Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 15

తాయారును ఉండడమో, పంపడమో, మంజరి తేల్చుకోలేక పోయింది. చలపతి సాటికి పదిసార్లు, పంపించుమని చెప్పాడు. అంటే తాయారు వుండటం వల్ల, అడ్డిపోయేదేదో ఉంటుందన్నమాట! అదేమిటయి ఉంటుందో మంజరికి ఛటుక్కున తట్టలేదు.
"ఏదో వొకటి నా పీకలమీదికి తెస్తూనే ఉంటాడు. ఏమనడానికీ లేకుండానూ  చేస్తాడు" అనుకొంది మంజరి.
తాయారు తన పనులన్నీ చకచకా పూర్తిచేసుకొంది. తదిచేతిని పమిటకు తుడుచుకుంటూ "వెళ్ళొస్తానండమ్మాయిగోరూ!" అన్నది.
"అదేం?" అన్నది మంజరి లాంఛనంగా.
"ఇంటికాడ శానపనులొగ్గేసినానండీ! ఇయ్యాల, అయ్యన్నీ పూరితి చేసుకొందామని పోతుండానండీ!" అన్నది తాయారు.
దాని కళ్ళు నవ్వుతున్నట్లు తోచింది మంజరికి. అయినా, కూపీ లాగుదామని ఉద్దేశంతో "ఎన్నడూ లేనిది ఇవ్వాళే నీకు పనులొచ్చాయా తాయారూ! ఆయనగారు బజారు కెళ్ళారు. ఎప్పుడొస్తారో ఏమిటో తెలీదు ఒంటరిగా, బిక్కు బిక్కు మంటూ ఉండాలంటే భయంగా వుంది. పోనీ వారొచ్చేదాకా ఉండగూడదుటే!" అన్నది మంజరి.
తాయారు మింటబెట్టిన దీపం, దానిముందీ  వసవసలేమీ పనికిరావు. ఆవిడ కళ్ళముందు ఇటువంటి వారెందరో దాటిపోయారు. ఆవిడ లోలోపల నవ్వుకొంటూ  సాధ్యమైనంత వరకూ నవ్వును కప్పిపుచ్చుకొంటూ, కాదు కూడదు పోవాలని బలవంతపెట్టింది.
"అంతగా అవసరమయితే, ఈవీధి కొసకొచ్చి కేక పెట్టండమ్మగారూ! నేను లగెత్తుకొస్తాను.... లేదా - నాపనులయ్యాక, వోసారి మళ్ళొస్తాను, అయ్యగారొస్తే సరేసరి, లేదా ఆపాట్నే తొంగుంటాను" అంటూనే అది వెళ్ళిపోయింది.
మంజరికో క్షణం అయోమయంగా అనిపించింది. అన్ని సంగతులూ, అందరకూ తెలిసిపోతున్నాయనీ, ఒక్క తనకు మాత్రమే ఏ సంగతీ తెలియడం లేదనీ, ఆవిడ వ్యధ చెందింది.
తాయారు వెళ్ళిన పదినిమిషాలకల్లా, ఓ నల్లనికారు - ఏది ముక్కో ఏది ముఖమో, తెలీని కారొచ్చి వాకిటిముందు ఆగింది.
అందులోంచి వెంకటేశ్వర్లుగారు దిగిందాకా, ఆకారు తనయింటి కోసమే వచ్చినట్లు మంజరి అనుకోలేదు. అతను నవ్వుకొంటూ దిగాడు మంజరిని చూసి కళ్ళెగరేశాడు  సన్నగా ఈల కూడా వేశాడు.
మంజరి గుండెలు గతుక్కుమన్నాయి. మొన్నటికన్నా ఈసారి చాలా చొరవగా వెంకటేశ్వర్లు వచ్చి కూచున్నాడు మొన్న సరీగ్గా పలకనందుకే, చలపతి చాలా చిరాకు పడ్డాడు. ఈసారి తనలా ప్రవర్తిస్తే అతను క్షమించడేమో ననిపించింది. ఇలా మాటిమాటికి చలపతికి కోపం తెప్పించటం భావ్యం కాదనికూడా మంజరికి తెలుసు. కానీ చలపతి ప్రవర్తన చూస్తుంటే తనకు కోపమేకాదు, చెప్పరానంత అసహ్యం కూడా వేస్తోంది. అయితే తన అసహ్యాన్ని బయట పెట్టడానికి వీల్లేదు. కుక్కిన పేనులాగా భరించవలసిందే!
అతనితో ఏదో విధంగా మాట్లాడాలనుకొంది కానీ, సంభాషణ ఎలా ప్రారంభించాలో మంజరికి తోచలేదు. బహుశా వెంకటేశ్వర్లుకూడా, ఇదే స్థితిలో ఉన్నాడేమో, తలొంచుకొని కుర్చీలో కాళ్ళూపుతూ కూర్చున్నాడు.
"వారు బజారు కెళ్ళారండీ! రావడానికి చాలాసేపు పడుతుందనుకుంటాను" అన్నది మంజరి. గడపకు ఆటో కాలూ, ఇటో కాలూ వేసి నిలబడి.
"నాకు తెలుసు ఇప్పుడాయన మా ఆఫీసు కొచ్చాడు. మా అన్నయ్యతో నీ బుకింగ్స్ ను గురించి మాట్లాడుతున్నాడు" అన్నాడు వెంకటేశ్వర్లు.
మంజరికి లోలోపల చలపతిమీద కృతజ్ఞతాభావం మోసులెత్తింది.
వెంకటేశ్వర్లు ఓసారి మంజరిని ఎగాదిగా చూసి, సన్నగా నవ్వేశాడు.
"చూడమ్మాయ్! నీవయస్సెంత?" అన్నాడతను. మంజరి ఇబ్బందిగా ఫీలయ్యే చోట్లను చూపులతో తడుముతూ.
అంత చిరాకులోనూ మ,మంజరికి నవ్వొచ్చింది. ఆ వెంటనే మరో బ్రహ్మాండమైన ఆలోచనకూడా వచ్చింది. తనీ మాటమీదనే వెంకటేశ్వర్లు తో సంభాషణ నెందుకు పెంచకూడదు?" ఈ ఆలోచన రాగానే అందులోంచి తేరుకున్న దానిలాగా ఓసారి గట్టిగా నవ్వి, చేతులు రెండూ వెనక్కు చేర్చి వొళ్ళు విరుచుకొని, కుర్చీలో - వెంకటేశ్వర్లు కెదురుగా కూచుంది. అతనికళ్ళు, తోడేలు కళ్ళలా, మకమకలాడుతుండటం   ఆవిడ గమనించింది.
"ఏం మాట్లాడవేం మంజరి?" అన్నాడు వెంకటేశ్వర్లు.
"మీరేమనుకుంటున్నారో చెప్పండి!" అన్నది మంజరి, సిగ్గుపడుతున్న దానిలాగా.
"నేనా?" అని కాస్సేపు మంజరిని ఎగాదిగా చూశాడు వెంకటేశ్వర్లు. అతని చూపులు ఉన్నతోన్నత ప్రదేశాల మీద కాస్సేపు తచ్చాడి, ఛటుక్కున లోయలోకి జారి అక్కడే ఆగిపోయాయి. నేనూ -పాతికదాకా ఉంటాయనుకొంటున్నాను అని నవ్వి  కన్నుమలిపాడు.
మంజరి అయిదారు నిమిషాలపాటు విరగబడి నవ్వింది. ఆ తరువాత తను బాగా నవ్వానని కూడా అనుకొంది.
"మంచివారేనండీ మీరు. నా వయస్సు చెప్పమంటుంటే మా అమ్మా వయస్సు చేబుతారేమిటి?" అన్నది కళ్ళు చిలికించి ఓసారి అనవసరంగా బుజాలు కుడుపుకుంటూ.
వెంకటేశ్వర్లు కూడా నవ్వాడు.
"పోనీ, నువ్వు చెప్పరాదూ?" అన్నాడతను కాళ్ళు, బల్లమీదుగా చాపుతూ.
"నాకు పాతికేళ్ళుంటాయన్న నమ్మకం మీ కేర్పడ్డాక, నేనెంత చెప్పినా అది అబద్దంగానే ఉంటుంది." అన్నది మంజరి.
"నాది నమ్మకంకాదు - కేవలం ఊహ. నువ్వబద్దం చేబుతావన్న ఆలోచన నాకు లేనేలేదు....ఊఁ....నువ్వే చెప్పుమరి!" అన్నాడతను.
"నాకా!" అని ఓ నిమిషం ఆలోచించింది మంజరి తరువాత, గోముగా నవ్వుతూ ఆడదాన్ని వయస్సూ, మగవాడి సంపాదనా అడక్కూడదు గదండీ అన్నది మంజరి.
"అయితే ఆ నియమాన్ని నేనే ముందు కాదంటాను నాకు డెబ్బైయ్యకరాల మాగాణి భట్లపెనుమర్రు దగ్గరుంది. పార్వతీ పరమేశ్వర రైస్ మిల్లులో పదకొండణాల వాటా ఉంది. రెండు కమీషను కొట్లున్నాయి. నా తమ్ముడి పేరున, ఎరువుల వ్యాపారం చేస్తున్నాను. దానా దీనా సాలుకు ఓ లకారం, కళ్ళ చూస్తుంటాను. కొంపదీసి ఏ ఇన్ కంటాక్స్  వాడికన్నా చెప్పేవు, నా పుఠామారిందన్నమాటే అసలీ డబ్బును, పన్నుల కింద గవర్నమెంటుకు కట్టడం నాకిష్టం లేదు  అందుకే సినిమా తియ్యాలని  సంకల్పించుకొన్నాను. మా షడ్డగుడున్నాడే రామబ్రహ్మం - వాడికి లైన్లో తెలిసిన వాళ్ళున్నారు. ఓ సినిమా తీద్దామన్నాడు. సరేనన్నాను. ఓ లక్ష సరిపోతాయన్నాడు. ఎందుకైనా మంచిదని రెండు లక్షలు బ్యాంకులో వేసుక్కూచున్నాను. ఇంతవరకూ మాంచి కధ దొరకలేదు. ఏదో ఓ కధను ఎన్నుకొని నాలుగుమాసాల్లో సినిమా తీసి పారేసి బెజవాడ వెళ్ళాలి. ఈ రెండు లక్షలు పోతాయన్న దిగులు నాకులేదు. సినిమావాళ్ళు నా డబ్బు తినకపోతే గవర్నమెంటు తింటుంది. అంతె తేడా! నాదికానపుడు  ఏమైనా నాకు దిగులులేదు గనక, నేను పట్టించుకోవడం లేదు. అమ్మాయీ ఇదీ నా సంగతి" అన్నాడు వెంకటేశ్వర్లు.
"మీ కంపెనీ పేరు నోట్లో ఆడతా ఉండండి! ఏమిటన్నారూ  అది?" అన్నది మంజరి.
"నవకళా చిత్రాలయ అని పేరు పెట్టాం."
"బ్యూటిఫుల్ చాలా బావుంది" అన్నది మంజరి.
ఆసరికే వెంకటేశ్వర్లు కాళ్ళు, మంజరి కాళ్ళను తాకుతున్నాయి. ఆవిడ కాళ్ళను వెనక్కు తీసుకోలేదు సరిగదా, మరికొంచెం ముందుకు జరిపి వెంకటేశ్వర్లుకు జవాబు  చెప్పసాగింది.
"ఇందాకనే , ఓ కవి నాకో కధ చెప్పాడు బావుంది. అందులో ఓ పదహారేళ్ళమ్మాయి భర్తను కోల్పోయి, అనేక సాహస కార్యాలు చేశాక, తిరిగి మొగుణ్ణి కలుసుకొంటుంది. ఆ కధ వింటున్నంత సేపూ నువ్వేనా కళ్ళముందున్నావు. ఇంతకు ముందు చలపతిగారు మా ఆఫీసు కొచ్చినప్పుడు ఆ ముక్కే ఆయనతో అన్నాను. అద చెప్పి మంజరి అభిప్రాయం కనుక్కోమన్నాడు. నేనిలా వచ్చాను, నీకా వేషం నచ్చినట్టేనా?" అన్నాడు వెంకటేశ్వర్లు.
మంజరి ఓసారి ఓరకంటితో అతని కేసి చూసి సిగ్గుపడి తల వొంచుకుంది.
"వండర్ ఫుల్, వండర్ ఫుల్! ఇంత గొప్పగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్నావు కదా! ఇంతవరకూ ఏ ప్రొడ్యూసరూ
నిన్నెందుకు ఎగరేసుకు పోలేదా అని! నిన్ను తొలిసారిగా సెల్యూలాయిడ్ లో కెక్కించిన కీర్తినాకు దక్కాలని దేవుడురాస్తే, ఒకళ్ళు చేసేదేమిటి గాని -నువ్వు కాస్త టాయిలెట్ అవరాదూ త్వరగా!"
"ఇలా మీకు బావుండలేదా?" అన్నది మంజరి.
ఆ మాటతో వెంకటేశ్వర్లు చిత్తు చిత్తయిపోయాడు. అతనో సారి బాధగా వొళ్ళు విరుచుకొని "అందుగ్గాదు. మణిని మసిపాతలో కట్టారనే నాబాధ" అన్నాడు.
"మణి అందం పూర్తిగా చూడాలంటే మసిపాతలున్నప్పుడు ఎలా వీలవుతుందండీ" అన్నది మంజరి!
"ఈ దెబ్బతో వెంకటేశ్వర్లు గో(హో)విందా!"
"మీ ఇల్లు చూపించావు గాదేం? ఇదేనా మర్యాద? రేపు ఆఫీసుకొచ్చినప్పుడు నిన్నిలాగే ఆఫీసు నుండి బయటికి పంపేస్తే నువ్వేమనుకొంటావ్?" అన్నాడు వెంకటేశ్వర్లు.
"అలా పంపించక  లోపలకు లాక్కుపోయి, వేసేస్తామంటారా ఏమిటి?" అన్నదావిడ.
"నువ్వు నన్ను నిలువునా కాల్చేస్తున్నావ్ మంజరి! అప్పు డెప్పుడో  తలుపులు వేయటం కాదు"
"కొంప ముంచారు, ఉండండి బాబూ మీలాంటి వాళ్ళతో వొంటరిగా ఉండడం ఎంత ప్రమాదమో! నేను లోపలకన్నా వెళతాను."
మంజరి లేచి గదిలో కొచ్చింది. ఆమె వెనుకనే వెంకటేశ్వర్లు కూడా వచ్చాడు. వస్తూనే తలుపులు రెండూ, దగ్గరకు నొక్కి గడియపెట్టాడు.
"మీ దౌర్జన్యమేమిటో నాకు బోధపడకుండా ఉంది. ఎవరిచ్చిన చనువండీ ఇది?" అన్నది మంజరి.
"కోపాన్ని ఎంతబాగా ఎక్స్ ప్రెస్ చేస్తావోయ్ నువ్వు, ఏదీ అలానే ఓ చిన్న నవ్వు కూడా పారేయ్ చూద్దాం" అన్నాడు వెంకటేశ్వర్లు.
"ఊఁహు, నేనవ్వను" అంటూనే మంజరి ముఖాన్ని రెండు చేతులతోను కప్పుకొని నేలమీద కూచుండి పోయింది.
ఆ తరువాత ఏం జరిగేదీ మంజరికి తెలుసు. అనేక వందలసార్లు ఇటువంటి సీనుల్లో అత్యద్భుతంగా నటించిన అనుభవం. వృదా కాలేదు. వెంకటేశ్వర్లు తోడేలులాగా! ఆమె దగ్గరకు చేరి రెండు చేతులతోనూ, ఆలింగనం చేసుకొన్నాడు.
"నన్ను తాకకండీ....దూరంగా ఉందండీ....ఎవరన్నా చూస్తారండీ స్వామీ! కనీసం తలుపులన్నా వెయ్యనిస్తా...."
వీటివేటికి వెంకటేశ్వర్లు సమాధానమివ్వలేదు. తన శక్తి నంతా చేతుల్లోకి తీసుకొని ఆమెను నిలుచోబెట్టాడు. ముఖాన్నించి అతని చేతుల్ని తీసిపారేశాడు. ఓ అడుగు ఎడంగా నిలబడి చూపులతో ఆవిణ్ణి తినేసాడు.
"అలా చూడకండి. మీకు పుణ్యముంటుంది. నన్నెందుకింకా పిచ్చిదాన్ని చేస్తావు?" అన్నది మంజరి.
ఆక్షణాన తను తాను కాకుండా అతనిలోని మృగాలు నిద్రలేచి వళ్ళు  విరుచుకొని మంజరిని నిలువునా ఆలింగనము చేసుకొని తనకేసి వెచ్చగా ఆత్రంగా వెదుకులాడే అతని పెదవులకు, పెదవులు తారసిల్లాయి.
"అబ్బ! చంపేస్తున్నారు!" అన్నది మంజరి. అతనిలోని నిప్పు ఎగసనదోస్తూ. వెంకటేశ్వర్లు మాట్లాడలేదు. ఆమెను తనమీదకు పోదువుకొని గట్టిగా నిట్టూర్చాడు....విశ్వాన్ని జయించిన వీరునిలాగా వెంకటేశ్వర్లు నవ్వుకుంటూ కూచున్నాడు. అతని చూపుల్లో ఇంకా తీరని దాహం దోబూచులాడుతూ వుంది....కుర్చీలో కూచుని సిగరెట్ పొగ ఉంగరాలకింద వూదుతూ కాళ్ళాడిస్తున్నాడు.
మంజరి ఎంతో బాధను అభినయించింది. మంచందిగి, రెండడుగులు వేసి తూలిపడింది. జారిపోయిన చీరె కుచ్చెళ్ళను  అటూ ఇటూ సర్దుకుంది. గోళ్ళతో జుత్తును సరిచేసుకొంది. అనవసరంగా జాకెట్ గుండీలను చూసుకొంది. తిరిగి మంచం మీదనే కూచుంది.
అలా వున్నావేం అన్నాడు వెంకటేశ్వర్లు. కో ప్రొడ్యూసర్  కమ్ నవకళా చిత్రాలయ మేనేజర్.
"ఎలా వున్నావేం? పాపమని? పోదురూ! ఇహనించీ మీతో నేను మాట్లాడను" అన్నది మంజరి ముద్దులు కుడుస్తూ.
"నేనేం చేశానని అంతకోపం?" అన్నాడు వెంకటేశ్వర్లు కుర్చీలోంచి లేస్తూ.
"మళ్ళా లేవకండి బాబూ!" అన్నది మంజరి.
ఈ మందులెలా పనిచేస్తాయో మంజరికి తెలుసు. అదే మందు వెంకటేశ్వర్లు మీదా వాడిచూసింది. ఆ మరుక్షణమే అతనికి పూనకమూ కలిగింది.
మకున్నాను గానీ ఇంత కనుగాయ
ఎరిగిందో తెలుసా? పెద్దాపురం వెళ్ళాను.  -నువ్వు వింటున్నట్టు లేదు గదూ?"
అని ఉలిక్కిపడి "ఏమిటి మళ్ళా చెప్పండి?" అన్నది మంజరి.
అదెప్పుడయినా  చెబుతానుగానీ ముందు నువ్వాలోచిస్తున్నదేమిటో బయటపెట్టరాదూ? అన్నాడతను. మంజరి ఓ నిముషంపాటు ఆలోచించింది. ఆ తరువాత గట్టిగా, నిట్టూరుస్తూ, పెదవి విరిచి. ఓ సారి కళ్ళునులుముకొని, ఏమిటన్నారు? మీరేదో చెబుతూ, చెబుతూ మధ్యలో ఆపేశారేం? అన్నది."
వెంకటేశ్వర్లు, తాపీగా మంజరి పక్కనే కూచున్నాడు. ఆవిడ భుజం మీదుగా చేతులు వేసి, మంజరి ముఖాన్ని తనకేసి తిప్పుకొని కళ్ళలోకి సూటిగా చూస్తూ "ఏమిటి మంజరీ ఆ పరధ్యానం? నాతో చెప్పరాదా వీలుంటే నేను తప్పకుండా సాయం చేస్తాను" సినిమాలో హీరోయిన్ లాగా.
"బ్యూటిఫుల్ మంజరీ! నాకిప్పటికి అర్ధంకానవి దేమిటంటే ఈ సినిమా మనుషులకు చెవులే తప్ప కళ్లెందుకు లేవా అని! ఇంత బ్రహ్మాండంగా, గ్రేతాగార్బోలాగా భావాలు పలికిస్తావుగదా, నీకింకా సినిమాచాన్స్ రాలేదో బోధపడదు. ఇప్పుడు నువ్వన్న డైలాగునే, రేపు నువ్వు క్లోజప్ లో అంటే ఆడిటోరియమ్, హాహాకారాలు చేస్తుంది గానీ, మానుతుందా? అబ్బే? ఏంలేదండీ, అనడంలో, ఎన్ని రకాల మాడ్యులేషన్సు  ఎక్స్ ప్రెస్ చేశావో నీకు తెలీదు. ఈ ఫీల్డులో పడి  కొట్టుకొంటున్న వాణ్ని గనుక, నేనిట్టే గ్రాస్ప్ చేశాను. మార్వోలెస్ మంజరీ! ఫ్యూచర్ సినీవరల్డంతా నీపాదాలమీద పడి గాపులు పడకపోతే నా చెవ్వు తెగ్గోసుకుంటాను" అన్నాడు వెంకటేశ్వర్లు.
"మీరు మనుషుల్ని ఉబ్బేసి పబ్బం బాగా గడుపుకొంటారనుకొంటా" అన్నది మంజరి.
ఆ తరువాత ముఖం చిట్లించి కోపం అభినయిస్తూ "అబ్బా ఏమిటా చిలిపి  మాటలు! ఎప్పుడూ అదే యావయితే ఎలా? స్వామీ! మీతో వేగడం బహుకష్టం. నా విన్నపమేమనగా, మీకు మీ స్నేహానికి గుడ్ బై! దయచేసి రేపటినుండి నన్నిలా వేధించకండి!" అన్నది మంజరి.
'అది నాయిష్టం!' అన్నాడు వెంకటేశ్వర్లు, ఆవిడ చెక్కిళ్ళ నోసారి మృదువుగా తాకుతూ.
"ఇందాక మీరో  ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పుకొన్నారు. ఇప్పుడలా వొదల్ను. నిజంగా -ప్రమాణంచేసి చెప్పండి నేను నీకళ్ళకు-"
వెంకటేశ్వర్లు ఓ క్షణం ఆలోచించి "ఓహో అదా! ఇప్పుడు చెప్పనా నీ వయసెంతో" అన్నాడు.
"పాతికేళ్ళు" అన్నది మంజరి, చిరుకోపంతో అతనికేసి చూస్తూ.
"కాదమ్మడూ! నేను సరదాగా అన్నాను. అంతకోపమయితే  ఎలా? నీకే పాతికుంటే, నాకు అరవై దాకా వుండాలి. నిజంగా నీ వయస్సెంతో చెప్పాలంటే - ఉండు  చెబుతాను....అరె, అలా జరిగిపోతే చెప్పడం నావల్లకాదు." అన్నాడు వెంకటేశ్వర్లు.
"ఒద్దులెండి మీరు చెప్పావద్దు నేను వినావద్దు...."
మాట సగంలోనే ఆగిపోయింది. మిగతా వాక్యాన్ని వెంకటేశ్వర్లు పెదవులు నొక్కేశాయి. మంజరి మరోసారి గాఢంగా  నిట్టూర్చింది. గట్టిగా కళ్ళుమూసుకుంది. కనురెప్పలను తొలగదోసుకుంటూ, నీటిపొరలు వెలికురిశాయి. ఆవిడ హృదయం అవమానంతో బాధతో, అసహ్యంతో నిండిపోయి, కుతకుతలాడసాగింది. ఆ పొంగు లన్నీ కన్నీళ్ళుగా  దుఖంగా మారి వెలువడుతున్నాయి. వెంకటేశ్వర్లు వున్నాడో లేడో . అతనేం  చేస్తున్నాడో కూడా కొన్ని క్షణాలదాకా ఆవిడకు తెలియలేదు.
వెంకటేశ్వర్లుకు తెలివొచ్చేసరికి మంజరి నడిమంచంమీద కూచుని వుండి, తలను  మొకాలిమీద ఆనించి ఎటోచూస్తోంది. ఆ చూపుల్లో ఏ భావమూలేదు. ఆ ముఖంలో ఏ ఆలోచనాలేదు.
"హెవెన్స్, హెవెన్స్! ఇలాంటి రోజులలో ఓ నిముషం పాటు నువ్వు  కనిపించావంటే బాక్సాఫీస్ బద్దలయి పోతుంది మంజరీ! చూస్తున్న నాకే గుండెలవిసిపోతున్నాయంటే, పబ్లిక్ సంగతి అడక్కు మరి! అంటే - చలపతి నిన్ను గురించి చెప్పిందంతా నిజమేనన్నమాట! నువ్వేదో నాటకాల్లో వేషాలేశావంటే - అందరి మాదిరేననుకున్నాగాని, యింతగా, నివురు గప్పిన నిప్పువనుకోలేదు. సుమా! ఏది ఏమైనప్పటికీ డియర్! ణా ఫస్టుపిక్చర్లో నువ్వు హీరోయిన్ గా వుండితీరాలి.
నీ కావుద్దేశం లేకపోతే యిప్పుడే చెప్పకుండా చట్టి చంకన పెట్టుకొని బెజవాడ చేరుకొంటాను. ఏమిటిట నవ్వుతావ్? నా మాటలమీద నమ్మకంలేదా?" అన్నాడు  వెంకటేశ్వర్లు.
"అందుక్కాదండీ! మీ పాండిత్యాన్ని చూసి నవ్వొచ్చింది" అన్నది మంజరి.
"నాకీ వెధవ తెలుగంటే పరమ అసహ్యం. నన్నడిగితే మన తెలుగు అండర్ డెవలప్ డ్ లాంగ్వేజ్ అంటాను. అందుకే మా రామబ్రహ్మంగాడితో తెలుగులో సినిమా తియ్యొద్దురా  సాపా, అన్నాను. వాడు వినుపించుకొన్నాడు కాదు. సరే అదీ వొకందుకు మంచిదే అయింది." అని నవ్వాడు వెంకటేశ్వర్లు.
"ఎందుకట!"
"వాడికాపట్టుదలే లేకపోతే నేనీ ఫీల్డులోకి వచ్చేవాణ్ణి కాదు. నిన్ను చూచేవాణ్ని కాదు.... కానీ, నా జీవితం హోల్ మొత్తంమీద యింత హాయిగా గడిచిపోయిన రాత్రి ఇదే ననుకో మంజరి! నేను ఏకపత్నీవ్రతుణ్నని  నీతో అనలేదని నా నమ్మకం. అనివుంటే ఉపసంహరించుకొంటున్నాను. ఒక్క ముక్కలో చెప్పనామరి! నువ్వు మనిషివికాదు - అంతే!"

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS