మేషరాశి  -  అశ్విని 1,2,3,4 (చూ,చే,చో,లా)
భరణి 1,2,3,4 (లీ,లూ,లే,లో)- కృత్తిక 1వ పాదము (అ)

ఆదాయము 2 వ్యయం 8 రాజపూజ్యం 1 అవమానం 7


        ఈ రాశివారికి గురువు 11.8.16 వరకు పంచమస్థానమున తామ్రమూర్తియై ఉండును. తదుపరి వత్సరాంతం లోహమూర్తియై షష్ఠమస్థానమునందు ఉండును. శని వత్సరాది 26.1.17 వరకు అష్టమస్థానము నందు సువర్ణమూర్తియై ఉండును. తదుపరి వత్సరాంతం రజితమూర్తియై నవమమునందు ఉండును. రాహువు వత్సరాది వత్సరాంతం 5వ స్థానమున కేతువు 11వ స్థానమున సువర్ణమూర్తులై ఉందురు.
    'గ్రహగమనము ఒకరికొరకు ఆగదు. కాలము-శాస్త్రము తన విధి నిర్వహణలో ఎవరి విషయంలోనూ పక్షపాతము చూపదు. జీవన సుఖ, దుఃఖ భ్రమణములో సమస్యలను ధైర్యముగా అధిగమిస్తూ శాస్త్ర సూచితమైన పరిహారములను ఆచరిస్తూ, భగవదనుగ్రహము, భాగవత మంగళాశాసనములతో మానవత్వపు విలువలు కల్గి, పరోపకార బుద్ధితో సత్కర్మాచరణం స్వధర్మానుష్ఠముతో సత్సాంగత్యముతో జీవనయనము సాగించిన గ్రహబాధల నుండి ఉపశమనము లభించును. అదియే జ్యోతిర్మార్గ దర్శనము'.
    ఈ సంవత్సరము మేషరాశివారికి గ్రహస్థితి పరిశీలించి చూడగా ఆగస్టువరకు విశేష కార్యములు చేయడంలో ఉత్సాహము చూపిస్తారు. ఏదో సాధించాలనే తపన పెరుగుతుంది. జనాకర్షణ విశేషముగా పెరుగుతుంది. మీలో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది. గృహములో విశేషశుభకార్యాచరణ చేస్తారు. చాలా కాలంగా వేచి చూస్తున్న శుభవార్త వింరు. సంతాన ప్రాప్తి కలదు. స్త్రీలకు దీర్ఘ సమస్యలు తీరి చక్కని పరిష్కార మార్గము లభించ గలదు. ధార్మిక, కార్యక్రమాలు చేస్తారు. నూతన వాహనప్రాప్తి కలదు. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తుల పరిచయము సంప్రాప్తించగలదు. రహస్య కార్యకలాపములు చేయవలసిన పరిస్థితులు ఉత్పన్నము కావచ్చును. భవిష్యత్తుకు ఉపయోగించే నూతన పరిచయాలు ఏర్పడవచ్చును. మీలో దాగి ఉన్న నైపుణ్యము సృజనాత్మకత తెలివి తేటలు తెలియపరచడానికి తగిన సమయం, నిరాశ, కాలయాపనము, దరికి రానివ్వకండి. పనులు వాయిదా వేయడము, ఊహలలో విహరించడం మీ ప్రధాన శతృవని గ్రహించండి. ప్రతి క్షణము తెలివిగా ఉపయోగించుకునే ప్రయత్నము చేయండి. సమాజంలో గౌరవము, పేరు ప్రఖ్యాతులు లభించగలవు. ఇతరులు చేసిన సత్కార్యములు మీరే చేసినట్లుగా చెలామణి అవుతారు. పండితునిగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఒక విశేష కార్యము కాని మీ మేథాసంపత్తి నిరూపించుకునే అవకాశాలు లభిస్తాయి. కాని మీ కాలయాపన ఒక రకమైన గాంభీర్యము వల్ల చేజార్చుకునే పరిస్థితి ఉత్పన్నము కావచ్చును.
    సమాజసేవా కార్యక్రమములో తమ వంతు బాధ్యత నిర్వహిస్తారు. విద్యార్థులు పోీ పరీక్షలలో విజయాన్ని సాధించే అవకాశాలు గలవు. కాని వాయిదావేసే తత్వము. వృధా కాలయాపన అతి గాంభీర్యము, మితిమీరిన ఆత్మ విశ్వాసము చేతికందిన ఫలాలను జారవిడుచుకునే ప్రమాదము గలదు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి గలదు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు, కొందరికి సఫలము కావడము జరుగును. రాజకీయ నాయకులకు అధిపత్యము లభించును. నూతన పదవీ బాధ్యతలు లభించగలవు.
    ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించడం చాలా కాలంగా నిరీక్షిస్తున్న ఉద్యోగపరమైన లాభాలు, రావలసిన లబ్ధి అందుకునే అవకాశాలు గలవు. తీర్థయాత్రలు కాని, విదేశీ ప్రయాణాలు గాని చేసే అవకాశాలు గలవు. న్యాయ మార్గము, ధర్మమార్గము అనుసరించాలనే స్థిరనిర్ణయాలతో ఉంారు. తాము కోరుకున్న విశ్వ విద్యాలయాలు కాని, విద్యాసంస్థలలో కాని ప్రవేశము లభించే అవకాశాలు గలవు.
    ఆగస్టు తరువాత మాత్రము ప్రతి విషయములోనూ జాగ్రత్తగా, ఆచితూచి అడుగు వేయాలి. మీలో ఉన్న రహస్యాలు గాని, ముఖ్యమైన విషయాలు గాని, వృత్తిపరమైన విషయాలు గాని, సాధ్యమైనంతవరకు గంభీరంగా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయండి. శ్రమ మీది ఫలితము పేరు మరొక్కరికి అయ్యే అవకాశాలు గలవు. ఆరోగ్య విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ అలసత్వము పనికిరాదు. చిన్న సమస్యకైనా సరియైన పరిష్కారానికి ప్రయత్నించండి. వాహనములు నడుపునపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదర సంబంధిత సమస్యలు బాధించవచ్చును. భాగస్వామ్య వ్యాపారాలలో తగు జాగ్రత్తలు అవసరము. పరోక్ష శతృవులు ఉన్నారు. తస్మాత్‌ జాగ్రత్త. మీ నుండి విషయసేకరణ చేసి మీ పైనే వాిని ప్రయోగించే ప్రయత్నాలు జరుగవచ్చును.
    ధనము మంచి నీళ్ళలా ఖర్చు చేసే అవకాశము గలదు. అనాలోచిత నిర్ణయాలు అనేక అవరోధాలు సృష్టించవచ్చును. సంవత్సరాంతములో ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరము. మూత్ర సంబంధిత బాధలు. ఉదరము. కిడ్నీ సంబంధ విషయాలపై సరియైన వైద్యుణ్ణి సంప్రదించవలసిన అవసరము ఏర్పడవచ్చును. సమాజంలో గౌరవ, మర్యాదలు కాపాడకోవడానికి ప్రయత్నించవలసిన పరిస్థితులు ఉత్పన్నం కావచ్చును.
    దుర్జన సాంగత్యము పొంచి ఉన్నది. తస్మాత్‌ జాగ్రత్త ఆర్థిక సమస్యలు ఉత్పన్నం కావచ్చును. ఆనాలోచిత వృథా వ్యయము కనపడుచున్నది. ఇతరులు చేసిన పొరపాట్లకు మీరు బాద్యులు కాకుండా చూచుకోవాలి. ఉద్యోగస్తులకు యజమాన్యం వల్ల వేధింపులు ఉత్పన్నం కావచ్చును. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ప్రతి చిన్న విషయానికి ఎక్కువ శ్రమపడవలసిన అవసరము. అగ్ని, విద్యుత్తు మొదలైన వాితో జాగ్రత్తలు అవసరం. ఎదుివారు రెచ్చగొట్టే ప్రయత్నము చేసినా సహనంగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి నిష్టూరపు మాటలు వినవలసి వస్తుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. స్త్రీ, పురుషుల స్నేహం విషయంలో అపోహలు అవమానాలు. ప్రేమికుల మధ్య విభేదాలు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో ఔషధపరమైన ఖర్చులు. తరచూ అసత్యము పలుకవలసిన పరిస్థితులు. ఎదుివారు ఎంత తక్కువస్థాయిలో ఉన్నా వారిని తక్కువగా అంచనా వేయకండి. ఋణబాధల నుండి ఒక అమృతహస్తం వల్ల బయటపడతారు. షేర్‌ మార్క్‌ెలో సత్ఫలితము. కోర్టు వివాదాలు కొంత బాధించగలవు. వ్యవసాయ క్షేత్రములుగాని, గృహనిర్మాణ భూములు లాభిస్తాయి. వాహన యోగం కలదు. విద్యార్థులకు ప్రథమార్థం అనుకూలము. విదేశీ ప్రయత్నాలు సఫలం కావచ్చును. ధర్మము, సంస్కృతి,  ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి, ప్రవేశము, స్నేహ లాభము, శతృధనము లభించుట, విలాసవంతమైన వస్తువులు ఖరీదు చేయుట, ఉద్యోగంలో పదోన్నతి.
    ఈ రాశివారు కనీసం ఒక నెల అయినా గోసేవ చేయండి. దేవతావృక్షాలను పెంచండి. వృద్ధులకు, వికలాంగులకు, అంధులకు, పేద విద్యార్థులకు కనీస సహాయం చేయండి. ప్రకృతిని కాపాడడానికి తమ వంతు కృషిచేయండి. శ్రీ రామరక్షాస్తోత్రము, హనుమాన్‌ చాలీసా, శని,గురు, రాహు స్తోత్రాలు నిత్యం ధ్యానం చేయండి. శుభం కలుగుతుంది. మీ మనోవాంఛ నెరవేరాలని నేనూ మా రాముడిని ప్రార్థిస్తాను.

కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17


Also Read

  Vrishabha Rashi...

More Rasi Phalalu 2016 - 2017