హామీ!

 

 

హామీ!

ఒక ఉద్యోగి తను పనిచేసే కంపెనీ నుంచి లక్షల రూపాలయను కాజేసినట్లు ఆరోపణలను ఎదుర్కొన్నాడు. అదే ఆరోపణ మీద అతని మీద విచారణ కూడా మొదలైంది. తనని ఎలాగైనా ఆ ఆరోపణల నుంచి కాపాడమంటూ ఆ ఉద్యోగి ఓ లాయరు దగ్గరకు వెళ్లాడు.

లాయరు ‘మరేం కంగారుపడకు! ఒకవేళ నువ్వు జైలుకి వెళ్లాల్సి వచ్చినా, నువ్వు కొట్టేసిన డబ్బు మాత్రం వెనక్కి వెళ్లకుండా చేసే బాధ్యత నాది’ అని హామీ ఇచ్చాడు.

లాయరు చెప్పిన మాట కొన్నాళ్లకు నిజమైంది. ఉద్యోగి జైలుకి వెళ్లాడు. అతను కొట్టేసిన డబ్బంతా న్యాయవాది ఫీజు కోసం ఖర్చైపోయింది!