Read more!

చుండ్రు తగ్గించే తేలికైన ఉపాయాలు

చుండ్రు తగ్గించే తేలికైన ఉపాయాలు


ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల రోజు రోజుకి చుండ్రు సమస్యలు ఎక్కువైపోతున్నాయి . చుండ్రు వల్ల జుట్టు రాలిపోవటం, పేలు రావడం, దురద లాంటివి మొదలవుతాయి. ఈ సమస్యను అరికట్టాలంటే చిన్న చిన్న చిట్కాలు చేయాల్సిఉంటుంది . అవేంటో చూసేద్దాం రండి ..

* వేపాకులతో చుండ్రును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. దురదను తగ్గించడమే కాదు.. చుండ్రు పెరగడానికి కారణమయ్యే ఫంగస్‌ పెరుగుదలను కూడా వేపాకు అరికడుతుంది. రెండు గుపిళ్ల నిండుగా వేపాకు, కొద్దిగా మందారకు,కొద్దిగా కలబంద గుజ్జు ఈ మూడింటిని మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసి తలకు పట్టించి రెండు గంటలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారైన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

* పిల్ సీడర్ వెనిగర్‌తోనూ చుండ్రును అరికట్టవచ్చు. ఇందుకోసం వెనిగర్ ను, నీటిని సమపాళ్లలో కలపాలి. దీన్ని షాంపుగా వాడి తలస్నానం చేయడం వల్ల చుండ్రు వల్ల వచ్చే దురదను వెంటనే తగ్గించవచ్చు. ఇలా కొద్ది రోజులపాటు చేయడం వల్ల చుండ్రు తగ్గిపోతుంది.

* కొబ్బరి నూనెతోనూ చుండ్రు ని తరిమేయొచ్చు. కాకపోతే దీనికి టీ ట్రీ ఆయిల్‌ను కలపాల్సి ఉంటుంది. ప్రతి ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెకు 5 - 10 చుక్కల స్వచ్ఛమైన టీ ట్రీ ఆయిల్ కలపాలి. తర్వాత దాన్ని మాడుకు పట్టించడం వల్ల చుండ్రుకు కారణమైన ఫంగస్ నశిస్తుంది. ఒకవేళ టీ ట్రీ ఆయిల్ లేకపోతే మామూలు కొబ్బరినూనె లో కొద్దిగా కర్పూరం పొడి వేసి కలిపి తలకి పెట్టుకున్న చుండ్రు తగ్గుతుంది.

* తాజా నిమ్మరసంలోని యాసిడ్లు చుండ్రును కలిగించే ఫంగస్‌ను నాశనం చేస్తాయి. నిమ్మరసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు నుంచి మంచి పరిమళం కూడా వస్తుంది. నిమ్మరసాన్ని మాడుకు పట్టించి ఒక నిమిషంపాటు వదిలేయాలి. లేదంటే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి తలను కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది.చుండ్రు తగ్గే వరకూ ఇలా చేయాలి.

* పులిసిన పెరుగును మాస్క్‌గా వేసుకోవడం వల్ల కూడా చుండ్రు తగ్గుముఖం పడుతుంది. ఇందుకోసం ఒక గ్లాస్ పెరుగు లో ఒక స్పూన్ మెంతి పొడి కలిపి రాత్రంతా ఉంచాలి. ఉదయం పూట తలకు పట్టించి గంటపాటు అలా వదిలేయాలి. తర్వాత షాంపూతో కడిగేసుకోవాలి. ఫలితంగా చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు మృదువుగా మారుతుంది.