LATEST NEWS
  నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..! తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టం..! ఢిల్లీ మీడియా చిట్‌చాట్‌లో మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో స్పందించారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనపై చర్యలు తీసుకోవద్దని కోరారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెబుతున్నారని, తన కుమార్తె మాట్లాడిన అంశానికి తనను బాధ్యురాలిని చేయడం సరికాదని అన్నారు. తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. “నా బిడ్డ మాట్లాడితే నాకు ఎందుకు శిక్ష వేస్తారు..? నా కూతురు మాట్లాడిన దానికి నాపై చర్యలు తీసుకోవద్దు” అని ఆమె పేర్కొన్నారు. నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది. ఆమెను వద్దని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టం అని మంత్రి కొండా సురేఖ అన్నారు. తాను బీసీ మహిళా మంత్రినని.. తన భర్త మున్నూరు కాపు, తాను పద్మశాలి కులానికి చెందినవారినని తెలిపారు. తమ కులానికి 16 శాతం ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని స్పష్టం చేశారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండానే తన శాఖను సమర్థంగా నిర్వహిస్తున్నానని అన్నారు. ఒకవైపు కర్ణాటక కాంగ్రెస్‌లో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరంటూ ఆందోళన జరుగుతోందని.. మరోవైపు తనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనపై ప్రెస్‌మీట్లు పెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనుక ఎవరున్నారో తనకు తెలుసని కొండా సురేఖ అన్నారు. అధిష్ఠానం కూడా ఈ విషయాలను ఆలోచించాలని సూచించారు. మీనాక్షి మేడంకు తాను చెప్పాల్సిందంతా చెప్పానని తెలిపారు. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తప్పని అన్నారు. తనపై ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ఏఐసీసీనే తీసుకోవాలని.. తాను ఏఐసీసీ సభ్యురాలినని కొండా సురేఖ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కే.సీ. వేణుగోపాల్‌ అపాయింట్‌మెంట్‌ తనకు దొరకలేదని తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని, తనపై వచ్చిన అంశాలపై ఆయనకు వివరణ ఇచ్చానని చెప్పారు.“ నాపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి” అని కొండా సురేఖ అన్నారు. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్‌రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు. అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భట్టి విక్రమార్క భార్యకు సంబంధించిన కమీషన్ల అంశాలపై కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు.  “ఆ ఫిర్యాదులపై ఎందుకు మాట్లాడటం లేదు?” అని ప్రశ్నించారు. చాలామంది రెడ్లు మాట్లాడిన సందర్భాల్లో వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. తన విషయంలో మాత్రమే చర్యల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఏమిటని ఆమె నిలదీశారు. మంత్రి కొండా సురేఖ తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలపై మరోసారి చర్చకు దారితీశాయి.   Konda Surekha Delhi visit, CM Revanth Reddy, Congress high command, AICC Mallikarjun Kharge, Konda Susmita comments, Telangana cabinet reshuffle 2026, Telangana politics news, K.C. Venugopal, Meenakshi Natarajan
  ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..! మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రి అని రేవంత్ చెప్పుకోవడం మంత్రులు, నేతలు అసంతృప్తిగా ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయం ఒక్కసారిగా ఢిల్లీ హస్తిన వీధులకు చేరింది. కొండా సురేఖ ఆమె కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యల దుమారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం  పార్టీ క్రమశిక్షణపై సుస్మిత చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ వివాదంపై స్పష్టత నిమిత్తం సురేఖకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి, నివేదికను కాంగ్రెస్ అధిష్టానానికి పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుమారు 60 నిమిషాల (1 గంట) పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీ నియమావళిని దాటి వ్యవహరించే నేతలపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి మరియు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. అయితే ఊహించని మలుపు తిరుగుతూ మంత్రి కొండా సురేఖ కూడా హుటాహుటిన ఢిల్లీకి చేరుకోవడంతో వరంగల్ రాజకీయాలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ తీవ్ర కలకలం రేగింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కొండా సురేఖ అత్యంత ఘాటుగా స్పందించారు. "నన్ను అధిష్టానం పిలవలేదు, నేనే స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్‌మెంట్ అడిగి ఢిల్లీకి వచ్చాను. పార్టీలో ఉన్నది మాట్లాడితే చర్యలు ఎందుకు తీసుకుంటారు?" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సంచలనం సృష్టించాయి. పార్టీ శ్రేణుల సంక్షేమం మరియు ప్రాంతీయ సమతుల్యత కోసమే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశామని, నిజ నిజాలు చెప్పడం క్రమశిక్షణా ఉల్లంఘన కిందకు ఎలా వస్తుందని ఆమె ప్రశ్నించడం గమనార్హం. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీలో విడివిడిగా పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ వివాదానికి వీలైనంత త్వరగా స్వస్తి చెప్పాలని అధిష్టానం భావిస్తోంది. మంత్రి వర్గంలో 100 శాతానికి పైగా క్రమశిక్షణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతుంటే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కొండా కుటుంబం తమ స్వరాన్ని బలంగా వినిపిస్తోంది. పార్టీ మూలాలకు హాని కలగకుండా, సురేఖ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలా? లేక కేవలం వివరణతో సరిపెట్టి వ్యవహారాన్ని సర్దుమణిగేలా చేయాలా? అనే అంశంపై ఏఐసీసీ పెద్దలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఒకవేళ తీవ్ర చర్యలు తీసుకుంటే ఉమ్మడి వరంగల్ పరిధిలోని దాదాపు 12 నియోజకవర్గాల్లో పార్టీ సమీకరణాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ వేదికగా సాగుతున్న ఈ హైడ్రామాలో రాబోయే 24 గంటల్లో వెలువడే అధిష్టానం నిర్ణయమే మంత్రి కొండా సురేఖ భవిష్యత్తును నిర్ణయించనుంది.   Konda Surekha Delhi visit, Revanth Reddy Congress high command, AICC Mallikarjun Kharge, Konda Susmita comments, Telangana cabinet reshuffle 2026, Telangana politics news  
తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో  కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుకి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విమర్శలకు పదును పెట్టింది.  బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు,   6 గ్యారంటీల  అమలులో రేవంత్  ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని  ధ్వజమెత్తారు. ప్రజలను మాయమాటలతో వంచించి అధికార పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్, ఈ వెయ్యి రోజుల పాలన ఇసుమంతైనా సంతృప్తికరంగా లేదని విమర్శించారు.  రైతాంగం, వ్యవసాయ కూలీలు, మహిళలు, విద్యార్థుల జీవితాలతో  రేవంత్ ఆటలాడుతోందని బీఆర్‌ఎస్  ఆ  చార్జ్‌షీట్‌లో పేర్కొంది. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు భరోసా పథకం కింద   ఏటా ఎకరాకు అందిస్తామన్న  15 వేల రూపాయల  సాయాన్ని నిలిపివేసి రైతులను నిట్టనిలువునా మోసం చేసిందని విమర్శించింది.  అలాగే వ్యవసాయ కూలీలకు చెల్లిస్తామని వాగ్దానం చేసిన   12 వేల రూపాయల ఆర్థిక సాయం కూడా నీటి మూటగానే మిగిలిందని చార్జ్ షీట్ పేర్కొంది.  2 లక్షల రూపాయల  రుణమాఫీ ప్రక్రియను అసంపూర్తిగానే మిగిలిందనీ, సగం సగం లెక్కలతో రైతులకు అన్యాయం చేసిందని ఈ సందర్భంగా కేటీఆర్ విమర్శించారు.  యువత,  విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని బీఆర్ఎస్ చార్జ్ షీట్ పేర్కొంది.  నిరుద్యోగులకు ఇస్తామని ప్రకటించిన   4 వేల రూపాయల నిరుద్యోగ భృతితో పాటు, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ పూర్తిగా నీటిమూటగా మారిపోయిందని విమర్శించింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వం, గురుకుల పాఠశాలలను మూసివేసే దిశగా కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ చార్జిషీట్ పేర్క్ంది. విద్యార్థులకు వాగ్దానం చేసిన  5 లక్షల విద్యా భరోసా కార్డు ఆచరణకు నోచుకోలేదని, 12 వేల  కోట్ల రూపాయలకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయనీ, అలాగే..  మహిళలకు ఇస్తామన్న నెలకు  2 వేల 500 రూపాయల ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి పథకం కింద ఇస్తామన్న తులం బంగారం హామీలను రేవంత్ ప్రభుత్వం విస్మరించిందని పేర్కొంది.   ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు,  తెలంగాణకు జీవనాధారమైన కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాష్ట్రానికి ఉన్న హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించిందని  విమర్శించారు. అంతేకాకుండా, బాధ్యతారహితమైన ఆర్థిక నిర్ణయాల వల్ల తెలంగాణను దాదాపు రూ. 4.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను, హామీల అమలును ప్రశ్నించిన నాయకులు, ప్రజలపై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. [BRS chargesheet on Congress, KTR press meet, Telangana Congress 1000 days, Revanth Reddy government failures, BRS vs Congress, Telangana politics,  Telugu One]
ALSO ON TELUGUONE N E W S
    -సినిమా పేరు: రోమాంచకం -న‌టీన‌టులు: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్ కుమార్, ఉపేంద్ర లిమాయే, నరేంద్ర రవి, వెంకటేష్ కాకుమాను, మణి ఆగుర్ల తదితరులు -సినిమాటోగ్ర‌ఫీ: పవన్ పప్పుల -మ్యూజిక్: వాసుకి వైభవ్  -నిర్మాత‌: ప్రణయ్ రెడ్డి  -సమర్పణ: సందీప్ రెడ్డి వంగ  -బ్యానర్: భద్రకాళీ పిక్చర్స్ ప్రొడక్షన్  -రచన,దర్శకత్వం: వేణుగోపాల్ రెడ్డి  -రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 3, 2026    సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్ కుమార్ జంటగా సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సమర్పణలో తెరకెక్కిన మూవీ 'రోమాంచకం'.  రిలీజ్ డేట్ ఈ రోజే అయినా  నిన్న ప్రీమియర్స్ తోనే థియేటర్స్ లో అడుగుపెట్టింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ అన్వేష్(సుమంత్ ప్రభాస్) హైదరాబాద్ లో నివసించే ఎంతో మంది 'జెన్ జీ' బ్యాచ్ కోవకి చెందిన యువకుడు. మైథిలి( అనంతిక సానిల్ కుమార్).. చెన్నై సిటీలో నివసించే తెలుగు మాట్లాడే 'జెన్ జీ' అమ్మాయి. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమ వరకు వెళ్తుంది. దీంతో మైథిలి చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుంది. మైథిలిని అన్వేష్ ఒక ఫ్లాట్ లో ఉంచుతాడు. కానీ మైథిలి హఠాత్తుగా మాయమవుతుంది. దీంతో మైథిలి చనిపోవడానికి వెళ్లిందని అన్వేష్ భయపడతాడు. మైథిలి చనిపోవడానికి వెళ్లిందని అన్వేష్ భయపడటానికి కారణం ఏంటి? హైదరాబాద్, చెన్నైలో ఉన్న ఆ ఇద్దరి మధ్య పరిచయం ఎలా జరిగింది? వాళ్ళ మధ్య ఉంది నిజమైన ప్రేమేనా? నిజమైన  ప్రేమే అయితే అనంతిక ఎందుకు వెళ్ళిపోయింది? నిజంగా సూసైడ్ చేసుకోవడానికే వెళ్లిందా?  లేదా ఎందుకు వెళ్లిందనేదే 'రోమాంచకం' మూవీ.  ఎనాలసిస్  కథగా చెప్పుకుంటే చాలా సింపుల్ కథ..నేటి జెన్ జీ బ్యాచ్ లో యువతీ, యువకుల మధ్య  కొన్నిప్రేమలు ఎలా పుడుతున్నాయో అదే విధంగా చూపించారు. దీంతో ప్రకృతి సిద్ధంగా ఏర్పడే 'ప్రేమ' అనే మహత్తరమైన పదానికి ఉన్న గొప్పతనం ఇదేనా అనిపిస్తుంది.  ఆడవాళ్లు తమ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటు ఒక వ్యక్తిని ఇష్టపడతారనే పాయింట్ బాగుంది. డైరెక్షన్ తో పాటు టెక్నీకల్ గా మెరుపులు ఉండి ఉంటే రోమాంచకం పొజిషన్ మరోలా ఉండేది.   ఫస్ట్ హాఫ్ చూసుకుంటే  అన్వేష్, మైథిలి ఇంట్రడక్షన్ సీన్ బాగున్నాయి. ముఖ్యంగా మైథిలి  ఇంట్రడక్షన్ సీన్ కొత్తగా చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చిన  సీన్స్ లో ఎలాంటి మెరుపులు లేకుండా  రొటీన్ గా సాగుతుంది. దీంతో ఇదేదో తేడాగా ఉందే అనుకుంటాం. కానీ ఆ తర్వాత కామెడీ పర్పస్ కోసమే  వచ్చిన ఫ్రెండ్ సీన్స్ బాగుంటాయి. ముఖ్యంగా డైలాగ్స్ తో పాటు  పెర్ ఫార్మెన్స్ బాగా పేలడంతో ఎంజాయ్ చేస్తుంటాం.  అన్వేష్ చెన్నై వెళ్లే  ఎపిసోడ్ బాగుంది. కానీ అక్కడ కేవలం మైథిలీ తో ఫోన్ మాట్లాడే సీన్ తోనే ఎండ్ చేయకుండా  చెన్నై సిటీలో మైథిలి కోసం వెతకడం చూపించాల్సింది.  మైథిలి హైదరాబాద్ వచ్చి వెంటనే కనపడకుండా వెళ్లిపోయిన సీన్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ లో చూసుకంటే ప్రతి సీన్ ఎంటర్ టైన్ మెంట్ కోణంలో సాగింది. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్‌ (ఉపేంద్ర లిమాయే)తో వచ్చిన టోటల్ ఎపిసోడ్ అయితే మైండ్ బ్లోయింగ్. కాకపోతే  మైథిలి ఎందుకు వెళ్లిపోయిందనే బలమైన రీజన్ తో పాటు మైథిలి విషయంలో క్యూరియాసిటీ మిస్ అయ్యింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ జోష్ తో ఉన్నాయి. నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు  అన్వేష్ గా సుమంత్ ప్రభాస్ తన పెర్ ఫార్మెన్స్ తో మెప్పించాడు. ప్రీవియస్ చిత్రాల కంటే బెటర్ పెర్ఫార్మ్ అని చెప్పవచ్చు. అనంతిక సునిల్ కుమార్ కూడా మైధిలిగా మెప్పించింది. అసలు మైధిలీ అనే పేరు ఆమె కోసమే పుట్టిందా అనేలా కళ్ళతోనే  క్లీన్ పెర్ఫార్మ్ ఇచ్చింది. ఫ్రెండ్స్ క్యారక్టర్ లలో చేసిన అందరు కూడా అద్భుతంగా మెప్పించారు. ముఖ్యంగా నరేంద్ర రవి కామెడీ టైమింగ్ బాగుంది. మరిన్ని అవకాశాలు వస్తే అగ్ర కమెడియన్ గా మారడం ఖాయం.  దర్శకుడిగా వేణుగోపాల్ రెడ్డి పర్వాలేదని అనిపించినా రచన పరంగా సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో మెప్పించాడు.  వాసుకి వైభవ్ నుంచి వచ్చిన సాంగ్స్ కొత్తగా ఉండటంతో పాటు  చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగోలేదు.  ఫొటోగ్రఫీ సో సో. నిర్మాణ విలువలు కూడా అదే పరిస్థితి. బలాలు 1 . ఆల్ ఆర్టిస్ట్స్ పెర్ ఫార్మెన్స్  2 . సెకండ్ హాఫ్  3 . కామెడీ ఎపిసోడ్స్  4 . డైలాగ్స్  బలహీనతలు  1 .మెరుపులు లేని డైరెక్షన్  2 . హీరోయిన్ క్యారక్టరయిజేషన్ విషయంలో ఉన్న కన్ఫ్యూజ్    చివరిగా చెప్పుకోవాలంటే కథ, కథనం, దర్శకత్వంలో ఎలాంటి మెరుపులు ఉండవు. కానీ ఫస్ట్ నుంచి,చివరి దాకా నవ్వుతు ఎంజాయ్ చేయవచ్చు.   రేటింగ్ 2 .5 /5                                                                 అరుణాచలం  
The latest teaser for HBO’s Harry Potter and the Philosopher’s Stone has finally offered a substantial look at the highly anticipated reboot, but it does little to answer the biggest question surrounding the series: why does this story need to be retold so soon after the hugely successful film franchise? Released on September 2, the new teaser runs through several of the most recognisable moments from Harry’s first year at Hogwarts, including the Sorting Ceremony, Quidditch, the dungeon troll sequence, Herbology classes and Harry’s first experiences with the wizarding world. It also gives audiences a better look at Dominic McLaughlin as Harry, Arabella Stanton as Hermione and Alastair Stout as Ron, alongside John Lithgow’s Dumbledore, Janet McTeer’s McGonagall and Paapa Essiedu’s Snape. The problem is that much of what is being showcased already exists in the collective memory of audiences. Several shots and story beats naturally invite comparisons with the 2001 film, and early reactions have highlighted the similarities rather than any strikingly different creative approach. That does not necessarily make the series a bad idea. HBO’s biggest advantage is its format: the first season will have eight episodes, giving Francesca Gardiner and her team considerably more room to explore material from J.K. Rowling’s first book than the feature film could. But as a teaser designed to reignite Harry Potter fever, this one falls short. Instead of creating anticipation for a new interpretation, it mostly reminds viewers of the version they already know and love. With the series arriving on Christmas Day, HBO will need to reveal more of its own identity before the premiere.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
The birthday celebrations of Jana Sena Party chief and Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan were held on a grand scale in Kukatpally, Hyderabad. As part of the celebrations, actor Sai Durgha Tej attended an event organized in Gopal Nagar, Kukatpally, as the chief guest. The actor joined the celebrations and interacted with children at the venue. Sai Durgha Tej cut a birthday cake along with the children and extended his heartfelt wishes to Pawan Kalyan. The celebrations witnessed enthusiastic participation from fans and Jana Sena supporters.Later, Sai Durgha Tej visited a blood donation camp organized as part of the birthday celebrations.  He inspected the arrangements and appreciated the volunteers and organizers for conducting the camp and encouraging people to participate in the noble initiative. The event highlighted the celebrations not only as a tribute to Pawan Kalyan but also as an occasion to promote social service and community welfare. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
The Maari franchise could be making a comeback, with reports suggesting that Dhanush has initiated discussions for Maari 3 with director Balaji Mohan. According to the latest buzz, Dhanush himself called Balaji Mohan and asked him to develop a script based on an idea he had for the third instalment. The actor reportedly discussed the basic concept with the filmmaker and expressed his interest in taking the popular Maari character forward once again. The original Maari, released in 2015, became one of Dhanush’s memorable commercial entertainers, with his eccentric local don character gaining a strong following. Maari 2 followed in 2018 and expanded the franchise with Sai Pallavi, Tovino Thomas and a new conflict around the character. While there is no official announcement yet regarding Maari 3, Dhanush’s reported initiative makes the possibility considerably more interesting. The fact that he has approached Balaji Mohan, who created the character and directed both earlier films, also suggests that the actor wants the third part to retain the original flavour. If the scripting works out, Maari 3 could soon move from an idea to an official project. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న 7 PM ప్రొడక్షన్స్ సంస్థ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇ.ఎం.ఐ టైటిల్ తో న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఓ కంప్లీట్ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి నిఖిల్ కువ్వరపు దర్శకత్వం వహిస్తున్నారు. లాల్ సలామ్, హాస్టల్ డేస్ వంటి పలు వెబ్ సిరీస్ లతో పేరు తెచ్చుకున్న దరహాస్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. లిటిల్ హార్ట్స్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించి ఫేమ్ అయిన శైలజ ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో "ఇ.ఎం.ఐ" సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో ఆది సాయికుమార్ క్లాప్ ఇవ్వగా, డైరెక్టర్ సాయి మార్తాండ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందజేశారు.  బైక్, కారు, మంచి ఫోన్..ఇలా ఏ వస్తువు కొన్నా ఇ.ఎం.ఐ కట్టాల్సిందే.  దాదాపు ప్రతి మధ్య తరగతి ఇంటిలో ఇ.ఎం.ఐ కష్టాలు తప్పవని అనుకోవచ్చు. ఇలా ఇ.ఎం.ఐ మీద వస్తువులు తీసుకున్న యువత ఆ ఇ.ఎం.ఐ లు కట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే కాన్సెప్ట్ తో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో పాటు కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలోని ప్రతి సీన్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.        [EMI Movie Launch, The Great Pre Wedding Show, Telugu Comedy, 7 PM Productions, Aadi Saikumar, Telugu Film News, Telugu News]  
పవర్ స్టార్, ఆంధ్రా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అభిమానులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న ఈ వేడుకల మధ్య ఒక పవర్‌ఫుల్ ఫ్యాన్ ప్రాణాలు కోల్పోవడం సినీ మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడిని బెండమూర్లంక గ్రామానికి చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్‌గా గుర్తించారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ప్రేమ్ కుమార్, తన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొనేందుకు స్నేహితులతో కలిసి సొంత ఊరికి వచ్చాడు. అమలాపురంలోని ఒక కళాశాల సమీపంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీ బ్యానర్ కట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఆ ఫ్లెక్సీ విద్యుత్ వైర్లకు తగలడంతో ప్రేమ్ కుమార్ తీవ్ర విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ అతడు కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. కళ్లముందే స్నేహితుడు ప్రాణాలు కోల్పోవడంతో తోటి అభిమానులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద వార్త తెలుసుకున్న ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, పవన్ కళ్యాణ్ అభిమాని ఎస్‌కేఎన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, తన వంతు బాధ్యతగా ఆ కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్, జనసేన వర్గాలు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చాయి. సినీ హీరోల పుట్టినరోజులు, సినిమా విడుదల సమయాల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టేటప్పుడు యంగ్ అభిమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు మరియు సినీ ప్రముఖులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్ తీగలు ఉన్న ప్రాంతాల్లో ప్రమాదకరంగా భారీ ఫ్లెక్సీలు కట్టవద్దని హెచ్చరిస్తున్నారు. అమలాపురం ఘటనతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒకరకమైన తీవ్ర విషాదం నెలకొంది. తమ ప్రియతమ నాయకుడి పుట్టినరోజు నాడు ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరమని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.     [Pawan Kalyan Birthday Fan Death, Amalapuram Pawan Kalyan Fan Electric Shock, Prem Kumar Electric Shock Amalapuram, Producer SKN Financial Help Pawan Kalyan Fan, TeluguOne TMDB Tollywood News]
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్, రిలీజ్ కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమై, సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. దాంతో డ్రాగన్ షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. మళ్ళీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ముందుగా అనుకున్నట్టుగా 2027 జూన్ 11న రిలీజ్ ఉంటుందా లేదా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మెదులుతున్నాయి. తాజాగా ఈ ప్రశ్నలకు మైత్రి నిర్మాత రవిశంకర్ బదులిచ్చారు. తాజాగా జరిగిన ఇరుముడి ప్రెస్ మీట్ లో రవిశంకర్ మాట్లాడుతూ.. "రెండు వారాల తర్వాత షూట్ స్టార్ట్ అవుతుంది. అప్పటినుంచి కంటిన్యూగా జరుగుతుంది. ఫిబ్రవరికి షూటింగ్ పూర్తవుతుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ బ్రహ్మాండమైన విడుదల ఉంటుంది." అని చెప్పారు.        [Dragon, Jr NTR, Prashanth Neel, NTR Neel, Irumudi, Mythri Movie Makers, Telugu Film News, Telugu News]  
ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఈ నెల 3న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో సుమంత్ ప్రభాస్. - మా మూవీ కోసం ప్రభాస్ గారిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. నా గతం, నా జర్నీ అంతా ఒక్కసారిగా గుర్తుకువచ్చింది. ఆయనను కలిసే ముందు ఒక ఎక్స్ పెక్టేషన్ తో వెళ్లాం. ప్రభాస్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ఆయనలో కనిపించింది. మా కుటుంబంలో ఎవరికీ సినిమా నేపథ్యం లేదు. సినిమాల గురించి తెలియదు. దాంతో వాళ్లు నన్ను పెద్దగా సపోర్ట్ చేయలేదు. అందరితో బాగుండు, పాజిటివ్ గా ఆలోచించు అని మాత్రం చెప్పారు.  - తెలంగాణ నేపథ్యంతో మేమ్ ఫేమస్ అనే సినిమా చేశాను. ఇక్కడి ఆడియెన్స్ బాగా చూశారు. ఆంధ్ర నేపథ్యంతో గోదారిగట్టుపైన సినిమా చేశాను. ఆ సినిమాను ఏపీ వాళ్లు ఆదరించారు. ఈ రెండు చిత్రాలతో నటుడిగా వెర్సటాలిటీ చూపించే అవకాశం దక్కింది. రోమాంచకం సినిమా హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుంది. - ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నించే యువకుడిగా ఈ చిత్రంలో కనిపిస్తాను. ఆ క్యారెక్టర్ క్యూట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో నేను ఎస్ఐ కావాలని మా నాన్నకు ఉండేది. డిగ్రీ చదువుతున్నప్పుడే మేమ్ ఫేమస్ మూవీలో అవకాశం వచ్చింది. - రోమాంచకం సినిమా ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు ఎవరైనా చూసి ఒకేలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో ఎవరితో అయినా ఈ మూవీని చూడొచ్చు. నేను హీరోగా రెండు సినిమాలు చేసినా డైరెక్టర్ వేణుగోపాల్ గారు ఆయనకు ఈ క్యారెక్టర్ కు ఎలా ఉండాలో అలా మార్చుకునేందుకు ఆర్నెళ్లు వర్క్ షాప్స్ కండక్ట్ చేశారు. ఈ క్యారెక్టర్ లో ఎలా నటించాలి అనేది నాకు ఐడియా ఉంది. కానీ వర్క్ షాప్స్ తో షార్ప్ అయ్యాను. వర్క్ షాప్స్ అంతా కంప్లీట్ అయ్యాక మొదటి నుంచి చివరి దాకా నా పర్ ఫార్మ్ చూసుకుంటే ఎంతో మార్పు కనిపించింది. కొన్నిసార్లు ఒకే సీన్ రెండు మూడు నెలలు ప్రాక్టీస్ చేసిన సందర్భాలున్నాయి. - సందీప్ అన్న ఒక అవార్డ్  ఫంక్షన్ లో కలిసి ఒక క్యూట్ స్టోరీ ఉంది నువ్వు విను అన్నారు. ఆయన చెప్పాడంటే తప్పకుండా బాగుంటుందని కథ విన్నాను. వేణు అన్న చెప్పిన నెరేషన్ రెండున్నర గంటలు ఎంజాయ్ చేశాను. సందీప్ అన్న, ప్రణయ్ అన్న బయటకు అలా కనిపిస్తారు కానీ వాళ్లు చాలా స్వీట్ పర్సన్స్. వాళ్లతో ట్రావెల్ అయిన వాళ్లకు తెలుస్తుంది. - విజయ్ దేవరకొండ అన్న మా మూవీ ప్రీ రిలీజ్ కు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన నా గురించి బాగా మాట్లాడటం కూడా సంతోషాన్నిచ్చింది. విజయ్ అన్నను చూసి నేను చాలా ఇన్స్ పైర్ అవుతుంటాను. రోమాంచకం సినిమా ఫస్ట్ కాపీ చూసి సందీప్ అన్న బాగా పర్ ఫార్మ్ చేశావంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. రోమాంచకం టైటిల్ కొత్తగా ఉంది ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందా అనిపించింది. కానీ ఇప్పుడు అదొక ఊతపదంలా మారిపోతోంది. సినిమా రిలీజ్ అయ్యాక చాలా మందికి ఈ పదం వాడుకలోకి వస్తుందని నమ్ముతున్నా. - అనంతిక టాలెంటెడ్ యాక్ట్రెస్. ఆమెకు చాలా ఆర్ట్ ఫామ్స్ తెలుసు. ఏ విద్యనైనా తక్కువ టైమ్ లో నేర్చుకుంటుంది. ఆమెతో ఈ మూవీలో వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. తనకు కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొస్తుంది. మా సినిమా ఆద్యంతం రోమాంచకం ఫీల్ ను ప్రేక్షకులకు కలిగిస్తుంటుంది. సినిమాలో ఫ్రెష్ నెస్ చూస్తారు. ప్రతి సీన్ మీకు నవ్వు తెప్పిస్తుంది. నాకు సినిమా చూసినంత సేపు మజా వచ్చింది. మా మూవీలో వాసుకి వైభవ్ మ్యూజిక్ ఇరగదీశాడు. రాధారమణ నా ఫేవరేట్ సాంగ్. ఇంకో లవ్ సాంగ్ ప్రభాస్ గారు రిలీజ్ చేశారు.  - హీరోగా అన్నిరకాల చిత్రాల్లో నటించాలని ఉంది. ఇప్పుడు లవ్ స్టోరీస్ వస్తున్నాయి. హీరోగా పేరొచ్చాక యాక్షన్, కమర్షియల్ ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. నెక్ట్స్ ఏషియన్ బ్యానర్ లో రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్ సాయిలు కంపాటితో ఒక మూవీ చేయబోతున్నా. ఈ నెలలోనే ఆ మూవీ స్టార్ట్ కానుంది.       [Romanchakam, Sumanth Prabhas, Sandeep Reddy Vanga, Prabhas, Vijay Deverakonda, Telugu Film News, Telugu News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
    మన దైనందిన జీవితంలో ఉదయపు అల్పాహారం శరీరానికి ఎంతో కీలకమైన శక్తిని అందిస్తుంది. అయితే రోజూ తినే సాధారణ ఇడ్లీ, దోసెల కంటే పోషకాలు నిండిన హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఈ క్రమంలో సూపర్ ఫుడ్‌గా పేరుగాంచిన రాగులతో చేసుకునే ఇడ్లీలు శరీరానికి కొండంత బలాన్ని ఇస్తాయి. రాగులలో కాల్షియం, ఐరన్, మరియు పీచు పదార్థాలు (ఫైబర్) పుష్కలంగా లభిస్తాయి. అయితే చాలామంది రాగి ఇడ్లీలు చేస్తే గట్టిగా వస్తాయని, పిల్లలు సరిగ్గా తినరని ఆందోళన చెందుతుంటారు. కానీ సరైన కొలతలు మరియు పద్ధతులు పాటిస్తే దూది లాంటి మెత్తని, స్పాంజీ రాగి ఇడ్లీలను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ రాగి ఇడ్లీల తయారీకి సరైన కొలతలు చాలా ముఖ్యమైనవి. ఈ రెసిపీ కోసం 1 1/2 కప్పుల రాగులు, 1/2 కప్పు బ్రౌన్ రైస్ (లేదా ఇడ్లీ బియ్యం/రేషన్ బియ్యం), 3/4 కప్పు మినపగుళ్లు, 1/2 టీస్పూన్ మెంతులు, మరియు 1/2 కప్పు అటుకులు అవసరమవుతాయి. ముందుగా ఒక గిన్నెలో 1 1/2 కప్పుల రాగులు, 1/2 కప్పు బ్రౌన్ రైస్‌ను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి 3 నుండి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మరొక గిన్నెలో 3/4 కప్పు మినపగుళ్లు మరియు 1/2 టీస్పూన్ మెంతులను కూడా నీటిలో కడిగి 3 నుండి 4 గంటల పాటు నానబెట్టాలి. పిండి రుబ్బుకోవడానికి కేవలం 5 నుండి 10 నిమిషాల ముందు 1/2 కప్పు అటుకులను కడిగి నీటిలో నానబెట్టుకుంటే సరిపోతుంది. రుబ్బే విధానంలోనే ఇడ్లీల సాఫ్ట్‌నెస్ దాగి ఉంటుంది. ముందుగా నానబెట్టిన మినప్పప్పు, మెంతులు, మరియు అటుకులను మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా నీళ్లు చేర్చి వీలైనంత మెత్తగా, నైస్‌గా రుబ్బుకుని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన రాగులు మరియు బ్రౌన్ రైస్‌ను మిక్సీలో వేసి కొద్దిగా నీటితో మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. ఇలా బరకగా రుబ్బడం వల్లే ఇడ్లీలు దూదిలా సాఫ్ట్‌గా, స్పాంజీగా తయారవుతాయి. ఈ రెండు పిండ్లను ఒకే గిన్నెలో వేసి చేతితో బాగా కలపాలి. అనంతరం ఈ పిండిని కనీసం 8 నుండి 12 గంటల పాటు ఓవర్‌నైట్ వెచ్చని ప్రదేశంలో పులియబెట్టాలి (ఫర్మెంటేషన్). పిండి బాగా పులిసి పరిమాణం పెరిగినప్పుడే ఇడ్లీలు తేలికగా వస్తాయి. ఇడ్లీలు చేసుకునే ముందు రుచికి సరిపడా ఉప్పు చేర్చి, ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొద్దిగా నీళ్లు కలిపి సిద్ధం చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి, పిండిని గడులలో నింపాలి. మరుగుతున్న నీటి ఇడ్లీ కుక్కర్‌లో ఈ ప్లేట్లను ఉంచి 10 నుండి 12 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. స్టవ్ ఆపిన 2 నుండి 3 నిమిషాల తర్వాత తీస్తే వేడివేడి, మెత్తటి రాగి ఇడ్లీలు సిద్ధమవుతాయి. వీటిని కమ్మటి ఉల్లిపాయ చట్నీ లేదా కారప్పొడితో తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి లభిస్తాయి.       Healthy ragi idli making tips, spongy ragi idli step by step.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది. మద్యలో జంటగా మారి.. జీవితం ముగిసే వరకు ఒకరికి ఒకరు అన్నట్టు ఉండటం ఈ బంధానికే చెల్లుతుంది. అయితే నేటి కాలంలో చాలామంది భార్యాభర్తలు అనుకునే ఒక పెద్ద పొరపాటు ఏంటంటే... గొడవలు, కేకలు లేదా పెద్ద జగడాలు జరిగితేనే బంధం దెబ్బతింటుందని. కానీ నిజానికి ఏ గొడవలు లేకపోయినా కూడా భార్యాభర్తల మధ్య మానసిక దూరం పెరిగిపోతూ ఉంటుంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే గదిలో పడుకుంటారు, కలిసి భోజనం చేస్తారు... కానీ ఇద్దరి మధ్య ఏదో తెలియని శూన్యం ఆవరించి ఉంటుంది. పైకి అంతా ప్రశాంతంగా అనిపించినా, లోపల అనుబంధం మాత్రం మెల్లమెల్లగా క్షీణిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం సరియైన కమ్యూనికేషన్ లేకపోవడం లేదా మాట్లాడటం బాగా తగ్గిపోవడం. ఇది విచిత్రంగా అనిపించవచ్చు కానీ idhe నిజం.. భార్యాభర్తలు అసలు మాట్లాడుకోక పోవడం లేదా మాట్లాడటం తగ్గించడం వల్ల ఏం జరుగుతుంది? దీని గురించి రిలేషన్షిప్ నిపుణులు ఏం చెబుతున్నారు? పూర్తిగా తెలుసుకుంటే.. దూరం చేసే మాయ.. ఒకప్పుడు ప్రతీ చిన్న విషయాన్ని ఉత్సాహంగా పంచుకున్న జంటలు, కాలక్రమేణా కేవలం అవసరమైన విషయాలకే మాట్లాడుకోవడాన్ని పరిమితం చేసుకుంటారు. పిల్లల ఫీజులు, ఇంటి సరుకులు, కరెంట్ బిల్లులు లేదా బంధువుల వివరాల గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. దీన్నే ఫంక్షనల్ కమ్యూనికేషన్ అంటారు. ఇది ఇంట్లో పనులు నడవడానికి ఎంత కావాలో అంత మాత్రమే మాట్లాడటం. కానీ దంపతుల మధ్య ఉండాల్సింది కేవలం సమాచార మార్పిడి కాదు, భావోద్వేగాల మార్పిడి. మనసులో ఏముంది, రోజంతా ఎలా గడిచింది, ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు ఏమిటి అనే విషయాలు పంచుకోనప్పుడు బంధంలో పలచదనం మొదలవుతుంది. మాటలు తగ్గడానికి లేదా కమ్యూనికేషన్ దెబ్బతినడానికి ప్రధాన కారణాలు.. రోజువారీ బాధ్యతలు  లేదా సోషల్ మీడియా లో చిక్కుకోవడం.. ఉద్యోగం, పిల్లల పెంపకం, ఇంటి పనుల ఒత్తిడిలో పడి ఇద్దరూ తీవ్రంగా అలసిపోతున్నారు. దానికి తోడు దొరికిన కాస్త సమయాన్ని స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా లేదా టీవీలకు కేటాయిస్తున్నారు. ఒకరినొకరు చూస్తూ మనస్ఫూర్తిగా మాట్లాడుకునే సమయం లేకుండా పోతోంది. చెప్పకుండానే అర్థం చేసుకోవాలనేమైండ్సెట్.. మేము పెళ్లై ఇన్ని సంవత్సరాలైంది, నా మనసులో ఏముందో అవతలి వారికి తెలియదా అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ ఎవరూ ఇతరుల మనసును చదవలేరు. ప్రతి విషయాన్ని స్పష్టంగా చెప్పకపోవడం వల్ల చిన్న చిన్న పొరపాట్లు, అనుమానాలు పెరిగి పెద్ద గోడలా మారతాయి. వినిపించుకునే ఓపిక లేకపోవడం.. కమ్యూనికేషన్ అంటే కేవలం మాట్లాడటం మాత్రమే కాదు, ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడం కూడా. ఒకరు చెప్తుంటే మధ్యలోనే అడ్డుపడటం, వారి భావాలను తేలికగా తీసిపారేయడం లేదా నిర్లక్ష్యం చేయడం వల్ల అవతలివారు ఇకపై ఏ విషయమూ పంచుకోకూడదని నిర్ణయించుకుంటారు. అసంతృప్తిని దాచుకోవడం.. మనస్పర్ధలు వస్తాయేమోననే భయంతో మనసులోని బాధను లేదా అసంతృప్తిని బయటకు చెప్పకుండా లోపలే దాచుకుంటారు. ఇది బయటకు గొడవగా కనిపించకపోయినా, లోపల ఒక రకమైన విరక్తిని, నిశ్శబ్ద దూరాన్ని పెంచుతుంది. భార్యాభర్తల మధ్య  మానసిక దూరాన్ని తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు.. ప్రతిరోజూ కనీసం 15 నుండి 20 నిమిషాల సమయాన్ని ఎలాంటి ఫోన్లు, టీవీలు లేకుండా కేవలం ఇద్దరి కోసమే కేటాయించాలి. కేవలం కుటుంబ బాధ్యతల గురించే కాకుండా ఒకరి ఎమోషన్స్, ఆలోచనల గురించి మరొకరు అడిగి తెలుసుకోవాలి. ఎదుటివారు మాట్లాడేటప్పుడు వారి పట్ల పూర్తి  శ్రద్ధతో ఉండాలి, చెప్పేది వినాలి.  వారి స్థానంలో నిలబడి ఆలోచించే ప్రయత్నం చేయాలి. మనసులో ఉన్న ఇబ్బందిని స్పష్టంగా, మర్యాదపూర్వకంగా పంచుకోవాలి. భార్యాభర్తల బంధంలో  నిశ్శబ్దం అనేది  శాంతికి సంకేతం కాదు. అది కొన్నిసార్లు  దూరం  పెరగడానికి కూడా కరణం అవుతుంది. ముఖ్యంగా ఒకరిని మరొకరు పూర్తిగా అర్థం చేసుకోలేనప్పుడు అది పెద్ద అగాధాన్ని సృష్టిస్తుంది.  కాబట్టి గొడవలు లేవు కదా అని నిర్లక్ష్యంగా ఉండకుండా, ప్రతిరోజూ మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడమే సంతోషకరమైన వైవాహిక జీవితానికి అసలైన సూత్రం.                          *రూపశ్రీ.
  ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మూలికా సంపదలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో మాత్రమే లభించే  పహాడీ వెల్లుల్లి  లేదా  హిమాలయన్ సింగిల్ క్లోవ్ గార్లిక్  ఎంతో ప్రత్యేకమైనది. దీనిని సాధారణంగా కశ్మీరీ వెల్లుల్లి అని కూడా పిలుస్తారు. సాధారణంగా మనం వంటల్లో వాడే వెల్లుల్లి పాయల కంటే ఇది పరిమాణంలో చిన్నగా, ఒకే ఒక్క పాయగా (Single Clove) గుండ్రంగా ఉంటుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మన సాధారణ వెల్లుల్లితో పోలిస్తే ఈ పహాడీ వెల్లుల్లిలో దాదాపు 7 రెట్లు అధికంగా పోషకాలు మరియు ఔషధ గుణాలు దాగి ఉంటాయని ఆయుర్వేద నిపుణులు మరియు శతాబ్దాల వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. హిమాలయాలలోని స్వచ్ఛమైన వాతావరణం, మంచు నీరు మరియు ప్రత్యేకమైన నేల స్వభావం దీనికి అపరిమితమైన శక్తిని అందిస్తాయి. పహాడీ వెల్లుల్లిలో అత్యధిక గాఢత కలిగిన  అల్లిసిన్  (Allicin) అనే అద్భుతమైన ఆర్గానోసల్ఫర్ సమ్మేళనం ఉంటుంది. సాధారణ వెల్లుల్లి కంటే ఇందులో 300 శాతం ఎక్కువ అల్లిసిన్ నిల్వలు ఉంటాయి, ఇది మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనితో పాటు పహాడీ వెల్లుల్లిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఐరన్, కాపర్, మాంగనీస్, విటమిన్ బి6 మరియు విటమిన్ సీ పుష్కలంగా లభిస్తాయి. రోజుకు కేవలం 2 నుండి 3 పహాడీ వెల్లుల్లి పాయలను పరగడుపున నమిలి తింటే, శరీరంలో రోగనిరోధక శక్తి దాదాపు 50 శాతం వరకు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది శరీరంలో ఉండే有害 ఉచిత రాడికల్స్ (Free Radicals) ను నిరోధించి కణాల క్షీణతను 40 శాతం వరకు అడ్డుకుంటుంది. హృదయ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పహాడీ వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి, రక్త ప్రసరణను 35 శాతం వరకు మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా పహాడీ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (LDL) మరియు ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు 20 శాతం నుండి 25 శాతం వరకు తగ్గుతాయి. అంతేకాకుండా అధిక రక్తపోటు (High Blood Pressure)ను నియంత్రించడంలో ఇది 90 శాతం సమర్థవంతంగా పనిచేస్తుంది. రక్తనాళాలను రిలాక్స్ చేసి, బ్లడ్ క్లాట్స్ (రక్తపు గడ్డలు) ఏర్పడే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.       how to use pahadi garlic daily,pahadi garlic vs normal garlic benefits.
అన్ని జీవరాశులకు ఆహారమే శక్తినవనరు. అయితే మనిషికి మాత్రం ఆహారంలో ఎన్నో ఛాయిస్ లు ఉన్నాయి. కానీ  ఏది పడితే అది, ఎలా పడితే అలా తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. కొందరు అనారోగ్యం చేసినప్పుడు లేదా కొన్ని రకాల ట్రీట్మెంట్ లలో ఉన్నప్పుడు పత్యం చేయమని చెబుతారు.   పత్యం ఆహారంలో ఉన్నప్పుడు వంకాయను తినకూడదని చెబుతూ ఉంటారు.  సాధారణంగా  సాంప్రదాయ ఆయుర్వేదం, నాటు వైద్యంలో కొన్నిరకాల అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి వంకాయ తినకూడదని సిఫారసు చేస్తారు.  సాధారణ రోజుల్లో వంకాయ రుచికరమైన, పోషకాలున్న కూరగాయ అయినప్పటికీ, పత్యం వేళల్లో దీనిని మినహాయించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వంకాయను పత్యం ఉన్నప్పుడు ఎందుకు తీసుకోకూడదో వివరంగా తెలుసుకుంటే.. వంకాయ.. వంకాయను ఆయుర్వేదంలో వాత, పిత్త దోషాలను పెంచే ఆహారంగా పరిగణిస్తారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఉన్నప్పుడు లేదా రోగ నివారణకు పత్యం ఉంటున్నప్పుడు వంకాయ తింటే వాత దోషం పెరిగి నొప్పులు, జాయింట్లలో ఇబ్బందులు వస్తాయి. వంకాయ విత్తనాల్లో , తోలులో కొన్ని రకాల సహజ కాంపౌండ్లు ఉంటాయి. ఇవి సున్నితమైన చర్మం ఉన్నవారిలో, లేదా ఇప్పటికే దద్దుర్లు, దురదలు, అలర్జీలతో బాధపడుతున్న వారిలో సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ఔషధాల ప్రభావం సరిగ్గా పనిచేయాలన్నా చర్మ సంబంధిత పత్యంలో వంకాయకు దూరంగా ఉండాలి. వంకాయ అరుగుదలకు కాస్త సమయం తీసుకుంటుంది. శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు జీర్ణక్రియ మందగిస్తుంది. అటువంటి సమయంలో సులభంగా అరగని వంకాయను తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో ఎక్కడైనా గాయాలు, పుండ్లు ఉన్నప్పుడు లేదా శస్త్రచికిత్సలు జరిగినప్పుడు నాటు వైద్యంలో ప్రత్యేక పత్యం సూచిస్తారు. వంకాయ శరీరంలో వేడిని,   దురదను పెంచి పుండ్లు త్వరగా మానకుండా అడ్డుకుంటుందని చెప్తారు. వంకాయ సోలనేసి కుటుంబానికి చెందిన కూరగాయ. ఇందులో సోలనైన్ అనే కాంపౌండ్ ఉంటుంది. సాధారణ ఆరోగ్యంతో ఉన్నవారికి ఇది పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా, పత్యం చేసేవారిలో , మందులు వాడేవారిలో ఇది జీర్ణ వ్యవస్థపై , నాడీ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్లనే పత్యం సమయంలో శరీరం త్వరగా కోలుకోవడానికి, ఔషధాలు ఎలాంటి సమస్య లేకుండా పనిచేయడానికి వంకాయకు దూరంగా ఉండాలని పెద్దలు , ఆయుర్వేద వైద్యులు సలహా ఇస్తారు. పత్యం పూర్తయి శరీరం పూర్తి ఆరోగ్యాన్ని పుంజుకున్న తర్వాతే వంకాయను ఆహారంలో తిరిగి చేర్చుకోవడం మంచిది.                          *రూపశ్రీ.
నేటి డిజిటల్ యుగంలో ఆరోగ్య స్పృహ, ఫిట్‌నెస్ పట్ల శ్రద్ద పెరిగాయి. జిమ్‌లకు వెళ్లేవారు, బరువు తగ్గాలనుకునేవారు లేదా కండరాల పుష్టి కోసం ప్రయత్నం చేసేవారు ప్రోటీన్ షేక్స్, హెల్త్ సప్లిమెంట్లు, డిజైనర్ ప్రోటీన్ బార్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కానీ, మన తాతల తండ్రుల కాలంలో ఎలాంటి ప్రొటీన్ పౌడర్లు ఉండేవి కావు. అయినా వారు ఎంతో బలంగా, శక్తివంతంగా, దీర్ఘకాలిక ఆరోగ్యంతో జీవించారు. దానికి కారణం వారు రోజూ తీసుకునే సంప్రదాయ భారతీయ ఆహారమే! మన ప్రాంతీయ వాతావరణం, రుతుపవనాలు , పాతకాలపు వంట పద్ధతుల ఆధారంగా మన పళ్లెంలో చేరే రోజూవారీ ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా లభించేవి. ఆధునిక ఆహార అలవాట్ల వల్ల కాలక్రమేణా మనం మరచిపోయిన, కానీ మన తాతల కాలంలో క్రమం తప్పకుండా తిన్న 10 శక్తివంతమైన ప్రోటీన్ ఆహారాలు ఉన్నాయి.  నిజానికి ఇవన్నీ ప్రోటీన్ సూపర్ ఫుడ్స్.. అవేంటో తెలుసుకుంటే..  ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం:  ఉలవలు.. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఇంట్లో క్రమం తప్పకుండా వాడే ధాన్యాల్లో ఉలవలు ముఖ్యమైనవి. శాకాహారంలో ప్రోటీన్ అత్యధికంగా లభించే ఆహారాల్లో ఇది ఒకటి. మన తాతలు రోజంతా కష్టపడి పనిచేయడానికి అవసరమైన శక్తిని ఈ ఉలవలే ఇచ్చేవి. ఉలవ చారు, ఉలవ పప్పు, చట్నీలు లేదా గుగ్గిళ్ల  రూపంలో వీటిని తీసుకునేవారు. ప్రోటీన్‌తో పాటు ఇందులో ఐరన్, పీచు పదార్థం , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీ రాళ్లను నివారించడంలోనూ, శరీరంలో కొవ్వును తగ్గించడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. సత్తు పిండి.. ఇది శనగలను వేయించి, మెత్తగా పొడి చేసి తయారుచేసే సంప్రదాయ ఆహారం. ప్రోటీన్ షేక్స్‌కు ఇది పూర్వీకుల కాలం నాటి దేశీ వెర్షన్ అని చెప్పవచ్చు. వేసవికాలంలో సత్తు పిండిని నీళ్లు, నిమ్మరసం, మసాలాలతో కలిపి  తాగేందుకు వాడేవారు. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. నాణ్యమైన ప్రోటీన్ , ఫైబర్ ఉన్న సత్తు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. నల్ల శనగలు.. ఈ రోజుల్లో తెల్ల శనగలు వాడకం పెరిగినప్పటికీ, పూర్వకాలంలో నల్ల శనగలదే హవా రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే గుడాలుగా  తినడం లేదా కూరల్లో వాడటం చేసేవారు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వేయించిన నల్ల శనగలను తీసుకెళ్లేవారు. ఇవి త్వరగా పాడవవు, తింటే కడుపు నిండుగా ఉంటుంది. ఇవి ప్లాంట్ బేస్డ్   ప్రోటీన్‌తో పాటు ఐరన్‌ను సమృద్ధిగా అందిస్తాయి.  బొబ్బర్లు / అలసందలు.. బొబ్బర్లు లేదా అలసందలు ఒకప్పుడు ప్రతీ ఇంట్లోనూ రెగ్యులర్‌గా వండే కూర ధాన్యం. వీటిలో అత్యధిక మోతాదులో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్ , ఐరన్ ఉంటాయి. నాటు దినుసులు , మసాలాలతో నెమ్మదిగా ఉడికించి చేసే బొబ్బర్ల కూర లేదా గుడాలు శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. మట్కీ / మోత్ బీన్స్.. రాజస్థాన్ వంటి పొడి వాతావరణం కలిగిన ప్రాంతాలలో ఎక్కువగా పండే మట్కీ లేదా మోత్ బీన్స్ చిన్నగా ఉన్నప్పటికీ పోషకాల గని. ఇవి చూడటానికి పెసల సైజ్ లో ఉంటాయి. కానీ వీటి రంగు మాత్రం భిన్నంగా ఉంటుంది.  తక్కువ నీటితో పండే ఈ పంట రైతులకు, ప్రజలకు ప్రధాన ప్రోటీన్ మూలంగా ఉండేది. వీటిని మొలకలెత్తించి తినడం లేదా కారంగా కూర వండుకోవడం చేసేవారు. ధాన్యాలను మొలకెత్తించడం వల్ల వాటిలోని ప్రోటీన్ , ఇతర పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుందని మన పూర్వీకులకు ముందే తెలుసు. మినపప్పు.. నేడు మినపప్పును కేవలం ఇడ్లీ, దోస పిండి లేదా పోపులకే పరిమితం చేశాం. కానీ, పూర్వకాలంలో మినపప్పుతో వడలు, మినప రొట్టెలు, మినప సున్నుండలు వంటి బలమైన పదార్థాలు తయారుచేసి తినేవారు. మినపప్పులో ప్రోటీన్‌తో పాటు క్యాల్షియం, పొటాషియం, ఐరన్ మెండుగా ఉంటాయి. బియ్యం లేదా తృణధాన్యాలతో కలిపి మినపప్పును తిన్నప్పుడు అది శరీరానికి పూర్తిస్థాయి ప్రోటీన్‌ను అందిస్తుంది.  ఇంట్లోనే తయారుచేసిన తాజా పనీర్.. పాకెట్లలో లభించే ప్యాక్ చేసిన పనీర్ కాకుండా, మన అమ్మమ్మలు గేదె లేదా ఆవు పాల నుంచి తాజా నిమ్మరసం పిండి పనీర్ తయారు చేసేవారు. ఈ తాజా పనీర్‌లో ఎలాంటి రసాయనాలు ఉండవు. ఇది నాణ్యమైన ప్రోటీన్ , క్యాల్షియంను ఉచితంగా శరీరానికి అందిస్తుంది. ఎముకల గట్టితనానికి, కండరాల పునరుద్ధరణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.  వేయించిన వేరుశనగలు..   నట్స్ అనగానే ఈ రోజుల్లో బాదం, జీడిపప్పు, పిస్తా గుర్తుకొస్తాయి. కానీ పేదవాడి బాదం పప్పు అయిన వేరుశనగలు పోషకాల్లో దేనికీ తీసిపోవు. సాయంత్రం పూట తినుబండారంగా, లేదా బెల్లంతో కలిపి పల్లీ పట్టీ రూపంలో పూర్వీకులు వీటిని రోజూ తినేవారు. వేరుశనగల్లో ప్రోటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. రాజగిరా / అమరాంత్ గింజలు.. రాజగిరాను  ఉపవాసాల సమయంలో ఎక్కువగా తింటుంటారు. కానీ పూర్వకాలంలో దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకునేవారు. రాజగిరా గింజల్లో శరీరం స్వయంగా తయారుచేసుకోలేని 9 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది సంపూర్ణ ప్రోటీన్ కలిగిన అతికొద్ది వృక్షాహారాలలో ఒకటి. రాజగిరా లాడ్డు, జావ, రొట్టెల రూపంలో  తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. నువ్వులు .. పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ నువ్వులలో ఉండే పోషకాలు అపారం. నువ్వుల పొడి, నువ్వుల చట్నీ, నువ్వుల ఉండలు మన సంప్రదాయ ఆహారంలో భాగం. నువ్వులలో కేవలం క్యాల్షియం, మంచి కొవ్వులే కాకుండా విలువైన ప్రోటీన్ కూడా ఉంటుంది. నువ్వులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కండరాలు బలంగా మారడమే కాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫిట్‌నెస్ అంటే విదేశీ ఆహార అలవాట్లను లేదా ప్యాక్ చేసిన హెల్త్ పౌడర్లను గ్రైండ్ చేయడం కాదు. మన ఇంట్లోనే, మన పూర్వీకులు తిన్న సంప్రదాయ ధాన్యాలు , పప్పు దినుసులలోనే శరీరానికి అవసరమైన అసలైన బలం దాగి ఉంది.  దైనందిన ఆహారంలో మళ్లీ ఈ పాతకాలపు ఆహారాలను భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన శరీరం లభిస్తుంది.