సింహరాశి - మఖ 1,2,3,4 (మ, మి, మూ, మే)

పుబ్బ 1,2,3,4 (మో, టా, టి, టు), ఉ.ఫ. 1 (టే)

ఆదాయం: 2     వ్యయం: 14    రాజపూజ్యం: 2   అవమానం: 2

ఈ రాశి వారికి గురువు వత్సరాది 12-09-2017 భాద్రపద ఒ|| సప్తమి మంగళవారం వరకు 2వ స్థానంలో లోహమూర్తిగాను, తదుపరి వత్సరాంతము 3వ స్థానములో తామ్ర మూర్తిగా ఉండును. శని వత్సరాది 20-06-2017 జ్యేష్ఠ ఒ|| ఏకాదశి మంగళవారము వరకు 5వ స్థానమున, తదుపరి 26-10-2017 కార్తీక. శు|| షష్ఠి గురువారం వరకు వక్రగతతుడై 4వ స్థానమున తదుపరి వత్సరాంతము 5వ స్థానమున రజిత మూర్తిగానే ఉండును. రాహుకేతువులు వత్సరాది 17-08-2017 వరకు రాహువు 1వ స్థానమున కేతువు 7వ స్థానమున రజిత మూర్తుకి ఉండురు. తదుపరి వత్సరాంతము రాహువు 12వ స్థానమున కేతువు 6వ స్థానమున సువర్ణ మూర్తులై సంచరించెదరు.

    ఈ విధమైన గ్రహస్థితిని పరిశీలించి చూడగా గత సంవత్సరము కంటే కొంత అనుకూలముగా ఉన్నమా రాహు, కేతు శని ప్రభావము వలన ప్రతి విషయంలోనూ ఏదో తెలియని సంఘర్షణ ఎవరికై చెప్పుకోలేక, తాము జీర్ణించుకోలేక కొంత సతమతమయ్యే అవకాశాలు గలవు. ప్రతి పనినీ శ్రమతో చేయవలసిన పరిస్థితి శారీరక, ఒకరికి ఆరోగ్య సమస్యలు కొంత ఉపశమించిననూ వైద్య పర్యవేక్షణ ఔషద సేవనము తప్పక పోవచ్చును. షేర్‌ మార్కెట్‌ వ్యాపారాలు చేసే వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అనాలోచన అత్యాస, అత్యావేశము అనర్థమని తెలుసుకోవాలి. మానసిక శ్రమ అధికంగా ఉండును. జీవితములో స్థిరపడటానికి అనేక ప్రయాసలు చేయ వలసి వచ్చును. అనవసర విరోధము పెరుగు సూచనలు, మీలో ఎంత శక్తి సామర్థ్యములు, ప్రజ్ఞా పాటవములు ఉన్ననూ తగు సమయంలో స్వయంగా ఉపయోగించుకోలేని పరిస్థితి ఉత్పన్నము అవుతుంది. మీరు ఇచ్చిన సలహాల వల్ల ఇతరులు ప్రయోజనాన్ని పొందటము చూసి ఆనందిస్తారు. కానీ మీకు మీరే నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ప్రతి పనికి ఒక పద్ధతిగా క్రమ శిక్షణగా అమలు చేసిన మేలు కలుగును. అయితే తొందరగా నిరాశ చెందకండా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. అతి శ్రీఘ్రముగా ఫలితలు మాత్రం ఆశించరాదు. విద్యార్థులు ఎక్కువగా శ్రమించాలి. సెప్టెంబరు 12వ తేదీ వరకు గురు బలము అనుకూలము వల్ల ఆర్థిక సమస్యలు తొలగి, ఋణ బాధ తోలగి ఉండు ఊరుట కల్గును.

 

పారిశ్రామిక వేత్తలు నూతన వ్యాపారముల కొరకు ఋణములు చేయవలసిన పరిస్థితి ఉత్పన్నం కావచ్చును. విద్యార్థులు తమ ఏకాగ్రత లోపం కాకుండా జాగ్రత్త పడాలి. విద్యార్థులు తమ ఉత్తీర్ణత శ్రేణి విషయంలో తృప్తి పడవలసి వచ్చును.  అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. అత్యాశతో అనర్థాలకు స్వాగతం పలకండి. క్రొత్తది సంపాధించుకున్నా ఉన్నది కాపాడు కోవడం ఉత్తమని గ్రహించండి. విదేశీయాన ప్రయత్నాలు ప్రయాసతో పూర్తి అయ్యే అవకాశం గలదు. వీలు అయినంత వరకు విదేశ ప్రయత్నాలు సురక్షితంగా చేయడం ఉత్తమము. సాంకేతిక పరమైన సమస్యలు  తలెత్త వచ్చును. వత్సరారంభములో అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ప్రేమ వివాహాలు విఫలమయ్యే అవకాశము గలదు. ఈ విధమైన గ్రహస్థితిని పరిశీలించి చూడగా ప్రతి కార్యమును ఆరంభించే ముందు ఒకటికి రెండు మారులు ఆలోచించవలసిన పరిస్థితి ఎదురుకావచ్చును. ఏదో తెలియని అభద్రత మీ పై మీకై తెలియనటువంటి ఆత్మస్థైర్యము లోపించే అవకాశము గలదు. పైకి మాత్రము మీ గౌరవానికి, గాంభీర్యానికి లోటు రానివ్వడం కొందరి విషయంలో మౌనమే మీ సమాధానమవుతుంది. సాటి వారి ముందు తక్కువకాకుండా మీ ఆత్మాభిమానుము గౌరవమును కాపాడుకునే ప్రయత్నము చేస్తారు. మీ ప్రవర్తన, ధర్మ మార్గాచరణం మీ ధైర్యము అనేక సమస్యల నుండి కాపాడుతాయని తెలుసుకోండి. ఎదుటి వారిని అంత సులభముగా నమ్మకూడదని నిర్ణయించుకుంటారు. దగ్గరి స్నేహితులను కూడా సంశయాత్మకంగా చూడడము అలవాటుగా మారుతుంది. ఎట్టి పరిస్థితులలోను మధ్య  వర్తిత్వము జరుపుట, హామీలు ఇచ్చుట, ముఖ్యముగా వివాహ సంబంధాలు నిశ్చయ విషయంలో మధ్య వర్తిత్వము మొదలైన విషయాలలో తగు జాగ్రత్తలు అవసరము. వీలైనంతవరకు దూరంగా ఉండుట ఉత్తమము.

 

మంచి చేయాలనుకున్నా ఎదుటివారు స్వీకరించే స్థితిలో ఉండకపోవడము మనస్సుకు బాధ కల్గించవచ్చును. వృధా ఖర్చులు అధికమవుతాయి. అనవసరమైన అవేశాలకు లోనవడము వలన మీ శ్రేయోభిలాషులు మనసును గాయపరచిన వారవుతారు. ద్వితీయ సంతానము యొక్క వివాహము విషయంలో నిర్ణయము తీసుకోవడం కష్టమవుతుంది. వీలైనంత వరకు కొంత సమయము వాయిదా వేయడము ఉత్తమము. చాలా విషయాలలో నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అను న్యాయాన్ని పాటిస్తారు. తమ సంతానము యొక్క విద్యా, ఉద్యోగ విషయంలో ఒకింత అసంతృప్తి ఉండవచ్చును. అయిననూ ఇది తాత్కాలికమని తెలుసుకోవాలి. ఆరోగ్య విషయమై ఏ మాత్రము అజాగ్రత్త పనికిరాదు. సమయానికి ఔషధ సేవనము విస్మరించడము తరుచుగా జరుగుతుంధి. ఎంతటి విపత్కర పరిస్థితులైనా ధైర్యముగా ఎదురుకుంటారు. తరువాత మీరే ఆశ్చర్యపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఒకింత సోమరితనము, ప్రతి విషయాన్ని వాయిదా వేయడము, అకారణ వివాదాలు, గృహంలో అశాంతి ఇష్టం ఉన్నా లేకున్నా కొందరితో స్నేహం చేయకతప్పక పోవచ్చును. జీవిత భాగస్వామితో చాలా విషయాలు దాచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పుడు మాటలు విని చెడిపోవడం కన్నా నిజానిజాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమము. స్థానచలన అవకాశాలు గలవు. చాలా కాలంగా మిమ్మల్ని వేదిస్తున్న సమస్యకు పరిష్కారము లభిస్తుంది.

 

తొందరపాటుతనము ఒకింత అహంభావము వలన కొంత నష్టము వాటిల్లవచ్చును. షుగర్‌, బిపి మొదలైన వ్యాధుల విషయంలో అశ్రద్ధ పనికిరాదు. తీర్ధయాత్రాఫలము దక్కుతుంది. తాత్కాలిక స్థానచలనం కనిపిస్తుంది. గృహంలో ఇంకొకరి ఆదాయం ఆరంభమగుట శుభ పరిణామం స్వస్థలము వదలి దూరంగా ఉండవలసిన పరిస్థితి లేదా తరచుగా ఉద్యోగరీత్యా లేదా వ్యాపారపరముగా పర్యటించవలసిన పరిస్థితి, స్థిర చరాస్థుల విషయంలో తీసుకునే నిర్ణయము శ్రేయోభిషుల సలహామేరకు తీసుకోవాలి. మీరు ఆశించిన ధరరాక, మధ్యవర్తులు లాభపడే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశము గలదు. ఆర్థికపరమైన వివాదాలు, ఒకరికి సహాయము చేయాలని మీరే చికాకుల పాలు కావడం మొదలైన పరిస్థితులు గోచరించుచున్నవి. కుటుంబ ప్రశాంతతకు భంగం వాటిల్లును. అవసరమైన వివాదాలతో, అపార్థాలతో, సతమతమవడం, లాటరీలు, షేర్‌ మార్కెట్‌, జూదము, బెట్టింగులు మొదలైన వాటి జోలికి వెళ్ళకుండా ఉండుట శ్రేయోదాయకము, శుభకార్యా చరణకై అధిక ధనవ్యయము. స్త్రీ వివాదముతో మీడియా పరముగా ప్రతిష్ఠ దెబ్బతినుట. అకారణ శతృత్వాలు, బంధుమరణము వల్ల మానసిక వేదన, దుర్జన సహవాసము, ఊహించని పరిణామము. తమకు సంబంధము లేని విషయాలలో దోషులుగా పరిగణించుట, చెడు సలహాలు ఇచ్చేవారి పట్ల ఒకింత జాగ్రత్తగా ఉండాలి.  తమ ఆలోచనా విచక్షణ జ్ఞానాన్ని కొల్పోవుట, గతంలోని మీ ప్రవర్తనకు ప్రస్తుత మీ ప్రవర్థనకు తేడాను గమనిస్తారు. కాని ఏమి  చేయలేని పరిస్థితి, పరపతి, ప్రతిష్ఠకు ఇబ్బంది కలుగకుండా చూసుకుంటారు. వివాహంలో కొన్ని అడ్డంకులు ప్రభుత్వపరమైన విషయాలలో ఒకింత భయము. పనులు ఆలస్యము అవడము.

    అయితే గురుచారము చేత అనుకూలత లేకున్ననూ ముహూర్త నిర్ణయము ఆధారముగా అనగా జులై 14 నుండి కొంతమేరకు అనుకూలతలు ఏర్పడవచ్చును. కోర్టు వ్యవహారములు మధ్యమార్గము ద్వారా పరిష్కారము అవుతాయి. మీ గురించి అపార్థము చేసుకున్నవారు నిజాన్ని గ్రహించి పశ్చాత్తాపడతారు. శత్రువులను ఎదురకోవడంలో మీరు వేసే ఎత్తులకు ఎదుటివారు చిత్తవుతారు. తమను అర్థం చేసుకునే వారు లేరనే నిరాశ, నిస్పృహ ఏర్పడుతుంది. చాలా కాలంగా మీరు ఏటూ తేల్చుకోలేక సతమతమవుతున్న సమస్యలపై తగిన నిర్ణయాలు తీసుకుంటారు. భూ వ్యాపారులకు దసరా తరువాత కొంత అనుకూలము. ఉదరసంబంధమైన చికాకులు బాధించవచ్చును. చిన్న సమస్యకైనా వైద్యుడిని సంప్రదించుట ఉత్తమము. విలువైన వస్తువులు కాగితములను అతి జాగ్రత్తవల్ల దాచిన చోటును మరిచి పోవడం ఒక సమస్యగా మారుతుంది. షుగరు, లివరు మరియు స్త్రీలకు సహజంగా ఉండే కొన్ని సమస్యలు చిరాకు కలిగించవచ్చును.

    తరుచుగా ఉద్యోగ ధర్మములో తమ బాధ్యతలు మారడం చికాకు కలిగించవచ్చును. పై అధికారులను ఏదో రకంగా సాధించడం విసుగు కల్గిస్తుంది. తరచూ స్థానచలనాలు ఏర్పడవచ్చును. సుఖ వ్యాధులు, కడుపులో సమస్యలు బాధించవచ్చును. చాలా విషయాలలో మీ పొరపాటులేకున్నా మౌనముగా ఉండవలసిన పరిస్థితి తమ అత్యంత సన్నిహితులు సహోద్యోగుల అందరినీ సంశయించాల్సిన పరిస్థితి ఎదురుకావడము. జీవితభాగస్వాములతో తరచూ అభిప్రాయభేదాలు గ్యాస్ట్రిక్‌ సమస్యలు, నరాలు, కండరాలు, ఎముకలకు సంబంధించే సమస్యలు, అనాలోచితంగా విలాసాలు, భోగాలకు వ్యసనాలకు ధనవ్యయం ఎవరిని చూసినా ముందుగా గురించి వ్యతిరేకంగా ఆలోచించడం జరుగవచ్చును. ఆధ్యాత్మిక దేవతాసేవలలో ఎక్కువగా పాల్గొంటారు.

    విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఊహలలో విహరించడం మాని వాస్తవములో జీవించాలి. మార్గాలలో ఫలితాన్ని పొందాలనే ఆలోచనలు మానుకోవాలి. పెసలు, శనగలు, గోవుకి తినిపించండి. హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయండి. ఉత్తమ ఫలితాలని పొందుతారు. సహవాస దోషాలు సమస్యగా మారవచ్చును. సంవత్సర ద్వితీయార్థంలో కొంత మేలు లుగుతుంది. నిత్యం యోగా సూర్య నమస్కారాలు చేయండి. మీ స్వవిషయంలో ఇతరుల జోక్యము సహించరు. నష్టమైనా, లాభమైనా తామే నిర్ణయము తీసుకోవాలని నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాలలో ఈ నిర్ణయం వికటించే అవకాశము గలదు. నమ్మక ద్రోహం వల్ల మానసిక నిరాశ పాత్రత నెరుగక కొందరిని అతిగా విశ్వసించడం ఒక గుణపాఠం కాగలదు.    మానసిక స్ధైర్యము పెరుగుతుంది. తమ స్వంత పనులకు నిమగ్నమై ఉంటారు. అపాత్ర దానం చేయరాదని అతి మంచితనము తమ అసమర్థతగా పరిణమిస్తున్నదని గ్రహించి స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. స్వార్థం పెంచుకుంటారు. ఎలర్జీలాంటి సమస్యలు బాధించవచ్చు. శత్రువులపై విజయం, జీవిత భాగస్వామితో సఖ్యత, మాతా పితరుల ఆరోగ్యము విషయమై అధిక శ్రద్ధ అవసరము, క్షుద్రశక్తులు, తాంత్రిక విద్యలు, మొదలైన వాటి గురించి ఆలోచించవలసిన పరిస్థితులు ఎదురవుట గర్భధారణ కల్గిన స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుని సలహాతోపాటు, సంప్రదాయపరమైన, వంశాచారపరమైన నియమాలు పాటించాలి. ఋణబాధలు, బంగారు ఆభరణలు, విలువైన వస్తువులు జాగ్రత్తగా దాచుకోవాలి. చోరభయము కలదు. తోబుట్టువులతో అభిప్రాయ భేదాలు, అపోహలు, విషజంతువుల వల్ల కీడు, కోర్టు వివాదాలకు ఎక్కువగా ధనము ఖర్చు ఆగుట, కొందరికి దంపతుల మధ్య వివాదములు న్యాయస్థానాలు వరకు వెళ్ళుట. ఇష్టం లేని వివాహాన్ని అంగీకరించవలసిన పరిస్థితులు శీరోభారం మొదలైనవి ఈ రాశివారికి కనిపించుచున్నవి. సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం కొంత మెరుగుగా ఉండగలదు. చాలా వరకు స్వీయరక్షణ పాటించుట మంచిది. శ్రీరామరక్షాస్తోత్రం, కనకధారస్తోత్రం, సూర్యాష్టకము మొదలైనవి నిత్య పారాయణంలో ఉండాలి. శని, రాహు, కేతు జపదానాదులు మేలు చేయగలవు, మహామృత్యుంజయమంత్రం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుపేద అవివాహితులకు సహాయం చేయుట, గోసేవ, విద్యా విషయమై సహాయం మరువవద్దు.


More Rasi Phalalu 2017 - 2018