
హైదరాబాద్ లో ఇండస్ట్రీ సెటిల్ అయ్యి ఉంది కాబట్టి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎక్కువ శాతం హైదరాబాద్ లోనే జరుగుతుంటాయి. కానీ అందుకు భిన్నంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో పెద్ది(Peddi)ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డున ఉన్న విజయవాడలో జరుగుతుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ వేడుకకి భారీ అభిమాన జనసందోహం తరలి వచ్చింది.
ఇక ఈ వేడుక విజయవాడలో జరగడానికి ప్రధాన కారకులు పెద్ది నిర్మాత వృద్ధి సినిమా అధినేత వెంకట సతీష్ కిలారు. అందుకు కారణం కూడా ఉంది. సతీష్ గారి స్వస్థలం విజయవాడ నే.. విజయవాడని అనుకోని ఉన్న పెనమలూరు. తన మొదటి సినిమా పెద్ది ఈవెంట్ తన ఊరిలో జరగాలని అనుకున్నారు. అందుకే ఎన్నో వ్యయప్రయాసలని ఓర్చుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విజయవాడలో జరుపుతున్నారు.
Also read: Peddi:ఎన్టీఆర్ అరవింద సమేత తర్వాత పెద్దినే.. జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు







