Home

»

Latest News

Dhurandhar 2: బాహుబలి సామ్రాజ్యాన్ని కూల్చబోతున్న ధురంధర్ 2 

Mar 28, 2026

 

 -ఆ ఏరియాలో ఏకఛత్రాది పత్యాన్ని చెలాయించిన బాహుబలి 
-ధురంధర్ రాకతో ఆలోచనలో పడ్డ  రికార్డ్స్ 
-నెంబర్ వన్ దిశగా ధురంధర్ 
-మరి ఆ ఏరియా ఏంటి 
-అసలు ఆ రికార్డు ఏంటో చూద్దాం

ఒక్కడే ఒక్కడు మొనగాడు.. దేశమే మెచ్చిన పనివాడు అనే రీతిలో అసేతు హిమాచలం సాక్షిగా ధురంధర్ పార్ట్ 2(Dhurandhar 2)దేదీప్యమానంగా దూసుకుపోతుంది. దీంతో ఇప్పటి వరకు ఆధిపత్యాన్ని చెలాయించిన చిత్రాలు ధురంధర్ 2 కి రెడ్ కార్పెట్ తో వెల్ కమ్ చెప్పాల్సిన పరిస్థితి. రీసెంట్ గా దురంధరుడు  మరో అరుదైన రికార్డుకి చేరువలో  ఉన్నాడు. పైగా ఇది మాములు రికార్డు కాదు. ఇప్పటిదాకా వేరే చిత్రంపై ఉన్న ఆ రికార్డుని సదరు చిత్రం కూడా అందుకుంటుందని, కలలో కూడా ఎవరు ఊహించలేదు. అలాంటిది ఆ రికార్డుని 'ఇట్స్ గాన్' అనేలా చెయ్యడానికి ప్రేక్షక అస్త్రాలని దురంధరుడు  సిద్ధం చేసుకుంటున్నాడు. మరి ఆ క్రేజీ న్యూస్ ఏంటో చూద్దాం

బాహుబలి 2(Baabubali 2).. ఈ పేరు ధురంధరుడి కలెక్షన్స్  మ్యాటర్ లో వినపడగానే చాలు.. ఏంటి బాహుబలి 2 కి కూడా ధురంధర్ ఎసరు బెట్టాడా అని మనం చెప్పేది చాలా శ్రద్దగా వింటారు. అవును దురంధరుడు ఎసరు బెట్టాడు. ఓవర్ సీస్ లో బాహుబలి 2 లాంగ్ రన్ లో 22 మిలియన్ డాలర్స్ ని రాబట్టింది. ఇప్పటి వరకు ఓవర్ సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్న రికార్డు అదే. వీటి తర్వాతి స్థానాల్లో దురంధర్ మొదటి భాగం  20 .65 మిలియన్ల డాలర్స్ తో సెకండ్ ప్లేస్, కల్కి 18 .57 మిలియన్ డాలర్స్ తో థర్డ్ ప్లేస్, పఠాన్ 17 .49 మిలియన్ డాలర్స్ తో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాయి. ఇప్పుడు 19 మిలియన్ల డాలర్స్ తో  ధురంధర్ 2  కల్కి ని కిందకి జరిపి మూడవ ప్లేస్ కి చేరింది.

Also read: Nayanthara: 50 కోట్ల విలువ చేసే ప్రైవేట్ జెట్ విమానం!.. మరి ఆస్తులు ఎన్ని 

ఇంత వరకు బాగానే ఉంది. కాకపోతే ధురంధర్ 2 సాధించిన 19 మిలియన్ల డాలర్స్  కేవలం 10 రోజులకే. మరి ప్రెజెంట్ దురంధరుడి సునామి ఏ రేంజ్ లో కొనసాగుతుందో అర్ధం అవుతుంది. దీంతో బాహుబలి 2 ఇప్పటి దాకా చెలామణి చేస్తున్న నెంబర్ వన్ పొజిషన్ ని దురంధరుడు ఆక్రమించుకోవడం ఖాయం. దీంతో బాక్స్ ఆఫీస్ కి కూడా దక్కేది దక్కక మానదు.. దక్కంది ఎన్నటికీ దక్కదు అనే నిజ జీవిత సూత్రం అప్లై అయినట్లయింది. ప్రెజెంట్ సుమారు 1100 కోట్ల గ్రాస్ తో దురంధరుడు చాలా వేగంగా పరుగెడుతున్నాడు.      

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com