Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 12

తాయారు కళ్ళు మిలమిలలాడాయి. అది మరోసారి  పెట్టి వెళ్ళిపోయింది మంగమ్మ వీధి తలుపు దగ్గరగా వేసింది. యింట్లోంచి  పెద్దగా నవ్వులు, కేకలు  వినిపిస్తున్నాయి. వరండా అరుగు మీద  నిలబడి ఓ సారిట్టా గోడమీదుగా, ఆయింటి వైపు చూసింది. అయిదారుగురు మగవాళ్ళు, ఆడవాళ్ళు కలిసి పేకాడుతున్నారు గదిలో, ఓ మూలగా నల్లనిసీసాలు, గ్లాసులో కనిపించాయి. ఒక బుద్దుడు కిటికీలోంచి మంగమ్మను చూసి, గట్టిగా ఈల వేశాడు వేరెవరో "కొత్తపిట్టరా!" అనడం కూడా మంగమ్మకు వినిపించింది. చకచకా లోపలికొచ్చి  మంచంమీద పడుకొంది. డాబాకమ్మలకు  బూజు వేళ్ళాడుతుంటే కాసేపు  చూసింది. ఓ పిచ్చిక కిలకిలలాడుతూ గదంతా తిరిగి, కిటికీలోంచి వెళ్ళిపోయింది. రాత్రి పక్క మీద నలిగిపోయిన 'చిత్రభూమి' పత్రిక తీసింది. దాన్నిండా రకరకాల బొమ్మలున్నాయి. వాటికింద ఏవేవో రాశారు. ఆ బొమ్మలుగానీ, రాతలు గానీ ఆవిడ మనస్సు కెక్కలేదు. చేరుపుదామన్నా చెరక్కుండా తాయారు చెప్పిన సంఘటనలు కళ్ళముందు కదులుతున్నాయి. ఓ సారి గట్టిగా కళ్ళు నులుముకొని, ఉత్తినే ఆవలించి వొళ్ళు విరుచుకుంది. శరీరాన్ని ఏదో బరువు అమిచివేస్తున్నట్లనిపించింది. కళ్ళు మూసుకుంది. అలాగే సాయంత్రందాకా నిద్రపోయింది.
ఆరుగంటలకు చలపతి వచ్చాడు. వస్తూ వస్తూ మరెవరినో వెంట బెట్టుకొచ్చాడు. ఆ రెండో గొంతు కాస్తంత బొంగురుగా వుంది "ముసలి వేషాల కయితే బాగా పనికొస్తాడు" అనుకొంది మంగమ్మ.
"మీరలా దయచెయ్యండి. నేను యిప్పుడే ఆవిణ్ని  తీసుకొస్తాను" అన్నాడు చలపతి.
మంగమ్మ గొంతు సరిచేసుకొంది.
చలపతి లోపలికొచ్చి, మంగమ్మనోసారి  చూశాడు. ఆవిడింకా  నిద్రమత్తుతో జోగుతూవుంది.
నేననుకుంటూనే వున్నాను....మరీ నీకింత నిద్రదయ్యం ఏమిటి మంగమ్మా! రాత్రింబవళ్ళలా ఏకఠాకీన నువ్వెలా నిద్రపోగలుగుతున్నావో  తెలీదు....సరే త్వరగా తయారవు. అవతల పంతులు గారు కూచునివున్నారు మా గొప్ప చెయ్యిలే? మాట అన్నాడంటే జరిగి తీరాల్సిందే! దానికిక తిరుగులేదు. ఈ కానియ్....వెంటనే చలపతి తిరిగి వసారాలోకి వెళ్ళిపోయాడు.
ఓసారి గట్టిగా నిట్టూర్చింది మంగమ్మ.
పావుగంటకల్లా జగన్మోహినిగా తయారయింది. ఈలోగా ఆవిడకోసం మూడుసార్లు లోపలికొచ్చాడు చలపతి. ఓసారి ఆవిడ జాకెట్ తొడుక్కొంటోంది."నేను సాయం చెయ్యనా?" అన్నాడు చలపతి దగ్గరగా వస్తూ.
"ఇప్పుడొద్దులెండి" అన్నది మంగమ్మ పైకి నవ్వేస్తూ.
"మరెప్పుడుటా?" అన్నాడు చలపతి.
"నేను చేబుతానుగా! మీరు వెళ్ళి కూచోండి. ఈలోగా చీరె కూడా మార్చేసుకొస్తాను....ఊఁ  వెళ్ళండి మరి....మీరున్నకొద్దీ ఆలస్యమే. ....అలా గంట్లు పడేలా చూస్తారేం.... వారు వెళ్ళి పొయ్యాక మనిద్దరమేగా వుంటాం....అప్పుడు....చలపతి ఓసారి ఆవిడముఖాన్ని వాసనచూసి త్వరగా రావాలి మరి పంతులుగారు ఎదురు చూస్తున్నారు. అన్నాడు బిగ్గరగా.
"ఫర్వాలేదు లెండి. అమ్మాయిగార్ని తొందర పెట్టకండి?" అన్నారాయన.
మరో అయిదు నిమిషాలకల్లా, మంగమ్మ తలుపు ప్రక్కన నుంచుంది.
చలపతి ఓసారి తలుపు కేసి చూసి "ఇలా రా మరి, అక్కడ నంచుంటావేం? ఫర్వాలేదులే రా. గురువుగారే" అన్నాడు.
"ఈ అభినయం చెయ్యలేక చచ్చిపోతున్నాను బాబూ!" అనుకుంది మంగమ్మ.
తరవాత, తలొంచుకొని  సిగ్గుపడుతూ, ముళ్ళమీద కూచున్నట్లుగా వొళ్ళంతా ముడుచుకొని కుర్చీమీద కూచుంది,మంగమ్మ.
"నమస్కారమండీ!" అన్నది మంగమ్మ చాలా సున్నితంగా .
"ఇష్టార్దసిద్ధిరస్తు" అని దీవించారు పంతులుగారు.
"పరబ్రహ్మ శాస్త్రి  గారని-మనం రోజూ చెప్పుకొంటుంటాం చూడూ మంగమ్మా వీరే ఆయనగారు. తీసుకురా తీసుకురా అని రోజూ నా ప్రాణాలు తోడేస్తుంటివి. ఇవ్వాళగానీ గురువుగారికి తీరిక చిక్కిందికాదు. వీరివాక్కు దేవ వాక్కనుకో. అన్ని విషయాల్లోనూ ఆరితేరిన ఉద్దండులు "అని పరిచయం చేశాడు చలపతి.
 ఇవన్నీ ఎంత అబద్దమో మంగమ్మ కొక్కదానికే తెలుసు.
చాలా సంతోషమండీ! మిమ్మల్ని గురుంచి నేను గుంటూరులో వున్నప్పుడే విన్నాను....చలపతి గారు నాకు రాసే ఉత్తరాల్లో మిమ్మల్ని గురించి తప్పకుండా రాసేవారు. ఈ నాటికి మీ దర్షనం చేసుకోగలిగాను. చాలా సంతోషం" అని మంగమ్మ కూడా మరి రెండు ముక్కలు జతచేసింది.
ఆవిడ సమయస్పూర్తికి చలపతి ముగ్డుదయ్యాడు.
  "సరే-అసలు సంగతికొద్దాం  పంతులుగారూ! ఈ అమ్మాయి పేరు మంగమ్మ. అలివేరు మంగతాయారు పేరు కలిసొచ్చేలాగా  'మంగమ్మ' అని పెట్టారు. ప్రస్తుతం  సినిమాఫీల్డులో  కొచ్చింది. నా శిష్యులనుకోండి. మీరోసారి ఈవిడను చూసి -ఫ్యూచర్ ఎలా వుండేదీ చెప్పాలి" అన్నాడు చలపతి.
"అయ్యయ్యో ఎంతమాటన్నారు? మీరు ఆజ్ఞాపించడం  నేను కాదనడమూనా? అమ్మాయిగారి ముఖం చూస్తూనే నేను, సమస్త విషయాలునూ స్థూలంగా గ్ర్రహించాననుకోండి.... ఓహోహో! బ్రహ్మాండమైన భవిష్యత్తు.
జగజ్జేగీయమానమైనటువంటి  కీర్తి ప్రతిష్టలు అమ్మాయిగారికి లభిస్తాయి....దానికి ఢోకాలేదు....అయ్యా....
పోతే....చూడమ్మా! మీ చేతులిలా వొక్కసారి చాపండి! అన్నారు పరబ్రహ్మశాస్త్రి గారు.
మంగమ్మ శాస్త్రి గారి వాగ్దోరణి  చూసి ముందుగా విస్తుపోయింది. అప్రయత్నంగా రెండు చేతులూ ముందుకు చాపింది. శాస్త్రి ఒకసారి కళ్ళజోడు సవరించుకొని, మంగమ్మ చేతుల్ని పెన్సిల్ తో చూపుతూ, మధ్య
"ఇష్టార్దసిద్ధిరస్తు" అని దీవించారు పంతులుగారు.
"పరబ్రహ్మశాస్త్రి గారని- మనం రోజూ చెప్పుకొంటుంటాం  చూడూ మంగమ్మా వీరే ఆయనగారు. తీసుకురా తీసుకురా అని రోజూ నా ప్రాణాలు తోడేస్తుంటివి. ఇవ్వాళగానీ  గురువుగారికి తీరిక చిక్కిందికాదు. వీరివాక్కు దేవ వాక్కనుకో. అన్ని విషయాల్లోనూ ఆరితేరిన ఉద్దండులు "అని పరిచయం చేశాడు చలపతి.
ఇవన్నీ ఎంత అబద్ధమో మంగమ్మ కొక్కదానికే తెలుసు.
చాలా సంతోషమండీ! మిమ్మల్ని గురించి నేను గుంటూరులో వున్నప్పుడే విన్నాను....చలపతి గారు నాకు రాసే ఉత్తరాల్లో మిమ్మల్ని గురించి తప్పకుండా రాసేవారు. ఈ నాటికి మీ దర్షనం చేసుకోగలిగాను. చాలా సంతోషం" అని మంగమ్మ కూడా మరి రెండు ముక్కలు జమచేసింది.
ఆవిడ సమయస్పూర్తికి చలపతి ముగ్దుదయ్యాడు.
"సరే-అసలు సంగతికొద్దాం పంతులుగారూ! ఈ అమ్మాయి పేరు మంగమ్మ. అలివేలు మంగతాయారు పేరు కలిసొచ్చేలాగా  'మంగమ్మ' అని పెట్టారు. ప్రస్తుతం సినిమాఫీల్డులో కొచ్చింది. నా శిష్యురాలనుకోండి. మీరోసారి ఈవిడను చూసి - ఫ్యూచర్ ఎలా వుండేదీ చెప్పాలి" అన్నాడు చలపతి.
"అయ్యొయ్యో ఎంతమాటన్నారు? మీరు ఆజ్ఞాపించడం నేను కాదనడమూనా? అమ్మాయిగారి ముఖం చూస్తూనే నేను, సమస్త విషయాలున్నూ స్థూలంగా గ్రహించాననుకోండి....  ఒహోహో! బ్రహ్మాండమైన  భవిష్యత్తు.జగజ్జేగీయమానమైనటువంటి కీర్తి ప్రతిష్టలు అమ్మాయిగారికి లభిస్తాయి....దానికి ఢోకాలేదు.... అయ్యా.... పోతే....చూడమ్మా! మీ చేతులిలా వొక్కోసారి చాపండి! అన్నారు పరబ్రహ్మశాస్త్రి గారు.
మంగమ్మ  శాస్త్రి గారి వాగ్దోరణి చూసి ముందుగా విస్తుపోయింది. అప్రత్నయంగా రెండు చేతులూ ముందుకు చాపింది. శాస్త్రి ఒకసారి కళ్ళజోడు సవరించుకొని, మంగమ్మ చేతుల్ని పెన్సిల్ తో చూపుతూ, మధ్య మధ్య ఆలోచిస్తూ, ఆలోచనకూ ఆలోచనకూ మద్య బేధం చూస్తూ, కళ్ళెగరేయడం సాగించాడు. ఈ మూకాభినయానికి అంతా తెలిసినవాడిలాగా చలపతి కూడా తలూపుతున్నాడు. మంగమ్మకు మాత్రం ఏమీ భోధపడలేదు.
పరబ్రహ్మశాస్త్రిగారు, విభూతిపండును మంగమ్మ చేతులకు పూశారు. వీళ్ళను పక్కలకూ, ముందుకూ,వెనక్కూ వంచమన్నారు. మణికట్టు దగ్గర గీతలను, మునివేళ్ళ  మీదున్న చక్రాలను పరిశీలించారు. ఆ తరువాత కాగితంమీద నలచదరంగా గళ్ళుగీసి రవి, శుక్ర, గురు, శని అంటూ రాశారు. పావుగంట తరువాత శాస్త్రి గారి ముఖం విప్పారింది.
 "చూడండీ అమ్మాయిగారూ? తమదగ్గర జాతకం లేడుగదండీ అంది  మంగమ్మా!....పోన్లెండి గానీ....మీకొచ్చిన డోకాలేదు. ప్రస్తుతం కొద్దికాలంపాటు"
"అంటేనండీ?" అని ప్రశ్నించాడు చలపతి.
"అనగా నాలుగు మూడు మాసాలపాటు, గ్రహవీక్షణం అంత బాగాలేదు. అక్కణ్ణుంచి శని తొలిగిపోతాడు. ఇహ అమ్మాయిగారి ప్రభస - ఇతరులు  అసూయపడిపోయేలాగా  మారిపోతుందనడంలో, యెవరికిన్నీ  ఎటువంటి సందేహాలున్నూ  ఉండనవసరం -నాకైతే కనిపించడంలేదు. అయితే, నాదో చిన్న సలహా వున్నదని మనవిచేస్తున్నాను..
... "మంగమ్మ" అన్న పేరుతో అంత బలం కనిపించడంలేదు. కానీ అమ్మాయిగారి పేరు  'మ'కారంతోనే ప్రారంభంకావలసివుంది. అదిన్నీ కాకుండా, వీరిపేరు, మూడంటే మూడే మూడు అక్షరాలను మించకూడదు.తద్విధంగా మీరు గనక  పేరునెన్నుకొన్న పక్షాన -గ్రహబలం అమోఘంగా వుంటుంది. తమరుకూడా సావదానంగా ఆలోచించుకోవచ్చు. అన్నాడు శాస్త్రి గారు.
"మూడక్షరాలని మీరనడంలేనే  బ్యూటీవుంది శాస్త్రి గారు! ఇవ్వాళ ఫైల్లోవున్న స్టార్స్ పేర్లన్నీ మూడక్షరాల్లోనే వున్నాయి. మరి మూడులోకాలు, స్వర్గం, మర్త్యం, పాతాళం. ముగ్గురు దేవుళ్ళు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. య మూడుకాలాలు -తెలుగులో ఏమంటారో గానీ. ఇంగ్లీషులో పాస్టు, ప్రెజెంటు, ఫ్యూచర్ అంటారు. మనదేవతలు కూడా మూడుకోట్లమందేగదండీ! అంచేత 'మూడు' అన్నదానికి చాలా ప్రాముఖ్య మున్నదంటారు. అంతేనా?" అన్నాడు చలపతి కళ్ళు చికిలిస్తూ.
తన ప్రతిభను మంగమ్మ గ్రహించాలని గావును -పదే పదే ఆవిడవైపు చూడసాగాడు. చలపతిని నిరుత్సాహపరచడం బొత్తిగా ఇష్టం లేని మంగమ్మ తన  ఆశ్చర్యాన్ని బహుసమర్దంగా నటించింది. పరబ్రహ్మశాస్త్రి గారు కూడా ఆశ్చర్యపడినట్లు కనిపించారు.
"చిత్తం. చిత్తం. మీరు బాగా సెలవిచ్చారు.....తనకింత చొరవ వున్నదని నాకు తెలీదు సుమండీ! చలపతిగారంటే సినిమా వ్యవహారాల్లో ఉద్దండులనుకున్నాగానీ, సాహిత్యరంగంలోనూ ప్రవేశముంటుందనుకోలేదు. అయ్య బాబో! మీతో జాగ్రత్తగా వుండాలండోయ్. మీరు పైకి కనిపిస్తున్నదానికి నాలుగు రెట్లకు పైగదా లోపలున్నారు....నేను ముఖప్రీతికోసం అనేవాణ్ని కాదన్న విషయం తనకు తెలుసు....అయ్యా....అదీ సంగతి" అన్నాడు పరబ్రహ్మశాస్త్రి గారు.
చలపతి పూర్తిగా చిత్తయిపోయాడు.
"ఏదో తమ దయలెంది" అన్నాడు చలపతి, కాళ్ళు ఊపుకొంటూ "మరి -ఆ పని కూడా మీ చేతుల మీదుగానే పూర్తి కానివ్వండి . "మ" కారంతో ప్రారంభమయ్యే  మూడక్షరాల  పేరు కూడా మనమిప్పుడే అనుకొందాం. దానికోసం యింకో సిటింగ్ దేనికండి  అనవసరంగానూ!"
"ఓ! దానికేం? అలాగే!" అన్నాడు పరబ్రహ్మశాస్త్రి గారు. కాస్సేపు ఆలోచించి "మాలతి"-"మాధవి"-"మంజుల"-"మోహిని" -"మోహన"-"మీనాక్షి"-"మంజూష"-"మేనక"-"మేదిని"
-"మేకల"- "మాణిక్యం"-"మల్లిక"-యిలాంటివి చాలా వున్నాయనుకోండి మరి-ఇంకా ఆలోచిద్దాం" అన్నారాయన,
ఈ   పెర్లేవీ మంగమ్మకు నచ్చలేదని గ్రహించి.
"పేరు మార్చుకోవడం అవసరమంటారా శాస్త్రి గారూ!" అన్నది మంగమ్మ.
ఆ మాటలు వింటూనే చలపతి లబలబలాడిపోయాడు.
"ఇంకా నయం - మంచిదానివేనే! శాస్త్రి గారు తోచక చెప్పారంటావా ఏమిటి? వారన్న వాక్కు వేద వాక్కు.
తప్పకుండా మార్చు కోవాలి. లేకపోతే మనకు ఫ్యూచరేలేదు. సరా?" అని కోప్పడ్డాడు చలపతి.
"బాగా సెలవిచ్చారు....పేరు మార్చుకోవడమే మంచిదండీ అమ్మాయిగారూ! నన్ను గురించి నేను చెప్పుకోకూడదనుకోండి.... అయినా తమకు అవసరం వచ్చింది. గనక మనవి చేసుకొంమంటున్నాను. ఇందాక మన అబ్బాయిగారాన్నట్లుగా మూడక్షరాల పేర్లున్నవారే  యీ రోజున బాగా పైకొచ్చారు. ఈ సంగతి తమరు చూస్తూనే వున్నారు. ఈ పేర్లన్నీ నేను పెట్టినవే ననుకోండి....తమకు చెప్పిన విధంగానే వారికిన్నీ నేను చెప్పాను. పది సినిమాలు చప్పు చప్పు న  దొరకడమున్నా, ఇంత ఆర్జించుకోవడమున్నూ జరిగింది "అన్నాడు శాస్త్రి.
మంగమ్మ ఆలోచించింది. ఇప్పుడు శాస్త్రి గారు చెప్పిన పేర్లు మంచివి కావని  కాదు గానీ, ఇంతకన్నా మంచిపేర్లు తడితే బావుంటుందని మంగమ్మ ఉద్దేశం. లోగడ తను వేసిన నాటకాలన్నీ జ్ఞాపకం చేసుకొంది. ఓ నాటకంలో 'మంజరి' పాత్రకూడా తను ధరించింది. విజయనగరంలో ఆ నాటకం ఆడినరోజున, తనకో వెండిషీల్డు ఇచ్చారుకూడాను. అప్పుడే రామచంద్రంగారు నవ్వుతూ,. చచ్చీ చెడీ నాటకం తయారుచేసింది నేనూ. బహుమతులు అందుకోవడం నువ్వూనా?" అని కూడా అన్నారు. ఆ పేరు ఆలోచిస్తే బాగానే వుందిగదా?
ఏమయితే అదే అవుతుందని మంగమ్మ ఆ పేరుకాస్తా బయటపెట్టింది. శాస్త్రి గారు ఉబ్బితబ్బిబ్బయిపోయారు. ఒహోహో ! వజ్రప్పలుకులాంటి  పేరండి  అమ్మాయిగారూ అది! బహుభేషుగ్గానూ, కమనీయంగానూ వుంది. ఇందులో మకారం తరువాత పూర్ణానుస్వారం రావడమే కాకుండా జకార కారములు కూడా వున్నాయి. 'మ' అక్షరం మంగళప్రదం, పూర్ణానుస్వారం వున్నదంటే, అది సూర్యభగవానుడనుకోండి. అంటే అమ్మాయిగారి భవిష్యత్తు మంగళప్రదంగా  సూర్యభగవానుడున్నంచకాలం వుంటుందన్నమాట  "జరి" అన్న అక్షరాలున్నాయి చూశారూ! అవి - వీరు అందుకోబోతున్న వేగాన్ని సూచిస్తున్నాయి. మనం మామూలుగా అంటుంటాం చూడండి ఏదీ-"జరజరా పాకడం" - జరజరపోవడం అని - వేగంలోని  ధ్వన్యనుకరణాన్ని  ఆ రెండక్షరాలూ తెలియచేస్తునాయన్నమాట. కాబట్టి అమ్మాయిగారన్నట్లుగా  'మంజరి' అన్న పేరు అన్ని విధాలా, మహోత్తమంగా వుంది...." అన్నారు పరబ్రహ్మశాస్త్రిగారు.
అయితే గురువుగారూ ! మీరు  "జర" లో వేగం వుందన్నారు సరే! కానీ యిక్కడ "జరి" అని వస్తున్నది గదా! ఎలా నంటారు అన్నాడు?" చలపతి.
"అబ్బాయిగారు ఎంత సున్నితంగా ఆలోచిస్తారో. మీరు గమనించారా అమ్మాయిగారూ!" అన్నాడు పరబ్రహ్మశాస్త్రి. "మర్రిమర్రాకు; కర్రి -కర్రావు అయినట్లుగానే "జర జర" కూడా ముందు మాటలో చేరినప్పుడు  "జరి జరి " అవుతుందని పెద్దలు  చెప్పుకొచ్చారు. మర్రిలోని  "రి" కారం, ఆకుదగ్గర కొచ్చేసరికి  "ర"కారం లాగా మారిపోయింది చూడండి. అధ్విదంగానే  "మంజరి" అన్న పదంలోనూ  జరిగింది. ఇహ మీరే పేరును మారుస్తానంటే నేనుమాత్రం వొప్పుకోను."
"ఇదే ఖాయం చేదామంటారా" అన్నాడు చలపతి.
"మనోజయంతు మాండవ్యః కానివ్వండి" అన్నాడు  పరబ్రహ్మశాస్త్రి.
"అయితే అదే ఖాయం" అన్నాడచలపతి.
"తధాస్తూ., ఇష్టార్దసిద్దిరస్తూ. శీఘ్రమే, చలన చిత్రరంగ ప్రవేశ ప్రాప్తిరస్తు -కీర్తి, ప్రతిష్ట, ఆర్దికాది శుభప్రాప్తిరస్తు" అని దీవించారు శాస్త్రిగారు.
 మంగమ్మ మనసిప్పుడు తేలిగ్గా వుంది. రెక్కలు తిడుక్కొని విశాలవినీల విహాయసవీధుల్లో అలవోకగా తేలిపోతున్న అనుభూతికి లోనయింది.
"బావుంది - మరినాకు సెలవిప్పిస్తే వెళ్ళొస్తాను" అని దీవించారు శాస్త్రిగారు.
చలపతి మంగమ్మ లోపలికొచ్చారు. ఓ గాజు పళ్ళెంలో, ఆకులు, అరడజను  అరటిపళ్ళూ, అర్ధనూటపదహార్లూ వుంచి "శాస్త్రి గారికిచ్చిరా!" అన్నాడు చలపతి.
ఆవిడ వెంటనే అతనూ బయటికొచ్చాడు.
శాస్త్రిగారు పళ్ళెంలోని నోట్లకేసి ఓసారి చూసి అబ్బాయిగారు నన్ను చిన్నచూపు చూశారు. నూటపదహార్లకు తక్కువ పుచ్చుకున్న చెయ్యికాదు నాది అన్నాడు.
ఈసారి కిలా వెళ్ళనివ్వండి, మీ నోటి వాక్యాన -మంగ - అనే మాటొస్తుంది. నాకు అలవాటు చొప్పున -మంజరి రెండు చిన్న వేషాలు దొరకనివ్వండి మీకు  పట్టుబట్టలు పెట్టకుంటాంయ అన్నాడు చలపతి.
"తమదయ" అంటూనే శాస్త్రిగారు వాటిని సంచీలో వేసుకొన్నారు. ఇలా తక్కువ పుచ్చుకున్నట్లు పొరబాటనైనా  ఎక్కడా అనకండి. నా రేటు పడిపోతుంది. తమకి వ్యవహారాలు తెలియనివి కాదనుకోండి.... మరి సెలవు.... వస్తాను" అని  బయలుదేరారు శాస్త్రి.
    మంగమ్మ అక్కడే నిలబడి దణ్ణం పెట్టింది.. చలపతి  శాస్త్రిని పంపించడానికి ఆయన వెనుకనే బయలుదేరారు. వారిద్దర్నీ చూస్తూ స్తంభాన్ని కానుకొని, అలానే నిలబడిపోయింది  మంగమ్మ.
                                                               5
ప్రతి సంఘటనకూ ఏదేదో కారణం ఉంటుందన్నమాట నిజమే గానీ, అన్నిటికీ సరైన కారణాలను మనం చెప్పుకోగాలమా? ఏనాటికీ కాదు. అలా మనం కారణాలు. మనకు నచ్చిన కారణాలను చెప్పుకోలేక పోయినప్పుడే - 'విధి' ప్రసక్తివస్తుంది.
చలపతి ఇతరవిషయాల్లో ఎలాంటివాడైనా  మంగమ్మ వరంగా - కాదు మంజరిపరంగా - చాలా నిజాయితీగా పనిచేశాడు. చేస్తున్నాడు. ఈ పనివల్ల వెంటనే ఫలితాలు కనిపించవేమని మంజరిగోల. ఆవిడామాట వేరుగా చలపతితో అనలేదు. సూటిపోటీగా ఇదే అర్ధం వచ్చే పదాలను విరివిగా వాడేసింది.
"మీరన్న మాట  నిజమేననుకోండి  బోలెడన్ని వ్యాపకాల్లో పడి , మీరు అసలువిషయం మరచిపోయారేమోనని
జ్ఞాపకం చేశానంతే! అదేదో ఫిలిం కంపెనీ కడతామన్నారు గదా! వాళ్ళేమన్నారేమిటి?" అన్నది మంజరి వొకసారి.
"వాళ్ళా? చూస్తామన్నారు" అన్నాడ చలపతి సాదాగా.
చలపతి ఏదో చెప్పకుండా దాచిపెడుతున్నాడని మంజరి పసిగట్టింది. అయితే 'నువ్విలా అబద్దాలాడకయ్యా ' అని అతని ముఖాన్నే  అడగలేదు.
మంజరి అనుమానం నిజమే! పరబ్రహ్మశాస్త్రిగారిచ్చిన  ప్రోత్సాహంతో ఆ మొన్నటి నుండి చలపతి కంపెనీలచుట్టూ తిరగడం ప్రారంభిచాడు. ఆసరికే చాలా కంపెనీలవారికీ, చలపతి తన వెంట వో పిట్టను పట్టుకొచ్చాడన్న సంగతి తెలిసిపోయింది. కానీ వారిలో చాలా మందికి ఆ 'పిట్ట' ఎలా ఉంటుందో తెలీదు. మంజరి సారా సరిగా కంపెనీల చుట్టూ  తిప్పడంకన్నా, ఆవిణ్ని గురుంచి ముందుగా కొంత ప్రచారంచేసి, ఆ తరువాతనే ఈ కార్యక్రమంలోకి దిగుదామని చలపతి ఉద్దేశం, ప్రస్తుతం అతనా వ్యాపకంలోనే ఉన్నాడు.
"మీరేదో కొత్తగా వో పిక్చర్ ప్రారంభించారుటగా. కధ బ్రహ్మాండంగా ఉందని పాండీబజారులో అనుకొంటున్నార్లెండి
.... నాకు మొదట్నుండి మీ కంపెనీ అంటే అదే నమ్మకం.మీరే పిక్చర్ తీసినా, ఏదో వో కొత్త ధనం లేకుండా తియ్యరు.
ఎక్స్ పెరిమెంట్ చెయ్యడం మీ హాబీ కదా! మీరే ననుకుంటాను  మనోరమను ఇంట్రోడ్యూస్ చేసింది. మొదట్లో అందరూ మీ పిక్చర్ ఫ్లాప్ అవుతుందనుకున్నారు. అదే బాక్సాఫీస్ హిట్ అయికూచుంది....మరేం లేదు లెండి "మంజరి" అని వో యంగ్  బ్యూటిఫుల్ యాక్ట్రెస్ వచ్చిది. చాలాకాలంపాటు నాటకాల్లో ఉన్నది. అవసరానికి మించిన అనుభవం వున్న పెర్సన్, సైన్, పెర్సనాలిటీ, వాయిస్, కల్చర్, విషయం అమోఘం. మీ కొత్త పిక్చర్ కి కావాలంటే - ఓసారి ట్రయ్ చెయ్యకూడదూ .
ఈ ధోరణిలో  మంజరిని గురించి అన్ని కంపెనీల దగ్గరా కాన్వాస్ ప్రారంభించాడు చలపతి.
అతనికి మొదట్నించి ప్రచారంమీద అచంచలమైన విశ్వాసం ఉన్నది. తగినంత  పబ్లిసిటీ లేనిదే ఎవ్వరూ పైకి రాలేరని తెలుసు. దీనికి అనేక మార్గాలున్నాయి.
మంజరిని గురించి పత్రికల్లో రాయించాలి ముఖ్యంగా సినిమా పత్రికల్లో ఆవిడ బొమ్మలు వేయించడమే కాకుండా, కొన్ని వ్యాసాలుకూడా పడేటట్టు చూడాలి. సహృదయులైన సినీజర్నలిస్టులు కొందరు ఈ పనిని తమ బాధ్యతగా భావించి చేస్తారు. కొంతమంది అంతో ఇంతో  'తైలం' ముట్టచెప్పందే పని కాదు. దానిక్కూడా చలపతి సిద్దపడ్డాడు.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS