కర్కాటకరాశి -  పునర్వసు 4(హీ)
      పుష్యమి 1,2,3,4(హూ,హే,హో,డా)- ఆశ్లేష 1,2,3,4(డీ,డు,డె,డో)

ఆదాయము 8 వ్యయం 11 రాజపూజ్యం 3 అవమానం 3


       ఈ రాశివారికి గురువు వత్సరాది 11.8.16 వరకు 2వ స్థానంలో లోహమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతము 3వ స్థానమున రజితమూర్తిగా ఉండును. శని వత్సరాది 21.1.17 వరకు 5వ స్థానమున లోహమూర్తిగా ఉండును. రాహువు వత్సరాది వత్సరాంతము 2వ స్థానమున తామ్రమూర్తిగా ఉండును. కేతువు 8 వ స్థానమున ఉండును. ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా పూర్వార్థము అనుకూలంగా ఉన్నది.
    సంతానముయొక్క అభివృద్ధికై కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుాంరు. సంతానం అభివృద్ధి పథంలో నడుస్తారు. వంశపారంపర్యంగా ఆస్తులు సంక్రమించవచ్చును. శుభకార్యములు చేస్తారు. శతృవులు ఏ స్థాయిలో ఉన్న చివరికి మీదే పై చేయి అవుతుంది. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. చతుష్పాత్‌ జంతువుల వల్ల ఇబ్బంది తల్లితరపు బంధువులతో విరోధాలు, వివాహప్రాప్తి, సంతానప్రాప్తి. గర్భధారణ జరుగవచ్చును. వాహనాలు నడుపునపుడు జాగ్రత్తలు వహించండి. వ్యసనాలు, జూదాలు, షేర్‌మార్క్‌ె విషయాలలో ఒకింత మెళకువగా ఉండండి. అనవసరమైన అపవాదాలు, నిందలకు సమర్ధవంతంగా ఎదుగుకుాంరు. శాఖాపరమైన విచారణను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఎదురుకావచ్చును. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరము. నూతన ప్రదేశాలకు స్థానచలనము.ఉద్యోగస్తులకు విపరీతమైన పని వత్తిడి ఏర్పడవచ్చును. తండ్రిగారి ఆరోగ్యము విషయంలో జాగ్రత్తలు అవసరము. జీవిత భాగస్వామికి అనారోగ్య సూచనలు, భాగస్వామ్య వ్యాపారాల విషయంలో సం||ర మధ్యకాలము నుండి ఒకింత జాగ్రత్తగా ఉండవలెను. స్వస్థలము విడిచి అన్య ప్రదేశములో నివసించే పరిస్థితులు, మానసిక పరిపక్వత లోపించుట, నిర్ణయము తీసుకోవటములో ఎటూ అర్థంకాని పరిస్థితి. మూత్ర సంబంధ వ్యాధుల పట్ల అశ్రద్ధ పనికిరాదు. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల గుర్తింపులేకపోవుట, తీవ్రమైన వత్తిడి, గృహములో ప్రతి చిన్న విషయానికి వివాదాలు సృష్టించ కుండా, జాగ్రత్త పడండి. ఏదో తెలియని అభద్రత, భయము కలుగవచ్చును.
    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించగా సంవత్సరము పూర్వార్థము అన్ని విధాలుగా యోగదాయకముగా ఉంటుంది. చాలా కాలంగా మీరు అనుభవిస్తున్న అవస్థలనుండి ఉపశమనము లభించే అవకాశము గలదు. జీవితములో అనేకమైన అనుభవాలు, ఉచితానుచితాలు తాము చూసిన, నమ్మిన మనుష్యులు మొదలైన అనేక విషయాలపై ఒక స్థిరమైన పారదర్శకమైన ఆలోచన దారి మీకు కనపడుతుంది. గోముఖ వ్యాఘ్రములను గుర్తిస్తారు. వారిని ద్వేషంతో కాకుండా మంచితనంతో దూరం ఉంచాలని నిర్ణయిస్తారు. జీవితాశయము నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దాదాపుగా సఫలమవుతారు. ఊహలలో విహరించడం మానుకొని తమ, పర భేదము తెలుసుకొని, హోదా ధనంతో మంచితనాన్ని మంచి స్నేహాన్ని పొందలేమని గ్రహిస్తారు.
    స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. సమాజంలో గతంలో నష్టపోయిన పరపతిని ప్రతిష్టను తిరిగి పొందుతారు. ఎవరైతే గతంలో అవమానపరిచారో వారు నిజము తెలుసుకొని పశ్చాత్తాప పడతారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆనందముచే చక్కని స్థిర నిర్ణయాలు తీసుకుాంరు. దాంపత్య సౌఖ్యము ఏర్పడుతుంది. గతంలో ఉన్న అపోహలు, అవమానాలు సమసిపోతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతమున్న ఆదాయానికి మరొక్క ఆదాయము తోడవును. తెలివితో చాకచక్యంతో శతృవులపై ఆధిపత్యాన్ని సాధిస్తారు. వారు తీసుకున్న గోతిలో వారే పడేలా ఎత్తుకు పైఎత్తులు వేస్తారు. అవివాహితులకు చక్కని వివాహ సంబంభాలు నిశ్చయము అవుతారు. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. సంతానప్రాప్తి కలుగుతుంది. పుత్రసంతాన ప్రాప్తి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారి పరిచయాలు ఏర్పడుతాయి. మీకు ఉన్నత గౌరవాలు స్థాయి దక్కుతుంది. విలువైన విలాస వంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో అనేక రకాలైన క్రొత్త మార్గాలు అవలంభించి వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. నష్టాలలో ఉన్న వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు. సమాజంలో ముఖ్యమైన అనవసరమైన  కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నతస్థాయి అధికారుల ప్రశంసలు పొందుతారు. అదనపు, భాద్యతలు నిర్వహించవలసి వస్తుంది. పని తీవ్రత, వత్తిడి పెరిగే అవకాశము గలదు. ఉద్యోగంలో ఉన్నతస్థాయికి (ప్రమోషన్‌) ఎదుగుతారు. నూతన వాహనాలు సమకూర్చుకుాంరు. చరాస్తులు వృద్ధి పరుచుకుాంరు. ప్రేమ వివాహాలు సఫలము కావచ్చును. నూతనంగా వ్యాపారపరంగా భూములపై బంగారంపై లేదా షేర్‌ మార్క్‌ెలో పెట్టుబడులు పెడతారు. తమ సంతానానికి వారి భవిష్యత్తుకై పిష్టమైన ప్రణాళికను సిద్ధంచేసి అమలు పరుస్తారు.
    మానసిక శ్రమ శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నను అది భవిష్యత్తులో మీరు వరించే విజయానికి సోపానముగా భావించండి కాని అహంభావము తమకు ఎదురులేదనే భావన మీలో ఏర్పడగలదు. తద్వారా మీకై మీరు అరిష్టములను ఆహ్వానించిన వారగుదురు. స్నేహము, స్నేహితుల విషయంలో ఒకింత మెళకువ, జాగ్రత్త అవసరం. మితిమీరిన ఆత్మ విశ్వాసం పనికిరాదు. ఏ పని అయినా ఒకికి పదిసార్లు ఆలోచించాలి. ఆహార విహారాదులలో ఒక క్రమపద్ధతి నియంత్రణ అవసరం. ఉదర సంబంధ సమస్యలు బాధించగలవు. కఠినమైన మానసిక ప్రవర్తన వలన, ఆత్మీయుల నుండి సమస్యలు, వారి నుండి కొంత అభిప్రాయ బేధములు ఏర్పడే అవకాశములు గలవు. తమ వైభవానికి ప్రతిష్ఠకు కొంత భంగకరమైన వాతావరణం ఏర్పడే అవకాశములు గలవు. అకారణ భీతి మొదలగు ఫలితాలు వత్సరారంభం నుండి మొది మూడు నెలలు సంభవించు అవకాశములు గలవు. తరువాత వత్సరాంతము మంచి ఫలితాలు ఏర్పడగలవు. కనుక అనవసర అతి అనాలోచిత నిర్ణయము తీసుకొనకూడదు. శ్రేయోభిలాషులు సలహాలు తీసుకోవాలి. తొందరపాటుతో ఎదుివారి మనస్సు బాధ పెట్టకుండా నడచుకోవాలి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. బంధు ద్వేషము ఏర్పడే అవకాశములు గలవు.
     భాగస్వామ్య వ్యాపారాలలో తమ పాత్ర కీలకమౌతుంది. ప్రభుత్వ పరంగా తమకు రావలసిన, ఋణాలు కొంత ప్రయత్నం వలన లభించును. వ్యాపార నిమిత్తమై భూసేకరణ విషయంలో గతంలో తాము ప్టిెన పెట్టుబడి లేదా భూమి వివాదాస్పదమవుట లేదా కోర్టు సంబంధ విషయాలలో పునరావృతమగుట జరుగును.వత్సరారంభంలో 8 నెలలు శని ప్రభావము అంతగా అనుకూలముగా లేకున్నను, శుభస్థాన స్థితి వలన మేలు జరుగును. ముఖ్యముగా స్త్రీ, పురుష స్నేహాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కలదు. నీచజన సహవాసము కలదు. నవంబరు నుండి ధన,ధాన్య వృద్ధియు స్థిర,చరాస్థులు కొనుగోలు చేయుట మరియు గృహనిర్మాణాది కార్యక్రమములు విజయవంతముగా పూర్తి చేయుదురు. స్త్రీ సౌఖ్యము తాము కోరుకున్న వ్యక్తులతో వివాహము జరగుటయు, అవివాహితులకు వివాహ ప్రాప్తియు జరుగును. సంతానం కొరకు తాపత్రయపడు దంపతులకు శుభసూచనలు కనపడుచున్నవి. సంతాన సౌఖ్యము కలదు. సంతానము యొక్క విద్యా విషయంలో శ్రద్ధ చూపిస్తారు. వారి భవిష్యత్తుకు కావలిసన ప్రణాళికలు పూర్తి చేస్తారు.     
    సరాసరిగా ఈ రాశివారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్ననూ తమ ఆత్మ విశ్వాసము, తమ నైపుణ్యత, ఓపిక చాకచక్యము నిరూపించుకోగల అవకాశాలు విరివిగా గలవు. ఈ సంవత్సరం శని, కుజ,కేతు, గురు ధ్యానములు జపహోమాదులు నిర్వర్తించండి. నిత్యం హనుమాన్‌ చాలీసా, విష్ణు సహస్రనామ స్తోత్రం, దుర్గా స్తోత్రం, గణపతి అర్చన వారి వారి కుటుంబ ఆచారం ప్రకారం ధ్యానం చేసిన మేలు జరుగును.

కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17


More Rasi Phalalu 2016 - 2017