వృషభరాశి - కృత్తిక 2,3,4 (ఈ, ఉ, ఏ)

రోహిణి 1,2,3,4 ( ఓ, వా, వి, వూ) - మృగశిర 1, 2, (వే,వో)

ఆదాయం:2      వ్యయం:8     రాజపూజ్యం:7    అవమానం:3

    ఈ రాశి వారికి గురువు వత్సరాది 12-09-2019 భాద్రపద ఒ|| సప్తమి మంగళ వారము వరకు 5వ స్థానములోనూ తామ్రమూర్తియై ఉండును. తదుపరి వత్సరాంతము 6వ స్థానమున సువర్ణ మూర్తియై ఉండును. శని వత్సరాది 20-06-2017 జ్యేష్ఠ ఒ|| ఏకాదశి మంగళవారం వరకు 8వ స్థానములోనూ, తిరిగి 26-10-2017 కార్తీక శు|| షష్ఠి గురువారం వరకు వక్రగతుడై 7వ స్థానమున తిరిగి వత్సరాంతము లోహమూర్తిగా ఉండును. రాహుకేతువులు 17-082017 వరకు రాహువు 4వ స్థానమున కేతువు 10వ స్థానమున తదుపరి వత్సరాంతము రాహువు 3వ స్థానమున కేతువు 9వ స్థానమున రజిత మూర్తులై ఉందురు.ఈ విధమైన గ్రహస్థితతి పరిశీలించి చూడగా సంవత్సరారంభములో అనగా సంవత్సర పూర్వార్థము విశేష కార్యములు చేయడంలో ఉత్సాహము చూపిస్తారు. ఏదో సాధించాలనే తపన పెరుగుతుంది. జనాకర్షణ పెరుగుతుంది. మీలో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది. గృహములో శుభకార్య సూచన గలదు. చాలా కాలంగా విసిగిస్తున్న సమస్యలు తీరి పరిష్కారము లభించగలదు. నూతన వాహన ప్రాప్తి గలదు. ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయము ఏర్పడును. భవిష్యత్తుకు ఉపయోగపడు ఒకానొక సమయంలో రహస్య కలాపములు చేయవలసిన పరిస్థితులు ఉత్పన్నము కావచ్చును. లేదా ఆ విధమైన పనూలు చేయు వారి పరిచయం ఏర్పడవచ్చును. ఒక విశేష కార్యముగాని, మీ తెలివి తేటలను ఉపయోగించుకునే అవకాశము లభించవచ్చును.

 

కాలయాపనను ప్రధాన శత్రువు కాగలదు. ప్రయాసచే ఉద్యోగ అవకాశాలు గలవు. మితిమీరిన ఆత్మవిశ్వాసము చేతికందిన ఫలాలను జార విడుచుకునే ప్రమాదము గలదు. తమ సంతానికి వివాహ సూచనలు కనపడుచున్నవి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత చికాకు వైద్య పర్యవేక్షణ ఔషద సేవనము, ఉద్యోగములో శ్రమ- వత్తిడి అధికముగా ఉన్ననూ ఓపిక అవసరము, తొందరపడి రాజినామా ప్రయత్నం చేయకండి. ఆలస్యంగానైనా మీ శ్రమను మీ యాజమాన్యం అధికారులు గుర్తిస్తారు. యజ్ఞయాగాది కార్యక్రమాలు నిర్వహించుటలో మీ పాత్ర నిర్వహిస్తారు. దాంపత్య సమస్యలు తారా స్థాయికి చేరుకోకుండా సహనం అవసరము. చేయవలసిన పనులు సెప్టెంబరులోగా పూర్తి చేయండి. లేదా ఆరంభమయినా చేయండి. పనులపై ఆసక్తి చూపాలి. ''శ్రేయాంసి బహు విఘ్నాని'' అన్నట్లుగా ఎన్ని అవరోధములు ఎదురైనా మీ పట్టుదలను సడలనీయకండి. మనోధైర్యము వీడకూడదు. మానసికంగా కాస్త అధైర్యము ఏర్పడ వచ్చును. నక్క వినయాలు గల మనుష్యులను గుర్తించడములో విఫలమయ్యే అవకాశము గలదు. ఎవరు తనవారు, ఎవరు పరాయి వారో గ్రహించండి. మిమ్ములను అభిమానించే వ్యక్తులను నిరాదరించకండి. స్తుతిప్రియులుగా మారుతారు. తరుచూ అసత్య మాడవలసిన పరిస్థితులు ఉత్పన్నము కావచ్చును. ఎదుటి వారు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా వారిని తక్కువగా అంచనా వేయకండి. ఎలర్జీ బాధ బాధించవచ్చు. తండ్రి గారి ఆరోగ్య విషయమై వైద్యుడిని సంప్రదించుట, ఔషద సేవనము ఆగష్టు నుండి కాస్త ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయండి. విద్యార్థులు ప్రయాసతో పనులు సాధిస్తారు.

 

కాలయాపన మీ ప్రధాన శత్రువుగా గ్రహించండి. వత్సరారంభములో మీలో ఉన్న బలహీనతలని గ్రహించే అవకాశము గలదు. ఎదుటి వారు ఎంత రెచ్చగొట్టే ప్రయత్నము చేసినా సహనంగా ఉండండి. స్త్రీ, పురుషుల మధ్య స్నేహాలు అపోహలకు దారి తీయవచ్చు. ప్రతి పనికి ఎక్కువ మారులు ప్రయత్నం చేయవలసిన పరిస్థితి. ఉద్యోగస్తులు తమ వృత్తి యందు వెయ్యికళ్ళతో మీ ధర్మాన్ని నిర్వర్తించండి. మిమ్ముల్ని అనవసరముగా ప్రలోభపెట్టే అవకాశము గలదు. అదనపు ధనానికి, ఆదాయానికి ఆశపడి అపనిందలు, అపఖ్యాతికి లోనుకాకూడదు. వ్యాపారస్తులు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందాలనే ఆశ చేత అవినీతి వ్యాపారానికి ప్రోత్సహించే వారుంటారు. తస్మాత్‌ జాగ్రత్త. తమ సంతానానికి వివాహ నిశ్చయము అవుతుంది. కన్యాదాన ఫలం దక్కుతుంది. అనివాహితులకు వివాహ సంబంధాలు నిశ్చయము అవుతాయి. అయితే ప్రయత్నాలు సెప్టెంబరుకు ముందే తీవ్రం చేయండి. సెప్టెంబరు లోపున ప్రయత్నించి నట్లయితే మీరు కోరుకున్న విద్యా సంస్థలలో ప్రవేశము లభించవచ్చును. జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తనలో మార్పులు గమనిస్తారు. ఏనాటికైనా మీ మాటకు విలువ పెరుగుతుంది. అర్థం చేసకుంటారనే ఆశ బలీయంగా పెరుగుతుంది. ''నొప్పింపక తానొవ్వక'' అనగా ఇతరులను నొప్పించ కుండా, తాను బాధపడ కుండా ఉండేలా ప్రవర్తించాలి.

 

అడగకుండా అప్పు ఇస్తున్నారు కదా అని అనవసరంగా అత్యుత్సాహంతో ఋణాలు చేయకండి. శ్రేయోభిలాషులను విస్మరించడం. పరోక్షంగా ఉండే ఈర్ష్యా పరులను దగ్గర తీయడం అలవాటుగా మారుతుంది. కోర్టు తీర్పులు వ్యవహారాలలో మొండి పట్టుదలకు పోకుండా మధ్య మార్గముగా పరస్పర అవగాహనతో పరిష్కరించుకునే ప్రయత్నము చేయండి. బంధువుల వల్ల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఒకసారి నమ్మక ద్రోహం జరుగవచ్చును. మోసపూరితత ప్రకటనలు చూసి మోస పోకూడదు. తమ సంతానం సాధించిన ఫలితాలు మీకు గర్వంగా ఉంటాయి. ఇతరులు చేసిన పొరపాట్లను మీరు జవాబు చెప్పాల్సిన పరిస్థితి. ఆత్మీయులతో విభేదాలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయంలో అశ్రద్ధ పనికి రాదు. అప్పుగా ఇచ్చిన ధనం రాబట్టడంలో ఆవేశము పనికిరాదు. ఆర్థికంగా ఎంత చికాకు ఉన్న ఒత అమృత హస్తం లభిస్తుంది. పోలీసు స్టేషనులు, కోర్టు వ్యవహారాల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. అపాత్ర దానం అవసరము లేదని తెలుసుకోవాలి. సంవత్సరం పూర్యార్థంలో వ్యాపార పరమైన లాభాలు చూస్తారు. ఒకానొక సమయంలో ఊహించని అవకాశాలు వస్తాయి. ఇష్టం లేకున్నా కొందరికి సహాయం చేయవలసిన పరిస్థితి రావచ్చును. గతంలో మీ వల్ల సహాయం పొందిన వారు మొహం చాటు వేయటం ఆశ్చర్యం, ఆవేదన కల్గిస్తుంది. ఉదర  సంబంధ సమస్య బాధించవచ్చు. కుటుంబములో ఒకరి ప్రవర్తన పట్ల కక్కలేక, మింగలేని పరిస్థితి ఉత్పన్న మవుతుంది. ఒక విశేష ప్రయోజనం కొరకు పట్టువదలని విక్రమార్కుడిలాగా శ్రమిస్తారు. క్షణికావేశము, అతి కోపము వల్ల కొన్ని ప్రయోజనాలను చేజేతతో చేజార్చుకోవద్దు. మీడియా విషయంలో తగు జాగ్రత్లవీ అవసరం.

    స్త్రీ పురుషుల మధ్య విభేదాలు రావచ్చును. ఇష్ఠం లేకున్నా దుర్జనులకు ఆశ్రయం కల్పించాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం గలదు. వైరాగ్య భావాలు ఏర్పడతాయి. తన వారెవరో, పరాయి వారెవరో తెలుసుకోలేని పరిస్థితీ ఏర్పడవచ్చును. ఉద్యోగంలో గాని, వ్యాపారంలో గాని ఒంటరి పోరు చేయాల్సిన పరిస్థితి. ఎముకలు, నరాల సంబంధించిన అవస్థలు అనుభవించ వలసిన పరిస్థితీ. సంవత్సరము ఉత్తరార్థంలో ప్రభుత్వమునకు కొంత అపరాద రుసుములు చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నము కావచ్చును. ఎంత కష్టపడినా, ఆరాట పడిన ప్రతిక్షణము శ్రమించినా మానసిక సంతృప్తి లేక పోవుట మరియు నిరాశ ఏర్పరవచ్చును. పనులలో జాప్యము కలుగవచ్చును. ఉన్నత స్థానాలు, పర్వత ప్రాంతాలు అధిరోహించునపుడు తగు  జాగ్రత్తలు అవసరము. బహుళ అంతస్తుల  మేడలు అధిరోహించినపుడు జాగ్రత్త అవసరం. ఒక ప్రదేశములో స్థిరముగా ఉండలేని పరిస్థితి. ఆకస్మిక అనూహ్యంగా ధనప్రాప్తి. అగ్ని, జల విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. నది విహారములు చేయునపుడు అప్రమత్తత అవసరం. వీలయితే వాయిదా వేసుకోవడం ఉత్తమం. తరుచూ ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి.


విద్యాభంగం కనపడువీన్నది. విద్యార్థులు శ్రీ హయశ్రీనస్తోత్ర పారాయణం చేయండి. మతపరమైన వివాదాలు,  విదేశాలలో ఉన్న వారు అచటి చట్టపరమైన విషయాలలో జాగ్రత్తలు అవసరం. తండ్రిగారి ఆరోగ్యం ఆందోళన కల్గించ వచ్చును. అనారోగ్యకర బాంధవ్యాలు, మనోవ్యధ, తల్లిగారి ఆరోగ్యం విషయాలలో జాగ్రత్తలు అవసరం. నూతన కార్యక్రమాలు వ్యాపారాలు ప్రారంభించే ముందు శ్రేయోభిలాషుల సలహా అవసరం. స్థాన చలన సూచనలు, ఇరుగు, పొరుగు వారితో విరోధములు. కుటుంబములో అర్థంగాని అశాంతి. చరాస్థిలో చలనం. వాహనాలు నడుపునపుడు జాగ్రత్త అవసరం. వత్సరాంతంలో కొంత మేలు జరిగే సూచనలు గలవు. శత్రు విజయం, అదృష్టం వరించుట, వివాహ ప్రాప్తి, ఆశయ సిద్ధి, దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం, బంధు మిత్రుల నుండి సహాయ సహకారాలు, విద్యలో సఫలం, ముద్రణా వ్యాపారంలో లాభాలు. స్నేహ లాభం, ధైర్యం పెరుగుట, ప్రేమ సఫలమగుట, మొత్తం మ జీద రాశి వాళ్ళకు ఇంకా ఉత్తమ ఫలితాల కొరకు వృక్షసేవ చేయుట. ఒక నెల అయినా గో సేవ చేయండి. శని, రాహు, కేతు, గురుధ్యాన శ్లోకాలు పఠించండి. శమీ వృక్షాన్ని పోషించండి.


More Rasi Phalalu 2017 - 2018