
ఇండియన్ సినిమా గొప్పతనాన్ని ప్రపంచ సినిమాకి చాటి చెప్పాలనే లక్ష్యంతో తెరకెక్కుతున్న 'వారణాసి'(Varanasi)షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పుడు ఈ చిత్రానికి లీకుల బెడద ఎక్కువయ్యింది. కొన్ని రోజుల క్రితం ఒడిస్సాలో జరిగిన తొలి షెడ్యూల్ సీన్స్ లీక్ అవ్వగా ఇప్పుడు "ఉగ్రాభట్టి గుహల" సీక్వెన్స్‌కి సంబంధించిన భారీ సెట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఆ లీక్డ్ ఫోటోని పరిశీలిస్తే, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసం ఉపయోగించే భారీ బ్లూ స్క్రీన్ బ్యాక్‌డ్రాప్ గా ఉండటంతో పాటు దాని చుట్టూ అద్భుతంగా చెక్కబడిన రాతి నిర్మాణాలు, అత్యంత సంక్లిష్టమైన రాతి స్తంభాల రూపకల్పన ఉంది. ఈ ఒక్క లీక్‌తోనే రాజమౌళి ఎలాంటి విజువల్ వండర్‌ని ప్లాన్ చేస్తున్నారో అర్థమైపోతోంది. అయితే ఈ లీక్డ్ పిక్చర్‌లో చిత్ర నటీనటులు ఎవరూ కనిపించనప్పటికీ, ప్రొడక్షన్ డిజైన్ యొక్క అసాధారణమైన స్కేల్ స్పష్టంగా వెల్లడవుతోంది.
Also read: Dhurandhar: ధురంధర్ సిరీస్ కాస్టింగ్.. ఎంపికైన తొలి నటుడు ఇతనే
ఈ ఉగ్రాభట్టి గుహల సీక్వెన్స్ వెనుక ఒక బలమైన పౌరాణిక కనెక్షన్ ఉన్నట్లు సమాచారం. హిందూ పురాణాలలో తీవ్రమైన ఆత్మత్యాగానికి, పరివర్తనకి ,బ్రహ్మాండమైన సమతుల్యతకు ప్రతీకగా నిలిచే 'మాతా ఛిన్నమస్తా దేవి' చుట్టూ ఈ ఎపిసోడ్ తిరుగుతుందని తెలుస్తోంది. సినిమాలో మహేష్ బాబు పోషిస్తున్న 'రుద్ర' అనే క్యారెక్టర్, ఒక ప్రాచీనమైన మరియు అత్యంత శక్తివంతమైన కాస్మిక్ ఆర్టిఫాక్ట్ (గ్రహాంతర/ప్రాచీన వస్తువు) కోసం అన్వేషిస్తూ ఈ భయంకరమైన గుహల్లోకి ప్రవేశిస్తాడట. అక్కడ విశ్వాన్ని అతలాకుతలం చేయాలని చూసే ఒక పురాతన దుష్ట శక్తిని అంతం చేయడానికి ఆ దేవి దివ్య అనుగ్రహాన్ని కోరతాడనేది ఈ సీన్ సారాంశం.రాజమౌళి ఎంతో రహస్యంగా ఉంచాలనుకున్న ఈ సెట్ తాలూకు విజువల్స్ బయటకు రావడం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.





