Home

»

Latest News

ఫౌజీ సెట్స్‌లోకి ప్రభాస్ రీఎంట్రీ: క్లైమాక్స్ కోసం హను రాఘవపూడి భారీ ప్లాన్.!

Nov 1, 2026 3:17PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్', మరోవైపు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ ప్రాధాన్యత అంతా 'ఫౌజీ' సినిమాపైనే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. నవంబర్ 3 నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

తాజా గ్లింప్స్‌తో ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ రీ ఎంట్రీ ఇవ్వనున్న షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.700 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.

'ఫౌజీ' షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సినిమాలో రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు నెల రోజుల పాటు క్లైమాక్స్ వార్ ఎపిసోడ్‌ను చిత్రీకరించేందుకు హను రాఘవపూడి ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తయితే సినిమా ప్రధాన చిత్రీకరణ ముగిసే అవకాశముంది.

'ఫౌజీ' మూవీ 2027 మార్చి 19న విడుదల కానుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వి నటిస్తున్నారు. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, టీ-సిరీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

ఇది కూడా చదవండి: రెజీనా సంచలన నిర్ణయం.. దాని వెనుక అసలు కారణమేంటి.?

 

 

 

[Fauzi Shooting Update, Prabhas Fauzi Movie, Fauzi Climax, Fauzi Movie Update, Fauzi Release Date, Prabhas, Hanu Raghavapudi, Immanvi, Mythri Movie Makers]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com