వృషభరాశి -  కృత్తిక 2,3,4 (ఈ,ఊ,ఏ)
రోహిణి 1,2,3,4(ఓ,వా,కీ,వూ)-మృగశిర 1,2(వే,వో)

ఆదాయము 11 వ్యయం 14 రాజపూజ్యం 4 అవమానం 7


    ఈ రాశివారికి గురువు వత్సరాది 11.8.16 వరకు చతుర్థస్థానమున రజితమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతము పంచమస్థానమున తామ్రమూర్తియై ఉండును. శనివత్సరాది 26.1.17 వరకు సప్తమస్థానమున తామ్రమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతము అష్టమస్థానమున లోహమూర్తియై ఉండును. రాహువు వత్సరాది వత్సరాంతము 4వ స్థానమున కేతువు 10వ స్థానమున రజితమూర్తులై ఉందురు.
    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా శుభాశుభ మిశ్రమ ఫలితములు కనపడుచున్నది. ప్రతి చిన్న విషయానికి కూడా విపరీతమైన కృషి అవసరం. పనులపై అనాసక్తి చూపకండి. శ్రేయాంసి బహువిఘ్నాని అన్నట్లుగా ఎన్ని అవరోధములు ఎదురైనా మీ పట్టుదలను సడలనీయకండి. మనోధైర్యము వీడకూడదు. ఇంకా ఎంతకాలము ఈ సమస్యలు అని మానసిక నిర్వేదము ఏర్పడుతుంది. ఆరోగ్యము కాస్త ఇబ్బంది కలిగించవచ్చును. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఔషధ సేవనము వైద్యపర్యవేక్షణము అవసరము కావచ్చును. మీ మనో ధైర్యమే మీకు శ్రీరామరక్ష అని తెలుసుకోండి. మేకవన్నె పులులు, నక్క వినయాలు గల మనుష్యులను గుర్తించడములో విఫలమయ్యే అవకాశాలు గలవు. ఎవరు తనవారు, ఎవరు పరాయి వారో గ్రహించండి. మిమ్ములను అభిమానించే వ్యక్తులను నిరాదరిస్తారు. స్తుతి ప్రియులుగా మారుతారు. గోముఖ వ్యాఘ్రాలను నమ్మి మోసపోయే అవకాశము గలదు. రాజకీయ పరపతి ఉన్న వ్యక్తుల వల్ల కొంత మేలు జరుగవచ్చును. విద్యార్థులకు ప్రయాసతో నైనా ప్రయోజనాన్ని పొందుతారు. మీ ప్రధాన శత్రువు.
        మీరు కోరుకున్న ప్రదేశంలో ఆ విద్యాసంస్థలలో ప్రవేశము లభించవచ్చును. మీలో ఉన్న బలహీనతలను మీరు గుర్తిస్తారు. సంవత్సరము ద్వితీయార్థంలో విశేష ఫలితము కలుగుతుంది. ఉద్యోగప్రాప్తి, వివాహప్రాప్తి, నూతన వాహన ప్రాప్తి కలుగుతుంది. పోీపరీక్షలకు మాత్రము అధిక శ్రద్ధ వహించాలి. చెప్పుడు మాటలు నమ్మి సువర్ణావకాశము జారవిడుచుకునే అవకాశము గలదు. సంవత్సరము ద్వితీయార్థంలో విద్యావకాశాలు అనుకూలంగా ఉంాయి. పోీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి అనుకూల సమయము.ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో విశేషంగా భాగస్వాములు అవుతారు. తమ సంతానం పూర్తిగా సమర్థవంతంగా తమ విద్యుక్త ధర్మాన్ని పాించడం ఆనందదాయకము. సంతానము ప్రయోజకులు అవుతారు. ఇష్టం లేకున్నా కొందరిని దరి చేర్చక అనగా దగ్గర తీయక తప్పని స్థితి ఏర్పడుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్య ఉపశమించవచ్చును. ఎలర్జీ విం బాధ ఆరంభం కావచ్చును. వ్యసనాలకు దూరంగా ఉండంది. సంవత్సర ద్వితీయార్థంలో అవివాహితులకు వివాహ సూచన. గర్భిణులు అజాగ్రత్త. నిర్లక్ష్యం దరి రానీయకండి. మీరు కోనుగోలు చేసిన ఆర్తి విలువ ర్టిెంపు అయ్యే అవకాశాలు స్వగృహప్రాప్తి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. వత్సరారంభంలో వృధా ఖర్చులు అయ్యే అవకాశము సంతానం యొక్క ఆరోగ్యమునకు సమస్యలు ఏర్పడును. విషజంతువులు నుండి జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామి ఆరోగ్యము కొంత కలవపరిచే అవకాశము గలదు. ప్రత్యక్ష శత్రువుల కన్నా పరోక్ష శత్రువులే అధికంగా ఉన్నారని గ్రహిస్తారు. దగ్గరి బంధువులు లేదా స్నేహితులు మీపై ఈర్ష్య మీ అభివృద్ధిని కాని మంచితనాన్ని కాని జీర్ణించుకోలేక పోవడం గుర్తిస్తారు. తల్లిగారి ఆరోగ్యము కూడా కొంత ఇబ్బంది పెట్టవచ్చును. వాహనాలు నడుపునపుడు తగు జాగ్రత్తలు అవసరం. ఇన్యూరెన్స్‌ మొనవి ఎప్పికపుడు చెల్లించి సక్రమమార్గంలో ఉంచండి.
    నిద్రకు తరచూ భంగము ఏర్పడవచ్చును. విద్యాభంగము జరిగే సూచనలు కలవు. ఉద్యోగస్థులకు ప్రధమార్థం కన్నా ద్వితీయార్థం కొంత మేలు చేయును. తొందరపడి కఠిన నిర్ణయాలు తీసుకొనగూడదు. ఉద్యోగములో శ్రమ అధికంగా ఉన్ననూ వత్తిడి అధికంగా ఉన్ననూ కాస్త ఓపిక అవసరం. తొందరపడి రాజీనామా ప్రయత్నం చేస్తారు. సంవత్సరం  ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ శ్రమను మీ యాజమాన్యముగాని, మీపై అధికారులుగాని గుర్తిస్తారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందాలనే ప్రలోభాలకు లొంగకండి. విద్యుత్తుతో జాగ్రత్త అవసరం. ఎలర్జీ సమస్యలు బాధించవచ్చును. ఆధ్యాత్మిక యజ్ఞయాగాదులు నిర్వహించుటలో మీ పాత్ర నిర్వహిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. మీరు అదనపు బాద్యతలు నిర్వహించవలసిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ద్వితీయార్థంలో సఫలం కావచ్చును. దాంపత్య సమస్యలు చిలికి చిలికి గాలివాన లాగే మారే పరిస్థితి రావచ్చును. కలహాలకు దూరంగా ఉండంది. చాలా కాలంగా ఉన్నవారికి కొంతమేలు జరుగుతుంది. నూతన అవకాశము లభిస్తాయి. నరాల సమస్యలు, కండరాలు, ఎముకలు, కీళ్ళనొప్పులు బాధించే అవకాశం గలదు. తరుచుగా శిరోబాధ విసిగించవచ్చును. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు, శాఖాపరమైన దర్యాప్తులు జరిగే అవకాశము గలదు.
    సంవత్సర ద్వితీయార్థంలో చాలా రోజులుగా అనుభవించిన చికాకులు తొలగి సుఖపడే సమయం దగ్గరలో ఉన్నదని సంతృప్తి చెందుతారు. సంతానం వల్ల ఏర్పడిన చికాకులు తొలగుతాయి. వారి విద్యాభివృద్ధి చెందుతుంది. తమ సంతానానికి వివాహం చేస్తారు. ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా ఉపశమించును. చాలా రోజులుగా కారణం తెలియని దీర్ఘవ్యాధులకి ఒక మార్గము, వ్యాధి నిర్ధారణ జరిగి సరియైన ఔషధము లభించును. రావలసిన ధనము చేతి కందుతుంది. ఇక రావు అనుకున్న బాకీలు ఊహించని విధముగా అందుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణము నెమ్మదిగా ఏర్పడుతుంది. తీర్థయాత్రలు చేయుట, పర్వతప్రాంత సందర్శన జీవిత భాగస్వామితో గతము కన్నా అనుకూలముగా ఉంటుంది. అయినా మీరు ఊహించని మార్పు జీవిత భాగస్వామిలో రాకపోవడం వల్ల కొంత నిరాశ ఏర్పడుతుంది. ఏనాికైనా మీ మాటకు విలువ ఏర్పడుతుంది. మిమ్మలని అర్థం చేసుకుాంరని ఆశ బలీయంగా ఏర్పడి అందుకు కావలసిన సూచనలు. శుభ శకునాలు కనబడుతాయి. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. జనాకర్షణ పెరుగుతుంది. మీ స్నేహాన్ని వాంఛించే వారు పెరుగుతారు. భవిష్యత్తుకు కావలసిన నిర్ణయాలు ధైర్యంగా తీసుకుాంరు అజాగ్రత్త పనికిరాదు. వాహనములు నడుపునప్పుడు జాగ్రత్తలు పాించాలి. ఎవరు ఎన్ని విధాలుగా మిమ్ములను రెచ్చగొట్టే ప్రయత్నము చేసిన సహనంగా ఉండాలి. అదే మీకు శ్రీరామరక్ష. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నట్లుగా వ్యవహరించాలి. అందుచేత ఈ న్యాయమును పాించిన అన్ని విధాలా శ్రేయస్కరము. తమకు సంబంధము లేని విషయాలపై ఆసక్తి చూపి తమకు తాము అరిష్టమును స్వాగతించెదరు. స్నేహాల విషయంలో ఒకింత జాగ్రత్తగా ఉండాలి.     
    స్నేహ ధర్మం కొరకు ఎదుివారు చేసిన పొరపాటుకు మీరు సంజాయిషీ చెప్పవలసిన పరిస్థితి రావచ్చును. కోర్ట వివాదాలు, పోలీస్‌ స్టేషన్‌లు విసుగు కల్గించవచ్చును. అనవసర నేరారోపణలు ఎదుర్కొవలసి వచ్చే అవకాశం కలదు. ఇందుకు మీ అతి మంచితనము కారణము కావచ్చును. మిమ్ములను మీరు మరచి అత్యుత్సాహాముతో పరిసరాలను మరచి మీరు మ్లాడే మాటలు వివాస్పదం కావచ్చును. స్త్రీ, పురుష పరిచయాలు, స్నేహాలు విషయంలో అపోహలు, అవమానాలు ఏర్పడే సూచనలు. పాదములకు గాయములు, వృధాఖర్చులు, ధనవ్యయము, జంతువుల వలన ప్రమాద సూచన గలదు. శక్తికి మించిన కార్యాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రత్యక్ష మిత్రులు పరోక్ష శత్రువులుగా మారే అవకాశం కలదు. ఇంకా ఉత్తమ ఫలితాల కొరకు, అరిష్ఠ నివృత్తికి గోసేవ చేయండి. పేద విద్యార్థులకు, అనాథ వృద్ధులకు చేయూత నివ్వండి. దేవతా వృక్షాలను పెంచండి. శని, గురు, రాహు, ధాన్య శ్లోకాలు నిత్యం పారాయణం చేయండి.

కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17


More Rasi Phalalu 2016 - 2017