కన్యారాశి -  ఉత్తర ఫల్గుని 2,3,4 (టో,పా,పీ)
హస్త 1,2,3,4(పూ,షం,ణా,ఠా)- చిత్త 1,2 (పే,పో)

ఆదాయము 14 వ్యయం 11 రాజపూజ్యం 2 అవమానం 6


      ఈ రాశివారికి గురువు వత్సరాది 11.8.16 వరకు 12వ స్థానమున తామ్రమూర్తియై ఉండును. తదుపరి వత్సరాంతము 1వ స్థానమున నుండును. శని వత్సరాది 26.1.17 వరకు 3వ స్థానమున సువర్ణమూర్తిగా నుండును.వత్సరాంతము 4వ స్థానమున లోహమూర్తిగా ఉండును. రాహువు వత్సరాది వత్సరాంతము 12వ స్థానమున కేతువు 6వ స్థానమున సుర్ణమూర్తులుగా ఉందురు.
    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా ఈ సంవత్సరము శని ప్రభావము దాదాపు అనుకూలంగానే ఉన్నది. గురు, రాహువులు ప్రభావము కొంత ప్రతికూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు స్థానచలనము జరగవచ్చును. నిరుద్యోగులకు ఉద్యోగము లభించవచ్చును. వివాహ ప్రయత్నాలు సఫలము కావచ్చును.
    ఈ విధమైన గ్రహస్థితిని పరిశీలించి చూడగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నవి. సంవత్సరారంభంలో అనుకూలంగా ఉన్నది. చేయవలసిన పనులు ఏ మాత్రం అలసత్వం లేకుండా పూర్తి చేయండి. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. కాలము ఎవరికోసం ఆగదు. ఏ మాత్రం పక్షపాతం లేకుండా నిర్ధాక్షిణ్యంగా తన పని తాను చేసుకొనిపోతుంది. ఉన్న సమయాన్ని విజ్ఞతతో ఉపయోగించుకొని బాగుపడడం విజ్ఞుల లక్షణం. వత్సరాంతంలో చిన్న చిన్న ఒడిదుడుకులు రావచ్చును. జీవితాశయం నెరవేర్చుకోవడానికి కృషిచేస్తారు. తమకు సంబంధం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి సమయాన్ని వృధా చేయకండి. సమాజంలో మనము ఒక భారమే కనుక. కాలానికి ఎదురీదే ప్రయత్నం చేయక నలుగురితో మనమూ నడచుకోవాలనే అభిప్రాయానికి వస్తారు. అదే మీకు శ్రీరామరక్ష అని గమనించండి. పేరు ప్రతిష్ట సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కాని ఖర్చు కూడా అలాగే పెరుగుతుంది. ప్రతి విషయాన్ని ఏదుి వ్యక్తులను విరోధులుగా భావించేతత్వము అలవాటుగా మారకుండా జాగ్రత్త పడండి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనే ప్రయత్నం నెరవేరదు. ఇంకొకరు చేశారని, తామెందుకు అలా చేయకూడదనే భావనను విరమించుకోవలసినది. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ప్రయత్నాలు ముమ్మరం చేయండి. ఏ మాత్రం నిర్లక్ష్యం, అలసత్వం పనికిరాదు. ఫలితాన్ని పొందుతారు.ఆలస్యం, అమృతం విషమనే విషయాన్ని గుర్తించాలి. ఆరోగ్యం అశ్రద్ధ చేయరాదు, వివాహాలు, ఇతర శుభకార్యాలు ప్రయాసచే పూర్తి చేస్తారు. రాజకీయంగా అనుకూలంగా ఉన్నది. విశేష ప్రయత్నాలు చేయండి. ఫలితము లభిస్తుంది. అవివాహితులకు వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి. మీరు ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తారు. ఆలోచన కార్యరూపం  దాలుస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. తమకు ఉన్న దానిలో కొంత దానం చేయాలనే నిర్ణయానికి వస్తారు. మీ మంచితనాన్ని అవకాశంగా ఉపయోగించుకొని పరోక్షంగా మీకు అపఖ్యాతి తెచ్చే ప్రయత్నం చేసేవారుాంరు. కళాకారులకు అనుకూలంగా ఉంది. కాని సంవత్సరాంతంలో కొంత నిరాశ కలుగవచ్చును. ఋణ బాధలు తీరుతాయి. కాని కొత్త ఋణాలకు దారి కూడా ఉందని గుర్తించండి. ఆత్మీయుల శ్రేయస్సు కొరకు కృషిచేస్తారు. నూతన గృహ నిర్మాణము దాదాపు సాకారమవుతుంది. విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు అనుకూలంగా ఉన్నది. అలసత్వం వాయిదాలు వేయకుండా తమ ఆలోచనలు అమలు పరచండి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా ఉంది. బ్యాంకు ఋణాలు కూడా లభించే అవకాశం కలదు. పోీ పరీక్షలు ప్రభుత్వ ఉద్యోగ సంబంధిత పరీక్షలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి గలదు. సంవత్సరం చివరలో అంత అనుకూలంగా లేదు కనుక భవిష్యత్తులో చేయవలసిన పనులకు ఇప్పుడే బీజం వేసి ఉంచండి. ప్రతిష్టాత్మకమైన అవార్డులకుగాని, విదేశీ ఉన్నత విద్యాభ్యాసానికి గాని అనుకూలంగా ఉంది. ప్రభుత్వం ద్వారా మీకు అందవలసిన లబ్ధి చేకూరుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. విదేశాలలో ఉన్నవారికి శాశ్వత నివాస అనుమతి లభించ వచ్చును. నూతన వ్యాపార ప్రవేశం సంభవిస్తుంది. మీరు గతంలో ఖరీదు చేసిన ఆస్తికి విలువ పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలించవచ్చు. మధ్యేమార్గంగా పరిష్కార మవుతాయి. ఋణంగా ఇచ్చిన ధనాన్ని తిరిగి పొందుటకు శతృత్వము పెంచుకోవాల్సిన పరిస్థితి రావచ్చును. జీవిత భాగస్వామితో తరచూ అకారణ వివాదాలు ఏర్పడవచ్చును. మౌనేన కలహం నాస్తి అను ధర్మాన్ని పాించండి. సంతానం వృద్ధిలోకి వస్తారు. సంవత్సరాంతంలో సమస్యలు పెరుగవచ్చును. జాడ్యము, సోమరితనము ఏర్పడవచ్చును.  గృహంలో ఒక రకమైన అకారణ వివాదాల వలన అశాంతి పెరుగవచ్చును. శతృవులు మితృలవడం, మిత్రులు శతృవులుగా మారడం ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. శుభకార్యాచరణ సత్కార్యాలకై ధనవ్యయం, ఇష్టం ఉన్నా లేకున్నా కొందరితో స్నేహం చేయక తప్పక పోవచ్చును. చెప్పుడు మాటలు విని చెడిపోయే అవకాశం కలదు. ఉద్యోగస్తులకు సంవత్సరారంభంలో అనుకూలంగా ఉన్నది. తమకు రావల్సిన ప్రయోజనాలు అనగా ప్రమోషన్లు, లోనులు, ఇంక్రిమెంట్లు, అవార్డులు మొదలైన విషయాలలో అలసత్వము, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కాలయాపన చేయక ప్రతిక్షణాన్ని ఉపయోగించుకోవాలి. ఫలితం లభిస్తుంది. మీరు కోరుకునే విధంగా స్థానచలనం జరుగవచ్చు. ఒక శుభ కార్య నిమిత్తమై మీరు వివాదాస్పదులుగా మారుట మొదలైన ఫలితము ఏర్పడవచ్చును. ఆదాయం కంటే ఖర్చు అధికం. స్త్రీలకు ప్రసవ సంబంధిత ఆందోళన ఎదురుకావచ్చును. నరముల బలహీనత ఔషధ సేవనము, నూతన ఉద్యోగ ప్రయత్నం సఫలమగుట, సంతానం పురోభివృద్ధి మీరు సంతృప్తి పడే విధంగా ఉంటుంది. అర్థం లేని అకారణ అపనిందలు మీ వెన్నంటే ఉన్నాయని గమనించండి. రాజకీయ పరపతి పదవి లభించవచ్చును. శతృవులకు సరియైన విధంగా గుణపాఠం జరగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. వీసా, పాస్‌పోర్టు, ఇన్‌కాంక్సు విషయంలో  నిర్లక్ష్యం పనికిరాదు. పాతది రోత క్రొత్తది వింతలా ఆలోచించడం మానివేయాలి. యోగా, ఆయుర్వేద శాస్త్రాలపై ఆసక్తి చూపుతారు. ఊహాలలో విహరించక వాస్తవంలో అడుగులు వేయండి. ఉన్నత విద్యావకాశములు గలవు ప్రయత్నించండి. మొత్తం మీద ఈ రాశి వారలకు శుభాశుభ మిశ్రమ ఫలితములు గలవు. ఒక నిరుపేత అవివాహిత కన్యకు సహాయం చేయండి. గోసేవ మరువవద్దు. రాహు, కేతు, గురు, శని జపశాంతులు అవసరం. కుల దైవాన్ని సందర్శించండి. ధనం లేకున్నా పూర్ణారోగ్యంతో ఉండాలనే నిర్ణయంతో ఉంారు. కన్యాదాన ఫలం దక్కుతుంది. ఉద్యోగములో ఉన్నతస్థానానికి వెళ్ళగలరు. కాని ఈ విషయంలో ఒకింత ఓపిక అవసరం. నిజం నిష్టూరంలా ఉంటుంది. కనుక ఆ నిజాన్ని మరొక విధంగా తెలిపే ప్రయత్నం చేయండి. విమర్శించే వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేయండి. విమర్శించే వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేయండి. స్వస్థల ప్రాప్తి, ఇంకా ఉత్తమ ఫలితాల కొరకు, అరిష్ఠ నివృత్తికి గోసేవ చేయండి. పేద విద్యార్థులకు, అనాథ వృద్ధులకు చేయూత నివ్వండి. దేవతా వృక్షాలను పెంచండి. శని, గురు, రాహు, కేతు ధాన్య శ్లోకాలు నిత్యం పారాయణం చేయండి.

కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17

 


More Rasi Phalalu 2016 - 2017