
- దేశ ప్రజలతో సంతోషాన్ని పంచుకుంటున్న విజయ్, రష్మిక
- దేశవ్యాప్తంగా 16 దేవాలయాల్లో అన్నదానం
- 20కి పైగా నగరాల్లో స్వీట్స్ పంపిణీ
టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వీరి వివాహం గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా విజయ్ యొక్క రాజు తరహా వస్త్రధారణ, ఆభరణాలు ధరించిన తీరు వైరల్ గా మారింది. ఈ నూతన జంటకు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (Virosh Celebrations)
వైవాహిక జీవితంలోకి తాము అడుగుపెట్టిన సందర్భంగా మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందించిన దేశ ప్రజలకు కృతజ్ఞత తెలిపారు విజయ్, రష్మిక జంట. వారిపై తమ ప్రేమను చూపించేందుకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని దేవాలయాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ చేస్తున్నట్లు విరోష్ ప్రకటించారు.

ఈ రోజు తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, బిహార్ లోని పలు నగరాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ చేయనున్నారు.

ఈ ప్రకటనలో విరోష్ స్పందిస్తూ.. "మా జీవిత ప్రయాణంలో ఈ దేశ ప్రజలందరూ ఒక భాగమే. మా వివాహం సందర్భంగా మీరంతా చూపించిన ప్రేమకు, అందించిన ఆశీస్సులకు కృతజ్ఞతలు. ఈ సంతోషమైన సందర్భాన్ని మీతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు మీ అందరికీ స్వీట్స్ పంపిస్తున్నాము. వివిధ నగరాల్లోని దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీ ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలి." అన్నారు.







