Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే
on Jan 24, 2026

-సెల్యులాయిడ్ పై బోర్డర్ 2 హవా
-ఫస్ట్ డే రికార్డుల మోత
-ధురంధర్ అవుట్
గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.
బాలీవుడ్ సినీ ట్రేడ్ సర్కిల్స్ ప్రకారం బోర్డర్ 2 నిన్న వరల్డ్ వైడ్ గా 41 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ధురంధర్ వరల్డ్ వైడ్ గా 41 . 5 కోట్ల గ్రాస్ ని సాధించింది. కానీ ఇండియా వైడ్ గా చూసుకుంటే దురంధర్ తొలి రోజు 28 .60 కోట్లు నెట్ రాబట్టగా, బోర్డర్ 2 30 కోట్ల నెట్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో ధురంధర్ ని బీట్ చేసినట్లయింది. మరి ముందు ముందు ధురంధర్ రికార్డులని బోర్డర్ 2 ఒక మూలాన కుర్చోపెడుతుందేమో చూడాలి. నిన్న 23 వ తారీకుతో యాభై రోజుల్ని పూర్తి చేసుకున్న ధురంధర్ ఇప్పటి వరకు 1300 కోట్ల వరకు రాబట్టింది.
Also read: ఛాంపియన్ ఓటిటి డేట్ ఇదే
1971 వ సంవత్సరంలో రాజస్థాన్ రాష్ట్రంలోని లాంగేవాలాలో ఉన్న సరిహద్దు విషయం దగ్గర మన దేశానికి, పాకిస్థాన్ కి మధ్య యుద్ధం జరిగింది. కేవలం 120 మంది మన సైనికులు పాకిస్తాన్ భారీ ట్యాంకుల దళాన్ని రాత్రంతా ఎలా ఎదుర్కొన్నారనేదే బోర్డర్ కథ. 'తెల్లవారుజామున భారత వైమానిక దళం వచ్చి పాకిస్తాన్ ట్యాంకులని ధ్వంసం చేసే వరకు మన సైనికులు చేసిన పోరాటం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది'. ఇప్పుడు బోర్డర్ 2 లో పాకిస్థాన్ కి మనకి మరో కీలకమైన సరిహద్దు పోరాటాన్ని చూపించారు. అనురాగ్ సింగ్(Anurag Singh)దర్శకుడు కాగా టి సిరీస్ నిర్మించింది. జాన్ స్టీవార్ట్ మ్యూజిక్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



