పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో నాగ చైతన్య మాస్ బొమ్మ!
on Jan 23, 2026

మళ్ళీ మాస్ వైపు నాగ చైతన్య చూపు
రంగంలోకి పవన్ కళ్యాణ్ డైరెక్టర్
అక్కినేని హీరో మాస్ హిట్ కొడతాడా?
నాగ చైతన్య(Naga Chaitanya) మనసు మళ్ళీ మాస్ వైపు మళ్లిందా? త్వరలో ఓ మాస్ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధమవుతున్నాడా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
గతేడాది 'తండేల్'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగ చైతన్య, ప్రస్తుతం 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో 'వృషకర్మ'(Vrushakarma) చేస్తున్నాడు. ఈ మిథికల్ థ్రిల్లర్ ను వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక హరీష్ శంకర్ విషయానికొస్తే పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) రూపొందిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

Also Read: ప్రభాస్ ని రెండు గంటల పాటు ఎండలో నిలబెట్టిన డైరెక్టర్!
'విరూపాక్ష' తర్వాత నాగ చైతన్య, 'ఉస్తాద్ భగత్ సింగ్' తర్వాత హరీష్ శంకర్.. ఓ మాస్ ఎంటర్టైనర్ కోసం చేతులు కలుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని వినికిడి.
కెరీర్ స్టార్టింగ్ లో రెండు మూడు మాస్ ప్రయత్నాలు చేసి, పరాజయాలు చూశాడు నాగ చైతన్య. ఆ తర్వాత ఎక్కువగా ప్రేమ కథా చిత్రాలు, విభిన్న కథా చిత్రాలతో విజయాలు అందుకుంటున్నాడు. అలాంటిది చైతన్యకు ఇప్పుడు మళ్ళీ మాస్ వైపు మనసు మళ్లినట్లు తెలుస్తోంది. మరి ఈ అక్కినేని హీరోకి.. హరీష్ శంకర్ ఒక మంచి మాస్ హిట్ ని అందిస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



