ఇచ్చేయ్‌!

 

ఇచ్చేయ్‌!

ఓ మీసాల గజదొంగ చీకటి సందు చూసుకుని కాపు కాశాడు. ఆ దారిన ఎవరైనా రాకపోతారా అని ఓపిగ్గా ఎదురుచూశాడు. గజదొంగ బయల్దేరిన సమయం బాగున్నట్లుంది.... తెల్ల బట్టలు వేసుకున్న ఓ లావాటాయన అటు వైపుగా వస్తూ కనిపించాడు. గజదొంగ అదను చూసి ఆ లావాటాయన మీదకు ఉరికాడు.

ఆయన పీక దగ్గర కత్తి పెట్టి ‘నీ జేబులో ఉన్న డబ్బులన్నీ తీసి నాకిచ్చేయి’ అని గదమాయించాడు గజదొంగ.

‘ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా! నేను ఈ ఊరికి ఎమ్మెల్యేని’ అంటూ హుంకరించాడు లావాటాయన.

ఆ మాటలు గజదొంగ మీద కాస్త ప్రభావం చూపినట్లే కనిపించాయి. నిదానంగా ఎమ్మెల్యే మొహం వంక చూసి ‘అయితే ఇన్నాళ్లుగా నా దగ్గర్నుంచీ దోచుకున్న డబ్బులు నాకు తిరిగిచ్చేయి’ అంటూ ఎమ్మెల్యేగారి జేబులోకి చేయిపెట్టాడు.