ఆగ్నేయంలో పెరిగితే లేదా తరిగితే ఏమౌతుంది?

(Vastu - Agneyam)

ఒక్కోసారి అన్ని దిశలా సమానంగా ఉన్న ప్లాట్లు దొరక్కపోవచ్చు. ఒక్కో దిక్కున పెరగడం లేదా తరగడం జరుగుతుంది. ఈవిధంగా పెరుగుదల, తరుగుదలకు సంబంధించి వాస్తులో సత్ఫలితాలు, దుష్ఫలితాలు ఉంటాయి. ఆగ్నేయంలో స్థలం పెరగడం, తరగడం గురించి వాస్తు ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

 

దక్షిణ ఆగ్నేయంలో స్థలం పెరిగితే పరవాలేదు. దక్షిణ ఆగ్నేయదిక్కులో పెరగడం అంటే, దక్షిణ నైరుతి దిశలో తగ్గుతుంది అన్నమాట. నైరుతి వైపున స్థలం తరిగి ఉండటం మంచిదే.

 

దక్షిణ ఆగ్నేయంలో పెరిగిన స్థలంతో కలిపి, ఉత్తర ఈశాన్యంలో ఖాళీ స్థలం కంటే తక్కువ ఉండాలి.

 

దక్షిణ ఆగ్నేయం సంగతి అలా ఉంటే, తూర్పు ఆగ్నేయంలో స్థలం పెరగకూడదు. అలా పెరిగితే దుష్ఫలితాలు తప్పవు. తూర్పు ఈశాన్యం తగ్గితేనే, తూర్పు ఆగ్నేయం పెరుగుతుంది. తూర్పు ఆగ్నేయం పెరిగిన ఇళ్ళలో ఏదో విషయంలో ఎవరో ఒకరితో గొడవలు, ఘర్షణలు వస్తుంటాయి. బంధుమిత్రులతో, ఇరుగుపొరుగులతో, కుటుంబసభ్యులతో చీటికిమాటికి కలహాలు వచ్చి, అశాంతి కలుగుతుంది. ఆత్మహత్యలకి కూడా అవకాశం ఉంది.


More Vastu