైనా పనిలో  విఫలమైతే, వైఫల్యం అనేది నేర్చుకోవడంలో ఒక భాగమని వారికి వివరించాలి. ఇది వైఫల్యం  తర్వాత తిరిగి లేచి ముందుకు సాగడాన్ని వారికి నేర్పుతుంది, ఇదే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కీలకం అవుతుంది. చెప్పేది వినాలి..   పిల్లలతో నిష్కపటంగా మాట్లాడాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. దీనివల్ల, వారు తమ సమస్యలను, ప్రశ్నలను  పంచుకోగలరనే నమ్మకం వారిలో పెరుగుతుంది . వినయం..  ఇతరులకు సహాయం చేయడం, చిన్న విషయాలకే కృతజ్ఞత చూపడం, అందరితో మర్యాదగా ప్రవర్తించడం పిల్లలకు నేర్పాలి. ఇవి వారు ఇతరులతో మమేకమవ్వడానికి, సమాజంలో గౌరవం సంపాదించుకోవడానికి సహాయపడతాయి. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో పైవన్నీ నేర్పిస్తూ ఉంటే.. పిల్లలు తప్పకుండా తమ జీవితంలో ఆత్మవిశ్వాసంలో ఉంటారు.  నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకుని వారి జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి ఎదుగుతారు.                                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా వాడుతూ ఉంటారు. వేసవి కాలం వస్తోందని అనిపించగానే కూలర్లు సిద్దం చేస్తుంటారు. అయితే.. చాలామంది కూలర్ విషయంలో ఎదుర్కునే సమస్య చల్లదనం రాకపోవడం. కూలర్ ఎంత స్పీడ్ లో ఉన్నా చల్లదనం లేకపోవడం,  గదిలో ఉన్నవారికి చెమట పట్టడం, మరీ ముఖ్యంగా ముఖం మీద జిడ్డుగా మారడం వంటివి జరుగుతూ ఉంటాయి.  దీనికి కూలర్ సరిగా పనిచేయడం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ దీనికి అసలు కారణం చాలామంది చేసే పొరపాట్లే..  ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుంటే.. గదిని పూర్తీగా మూసి ఉంచడం.. ఏసీ వాడేటప్పుడు గదిలోని కిటికీలు, తలుపులన్నీ ఎలాగైతే మూసి ఉంచాలో, కూలర్ విషయంలో కూడా అలాగే చేయాలని  తరచుగా అనుకుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. కూలర్లు గాలిలోకి తేమను విడుదల చేస్తాయి. గదిని పూర్తిగా మూసి ఉంచితే, ఆ తేమ బయటకు వెళ్లలేక, గాలిలో విపరీతమైన తేమ ఏర్పడుతుంది. అందువల్ల, గాలి ప్రసరణ జరిగేలా , గదిలోని నిస్సారమైన గాలి బయటకు వెళ్లేలా చేయడానికి, ఒక కిటికీని లేదా తలుపును కొద్దిగా తెరిచి ఉంచాలి. కూలర్ అమరిక.. కూలర్‌ను గది మధ్యలో లేదా గోడకు ఆనించి, దానికి స్వచ్ఛమైన గాలి అందని చోట ఉంచితే, అది గదిలోని వేడి గాలిని బయటకు పంపుతూనే ఉంటుంది. కూలర్‌ను ఎల్లప్పుడూ కిటికీ లేదా తలుపు దగ్గర ఉంచాలి. తద్వారా అది బయటి నుండి స్వచ్ఛమైన గాలిని లోపలికి లాగి, దానిని లోపలికి పంపుతుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్.. బయట విపరీతమైన వేడి, తేమ ఉన్నప్పుడు, కేవలం కిటికీ తెరవడం ద్వారా కూలర్‌లోని తేమను బయటకు పంపడం కష్టమవుతుంది. గదిలో తప్పకుండా ఒక చిన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను అమర్చాలి.   కూలర్‌ను నడుపుతున్నప్పుడు, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను కూడా ఆన్ చేయాలి. ఇది గదిలోని జిగటగా ఉండే వేడి గాలి మొత్తాన్ని బయటకు లాగి, గదిని చల్లగా ఉంచుతుంది. కూలర్ ప్యాడ్స్.. కొన్నిసార్లు  సంవత్సరాల తరబడి కూలర్ పక్క ప్యాడ్‌లను మార్చకుండా ఉంటారు.  వాటిపై దుమ్ము, ఉప్పునీరు పేరుకుపోయి, తెల్లటి పొరలా ఏర్పడుతుంది. దీనివల్ల గాలి లోపలికి వెళ్లదు,  కూలర్ ఫ్యాన్‌లా కేవలం వేడి గాలిని మాత్రమే బయటకు పంపుతుంది. అందువల్ల, ప్రతి సీజన్‌లో కూలర్ ప్యాడ్‌లను తప్పకుండా మార్చాలి. కూలర్ లో హనీకూంబ్ ప్యాడ్స్ ఉంటే వాటిని బయటకు తీసి బాగా శుభ్రం చేయాలి. సూర్యరశ్మి.. గది గోడలు లేదా కిటికీలపైకి నేరుగా సూర్యరశ్మి పడితే, అవి వేడెక్కుతాయి. కూలర్‌లోని గాలి వేడెక్కిన గోడలను తాకినప్పుడు దాని ప్రభావం తగ్గిపోతుంది. అందువల్ల, పగటిపూట కిటికీలకు మందపాటి, ముదురు రంగు కర్టెన్లను వేయాలి. ఇది సహజంగా గది ఉష్ణోగ్రతను తగ్గించి, కూలర్ వేగంగా చల్లబడటానికి సహాయపడుతుంది. వాతావరణం చాలా వేడిగా ఉంటే, కూలర్‌లోని వాటర్ ట్యాంక్‌లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేయాలి.  దీనివల్ల నీరు వెంటనే చల్లబడుతుంది. కూలర్ నుండి వచ్చే గాలి ఎయిర్ కండిషనర్ లాగా అనిపిస్తుంది.                                     *రూపశ్రీ.
హిమాలయాలకు వెళ్ళిన ఒక యోగి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు వారిని చూసి, "ఇంకా పోట్లాడుకుంటూనే వున్నారా?” అని ఆశ్చర్యపోయాడంట. పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరకూ, మనుష్యులు పోట్లాడుకోకుండా క్షణముండలేరు. ఈ విషయంలో ఆధునికులూ పూర్వీకులూ అనిగానీ, ఈ జాతివారు ఆ జాతివారు అనిగానీ, ఈ మతంవారూ మరో మతానికి చెందినవారని గానీ, స్త్రీ పురుష భేదాలు గానీ ఏమీలేవు. పోట్లాడటం ప్రధానం, కారణమేదైనాగానీ, పోట్లాట అనేది ఒకటి వుంటూ వుండాలి. లేకపోతే తోచదు. సాధారణంగా చిన్న పిల్లల్ని "మీరిద్దరూ ఏదో గిల్లికజ్జా పెట్టుకుంటారేమిటర్రా?" అని మందిలిస్తాం కానీ, పెద్దవాళ్ళూ చేసేది అదే. కాకపోతే చిన్నవాళ్ళు ఏ చాక్లెట్ల పంపిణీ దగ్గరో, బడిలో ఏ కుర్చీలో ఎవరు కూచోవాలి అనే విషయానికో తగాదా పడతారు. పెద్దవాళ్ళు చాలా “పెద్ద” విషయాలనుకునే వాటి విషయంలో అంటే... మతపరమైన, భాషాపరమైన విషయాలతో, పోరాటానికి సిద్ధపడతారు. చిన్న పిల్లలు గిల్లుకోవటంతో ఆపేస్తారు. పెద్దవాళ్ళు రక్తం చిందిస్తారు. మనిషిలో తల ఎత్తే ప్రతి అభిప్రాయమూ, మరొక మనిషితో వచ్చే ప్రతి అభిప్రాయ భేదమూ రక్తం ధారపోసేటంతటి ముఖ్యమైన విషయమే. ఇక్కడ ఒక విషయమేమంటే తప్పని సరి అయితేనే తన రక్తం చిందుతుంది.  సాధారణంగా అయితే  తన అనుచరుల రక్తమే ఉంటుందక్కడ ఇదీ నేటి రాజకీయం, సమాజ పోకడ. మత విశ్వాసాలు బలంగావున్న కాలంలో ఒక్కొక్క మతం వారు మరొకరి మీద విరుచుకు పడేవారు. ఒకే మతానికి చెందినవారిలో కూడా ఎన్నో సంఘర్షణలు. కేథలిక్కులూ, ప్రాటస్టాంట్ లూ ఆనాటికీ ఈనాటికీ ఐర్లాండ్లో కుత్తుకలను కత్తరించుకోడానికి వెనుకాడడం లేదు. ముస్లిములలో సున్నీలకు షియాలకు మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే వున్నది. హిందూమతంలోని వైష్ణవులకు, శైవులకు ఎంతటి ప్రజల విరోధమో చరిత్ర తెలియజేస్తూనే వున్నది. మతం కాకపోతే భాష, భాష కాకపోతే ప్రాంతం, నగరాలకై గ్రామాలకై పెనుగులాట, ఆదర్శాలకై, అభిప్రాయాలకై పోరుసల్పమని నాయకులు ఉద్ఘాటిస్తూనే వుంటారు. పోరునష్టం అనే విషయం మానవుడికి తెలిసినట్లుగానే వుంటుంది. కాని పోరునే అతడు ఆరాధిస్తాడు. పోరే అతడి జీవనసూత్రం, అందుకనే జీవితాన్ని కూడా "జీవనసమరం, జీవనపోరాటం" అనే పేర్లతో వ్యవహరిస్తూ వుంటాడు.  పూర్వం మనరాజులు ఆచరించిన అశ్వమేధయాగం లో "చేతనైతే మా యజ్ఞాశ్వాన్ని ఆపిచూడండి, ఆపినవారు మా భుజబలాన్ని చవిచూడండి". అనే ప్రకటన, పోరుకు ఆహ్వానమే కదా? అంటే మనిషికి పోరు అతి సహజమైన గుణమన్నమాట, పైపెచ్చు ఇది ఎంతో గౌరవించదగిన గుణమని మన నాగరీకుల భావన. కానీ ఈ ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని "అనాగరికమైన" అడవి జాతులు కూడా వున్నాయి. వారిలో ఒక జాతివారు మరొక జాతివారిమీద అనివార్య కారణాల వల్ల యుద్ధ దుందుభులు మ్రోగించారనుకుందాం. ఇవతలి జాతివాడు అవతలి జాతివాణ్ణి చంపడం కూడా జరిగిందనుకుందాం. అప్పుడు ఇతడు తానొక ఘనకార్యం చేశానని తానొక వీరాధి వీరుణ్ణని భావించడం జరుగుతుంది. చాలా ఉద్రేకంగా ఉత్సాహంగా తనవారిలోకి తిరిగి వస్తాడు. అతని గ్రామంలోని వారందరూ అతడికి బ్రహ్మరథం పట్టారనీ, "వీరగంధం" పూస్తారని మనం అనుకోవచ్చు. కానీ మన ఊహ సరికాదు అంటాడు, ఆఫ్రికాలోని కొన్ని అడవి జాతుల్ని అధ్యయనం చేసిన ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త, కార్ల్ యూంగ్, ఈ వీర శూర శిఖామణిని ఊరి పొలిమేరల్లోనే ఆపి అక్కడే ఒక గుడిసెలో అతడికి నివాసం ఏర్పాటు చేస్తారు. అతడిలోని రక్తదాహం తొలగిపోవడానికి కొన్ని నెలలపాటు అతణ్ణి ఏకాంతంగా వుండనిచ్చి, శాఖాహారం మాత్రమే పెడుతుంటారు. ఆ అడవి జాతివారికి తోటి మానవుడి ప్రాణం తీయడం అంత గర్భనీయం అంటారు. ఇదీ మనిషిలో ఉండే ఒకానొక స్వభావ కోణం                                    ◆నిశ్శబ్ద.
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం దీనిని 'పిత్త దోషం' అధికమవ్వడం అంటారు. శరీరం వేడెక్కినప్పుడు కళ్ల మంటలు, కాళ్లల్లో నొప్పులు, నీరసం, చర్మంపై చెమటకాయలు, అజీర్తి వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. మరి ఈ సమస్య నుండి ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో ఎలా ఉపశమనం పొందాలో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో క్లియర్ గా వివరించారు. 👇 🌟శరీరంలో వేడి తగ్గడానికి ముఖ్యమైన ఆయుర్వేద చిట్కాలు: మజ్జిగ మరియు సబ్జా గింజలు: ప్రతిరోజూ పల్చటి మజ్జిగ తాగడం లేదా నీళ్లలో నానబెట్టిన సబ్జా గింజలను తీసుకోవడం వల్ల శరీరం తక్షణమే చలవబడుతుంది. ధనియాల నీరు: రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో చెంచా ధనియాలు నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగడం వల్ల పిత్త దోషం అదుపులోకి వస్తుంది. కొబ్బరినీళ్లు: వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అంది, వేడి తగ్గుతుంది. తీసుకోవలసిన ఆహారాలు: పుచ్చకాయ, కీరదోసకాయ, సొరకాయ, బీరకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లను డైట్‌లో భాగం చేసుకోవాలి. దూరంగా ఉంచాల్సినవి: మిరపకాయలు, మసాలాలు, పచ్చళ్లు, టీ మరియు కాఫీలను కాస్త తగ్గించడం చాలా మంచిది. మీ శరీర తత్వాన్ని బట్టి పిత్త దోషం తీవ్రత మారుతూ ఉంటుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి! 🙌
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది శరీరానికి మేలు చేయడానికి బదులుగా హాని కలిగించే  పదార్థాలను బ్రేక్పాస్ట్ లో తింటారు. ఖాళీ కడుపుతో కొన్ని రకాల బ్రేక్పాస్ట్ లను  తినడం  జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. రోజంతా నీరసంగా, చిరాగ్గా  ఉంచుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన, సమతుల్యమైన అల్పాహారం శక్తిని అందించడమే కాకుండా, బరువు నియంత్రణ, మెరుగైన జీవక్రియ , మానసిక ఏకాగ్రతకు కూడా సహాయపడుతుంది. బ్రేక్పాస్ట్ లో  ఏ పదార్థాలను నివారించాలో , ఏ అలవాట్లు  ఆరోగ్యానికి హాని కలిగిస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో తెలుసుకుంటే.. వేయించిన, నూనే ఆహారాలు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేయించిన, నూనెతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడి పడుతుంది. పూరీలు, కచోరీలు, సమోసాలు,  బజ్జీలు  వంటి వేయించిన ఆహారాలు  కడుపులో భారంగా అనిపించేలా చేస్తాయి. దీనివల్ల జీర్ణక్రియ ఆలస్యం అయి, ఎసిడిటీ, గ్యాస్, నీరసం పెరగవచ్చు. దీర్ఘకాలంలో, ఇలాంటి అలవాట్లు బరువు పెరగడానికి, కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా దారితీయవచ్చు. ప్యాకింగ్ జ్యూసులు.. ఉదయం పూట తీపి బ్రెడ్ లేదా తృణధాన్యాలతో చేసిన బ్రెడ్ వంటివి లేదా  ప్యాక్ చేసిన జ్యూస్‌లు తాగడం ఆరోగ్యకరమని చాలామంది అనుకుంటారు.  కానీ వీటిలో చక్కెర అధిక మొత్తంలో ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి, కొద్దిసేపటికే అకస్మాత్తుగా పడిపోతాయి. ఇది శరీర శక్తి స్థాయిలను ప్రభావితం చేసి, త్వరగా ఆకలి వేయడానికి దారితీస్తుంది. అధిక చక్కెర ఉన్న ఆహారాలను  క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయం , మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. టీ, కాఫీలు.. చాలామంది  రోజును కేవలం టీ లేదా కాఫీతో గడిపేస్తుంటారు. మరికొంతమంది  ఉదయాన్నే టీ, కాఫీలు తాగుతూ ఉంటారు. వీటి  వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఖాళీ కడుపుతో ఎక్కువగా టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల ఎసిడిటీ , గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.  ఇది నీరసం, అలసట , ఏకాగ్రత లోపానికి దారితీయవచ్చు. ఇలా ఎక్కువ కాలం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా ప్రభావితం అవుతుంది. ప్రాసెస్ ఫుడ్స్.. ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్ , ప్యాక్ చేసిన ఆహారాలలో ప్రిజర్వేటివ్‌లు , సోడియం అధికంగా ఉంటాయి. ఇవి తగినంత పోషణను అందించవు . పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణశక్తి బలహీనపడి, పోషకాహార లోపాలకు దారితీస్తుంది.                                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...