బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబో.. వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందా!
on Jan 21, 2026

-సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్
-బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబో సెట్ కాబోతుందా!
-అనిల్ రావిపూడి ఏమంటున్నాడు
రామాయణంలో రాముడు, హనుమంతుడి కి ఉన్నశక్తుల్ని చెప్పమని రామ,హనుమ భక్తులని అడగడం ఎంతో హాస్యాస్పదంగా ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ వద్ద బాలకృష్ణ(Balakrishna),అనిల్ రావిపూడి(Anil Ravipudi)కి ఉన్న కెపాసిటీ ని చెప్పమని మూవీ లవర్స్ ని అడిగినా కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుంది. అంతలా ఆ ఇద్దరు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా ఈ ఇద్దరికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారింది.
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో 2023 అక్టోబర్ లో 'భగవంత్ కేసరి'(Bhagavanth kesari)వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నేలకొండపల్లి భగవంత్ కేసరి గా బాలకృష్ణ పెర్ ఫార్మ్, అనిల్ రావిపూడి టేకింగ్ ఒక రేంజ్ లో ఉంటాయి. నేషనల్ అవార్డుని సైతం అందుకుందంటే కథ, కథనాలు ఎంత వాల్యుబుల్ నో అర్ధం చేసుకోవచ్చు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతిని కూడా అనిల్ రావిపూడి టార్గెట్ చేసినట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. అది కూడా బాలకృష్ణతోనే రాబోతున్నాడనే టాక్ ఒక రేంజ్ లోనే వైరల్ అవుతుంది.
నిజానికి గోపీచంద్ మలినేని తో బాలకృష్ణ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ బడ్జెట్ పరిమితుల నేపథ్యంలో కథ మారిపోవడంతో, సెట్స్‌పైకి వెళ్లేందుకు కొంచం గ్యాప్ రావచ్చనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. దీంతో అనిల్ దగ్గర బాలకృష్ణకి సరిపోయే కథ సిద్ధంగా ఉందని ఆ ఇద్దరి కాంబోలో త్వరలోనే మూవీ అనౌన్స్ మెంట్ రావచ్చనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.
ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో అభిమానులు ఆ ఇద్దరి కాంబోలో సినిమా రావాలని కోరుకుంటున్నారు. రీసెంట్ గా మన శంకర వర ప్రసాద్ గారు సక్సెస్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనిల్ రావిపూడి మాట్లాడుతు బాలకృష్ణతో ఎవరూ ఊహించని విధంగా సినిమా చేయాలన్నదే నా లక్ష్యం. ఆ దిశగా ఎంతో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్‌లలో ‘భగవంత్ కేసరి ఒకటి. ఆ సినిమా ఇంకా పెద్ద స్థాయిలో హిట్ కావాల్సింది.
సినిమా విడుదల సమయంలో రాజకీయ పరిస్థితుల కారణంగా బాలయ్య అభిమానుల్లో కొంత నిరాశ కనిపించింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)గారు జైలులో ఉండటం ప్రభావం చూపించింది. అయినప్పటికీ సాధారణ ప్రేక్షకులు మూవీని ఆదరించి హిట్ చేసారు. పరిస్థితులు అనుకూలంగా ఉండి ఉంటే స్పందన మరింత గొప్పగా ఉండేదని చెప్పాడు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి బాలకృష్ణ తో వస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



