Home

»

Latest News

RC17: ఎవరి ఊహలకు అందదు.. ఏం ప్లాన్ చేశావయ్యా సుకుమార్.!

Nov 1, 2026 1:25PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17పై అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. 'మీరు ఊహించుకోవచ్చు.. కానీ అందరి అంచనాలకు మించి ఉంటుంది' అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు మెగా అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది.

తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టారు. రామ్ చరణ్, సుకుమార్ కొత్త ప్రయాణానికి చిరంజీవి ఆశీస్సులు అందించారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ట్వీట్‌లో 'You Can Imagine, but beyond everyone's expectations' అనే క్యాప్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. రామ్ చరణ్ ఫేస్, నెమలి పించంతో పెయింటింగ్ లా డిజైన్ చేసిన పోస్టర్ ఎంతో క్రియేటివ్ గా ఉంది.

పోస్టర్ లో నెమలి పించం ఉండటం చూస్తుంటే.. ఈ కథకు శ్రీకృష్ణుడితో ఏమైనా సంబంధం ఉంటుందా? ఈ మూవీలో మైథలాజికల్ టచ్ ఉంటుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు సుకుమార్ కి క్రియేటివ్ జీనియస్ గా పేరుంది. అలాంటి సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్ తో ఏదో పెద్దగానే ప్లాన్ చేశారని అర్థమవుతోంది. 

RC17 రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే  ప్రారంభం కానుంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'రంగస్థలం' ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వీరిద్దరూ మరోసారి చేతులు కలపడంతో RC17పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇది కూడా చదవండి: సంక్రాంతి బరిలో అక్కినేని కోడలు.. పాన్ ఇండియా మూవీతో సర్‌ప్రైజ్ ఎంట్రీ.!

 

 

 

[RC17 Movie Story, RC17 Pooja Ceremony, RC17 Movie Launch, Chiranjeevi, Ram Charan Sukumar Movie, RC17 Movie Update, RC17 Shoot, Ram Charan, Sukumar, Mythri Movie Makers]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com