Home

»

Latest News

రెజీనా సంచలన నిర్ణయం: దాని వెనుక అసలు కారణమేంటి.?

Nov 1, 2026 3:01PM

టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనే ఆమె.. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న 'డెమోక్రటిక్ సంఘ' అనే స్వచ్ఛంద సంస్థ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సహ వ్యవస్థాపకురాలిగా, సభ్యురాలిగా కూడా ఇకపై ఆ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు.

సోషల్ మీడియా వేదికగా రెజీనా ఈ విషయాన్ని వెల్లడించారు. చాలా కాలంగా ఆలోచించి, ఆత్మపరిశీలన చేసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన జీవితంలో డెమోక్రటిక్ సంఘ ప్రయాణం ఎంతో అర్థవంతమైనదని, ఈ సంస్థ ద్వారా ఎన్నో అనుభవాలు, స్నేహాలు, మధుర జ్ఞాపకాలు సంపాదించుకున్నానని పేర్కొన్నారు.

అయితే ఈ సంస్థ నుంచి ఎందుకు తప్పుకుంటున్నారనే విషయంపై మాత్రం రెజీనా స్పష్టమైన కారణాన్ని వెల్లడించలేదు. జీవితంలో ముందుకు సాగుతున్న క్రమంలో కొత్త మార్గాన్ని ఎంచుకోవడానికి, ఇతర ప్రాధాన్యతలపై దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొన్నారు.

సినిమాల్లో నటిస్తూనే సామాజిక సేవపై కూడా ఆసక్తి చూపించే రెజీనా.. 2023లో డెమోక్రటిక్ సంఘతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా బాధ్యతలు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, ప్రజాస్వామ్యంపై అవగాహన కల్పించడం, మహిళల హక్కుల గురించి తెలియజేయడం వంటి కార్యక్రమాల్లో భాగమయ్యారు.

డెమోక్రటిక్ సంఘతో తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ రెజీనా కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ఆశయాల కోసం పనిచేసే అవకాశం రావడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. తనకు అండగా నిలిచిన సహచరులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల మద్దతును ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. సంస్థ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి: RC17 ఎవరి ఊహలకు అందదు.. ఏం ప్లాన్ చేశావయ్యా సుకుమార్.!

 

 

 

[Regina Democratic Sangha, Regina Cassandra, Regina Cassandra Latest News, Democratic Sangha, Regina Cassandra NGO, Regina Cassandra Social Work, Telugu Film News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com