
అభిమానుల, మూవీ లవర్స్ సుదీర్గ నిరీక్షణకి తెరదించుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)అండ్ టీం పెద్ది'(Peddi) తో జూన్ 4న వరల్డ్ వైడ్ గా ల్యాండ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలని విజయవాడ నగర నడిబొడ్డులో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తుంది.
ప్రెజెంట్ జరుగుతున్న ఈ వేడుకకి మెగా అభిమానులు, సినిమా ప్రేమికులు భారీ ఎత్తున హాజరయ్యారు. స్టేడియం లోపల ఉన్న గ్యాలరీలన్నీ భారీగా నిండిపోయాయి. కొంత మంది అభిమానులైతే చెట్లు ఎక్కి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. దీంతో పోలీసులు వాళ్ళని కిందకి దింపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




.webp)

