శ్రీశైల మల్లన్నని తాకనివ్వరు
.png)
జ్యోతిర్లింగ మహాక్షేత్రం శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శ్రీశైల మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనాన్ని నిలిపివేస్తున్నట్టు ఆలయ ఇ.ఓ. సాగర్‌బాబు తెలిపారు. సాధారణంగా శ్రీశైల మల్లికార్జునుడైన శివలింగాన్ని భక్తులు దర్శించుకుని తాకడం సంప్రదాయం. అయితే భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకుని స్పర్శ దర్శనాన్ని నిలిపివేశారు. అలాగే ఈనెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మల్లన్న గర్భాలయంలో అభిషేకాలు, అమ్మవారి ఆలయ ముఖమంటపంలో కుంకుమార్చనలు కూడా నిలిపేశారు. ఆలయంలోని ఇతర ప్రదేశాలలో అభిషేకాలు, కుంకుమార్చన నిర్వహించుకోవచ్చని తెలిపారు.



