మూర్ఖుని మనసు మారదు

 

 

ప్రసహ్య మణిముద్ధరేన్మకర వక్త్ర దంష్ట్రాంతరాత్‌

సముద్రమపి సంతరేత్ప్రచలదూర్మి మాలాకులమ్‌ ।

భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్‌

న తు ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తమారాధయేత్‌ ॥

 

మొసలి కోరల మధ్య ఉన్న మణిని వెలికితీయవచ్చు. అలలతో అతలాకుతలంగా ఉన్న సంద్రాన్ని దాటవచ్చు. కోపంతో కోరలు చాచిన పాముని పూదండలా ధరించవచ్చు. కానీ మూర్ఖుని మనసుని రంజింపచేయడం అసాధ్యం.

 

..Nirjara


More Good Word Of The Day