
ధురంధర్ రెండు భాగాలు సాధించిన విజయం తెలిసిందే. ఇప్పుడప్పుడే విజయం తాలూకు గుర్తులని అభిమానులు, ప్రేక్షకులు మర్చిపోవడం అనేది జరగని పని. ధురంధర్ విజయంలో కాస్టింగ్ కి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. అంతలా ప్రతి ఒక్కరు నిజ జీవిత క్యారెక్టర్స్ కి సూటయ్యి, అద్భుతమైన పెర్ఫార్మ్ ప్రదర్శించారు. ఈ క్రమంలో ధురంధర్ కి సంబంధించిన నయా అప్డేట్ ధురంధర్ ప్రేమికులని ఆకర్షిస్తుంది.
ధురంధర్ సిరీస్ కి సంబంధించి ఎంపిక అయిన మొదటి నటుడు రాకేశ్ బేడీ. జమీల్ జమాలీ అనే పాకిస్తాన్ రాజకీయనాయకుడి క్యారక్టర్ లో జీవించి పడేసాడు. దాదాపు 49 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన క్యారెక్టర్స్ పోషిస్తూ నిలదొక్కుకున్నప్పటికీ, ఎప్పుడూ లభించని ఒక సరికొత్త అనుభూతిని, స్టార్ ఇమేజ్‌ని 'ధురంధర్' చిత్రం తెచ్చిపెట్టింది. సీరియస్ లుక్‌తో భయపెడుతూనే, విలక్షణమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులని థియేటర్లలో మెప్పించారు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిన సమయంలో, చివరి రోజున హీరో రణ్‌వీర్ సింగ్ తో పాటు చిత్ర యూనిట్ సమక్షంలో రాకేశ్ బేడీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఒకవేళ ఈ సినిమా రూ. 1,000 కోట్ల క్లబ్‌లో చేరితే, అందులో 500 కోట్ల క్రెడిట్ కేవలం రాకేశ్ బేడీ నటనకే దక్కుతుందని రణ్‌వీర్ సింగ్ ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇవ్వడం విశేషం. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి ఇంతకంటే పెద్ద గౌరవం ఇంకేముంటుంది.
Also read: Hai Jawani Toh Ishq Hona Hai: పాట వివాదం.. 400 కోట్ల నష్టపరిహారం కోరుతు దావా
రాకేశ్ బేడీ అద్భుత నటనకి , సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి ఫిదా అయిన దర్శక నిర్మాతలు ఆయనకు ఒక ఊహించని భారీ సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. మొదట ఈ సినిమా రెండు భాగాలకు కలిపి ఆయనతో 50 లక్షల పారితోషికం కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే సినిమా విడుదలయ్యాక ఆయన క్యారక్టర్ కి థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్, సోషల్ మీడియాలో ఆయన డైలాగులపై వస్తున్న క్రేజీ మీమ్స్ చూసి నిర్మాతలు ఒప్పందం చేసుకున్న అమౌంట్ కంటే అదనంగా ఏకంగా 1 కోటి రూపాయలను బోనస్‌గా అందించారు.






