మందు తాగే ముందు, తాగాక.. ఇలా చేస్తే హెల్త్ సేఫ్
on Jan 24, 2026

-మద్యం తాగే ముందు ఏం చెయ్యాలి
-తాగాక ఏం చెయ్యాలి
-హర్ష వర్ధన్ ఏం చెప్పాడు
-నితిన్ సలహా ఏంటి
ప్రముఖ రచయిత హర్షవర్ధన్(Harsha Vardhan)నటుడుగా విభిన్న క్యారెక్టర్స్ చేస్తూ తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే సంక్రాంతికి చిరంజీవితో కలిసి మన శంకర వరప్రసాద్ గారు తో సెల్యులాయిడ్ పై తనదైన మేనరిజంతో సందడి చేస్తున్నాడు. చిరంజీవి అసిస్టెంట్ నారాయణ గా హర్షవర్ధన్ ప్రదర్శించిన పెర్ఫార్మ్ కి ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. రీసెంట్ గా హర్ష వర్ధన్ తెలుగు వన్ కి ఇంటర్ వ్యూ ఇవ్వడం జరిగింది. సదరు ఇంటర్వ్యూ లో ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నవాళ్ళకి చెప్తున్న జాగ్రత్తలకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారింది.
హర్ష వర్ధన్ మాట్లాడుతు నితిన్(Nithiin)వాళ్ళ నాన్నతో సిట్టింగ్ కి కూర్చున్నప్పుడు ఒక పెగ్ తాగగానే గ్లాస్ లో వాటర్ వస్తుంది. ఆ వాటర్ మనం తాగకపోతే ఇంకో పెగ్ తీసుకోనివ్వరు. ఆల్కహాల్ తాగే ముందు ఒక హాఫ్ లీటర్ వాటర్ కూడా తాగాలి. ఆ విధంగా చేయడం వల్ల హెల్త్ కి చాలా మంచిదని ఆ విధంగా చేయిస్తారు. నాకు అదే అలవాటు అయ్యింది. నా ఫ్రెండ్స్ తో పాటు వేరే పార్టీలకి వెళ్లినా ఆరోగ్యం కోసం అందరు ఆ సిస్టమ్ ఫాలో అయ్యేలా చేస్తున్నాను అని హర్ష వర్ధన్ చెప్పడం జరిగింది.
Also read: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



