
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో 'పెద్ది'(Peddi)ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమాన జనసందోహం మధ్య విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. చరణ్, జాన్వీ కపూర్ తో పాటు చిత్ర యూనిట్ మొత్తం హాజరు కావడంతో అభిమానులు, విజయవాడ వాసుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
ఇక పెద్దిలో అప్పలసూరి క్యారక్టర్ లో మరోసారి తన విశ్వరూపాన్ని చూపించబోతున్న జగపతిబాబు మాట్లాడుతు ఎనిమిది సంవత్సరాలుగా మంచి క్యారక్టర్ కోసం ఎదురుచూస్తున్నా. అరవింద సమేత తర్వాత పెద్ది తో ఆ అవకాశం వచ్చింది. పెద్ది సూపర్ డూపర్ హిట్ ఖాయం. రామ్ చరణ్ మీ అందర్నీ మెస్మరైజ్ చెయ్యబోతున్నాడు. క్రమశిక్షణకి, మంచి తనానికి మారు పేరు చరణ్. నేను విజయవాడలోనే పుట్టాను అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు.
Also read: Peddi: చెట్లు ఎక్కిన పెద్ది ఫ్యాన్స్.. పోలీసుల కంగారు






