తులరాశి - చిత్త 3,4 (రా,రి)  
స్వాతి 1,2,3,4 (రూ, రే,రో,తా) -  విశాఖ 1,2,3 (తీ, తు, తే)

ఆదాయం: 2     వ్యయం: 8    రాజపూజ్యం: 1   అవమానం: 5


    ఈ రాశి వారికి గురువు వత్సరాది 12-09-2017 భాద్రపద ఒ|| సప్తమి మంగళవారము వరకు 12వ స్థానములో రజిమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతము 1వ స్థానమున లోహమూర్తిగా ఉండును. శని వత్సరాది 20-06-2017 జ్యేష్ఠ ఒ|| ఏకాదశి మంగళవారం వరకు 3వ స్థానము తదుపరి 26-10-2017 కార్తీక శు||షష్ఠి గురువారము వరకు వక్రగతుడై 2వ స్థానమున తదుపరి వత్సరాంతము 3వ స్థానము తామ్రమూర్తిగా ఉండును. రాహుకేతువులు 17-08-2017 రాహువు 11వ స్థానములోను - కేతువు 5వ స్థానములోను లోహమూర్తులై ఉందురు. తదుపరి వత్సరాంతము రాహువు 10వ స్థానమున కేతువు 4వ స్థానమున రజిత మూర్తులై ఉందురు.

    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా ప్రతి పనిని కూడా పూర్తి చేయుటకు విశేష కృషి అవసరము. వత్సరారంభములో శని అనుకూలంగా ఉన్ననూ, వక్రగతి చేత 5 నెలల సమయము మళ్ళీ 2వ స్థానంలో ఉండట చేత ఏలినాటి శని పూర్తిగా తోగిపోవుచున్ననూ, శని ఇవ్వవలసినంత ఫలితము ఇవ్వలేకపోవడం గమనించాలి. అయితే అక్టోబరు 26 నుండి అన్నింటా విజయము జరుగుతుంది. రాహువు ఏకాదశ స్థాన స్థితి చేత (పూర్యార్థము) విదేశీ ప్రయత్నాలు లభించుట. స్థానచలనము అభివృద్ధి దిశగా మారుట. ఉద్యోగంలో మార్పు, శత్రువులపై అధిపత్యము, సంప్రదాయ విద్యలపై మక్కువతంత్రక విద్యలు అభ్యసించుటకు ఉత్సాహము, సంతానంనకు అనారోగ్యము సంతానం ఆరు మాట వినకపోవుట, పనులు పూర్తి అయినట్లుగానే అనిపించినా ఏదో ఒక కారణం చేత ఆగిపోవడము జరగవచ్చును. పనులలో ఆటంకము లేకపోయినా ప్రణాళికా బద్ధంగా నిర్వర్తించ లేకపోవుట, ఆరోగ్య విషయంలో ఏ మాత్రం అజాగ్రత్త పనికిరాదు. నూతన నిర్మాణాత్మకమైన పనులు కొరకు ఋణములు చేయవలసిన పరిస్థితి ఊహాలలో విహరించడం మానుకొని వాస్తవంలో జీవించండి. చాలా రోజులుగా దీర్ఘకాలిక వ్యాధుల నుండి పూర్తిగా ఉపశమనము లభించును.

అక్టోబరు తరువాత ఆరోగ్య విషయంలో సంతోషకరమైన పరిణామాలు ఏర్పడతాయి. మీకు సంబంధం లేని విషయంలో జోక్యం కలిగించుకోకండి అనవసరంగా వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడే అవకాశం గలదు.  వాక్‌కాఠిన్యము కనపడుచున్నది. మాటలు వాడిగా వేడిగా రాకుండా జాగ్రత్త పడాలి. స్థిరాస్తులు వృద్ధి చేసుకుంటారు. సంతానం యొక్క ఆరోగ్య విషయమై వైద్య సంప్రదింపులు, ఔషద సేవనము తప్పకపోవచ్చు. ధార్మిక సేవా, దైవ కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తారు. శుభకార్యచరణలో మీ వంతు పాత్ర వహించి మీకై ఒక ముద్ర వేసుకుంటారు. విద్యార్థులు విశేషంగా కృషి చేయండి. మంచి ఫలితాలు సాధిస్తారు. చాలాకాలంగా అనుభవిస్తున్న అవస్థలు దూరమవుతాయి. హయగ్రీవస్తోత్ర పారాయణం చేయండి. ఆకస్మిక ధనప్రాప్తి, అక్టోబరు తరువాత వ్యాపారంలో పురోభివృద్ధి సంతానానికి వివాహ సంబంధాలు నిశ్చయం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, దొంగ ఫైనాన్స్‌లలో చేరకండి. పాత సమస్యలు దూరం అవుతాయి. కాని అత్యుత్సాహంతో క్రొత్త సమస్యలకు స్వాగతం పలకకండి. గతంలో ఏర్పడిన గుణపాఠంను మరువకండి. అక్టోబరు తరువాత మాత్రం.చేయవలసిన పనులు ఏమాత్రం అలసత్వము లేకుండా పూర్తిచేయండి. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. కాలము ఎవరి కోసమూ ఆగదు. ఉన్న సమయాన్ని విజ్ఞతతో ఉపయోగించుకొని బాగుపడటం విజ్ఞుల లక్షణం. జీవితాశయము నెరవేర్చుకోవడానికి కృషిచేస్తారు. దాదాపు సఫలమవుతారు.

తమకు సంబంధము లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి సమయం వృధా చేయకండి. సమాజంలో మనమూ ఒక భాగమే కనుక కాలానికి ఎదురీదే ప్రయత్నము మానుకొని నలుగురితో పాటు మనమూ అనే భావనకు వస్తారు. ఎదుటి వారిలో లోపాలను వెతకటం మానివేసిన చాలా మేలు జరుగుతుంద.ఇ విదేశాలకు వెళ్ళాలనుకునే వారు 2వ ప్రయత్నంగా సఫలం కావచ్చును. ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితి కనబడుతున్నది. నూతన వ్యాపార ప్రవేశము జరుగవచ్చును. మీరు పెట్టుబడిగా పెట్టిన ధనము, ఇక రాదనుకొని నిర్ణయించుకున్న ధన విషయంలో శుభవార్త వింటారు. శుభకార్యా చరణ సత్కార్యాలకై ధనవ్యయము చేస్తారు.

    గతంలో అనుభవించిన అనేక సమస్యల నుండి ఉపశమనము లభిస్తుంది. పేరు ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. చాలాకాలంగా అనుభవిస్తున్న ఆరోగ్య సమస్యలకు వైద్యపరమైన పరిష్కారము లభిస్తుంది. సమాజములో గౌరవము ప్రతిష్ట పెరుగుతుంది. పరోక్ష ప్రత్యక్ష శతృవులు మీ స్నేహానికి ఆరాటపడతారు. అవివాహితులకు వివాహప్రాప్తి శుభకార్యాచరణ, ఉద్యోగస్తులకు తమ పదవిలో స్థాయిలో ఉన్నతి కలుగవచ్చును. వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి విసృత పరచడానికి ప్రయత్నాలు చేస్తారు. సఫలమవుతారు. ఒక స్థిరాస్థిని అమ్మదలచుకొని, చివరి నిమిషంలో విరమించుకునే అవకాశము గలదు. దాంపత్య సౌఖ్యాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తారు. సంఘ సేవా కార్యక్రమాలు  అనాథ శరణాలయాలు మొదలగు వాటికి హితోధికంగా సహాయం చేస్తారు. విద్యార్థులు చక్కగా తమ ప్రతిభా పాటవాలను వృద్ధి పరచుకుంటారు. మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు పొందే అవకాశము గలదు. విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు.

విలువైన ఆభరణాలు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి అయినా తాము ఆ ఉద్యోగములో పూర్తిగా సంతృప్తి చెందకపోవచ్చును. ఉద్యోగ విషయమై ప్రస్తుత స్థలాన్ని వదలి మరొక చోట నివసించవలసిన పరిస్థితులు రావచ్చును. సంతానప్రాప్తి గలదు. ముఖ్యంగా పుత్రసంతానాన్ని పొందే కోరిక తీరవచ్చును. మానసికమైన ధైర్యము పెరుగుతుంది. ఆలోచనా శక్తి ఆత్మస్థైర్యము పెరుగుతాయి. ప్రాపంచిక సౌఖ్యాలు మీ దరికి చేరుతాయి. స్త్రీ, సౌఖ్యము. కోరిన వారితో వివాహ సూచన. వంశపారంపర్య ఆస్తులు సంక్రమించుట మొదలైన శుభ పరిణామాలు. పౌరుషమైన దర్పంతో కూడిన జీవితము లభించవచ్చును. ఆదాయ మార్గాలు పెరుగుట. సైనస్‌ సంబంధిత సమస్యలు ఉత్పన్నము కావచ్చును. కొందరికి వివాహ విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు ఎదురుకావచ్చును. మంచి ఉద్యోగము లభించవచ్చును. స్థిరాస్థులు సంపాదించుట, వివాదంలో ఉన్న అస్తి మీ స్వాధీనమగుట. నూతన వ్యాపార ప్రారంభము. వ్యాపార భాగస్వాములపై ఆధిపత్యము చలాయించుట. మీ భాద్యతలను, వృత్తిని, విధులను చాలా సమర్థవంతముగా చురుకుగా నిర్వహిస్తారు. మీ ఆధీనంలో నడుస్తున్న సంస్థలలోగాని, లేదా ఉద్యోగంలోగాని కొందరిని అనగా మీకు పర్షోముగా సమస్యలు సృష్టిస్తున్న వారిని గుర్తించి వారిని ఆ స్థానమునుండి తొలగింపచేస్తారు.

అధిపత్యాన్ని పొందుతారు. మీ స్థాయిని స్థానాన్ని పదిలపరచుకుంటారు. తమ తోబుట్టువులు వృద్ధిలోకి వస్తారు. చక్కని స్థానాన్ని పొందుతారు. ప్రకాశిస్తారు. వాహనసౌఖ్యము గలదు. పాత వాహనముల చోట, క్రొత్త వాహనాలను సమకూర్చుకుంటారు. స్వగృహము నిర్మించుకోవాలన్న కల నెరవేరుతుంది. వివాహప్రాప్తి దూరప్రాంత ప్రయాణాలలో తగు జాగ్రత్తలు అవసరము. జీవిత భాగస్వామి మీ పట్ల వాస్తవము తెలుసుకొని, మీకు మీ యొక్క వ్యక్తిత్వానికి విలువనిస్తారు. సంతానము యొక్క పురోభివృద్ధి చక్కగా ఉంటుంది. జ్యేష్ఠ సంతానము యొక్క పురోభివృద్ధిలో శ్రమ ఎక్కువ అవసరము. చెవులకు, కంటికి సంబంధించిన సమస్యలు బాధించవచ్చును. ఔషధసేవనము తప్పక పోవచ్చును. కళాకారులకు అనుకూలము. నూతన అయాచిత అవకాశాలు రావచ్చును. మీ చాతుర్యంతో, చాకచక్యంతో అనేక కార్యాలను సంపూర్తి చేస్తారు. భార్యాభర్తలకు చిన్న చిన్న వివాదాలు తప్ప చక్కని దాంపత్య జీవితము అనుభవిస్తారు. జీవితాశయము నెరవేరుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు ఒకింత జాగ్రత్తగా చేయవలెను. రాజకీయ పరపతి హోదా లభించును. బ్యాంకు ఋణాలు తీసుకొని నూతన వ్యాపారారంభం చేయవచ్చును.

    నూతన పరిచయాలు ఏర్పడతాయి. జీవితంలో ఆత్మస్థైర్యము. ధైర్యము పెరుగుతుంది. ఎలర్జీ వంటి సమస్యలు బాధించవచ్చును. ఈ సమస్య కొంత దీర్ఘకాలికంగా ఉండవచ్చును. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఒకింత ధనవ్యయము, వీరికి తాంత్రిక, నరఘోష మొదలైన క్షుద్ర విద్య బాధితులు అయ్యే అవకాశము గలదు. నిత్యము శ్రీలక్ష్మినృసింహ కరావలంబ స్తోత్రము పారాయణం చేయండి. అనేకమైన దృష్టశక్తులనుండి విముక్తి పొందండి. సంవత్సరాంతంలో గర్భధారణ సమస్యలు, విషజంతు పీడయు, నిర్లక్ష్యము, కంటి మరియు దంత సమస్యలు బాధించుట, ఇతరులచే మోసగింపబడుట, అన్యస్త్రీ వివాదములు. కుటుంబములో తరచూ అకారణ కలహాలు, స్థలమార్పు గోచరించుచున్నది. రక్త సంబంధీకులకు అనారోగ్య సూచనలు. మధ్యవర్తుల ద్వారా అపోహలు, చెప్పుడు మాటలు వినుటద్వారా మానసిక అశాంతి కాళ్ళకు, పాదాలకు గాయాలు కాకుండా జాగ్రత్త పడండి. వాహనములు నడుపునపుడు జాగ్రత్త. అయినా కొద్దిపాటి సమస్యలు ఎదురైననూ గతము అనుభవాల ప్రభావం చేత ఎత్తుకుపై ఎత్తులు వేసి ఆర్థికముగా అభివృద్ధి చెందుతారు. వృత్తి పరముగా వృద్ధిలోకి వస్తారు. మేన మామలకు ఆరోగ్యములో కొంత చికాకు కనిపించుచున్నది.

పాండిత్య ప్రతిభ పెరుగుతుంది. గొప్ప పండితుడిగా చెలామణి అవుతారు. ఋణ బాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక, సేవా రంగాలలో ప్రవేశిస్తారు. సేవ చేస్తారు. ఒక ప్రాణ స్నేహితునికి మీ సహాయము అవసరమవుతుంది. సహాయము చేస్తారు. కోర్టులలో ఉన్న దంపతుల సమస్యలు మధ్యమార్గంగా పరిష్కరించుకుంటారు. మొండి పట్టుదలల చేత దాంపత్య సమస్యలు మీకై మీరు సృష్టించుకో కూడదు. జ్ఞాపకశక్తి తగ్గడం, అపనిందలు, భరించవలసివచ్చును. సమస్యలు వత్సరాంతంలో సంభవించవచ్చును. చేయని దోషమునకు మీరు సంజాయిషీ చెప్పుకోవడం బాధ కల్గించును. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారము లభిస్తుంది. విదేశీయానము కొరకు ప్రయత్నాలు శ్రద్ధగా చేయండి. ఫలితము లభిస్తుంది. పోటీ పరీక్షలలో చక్కని విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యుల పరిపూర్ణ సహకారాన్ని పొందుతారు. ప్రభుత్వపరమైన కాంటాక్టులు లభిస్తాయి. ఖర్చులను నియంత్రించుకొనుట ఉత్తమము. అధికాశతో వివాదాస్పదమైన ఆస్తులను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తారు. తస్మాత్‌ జాగ్రత్త. తమ సంతానానికి శుభకార్యాచరణ. తన కోపమే తన శతృవని తెలుసుకోవాలి. ఆవేశము అనర్థానికి కారణం కావచ్చును. విద్యార్థులకు అనుకూలంగా ఉన్నది.తాము కోరుకున్న స్థానాలలో ప్రవేశము లభించగలదు. వ్యవసాయదారులకు అనుకూలముగా ఉన్నది. మీ పరిచయానికి, స్నేహానికి ఇతరులు ఆసక్తి చూపుతారు. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహకారం లభిస్తుంది. సంతానం యొక్క పురోగతి సంతృప్తి కరముగా ఉంటుంది. కన్యాదాన ఫలం దక్కుతుంది. ఉద్యోగములో ఉన్నతస్థానానికి వెళ్ళగలరు. కాని ఒకింత ఓపిక అవసరము. నిజం నిష్ఠూరంగా ఉంటుంది. కనుక తమ భావాన్ని అభిప్రాయాన్ని ఎదుటివారు అర్థం చేసుకునే రీతిలో సాత్వికంగా తెలియజేయండి. విమర్శించే వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నము చేయండి. సాటి వారి ముందు మీరు ఏమిటో నిరూపించుకోవాలనే తపన పెరుగుతుంది. ఆ దిశలో ముందడుగు వేస్తారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు ఎక్కువగా అనుకూలంగా ఉన్నది. మంచి ప్రయోజనాలకై ధనవ్యయం చేస్తారు. రాహు, గురు, కేతు, కుజ జపధ్యానాలు చేయండి. సంక్షేప రామాయణం మేలు చేస్తుంది. ఆకలితో ఉన్నవారికి అన్నదానం, వస్త్రదానం, గోసేవ మీకు అన్ని విధాలా శ్రేయస్సు, భవిష్యత్తునిస్తుంది.


More Rasi Phalalu 2017 - 2018