సింహరాశి -  మఖ 1,2,3,4 (మా,మి,మూ,మే)
పుబ్బ 1,2,3,4(మో, టా, టీ,టూ)- ఉత్తర ఫల్గుని 1(టే)

ఆదాయము 11 వ్యయం 5 రాజపూజ్యం 6 అవమానం 3


      ఈ రాశివారికి గురువు వత్సరాది 11.8.16 వరకు 1వ స్థానమున సువర్ణమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతము 2వ స్థానము లోహమూర్తిగా ఉండును. శని వత్సరాది నుండి 26.1.17 వరకు 4వ స్థానమున తామ్రమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతము 5 వస్థానములో రజితమూర్తిగా ఉండును. రాహువు వత్సరాది వత్సరాంతము 1వ స్థానమున రజితమూర్తిగా ఉండును. కేతువు 7వ స్థానమున ఉండును.
    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా ఈ సంవత్సరము ఆరోగ్యవిషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోకూడా తగు జాగ్రత్తలు అవసరం. అర్థికంగా పెద్దగా చికాకులు ఉండవు. కాని ధనవ్యయం కూడా కపనడుచున్నది. వివాహ సంబంధాలు నిర్ణయమవుతాయి. నిరుద్యోగుకులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. 2వ ప్రయత్నంలో ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ప్రయాస పడవలసిన స్థితి. క్రొత్తది సంపాదించకున్నా ఉన్నది కాపాడుకోవడం ఉత్తమం. సంవత్సర ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది.
    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా ఈ సంవత్సరము యోగ దాయకంగా ఉన్నది. జీవితంలో అనేకమైన అనుభవాలు, ఉచితానుచితాలు, తాము చూసిన నమ్మిన మనుష్యులు మొదలైన అనేక విషయాలపై ఒక స్థిరమైన, పారదర్శకమైన దారి మీకు కనపడుతుంది. గతంలో కొందరి మనసును అనవసరంగా నిరాదరించామన్న విషయాన్ని తెలుసుకుాంరు. పాలు, నీళ్ళనను గ్రహిస్తారు. గోముఖ వ్యాఘ్రములను గుర్తిస్తారు. వారిని ద్వేషంతో కాకుండా ప్రేమగా దూరం ఉంచాలని నిర్ణయిస్తారు. ఈ సంవత్సరం అనేక స్థిర నిర్ణయాలు తీసుకుాంరు. నూతన వ్యాపారాలకై అన్వేషణ ఆరంభమవుతుంది. ప్రస్తుతమున్న వ్యాపారముపై పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. కాని అది అంత సులభం కాదని గ్రహిస్తారు. సమయానికై నిరీక్షిస్తారు. మీ కలలు నెరవేరుతాయి. జీవితాశయము నెరవేరే అవకాశాలు అతి చెరువలో ఉన్నాయని గ్రహించండి. మిమ్ములను ద్వేషించిన వారు మీ స్నేహానికై ఆరాటపడతారు. అదే విధంగా మీ స్నేహాన్ని కోరే వారు కూడా ఆరాటపడు తుాంరు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు భవిష్యత్‌ జీవితానికి గుణపాఠమని గుర్తించండి. ఊహలలో విహరించడం మానుకొని తమ, పర బేధము తెలుసుకునే ప్రయత్నం చేయండి. ధనము, హోదాతో స్నేహాలను, అభిమానాన్ని పొందలేమని గ్రహిస్తారు. ధనము చేతికందుతుంది. నూతన వ్యాపార భాగస్వాములను చేర్చుకుాంరు. భవిష్యత్తుకై చక్కని నిర్ణయాత్మకమైన పునాదులు వేస్తారు. నూతన పరిచయాలు వివాహప్రాప్తి, సంతానప్రాప్తి. కోరుకున్న వారితో సఖ్యత ఏర్పడుతుంది. ఆరోగ్య పరిస్థితి గతముకన్నా కొంత బాగుపడుతుంది. కీళ్లు, ఎముకలు, నరములకు సంబంధించిన అవస్ధతలకు వైద్యపరమైన పరిష్కారం లభిస్తుంది. నరఘోషపై ఎప్పికప్పుడు పరిహారములు చేసుకొనుట ఉత్తమం. జీవితంలో ధనము, హోద, విలాసాలు మాత్రమే ప్రధానము కాదని గ్రహిస్తారు. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యము యధాస్థితి కొనసాగుతుంది. వారి ప్రవర్తన కూడా అదే విధంగా ఉండవచ్చును.మీ శ్రేయస్సుకోరే వ్యక్తులకు అభిమానించే వ్యక్తులకు ఏ విధమైన న్యాయము చేయలేకపోతున్నామనే ఆవేదన మీలో ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ ఏ మాత్రం పనికిరాదు. శతృ, ఋణ బాధలు పరోక్షంగా బాధించవచ్చును. మీ నిర్లక్ష్యము అహంభావము వల్ల కొందరికి శ్రేయోభలాషులకు దూరం కావలసిన పరిస్థితి రావచ్చును. జీవిత భాగస్వామి స్త్రీలు కాని, పురుషులు కాని వారి సలహా పాించుట అన్ని విధాలుగా శ్రేయస్సునిస్తుంది. అతి మంచి తనము తమకు అసమర్ధంగా మారే అవకాశము గలదు. పొగడ్తలకు లొంగకూడదు. ఎదుి వారి విలువైన వస్తువులపట్ల జాగ్రత్త అవసరం. తనకుమాలిన ధర్మం పనికిరాదు. కొందరికి సహాయం చేయబోతే అది మీ మెడకు చుట్టుకునే అవకాశము గలదు. ఋణ రూపకంగా ఇచ్చిన ధనం కాస్త తగ్గి చేతికందవచ్చును. మీ వ్యాపారంలో పేరు ప్రఖ్యాతులు రావడంలో మీ పాత్ర కీలకమవుతుంది. ఆత్మీయుల, బంధము ప్రవర్తన విస్మయానికి గురిచేస్తుంది. రాజకీయ పరపతి, రాజకీయ ఉన్నతి గలదు. ప్రభుత్వపరంగా మీకు రావలసిన బకాయిలు, కాంాక్టులు వల్ల ప్రయోజనం పొందుతారు. ప్రతిష్ఠ పెరుగుతుంది. కాని సమయానికి ఉపయోగించుకొని విస్మరించే వారున్నారని గ్రహించండి. స్త్రీ పురుషులకు పరస్పర వివాదాలు. అకారణ కలహాలు ఏర్పడవచ్చునను. ధార్మిక క్షేత్రాల సందర్శన, దాన ధర్మాలు చేస్తారు. ఎలర్జీ సంబంధమైన చికాకులు ఏర్పడవచ్చునున. ఆత్మీయులు అవసరానికి ఉపయోగించుకొని వదలివేయవచ్చును. కళాకారులకి అనుకూల సమయం, తాము ఆశించిన స్థాయికి చేరువవుతారు. నూతన వాహన కొనుగోలు చేసే అవకాశము కలదు.
    సంవత్సరం 2వ భాగంలో సమస్యల నుండి కొద్దిగా ఉపశమనం లభించును. ఈ సంవత్సరం ప్రతి పని, ప్రతి విషయం ఒకికి రెండుసార్లు ఆలోచించి చేయాలి. అతి ఆవేశం, క్రోధం తగ్గించుకొనిన మేలు జరుగును. అనాలోచిత నిర్ణయాల వలన సమస్యలు మీకై మీరే సృష్టించుకొనిన వారగుదురు. ప్రతి విషయాన్ని ప్రతి వారిని సంశయాత్మకముగా చూడటం మానుకొనిన మేలు జరుగును. పనులన్నియు నెరవేరుటలో ఆలస్యం జరుగవచ్చును. కొందరికి స్థానచలనం జరుగు సూచనలు. ధనము మంచినీళ్ళలా ఖర్చు అయ్యే అవకాశం గలదు. ప్రతి పనీ సాధించేవరకు పూర్తి ఓపిక, సహనం అవసరం. కొంతవరకు మీలోని భావాలను హద్దులో ఉంచుకోవలసివచ్చును. ఆర్థికంగా చికాకులు ఏర్పడే అవకాశములు గలవు. ధనవ్యయము జరిగిననూ అది ఉపయోగ కరముగా, ప్రయోజన కరమైన వ్యయము కాగలదు. వృధా భ్రమణం చేసే పరిస్థితులు రావచ్చును. సహవాస దోషములు ఏర్పడే అవకాశములు గలవు. నీచ జన సహవాసం కలదు. ఎవరినైతే అతిగా విశ్వసిస్తున్నారో, వారి విషయంలోనే మీ మనస్సుకు బాధ కలిగించే సంఘటనలు ఎదురుకావచ్చును. వ్యసనాలకు దూరంగా ఉండాలి. వ్యామోహాలకు గురి అయ్యే అవకాశము గలదు. జీవిత భాగస్వామి ఆరోగ్యం అశ్రద్ధ చేయరాదు. పంతాలకు, ప్టింపులతో ఏమీ సాధించలేరని గ్రహించండి. సంతానం యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం యొక్క విద్యా విషయంలో కొంత నిరాశ చెందే పరిస్థితి రావచ్చును. అవివాహితులకు వివాహ సంబధాలు నిశ్చయమవుతాయి. సామాజిక పరపతి, ప్రతిష్ట పెరుగుతుంది. కాని దానికి సమాంతరం తీవ్రవత్తిడి, ధన వ్యయం కాగలదు. స్నేహితులతో, ఆత్మీయులతో కుటుంబంలో స్పర్థలు పెరిగే సూచన. వ్యాపార భాగస్వామియొక్క ప్రవర్తన ఆశ్యర్యానికి గురి చేస్తుంది. నమ్మకద్రోహం వల్ల మానసిక నిరాశ చెందుతారు. పాత్రత నెరుగక కొందరిని అతిగా విశ్వసించడం వలన కొంత నష్టపోతారు. రాజకీయ పరంగా సంఘంలో ఉన్నత పదవి పొందే అవకావము గలదు. దూర ప్రాంతాల ప్రయాణం కొంతవరకు లాభించవచ్చు. వ్యాపారంలో పోీతత్వము పెరుగుతుంది. తమ వారు పరాయివారు ప్రతి వారూ విమర్శిస్తుండటం ఒకింత నిరాశకు గురిచేస్తుంది. మీ స్వవిషయంలో ఇతరుల జోక్యం సహించరు. నష్టమైనా, లాభమైనా నిర్ణయాలు తామే తీసుకోవాలని నిర్ణయిస్తారు. కాని ఈ నిర్ణయం కొన్ని సందర్భాలలో వికించే అవకాశం కలదు. తమ శ్రేయస్సు కోరే వారి సలహా పాించండి. మేలు చేస్తుంది. సహవాసదోషాలు విపరీతంగా బాధిస్తాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. రాహుకేతువుల ప్రభౄవం వలన ఆరోగ్యవిషయంలో ఏ మాత్రం అజాగ్రత్త పనికిరాదు. జీవిథ భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరం.  మొత్తం మీద ఈ రాశివారలకు శుభాశుభ మిశ్రమ ఫలితములు కలుగుచున్నవి. ఇంకా ఉత్తమ ఫలితాల కొరకు శని, గురు, కేతు జపాలు ధ్యానము చేసిన మేలు జరుగును. గోపూజ చేయండి. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం శ్రీ రామరక్షా స్తోత్రము చేసిన మేలు జరుగును.

కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17


More Rasi Phalalu 2016 - 2017