Home

»

Latest News

సేమ్ పెయిర్ - సేమ్ సీజ‌న్!

Jan 19, 2022 11:57AM

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌నువిందు చేసిన క‌థానాయిక‌ల్లో ఉత్త‌రాది భామ కియారా అద్వానీ ఒక‌రు. `విన‌య విధేయ రామ‌` కోసం ఈ ఇద్ద‌రు తొలిసారిగా జంట‌గా సంద‌డి చేశారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు చ‌ర‌ణ్‌, కియారా మ‌రో బిగ్ టికెట్ ఫిల్మ్ కోసం జ‌ట్టుక‌ట్టారు. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ రూపొందిస్తున్న స‌ద‌రు సినిమా.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. తెలుగుతో పాటు ప‌లు భాష‌ల్లో పాన్ - ఇండియా మూవీగా ఈ భారీ బ‌డ్జెట్ వెంచ‌ర్ సంద‌డి చేయ‌నుంది.

Also read:   పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి!

ఇదిలా ఉంటే.. చ‌ర‌ణ్ - కియారా సెకండ్ జాయింట్ వెంచ‌ర్ ని 2023 సంక్రాంతి స్పెష‌ల్ గా రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు రీసెంట్ గా చిత్ర నిర్మాత `దిల్` రాజు ప్ర‌క‌టించారు. అదే గ‌నుక కార్య‌రూపం దాల్చితే.. చ‌ర‌ణ్ - కియారా మ‌రోసారి పొంగ‌ల్ సీజ‌న్ లో ఎంట‌ర్టైన్ చేయ‌బోతున్న‌ట్లే. ఎందుకంటే.. వీరిద్ద‌రి తొలి కాంబో మూవీ `విన‌య విధేయ రామ‌` కూడా 2019లో ముగ్గుల పండక్కే సంద‌డి చేసింది. మ‌రి.. నాలుగేళ్ళ త‌రువాత మ‌ళ్ళీ సంక్రాంతి సీజ‌న్ లోనే వినోదాలు పంచ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న సేమ్ పెయిర్ (చ‌ర‌ణ్ - కియారా).. ఈ సారైనా స‌క్సెస్ అందుకుంటారేమో చూడాలి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com