
-ఉస్తాద్ ఈ నెల 19 న రిలీజైన విషయం తెలిసిందే
-పవన్ రేంజ్ కి తగ్గ కలెక్షన్స్ లేవు
-మరి ఈ టైంలో అలీ చెప్పిన విషయమేంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan)వన్ మాన్ షో 'ఉస్తాద్ భగత్ సింగ్'(ustaad Bhagat Singh)టాక్ అభిమానులు, మూవీ లవర్స్ నుంచి పర్లేదనే వచ్చినా కలెక్షన్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. దీంతో పవన్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మేకర్స్ మాత్రం ఉస్తాద్ విజయం సాధించిందని చెప్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో రీసెంట్ గా ఉస్తాద్ పై ప్రముఖ నటుడు అలీ(Ali)చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఆ వ్యాఖ్యలు ఏంటో చూద్దాం.
అలీకి ఇటీవలఒక ఇంటర్వ్యూలో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. దాంతో అలీ మాట్లాడుతు హరీష్, పవన్ కాంబోలో రెండవ సినిమా. తొలి చిత్రం గబ్బర్ సింగ్ ఎంత పెద్ద విజయం సాధించిందో, ఉస్తాద్ కూడా ఆ రేంజ్ హిట్ కావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ఉస్తాద్ రిలీజ్ కి కొన్ని రోజుల ముందు ఈ ఇంటర్వ్యూ జరిగినా కూడా ఎప్పుడు వచ్చామన్నది కాదన్నాయ్, బులెట్ దిగిందా లేదా అనే రీతిలో ఎక్సక్లూజివ్ గా సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్నాయి. దీంతో నెటిజన్స్ స్పందిస్తు అలీ సాబ్ గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ ని ఉస్తాద్ అందుకోవాలని మీరు కోరుకున్నారు. కాకపోతే ఆ రేంజ్ హిట్ కాలేదనే కామెంట్స్ చేస్తున్నారు.
also read: Dhurandhar 2: ధురంధర్ 2 పై వెట్రిమారన్ కామెంట్స్!..ప్రాణాలు కోల్పోయిన వారిని చూసారా!
పవన్ ఫస్ట్ మూవీ అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి నుంచి వకీల్ సాబ్ వరకు దాదాపుగా అన్ని చిత్రాల్లో అలీ కనిపించాడు. హరీష్, పవన్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ లోని క్యారక్టర్ అలీకి మంచి పేరు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.






