
మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)పెద్ది(Peddi)తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో నిన్న ప్రీమియర్స్ నుంచి సందడి చేస్తున్నాడు. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత వచ్చిన మూవీ కావడంతో అభిమానులతో పాటు, ప్రేక్షకులు పెద్ది ఎలా ఉంటాడో అనే ఆసక్తితో థియేటర్స్ లో అడుగుపెడుతున్నారు. బయటకి వచ్చిన వాళ్లంతా పెద్ది సూపర్ గా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటంతో పాటు చరణ్ నోటి నుంచి వచ్చిన 'మళ్ళీ పుడతామా యేటి, ఏదైనా ఈ భూమ్మీద ఉన్నప్పుడే చేసేయాలి'అనే మాటలోనే పెద్ది కథ మొత్తం ఉందని చెప్తున్నారు. మరి వాళ్ళు చెప్తున్న పూర్తి పాయింట్ ఏంటో చూద్దాం.
also read: Peddi Movie Review In Telugu: పెద్ది మూవీ రివ్యూ
'మళ్ళీ పుడతామా యేటి'.. పెద్దిలో చరణ్ తన క్యారక్టర్ కి తగ్గ పలికే ఊతపదం.. చిన్న చిన్న పనులు చేసుకునే పెద్ది డబ్బు కోసం ఆట కూలీగా క్రికెట్ ఆడతాడు. తన ఊరి మనిషి అప్పలసూరి వేగంగా వస్తున్న ట్రైన్ కి ఎదురు నుంచొని ప్రాణాలు కోల్పోతాడు. అప్పలసూరి చనిపోయేది తన ఊరు గురించి ప్రపంచానికి తెలియాలని. దీంతో పెద్ది తనకి పరిచయం, అలవాటు కూడా లేని కుస్తీని నేర్చుకొని ఇండియా తరుపున ఆడతాడు. కానీ సొంత శత్రువు చేసిన పని వల్ల ఫైనల్ ఆడకపోతాడు. దీంతో తన ఊరి కోసం ఒక కాలు పోయేలా చేసుకొని పారా ఒలింపిక్ ఆడి తను అనుకున్న లక్షాన్ని సాధిస్తాడు. పైన చెప్పుకున్నవన్నీ ఎంతో కష్టమైనా కూడా 'మళ్ళీ పుడతామా యేటి, ఏదైనా సరే ఈ జన్మలోనే తీర్చుకోవాలని తన గోల్ సాధిస్తాడు. ఆ ఒక్క డైలాగ్ పెద్ది కథ మొత్తానికి జస్టిఫై అనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.






